డెలివరీ బాయ్స్ వీరంగం... కస్టమర్‌పై మూకుమ్మడిగా దాడి

 

హైదరాబాద్ నగరంలో కొంత మంది యువకులు గంజాయి సేవించి... ఆ మత్తులో రోడ్ల మీద నానా హల్చల్ సృష్టిస్తున్న ఘట నలు ఎన్నో జరు గుతున్నాయి. ఇటువంటి ఘటనే మరొకటి చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీరు ఏదైనా వస్తువు కోసం ఆర్డర్ చేస్తున్నారా తస్మా జాగ్రత్త.... ఇదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? పూర్తిగా వివరాలు చదవండి.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ బస్తీలో నివాసం ఉంటున్న సందీప్ అనే వ్యక్తి పెన్సిల్ కిట్ మరియు పెరుగు ప్యాకెట్ కోసం జిప్టోలో ఆర్డర్ చేశాడు... ఆన్లైన్ పేమెంట్ కూడా చేశాడు. అయితే సందీప్ ఆర్డర్ చేసిన వస్తువులు రాలేదు. దీంతో సందీప్ డెలివరీ బాయ్ కి ఫోన్ చేసి తన వస్తువులు ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నించాడు... అందుకు ఆ జిప్టో  బాయ్ విఎస్టి ఎస్పీ గార్డెన్స్ వద్ద ఉన్న జిప్టో హబ్‌కు వచ్చి మాట్లాడమని చెప్పాడు. దీంతో సందీప్ వెంటనే విఎస్టీ వద్ద ఉన్న జిప్టో హబ్ వద్దకు వెళ్లాడు.

 సందీప్ అడిగిన ప్రశ్నకు జిప్టో సిబ్బందితో పాటు డెలివరీ బాయ్స్ సరైన సమాధానం ఇవ్వకపోగా ఒక్కసారిగా సందీప్ పై దాడికి పాల్ప డ్డారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు , ఎనిమిది మంది గంజాయి మత్తులో రోడ్డుమీద వీరంగం సృష్టిస్తూ సందీప్ ను చితకబాదారు.. ఈ దాడిలో సందీప్ కు తీవ్ర గాయాల య్యాయి. అయితే ఈ దాడికి సంబం ధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్, రాజు తో పాటు ఇంకొందరు  తనపై దాడి చేశారని... సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu