అల్లు అర్జున్‌కు నోటీసులు... ఎందుకంటే?

 

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మా ణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ బన్నీకి  జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లో రెండేండ్ల కిందట అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరుతో భవనాన్ని నిర్మించారు. అయితే గీతా ఆర్ట్స్‌తో పాటు అల్లు ఆర్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు, ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. 

సుమారు 1226 గజాల స్థలంలోని ఈ భవనానికి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్‌ 4 అనుమతి కూడా ఉంది. కాగా, ఇటీవల నాలుగో అంతస్తుపైన అక్రమ నిర్మాణాన్ని చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందు కున్న వెంటనే జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 డీఎంసీ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. ఎటువంటి అనుమతి లేకుండా నాలుగవ అంతస్తు పైన అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని దీనిని వెంటనే కూల్చివేయాలి. కానీ అందుకు బన్నీ కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారు. అయితే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ అల్లు అర్జున్ కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu