నేపాల్ లోని భారతీయుల సహాయార్ధం హెల్స్ లైన్ నంబర్లు
posted on Sep 10, 2025 12:36PM

నేపాల్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందు కోసం నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. నేపాల్ లోని భారత్ కు చెందిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం ఆ దేశంలోని రాయబార కార్యాలయం 977 – 980 860 2881 / 977 – 981 032 6134 నంబర్లను ప్రకటించింది.
ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపింది. నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల వివరాలు తెలుసుకుని వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చుందుకు మంత్రి నారా లోకేష్ తన హిందుపూర్ పర్యటనను రద్దు చేసుకుని సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే... ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com అలాగే info@apnrts.com, లను సంప్రదించాలని మంత్రి లోకేష్ తెలిపారు.