అంబానీ సెక్యూరిటీ అన్ లిమిటెడ్!
posted on Sep 10, 2025 11:08AM

ఇదిగో ఈ వీడియో లాంగ్ షాట్ చూస్తున్నారా? కొన్ని వందల మంది క్యూ కట్టి వెళ్తున్నారు చూశారా? వీరంతా ఏ మిలటరీ పరెడ్ కీ వెళ్లడం లేదు. మరే సైనిక కార్యక్రమానికీ హాజరు కావడం లేదు. ఆ మాటకొస్తే వీరెవరూ అసలు సైనిక విభాగానికి చెందిన వారు కానే కారు. వీరు జస్ట్ ఒక వ్యక్తి, సింగిల్ పర్సన్ కి సెక్యూరిటీగా పని చేస్తున్నారంతే.. ఏంటి అంతలా నోరెళ్లబెట్టేశారు? ఎస్ మీరు విన్నది కరెష్టే..
ఇంతకీ ఆ వ్యక్తి ఆ సింగిల్ పర్సన్ ఎవరనేగా మీ డౌటనుమానం. అయితే చెవులు రిక్కించి మరీ వినండి.. ఆ వ్యక్తి మరెవరో కాదు ముఖేష్ అంబానీ ముద్దులు కొడుకు అనంత్ అంబానీ. పేరుకు తగ్గట్టే ఆయన సెక్యూరిటీ కూడా అనంతంగానే ఉంది కదూ? అనంత్ అంబాని ఒక క్లబ్ కి ఇంత భారీ ఎత్తున వస్తుండగా.. జనమంతా కలసి.. వీడియోలు తీశారు. అదిగో చూడండి చూడండి.. ప్రపంచ ఎనిమిదో వింత వస్తోంది చూడండీ.. అంటూ వారు వీడియోలో కాసేపు ఊరించి ఊరించి చూపించారు. ఎవరో ఏంటో ఏ విచిత్రమో చూపించవచ్చనుకుంటాం. కానీ ఇది అంతకన్నా మించిన వింతే. ఒక వ్యక్తికి ఇన్ని వందల మంది రక్షణ విభాగమా!?
ఆయనేమైనా సినీ సెలబ్రిటీనా? క్రికెట్ వీరుడా? రాజకీయ నాయకుడా? అని మనకు అనిపించవచ్చుగానీ.. ఆయన అంతకన్నా మించి.. అంబానీలంటే మరేంటనుకున్నారు. ముంబై ఇండియన్స్ వంటి పెద్ద పెద్ద జట్లకు జట్లను కొనగలరు. ఇంకా వారి వ్యాపార సామ్రాజ్యం ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏషియాలో టాప్ త్రీ పొజిషన్. ఇంకా మాట్లాడితే.. ముంబైలో వారిల్లే ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇక ఫోర్బ్స్ జాబితాలో నిత్యం తొణికిసలాడే పేరది. అంబానీ అంటే అది సిరిసంపదలకే బ్రాండ్ అంబాసిడర్ లాంటి పేరు. మరి ఆ మాత్రం ఉండదా ఏంటి??? అనంటారు ఆర్ధిక రంగ నిపుణులు. కేవలం అనంత్ అంబానీ సెక్యూరిటీకే ఏటా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదేమో!