గ్రూపు-1 పరీక్షపై... హైకోర్టులో మరో అప్పీలు

 

తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ, ఫలితాలను సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ దాఖలైంది. జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గ్రూప్‌-1 అభ్యర్ధి విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్‌ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టీజీపీఎస్సీ కూడా అప్పీల్‌ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా.. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. ఆ ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు అధ్యక్షతన, ఈ నెల 9వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేస్తూ, కమిషన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu