తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 24 గంటలు

 

తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల క్యూ కంపార్ట్ మ్మెంట్  దాటి ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 75,006 మంది భక్తులు దర్శించుకోగా 45,413 మంది తలనీలాలు సమర్పించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది. 

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వరలక్ష్మి శరత్ కుమార్  దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు కూడా గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని   టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మూల విరాట్టు దర్శనం కోసం కూడా వేలాది మంది భక్తులు క్యూ లైనల్లో వేచి ఉన్నారని చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి.. సర్వదర్శనం క్యూ లైన్ గుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని  ఈవో తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu