ట్రంప్, మోలానియా డిష్యూం.. డిష్యూం.. నిజమేనా?

అమెరికా దేశాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాల మధ్యసఖ్యత లేదా? వారిరువురూ తరచూ ఘర్షణ పడుతుంటారా? అంటే.. తాజాగా బయటపడిన ఓ వీడియోను బట్టి ఔననే అనాల్సివస్తున్నది. ఈ వీడియో ప్రకారం ఇరువురూ హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ఏదో విషయంపై తీవ్రంగా వాదించుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఆ వీడియో ఎప్పటిదంటే.. ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు సతీసమేతంగా డోనాల్డ్ ట్రంప్ హాజరై తిరిగి వెళుతున్నప్పటిదని తెలుస్తోంది. తిరుగుప్రయాణంలో ట్రంప్, మెలానియాలు మెరైన్‌ వన్ హెలికాప్టర్‌లో ఘర్షణపడ్డారని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.

 ట్రంప్ మెలానియా వైపు చూపుడువేలు చూపుతూ ఆగ్రహంగా మాట్లాడుతుంటే.. మెలానియా కూడా ఆగ్రహంగా తల అడ్డంగా తిప్పుతూ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్ధమౌతుంది. ఈ వీడియోను హెలికాప్టర్ బయట నుంచి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu