అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురి మృతి

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల ఘటన మిసిసిపీలో ని లేలాండ్ పట్టణం జరిగింది.  ఘటన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన పుట్ బాల్ మ్యాచ్ అనంతరం జనం గుమిగూడిన సమయంలో ఆ సమయంలో కాల్పుల ఘటన జరిగింది.

ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.  ఈ ఘటనలో గాయపడిన వారిని   ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాల్పులకు పాల్పడిన వారు ఎవరు? ఎందరు అన్న వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu