బీఆర్‌ఎస్‌ పాలనలో చేయని సమ్మె...ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు : మంత్రి దామోదర

 

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ను తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వంలో నెలకు రూ.50 కోట్లు కూడా రిలీజ్‌ అవ్వలేదు. 

మేం నెలకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాం. ఈ మేరకు ఇటీవలే రూ.100 కోట్లు విడుదల చేశాం. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకపోవడంతో మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలకు ఆరోగ్య సేవలో ఎలాంటి అంతరాయం కలగదు’’ అని దామోదర రాజనర్సింహ తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తం ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ సర్కార్  నుంచి రావలసిన రూ.1,400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా, ఉన్నపళంగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేటు ఆస్పత్రులు నిలిపివేయటంతో..రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తమ బకాయిలను సర్కార్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu