కేటీఆర్ నువ్వో బచ్చా...నీ తండ్రి వల్లే కాలేదు : మంత్రి పొంగులేటి

 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో తాను గెలవకుండా చూస్తానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పొంగులేటి బదులిచ్చారు. పాలేరులో నా గెలుపును ఆపడానికి నీ తండ్రి వల్లే కాలేదు. నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసిన..ఆయన వల్లే కాలేదని  పొంగులేటి అన్నారు. 

నీ వల్ల అవుద్దా..బచ్చాగాడివి ఘాటు  వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా..సంచి సర్దుకుని అమెరికాకు చెక్కుతవా..అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారు.. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండని మంత్రి పొంగులేటి తెలిపారు. గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 కుటుంబాలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. "ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు" అని ఆయన ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu