సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు
posted on Sep 13, 2025 6:02PM

సికింద్రాబాద్‌లో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీం అధికారులు పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పాత స్కూల్ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం అధికారుల బృందం వారిని విచారిస్తోంది. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించినట్టు సమాచారం. మత్తు మందును తరలిస్తున్న సమయంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. వారి వద్ద నుండి కోటి రూపాయల విలువైన మత్తు మందు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.