జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం : రామ్మోహన్‌నాయుడు
posted on Sep 13, 2025 4:59PM
.webp)
విజయనగరం భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తియ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణ పనులు, పూర్తి కావాల్సిన పనులు, పురోగతిపై అధికారులతో చర్చించారు. వర్షాలు కురుస్తున్నా జీఎంఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. వచ్చే ఏప్రిల్‌లోగా విశాఖ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
వచ్చే ఏప్రిల్ నాటికి ఈ రహదారి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే వైజాగ్ బీచ్ కారిడార్ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. తొలి దశలో రూ.4,592 కోట్లతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. మొత్తం 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు ఇతరత్రా అవసరాల కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి మరో 500 ఎకరాల భూమిని అదనంగా కేటాయించింది.