టీచర్ కు ప్రేమ వల.. రూ. 2.3 కోట్ల టోకరా
posted on Oct 9, 2025 4:54PM

ప్రేమ పేరుతో అమాయక మహిళలు ఎలా మోసపోతారనడానికి తార్కానంగా నిలుస్తుందీ సంఘటన. మంచి మాటలు, సానుభూతి వ్యాఖ్యలకు మోసపోయి కొత్తవారిని గుడ్డిగా నమ్మకూడదనడానికి నిదర్శనంగా నిలుస్తుందీ ఉదంతం. ఆన్‌లైన్ పరిచయాల్లో వ్యక్తిగత వివరాలను పంచుకునే సమయంలో జాగ్రత్త వహించాలని విషయాన్ని తెలియజేస్తుందీ ఘటన.. ఇంతకీ విషయమేంటంటే..
ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల నుండి మనం తీసుకోవలసిన పాఠం ఏంటంటే, నమ్మకంతోపాటు జాగ్రత్త కూడా అవసరం. ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.ఒంటరి తనం భరించలేక తోడు కావాలని ఆశపడటమే ఆ టీచర్ చేసిన పాపం. లేటు వయసులో తోడు కోసం ఆరాటపడిన ఆ టీచరమ్మ మాట్రిమోనియల్ సైట్ లో తన వివరాలు నమోదు చేశారు. ఆమో వయస్సు 59 ఏళ్లు. భర్త మరణంతో ఒంటరిగా జీవించడం కష్టంగా ఉండటంతో ఆమె మాట్రిమోనియల్ సైట్ ను ఆశ్రయించారు.
ఆ సైట్ లో ఆమె వివరాలు చూసిన అహాన్ కుమార్ అనే వ్యక్తి తాను అట్లాంటాలో ఇంజినీర్ గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. తన ఐడీ కార్డు కూడా చూపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలోకి దింపాడు. అప్పటి నుంచి అంటే 2020 నుంచి 2024 వరకూ నాలుగేళ్ల పాటు వివిధ కారణాలు చెప్పి ఆ టీచరమ్మ నుంచి సొమ్ములు దండుకున్నాడు. నాలుగేళ్లలో ఆ టీచర్ నుంచి దాదాపు 2.3 కోట్లు రాబట్టిన అహాన్ కుమార్ ఆ తరువాత మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ టీచర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.