రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్

Chris Gayle smashes T20 records to demolish Pune, Chris Gayle smashes T20 records with astonishing innings, Royal Challengers Bangalore thrashed Pune Warriors by 130 runs, Chris Gayle Trashes T20, IPL Records

 

వెస్ట్ ఇండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు సభ్యుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్ T20, ఐపిఎల్ చరిత్ర రికార్డులను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పూణే వారియర్స్ జరిగిన మ్యాచ్ లో బద్ధలు చేశాడు. టాస్ గెలిచి పూణే వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ఓపెనర్లుగా  గేల్, దిల్షాన్ బరిలోకి దిగారు. మొదటి రెండు బౌల్స్ లో రెండు ఫోర్లు కొట్టిన గేల్ వర్షం పడడంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కలిగింది. వర్షం నిలిచిపోవడంతో మళ్ళీ క్రీజ్ లో కి వచ్చిన గేల్ మరో మూడు ఫోర్లు కొట్టి మొదటి ఓవర్లోనే 20 పరుగులు రాబట్టాడు. ఆ తరువాత క్రిస్ గేల్ రెచ్చిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్న గేల్ 30 బంతుల్లోనే శతకం సాధించాడు. 34 బంతుల్లో శతకం చేసిన సైమండ్స్ రికార్డు తుడుచిపెట్టుకుపోయింది. తిలకరత్నే దిల్షాన్ 36 బంతుల్లో 33 పరుగులు (5బౌండరీలు) గేల్ కు చక్కటి సహకారం ఆడించాడు. దిల్షాన్, రైట్ బౌలింగ్ లో ముర్తజా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి రికార్డు స్థాయిలో మొదటి వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో బ్యాట్స్ మెన్ గా క్రీజ్ లోకి వచ్చిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 11 పరుగులు (1 సిక్స్) దురదృష్టవశాత్తు రనౌట్ గా పెవిలియన్ చేరాడు. నాలుగో ఆటగాడిగా క్రీజ్ లోకి వచ్చిన ఎబి డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్ లో  8 బంతుల్లోనే 31 పరుగులు (3 బౌండరీలు 3 సిక్స్)లు చేసి మార్ష్ బౌలింగ్ లో మన్హాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పరుగుల వేగం పెంచాలనే ప్రయత్నంలో మనోజ్ తివారీ 2 దిండా బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి, అర్జున్ రామ్ పాల్ 0 దిండా బౌలింగ్ లోనే మార్ష్ కు క్యాచ్ ఇచ్చి వికెట్లు పారేసుకున్నారు.

 

Chris Gayle smashes T20 records to demolish Pune, Chris Gayle smashes T20 records with astonishing innings, Royal Challengers Bangalore thrashed Pune Warriors by 130 runs, Chris Gayle Trashes T20, IPL Records

 

ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో క్రిస్ గేల్ కేవలం 66 బంతుల్లోనే 13 బౌండరీలు, 17 సిక్సర్లు కొట్టి 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బ్రెండన్ మెక్ కల్లామ్ పేరిట ఉన్న 158 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు, ఒకే మ్యాచ్ లో 17 సిక్సర్ల రికార్డు, ఐపీఎల్ లో 150కు పైగా(163) సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ రికార్డు, ఏ ఫార్మాట్ లోనైనా అత్యంత వేగవంతమైన శతకం రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో శ్రీలంక, కెన్యాపై చేసిన అత్యధిక 260 పరుగుల రికార్డ్ ను కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. అశోక దిండా 2, జెఫ్ మార్ష్ 1,ల్యూక్ రైట్ 1 వికెట్లు పడగొట్టారు.

Chris Gayle smashes T20 records to demolish Pune, Chris Gayle smashes T20 records with astonishing innings, Royal Challengers Bangalore thrashed Pune Warriors by 130 runs, Chris Gayle Trashes T20, IPL Records

 

భారీ టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగిన పూణే వారియర్స్ కు మొదటి ఓవర్లోనే చుక్కెదురైంది. మొదటి ఓవర్ లో రెండో బంతికే ఓపెనర్ రాబిన్ ఊప్పను మురళీ కార్తీక్ బౌలింగ్ లో కవర్స్ లో ఆర్పీ సింగ్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత పూణే నిలదొక్కుకోలేకపోయింది. ఫించ్ 0ను అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో మురళీ కార్తీక్ క్యాచ్ పట్టడం ద్వారా, యువరాజ్ సింగ్ 16 ఉనాద్కట్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ ద్వారా, రైట్ 7 ఉనాద్కట్ బౌలింగ్ లో డివిలియర్స్ క్యాచ్ ద్వారా, స్మిత్ 31 బంతుల్లో 41 పరుగులు (6బౌండరీలు)అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో దిల్షాన్ క్యాచ్ ద్వారా, జెఫ్ మార్ష్ 23 బంతుల్లో 25 పరుగులు (2 సిక్సర్లు) వినయ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా, భువనేశ్వర్ కుమార్ 6 ఆర్పీ సింగ్ బౌలింగ్ లో అరుణ్ క్యాచ్ పట్టడం ద్వారా, ముర్తజా 5 గేల్ బౌలింగ్ లో అరుణ్ స్టంపవుట్ ద్వారా, పాండే 0 గేల్ క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా పూణే బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నించడంతో ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ దారి పట్టారు. మన్హాస్ 11 నాటౌట్, అశోక దిండా 1 నాటౌట్ గా నిలిచారు. ఐదో వికెట్ కు స్మిత్, జెఫ్ మార్ష్ 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టీవ్ స్మిత్ ఒక్కడే పూణే వారియర్స్ జట్టులో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. అంటే బెంగళూరు సాధించిన పరుగులలో సగం మాత్రమే చేయగలిగింది. క్రిస్ గేల్ 2, ఉనాద్కట్ 2, అర్జున్ రామ్ పాల్ 2, ఆర్పీ సింగ్ 1, మురళీ కార్తీక్ 1, వినయ్ కుమార్ 1 వికెట్లు పడగొట్టారు. రెండు వికెట్లు తీయడమే కాకుండా 175 పరుగులు చేసిన క్రిస్ గేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆడిన 8 మ్యాచుల్లో 6 మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.