చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట
posted on Oct 10, 2025 3:29PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అక్రమ మద్యం కేసులో యాంటిసిపేటరీ బెయిలు కోసం మోహిత్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి, సిద్దార్థ లూథ్రా వా దనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఏ 39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో మోహిత్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు లభించింది.