రమేష్ ధీరజ్ రాసిన మార్పు కోసం పుస్తకావిష్కరణ
posted on Oct 10, 2025 3:46PM

మానవ విలువల గొప్పతనాన్ని తెలియజేయడానికే సినీనటుడు,రచయిత స్వర్గీయ రమేష్ ధీరజ్"జీవితంలో మార్పుకోసం" అన్న అద్భుతగ్రంథాన్ని రాశారని ప్రముఖ కవి మాజీ మైన్స్ డైరెక్టర్ డా.వి.డి.రాజగోపాల్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య అనువాద పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళారత్న డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ లోని కాళా భారతిలో రమేష్ ధీరజ్ రాసిన జీవితంలో మార్పుకోసం గ్రంథావిష్కరణ సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిథులుగా ప్రముఖ కవులు డా.పి.విజయలక్ష్మి పండిట్, డా.జెల్ది విద్యాధర్, డా.రాధాకుసుమ, పద్మశ్రీలత ,పెద్దూరి వెంకట దాసు,ధీరజ్ తల్లి యం.రమాదేవి, సోదరుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ ధీరజ్ వ్యక్తిత్వాన్ని,ఆయన రాసిన పుస్తకాల మానవీయవిలువలను వక్తలు కొనియాడారు. ధీరజ్ తల్లి రమాదేవిని ఘనంగా సన్మానించారు.