ఓ చాయ్ వాలా.. కట్నంగా రూ.1.51 కోట్లు


సామాన్యులకు తమ కూతుర్లకు పెళ్లి చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్మో కష్టాలు పడితేకానీ పెళ్లి చేయలేని పరిస్థితి. అలాంటిది కేవలం టీ అమ్ముకునే వాడు పెళ్లి చేయాలంటే ఇంకెంత కష్టం. కానీ అలాంటి ఓ చాయ్ వాలా తమ కూతుర్లకు భారీగా కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసి అందరికి షాకిచ్చాడు. ఇంతకీ ఎంత కట్నం ఇచ్చాడు అనుకుంటున్నారా..? ఏకంగా రూ.1.51 కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలుసంగతేంటంటే.. రాజస్థాన్‌కి చెందిన రామ్‌ గుజ్జర్‌ కోత్‌పుట్లి ప్రాంతంలో ఓ టీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఆరుగురు కుమార్తెలు. ఏప్రిల్‌ 4న రామ్‌ తన ఆరుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. అయితే వారికి కట్నంగా రూ.1.51 కోట్ల నగదును ఇచ్చాడు. దీంతో విషయం తెలుసుకున్న ఐటీ శాఖ అధికారులు రామ్‌కి సమన్లు జారీ చేశారు. కానీ రామ్‌ స్పందించలేదు. దాంతో అతనికి ఐటీ శాఖ గురువారం లోగా అతను ఆస్తి వివరాలు చెప్పకపోతే న్యాయపర్యమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu