మూడు బీర్లు కొట్టిన పంది..అవాక్కయిన జనం

మనుషులే కాదు..జంతువులు కూడా మందు కొడతాయా అని అనుకునే వారికి ఈ వార్త నిజంగానే కళ్లు తెరిపిస్తుంది. ఒక వరాహం ఒకటి కాదు రెండు కాదు..మూడు బీర్లు లాగించేసి అక్కడున్న జనాన్ని అవాక్కయ్యేలా చేసింది. మెక్సికోలో జరిగిన ఈ వింత సంఘటనను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. మెక్సికోలోని ఓ నగరంలో ఓ పందికి ఉన్నట్టుండి దాహం వేసింది..దీంతో స్థానికంగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తచ్చాడుతూ..అక్కడ పడి ఉన్న బీరు సీసాలను నోట్లో పెట్టుకుని తన దాహం తీర్చుకోవాలని అనుకుంది.

 

కానీ, వాటిలో చుక్క బీరు కూడా లేకపోవడంతో నిరాశ చెంది అటు ఇటు చూసింది. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి బీరు తాగేందుకు పక్కనపెట్టుకున్నాడు. అంతే ఆ బాటిల్‌పై పంది కన్ను పడింది. వెంటనే అక్కడికి పరిగెత్తుకెళ్లి ఆ బాటిల్‌ను నోట కరచుకుని తాగేసింది. ఒక్క బీరుతో దాహం తీరలేదో లేక..బీరు టెస్ట్ బాగుందో ఏమో కానీ..మరో సీసా దొరుకుతుందేమోనని వెతికింది. ఇది గమనించిన అక్కడి వారు మరో రెండు బీర్ బాటిల్స్ కొని..ఓపెన్ చేసి దాని ముందు పెట్టారు. అంతే ఆనందంతో ఎత్తిన బాటిల్‌ను దించకుండా ఒక దాని తర్వాత మరొకటి లాగించి ఆనందంగా తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu