విజయ్ నివాసానికి బాంబు బెదరింపు
posted on Oct 9, 2025 1:44PM
.webp)
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఇటీవల కరూర్‌లో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట సంభవించి 41 మంది మరణించిన విషాద ఘటన తర్వాత ఈ బెదిరింపు రావడం ఆందోళన రేకెత్తించింది. విజయ్ భవిష్యత్తులో మరోసారి బహిరంగ సభలు పెడితే ఆయన ఇంటిని బాంబుతో పేల్చివేస్తామంటూ ఓఆగంతుకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు.
ఈ కాల్ కన్యాకుమారి నుంచి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ బెదరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. విజయ్ నివాసంలో అణువణువూ తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా ఉండగావిజయ్ నివాసంలో బాంబు పెట్టామంటూ బెదరింపు కాల్ రావడం ఇదిరెండో సారి.