నకిలీ మద్యం కేసు...కీలక అప్డేట్
posted on Oct 15, 2025 4:37PM
.webp)
మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో 10 మంది నిందితులను మూడు రోజుల కస్టడీకి తంబలళ్లపల్లె కోర్టు అనుమతించింది. ఎక్సైజ్ శాఖ రేపు వీరిని కస్టడీలోకి తీసుకోనుంది. మరోవైపు ప్రధాన నిందితులు A5 రాజేష్, A17 జయచంద్రారెడ్డి, A18 గిరిధర్‌రెడ్డి ఆచూకి లభించలేదు. కల్తీ మద్యం తయారీకి సహకరించిన రమేష్, అల్లా భక్షు, శ్రీకర్, అనే ముగ్గురిని విజయవాడలో విచారిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని నిందితులుగా గర్తించగా.. మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు కూడా ఉన్నారు. మరో ఏడుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరోవైపు కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్‌రావు అరెస్ట్‌పై పీటీ వారెంట్ దాఖలు చేయగా.. తంబళ్లపల్లి కోర్టు పిటిషన్‌పై విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది.