ఏపీలో కలిసొస్తున్న పరిస్ధితులు..మళ్లీ జోష్‌లో టీడీపీ....
posted on Mar 20, 2020 12:48PM
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం టీడీపీలో జోష్ నింపింది.....కరోనా ఎఫెక్ట్ కావచ్చు వేరే కారణ కావచ్చు ఎన్నికలు కొన్ని వారాలు వాయిదా పడడంతో టీడీపీకి మంచి ఊరట దొరికింది... ఎన్నికలకు ప్రిపేర్ కావడానికి మంచి టైమ్ దొరకడం ఒక కారణం అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు రడీ అయ్యిన పరిస్థితిలో టిడిపి లేదు...దీంతో తాజా పరిణామాలు టిడిపికి ఆనందం కలిగిస్తున్నాయి....ప్రస్తుతం టిడిపి నాయకత్వ లోపంతో కొంత ఇబ్బంది పడుతోంది..చంద్రబాబు ఎంత మోటీవేట్ చేసినా నాయకులు క్రమంగా జారిపోతున్నారు....చాలా చోట్ల అసలు పోటీ చేయడానికి కూడా ముందుకు కాని పరిస్థతి ఏర్పడింది.. కొన్ని జిల్లాలు చాలా నియోజక వర్గాలలో ఈ పరిస్థితి ఉంది..దీనికి కారణం మొన్న ఎన్నికల్లో ఘోర సరాజయం పాలవ్వడమే...ఇంతో లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చాయి....
ఔనన్నా కాదన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది..కానీ సాధారణ ఎన్నికలు జరిగిన రెండు నెలల నుంచే ఏపీలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి.....టిడిపి అయితే వైసీపీ పైౌ తీవ్ర స్థాయిలో దాడి మొదలు పెట్టింది....దీంతో వైౌసీపీకి కొంత ఇబ్బంది ఎదురయ్యింది..సాధారణంగా ఎన్నికలు జరిగిన ఆరు నెలల వరకు ప్రతిపక్షం సైలెంట్ గా ఉంటుంది..కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు....దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు వ్యవహారం మొదట్లో వచ్చిన ఇసుక సమస్య చాలా ఇబ్బండిగా మారాయి....ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి....దీంతో వైసీపీ సహజంగానే జోష్ లో ఉంది.కానీ టీడిపి, మిగిలిన ప్రతిపక్షాలు ఇబ్బంది పడే పరిస‌్థితి..
అయితే కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికలు ప్రస్తుతం ఆరు వారాలు వాయదా పడ్డాయి...దీంతో టిడిపి ఊపిరి పీల్చుకుని మెంటల్ గా ఎన్నికలకు రడీ అయ్యే పరిస‌్థితి వచ్చింది..గెలుపు ఓటమి తర్వాత విషయం.. ముందు పోటీ చేయడానికి అధ్యర్ధులు ప్రిపేర్ అవ్వచ్చే అనే భావన పార్టీలో ఏర్పడింది..దీంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో టిడిపి వర్గాలున్నాయి.....