ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ విచారణకు మిథున్ రెడ్డి
posted on Jan 23, 2026 2:38PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్ల మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం (జనవరి 23) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో కోట్లాది రూపాయల కిక్బ్యాగ్స్ ఉండొచ్చన్న అనుమానాలతో దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది.
జగన్ హయాంలో మద్యం విధానం రూపకల్పన, అమలు సమయంలో భారీ అవకతవకలు జరిగాయనీ, మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తాలు లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ముఖ్యంగా హవాలా మార్గంలో నగదు తరలింపులు, మనీ లాండ రింగ్ చట్టాల ఉల్లంఘన జరిగిందని ఈడీ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలు, అను బంధ వ్యక్తులు, సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న పలువురు వ్యాపా రులు, మధ్యవర్తులను విచారించడం ద్వారా వచ్చిన సమాచారంతో ఈడీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ కుంభకోణంలో రాజకీయ నేతల పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో, ఎంపీ విజయసాయిని ఈడీ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డి విచారణలో మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసు రాజ కీయ ప్రేరేపితమని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండగా, చట్టప్రకారమే విచారణ జరుగుతోందని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.