ఆంధ్ర ఈసీ లేఖ నిజమే : కిషన్ రెడ్డి
posted on Mar 20, 2020 12:35PM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎపి ఎస్‌ఇసి) కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్‌ఇసి రమేశ్ కుమార్‌కు భద్రత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. రమేశ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినప్పుడల్లా భద్రత కల్పిస్తారు. రమేష్‌కు భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. నేను కూడా ఏపీ డీజీపీతో మాట్లాడతానని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ జోక్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం అధికార పార్టీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఆయన ధృవీకరించలేదు. కానీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ధృవీకరించారు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం భద్రత పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేర్చారు.