విజయ్ టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు
posted on Jan 22, 2026 5:15PM

తమిళ స్టార్ హీరో విజయ్‌కు చెందిన తమిళ వెట్రి కళగం పార్టీ.. టీవీకేకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ ఈసీ గురువారం (జనవరి 22) నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ కి ఈ ఏడాది ఏప్రిల్- మే లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజిల్ గుర్తు మీద పోటీ చేయనుంది. ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించడం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ నాయకుడు విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విజల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, టీవీకేకు విజిల్ గుర్తు సక్సెస్ కు సంకేతంగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా.. ఏఐడీఎమ్‌కే ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేసింది. ప్రజలపై హామీల జల్లులు కురిపిస్తోంది. టీవీకే పార్టీ ఎలాంటి పొత్తూ లేకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికలలో టీవీకే ప్రభావం పై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.