తప్పులెన్నువారు తమతప్పులెరుగరన్నట్లుగా జగన్ తీరు!

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లుగా ఉంది జగన్ తీరు. తన హయాంలో సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. స్థలాల సరిహద్దులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసే సర్వే రాళ్ల కోసం ఏకంగా రూ.700 కోట్లా వ్యయం చేయడం, ఖరీదైన గ్రానైట్ రాళ్లను వినియోగించడం అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే  భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  
కాగా 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే భూముల రీసర్వేను పారదర్శకంగా చేపడతామనీ, అలాగే పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మలను తొలగిస్తామని అప్పటి విపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు పంపిణీ చేశారు. దీనిపై రైతులలో హర్షం వ్యక్తం అవుతోంది. 

కానీ జగన్ మాత్రం తన తప్పులను తెలుగుదేశం ప్రభుత్వం సరిదిద్దడాన్ని సహించలేకపోతున్నారు.  సరిహద్దురాళ్లు సరిగా లేవు, పాసుపుస్తకాలు కూడా తప్పుల తడకలా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  గురువారం (జనవరి 22) తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడిన జగన్ తన ప్రసంగం మొత్తం తెలుగుదేశం కూటమి  చేపట్టిన భూముల రీసర్వేపైనే మాట్లాడారు.

అసలీ కార్యక్రమాన్ని చేపట్టినది తానేనంటూ క్రెడిట్ చోరీకి శతధా ప్రయత్నించారు. వాస్తవానికి భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం  అదే సమయంలో అప్పట్లో తన నిర్వాకం అదే ఫొటోల వ్యవహారం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నవ విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు.  భూ యజమానులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలపై  తన సొంత ఫోటోను ముద్రించడం పట్ల జగన్  ఈ సమావేశంలో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అసలా ప్రస్తావన చేయడానికి కూడా సాహసించలేదు. అంతే కాదు తన హయాంలో సరిహద్దు రాళ్లపై తన పేరు, ఫోటో విషయాన్ని కూడా దాటవేశారు.   దీంతో జగన్ మీడియా సమావేశంలో ప్రసంగం విన్నవారంతా తప్పులెన్నువారు అన్న వేమన శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu