రామ్ గోపాల్ వర్మపై మరో కేసు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. ఈ సారి ఈ కేసు మాజీ ఐపీఎస్ అధికారిని అంజనాసిన్హా ఫిర్యాదు మేరకు నమోదైంది అంజనా సిన్హా తన ఫిర్యాదులో దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్‌ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని   పేర్కొన్నారు.  దహనం వెబ్‌సిరిస్‌కు రామ్‌గోపాల్‌వర్మ  నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.  2022లో దహనం వెబ్ సీరిస్ వచ్చింది.

మొదట ఎంఎక్స్ ప్లేయర్ ‌లో విడుదలైంది. అయితే తరువాత తొలగించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్, ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్య అనంతర ప్రతికార నేపథ్యంలో రూపొందింది.  1990 బ్యాచ్‌కు చెందిన అంజనా సిన్హా   రాయలసీమలో ఎస్పీగా, డీఐజీగా పనిచేశారు అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్‌సిరీస్‌లో ఉపయోగించారన్నది ఆమె అభియోగం. అంజనా సిన్హాప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ డైరక్టర్ గా ఉన్నారు. తన అనుమతి లేకుండా తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్ లో వినియోగించారని అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దహనం సిరీస్ మొత్ం హింసాత్మక దృశ్యాలతో, సెక్సువల్ కంటెంట్ తో కూడుకుని ఉందన్న అంజనా సిన్హా  ఆ సినిమాలో తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని ఉపయోగించడం ద్వారా  గౌరవ ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగిందనీ, తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు రాదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.   ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu