వివేకా హత్య కేసు.. బెయిల్ రద్దు పిటిషన్లు మళ్లీ ట్రయల్ కోర్టుకు!

వివేకానందరెడ్డి హత్య కేసులో  విచారణ ఓ అంతులేని కథలా సాగుతోంది. ఈ కేసులో నిందితుల బెయిలు రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన బెయిలు పిటిషన్ పై ఈ దశలో నిర్ణయం తీసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బెయిలు రద్దు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సునీతకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు కోరుతూ డాక్టర్ సునీత మళ్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నారు.

డాక్టర్ సునీత దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 16) విచారించింది. గత విచారణ సందర్రభంగా సుప్రీం కోర్టు ఎంత మంది బెయిల్స్ రద్దు చేయాలి అని ప్రశ్నించడమే కాకుండా గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేసిందనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ వ్యాఖ్యనించడంతో పాటు డాక్టర్ సునీత, ఆమె భర్త, అలాగే సీబీఐ ఎస్పీ రాం సింగ్ లపై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. దీంతో సుప్రీం కోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయని అంతా భావించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu