9 మంది తమిళనాడు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

 

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మాచిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న తమిళనాడుకు చెందిన  9 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.34.40 లక్షలు విలువ చేసే 344 కేజీల బరువు వున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు  జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.
     
రాయచోటిలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ  మాచిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా సాగుతోందని సమాచారం అందిందన్నారు. సమాచారం అందుకున్న రాయచోటి రూరల్ సి.ఐ వరప్రసాద్   రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ సి.ఐ మధు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి బుధవారం తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో తొగురుపల్లి క్రాస్ వద్ద కాపు కాశారన్నారు.  

ఈ క్రమంలో మాచిరెడ్డిగారిపల్లె వైపు నుండి ఒక కారు వచ్చి ఆగిందన్నారు. అంతలోనే ప్రక్కనే వున్నటువంటి మామిడి తోపు నుండి కొంత మంది  ఎర్రచందనం  దుంగలను తీసుకుని కారులో లోడ్ చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారన్నారు. అందులో కొంత మంది కారులో ఎక్కి పోలీసులను గుద్దే ప్రయత్నం చేస్తూ అక్కడ నుంచి తప్పించుకుని పోయారన్నారు. 

వెంటనే అప్రమత్తమైన పలీసులువారందరిని వెంబడించి వారిలో 9 మంది మందిని అరెస్టు చేసి, 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వివరించారు. అరెస్టు చేసిన తమిళ ముద్దాయిలు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరు తప్పిందుకుని పోయినట్లు తెలిసిందని, వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులు, పోలీసు, ఆర్.ఎస్.టి.ఎఫ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu