ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం
posted on Sep 20, 2025 3:21PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద జరిగే దసరా వేడుకల్లో ఈసారి ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. భద్రత కోసం ఏఐ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు అమర్చనుండగా, చిన్నారుల రక్షణ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చేతి బ్యాండ్‌లు అందించనున్నారు. ఉత్సవాల వివరాలు, సేవలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ మరియు చాట్‌బాట్‌ను రూపొందించారు. ‘దసరా–2025’ పేరుతో ఆ యాప్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. యాప్‌లో పొందుపరిచిన ఫీచర్లు, వినియోగదారులకు అందే సౌకర్యాల గురించి అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చింత అనిల్‌కుమార్ వివరించారు.