LATEST NEWS
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ కమ్మ, కాపు కులాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలపై కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, రాజకీయాల్లో ఓటమి చెందిన నేతలు మళ్లీ ప్రయత్నించడం సహజమని అన్నారు.
వైసీపీ హయాంలో కుల ద్వేషం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కుల ప్రభావం ఎప్పటినుంచో ఉన్నదని, అయితే జగన్ ఐదేళ్ల పాలనలో అహంకారం మితిమీరిందని విమర్శించారు. కుల రాజకీయాలు ఉన్మాద స్థాయికి చేరి ఇతర కులాలపై విమర్శలు చేయించారని అన్నారు.దీనికి ప్రతిస్పందించిన రవిశంకర్, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై దాడులు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్లే జగన్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని, అనవసరంగా శత్రువులను సృష్టించుకున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇదే కారణంగా వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు తక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో కుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. కుల అభిమానం వేరు, కుల ద్వేషం వేరు అని, ప్రతి ఒక్కరూ తమ కులాన్ని గౌరవించుకోవచ్చు కానీ ఇతర కులాలను ద్వేషించకూడదని సూచించారు. అమరావతి విషయంలో కూడా అన్ని కులాల ప్రజలు భూములు ఇచ్చారని, ఎస్సీ, బీసీ, ఓసీ అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములయ్యారని రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం నగరాల్లో కులం కంటే ఆర్థిక స్థితి ప్రభావం ఎక్కువగా ఉందని, డబ్బు ఉంటే కుల భేదాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు.ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ప్రకటించారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నేతలకు, ముఖ్యంగా మాజీ మంత్రులకు పార్టీ పెద్దపీట వేయడం గమనార్హం.
ఈ తొలి జాబితాలో పార్టీ అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత గడ్డ అయిన 'ఎడప్పాడి' నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రకటించిన 23 మంది అభ్యర్థులలో ఏకంగా 21 మంది మాజీ మంత్రులు ఉండటం విశేషం. తమకున్న అనుభవం, నియోజకవర్గాలపై పట్టును దృష్టిలో ఉంచుకుని పాత వారికే ఈపీఎస్ మొగ్గు చూపారు. డీ జయకుమార్ రాయపురం నుండి, సీవీ షణ్ముగం మైలం నుండి, ఎస్పీ వేలుమణి తొండముత్తూరు నుండి బరిలోకి దిగుతున్నారు.
ముఖ్య నేతల విషయానికి వస్తే.. కేపీ మునుసామి వేపనహళ్లి నుంచి, దిండిగల్ శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, నథమ్ విశ్వనాథన్ నథమ్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ మంత్రులు సెల్లూరు రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (విరాలిమలై), ఓఎస్ మణియన్ (వేదారణ్యం) తమ పాత నియోజకవర్గాల నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెజారిటీ నేతలు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతుండగా, ముగ్గురు మాజీ మంత్రుల నియోజకవర్గాలను మాత్రం పార్టీ మార్చింది.
కూటమి లెక్కల ప్రకారం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సింహభాగం స్థానాల్లో అంటే సుమారు 178 సీట్లలో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎమ్ఎంకేకు 11 స్థానాలను కేటాయించారు. డీఎంకే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పళనిస్వామి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కానుండటంతో, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పార్టీ వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులపై భారం వేసిన అన్నాడీఎంకే, ఈసారి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉంది.మే 4వ తేదీన వెలువడే ఫలితాలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం (మార్చి 28) రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ముద్ర వేయించుకోవడానికి అవసరమైన కీలక తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యం ఈ ప్రత్యేక సమావేశం జరుగుతోంది.
రాజధాని విషయంలో గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి తిరుగులేని చట్టపరమైన రక్షణ ఉండాలని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల అనంతరం.. గతంలో ఉన్న సీఆర్డీయే 2014 చట్టానికి సంబంధించిన తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది.
అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరే ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడానికి వీలులేకుండా గట్టి పునాది వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది. అయితే రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకపోతే.. రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. మూడు రాజధానుల వైఖరిని ప్రజలు గత ఎన్నికల్లో నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
గత ఏడాది కాలంగా వైసీపీ నేతలు అమరావతి రాజధాని విషయంలో ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తున్నారు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో రాజధాని విధానంపై పునరాలోచన చేస్తామని ప్రకటించినా, అధినేత జగన్ నుండి మాత్రం ఆ దిశగా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కోసం జరుగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరిస్తే.. అమరావతిపై వైసీపీ వైఖరిలో మార్పు లేదనీ, రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరించడం లేదనీ సందేహాలకు అతీతంగా తేలిపోతుంది. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయంగా తేరుకోలేని నష్టం జరగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
అమరావతికి సంబంధించి కీలక తీర్మానం చేయడం కోసం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వస్తారా? రారా అన్నది స్పష్టత లేదు. గతంలో అంటే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా విస్పష్టంగా చెప్పి అమరావతికి మద్దతు పలికిన జగన్ ఆ తరువాత అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా ? ఒకవేళ మద్దతు ఇస్తే ఐదేళ్ల తమ పాలనలో తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. ఇక మద్దతు ఇవ్వకుంటే.. జగన్ అమరావతికి వ్యతిరేకి అన్న ముద్ర పడుతుంది. అందుకే జగన్ డుమ్మా కొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్(Thiruveer). 'మసూద', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు 'పాపం ప్రతాప్'(Papam Prathap) అంటూ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్.పి.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరువీర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డ్రైవర్ అనుకున్నాడు
తాను ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంపై తిరువీర్ తనదైన శైలిలో స్పందించాడు. తన దగ్గరకు వచ్చిన బెస్ట్ కథలు ఎంచుకొని చేస్తున్నానని, ప్లాన్ చేసి చేయట్లేదని తెలిపాడు. అలాగే తనని రియల్ గా హీరోలా చూడరు అంటూ తనకు ఎదురైన కొన్ని సంఘటనలను షేర్ చేసుకున్నాడు.
"మసూద సినిమా షూటింగ్ సమయంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నన్ను చూసి కారు డ్రైవర్ అనుకున్నాడు. నేను హీరోని అని చెబితే.. హీరో అయితే పక్కన మనుషులు ఉండాలి, గొడుగు ఉండాలి కదా అని అమాయకంగా అడిగాడు" అంటూ నవ్వుతూనే ఆ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఈ సినిమాలో హీరో ఎవరని నన్నే అడిగిన సందర్భాలు పలు ఉన్నాయని తిరువీర్ తెలిపాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పా
"అలాగే ఇటీవల ఫ్లయిట్ లో విజయవాడ వెళ్తూ.. ఫోన్ లో నేను మూవీ డేట్స్ గురించి మాట్లాడటంతో.. పక్కన కూర్చున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీయా అని అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదని అర్థమై.. యాక్టర్ అని చెప్పకుండా.. ఓజీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ని అని అబద్ధం చెప్పాను" అంటూ మరో ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు తిరువీర్.
టీజర్ అదిరింది.. కథేంటంటే?
తాజాగా విడుదలైన ‘పాపం ప్రతాప్’ టీజర్ చూస్తుంటే ఇది ఒక పక్కా విలేజ్ రొమాంటిక్ కామెడీ అని అర్థమవుతోంది. చిన్ననాటి నుంచి ప్రేమించిన అమ్మాయి బుజ్జమ్మను పెళ్లి చేసుకున్న ప్రతాప్ అనే అమాయకపు యువకుడి కథ ఇది. పెళ్లైన మూడు రోజులకే బుజ్జమ్మ పంచాయతీ పెట్టడం, ఊరంతా ప్రతాప్‌ను ఒక వింత చూపుతో చూడటం టీజర్‌లో భలే సరదాగా చూపించారు. అసలు ప్రతాప్ చేసిన తప్పేంటి? ఆ ఊరి జనం అతడిని ఎందుకు 'పాపం ప్రతాప్' అంటున్నారు? అన్నది తెలియాలంటే ఏప్రిల్ 17 వరకు ఆగాల్సిందే.
వచ్చే సంక్రాంతికి బావ బావమరుదుల రచ్చ
వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ స్టోరీ ఇదేనా?
అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడు?
విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించింది.
ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా నటిస్తుండటం విశేషం. దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్, అలాగే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన వెంకటేష్.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించడం ద్వారా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వాలని అనిల్ రావిపూడి చూస్తున్నాడు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరుదులుగా కనిపిస్తారని, వారి మధ్య వచ్చే ఫన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి కేవలం నవ్వించడమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా జోడిస్తున్నారట. బావ బావమరుదుల మధ్య ఉండే బంధం, అనుబంధాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. పాత తరం సినిమాల్లో ఉండే స్వచ్ఛమైన వినోదాన్ని మళ్ళీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందట.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాస్టింగ్ విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్‌ను, అలాగే కళ్యాణ్ రామ్ జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ రామ్ సరసన కయదు లోహర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో భూ రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రముఖ హీరో గోపీచంద్(Gopichand) కనిపించడం విశేషం.
చంద్రబాబు సర్కార్ ఏపీలో భూ రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. తాజా టెక్నాలజీ వినియోగంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా మారిందని తెలుస్తోంది. స్లాట్ బుకింగ్ విధానంలో కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతోందని అంటున్నారు.
భూ రిజిస్ట్రేషన్ కి సంబంధించి హీరో గోపీచంద్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా, అతికొద్ది సమయంలోనే పని పూర్తి కావడంతో ఆయన ఆశ్చర్యపోయారట.
భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పులపై గోపీచంద్ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగుందని గోపీచంద్ కొనియాడారట.
గోపీచంద్ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://x.com/bobbysairam/status/2036759835740610561
-ఓటిటిలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న మూవీ
-మహిళా సాదరికతపై ప్రశ్నలు
-భార్య అయినా శృంగారం అనేది ఇష్టం ఉండాల్సిందే
-ఇంతకీ ఆ సిరీస్ ఏంటి
సినీయుగంలో ఓటిటి యుగం కూడా వాటా దక్కించుకున్న ఈ రోజుల్లో డిఫరెంట్ జోనర్స్ తో కూడిన పలు ఓటిటి చిత్రాలు ప్రేక్షకులకి సరికొత్త మజాని ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకంజ వెయ్యడం లేదు. థియేటర్ చిత్రాలతో పోటీపడి సై అంటే సై అంటున్నాయి. ఆ కోవలోనే వచ్చిన తాజా చిత్రం 'చిరాయ'. ఈ నెల 20 నుంచి జియో హాట్ స్టార్(Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ అవుతుండటమే కాదు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఎన్నో చర్చలని లేవనెత్తుతూ ట్రెండింగ్ లో ఉంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.
వివాహం తర్వాత మహిళపై జరుగుతున్న వైవాహిక అత్యాచారం అనే కాన్సెప్ట్ అధారంగా చిరాయ తెరకెక్కింది. శృంగారం విషయంలో భార్య సమ్మతి కూడా ముఖ్యమనే విషయాన్నీ కూడా ఎలాంటి బెరుకు లేకుండా చెప్పడంతో పాటు విషపూరితమైన పురుషాహంకారాన్ని తెలియచేసింది. కథగా చూసుకుంటే 'కమ్లేష్' అనే మహిళ ఒక ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు. తన మరిది చాలా మంచివాడని నమ్మి పూజా అనే అమ్మాయితో వివాహం జరిపిస్తుంది. కానీ పెళ్లి తర్వాత అరుణ్ అసలు రూపం బయటపడుతుంది. పూజాని మానసికంగా హింసిస్తుండటమే కాకుండా పూజకి ఇష్టం లేకపోయినా శారీరకంగా అనుభవించాలనుకునే పెద్ద సైకో. మరి భర్త వేధింపుల నుంచి ఎలా బయటపడిందనేదే చిరాయ.
also read: Dhurandhar 2: హంజాతో అలజడులు సృష్టించాలనుకుంటున్నారా! వార్నింగ్ ఇస్తున్న ఆదిత్య ధర్
మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉండగా ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. తెలుగు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో సహా మొత్తం పదకొండు భాషల్లో అందుబాటులో ఉంది. మరి గృహ హింస, వైవాహిక అత్యాచారాల తీవ్రతని కళ్లకు కట్టినట్లు చూపించిన చిరాయని ఇప్పుడే చూడండి. ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా శశాంత్ షా(Shashant Shah) దర్శకుడు.
The Telugu film industry is beaming with pride as one of its most iconic figures, Nandamuri Balakrishna, adds another glittering jewel to his crown. The legendary actor has been conferred with the prestigious “Lifetime Achievement Award” at the International Film Festival Delhi (IFFD) 2026, recognizing his unparalleled contribution to Indian cinema.
The news of the award has sparked a wave of joy across the Telugu film fraternity. Industry associations and fans alike have taken to social media to celebrate the achievement. The Honorary Secretaries of the Telugu Film Producers Council, T. Prasanna Kumar and Y. V. S. Chowdary, extended their heartfelt congratulations to the actor.
In a joint statement, they expressed their immense pride, noting, "We are delighted to announce that Nandamuri Balakrishna has been honored with the prestigious “Lifetime Achievement Award” at the International Film Festival Delhi 2026. The award was presented by the Hon’ble Chief Minister of Delhi, Rekha Gupta.
This recognition marks yet another significant milestone in the illustrious journey of Shri Nandamuri Balakrishna Garu. His contribution to the Telugu film industry has been remarkable, and this honor stands as a moment of pride not only for him but for the entire Telugu cinema fraternity.
On this special occasion, we extend our heartfelt congratulations to Shri Nandamuri Balakrishna Garu and wish him continued success, hoping he receives many more accolades in the years to come."
https://x.com/tfpcin/status/2037115819789082770
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు.
నవమి వైభవం!!
నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.
ఏకపత్నీ వ్రతుడు!!
ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.
రామాయణం!!
భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా. ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.
హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు. వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి.
రామనామం!!
రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది.
త్యాగరాజు అంటాడు
నిధి చాల సుఖమా రాముని స
న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని
రామదాసు అంటాడు
ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని
ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు.
ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం.
ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.
◆వెంకటేష్ పువ్వాడ.
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం, మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం. అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే..
ఆర్థిక పరిస్థితి గురించి
ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు. కొన్నిసార్లు ఇలాంటి సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి దొంగతనం లేదా మోసపోవడానికి దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం.
ఆరోగ్యం, వైద్య సమాచారం..
ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది. తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.
ఉదాహరణకు.. దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు.
ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు..
మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.
వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే ఎగతాళి చేయవచ్చు. కాబట్టి, ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి.
రిలేషన్స్, పర్సనల్ లైఫ్..
రిలేషన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం గోప్యతకు భంగం కలిగించవచ్చు.
ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది. అంతేకాదు.. బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.
*రూపశ్రీ.
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు. డబ్బు సంపాదిస్తారు, నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు. కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు. కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు. పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు. పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు? వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు..
జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం.
స్వప్రయోజనాలు చూసుకునేవారు..
స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు. మాట్లాడి చాలా రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు. ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు.
చాడీలు చెప్పేవారు..
ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు. జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
అసూయ పరులు..
మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు.
నిరాశ పరిచేవారు..
నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి.
పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి, మనిషిని అశాంతికి గురిచేస్తారు.
*రూపశ్రీ.
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ కమ్మ, కాపు కులాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలపై కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, రాజకీయాల్లో ఓటమి చెందిన నేతలు మళ్లీ ప్రయత్నించడం సహజమని అన్నారు.
వైసీపీ హయాంలో కుల ద్వేషం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కుల ప్రభావం ఎప్పటినుంచో ఉన్నదని, అయితే జగన్ ఐదేళ్ల పాలనలో అహంకారం మితిమీరిందని విమర్శించారు. కుల రాజకీయాలు ఉన్మాద స్థాయికి చేరి ఇతర కులాలపై విమర్శలు చేయించారని అన్నారు.దీనికి ప్రతిస్పందించిన రవిశంకర్, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై దాడులు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్లే జగన్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని, అనవసరంగా శత్రువులను సృష్టించుకున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇదే కారణంగా వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు తక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో కుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. కుల అభిమానం వేరు, కుల ద్వేషం వేరు అని, ప్రతి ఒక్కరూ తమ కులాన్ని గౌరవించుకోవచ్చు కానీ ఇతర కులాలను ద్వేషించకూడదని సూచించారు. అమరావతి విషయంలో కూడా అన్ని కులాల ప్రజలు భూములు ఇచ్చారని, ఎస్సీ, బీసీ, ఓసీ అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములయ్యారని రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం నగరాల్లో కులం కంటే ఆర్థిక స్థితి ప్రభావం ఎక్కువగా ఉందని, డబ్బు ఉంటే కుల భేదాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు.ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ప్రకటించారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నేతలకు, ముఖ్యంగా మాజీ మంత్రులకు పార్టీ పెద్దపీట వేయడం గమనార్హం.
ఈ తొలి జాబితాలో పార్టీ అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత గడ్డ అయిన 'ఎడప్పాడి' నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రకటించిన 23 మంది అభ్యర్థులలో ఏకంగా 21 మంది మాజీ మంత్రులు ఉండటం విశేషం. తమకున్న అనుభవం, నియోజకవర్గాలపై పట్టును దృష్టిలో ఉంచుకుని పాత వారికే ఈపీఎస్ మొగ్గు చూపారు. డీ జయకుమార్ రాయపురం నుండి, సీవీ షణ్ముగం మైలం నుండి, ఎస్పీ వేలుమణి తొండముత్తూరు నుండి బరిలోకి దిగుతున్నారు.
ముఖ్య నేతల విషయానికి వస్తే.. కేపీ మునుసామి వేపనహళ్లి నుంచి, దిండిగల్ శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, నథమ్ విశ్వనాథన్ నథమ్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ మంత్రులు సెల్లూరు రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (విరాలిమలై), ఓఎస్ మణియన్ (వేదారణ్యం) తమ పాత నియోజకవర్గాల నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెజారిటీ నేతలు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతుండగా, ముగ్గురు మాజీ మంత్రుల నియోజకవర్గాలను మాత్రం పార్టీ మార్చింది.
కూటమి లెక్కల ప్రకారం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సింహభాగం స్థానాల్లో అంటే సుమారు 178 సీట్లలో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎమ్ఎంకేకు 11 స్థానాలను కేటాయించారు. డీఎంకే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పళనిస్వామి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కానుండటంతో, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పార్టీ వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులపై భారం వేసిన అన్నాడీఎంకే, ఈసారి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉంది.మే 4వ తేదీన వెలువడే ఫలితాలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం (మార్చి 28) రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ముద్ర వేయించుకోవడానికి అవసరమైన కీలక తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యం ఈ ప్రత్యేక సమావేశం జరుగుతోంది.
రాజధాని విషయంలో గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి తిరుగులేని చట్టపరమైన రక్షణ ఉండాలని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల అనంతరం.. గతంలో ఉన్న సీఆర్డీయే 2014 చట్టానికి సంబంధించిన తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది.
అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరే ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడానికి వీలులేకుండా గట్టి పునాది వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది. అయితే రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకపోతే.. రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. మూడు రాజధానుల వైఖరిని ప్రజలు గత ఎన్నికల్లో నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
గత ఏడాది కాలంగా వైసీపీ నేతలు అమరావతి రాజధాని విషయంలో ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తున్నారు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో రాజధాని విధానంపై పునరాలోచన చేస్తామని ప్రకటించినా, అధినేత జగన్ నుండి మాత్రం ఆ దిశగా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కోసం జరుగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరిస్తే.. అమరావతిపై వైసీపీ వైఖరిలో మార్పు లేదనీ, రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరించడం లేదనీ సందేహాలకు అతీతంగా తేలిపోతుంది. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయంగా తేరుకోలేని నష్టం జరగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
అమరావతికి సంబంధించి కీలక తీర్మానం చేయడం కోసం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వస్తారా? రారా అన్నది స్పష్టత లేదు. గతంలో అంటే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా విస్పష్టంగా చెప్పి అమరావతికి మద్దతు పలికిన జగన్ ఆ తరువాత అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా ? ఒకవేళ మద్దతు ఇస్తే ఐదేళ్ల తమ పాలనలో తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. ఇక మద్దతు ఇవ్వకుంటే.. జగన్ అమరావతికి వ్యతిరేకి అన్న ముద్ర పడుతుంది. అందుకే జగన్ డుమ్మా కొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!
శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి.
ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.
బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!
..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు. ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది. మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే..
రెండు రూపాలు..
మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి. మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా, ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక, శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి.
తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి..
మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు, మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు.
ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి..
కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం ఏర్పడుతుంది.
లక్షణాలు..
మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి, వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి ఉంటాయి.
పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం, ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే.
చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు..
చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు. కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్, ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం.
మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్, ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు. ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు. కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు, ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి..
తొక్క వల్ల కలిగే నష్టం..
చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు. పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి. కానీ పండ్లను తొక్క తొలగించి కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది.
పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం, మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో వదిలేస్తే, బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.
నిల్వ..
కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఫుడ్ పాయిజన్, కడుపునొప్పి, వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ.
పోషణ ఉండవు..
శరీరానికి తగినంత పోషణ అందించడానికి పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు.
ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్..
సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని, వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే..
మార్కెట్ నుండి తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి.
పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి.
పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు.
కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట, ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.
*రూపశ్రీ.
