అఖిల్ ఈసారి కూడా ఆట‌లో అర‌టిపండేనా?

బిగ్‌బాస్ హ్యూజ్ హిట్ కావ‌డంతో అదే ఊపుతో ఉత్త‌రాదిలో ఓటీటీ వెర్ష‌న్ ని ప్రారంభించారు. అదే ఫార్మాట్ ని ద‌క్షిణాదిలోనూ ఫాలో అయిపోదామ‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా స‌క్సెస్ అయిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. తిట్లు, బూతులు, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో మ‌రింత దారుణ స్థాయికి ప‌డిపోయింది. హిందీ, త‌మిళంలో స‌క్సెస్ అయినంత‌గా మ‌న ద‌గ్గ‌ర‌ స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. మొత్తం 17 మందిని ఏర్చి కూర్చి త‌మిళ‌, హిందీ ఓటీటీ వెర్ష‌న్ ల‌కు మించి ర‌చ్చ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ వున్నారు. హ‌మీదా, అనీల్‌, మ‌హేష్ విట్టా, యాంక‌ర్ శివ‌, మిత్రాశ‌ర్మ‌, అరియానా, బిందు మాధ‌వి, అఖిల్‌, అషు రెడ్డి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్ వున్నారు. ఇందులో టాప్ 5 వెళ్లే వారెవ‌రో తెలిసిపోయింది. బిందు మాధ‌వి, అఖిల్‌, అషురెడ్డి, అరియానా, యాంక‌ర్ శివ‌. వీళ్లు మాత్ర‌మే టాప్ 5 లో వుంటార‌ని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ సారి బిగ్ బాస్ ఓటీటీ విన్న‌ర్ ఎవ‌రో కూడా స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. సోష‌ల్ మీడియాలో కంటెస్టెంట్ ల‌కు షో ప్రారంభం నుంచి పెరిగే ఫాలోవ‌ర్స్ ని బ‌ట్టి ఎవ‌రు విన్న‌రో ఇట్టే చెప్పేయెచ్చు. ఈ సీజ‌న్ లో ఇద్ద‌రి మ‌ధ్యే పోటీ ప్ర‌ధానంగా న‌డుస్తూ వ‌స్తోంది. వారే బిందు మాధ‌వి, అఖిల్‌. బిగ్ బాస్ సీజ‌న్ 4 లోనూ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో నెగెటివ్ అయిపోతూ రేసులో వెన‌క‌బ‌డిన అఖిల్ ఓటీటీ వెర్ష‌న్ లోనూ అదే త‌ప్పు చేస్తూ మ‌రోసారి ఆట‌లో అర‌టిపండు అయిపోతున్నాడు. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ బిందు మాధ‌విని టైటిల్ ఫేవ‌రేట్ గా నిల‌బెట్టేశాడు. షోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో అఖిల్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య‌ 717కె. బిందు మాధ‌వి ఫాలోవ‌ర్స్ గ‌త వారం కంటే భారీగా పెర‌గ‌డంతో ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య 917కి చేరింది. మొద‌ట్లో అఖిల్ కంటే త‌క్కువే వున్న బిందు ఫాలోవ‌ర్స్ క్ర‌మ క్ర‌మంగా పెరిగిపోతున్నారు. దీన్ని బ‌ట్టే ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయింది. ఎప్ప‌టిలాగే అఖిల్ మ‌రోసారి ఆట‌లో అర‌టిపండుగా మారిపోయాడు అంటున్నారు నెటిజ‌న్స్‌.   

పాట‌ల‌తో ర‌ష్మీ క‌వ్వింపు.. నేను ఆగ‌లేన‌న్న సుధీర్‌

బుల్లితెర పై సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ ల జంట‌కున్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వీరి కాంబినేష‌న్ లో ఏ స్కిట్ చేసినా అది సూప‌ర్ హిట్టే. వీరిద్ద‌రు గ‌త కొంత కాలంగా `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షోలో ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. ఇటీవ‌ల స్టార్ మా ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసిన షోలో ఈ ఇద్ద‌రు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. షో మ‌ధ్య‌లో స్పెష‌ల్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ పాట‌లు పాడుతూ ర‌ష్మీగౌత‌మ్ పై త‌న‌కున్న ప్రేమ‌ని వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. తాజాగా `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్` ఎపిసోడ్ లో అవే పాట‌ల్ని ర‌ష్మీ పాడుతూ సుధీర్‌ని ఇబ్బందిపెట్టే ప్ర‌య‌త్నం చేసింది. కెవ్వుకేక రాకేష్ తో క‌లిసి తొలిసారి సుడిగాలి సుధీర్ ఓ స్కిట్ చేశాడు. తాత‌ల‌నాటి ప‌దివేల కోట్ల ఆస్తిని అమ్మాయిల పిచ్చితో రెండు వేల కోట్ల‌కు తీసుకొచ్చాడ‌ని, ఆ రెండే వేల కోట్లు ఇవ్వాలంటే సుడిగాలి సుధీర్ 24 గంట‌ల‌పాటు అమ్మాయిలని చూడ‌కూడ‌ద‌ని కండీష‌న్ పెడ‌తాడు కెవ్వుకేక కార్తీక్‌. దీంతో సుధీర్ ని డిస్ట్ర‌బ్ చేయ‌డానికి ర‌ష్మీ గౌత‌మ్ రంగంలోకి దిగేసింది. సుధీర్‌ని కొంటె చూపులు చూస్తూ.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ర‌ష్మీ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అంతే కాకుండా `స్టార్ మా` షోలో త‌న కోసం సుధీర్ పాడిన పాట‌ల్ని పాడుతూ సుధీర్ ని ఉక్కిరిబిక్కిరి చేయ‌డం మొద‌లుపెట్టింది. దీంతో సుధీర్ త‌న‌ని తాను కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు. నేను ఆగ‌లేను.. ర‌ష్మిని చూసేస్తా.. అంటూ ఓపెన్ అయిపోయాడు. అయితే కెవ్వుకేక కార్తీక్ .. సుధీర్ ని ఆపే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో ర‌ష్మీతో పాటు రోజా కూడా సుధీర్‌ని ఆడుకోవ‌డం మొద‌లుపెట్టింది. సుధీర్ .. త‌న‌ కోసం చెప్పిన డైలాగ్ ల‌ని ర‌ష్మీ చెబుతూ త‌డ‌బ‌డింది. దీంతో `డైలాగ్  ని చంపేస్తున్నార‌మ్మా` అని సుధీర్ అన‌డంతో ఒక్క‌సారిగా అక్క‌డ‌ న‌వ్వులు విరిశాయి. ఏప్రిల్ 15న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.   

బిందు కోసం హీరో ట్వీట్‌.. ఏం జ‌రుగుతోంది?

బిగ్‌బాస్ బిందు సీక్రెట్ ల‌వ్ ట్రాక్? అనీష్ కురువిల్ల తొలి సారి డైరెక్ట్ చేసిన చిత్రం `ఆవ‌కాయ్‌ బిర్యానీ`. ఈ చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన బిందు మాధ‌వి ఆ త‌రువాత త‌మిళ చిత్ర‌సీమ‌కే ప‌రిమిత‌మైపోయింది. తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ‌గా పేరు తెచ్చుకుంది. అయితే బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీతో మ‌ళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో బిందు మాధ‌వి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఓటీటీ బిగ్ బాస్ లో త‌న‌దైన మార్కుని ప్ర‌ద‌ర్శిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. త‌న‌ని టార్గెట్ చేసిన అఖిల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటోంది. `ఆవ‌కాయ్ బిర్యానీ` త‌రువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా ఫిలితం లేక‌పోవ‌డంతో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `పిల్ల జ‌మీందార్‌` త‌రువాత నుంచి తెలుగులో క‌నిపించ‌కుండా పోయింది. ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డం.. త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డికే మ‌కాం మార్చేసింది. గ‌త కొంత కాలంగా త‌మిళ చిత్రాల్లో మెరుస్తున్న బిందు మాధ‌వి స‌డ‌న్ గా ఓటీటీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. లేడీ అర్జున్ రెడ్డిలా హ‌ల్ చ‌ల్ చేస్తూ సింగిల్ గానే అఖిల్ గ్రూప్ ని చెడుగుడు ఆడేస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో బిందు మాధ‌వికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మొద‌లైంది. దీంతో అనూహ్యంగా టైటిల్ హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయింది. ఇటీవ‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అఖిల్ తో జ‌రిగిన ర‌భ‌స లో ఏకంగా అరేయ్ అఖిల్ గా .. చెప్పురా.. అంటూ షాకిచ్చింది. బిందు దెబ్బ‌ కి త‌ట్టుకోలేక అఖిల్ అబ్బా అనేశాడు. ఇదిలా వుంటే బిందు మాధ‌వి ఓ త‌మిళ హీరోతో సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డుపుతోందంటూ వార్త‌లు  చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ఇందుకు కార‌ణం బిందు మాధ‌వికి స‌పోర్ట్ చేస్తూ త‌మిళ హీరో, జెర్సీ ఫేమ్ హ‌రీష్ క‌ల్యాణ్   ప్ర‌త్యేకంగా ట్వీట్ చేయ‌డ‌మే. గ‌తంలోనూ వీరిద్ద‌రు రిలేష‌న్ లో వున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజా ట్వీట్ తో అది మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. మ‌రి ఈ ట్వీట్ గురించి బిందు ఏమంటుందో చూడాలి.   

లూజ‌ర్ అంటూ అభిమ‌న్యుకు వేద దిమ్మ‌దిరిగే షాక్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొంత కాలంగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతోంది. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బేబీ మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పాల‌కుర్తి సురేష్ ద‌ర్శ‌కుడు. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ తాజాగా కీల‌క మ‌లుపు తిరిగింది. ఎలాగైనా య‌ష్ ని దెబ్బ‌కొట్టాల‌ని అభిమ‌న్యు - మాళ‌విక ప్లాన్ ప్ర‌కారం ఖుషీ త‌నకు పుట్టిన కూతురు కాద‌ని య‌ష్ కు చెప్పేస్తారు. అప్ప‌టి నుంచి య‌ష్ ఖుషీని త‌న కూతురిగా అంగీక‌రించ‌లేక‌.. కాద‌న లేక న‌ర‌కం అనుభ‌విస్తూ వుంటాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన వేద .. య‌ష్ ని  నిల‌దీస్తుంది. త‌ప్ప‌తాగి మాళ‌విక బెడ్రూమ్ లో య‌ష్ వీరంగం వేయ‌డం..దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని మాళ‌విక నానా మాట‌లు అన‌డంతో ఆగ్ర‌హానికి లోనైన వేద ఏం జ‌రుగుతోందో నాకు తెలియాల‌ని ప‌ట్టుబ‌డుతుంది. దీంతో య‌ష్ త‌న‌తో అభిమ‌న్యు అన్న మాట‌ల్ని చెబుతాడు. విష‌యం తెలిసి షాక్ అయిన వేద ఇక నుంచి య‌ష్ కు భార్య‌గా అండ‌గా వుండాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఇక ఇద్ద‌రు క‌లిసి ఇంటికి వ‌స్తారు. బెడ్ పై ఖుషీ నిద్ర‌పోతుంటే య‌ష్ దీనంగా పాప వంక చూస్తూ నిల‌బ‌డిపోతాడు. అది గ‌మ‌నించిన ఖుషీ లేచి ఎక్క‌డికి వెళ్లావు డాడీ అంటూ య‌ష్ ని కౌగిలించుకుంటుంది. బెడ్ పై ప‌డుకుని వేద‌న‌తో ఆలోచిస్తున్న య‌ష్ కు వెళ్లి మంచినీళ్లు తెచ్చిస్తుంది. ఆ త‌రువాత య‌ష్ పై ప‌డుకుని నిద్ర‌పోతుంది. క‌ట్ చేస్తే.. య‌ష్ ని వేదిస్తున్నామ‌ని పండ‌గ చేసుకుంటున్న అభిమ‌న్యు, మాళ‌విక‌ల ఇంటికి వెళ్లి వేద వారికి దిమ్మ‌దిరిగే షాక్ ఇస్తుంది.  ఖుషీ తండ్రి య‌ష్ అని నిరూపిస్తాన‌ని ఛాలెంజ్ చేస్తుంది. అది జ‌రిగే ప‌నికాద‌ని హేళ‌న చేస్తాడు అభిమ‌న్యు.. చేసి చూపిస్తా లూజ‌ర్ అని వేద అన‌డంతో అభిమ‌న్యు, మాళ‌విక ఒక్క‌సారిగా షాక్ అవుతారు. మంగ‌ళ వారం ఎపిసోడ్ ఎలా వుండోతోంది?  య‌ష్ తో క‌లిసి వేద వేసే ఎత్తుల‌కు అభిమ‌న్యు - మాళ‌విక చిత్తు అవుతారా? అన్న‌ది చూడాల్సిందే.  

పోలీసుల‌కు చిక్కిన జ్వాల, హిమ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ దేశవ్యాప్తంగా అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకున్న సీరియ‌ల్ గా రికార్డు సాధించింది. అయితే గ‌త కొంత కాలంగా క‌థ గాడి త‌ప్ప‌డంతో ఈ సీరియ‌ల్ పై వున్న క్రేజ్ కాస్త త‌గ్గిపోయింది. దీంతో ప్ర‌ధాన పాత్ర‌లైన వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌ని ఎండ్ చేసేసి కొత్త జ‌న‌రేష‌న్ తో క‌థ‌ని గాడిలో పెట్టాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కానీ ఈ క‌థ మ‌ళ్లీ గాడిలో ప‌డ‌టం ఇక క‌ష్ట‌మ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. క‌థ‌. క‌థ‌నాలు ఆక‌ట్టుకునే స్థాయిలో లేక‌పోవ‌డం, మ‌న‌సుని హ‌త్తుకునే పాత్ర‌లు లేక‌పోవ‌డంతో ఈ సీరియ‌ల్ ఏదో న‌డుస్తోంది అంటే న‌డుస్తోంది అన్న‌ట్టుగా సాగుతోంది. హిమ‌, శౌర్య‌ల పాత్ర‌ల‌తో క‌థ‌ని న‌డిపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ కాస్త ఆస‌క్తిగా సాగ‌బోతోంది. జ్వాల గా పేరు మార్చుకున్న శౌర్య త‌న‌ని బాగా చూసుకుంటుంద‌ని హిమ సంతోష‌ప‌డుతూ వుంటుంది. అంతే కాకుండా ఐయామ్ తింగ‌రి అంటూ గంతులేస్తూ వుంటుంది.   క‌ట్ చేస్తే.. త‌మ‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శౌర్య కోసం హిమ వెతుకుతోంద‌ని, ఆమెకు త‌ను కూడా స‌హాయం చేస్తున్నాన‌ని, మీరు ఎందుకు దీని గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆనంద‌రావుని నిరుప‌మ్ అడుగుతాడు. శౌర్య మ‌న‌కు దొర‌క‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుందేమోన‌ని నా అనుమానం అంటాడు. క‌ట్ చేస్తే.. హిమ‌, నిరుప‌మ్ లు జ్వాల ద‌గ్గ‌రికి వ‌స్తారు. 'నీ హుషారు కొంచెం హిమ‌కు కావాలి. అందుకే హిమ‌ని నీతో తిప్పుకో, నీలా మార్చు' అంటాడు. ఇదిలా వుంటే ఆటో రెన్యువ‌ల్ కోసం వెళ్లిన జ్వాల‌, హిమ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. వీళ్ల కోసం నిరుప‌మ్ ఏం చేశాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బిందుమాధ‌వి దెబ్బ‌.. అఖిల్ అబ్బా!

బిగ్‌బాస్ హ‌ద్దులు దాటుతోంద‌ని తొలి సీజ‌న్ నుంచే విమ‌ర్శ‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక అంత‌కు మించి అన్న‌ట్టుగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ర‌చ్చ చేయించాల‌ని ఫిక్స‌య్యారో ఏమో తెలియ‌దు కానీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం నిజంగానే హ‌ద్దులు దాటేసి ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. కంటెస్టెంట్ లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సీజ‌న్ ఎండింగ్ కు వ‌స్తున్న కొద్దీ మ‌రీ దారుణంగా మారుతోంది. ఇందులో ఏడ‌వ వారం ఎలిమినేష‌న్ లో బిందు మాధ‌వి, అఖిల్ ల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణే ఇందుకు అద్దంప‌డుతోంది. ఈ వీకెండ్ లో నాగార్జున ఏకంగా ఇద్ద‌రిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఏడ‌వ వారం ఎలిమినేష‌న్స్ ని ప్రారంభించేశారు. ఇక ఈ ఎలిమినేష‌న్ మ‌రింత ర‌చ్చ ర‌చ్చ‌గా సాగాల‌ని బిగ్ బాస్ అనుకున్నాడో ఏమో కానీ అంత‌కు మించి అన్న‌ట్టుగానే ఈ నామినేష‌న్ ల ప్ర‌క్రియ మ‌రింత ర‌చ్చ‌కు తెర‌లేపింది. హ‌ద్దులు దాటి కంటెస్టెంట్ లు ఒరేయ్.. ఒసేయ్ అనే స్థాయికి దిగ‌జారింది. ఎవ‌రి మ‌ధ్య అయితే గొడ‌వ పీక్స్ కి చేరుకుంటుందో అదే జంట మ‌ధ్య బిగ్ బాస్.. నామినేషన్స్ పేరుతో మంట పెట్టేశాడు. అది ఓ రేంజ్ లో అంటుకుని అరేయ్ తురేయ్ అనే దాకా వెళ్లింది. 'నీ కంటే నేనే బెస్ట్' అంటూ అఖిల్ ముందు మొద‌లుపెట్టాడు. త‌రువాత బిందు ఆడుకుంది. `మీది మీదికి వ‌చ్చింది నువ్వు. ఈ ఇంట్లో వుండే హ‌క్కు నీకెంత వుందో నాకు అంత‌కంటే ఎక్కువ వుంది. ప‌క్క‌కిపో ప‌క్క‌కి పో అంటే నేనెందుకు పోతా..' అంటూ అఖిల్ కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. అయితే ఈ డిస్క‌ష‌న్ లో బిందు మాధ‌విని అఖిల్ 'పండు.. బుజ్జి..వెళ్లి కుర్చీలో కూర్చో' అని వెట‌కారంగా అనడంతో బిందు మాధ‌వి రెచ్చిపోయింది... 'అరేయ్ అఖిల్ గా ఏంట్రా.. చెప్పురా..' అంటూ షాకిచ్చింది. దీంతో అఖిల్ 'నా వ‌ల్ల కాదు' అంటూ చేతులెత్తేశాడు.

జ‌బ‌ర్ద‌స్త్ కు రోజా గుడ్ బై!

  బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ల‌కు న‌టి, పొలిటికల్ లీడ‌ర్ రోజా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆమెతో పాటు మ‌నో కూడా గ‌త కొంత కాలంగా ఈ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే గ‌త కొన్ని వారాలుగా రోజా త‌న పాత్ర‌ని త‌గ్గించుకుంటూ ఒక‌నాటి త‌న స‌హ తార‌లైన‌ ఆమ‌ని, లైలాల‌కు చోటు క‌ల్పిస్తూ వారికి ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చారు. ఏపీ మంత్ర వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజాకు చోటు ద‌క్క‌నున్న నేప‌థ్యంలోనే ఆమె త‌న జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌లో త‌న పాత్ర‌ని త‌గ్గించుకుంటూ వ‌స్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి. రోజా కూడా ఇందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ వ‌చ్చారు. ఫైన‌ల్ గా రోజాకు ఏపీ మంత్రివ‌ర్గంలో అంతా ఊహించిన‌ట్టుగానే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌లో మునుప‌టి త‌ర‌హాలో కంటిన్యూ కావ‌డం క‌ష్ట‌మ‌నే వార్త‌లు జోరందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ షోల‌కు లైలా, ఆమని మాత్ర‌మే జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ రోజా సోమ‌వారం అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఏపీ మంత్రివ‌ర్గంలో త‌న‌కు చోటు ద‌క్కిన నేప‌థ్యంలో ఇక‌పై షూటింగ్ ల‌కు వెళ్ల‌న‌ని, అన్ని షోల‌ని తాను మానేస్తున్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు రోజా. ఇక‌పై టీవీ షోల షూటింగ్ ల‌లో  తాను పాల్గొన‌ని, సీఎం జ‌గ‌న్ ఇచ్చిన గుర్తింపుని ఎప్ప‌టికీ మ‌ర్చిపోన‌ని, త‌న‌ను అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌నివ్వ‌న‌ని చంద్ర‌బాబు అంటే జ‌గ‌న‌న్న త‌న‌ని రెండు సార్లు ఎమ్మెల్యేని చేశార‌ని, ఇప్ప‌డు మంత్రిని చేస్తున్నార‌ని రోజా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వైఎస్ జ‌గ‌న్ మ‌హిళా ప‌క్ష‌పాతిగా కేబినెట్ లో మంత్రిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం త‌న‌ అదృష్టం అని తెలిపారు రోజా. దీంతో జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ అభిమానులు రోజా లేకుండా ఈ కార్య‌క్ర‌మం బోసిపోతుందేమో అని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. 

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ట్విస్ట్‌.. స్ర‌వంతి, ముమైత్ ఇద్ద‌రూ ఔట్‌!

  బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొత్తానికి కిందా మీదా ప‌డుతూ మిడిల్ కి చేరింది. కాంట్రివ‌ర్సీలు.. గొడ‌వ‌లు.. తిట్లు.. కుల ప్ర‌స్తావ‌న‌ వంటి ప్ర‌హ‌స‌నాల‌తో మొత్తానికి స‌గం జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఆదివారం వీకెండ్ కావ‌డంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేశారు. ఎప్ప‌టిలాగే హౌస్ మేట్స్ తో వారం రోజుల్లో జరిగిన దానిపై రివ్యూ నిర్వ‌హించ‌డంతో పాటు కంటెస్టెంట్ ల‌తో గేమ్స్ ఆడించారు. ఇక ఆటపాట‌ల‌తో కంటెస్టెంట్స్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఎలిమినేష‌న్ కి సంబంధించిన టెన్ష‌న్ ని క్రియేట్ చేశారు. అయితే అనూహ్యంగా ఇద్ద‌రిని ఎలిమినేట్ చేసేశారు. ప్రేక్ష‌కుల ఓటింగ్ ఆధారంగా త‌క్కువ ఓట్లు వ‌చ్చిన వారిని హౌస్ నుంచి బ‌య‌టికి పంపించేశారు.  ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగిన ఈ ఎలిమినేష‌న్ రౌండ్ లో చివ‌రికి ముగ్గురు మిగిలారు. ముమైత్ ఖాన్‌, స్ర‌వంతి, మిత్ర‌ల‌ను నాగార్జున కొంత సేపు టెన్ష‌న్ పెట్టారు. ఆ త‌రువాత వారి ఎదురుగా వున్న బాక్సుల్లో చేతులు పెట్ట‌మన్నారు. అనంత‌రం కౌంట్ డౌన్ మొద‌లు పెట్టారు. చేతుల్లో రెడ్ క‌ల‌ర్ వున్న వారు ఎలిమినేట్ అయిపోతే.. గ్రీన్ క‌ల‌ర్ వున్న వారు సేఫ్ అవుతారు. అయితే ఈ టాస్క్ లో అనూహ్యంగా ముమైత్‌, స్ర‌వంతి చేతుల‌కు రెడ్ క‌ల‌ర్ రాగా, మిత్ర చేతికి మాత్రం గ్రీన్ క‌ల‌ర్ క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా కంటెస్టెంట్స్ షాక‌య్యారు. ఇదేంటీ ఒకేసారి ఇద్ద‌రు ఎలిమినేట్ కావ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. అనంత‌రం ముమైత్‌, స్ర‌వంతిలు ఎలిమినేట్ అయిన‌ట్టుగా నాగార్జున ప్ర‌క‌టించారు. మొద‌టి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ కు బిగ్ బాస్ మ‌రో ఛాన్స్ ఇచ్చి రెండ‌వ సారి హౌస్ లోకి తీసుకొచ్చినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో రెండ‌వ సారి కూడా ముమైత్ హౌస్ నుంచి వెళ్లిపోవ‌డం ఇప్ప‌డు ఆమెకు భారీ షాక్ అంటున్నారు. అయితే స్ర‌వంతి మాత్రం చాలా ఎమోష‌న‌ల్ అయింది. తాను ఎలిమినేట్ అయ్యాన‌ని తెలియ‌గానే భోరున‌ ఏడ్చేసింది. వెళుతూ వెళుతూ స్ర‌వంతి .. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు మాత్రం గ‌ట్టి షాక్ ఇవ్వ‌డం విశేషం. అఖిల్‌, బిందు మాధ‌వి, అషురెడ్డి త‌న‌కు ఇష్ట‌మైన కంటెస్టెంట్స్ అని చెప్పిన స్ర‌వంతి .. నట‌రాజ్ మాస్ట‌ర్ పై మాత్రం అనూహ్య‌మైన‌ కామెంట్స్ చేసి అత‌న్ని షాక్ కు గురిచేసింది. 

ఆర్య త‌ల్లి ఎందుకు భ‌య‌ప‌డుతోంది.. అనుకి ప్ర‌మాద‌మా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌ఠేరే` ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ (సిద్ధార్ధ్ కి సోద‌రుడిగా క‌నిపించారు), వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన జంట‌గా న‌టించ‌గా కీల‌క పాత్రల్లో జ‌య‌లలిత‌, రామ్ జ‌గ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్, అనూషా సంతోష్‌, జ్యోతి రెడ్డి, వ‌ర్ష త‌దిత‌రులు న‌టించారు. ఆర్య - అనుల శోభ‌నం .. సుబ్బు, స‌ద్దుల ఇంటిలో ఏర్పాటు చేయ‌డంతో దాన్ని ఎలాగైనా ఆపాల‌ని మాన్సీ ఆమె త‌ల్లి ప్లాన్ చేస్తారు. అదే స‌మ‌యంలో ఆర్య‌ని హ‌త్య చేయాలని రాగ‌సుధ శోభ‌నం గ‌దిలోని ఫ్యాన్ ఊడిప‌డేలా ప్లాన్ చేస్తుంది. మాన్సీ ఆత్మ హ‌త్య చేసుకుంటాన‌ని కాల్ చేయ‌డంతో అను - ఆర్య వెంట‌నే శోభ‌నం గ‌ది నుంచి బ‌య‌టికి వ‌స్తారు. అదే స‌మ‌యంలో ఫ్యాన్ ఊడి బెడ్ పై ప‌డిపోతుంది. ఆ వెంట‌నే ఆర్య - అను తో పాటు అంతా ఇంటికి వెళ‌తారు. మాన్సీ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తోంద‌ని నీర‌జ్ కు చెప్పి ఆమె గ‌దికి వెళ్లి త‌లుపులు తీస్తారు. క‌ట్ చేస్తే మాన్సీ, ఆమె త‌ల్లి హ్యాపీగా బిర్యానీ తింటూ క‌నిపిస్తారు. అదేంటీ ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ఫోన్ చేశావ్ అని మాన్సీని అడిగితే అది ప్రాంక్ కాల్ అని, త‌ను ఆత్మ హ‌త్య చేసుకోవ‌డం ఏంట‌ని సిల్లీగా న‌వ్వుతుంది మాన్సీ అతి త‌ట్టుకోలేని ఆర్య‌కు చిర్రెత్తుకొచ్చి అరిచేస్తాడు. మాన్సీకి, ఆమె త‌ల్లికి ఇది మ‌రోసారి రిపీట్ కావ‌ద్ద‌ని వార్నింగ్ ఇస్తాడు. ఇంత‌లో జెండే క‌ల‌గ‌జేసుకుని నేను చూసుకుంటానంటాడు. ఆర్య వెళ్ల‌గానే మాన్సీకి, ఆమె త‌ల్లికి సీరియ‌స్ వార్నింగ్ ఇస్తాడు. ఈ సారి మీరు కోరుకున్న‌ది నిజ‌మ‌వుతుంద‌ని షాకిచ్చి వెళ్లిపోతాడు.  క‌ట్ చేస్తే ఆర్య త‌ల్లి నిర్మ‌లా దేవి పంచాంగం చూస్తూ వుంటుంది. ఇంత‌లో అను ఆఫీస్ కి బ‌య‌లుదేరాల‌ని అటుగా వ‌స్తుంది. అనుని గ‌మ‌నించిన నిర్మ‌లా దేవి ఈ రోజు ఆఫీస్ కి వెళ్ల‌కూడ‌ద‌ని, నీకు ప్ర‌మాదం పొంచి వుంద‌ని చెబుతుంది. ఇంత‌కీ అనుకు రాబోయే ప్ర‌మాదం ఏంటీ? .. నిర్మ‌లాదేవి ఊహలో అనుకి ప్ర‌మాదం త‌ల‌పెట్టే వ్య‌క్తి ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

మాన్సీ కుట్ర‌ ఆర్య వ‌ర్థ‌న్ కు తెలిసిపోయిందా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ధారావాహిక `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ `తులా ఫ‌ఠేరా` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. అత‌నికి జోడీగా వర్ష హెచ్ కె న‌టించింది. కీల‌క పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్, క‌రణ్‌, అనూష సంతోష్ త‌దిత‌రులు న‌టించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సుబ్బు ఇంట్లో అను - ఆర్య‌ల శోభ‌నం కు ఏర్పాట్లు చేస్తారు. మిగ‌తా వాళ్ల‌తంతా డాబాపైకి వెళ్లి ప‌డుకుంటారు. అయితే శోభ‌నం గ‌దిలో కాల‌నీ వాళ్లంతా వ‌చ్చి చేరి ప‌డుకోవడం ఆర్య కు చిరాకు తెప్పిస్తుంది. ఈ విష‌యం తెలిసి ప‌ద్దు - సుబ్బు కిందికి వ‌చ్చేస్తారు. కాల‌నీ జ‌నాన్ని బ‌య‌టికి పంపించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తారు. అయితే అను చేసిన ప‌నికి అంతా లేచి ఒక్కసారిగా బ‌య‌టికి వెళ్లిపోతారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఆర్య వ‌ర్థ‌న్ శోభ‌నానికి ఇక ఎలాంటి అడ్డు లేద‌ని రెడీ అయిపోతాడు. అనుని ముద్దు పెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా మాన్సీ నుంచి ఫోన్ వ‌స్తుంది. క‌ట్ చేసి వ‌చ్చేయ్ అంటాడు ఆర్య‌.. అయినా మ‌ళ్లీ మ‌ళ్లీ ఫోన్ చేస్తుండ‌టంతో అను లిఫ్ట్ చేస్తుంది. మాన్సీ ఆత్మ హ‌త్య చేసుకుంటానంటూ అరుపులు కేక‌లు పెడుతూ ఫోన్ క‌ట్ చేస్తుంది. ఊహించ‌ని విధంగా మాన్సీ ఆత్మ‌హ‌త్య‌కు పూనుకుంటాన‌న‌డంతో ఆర్య - అను ఉన్న‌ప‌లంగా ఇంటికి వెళ‌తారు. అక్క‌డికి వెళ్లేస‌స‌రికి  నీర‌జ్ సోఫాలో గాఢ‌నిద్ర‌లో వుంటాడు. ఆర్య అర‌వ‌డంతో లేచి ఏం జ‌రిగింది? అంటాడు. మాన్సీ ఆత్మ హ‌త్య చేసుకుంటానంటూ ఫోన్ చేసింద‌ని చెబుతాడు. అదేంటీ ఇప్ప‌డే చికెన్ బిర్యానీ కావాలంటే ఆర్డ‌ర్ చేసి ఇచ్చాను. మాన్సీ, ఆమె త‌ల్లి క‌లిసి తింటున్నారు. త‌ను ఆత్మ హ‌త్య చేసుకుంటాన‌నడ‌మేంటి అంటాడు. ముందు గ‌దిలో ఏం జ‌రుగుతుందో చూద్దాం ప‌ద అంటాడు ఆర్య. వెళ్లి గ‌ది త‌లుపులు తెరిచే స‌రికి నీర‌జ్ చెప్పిన‌ట్టే మాన్సీ - ఆమె త‌ల్లి చికెన్ బిర్యానీ తింటూ కనిపిస్తారు. వాళ్ల‌ని చూసి అంతా షాక్ అవుతారు. ఆర్య వ‌ర్థ‌న్ కు మాన్సీ - ఆమె త‌ల్లి ప‌న్నిన కుట్ర తెలిసిపోతుందా? .. ఏం జ‌ర‌బోతోంది అన్న‌ది ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

బిగ్‌బాస్ : బిందు మాధ‌వి తొలి అనుభవం అత‌నితోనే

ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో తొలి ప్రేమ అనుభూతులు కామ‌న్‌. స్కూల్ డేస్ లో లేదా.. కాలేజీ  డేస్ లో .. ఉండే కాల‌నీలో లేదా వేస‌వి సెల‌వులకు వెళ్లిన సంద‌ర్భంలో కానీ.. పెళ్లిళ్ల‌ల్లో కానీ ఇలాంటి అనుభ‌వం చాలా మందికి ఎదుర‌య్యే వుంటుంది. ఇలా మొద‌లైన తొలి ప్రేమ కొంత మంది జీవితాల‌ని మ‌లుపుతిప్పి మ‌ధురానుభూతిని క‌లిగిస్తే మ‌రి కొంద‌రి జీవితాల్లో చేదు జ్ఞాప‌కంలా మిగిలిపోతుంది. ఇలాంటి ఓ మ‌ధురానుభూతిని క‌లిగించే ఓ ప్రేమ‌క‌థ త‌న‌కూ వుందంటోంది బిందు మాధ‌వి. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో గ‌త కొన్ని రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న బిందు మాధ‌వి తాజాగా త‌న క్యూట్ ల‌వ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టింది. `ప్ర‌తి రోజు నాన్న‌తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ బ్యాడ్మింట‌న్ ఆడ‌టానికి వెళ్లేదాన్ని. ఆ రోజుల్లో నాకు ఒక స్కూటి ఉండేది. దానిమీదే బ్యాడ్మింట‌న్ ఆడ‌టానికి వెళ్లేదాన్ని. అక్క‌డో అబ్బాయి వుండేవాడు. పేరు జెస్ట్ ఆర్‌.. మీరే ఊహించుకోండి. త‌ను ప‌రిచ‌యం కాలేదు కానీ రోజే నా స్కూటి మీద ఒక ఫ్ల‌వ‌ర్ కానీ.. చిన్న బొమ్మ‌కానీ .. చిన్న లెట‌ర్ కానీ .. ఇలా ప్ర‌తీ రోజు ఏదో ఒక‌టి నా కోసం పెట్టి వెళ్లే వాడు. ఆ త‌రువాత నేను ఈ రోజు ఏం పెడ‌తాడా? అని ఆస‌క్తిగా ఎదురుచూసేదాన్ని. ఈ అనుభ‌వం నాకు చాలా థ్రిల్లింగ్ గా స‌రికొత్త‌గా అనిపించేది. చాలా హ్యాపీగా ఫీల‌య్యేదాన్ని. అలా చాలా రోజులు జ‌ర‌గ‌డంతో మా ప‌రిచ‌యం కాస్తా అత‌నిపై ఇష్టంగా మారింది. ఫైన‌ల్ గా ఒక‌రోజు అత‌న్ని క‌లిశాను. అప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో ఊహించుకున్న వ‌న్నీ అత‌నితో క‌లిసి చేశాను. అదొక మ‌ర్చిపోలేని తొలి అనుభ‌వంగా మిగిలిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టి వ్య‌క్తుల ముందు ఫ్రీగా మాట్లాడ‌లేని నేను త‌న ప‌రిచ‌యంతో దాన్ని అధిగ‌మించాను. అంతే కాకుండా నాలోని ప్ల‌స్ లు ఏంటో త‌న వ‌ల్లే నాకు తెలిశాయి. మా ఇద్ద‌రిది గ్రేట్ బాండింగ్‌. ఫ‌స్ట్ ల‌వ్ స్టోరీస్ బ్రేక‌ప్ తో ఎండ్ అవుతుంటాయి. నాకు ఇండిపెండెంట్ గా ఉండాల‌ని నేర్పింది త‌నే అయితే త‌ను ఇప్ప‌డు వేరే వాళ్ల‌తో వుండొచ్చు కానీ అత‌ని మ‌ధుర జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ న‌న్ను వెంటాడుతూనే వున్నాయి` అని తెలిపింది బిందు మాధ‌వి.   

అభిమానుల‌కు షాక్‌.. శ్రీ‌ముఖి మ‌ళ్లీ బిస్కెట్ వేస్తోందా?

అభిమానుల‌కు శ్రీ‌ముఖి మ‌రోసారి బిస్కెట్ వేస్తోందా? అంటే అవున‌నే అనిపిస్తోంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. తాజాగా `క్యాష్` ప్రోగ్ర‌మ్ లో పాల్గొన్న శ్రీ‌ముఖి మ‌ళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తుకుంది. ఈటీవిలో `ప‌టాస్‌` త‌ర‌హాలోనే డిజైన్ చేసిన షో `జాతిర‌త్నాలు`. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌ముఖి ప్ర‌స్తుతం యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌నిస్తోంది. అయితే త‌న టీమ్ తో క‌లిసి శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా `క్యాష్‌` షో కోసం సుమ‌తో క‌లిసి స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా త‌న `జాతిర‌త్నాలు` టీమ్ ని ప‌రిచ‌యం చేసిన శ్రీ‌ముఖి మ‌ళ్లీ త‌న ప్రేమ, పెళ్లిగోల‌ని మొద‌లుపెట్టింది. `నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు అయిన‌ప్ప‌టికీ.. ఎంతో మంది అంద‌మైన హీరోలు, కో - యాక్ట‌ర్ ల‌తో వ‌ర్క్ చేసిన‌ప్ప‌టికి ఎవ్వ‌రికీ నా మ‌న‌సు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోకుండా నా మెడ‌లో మూడు ముళ్లు ప‌డ‌కుండా ఉండ‌టానికి కార‌ణ‌మైన ఏకైక వ్య‌క్తి ఎవ‌రో కాదు..` అంటూ త‌న మ‌న‌సు దోచిన ప్రియుడి ని ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేసింది. శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `క్యాష్` స్పెష‌ల్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఈవెంట్ ద్వారా శ్రీ‌ముఖి త‌న కు కాబోయే వ‌రుడిని నిజంగానే ప‌రిచ‌యం చేయ‌బోతోందా?  లేక ప్రోమో కోస‌మే అలా చెప్పిందా? అన్న‌ది తెలియాలంటే శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే `క్యాష్` ఎపిసోడ్ చూడాల్సిందే. గ‌త కొంత కాలంగా శ్రీ‌ముఖి ల‌వ్ లో వుందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఈ వార్త వైర‌ల్ అయిన ప్ర‌తీ సారి అలాంటిది ఏమీ లేద‌ని కొట్టి పారేస్తూ వ‌స్తున్న శ్రీ‌ముఖి ఇటీవ‌ల ఇది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, దీన్ని ఇంత‌టితో వ‌దిలేయండ‌ని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా `క్యాష్‌` ప్రోమోలో మాత్రం త‌ను ఇప్ప‌టికి పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ వ్య‌క్తి కార‌ణం అంటూ బాహాటంగానే బ‌య‌ట‌పెట్ట‌డం.. ఆ వ్య‌క్తి పేరుని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే శ్రీ‌ముఖి త‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకున్న వ్య‌క్తి ఎవ‌రో ఈసారైనా బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.    

వేద‌కు య‌ష్ అస‌లు నిజం చెప్పేస్తాడా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్  `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. రీసెంట్ గానే స్టార్ మా లో ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ అన‌తి కాలంలోనే వీక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, అనంద్‌, మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పిల్ల‌లే పుట్ట‌ర‌ని తెలిసిన ఓ డాక్ట‌ర్‌, త‌ల్లి ప్రేమే తెలియ‌ని ఓ పాప క‌థ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది. ఎలాగైనా య‌శోధ‌ర్ ని ఓడించాల‌ని, త‌న నుంచి ఖుషీని ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ చేసిన అభిమ‌న్యు చివరికి నీచ‌మైన ప‌నికి సిద్ధ‌మ‌వుతాడు. త‌న‌కు సంబంధం లేని ఖుషీ త‌న‌కే పుట్టింద‌ని అబ‌ద్దం చెప్పి య‌ష్ ని న‌మ్మించ‌డం మొద‌లుపెడ‌తాడు. అ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేక త‌న మ‌న‌సులో దాచుకోలేక య‌ష్ న‌ర‌కం చూస్తుంటాడు. ఒక ద‌శ‌లో న‌మ్మి డీఎన్ ఏ టెస్ట్ కు సిద్ధ మ‌వుతాడు. త‌న స్నేహితులు డాక్ట‌ర్ కావ‌డంతో డీఎన్ ఏ టెస్ట్ కు రెడీ అవుతాడు. కానీ చివ‌రి నిమిషంలో త‌ను చేస్తుంది త‌ప్ప‌ని గ్ర‌హించిన విర‌మించుకుంటాడు. చివ‌రికి ప‌ట్ట‌లేని కోపంతో మాళ‌విక ద‌గ్గ‌రి కి వెళ్లి నిజం చెబుతావా ?  హ‌త్య చేయ‌మంటావా? అంటూ బెదిరించి నానా హంగామా చేస్తాడు. అయితే మాళ‌విక తెలివిగా త‌న‌ని వెతుక్కుంటూ నీ మొగ‌డు వ‌చ్చాడ‌ని, నా బెడ్రూమ్ లో దూరి నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని వేద‌కు ఫోన్ చేసి అబ‌ద్దాలు చెబుతుంది. అది విని షాక్ కు గురైన వేద వెంట‌నే మాళ‌విక ఇంటికి వెళ్లి య‌ష్ ని తీసుకెళుతుంది. మ‌ధ్య‌లో అస‌లు ఏం జ‌రుగుతోంది? .. మీ బాధ వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటీ? అని య‌ష్ ని నిల‌దీస్తుంది. య‌ష్ అస‌లు నిజం చెప్పేస్తాడా? .. అది విని వేద ఎలా రియాక్ట్ అయింది? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

అను - ఆర్యల‌ శోభ‌నానికి రాగ సుధ బ్రేక్ వేస్తుందా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మరాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇప్ప‌టికే ఏడు భాష‌ల్లో ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. `బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్‌, వ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్ , జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, రామ్ జ‌గ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. థ్రిల్ల‌ర్ క‌థాంశం కావ‌డంతో మ‌హిళా ప్రేక్ష‌కుల‌తో పాటు అన్ని వ‌ర్గాల  వారిని ఆక‌ట్టుకుంటోంది. ఈ శుక్ర‌వారం ఎపిసోడ్ ఎలా వుంటుందో ఒక‌సారి చూద్దాం. అను - ఆర్యల‌ శోభ‌నం కోసం ప‌ద్దు - సుబ్బుల ఇంట్లో ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు రోస‌మే ఎదురుచూస్తున్న ఆర్య చాలా ఎక్సైట్ మెంట్ తో వుంటాడు. అయితే అనూహ్యంగా ఆర్య కు బ‌స్తీ వాసులు షాకిస్తారు. అందంగా అలంక‌రించిన శోభ‌నం గ‌దిలో బ‌స్తీవాసులంతా చేరి నిద్రిస్తున్న‌ట్టుగా న‌టిస్తూ వుంటారు. వారిని చూసి షాక్ కు గురైన ఆర్య వ‌ర్థ‌న్ ఏంటిది? వీళ్లంద‌రిని ఇక్క‌డి నుంచి పంపించు అంటాడు. నాకు శోభ‌నానికి ఎలాంటి తొంద‌ర‌లేద‌ని అను కూడా ఆర్య‌ని ఏడిపించే ప్ర‌య‌త్నం చేస్తుంది. క‌ట్ చేస్తే .. జెండే, ప‌ద్దు, సుబ్బుల‌తో పాటు జ‌య‌ల‌లిత టర్రాస్ పై కూర్చుని క‌బుర్లు చెప్పుకుంటుంటారు. అక్క‌డికి రాగ‌సుధ‌ని తీసుకొస్తాడు సంప‌త్ . వీళ్లు అక్క‌డ వున్నార‌ని తెలియ‌క రాగ‌సుధ వ‌చ్చేసి బుక్క‌యిపోయాన‌ని కంగారు ప‌డుతూ వుంటుంది. ఇంత‌లో జెండే రాగ‌సుధ ప‌రాయి మ‌గాళ్ల ముందు ముసుగు తీయ‌ద‌ని, అది వాళ్ల సంప్ర‌దాయ‌మ‌ని చెబుతాడు. ఇదేంటీ?  కొత్త‌గా మా ద‌గ్గ‌ర ఫ్రీగానే వుంటున్నావుగా.. అని ప‌ద్దు అనుమానంగా అలంటుంది. ఎక్క‌డ దొరికి పోతానేమోన‌ని రాగ‌సుధ కంగారుప‌డుతూనే క‌వ‌ర్ చేస్తుంది. ఇంత‌లో జెండే అది వాళ్ల సంప్ర‌దాయం వ‌దిలేయండి అంటాడు. దీంతో రాగ‌సుధ ఊపిరి పీల్చుకుంటుంది. క‌ట్ చేస్తే...శోభ‌నం గ‌దిలో బ‌స్తీ జ‌నం గాఢ నిద్ర‌ని న‌టిస్తున్నార‌ని, ఆర్య ని ఇబ్బంది పెడుతున్నార‌ని తెలుసుకున్న ప‌ద్దు వెంట‌నే సుబ్బుని తీసుకుని శోభ‌నం గ‌దికి వ‌చ్చేస్తుంది. అక్క‌డ బ‌స్తీ వాసుల ని చూసి షాక‌వుతుంది. న‌టించింది చాలు కానీ లేవండి అంటూ ఆరుస్తుంది. అయినా ఎవ‌రూ లేవ‌రు. దీంతో త‌న వ‌ద్ద ఓ చిట్కా వుంద‌ని, అది పాటిస్తే ఇక్క‌డున్న అంద‌రూ లేచి ప‌రుగెడ‌తార‌ని చెబుతుంది అను. అయితే ఆల‌స్య‌మెందుకు కానియ్ అంటాడు. కానీ నాకేంటీ? అని ఎదురుప్ర‌శ్రిస్తుంది. ఆర్య రిక్వెస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా బ‌స్తీవాసుల్ని అక్క‌డి నుంచి ప‌రుగెత్తేలా చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రాగ సుధ ప్లాన్ ప్ర‌కారం అను - ఆర్య‌ల శోభ‌నం ఆగిపోయిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

మీరు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి.. పొట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటారా?

  తెలుగు టీవీ యాంక‌రింగ్‌కు గ్లామ‌ర్‌ను అద్దిన వారిలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అన‌సూయ యాంక‌రింగ్ చేసిన షోల‌న్నీ సూప‌ర్ హిట్ట‌య్యాయి. జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా ఆమెకు ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె క్రేజ్‌ను సినిమావాళ్లు కూడా క్యాష్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇప్ప‌టికే ఆమె కొన్ని సినిమాల్లో త‌న గ్లామ‌ర్‌తో, త‌న యాక్టింగ్‌తో అల‌రించింది. సోష‌ల్ మీడియాలోనూ అన‌సూయ య‌మ యాక్టివ్‌. త‌న గ్లామ‌ర‌స్‌ ఫొటోల‌ను రెగ్యుల‌ర్‌గా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తూ ఉంటుంది. షోల‌లో ఆమె వేసుకొనే డ్ర‌స్సుల‌పై త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి. అప్పుడ‌ప్పుడు ప్ర‌శ్న‌-జ‌వాబు సెష‌న్ నిర్వ‌హిస్తూ, ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇస్తుంటుంది అన‌సూయ‌. కాగా సోమ‌వారం సందీప్ కోరేటి అనే నెటిజ‌న్ అన‌సూయ డ్ర‌స్సింగ్‌పై చేసిన కామెంట్, దానికి అన‌సూయ ఇచ్చిన రిప్లై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. "అన‌సూయ గారూ.. మీరు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటారా తెలుగు ఆడ‌ప‌డుచుల ప‌రువు తీస్తున్నావు" అంటూ ఓ నోట్ పెట్టాడు సందీప్‌. దానికి త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇచ్చింది అన‌సూయ‌. "దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు." అని ఆమె రాసుకొచ్చింది. మ‌రోవైపు అన‌సూయ ఫ్యాన్స్ కూడా సందీప్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అత‌డిని "నీ ప‌ని నువ్వు చూసుకోరా.. పెళ్ల‌యి పిల్ల‌లున్న హీరోలు టాప్‌లెస్‌గా క‌నిపించ‌వ‌చ్చా, షార్ట్స్ వేసుకోవ‌చ్చా?" అని అత‌డికి ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించారు. పాపం సందీప్‌.. !!

శ్రీ‌ముఖిపై అన్న‌పూర్ణమ్మ ట్రిపుల్ ఆర్‌ పంచ్

స్టార్ మా లో ఓంకార్ ప్రొడ్యూస్ చేసిన కామెడీ షో `కామెడీ స్టార్స్`. ఈ షోలో గ‌త కొన్ని నెల‌లుగా యాంక‌ర్ గా మెరిసిన శ్రీ‌ముఖి తాజాగా నాగ‌బాబు ఎంట్రీతో అక్క‌డి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. నాగ‌బాబు ఎంట్రీ త‌రువాత ఈ షోని `కామెడీ స్టార్స్ ధ‌మాకా`గా మార్చేశారు. శ్రీ‌ముఖి ప్లేస్ లో ఈ షోకి దీపికి పిల్లి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ఈ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన శ్రీ‌ముఖి ఈటీవీ కోసం మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌రికొత్త‌గా ప్రారంభిస్తున్న `జాతిర‌త్నాలు` స్టాండ‌ప్ కామెడీ షోకు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. శ్రీ‌ముఖితో పాటు ఈ షోలో న‌టి ఇంద్ర‌జ కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ షోలో అన్న‌పూర్ణ‌మ్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి, కృష్ణ భ‌గ‌వాన్‌, భ‌ద్రం స్టాండ‌ప్ కామెడీ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌మోలో పోసాని, కృష్ణ భ‌గ‌వాన్‌, భ‌ద్రం వేసిన పంచ్ లు అదిరిపోయాయి. అయితే అన్న‌పూర్ణ‌మ్మ ఏకంగా శ్రీ‌ముఖిని టార్గెట్ చేసి వేసిన పంచ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీ‌ముఖి గురించి కొంచెం చెబుతానే అంటూ మొద‌లుపెట్టింది అన్న‌పూర్ణ‌మ్మ‌.. టీవీల్లో అంద‌రూ రాముల‌మ్మా రాముల్మ‌మా అంటారుగా అదే తెలుసు త‌న‌కి టీవీ ముందు కూర్చున్న వాళ్లు మాత్రం రావ‌ద్ద‌మ్మా.. రావ‌ద్ద‌మ్మా అంటుంటారు. అంటే పంచ్ వేసేసింది. ఆ త‌రువాత శ్రీ‌ముఖిని స్టేజ్ మీద‌కి పిలిచిన అన్న‌పూర్ణ‌మ్మ నిన్ను ట్రిపుల్ ఆర్ సినిమాలో అడిగారా అంది.. దీనికి శ్రీ‌ముఖి అడ‌గ‌లేదే అని చెప్పింది.. వెంట‌నే `అదేంటీ.. నువ్వు మాట్లాడితే ఆర్ ఆర్ వేసిన‌ట్టువుంట‌ది క‌దా ట్రిపుల్ ఆర్ వాళ్లు నిన్ను పిల‌వాలి క‌దా? అంటూ మ‌రో పంచ్ వేసింది. దీంతో శ్రీ‌ముఖి ముఖం మాడిపోయింది. ఈ పంచ్ ల‌కి ఇంద్ర‌జ ప‌డి ప‌డి న‌వ్వ‌డంతో అక్క‌డున్న వారంతా న‌వ్వుల్లో మునిగిపోయారు.

 ఫ్యామిలీ స‌పోర్ట్ తో య‌ష్ ని ఓ ఆట ఆడుకున్న వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, అనంద్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌యవంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప పాత్ర ప్ర‌ధానంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌తీ వారం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆద్యంతం అల‌రిస్తోంది. ఈ గురువారం మ‌రింత ఆస‌క్తిగా సాగ‌బోతోంది. వేదఅత్తారింట్లో వుండ‌టంతో ఆమె తండ్రి వేద గురించి ఆలోచిస్తూ బాల్క‌నీలోకి వ‌స్తారు. అప్పుడే బాల్క‌నీలోకి వ‌చ్చిన వేద త‌న కోసం బాధ‌ప‌డుతున్న త‌ల్లిదండ్రుల‌ని చూసి వారిని సంతోష‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆ త‌రువాత ఇంట్లోకి వెళ్లి త‌న త‌ల్లి సులోచ‌న పెట్టిన‌ ఫిల్ట‌ర్ కాఫీ తాగుతుంది. ఈ లోగా చైల్డ్ వెల్ఫేర్ ఆర్గ‌నైజేష‌న్ నుంచి ఓ వ్య‌క్తి ఫోన్ చేసి ఉత్త‌ర డాక్ట‌ర్ గా ఈ ఏడాది మా చైల్డ్ వెల్ఫేర్ ఆర్గ‌నైజేష‌న్ నుంచి మిమ్మ‌ల్ని ఎంపిక చేశామ‌ని చెబుతాడు. ఆ విష‌యం విని వేద‌తో పాటు ఇంటి స‌భ్యులంతా ఆనంద‌ప‌డ‌తారు. ఈ విష‌యాన్ని అల్లుడు య‌ష్ కు తెలియ‌జేయ‌మ‌ని వేద‌ని ఫోన్ చేయ‌మంటారు. అదే టైమ్ లో స్టాఫ్ చేసిన ప‌నికి చెర్రెత్తుకొచ్చిన య‌ష్ వారిపై కేక‌లు వేస్తుంటాడు. ఫోన్ మోగ‌డంతో అదే చిరాకులో వేద‌పై కూడా అరిఏస్తాడు. నీలాంటి పిచ్చిదానికి ఉత్త‌మ డాక్ట‌ర్ అవార్డ్ ఇచ్చిన పిచ్చి వాళ్లెవ‌రు? అంటూ వేద‌ని ఆట‌ప‌ట్టిస్తాడు. దీంతో త‌న వాళ్లు తెలియ‌కుండానే య‌ష్ తో నైస్ గా మాట్లాడి జూబ్లీ ఫంక్ష‌న్ హాల్ లో ఫంక్ష‌న్ వుంది రావాలి అని చెబుతుంది. నేను రాన‌ని చెబుతుంటే నీకు మెంట‌లా ? అని య‌ష్ అరిచేస్తాడు. అయినా స‌రే వేద త‌న‌కు ఎక్క‌డ‌లేని కోపం వ‌స్తున్నా.. త‌ల్లిదండ్రుల ముందు ఎక్క‌డ దెలిసిపోతుందోన‌ని జాగ్ర‌త్త‌ప‌డుతూ య‌ష్ కి మ‌ళ్లీ చెబుతుంది. మీరు వ‌స్తున్నారు అంతే అని ఫోన్ పెట్టేస్తుంది. దీంతో నేను సీరియస్ అవుతుంటే త‌నేంటి ఇంత కూల్ గా మాట్లాడుతోంద‌ని య‌ష్ కి ఏమీ అర్థం కాదు. ఆ త‌రువాత మాలిని ఇంట్లో కూడా విష‌యం తెలిసిపోవ‌డంతో ఆ విష‌యాన్ని చెప్పాల‌ని య‌ష్ తండ్రి ఫోన్ చేసి విష‌యం చెబుతాడు. వెంట‌నే ఆ పిచ్చిదానికి అవార్డ్ ఇచ్చింది ఎవ‌రంటాడు య‌ష్ .. ఇదంతా స్పీక‌ర్ ఆన్ చేయ‌డంతో వేద‌తో పాటు వేద త‌ల్లిదండ్రులు, మాళిని కూడా వింటుంది. ఇంత మాట‌న్నాడేంటీ? అని వేద త‌ల్లిదండ్రుల‌కంటే ఎక్కువ‌గా య‌ష్ త‌ల్లిదండ్రులు య‌ష్ పై గుర్రుగా వుంటారు. ఇక ఇంటికి వ‌చ్చిన య‌ష్ కు చుక్క‌లు చూపిస్తారు. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా పిచ్చి వాళ్లం, పిచ్చి మాలోకం అంటూ సెటైర్లు వేస్తారు. ఇదంతా వేద చేసిన ప్లాన్ అని య‌ష్ ... వేద‌ని నిల‌దీయాల‌ని వెళ‌తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. య‌ష్ అవార్డ్ ఫంక్ష‌న్ కి వెళ్లాడా? అక్క‌డ ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

 అభిమ‌న్యు ఉచ్చులో య‌శోధ‌ర్ ఏం జ‌ర‌గ‌బోతోంది?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల  బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్, ఆనంద్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్ని పోషించారు. ఓ పాప చుట్టూ సున్నిత‌మైన భావోద్వేగాల స‌మాహారంగా ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నారు. మంగ‌ళ వారం ఎపిసోడ్ మరో కొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. డాక్ట‌ర్ వేద‌ని పెళ్లి చేసుకుని ఖుషీని ద‌క్కించుకున్న య‌శోధ‌ర్ ని ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని ఎదురుచూస్తుంటాడు అభిమ‌న్యు. ఇదే స‌మ‌యంలో య‌శోధ‌ర్ ఫ్రెండ్ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ పార్టీ అంటూ ప్ర‌త్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి య‌ష్ ని ఆహ్వానిస్తే అయిష్టంగానే వేద‌తో క‌లిసి వెళ‌తాడు. అదే పార్టీకి అభిమ‌న్యు, మాళ‌విక వ‌స్తారు. ఒంట‌రిగా వున్న వేద‌ని త‌న ట్రాప్ లో ప‌డేసుకోమ‌ని చెబుతాడు అభిమ‌న్యు. త‌నని ప‌ట్టించుకోకుండానే య‌ష్ ఫ్రెండ్స్ తో క‌లిసి పార్టీలో మందు కొట్ట‌డం మొద‌లు పెడ‌తాడు. మ‌ధ్య‌లో ప్ర‌త్యేకంగా నీతో మాట్లాడాల‌ని, ఓ విష‌యం చెప్పాల‌ని ప్లాన్ వేసిన అభిమ‌న్యు .. య‌ష్ ని ప‌క్క‌కు తీసుకెళ్లి త‌న కుట్ర‌ని మొద‌లుపెడ‌తాడు. ఖుషీ త‌న కూతుర‌ని, త‌న‌కూ, మాళ‌విక‌కు పుట్టిన పాప అని అబ‌ద్ధం చెప్పి య‌ష్ ని ట్రాప్ చేస్తాడు. అభిమ‌న్యు మాట‌ల్ని గుడ్డిగా న‌మ్మేసిన య‌ష్ మ‌రింతగా తాగి తూలుతూ వేద‌ని అక్క‌డే వ‌దిలేసి ఇంటికి వెళ్లిపోతాడు. మ‌మ్మి ఏదంటూ అడిగిన ఖుషీపై అరుస్తాడు.. ఇంత‌లో అక్క‌డికి వేద వ‌చ్చేస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మొద‌ల‌వుతుంది. త‌న‌ని ట్రాప్ చేశార‌న్న విష‌యం య‌శోధ‌ర్ గ‌మ‌నిస్తాడా? .. య‌శోధ‌ర్ అలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నాడో వేద తెలుసుకుంటుందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

 గోవాలో మోనిత చెరుకు ర‌సం

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న టాప్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ దేశ వ్యాప్తంగా టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. మ‌ల‌యాళ సీరియ‌ల్ కు రీమేక్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ద్వారా మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ తెలుగులో వంట‌ల‌క్క‌గా పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా స్టార్స్ త‌ర‌హాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. వంట‌ల‌క్క‌కు జోడీగా న‌టించిన ప‌రిటాల‌ నిరుప‌మ్ కూడా స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయాడు. ఇదిలా వుంటే ఈ సీరియ‌ల్ లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు నిరుప‌మ్ ల పాత్ర‌ల‌కు శుభం కార్డు వేసేశాడు ద‌ర్శ‌కుడు. వీరితో పాటు మోనిత పాత్ర‌కు కూడా అల్ మోస్ట్ ఎండింగ్ ఇచ్చేశాడు. దీంతో `కార్తీక దీపం` సీర‌య‌ల్ కు ప్ర‌ధాన ఆయువు ప‌ట్టుగా నిలిచిన ఈ ముగ్గురు ప్ర‌స్తుతం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మోనిత‌, డాక్ట‌ర్ బాబు ఇటీవ‌ల స్టార్ మా లో జ‌రిగిన ఓ ఈవెంట్ లో త‌ళుక్కున మెరిసారు. బుల్లితెర‌పై రొమాన్స్ చేసే ఛాన్స్ రాక‌పోవ‌డంతో తాజా ఈవెంట్ లో ఆ ముచ్చ‌ట తీర్చుకున్నారు. రొమాంటిక్ పాట‌ల‌కు డ్యాన్స్ చేసి రొమాంటిక్‌ జోడీ అనిపించుకున్నారు. ఇక వంట‌ల‌క్క మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. టీవీ షోల్లోనూ క‌నిపించ‌డం లేదు.  కానీ మోనిత మాత్రం ప్ర‌తీ చోటా నేనే అంటూ హ‌డావిడి చేస్తోంది. ప్ర‌దీప్ సూప‌ర్ క్వీన్ తో పాటు ప‌లు టీవీ షోల్లో సంద‌డి చేస్తున్న మోనిత తాజాగా గోవాలో హ‌ల్ చ‌ల్ చేసింది. వెకేష‌న్ కి వెళ్లిన మోనిత (శోభా శెట్టి) గోవా వీధుల్లో తిరుగుతూ అక్క‌డి అందాల‌ని ఆస్వాదిస్తూ సంద‌డి చేస్తోంది. ఓ చెరుకుర‌సం బండి ద‌గ్గ‌ర మోనిత చేసిన  హంగామా అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.