'నో కామెంట్' అంటూనే ఆర్జీవీపై యాంకర్ శ్యామల కామెంట్స్

'బడవ రాస్కెల్' మూవీ ఈవెంట్ లో యాంకర్ శ్యామల గురించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీరు చాలా అందంగా ఉన్నారని, ఈ అందం ఇంతకాలం నా కళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది అంటూ శ్యామలని ఆర్జీవీ ప్రశంసించారు. అయితే తాజాగా శ్యామల కూడా ఆర్జీవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా శ్యామల ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చర్చించింది. ఈ సందర్భంగా ఆమెకు ఆర్జీవీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 'ఆర్జీవీ గురించి చెప్పండి' అని ఓ నెటిజన్ అడగగా.. 'నో కామెంట్' అంటూనే ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్యామల. 'ఆయన గ్రేట్ డైరెక్టర్. ఆయన మొదట్లో చేసిన సినిమాలకు పెద్ద అభిమానిని' అని శ్యామల చెప్పింది. అంటే ఆర్జీవీ ఇప్పుడు మంచి సినిమాలు తీయట్లేదని, ఆయన ఇప్పుడు తీసే సినిమాలకు ఫ్యాన్ కాదని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరొక నెటిజన్ 'ఆర్జీవీ చెప్పినట్లు మీరు నిజంగా ఏంజెల్ మేడం. అన్నం తింటున్నారా లేక అందం తింటున్నారా' అని అడగగా.. 'అన్నమే తింటున్నాను' అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది శ్యామల. అలాగే తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు, ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి అని తెలిపింది. 'ప్రభాస్ or పవన్ కళ్యాణ్' అని ఒక నెటిజన్ అడగగా.. ప్రస్తుతం 'రాధేశ్యామ్' కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పరోక్షంగా ప్రభాస్ పేరు చెప్పింది శ్యామల.

బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి ముమైత్ ఖాన్ అవుట్.. ఏడ్చేసిన సరయు!

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారం పూర్తి చేసుకుంది. తొలి వారం సరయు లేదా మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతారని మొదట్లో అభిప్రాయపడ్డారు అంతా. అయితే చివరిలో ఊహించని విధంగా ముమైత్ ఖాన్ పేరు తెరమీదకు వచ్చింది. అనుకున్నట్లుగానే మొదటి ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఆదివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడి, టాస్క్ లు ఆడించిన హోస్ట్ నాగార్జున మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రకటించాడు. మొదట తాను ఎలిమినేట్ అవుతానని భావించిన సరయు తెగ ఏడ్చేసింది. ఆ తరువాత సరయు సేఫ్ అయ్యి,  ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిందని నాగ్ తెలిపాడు. సేఫ్ అయినప్పుడు సరయు అలాగే కాసేపు ఏడ్చింది. బిగ్ బాస్ 5 లో పార్టిసిపేట్ చేసిన సరయు తన బిహేవియర్ తో మొదటి వారమే ఎలిమినేట్ అయింది. నాన్ స్టాప్ లో కూడా సరయు అలాగే ఎలిమినేట్ అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ సరయు కాకపోతే, ఆడియన్స్ కి పెద్దగా తెలియని మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని భావించారంతా. కానీ వీరిద్దరికంటే ముమైత్ కి తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమె ఆర్జే చైతుతో సిగరెట్స్ ఇష్యూ గురించి పదే పదే వాదన పెట్టుకోవడంతో ఆమె పట్ల ఆడియెన్స్ పాజిటివ్ గా లేరని, అదే ఆమె ఎలిమినేషన్ కి కారణమని అంటున్నారు. ఎలిమినేట్ అవ్వడంతో ముమైత్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది.

రాగ‌సుధ‌ అల‌ర్ట్‌.. బెడిసికొట్టిన ఆర్య - జెండేల ప్లాన్!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మధురం`. జీ తెలుగులో గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ కీల‌క పాత్ర‌లో నటించిన నిర్మించారు. సాయి వెంక‌ట్ డైరెక్ట్ చేసిన ఈ సీరియ‌ల్ ని ఆత్మ‌, ప‌గా, ప్ర‌తీకారం నేప‌థ్యంలో రూపొందించారు. రాగ‌సుధ ఆచూకీ కోసం ఆర్య వ‌ర్ధ‌న్ - జెండే మాస్ట‌ర్ ప్లాన్ వేస్తారు. వ‌శిష్ట‌ని తామో త‌ప్పించుకునేలా చేసి త‌ను బ‌య‌టికి రావ‌డంతో అత‌నిపై నిఘా పెడ‌తారు. ఆర్య వ‌ర్థ‌న్ - జెండే ల ప్లాన్ ప్ర‌కారం తెలియ‌కుండానే వశిష్ట ట్రాప్ లో చిక్కుకుంటాడు. రాగ‌సుధ వుంటున్న సుబ్బు ఇంటికి చేర‌తాడు. అదే స‌మ‌యంలో టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద ప‌ని పూర్త‌వ‌డంతో రాగ‌సుధ ఇంటికి వ‌చ్చేస్తుంది. ఇంటి ముందు వ‌శీష్ట క‌నిపించ‌డంతో షాక్ కు గురైన రాగ‌సుధ వెంటే అత‌న్ని ఇంటిలోకి తీసుకెళ్లి ఎలా వ‌చ్చావ్‌.. ఈ దెబ్బ‌లేంటీ? అని ప్ర‌శ్నిస్తుంది. తానని ఆర్య‌, జెండే బంధించి చిత్ర హింస‌ల‌కు గురిచేశార‌ని చెబుతాడు. సుబ్బు ఇంట్లో రాగ‌సుధ‌, వ‌శిష్ట వున్నార‌ని గ‌మ‌నించి అక్క‌డికి చేరుకున్న ఆర్య‌, జెండే వారిపై ఎటాక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. విష‌యం ప‌సిగ‌ట్టిన రాగ‌సుధ వారికి షాకిస్తుంది. Also Read: రాగ సుధ ఎక్క‌డుందో ఆర్య వ‌ర్థ‌న్ కి తెలిసిపోయిందా? ముందు డోర్ వ‌ద్ద గ‌న్ తో జెండే - ఆర్య‌వ‌ర్ధ‌న్ వుండ‌టాన్ని ప‌సిగ‌ట్టిన రాగ‌సుధ ముందు వ‌శిష్ట‌ని వెన‌క ద్వ‌రం ద్వారా త‌ప్పించి వెళ్లిపోమంటుంది. ఆ త‌రువాత త‌ను కూడా త‌న‌తో పాటే పారిపోతుంది. ఊహించ‌ని ట్విస్ట్ కు జెండే హ‌ర్ట్ అవుతాడు. మ‌ళ్లీ త‌ప్పించుకుంద‌ని ఊగిపోతాడు.. క‌ట్ చేస్తే బ‌స్తీపై క‌న్నేసిన లోక‌ల్ ఎమ్మెల్యే త‌న అనుచ‌రుల‌తో పెద్ద‌మ్మ బ‌స్తీ వాసుల‌పై దౌర్జ‌న్యం చేయిస్తాడు. అడ్డువ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రినీ చిత‌క బాదిస్తాడు. ఈ విష‌యాన్ని బ‌స్తీ వాసులంతా సుబ్బుకు చెప్పి ఏదో ఒక‌టి చేయ‌మంటారు. క‌ట్ చేస్తే విష‌యం ఆర్యవ‌ర్థ‌న్ వ‌ద్ద‌కు చేరుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఆర్య ఏం చేశాడు? ఎమ్మెల్యేకి ఎలా బుద్ధి చెప్పాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.     

అభిమ‌న్యు - మాళ‌వికల‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన వేద

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా వీక్ష‌కుల‌ని ఈ సీరియ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. య‌శోధ‌ర్ - వేద‌ల పెళ్లి ఆగిపోయింద‌న్న ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి అభిమ‌న్యు, మాళ‌విక పార్టీ కి వెళ‌తారు. క‌ట్ చేస్తే వేద - య‌ష్ ల పెళ్లి జ‌రిగిపోతుంది. మాళ‌విక మోసం చేస్తోంద‌ని, పెళ్లి ఆపాల‌నే కుట్ర‌లో భాగంగానే ఇలా చేసింద‌ని ఖుషీ చెప్ప‌డంతో వేద రియ‌లైజ్ అయి య‌ష్ ని పెళ్లి చేసుకుంటుంది.  జ‌ర‌గ‌ద‌నుకున్న పెళ్ళి జ‌ర‌గ‌డంతో ఇరు కుటుంబాలు హ్యాపీ మోడ్‌లోకి వెళ్లిపోతారు. య‌ష్ - వేద‌లు ఊరేగింపుగా బ‌య‌లుదేరి అపార్ట్‌మెంట్ కి చేర‌తారు. అయితే కొత్త జంట గృహ ప్ర‌వేశం పేరుతో ఇరు కుటుంబాల మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ మొద‌ల‌వుతుంది. మా ఇంట్లోకి రావాలంటే మా ఇంట్లోకి రావాలంటూ ఇరు కుటుంబాల వారు పోటీప‌డుతుంటారు. ఇంతో మంచి ముహూర్తం మించిపోతోంద‌ని పూజారి అన‌డంతో వేద - య‌ష్ ... య‌ష్ ఇంటిలోకి వెళుతుంటారు. ఈ లోగా య‌ష్ సోద‌రి ఎంట్రీ ఎదురొచ్చి ఒక‌రి పేరు ఒక‌రు చెబితేనే ఇంట్లోకి ఎంట్రీ అంటుంది. ఇక్క‌డ కూడా య‌ష్ - వేద‌ల మ‌ధ్య గిల్లిక‌జ్జాలు మొద‌ల‌వుతాయి. చివ‌రికి య‌ష్ వేద‌తో పాటు త‌న ఇంటివారి పేర్లు కూడా చెప్ప‌డంతో అంతా ఆనందిస్తారు. వేద కూడా య‌ష్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ పేర్లు చెప్పి ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. ఆ త‌రువాత క‌లిసి ఒకే విస్త‌రాకులో య‌ష్ - వేద భోజ‌నం చేయాలంటారు. నేను చేయ‌నంటే నేను చేయ‌నంటూ య‌ష్ - వేద మొండికేస్తారు. క‌ట్ చేస్తూ నో ట‌చ్చింగ్స్ అంటూనే ఒక‌రికి ఒక‌రు తినిపించుకుంటారు. ... య‌ష్ - వేద‌ల పెళ్లి ఆగిపోయింద‌ని పార్టీలో పీక‌ల దాకా తాగి ఎంజాయ్ చేసిన అభిమ‌న్యు మాళ‌విక‌తో క‌లిసి ఇంటికి చేర‌తాడు. అదే స‌మ‌యంలో ఖుషీ ఆయ‌మ్మ ఇంటికి చేర‌తారు. ఎక్క‌డికి వెళ్లార‌ని మాళ‌విక -అభిమ‌న్యు ఆయ‌మ్మ‌ని నిల‌దీస్తారు. కానీ త‌ను నిజం చెప్ప‌దు... అయితే ఎక్క‌డో ఏదో త‌ప్పు జ‌రుగుతోంద‌ని అభిమ‌న్యు శంకించ‌డం మొద‌లుపెడ‌తాడు.  విష‌యం తెలిప‌సి న‌న్నుఎందుకు మోసం చేశావ‌ని మాళ‌విక .. వేద‌ను నిల‌దీస్తుంది. ఖుషీని ద‌క్కించుకోవ‌డం కోస‌మే ఇదంతా చేశాన‌ని వేద‌.. మాళ‌విక‌కు దిమ్మ‌దిరిగే షాకిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

రాగ సుధ ఎక్క‌డుందో ఆర్య వ‌ర్థ‌న్ కి తెలిసిపోయిందా?

బుల్లితెర‌పై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. మారాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగుతో పాటు ఈ సీరియ‌ల్ ఆరు భాష‌ల్లో రీమేక్ అయింది. బెంగాలీ భాష‌లో రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నించి చివ‌రికి డ‌బ్ చేశారు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఒడియా, హిందీ భాష‌ల్లో మాత్ర‌మే కంటిన్యూ అవుతోంది. త‌న కంప‌నీలో ప‌నిచేసే స్టాఫ్ కు ఫ్లాట్స్ ఇవ్వాల‌ని ఆర్య‌వ‌ర్థ‌న్ నిర్ణ‌యించుకుంటాడు. ఆ విష‌యం తెలిసిన మాన్సీ కంప‌నీ ఎంప్లాయిస్ ని దారుణంగా అవ‌మానిస్తుంది. ఆత్మాభిమానం లేని వాళ్లైతే తేర‌గా వ‌చ్చే వాటిని తీసుకుంటార‌ని కించ‌ప‌రుస్తుంది. దీంతో ఆత్మాభిమానం దెబ్బ‌తిన్న ఉద్యోగులు మూకుమ్మ‌డిగా ఆర్య‌వ‌ర్థ‌న్ ఇచ్చే ఫ్లాట్స్ తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటారు. ఈ విష‌యం మీరాకు తెలుస్తుంది. త‌ను అనుతో చెబుతుంది. అయితే ఆర్య వ‌ర్థ‌న్ ..అను, మీరా, జెండేల‌ని సంప్ర‌దించిన త‌రువాత ఎంప్లాస్ కి ఫ్లాట్స్ పేప‌ర్స్ మాన్సీ చేతుల మీదుగా అంద‌జేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. త‌నే అందించేలా అను ప్లాన్ చేస్తుంది. ఆ విష‌యాన్ని ఆర్య పిలిచి మాన్సీతో చెబుతాడు. ఆర్య త‌న‌ని పిల‌వ‌డంతో విష‌యం తెలిసిపోయింద‌ని  మాన్సీ అద‌రిప‌డుతుంది. ఆ త‌రువాత తెలియలేద‌ని గ‌మ‌నించి కుదుట‌ప‌డుతుంది. కానీ ఎంప్లాయిస్ ని అవ‌మానించిన త‌నే ఫ్లాట్స్ కి సంబంధించిన పేప‌ర్స్ ఇవ్వాల‌ని ఆర్య నిర్ణ‌యించ‌డంతో ఏం చేయాలో మాన్సీకి అర్థం కాదు. త‌ప్పించుకోవ‌డానికి ఛాన్స్ లేక‌పోవ‌డంతో చేసేది లేక ఎంప్లాయిస్ కి ఫ్లాట్స్ కి సంబంధించిన ద‌స్తావేజులు అందించ‌డానికి వెళుతుంది. కంప‌నీలో సీరియ‌ర్ శంక‌ర్ గారి నుంచి పంపిణీ మొద‌లుపెడుతుంది. కానీ అత‌ను ద‌స్తావేజులు తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తాడు. దీంతో ఎక్క‌డ త‌ను అవ‌మానించిన నిజం తెలిసిపోతుందేమోన‌ని మాన్సీ బ్ర‌తిమాల‌డం.. ఆర్య చెప్ప‌డంతో తీసుకుంటాడు. క‌ట్ చేస్తే... జెండే మ‌నుషుల నుంచి త‌ప్పించుకున్న వ‌శిష్ట .. రాగ‌సుధ కోసం సుబ్బు వుంటున్న ఇంటి ముందు తిరుగుతూ వుంటాడు. అత‌న్ని వెంబ‌డించి వెంట వ‌చ్చిన జెండే మ‌నుషులు చాటుగా అత‌న్ని గ‌మ‌నించి ఆ విష‌యాన్ని జెండేకి ఫోన్ ద్వారా తెలియ‌జేస్తారు. వెంట‌నే ఆ లొకేష‌న్ త‌న‌కు షేర్ చేయ‌మ‌ని చెప్పిన జెండే ఆ విష‌యాన్ని ఆర్య‌కు తెలియ‌జేస్తాడు. ఇద్ద‌రూ క‌లిసి రాగ‌సుధ కోసం వ‌శిష్ట ఎదురుచూస్తున్న ప్లేస్ కి బ‌య‌లుదేర‌తారు. ఇదే స‌మ‌యంలో టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద ప‌ని పూర్త‌యిపోవ‌డంతో సుబ్బు .. రాగ‌సుధ‌ని ఇంటికెళ్లిపోమంటాడు. రాగ‌సుధ ఇంటికి బ‌య‌లు దేరుతుంది. అక్క‌డే వున్న వ‌శిష్ట‌ని చూసి షాక‌వుతుంది. కానీ విశిష్ట‌కు క‌నిపించ‌దు.. ఈ ఇద్ద‌రిని జెండే, ఆర్య వ‌ర్థ‌న్ గ‌మ‌నించారా? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

'ఫ‌న్ బ‌కెట్' మ‌హేశ్ విట్టా నాలుగేళ్ల ల‌వ్ స్టోరీ!

సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన క‌మెడియ‌న్‌ మ‌హేష్ విట్టా ఫ‌న్ బ‌కెట్ వెబ్ సిరీస్‌, బిగ్ బాస్ షోల త‌ర్వాత‌ సెల‌బ్రిటీ అయిపోయాడు. ఫ‌న్ బ‌కెట్ కార‌ణంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కొట్టేసిన‌ మ‌హేష్ విట్టా ఇప్పుడు తానే సొంతంగా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ పెట్టి సినిమాలు నిర్మించే స్థాయికి వ‌చ్చేశాడు. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ విట్టా ఈ సంద‌ర్భంగా త‌న ల‌వ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 3 లో వ‌రుణ్ సందేశ్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి ర‌చ్చ ర‌చ్చ చేసిన మ‌హేష్ విట్టా బ‌యటికి వెళ్లాక ఓ రేంజ్ లో స్థిర‌ప‌డ్డాడు. బిగ్ బాస్ ఓటీటీ లో అవ‌కాశం రావ‌డంతో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని వెల్ల‌డించాడు. "నాలుగేళ్లుగా ఒక అమ్మాయిని ల‌వ్ చేస్తున్నా. ఇద్ద‌రం లివిన్ రిలేష‌న్ లో వున్నాం. నాకు ల‌వ్ గురించి పెద్ద‌గా ఏమీ తెలియ‌దు. త‌ను నా ప‌క్క‌న వుంటే బాగుంటుంద‌ని అనిపించింది. అందుకే అమెనే త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాను. నా సొంత ప్రొడ‌క్ష‌న్ లో వ‌స్తున్న సినిమా రిలీజ్ కాగానే ఇద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్నాం" అని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు మ‌హేష్ విట్టా. సెప్టెంబ‌ర్ లో పెళ్లి చేసుకోబోతున్నామ‌ని వెల్ల‌డించాడు. Also Read: `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`.. డీఎస్పీ మార్చి సెంటిమెంట్! త‌ను ఐటీ ఉద్యోగి అని ఇండ‌స్ట్రీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, ఆమె త‌న‌ చెల్లెలి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. "ఫ‌స్ట్ టైం త‌న‌ని చూసిన‌ప్పుడు మా అమ్మ ఫేస్ క‌ట్ క‌నిపించింది. నాకు క‌నెక్ట్ అయిపోయింది. వెంట‌నే ప్ర‌పోజ్ చేశా. తాను మాత్రం రిజెక్ట్ చేసింది. రెండేళ్ల త‌రువాతే నాకు ఓకే చెప్పింది. త‌రువాత ఇద్ద‌రం ఒకిరి ఇంట్లో ఒక‌రం చెప్పుకున్నాం. ఇంట్లో వాళ్లు ఓకే అన్నారు. మా ఊరిలోనే పెళ్లి" అని వివ‌రించాడు.

బిగ్‌బాస్ ఓటీటీ ఎలిమినేష‌న్ స్టార్ట్‌!

బిగ్‌బాస్ నాన్‌ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ ఇటీవ‌ల ఫిబ్ర‌వ‌రి 26న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో 24 గంట‌ల పాటు స్ట్రీమింగ్ అంటూ హ‌డావిడి చేశారు. కానీ ఆదిలోనే దీనికి ఆటంకాలు మొద‌ల‌య్యాయి. బుధ‌వారం అర్థ్ర‌రాత్రి లైవ్ స్ట్రీమింగ్ ని నిలిపివేస్తూ వీక్ష‌కుల‌కు షాకిచ్చింది. సాంకేతిక లోపాల కార‌ణంగానే స్ట్రీమింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశామ‌ని చెప్పిన నిర్వాహ‌కులు మొత్తానికి గురువారం రాత్రి 9 గంట‌ల నుంచి మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాన్ని ప్రారంభించారు. ఇదిలా వుంటే షోలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ హౌస్ లో ర‌చ్చ మొద‌లుపెట్టారు. వీక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. అల్ల‌రి, ఏడుపులు, గొడ‌వ‌లు..అల‌క‌లు వెర‌సి బిగ్‌బాస్ ఓటీటీ వెర్ష‌న్ గోల గోల‌గా సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి వ‌చ్చారు. ఇందులో మాజీలు, కొత్త వారూ వున్నారు. ఇటీవ‌లే నామినేష‌న్ మొద‌లైంది. సీనియ‌ర్ ల‌ని జూనియ‌ర్ లు ఎక్క‌డా వ‌ద‌ల‌డం లేదు. ర‌క ర‌కాల కార‌ణాలు చెప్పి సీనియ‌ర్ ల‌ని కూడా నామినేట్ చేసేశారు. ఈ వారం వారియ‌ర్స్ టీమ్ నుంచి స‌ర‌యు, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, అరియానా గ్లోరి, హ‌మీదా, ముమైత్ ఖాన్‌.. ఛాలెంజ‌ర్స్ టీమ్ నుంచి మిత్ర‌శ‌ర్మ‌ ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు. Also Read: `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`.. డీఎస్పీ మార్చి సెంటిమెంట్! ఇలా నామినేట్ అయిన వారిలో అరియానా, హ‌మీదాల‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. దీంతో వీరు సేఫ్ అయిన‌ట్టే. ఆర్జే చైతూ కు యాంక‌ర్ శ్రీ‌ముఖి, ఆర్జే కాజ‌ల్ ల అండ వుంది దీంతో ఇత‌నూ సేఫేన‌ట‌. ఇక ముమైత్‌ఖాన్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు త‌న‌కూ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది కాబ‌ట్టి త‌న‌ని వారు కాపాడేస్తారు.. దీంతో త‌ను కూడా సేఫే. ఎటొచ్చీ న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, స‌ర‌యు, మిత్ర‌శ‌ర్మ‌ల‌కు రిస్కు ఎక్కువ‌. అయితే ఈ ముగ్గురిలో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ హౌస్ లో వుండాల‌ని, త‌ను వుంటేనే గొడ‌వ‌లు, హంగామా వుంటుంద‌ని భావించే వాళ్లు వున్నారు.  వారి వ‌ల్ల న‌ట‌రాజ్ మాస్ట‌ర్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి. స‌ర‌యు సీజ‌న్ 5లో ఫ‌స్ట్ వీక్ లోనే ఇంటిదారి ప‌ట్టింది. ఈ సారి ఛాన్స్ ఇవ్వాల‌ని అనుకుంటే ఆమె సేఫ్‌.. మిత్ర‌శ‌ర్మ గురించి ఎవ‌రీకీ తెలియ‌దు. త‌మిళ న‌టి .. ఆమె వుండ‌టం క‌ష్ట‌మే.  

సూర్య‌ని చూడ‌గానే ఏడ్చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

హీరో సూర్య‌ని చూడ‌గానే బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం `ఈటీ`. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అమ్మాయిల‌పై అఘాయిత్యాల నేప‌థ్యంలో ఓ స‌రికొత్త క‌థ‌తో రూపొందింది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 10న ఈ మూవీ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో సూర్య హైద‌రాబాద్ వ‌చ్చారు. గురువారం మీడియాతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వినూత్న‌మైన చిత్రాల‌తో హీరోగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్న సూర్య‌కు తెలుగులో చాలా మంది అభిమానులున్నారు. బిగ్ బాస్ రన్న‌ర‌ప్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ కూడా సూర్య‌కు వీరాభిమాని. గురువారం వీరిద్ద‌రి మ‌ధ్య అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇంట‌ర్వ్యూలు ముగించుకుని బ‌య‌టికి వ‌స్తున్న సూర్య‌కు అక్క‌డే కూర్చుని త‌న‌ను గ‌మ‌నిస్తున్న ష‌ణ్ముఖ్ క‌నిపించాడు. వెంట‌నే వెళ్లి అత‌న్ని క‌లిసి ప‌ల‌క‌రించారు సూర్య‌.. ఇలా త‌న వ‌ద్ద‌కే త‌న అభిమాన న‌టుడు రావ‌డం.. త‌న‌ని ప‌ల‌క‌రించ‌డంతో ష‌ణ్ముఖ్ ఆ క్ష‌ణాన ఉద్వేగానికి లోన‌య్యాడు. Also Read: నాగ శ్రీనుకి నాగబాబు సాయం.. మంచు కాంట్రవర్సీలోకి మెగా ఎంట్రీ! వెంటనే సూర్య అత‌న్ని అక్కున చేర్చుకుని భుజం త‌ట్టారు. దీంతో ఉప్పొంగిన ఆనందానుభూతికి లోనైన ష‌ణ్ముఖ్ త‌న అబిమాన హీరోని క‌లిసిన ఫొటోల‌ని, వీడియోల‌ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. అంతే కాకుండా త‌ను షేర్ చేసిన వీడియోకు `నువ్వు ఏం కావాల‌ని కోరుకుంటావో అది దొర‌క్క‌పోవ‌చ్చు.. కానీ నీకు ద‌క్కాల్సింది.. అవ‌స‌ర‌మైన‌ది త‌ప్ప‌కుండా దొరుకుతుంది` అంటూ ఆస‌క్తిక‌రమైన కామెంట్ ని జోడించాడు ష‌న్ను. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అంతే కాకుండా చాలా రోజులుగా చాలా ఫెయిల్యూర్స్ ని చూస్తున్న నాకు 3-3-2022 రోజు అత్యంత ఆనంద‌క‌ర‌మైన రోజు.. ఐ ల‌వ్ యూ సూర్య అన్న` అని ష‌న్ను మ‌రో కామెంట్ చేయ‌డం విశేషం.   

మాళ‌విక - అభిమ‌న్యుల‌కు షాకిచ్చిన య‌ష్ - వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌చ డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన  పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, మిన్ను నైనిక‌,ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఈ సీరియ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. మాళ‌విక కుట్ర‌ని తెలుసుకోని వేద త‌ను చెప్పిన మాట‌లు వినిపి య‌ష్ తో పెళ్లికి నిరాక‌రిస్తుంది. కూతురు మాత్ర‌మే ఉంద‌ని, కొడుకు లేడ‌ని త‌న‌ని న‌మ్మించి మోసం చేశారంటూ య‌ష్ కుటుంబంపై మండిప‌డుతుంది. Also Read: ప్రభాస్ లాంటి హీరోని చూడలేదు! అక్క‌డికి నుంచి లోనికి వెళ్లిపోయిన వేద‌ని వెతుక్కుంటూ అక్క‌డికి చేరుకున్న ఖుషీ.. త‌న త‌ల్లి మాళ‌విక ప‌న్నిన కుట్ర‌ని వేద‌కు తెలియ‌జేస్తుంది. త‌న తండ్రి మంచి వాడ‌ని, అత‌నికి ఎలాంటి కుట్ర‌లు తెలియ‌వ‌ని, త‌న‌కు నువ్వు కావాల‌ని, డాడీ, నువ్వు, నేను ముగ్గురం క‌లిసి వుందామ‌ని చెబుతుంది. దీంతో క‌న్విన్స్ అయిన వేద త‌న‌ని విడిచి వెళ్లిపోతున్న ఖుషీని అక్కున్న చేర్చుకుని పెళ్లికి అంగీక‌రిస్తుంది. ఇరు కుటుంబాలు ఆనందాన్ని వ్య‌క్తం చేసి య‌ష్, వేద‌ల పెళ్లి చేస్తారు. పెళ్లి త‌రువాత ఊరేగింపుగా వెళుతుంటే య‌ష్, వేద‌ల మ‌ధ్య‌లో నిలుచుని ఖుషీ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వుంటుంది. అది చూసి య‌ష్, వేదలు మురిసిపోతూ వుంటారు. త‌ను కోరుకున్న‌ట్టుగానే య‌ష్, వేద‌ల వివాహం జ‌ర‌గ‌డంతో ఖుషీ ఆ ఆనందంతో మురిసిపోతుంది. ఇద్ద‌రి ప‌ట్టుకుని ఫొటోల‌కు పోజులిస్తుంది. అయితే జ‌ర‌గ‌దు అనుకున్న య‌ష్, వేద‌ల పెళ్లి జ‌రిగిపోవ‌డంతో మాళ‌విక - అభిమ‌న్యు ఏం చేశారు? .. ఎలాంటి కుట్ర‌కు తెర తీశారు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సుధీర్ పెళ్లాడిన ఈ అమ్మాయి ఎవరు?

బుల్లితెరపై సుధీర్-రష్మి జోడీకి మంచి క్రేజ్ ఉంది. ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి కెమిస్ట్రీకి, లవ్ ట్రాక్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పటికే పలుసార్లు షోలలో పెళ్లి కూడా జరిగింది. కానీ అది నిజం కాదు. ఊరికే ప్రేక్షకులను అలరించడం కోసం, స్క్రిప్ట్ ప్రకారం షో కోసం అలా చేశారు. అయితే తాజాగా మరోసారి సుధీర్ పెళ్ళికొడుకు అవతారమెత్తాడు. ఈసారి రష్మికి బదులుగా వేరే అమ్మాయిని పెళ్లాడాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అంటూ చర్చలు మొదలయ్యాయి. సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో సుధీర్ కి ఒకమ్మాయితో పెళ్లి జరిగినట్లుగా చూపించారు. ఇద్దరూ రింగ్స్, దండలు మార్చుకోవడం ప్రోమోలో కనిపించింది. ఇక ఈ ప్రోమోలో సుధీర్ ని పెళ్లాడినట్లు కనిపించిన అమ్మాయి గతంలో వేరే షోలలో కనిపించలేదు. కొత్తగా కనిపిస్తుంది. పైగా ఆమె సుధీర్ ని చూసి సిగ్గుపడటం, మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తుంటే ఈసారి సుధీర్ కి నిజంగానే పెళ్లయిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి ప్రాంక్స్ ఇప్పటికే ఎన్నో చూశాం, ఈసారి మరో కొత్త అమ్మాయితో ప్రాంక్ ప్లాన్ చేశారని అంటున్నారు. సుధీర్ కి ఈసారైనా నిజంగా పెళ్లయిందా లేదో? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

అవినాష్ పెళ్లిలో విష్ణు ప్రియ వ్లాగ్‌..

  ముక్కు అవినాష్ బుల్లితెర‌పై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ షోలో త‌న‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుని న‌వ్వించిన అవినాష్ ఆ త‌రువాత బిగ్‌బాస్ సీజ‌న్ 4 లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. టాప్ 5 దాకా ఫైట్ చేసి చివ‌రి ద‌శ‌లో షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. మ‌ల్లెమాల అగ్రిమెంట్ కార‌ణంగా ప‌ది ల‌క్ష‌లు పోగొట్టుకున్న అవినాష్ ఆ డ‌బ్బులు మ‌ల్లెమాల వారికి క‌ట్టి మ‌రీ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో లో అవినాష్ విన్న‌ర్ కాలేక‌పోయినా చాలా మంది దృష్టిని ఆక‌ర్షించ‌డంతో స‌ఫ‌లం అయ్యాడు. మ‌ల్లెమాల అగ్రిమెంట్ కార‌ణంగా వారికి అవినాష్ ప‌ది ల‌క్ష‌లు క‌ట్టి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ద్వారా అత‌నికి భారీ మొత్త‌మే అందింద‌ని తెలిసింది. ఇదిలా వుంటే అవినాష్ ప్ర‌స్తుతం నాగ‌బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కామెడీ స్టార్స్ ధ‌మాకాలో స్కిట్ లు చేస్తున్నాడు. గ‌త కొంత కాలంగా ఈ షోలో క‌నిపించ‌కుండా పోయిన అవినాష్ తిరిగి మ‌ళ్లీ యాక్టీవ్ గా మారిపోయాడు. ఈ షోకు దీపిక పిల్లి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌చ్చే ఆదివారం ప్ర‌సారం కానున్న షోకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. Also Read: అషురెడ్డిని ఆడుకున్న నెటిజ‌న్స్‌.. ఏం జ‌రిగింది? నాలుగు స్కిట్ ల‌కు దూరంగా వుంటే త‌న‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని త‌న ఫ్ర‌స్ట్రేష‌న్ ని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఇదే ప్రోమోలో యాంక‌ర్ విష్ణు ప్రియ‌పై షాకింగ్ పంచ్ లేశాడు. త‌న పెళ్లిలోవిష్ణు ప్రియ వ్లాగ్ చేసింద‌ని, నా పెళ్లిలో వ్లాగ్ చేయ‌డానికి అది ఎవ‌తిరా? అంటూ హ‌ల్ చ‌ల్ చేశాడు. నేను వ్లాగ్ చేద్దామ‌ని ప్లాన్ చేసుకుంటే త‌ను ఉద‌యం ఏడు గంట‌ల నుంచే వ్లాగ్ మొద‌లుపెట్టి త‌న ఛాన‌ల్ లో పోస్ట్ చేసింద‌ని, నేను చేసిన వీడియోని ఎవ‌రూ చూడ‌లేద‌ని, వీవ‌ర్షిప్ మొత్తం విష్ణు ప్రియ ఛాన‌ల్ కే వెళ్లిపోయింద‌నిఅవినాష్ త‌న బాధ‌ని వ్య‌క్తం చేశాడు. పెళ్లి పేరుతో అవినాష్ చేసిన స్కిట్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తూ న‌వ్వులు పూయిస్తోంది. 

బిగ్‌బాస్ ఓటీటీ ప్రియుల‌కు బిగ్ షాక్‌

బుల్లితెర‌పై బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు... ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, సిరి హ‌న్మంత్ హ‌గ్గులు.. హ‌ద్దులు దాటిన‌ ప్రియ - స‌న్నిల‌ మాట‌ల యుద్ధం.. యాంక‌ర్ ర‌వి స‌డ‌న్ ఎలిమినేష‌న్‌.. వెర‌సి బిగ్‌బాస్ వార్త‌ల్లో నిలిచింది. గ‌తంతో పోలిస్తే ఈ సీజ‌న్ పై వ‌చ్చిన‌న్ని విమ‌ర్శ‌లు మ‌రో సీజ‌న్ పై రాలేదు. చివ‌రికి హోస్ట్ నాగార్జున‌పై కూడా నెట్టింట దారుణంగా ట్రోలింగ్ జ‌రిగింది. ఓ జంట బ్రేక‌ప్ కి కూడా కార‌ణంగా నిలిచి బిగ్‌బాస్ సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా వుంటే 24 గంట‌ల స్ట్రీమింగ్ అంటూ ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్  మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇది తాజాగా వీక్ష‌కుల‌కు బిగ్ షాక్‌ ఇచ్చేసింది. ఫిబ్ర‌వ‌రి 26న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ షో స్ట్రీమింగ్ మొద‌లైంది. ఈ షోపై క్రేజ్ వుండ‌టంతో వీక్ష‌కులు చాలా మంది డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని రీచార్జ్ చేసుకున్నారు. శ‌నివారం మొద‌లైన ఓటీటీ బిగ్ బాస్ షో నాన్ స్టాప్ కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ మాత్రం అంతంత మాత్ర‌మే. ఇంత‌కీ ఈ షో మొద‌లైన‌ట్టుగా కూడా ఎవ‌రికి తెలియ‌లేదు. దీంతో రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది. Also Read: బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్ ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ ఓటీటీ టీమ్ యూజ‌ర్ల‌కు బిగ్ షాకిచ్చేసింది. ఉన్న‌ట్టుండి లైవ్ స్ట్రీమింగ్ ని ఆపేసింది. 24 గంట‌ల పాటు నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటూ ప్ర‌చారం చేసిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు బుధ‌వారం అర్థ్రరాత్రి నుంచే లైవ్ స్ట్రీమింగ్ కి బ్రేకివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బుధ‌వారం ఆర్థ్ర రాత్రి స్ట్రిమింగ్ నిలిపివేసిన నిర్వాహ‌కులు గురువారం రాత్రి 9 గంట‌ల నుంచి మ‌ళ్లీ స్ట్రీమింగ్ స్టార్ట‌వుతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ఈ షో ఫెయిల్ అయింద‌ని నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి.  

మాళ‌విక కుట్ర‌ని ఖుషీ బ‌య‌ట‌పెట్టిందా?

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొంత కాలంగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ముందు సాదా సీదాగా ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ క్ర క్ర‌మంగా పాపులారిటీని సొంతం చేసుకుంటూ విశేష ఆద‌ర‌ణ దిశ‌గా ప‌య‌నిస్తోంది. య‌ష్‌, వేద‌ల పెళ్లిని గ‌మనించిన మాళ‌విక‌ ఎలా గైనా చెడ‌గొట్టాల‌ని ప‌న్నాగం ప‌న్నుతుంది. వెంట‌నే వేద ద‌గ్గ‌రికి వెళ్లి త‌న‌తో ఏకాంతంగా మాట్లాడాల‌ని చెప్పి య‌ష్ గురించి లేనిపోనివి చెప్పి త‌న మ‌న‌సు మారుస్తుంది.   దీంతో మాళ‌విక‌ ట్రాప్ లో ప‌డిన వేద మ‌నం మోస‌పోయామ‌ని త‌ల్లితో చెప్పి పెళ్లి జ‌ర‌గ‌ద‌ని య‌ష్ కు, అత‌ని కుటుంబానికి షాకిస్తుంది. అయితే మాళ‌విక‌ చెప్పిన విష‌యాల్లో య‌ష్ కు కొడుకు వున్నాడన్నది బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ విష‌యాన్ని య‌ష్ త‌ల్లి మాలిని అంగీక‌రిస్తుంది. అయితే ఆ విష‌యం దాచ‌డం త‌మ త‌ప్పేన‌ని అంగీక‌రించి వేద కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతుంది. దీంతో వేద త‌ల్లి  ఇంత మోసం చేస్తారా? అని య‌ష్ కుటుంబాన్ని నిల‌దీస్తుంది. వెంట‌నే వేద ఇక ఈ పెళ్లి జ‌ర‌గ‌ద‌ని చెప్పి అక్క‌డి నుంచి లోప‌లికి వెళ్లిపోతుంది. Also Read: మాళ‌విక ట్రాప్ లో వేద‌.. పెళ్లి ఆగిపోతుందా? క‌ట్ చేస్తే... య‌ష్ .. వేద‌ల పెళ్లి ని ఆపేశాన‌న్న ఆనందంలో ఇంటికి చేరుకున్న మాళ‌విక ఆ విష‌యాన్ని అభిమ‌న్యుకి చెబుతుంది. వెంట‌నే ఇద్ద‌రు సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి పార్టీకి వెళ‌తారు.. ఇదంతా గ‌మ‌నించిన ఖుషీ పెళ్లి ఆగిపోయిందా? అని బాధ‌ప‌డుతూ వేద ద‌గ్గ‌రికి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఆయ‌మ్మ స‌హాయంతో క‌ల్యాణ మండ‌పానికి చేరుకుంటుంది. అక్క‌డ ఒంట‌రిగా వున్న వేద ద‌గ్గ‌రికి వెళ్లి కావాల‌నే త‌న త‌ల్లి మాళ‌విక ఇదంతా చేసింద‌ని, పెళ్లి చెడ‌గొట్టింద‌ని, ఇందులో త‌న తండ్రి య‌ష్ త‌ప్పు ఎంత మాత్ర‌మూ లేద‌ని వేద‌కు చెబుతుంది. అంతే కాకుండా నువ్వు మా నాన్న‌ని పెళ్లి చేసుకోక‌పోతే వాళ్లు న‌న్ను క‌న‌పించ‌కుండా చేస్తార‌ని, జీవితంలో ఇక నేను నీకు క‌నిపించ‌న‌ని చెప్పి ఖుషీ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంటుంది. ఆ మాట‌లు విన్న వేద ఏం చేసింది? ఇంత‌కీ య‌ష్ ని పెళ్లి చేసుకుందా?  లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్

బుల్లితెరపై తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. ఈరోజు నుంచి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ఓటీటీలో సందడి చేయనుంది. అయితే ఈ షోని మొదటి నుంచి వ్యక్తిరేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ నేత నారాయ‌ణ మరోసారి బిగ్ బాస్ షోపై విరుచుకుపడ్డారు. ఈ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ అనేది గేమ్‌ షో కాదని.. లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్ అని నారాయ‌ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో ఉంచడం ఏంటని ఏంటని ప్రశ్నించారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి షోలు చేయొద్దని సూచించారు. ఈ షో వల్ల సమాజం నాశనమైపోతుందని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. ‘స్టాప్‌ బిగ్‌బాస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో నారాయ‌ణ సోషల్ మీడియాలో యాంటి బిగ్‌బాస్‌ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఈరోజు నుంచే ఓటీటీ వేదిక డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారమవుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ఈ షో 84 రోజుల పాటు సాగనుంది.

అనసూయ కంటే ఎక్స్‌ ట్రా అందం రష్మిది!

యాంకర్ అనసూయ అందం ముందు మిగతా యాంకర్ల అందరూ దిగదుడుపే. ఈ విషయం బుల్లి తెర షో వీక్షించే బుల్లి పాపాయికి కూడా తెలిసిందే. బుల్లి తెర జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటకు వెళ్లిపోతే.. ఆమె అభిమానులు ఎంతగా మనస్సులో మూగగా రోదించారో! ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు బుల్లితెరపై తన అందాల సోయగాల మెరుపులతో.. అందరినీ మైమరిపించింది అన‌సూయ‌. నెక్ట్స్ జబర్దస్త్ షో యాంకర్ ఎవరంటూ ఆ సమయంలో కుర్రకారు బెంబెలెత్తిపోయారు. అలాంటి సమయంలో మీ కోసం నేనున్నా.. మీకోసం నేను వస్తున్నానంటూ డీలా పడిపోతున్న కుర్రకారులో నయా హుషారు తెప్పించింది రష్మి గౌతమ్. వెండి తెర మీద వెలిగి.. బుల్లి తెరకి దిగుమతైందీ అందాల నెరజాణ. అందం, పరువం, చలాకీతనం, మాటకారితనం, ఓర చూపు.. కోర చూపు అన్ని కలగసిపోయినట్లుండే రష్మి రాకతో.. కుర్రకారు హీటెక్కిపోయింది. అన్నింటిలో అనసూయను మించి పోయిందనే టాక్ అయితే బుల్లితెర జబర్దస్త్ షో సాక్షిగా నాడు తెగ వైరల్ అయింది. ఈ విషయం అనసూయకు తెలిసిందేమో మరి... అంతే మళ్లీ జబర్దస్త్‌ షో యాంకరింగ్ నాకే కావాలంటూ సదరు షో ప్రోడ్యూసర్స్ ముందు పీఠం వేసుకుని కూర్చుందనీ, ఈ నేపథ్యంలో ఈ షో ప్రోడ్యూసర్స్ .. ఆమెకు జబర్దస్త్ షో కట్టబెట్టారనీ చాలామంది చెప్పుకున్నారు. అయితే అనసూయకు కంటే ఎక్స్ ట్రా అందం ఉండే రష్మి గౌతమ్‌ను బ‌య‌ట‌కు పంప‌కుండా ఆమెకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోను కట్టబెట్టారనే టాక్ సైతం నాడు.. నేడు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.... చేస్తోంది కూడా. అలాంటి ఎక్స్ ట్రా అందం ఉన్న రష్మికి అలా ఇలా కాదు.. చాలా పెద్ద రేంజ్‌లో ఫ్యాన్స్ పాలోయింగే ఉంది. బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు తన అభిమానులను తన అందాలతో అలరిస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఈ సుంద‌రి.. తన అందాలను సైతం ఆరబోస్తోంది. అప్పుడప్పుడు తన అందాలను ప్రదర్శించేలా ఉన్న ఫొటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. కుర్రకారును కైపులో ముంచేస్తోందీ ముద్దుగుమ్మ. తాజాగా రష్మి గౌతమ్ తన ఇన్ స్టాలో కొన్న హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో రష్మి అదిరిపోయే రేంజ్‌లో ఉన్న తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ చూసి కొంత మంది నెటిజన్లు..లవ్ సింబల్ ఎమోజీలను కామెంట్సుగా పెడుతున్నారు.

రాగ సుధ పోలీస్‌స్టేష‌న్ లో అడ్డంగా దొరికిపోతుందా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. శ్రీ‌రామ్ వెంక‌ట్, వ‌ర్ష జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్, అనూషా సంతోష్ కీల‌క పాత్ర‌లు చేశారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ల నేప‌థ్యంలో సాగే ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతోంది. గ‌త జ‌న్మ ప్ర‌తీకారం నేప‌థ్యంలో క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతోంది. రాగ‌సుధ దేవుని ప‌టాల వెన‌క గ‌న్ దాచిపెట్ట‌డాన్ని క‌నిపెట్టిన సుబ్బు దాన్ని స్టేష‌న్ లో ఇచ్చేద్దామంటాడు. రాగ‌సుధ కంగారుప‌డుతుంది. బిజినెస్ టైమ్ క‌దా త‌రువాత ఇద్దాంలే అంటుంది. అనుమానం వ‌చ్చిన సుబ్బు నీకు దీంతో ఏమైనా ప‌నుందా అమ్మా? అంటాడు. అదేంటి బాబాయ్ నాకు దీంతో ఏం ప‌నుంటుంది? అని తిరిగి ప్ర‌శ్నిస్తుంది. ఇలాంటి విష‌యాలు ఆల‌స్యం చేస్తే ఆ త‌రువాత జ‌రిగే ప‌రిణామాల వ‌ల్ల జీవిత‌మే దెబ్బ‌తింటుంద‌ని ఇద్ద‌రం పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి గ‌న్ ఇచ్చేద్దాం అంటాడు సుబ్బు. నేనెందుకు బాబాయ్ మీరే వెళ్లి ఇచ్చేయండి  అంటుంది  రాగ‌సుధ‌. నువ్వెందుకు రావ‌మ్మా అంటాడు సుబ్బు.. నేను ఎప్పుడూ పోలీస్ స్టేష్ కి వెళ్ల‌లేదంటుంది. మ‌రి నేను ఎప్పుడూ వెళుతుంటానా? అని రాగ‌సుధ‌ని రావాల్సిందే అంటాడు. చేసేది లేక సుబ్బుతో క‌లిసి రాగ‌సుధ స్టేష‌న్ కు వెళుతుంది. క‌ట్ చేస్తే సోఫాలో ఆర్య వ‌ర్ధ‌న్ మూడీగా కూర్చుని అనుకి క‌నిపిస్తాడు. ఏంటీ ఇది క‌లా నిజ‌మా.. ఈయ‌న ఇలా వున్నాడేంటీ అని అను ఆలోచ‌న‌లో ప‌డుతుంది. ద‌గ్గ‌రికి వెళ్లి పిలిచినా పెద్ద‌గా ప‌ల‌క్క‌పోవ‌డంతో ఇది మీరేనా అంటుంది. ఈ రోజు ప్రామిస్ డే.. అందులోనూ మీది అంటూ అను గుర్తు చేస్తుంది. వెంట‌నే పైకి లేచిన ఆర్య .. త‌న‌కు ప్రామిస్ చేయ‌మ‌ని అనుని అడుగుతాడు.. రాగ‌సుధ గురించి చెప్ప‌మ‌ని ఇలా అంటున్నాడా? అని అను కంగారు ప‌డుతూనే ప్రామిస్‌ చేస్తుంది. క‌ట్ చేస్తే ..పోలీస్ స్టేష‌న్ లోకి వెళ్ల‌డానికి రాగ‌సుధ భ‌య‌ప‌డుతూ వుంటుంది. మీరే వెళ్లి రివాల్వ‌ర్ ఇచ్చేసి రండి అంటుంది. ఇక్క‌డి దాకా వ‌చ్చి లోప‌లికి రానంటే ఎలా అంటాడు సుబ్బు.. అన‌గానే ఇద్ద‌రూ క‌లిసి స్టేష‌న్ లోకి వెళ‌తారు అక్క‌డ సీఐని క‌లుస్తారు. జ‌రిగిన విష‌యం చెప్పి గ‌న్ ఇచ్చేస్తాడు సుబ్బు.. కానీ గ‌న్ త‌న‌కు దొర‌క‌లేద‌ని, మా అమ్మాయికి దొరికింద‌ని చెప్ప‌డంతో త‌న‌ని పిల‌వ‌మంటాడు సీఐ. త‌న స్టైల్లో రాగ‌సుధ‌ని ప్ర‌శ్నించ‌డంతో సుబ్బు హ‌డ‌లిపోతాడు.. ఈ గ‌న్ దొరికిందా?.. దొంగిలించావా?.. దీంతో ఎవ‌రినైనా షూట్ చేయాల‌నుకున్నావా? అని ప్ర‌శ్న‌లు సంధిస్తాడు సీఐ. ఆ త‌రువాత రాగ‌సుధ ముఖాన్ని క‌వ‌ర్ చేస్తున్న కొంగుని తీసి ముఖం చూపించ‌మంటాడు.. దీంతో రాగ‌సుధ కంగారు ప‌డుతుంది.. రాగ‌సుధ‌ని చూసిన సీఐ ఏం చేశాడు? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

మాళ‌విక ట్రాప్ లో వేద‌.. పెళ్లి ఆగిపోతుందా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగిపోతోంది. త‌ల్లిని రాలేన‌ని తెలిసి ఓ ప‌సి పాప‌పై ప్రేమ‌ని పెంచుకున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఓ పాప నేప‌థ్యంలో సాగుతున్న ఈ సీరియ‌ల్ పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌ల‌ని కూడా ఎంట‌ర్ టైన్ చేస్తోంది. య‌శోధ‌ర్ ని ఖుషీ కోసం పెళ్లి చేసుకోవ‌డానికి వేద రెడీ అయిపోతుంది. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం పెళ్లి ఏర్పాట్లు చేస్తుండ‌టంతో హంగామా మొద‌ల‌వుతుంది. సంగీత్ ఏర్పాట్లు చేయ‌డం.. అందులో వేద‌, య‌ష్ క‌లిసి డ్యాన్స్ చేస్తుండ‌గా సంగీత్ లోకి ఎంట‌రైన మాళ‌విక ఆ దృశ్యాల‌ని చూసి షాక్ కు గుర‌వుతుంది. య‌శోధ‌ర్ పెళ్లి చేసుకోబోయేది వేద‌నా అని ఆశ్చ‌ర్య‌పోతుంది. ఆ త‌రువాత వేద‌కు గిఫ్ట్ ఇవ్వ‌డానికి వెళ్లిన మాళ‌విక ఇండైరెక్ట్ గా మీ పెళ్లి ఎలా జ‌రుగుతుందో చూస్తాన‌ని వేదకు షాకిస్తుంది. అదే స‌మ‌యంలో ఖుషీ వేద‌కు ఇచ్చిన గిఫ్ట్ క‌నిపించి మ‌రింత షాక‌వుతుంది మాళ‌విక‌. త‌న మాజీ భ‌ర్తే కాదు, త‌న కూతురు కూడా వేద వ‌ల్ల మారిపోయింద‌ని తెగ ఫీల‌వుతుంది. య‌ష్ ని ఎలా పెళ్లి చేసుకుంటావో.. ఖుషీని నా నుంచి ఎలా దూరం చేస్తావో చూస్తాన‌ని ఆగ్ర‌హాంతో ఊగిపోతుంది. గిఫ్ట్ వంక‌తో వేద తో ఇండైరెక్ట్ గా పెళ్లి పై సెటైర్లు వేస్తుంది. ఇంత‌గా మాళ‌విక హింట్ ఇస్తూ మాట్లాడుతున్నా వేద‌కు అర్థం కాదు. కానీ సంథింగ్ ఈజ్ దేర్ అని ఆలోచ‌న‌లో ప‌డుతుంది. వేద ఆలోచ‌న‌లో వుండ‌గానే సీరియ‌స్ గా గిఫ్ట్ ఇచ్చేసి అక్క‌డి నుంచి మాలిని, య‌శోధ‌ర్ ల‌ని నిల‌దీస్తానంటూ వెళుతుంది మాళ‌విక‌.. అంతా క‌లిసి డ్రామా చేస్తున్నార‌ని, య‌ష్ పెళ్లి ఎవ‌రితో జ‌ర‌గ‌బోతోంద‌ని య‌ష్ త‌ల్లి మాలినితో వాద‌న‌కు దిగుతుంది.నీకు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నీ నుంచి ఇలాంటి ఫ్ర‌స్ట్రేష‌న్ నే కోరుకున్నా.. అదే ఇప్ప‌డు నీలో క‌నిపిస్తోంది. అన‌గానే వేద‌ని య‌ష్ పెళ్లి చేసుకుంటున్నాడ‌ని నాకు తెలిసిపోయింద‌ని చెబుతుంది. ముందు షాక్ అయినా.. అయితే ఏం చేస్తావంటూ మాలిని .. మాళ‌విక‌తో అంటుంది. నీకు చేత‌నైంది చేసి పెళ్లి ఆపు చూద్దాం అంటుంది. అంతే కాకుండా య‌ష్ - వేద‌ల పెళ్లి ఆప‌డం నీ వల్ల కాద‌ని ఛాలెంజ్ చేస్తుంది. అయితే మాళ‌విక - అభిమ‌న్యు మాస్ట‌ర్ ప్లాన్ వేస్తారు. య‌ష్  గురించి ఓ బ‌ల‌మైన అబ‌ద్ధాన్ని మాళ‌విక .. వేద‌కు చెప్పి త‌న మ‌న‌సు మార్చేలా ప్ర‌వ‌ర్తిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? మాళ‌విక - అభిమ‌న్యు ప్లాన్ ప్రకారం య‌ష్ - వేద‌ల పెళ్లి ఆగిపోయిందా? .. లేక మాళ‌విక - అభిమ‌న్యు ప్లాన్ బెడిసికొట్టిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

య‌ష్ - వేద‌ల పెళ్లిని ఆప‌డానికి అభిమ‌న్యు - మాళ‌విక ఏం చేశారు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ గురువారం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిర‌గ‌బోతోంది. ఈ రోజు హైలెట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. వేద వేసుకున్న మేక‌ప్‌, డ్రెస్సింగ్ చూసి ఖుషీ కోస‌మే పెళ్లి అన్నావ్‌.. ఇప్పుడు ఇలా రెడీ అవుతున్నావ్ అంటూ య‌శోధ‌ర్ కామెంట్ చేస్తాడు. ఆట‌ప‌ట్టించ‌డం కోసం మాలిని కూల్ డ్రింక్‌ లో మందు క‌లిపి వేద ఫ్యామిలీని తాగ‌మంటుంది. వేద త‌ల్లి సులోచ‌న అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో తాను హ‌ర్ట్ అయ్యాన‌ని డ్రామా మొద‌లుపెడుతుంది మాలిని. దాంతో వేద ఫ్యామిలీ తాగాల్సి వ‌స్తుంది. Also Read:  'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వ‌నిత‌! ఇక సంగీత్ చిత్ర‌, వ‌సంత్ ల డ్యాన్స్ తో మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే వేదని గిఫ్ట్ తో ప‌డేయాలని మాళవిక నెక్లెస్ తీసుకుని వేద సంగీత్ ఫంక్ష‌న్ కి బ‌య‌లుదేరుతుంది. ఫంక్ష‌న్ హాల్ కి చేరుకున్న మాళ‌విక కంగారులో కార్ లాక్ తో పాటు నెక్లెస్ బాక్స్ తీసుకోవ‌డం మ‌ర్చిపోతుంది. ఈ లోగా కార్ లాక్ అవుతుంది. సెక్యూరిటీతో చెప్పి కార్ డోర్ లాక్ తీయించిన మాళ‌విక వేద కోసం తీసుకొచ్చిన నెక్లెస్ బాక్స్ తీసుకుని ఫంక్ష‌న్ హాల్ లోకి ప్ర‌వేశిస్తుంది. అప్ప‌టికే య‌శోధ‌ర్ వీర‌బిల్డ‌ప్ ఇస్తూ డ్యాన్స్ నేనే అద‌ర‌గొట్టాన‌ని వేద ముందు పోజు కొడుతుంటాడు. Also Read: సంగీత్‌లో య‌ష్ - వేద అడ్డంగా దొరికిపోయారా? ఆ బిల్డ‌ప్ లు చూసి వేద మ‌రీ ఎక్కువైంది అంటూ క‌ళ్ల‌తోనే చెప్పేస్తుంది. ఆ త‌రువాత ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేస్తుండ‌గా ఇంత‌లో సంగీత్ ఫంక్ష‌న్ లోకి మాళ‌విక ఎంట్రీ ఇస్తుంది. య‌ష్ పెళ్లి చేసుకోబోయేది వేద‌నే అని తెలుసుకుని షాక్ అవుతుంది. వెంట‌నే ఆ విష‌యాన్ని అభిమ‌న్యుకి చెబుతుంది. ఆ త‌రువాత య‌ష్ - వేద‌ల పెళ్లిని ఆప‌డానికి అభిమ‌న్యు - మాళ‌విక ఏం చేశారు? .. అందుకు ప్ర‌తిగా య‌ష్ ఎలాంటి ప్లాన్ వేశాడన్న‌ది ఈ రోజు చూడాల్సిందే.   

'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వ‌నిత‌!

  వివాదాస్ప‌ద‌ త‌మిళ న‌టి వ‌నితా విజ‌య్‌కుమార్ బిగ్ బాస్ అల్టిమేట్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆ షోకు సంబంధించి మోస్ట్ ప్రామిసింగ్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా భావించిన ఆమె హ‌ఠాత్తుగా బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. హాట్‌స్టార్ రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో తాను షో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని అనుకుంటున్న‌ట్లు క‌న్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది వ‌నిత‌. అంత‌కు ముందు క‌న్ఫెష‌న్ రూమ్ డోర్స్ తెర‌వ‌మ‌ని బిగ్ బాస్‌ను గ‌ట్టిగా అరుస్తూ క‌నిపించిందామె. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక‌పోయిన ఆమె బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని డిసైడ్ చేసుకుంది. మ‌న‌సులో అనుకున్న‌దే బ‌య‌ట‌కు చెప్పే మ‌నిషిగా వ‌నిత పేరు తెచ్చుకుంది. ఇది బిగ్ బాస్ త‌మిళ్ షోలో పాల్గొన్న‌ప్పుడు తోటి కంటెస్టెంట్లు వ‌నిత‌ది డామినేటింగ్ క్యారెక్ట‌ర్ అనీ, ఇత‌రుల‌కు ఆర్డ‌ర్లు వేస్తుంటుంద‌నీ చెప్పారు. అయితే త‌న‌లోనూ సున్నిత‌మైన హృద‌యం ఉంద‌ని ఓ సంద‌ర్భంలో ఆమె తెలియ‌జేసింది కూడా. ప్ర‌స్తుతం వ‌నిత బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ అయిన బిగ్ బాస్ అల్టిమేట్ కంటెస్టెంట్ల‌లో ఒక‌రుగా ఉన్నారు. ఏంజెల్స్ అండ్ డెమ‌న్స్ అనే టాస్క్ సంద‌ర్భంగా వ‌నిత తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యింది. అప్పుడే క‌న్ఫెష‌న్ రూమ్ డోర్స్ తెర‌వ‌మ‌ని బిగ్ బాస్‌ని అడిగింది. లోప‌ల‌కు ర‌మ్మ‌న‌మ‌ని పిలిచిన‌ప్పుడు, ఆ టాస్క్‌పై ఫిర్యాదు చేసిన ఆమె, ఆ షో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు తెలిపింది. త‌న మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు చెప్పింది వ‌నిత‌. ఆమె నిర్ణ‌యం ఫైన‌లేనా అని బిగ్ బాస్ మ‌రోసారి అడ‌గ‌గా, అవునంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్‌లో తొలి సీజ‌న్‌గా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ అల్టిమేట్ రోజుకు 24 గంట‌ల పాటు ప్ర‌సార‌మ‌వుతోంది. మొద‌ట ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్‌గా లోకేశ్ క‌న‌క‌రాజ్ డైరెక్ట్ చేస్తోన్న‌ 'విక్ర‌మ్' మూవీ షూటింగ్ నిమిత్తం ఆ షో నుంచి త‌ప్పుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన బిగ్ బాస్ త‌మిళ 5 సీజ‌న్ల నుంచి 14 మంది కంటెస్టెంట్ల‌ను ఎంచుకొని, వారితో బిగ్ బాస్ అల్టిమేట్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ షోకు కొత్త హోస్ట్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో తేలుతుంది.