డాక్ట‌ర్ బాబు, మోనిత రొమాంటిక్ ట్రీట్‌

మొత్తానికి `కార్తీక దీపం` రూపు రేఖ‌లు మారిపోతున్నాయి. దీప‌, డాక్ట‌ర్ బాబు, మోనిత‌ల పాత్ర‌ల‌కు డైరెక్ట‌ర్ ఎండ్ కార్డ్ వేసేశాడు. ఈ నేప‌థ్యంలో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఈ సీరియ‌ల్ నుంచి వెళ్లిపోయిన దీప‌, డాక్ట‌ర్ బాబు, మోనిత మ‌ళ్లీ కొత్త సీరియ‌ల్ లో క‌నిపిస్తారా? .. అది ఎప్పుడు మొద‌ల‌వుతుంది? ... డాక్ట‌ర్ బాబు - మోనిత ఇద్ద‌రు క‌లిసి చేస్తారా? లేక డాక్ట‌ర్ బాబు, దీప క‌లిసి చేస్తారా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూ డాక్ట‌ర్ బాబు, మోనిత రొమాంటిక్ ట్రీట్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. `కార్తీక దీపం` సీరియ‌ల్ లో వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స‌ర‌దా స‌న్నివేశాలు కానీ , రొమాంటిక్ సీన్ లు కానీ లేవు. అయితే ఆ లోటుని తీర్చేందుకు ఓ రొమాంటిక్ సాంగ్ తో ఈ ఇద్ద‌రు ర‌చ్చ చేశారు. `స్టార్ మా` లో ప్ర‌సారం కానున్న స్పెష‌ల్ ఈవెంట్ కోసం డాక్ట‌ర్ బాబు, మోనిత క‌లిసి రొమాంటిక్ సాంగ్ ల‌కు డ్యాన్స్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. `స్టార్ మా లో `క‌ల‌ర్స్ ఆఫ్ రొమాన్స్.. త‌గ్గేదేలే` అంటూ ప్ర‌త్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఇందులో డాక్ట‌ర్ బాబు, మోనిత రొమాన్స్ చేస్తూ రొమాంటిక్ పాట‌ల‌కు స్టెప్పులేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. డాక్ట‌ర్ బాబు మోనిత‌ని ఎత్తుకుని క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూస్తూ అలా ఉండిపోవ‌డంతో.. 'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' ఫేమ్ అమ‌ర్ దీప్ ఈ జంట‌పై అదిరిపోయే సెటైర్ వేశాడు. "ఆ కంఫ‌ర్ట్ లెవెల్.." అంటూ కామెంట్ చేశాడు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న యాంక‌ర్ ర‌వి మ‌రింత‌గా రెచ్చిపోయి డాక్ట‌ర్ బాబు.. మోనిత‌పై ఎక్క‌డ చేయి వేశాడో .. న‌డుముపై ఏ విధంగా ప‌ట్టుకున్నాడో.. అంటూ వ‌ర్ణించ‌డం మొద‌లు పెట్టాడు. తాజాగా విడుద‌లైన ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో `కార్తీక దీపం` ల‌వ‌ర్స్ ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 20న రాత్రి 6 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కానుంది.

సుడిగాలి సుధీర్ స‌ర‌సం మ‌రీ ఎక్కువైంద‌న్న ర‌ష్మీ

బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ గౌత‌మ్ ల‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స్టేజ్ పై ఇద్ద‌రు క‌లిశారంటే ఆ కెమిస్ట్రీ చూడ‌ముచ్చ‌ట‌గా వుంటుందంటారంతా. ఈ ఇద్ద‌రు జ‌బ‌ర్ద‌స్త్ షోతో మ‌రింత‌గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. వీరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని చూడ‌ని వారులేరు. చివ‌రికి ప్రొడ్యూస‌ర్స్ కూడా వీరిద్ద‌రితో సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి చివ‌రికి విఫ‌ల‌మ‌య్యారు. ర‌ష్మి అంగీక‌రించ‌కపోవ‌డంతో సినిమా కార్య‌రూపం దాల్చ‌లేదు. వీరిద్ద‌రు బుల్లితెర‌పై ఏ షో చేసినా అది సూప‌ర్ హిట్టే.. అంత‌లా ఈ జోడీ పాపులారిటీని సొంతం చేసుకుంది. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రు క‌లిసి షోలు చేయ‌డం లేదు. తాజాగా ఈ ఇద్ద‌రు స్టార్ మా ఛాన‌ల్ ఏర్పాటు చేసిన స్పెష‌ల్ షోలో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ నెల 20న ప్ర‌త్యేకంగా ఓ స్పెష‌ల్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది స్టార్ మా. ఈ షోలో సుడిగాలి సుధీర్ , ర‌ష్మీ గౌత‌మ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. చాలా కాలం త‌రువాత జంట‌గా క‌నిపించ‌డంతో అక్క‌డున్న వారంతా ఈ జోడీ క‌నిపించ‌గానే ఆరుపులు కేక‌ల‌తో ర‌చ్చ చేశారు. ఇదే అద‌నుగా అనుకున్న సుడిగాలి సుధీర్ .. మ‌రో సారి ర‌ష్మీ గౌత‌మ్ ని ఇంప్రెస్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ర‌ష్మీని ఐస్ చేస్తూ పాట‌లు అందుకున్నాడు. చురాలియా.. అంటూ ఓ పాటేసుకున్నాడు. మ‌ధ్య‌లో దూరిన యాంక‌ర్ ర‌వి సుధీర్ - ర‌ష్మీల మ‌ధ్య వున్న బంధాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్రం చేశాడు. ఛాన్స్ ఇస్తే ర‌ష్మీ.. సుధీర్ కు ఏం ఇవ్వాల‌నుకుంటుంది? అని ర‌ష్మిని ర‌వి అడిగేశాడు. సుధీర్ ని చూస్తూ `ఇచ్చేయ‌మంటావా? అంది ర‌ష్మీ.. కెమెరా ముందు ఇచ్చేదేనా..? అని సుధీర్ కొంటెగా చెప్ప‌డంతో. ర‌ష్మీ .. సుధీర్ ని ఒక్క‌టేసి నీకు స‌ర‌సాలు ఎక్కువ‌య్యాయి అంటూ కౌంట‌రిచ్చింది. ఆ వెంట‌నే యాంక‌ర్ ర‌వి మ‌ధ్య‌లో దూరి .. ర‌ష్మీ ఫోన్ లో సుధీర్ నంబ‌ర్ ఏ పేరుతో వుంట‌ది? అని అడిగేశాడు. దీనికి స‌మాధానం దాట‌వేసిన ర‌ష్మీ న‌వ్వుల్లో మునిగిపోయింది. ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.  

`కార్తీక‌దీపం` నుంచి ఒక్కొక్క‌రు ఔట్‌

కార్తీక్, దీపల పాత్ర‌ల‌ని చంపేసి అర్ధంత‌రంగా వాళ్ల క‌థ‌కు ముంగింపు ప‌ల‌క‌డాన్ని ప్రేక్ష‌కులు, అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. వాళ్లు లేని 'కార్తీక దీపం' కొన‌సాగ‌డం క‌ష్ట‌మే అంటూ మ‌హిళా ప్రేక్ష‌కులు ఇప్ప‌టికే పెద‌వి విరుస్తూ ద‌ర్శ‌కుడిపై మండి ప‌డుతున్నారు. 1300 ఎపిసోడ్స్ విజ‌య‌వంతంగా న‌డిచిన‌ ఈ సీరియ‌ల్ జాతీయ స్థాయిలో టీవీ సీరియ‌ల్స్ లోనే టాప్ రేటింగ్ తో రికార్డుని సృష్టించింది. ఆ స్థాయిలో ఈ సీరియ‌ల్ కి ఆద‌ర‌ణ ద‌క్క‌డానికి ప్ర‌ధాన కార‌ణం డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌లే. క‌థ‌లో వాళ్లే లేక‌పోతే సీరియ‌ల్ కు ఇంత క్రేజ్ వ‌చ్చేది కాదు.. ఈ రేంజ్ లో వైర‌ల్ అయ్యేదీ కాదు. కానీ ద‌ర్శ‌కుడు నీర‌సంగా మారిన సీరియ‌ల్ ని కొత్త దారి ప‌ట్టిస్తున్నాన‌ని, నెక్స్ట్ జ‌న‌రేష‌న్ క‌థ అంటూ ద‌ర్శ‌కుడు కొత్త క‌థ‌లు వినిపించ‌డాన్ని జ‌నం త‌ప్పుప‌డుతున్నారు. ఇదిలా వుంటే ద‌ర్శ‌కుడు ఆడియ‌న్స్ కు మ‌రో షాక్ ఇచ్చేశాడు. ఈ సీరియ‌ల్ నుంచి హిమ‌, శౌర్య‌ని కూడా తీసేస్తున్నాడు. వీళ్ల పాత్ర‌ల‌ని పెద్దవాళ్లుగా చేయ‌డంతో ఆ స్థానంలో ఇత‌ర న‌టుల్ని రంగంలోకి దించేస్తున్నారు. వీళ్ల స్థానంలో ఇద్ద‌రు యంగ్ బ్యూటీస్ ని దించేస్తున్నాడు. వీళ్ల‌కు జోడీలుగా ఇద్ద‌రు యంగ్ టాలెంటెడ్ యాక్ట‌ర్స్ ని ఎంపిక చేసేశాడు. Also Read: శౌర్య‌ కార‌ణంగా అనాథ‌గా మారిన హిమ‌! అందులో ఇప్ప‌టికే బిగ్ బాస్ ఫేమ్ మాన‌స్ ని ఎంపిక చేశాడు. త్వ‌ర‌లోనే మాన‌స్ తో షూటింగ్ చేయ‌బోతున్నాడ‌ట‌. "దీప‌, కార్తీక్ దంప‌తులు వ‌దిలి వెళ్లిన జ్ఞాప‌కాలు మ‌న‌తోనే వున్నాయి. కొత్త త‌రం వేస్తున్న తొలి అడుగులతో స‌రికొత్త వాగ్దానంతో దివ్య‌కాంతులు విర‌జిమ్మ‌బోతోంది కార్తీక దీపం" అంటూ నెక్స్ట్ జ‌న‌రేష‌న్ క‌థ‌కి లీడ్ వ‌దిలారు ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర‌. దీంతో హిమ‌, శౌర్య‌ల పాత్ర‌ల‌తోనే `కార్తీక దీపం`ని ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర ముందుకు న‌డిపించ‌బోతున్నాన‌ని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ సీరియ‌ల్ రానున్న రోజుల్లో ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో అని అంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

వ‌ర్ష‌ అమ్మాయి కాద‌న్న ఇమ్మాన్యుయేల్‌.. వాకౌట్ చేసిన వ‌ర్ష‌!

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోల్లో ఎవ‌రు జంట‌గా క‌నిపించినా పాపుల‌ర్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్.. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల కార‌ణంగా పాపులారిటీని సొంతం చేసుకుని సెల‌బ్రిటీలుగా మారిపోయారు. తాజాగా మ‌రో జంట గ‌త కొంత కాలంగా ఈ షోలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ జంట. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుద‌ర‌డంతో నిర్వాహ‌కులు వీరిని జంట‌గా ఫిక్స్ చేసి ఆ క్రేజ్ ని వాడుకుంటున్నారు. గ‌త కొంత కాలంగా వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్‌ జంట జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌తో పాటు శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షోలోనూ ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ వీరి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. ఇద్దరూ క‌లిసి స్కిట్ లు చేయ‌డం లేదు. వ‌ర్ష మ‌రో క‌మెడియ‌న్ బుల్లెట్ భాస్క‌ర్‌ తో క‌లిసి స్కిట్ లు చేస్తూ వ‌స్తోంది. తాజాగా వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తారా స్థాయికి చేరిన‌ట్టుగా బ‌య‌ట‌ప‌డింది. వ‌ర్ష అస‌లు అమ్మాయే కాదంటూ తాజాగా ఇమ్మాన్యుయేల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. వ‌ర్ష‌పై ఇమ్మాన్యుయేల్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వ‌ర్ష‌ని అమ్మాయి కాదంటూ కామెంట్ చేయ‌డంతో షో నుంచి వ‌ర్ష అర్ధంత‌రంగా బ‌య‌టికి వెళ్లిపోయింది. ఇమ్మాన్యుయేల్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డిందంటూ వ‌ర్ష క‌న్నీళ్లు పెట్టుకుంటూ షో నుంచి బ‌య‌టికి వెళ్లిపోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. `ఈటీవీ` కోసం చేసిన స్పెష‌ల్ షో `రంగ్ దే` ఈ వెంట్ లో తాజా సంఘ‌ట‌న చోటు చేసుకుంది. హోలీ ఫెస్టివెల్ సంద‌ర్భంగా మ‌ల్లెమాల వారు ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ఇమ్మాన్యుయేల్ కార‌ణంగా ర‌సాభాస‌గా మార‌డం గ‌మ‌నార్హం.

శౌర్య‌ కార‌ణంగా అనాథ‌గా మారిన హిమ‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా రేటింగ్ ప‌రంగా, వీక్ష‌కాద‌ర‌ణ ప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సీరియ‌ల్ కి తాజాగా డైరెక్ట‌ర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. వీక్ష‌కుల‌కు భారీ షాకిచ్చాడు. ఉన్న‌ట్టుండి డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌ని చంపేశాడు. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్పుడు డైరెక్ట‌ర్ ని తిట్ట‌డం మొద‌లుపెట్టారు. గ‌తి త‌ప్పిన సీరియ‌ల్ ని గాడిలో పెట్టాలి కానీ మొత్తానికే చంపేస్తావా? అంటూ డైరెక్ట‌ర్ పై కామెంట్ లు చేస్తున్నారు. Also Read: సామ్ తో మైత్రీ వారి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్! ఇక హిమ అతి కార‌ణంగా కార్ యాక్సిడెంట్ లో డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌లు చ‌నిపోతారు. గ‌త కొన్ని రోజులుగా దీనిపై ప్రోమోల్లో హింట్ లు ఇస్తూ వ‌చ్చిన ద‌ర్శ‌కుడు చివ‌రికి త‌ను అనుకున్న‌ట్టుగానే డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌కు `కార్తీక‌దీపం` సీరియ‌ల్ లో ఎండ్ కార్డ్ వేసేశాడు. ఈ ఇద్ద‌రూ చ‌నిపోవ‌డంతో సౌంద‌ర్య ఇంట్లో విషాదం అలుముకుంటుంది. చంద్ర‌మ్మ - ఇంద్రుడు వ‌ద్ద‌ స్పృహ‌లోకి వ‌చ్చిన హిమ త‌న‌ని హైద‌రాబాద్ తీసుకెళ్ల‌మ‌ని ఏడుస్తుంది. క‌ట్ చేస్తే హిమ ప‌చ్చ బొట్టుని తీసేయాల‌ని అరుస్తూ శౌర్య నీళ్ల‌తో క‌డుగుతూ వుంటుంది. అది గ‌మ‌నించిన సౌంద‌ర్య ఫ్యామిలీ బాధ‌ప‌డుతుంటారు. ఇంత‌లో అక్క‌డికి వార‌ణాసి బ‌స్తీవాసుల‌తో క‌లిసి వ‌స్తాడు. హిమ‌ని క్ష‌మించ‌న‌ని శౌర్య అన‌గా, పాపం హిమ అంటూ వార‌ణాసి మాట్లాడుతుంటే ఆపు వార‌ణాసి అంటూ అరుస్తుంది శౌర్య‌. త‌నే అమ్మా నాన్న‌ల‌ని చంపేసింద‌ని బోరుమంటుంది. ఇక మాకు దిక్కెవ్వ‌ర‌ని బ‌స్తీవాసులు సౌంద‌ర్య‌తో మొర‌పెట్టుకుంటారు. మీకు మేమున్నామ‌ని సౌంద‌ర్య ఓదారుస్తుంది. క‌ట్ చేస్తే హిమ‌ని హైద‌రాబాద్ తీసుకురావ‌డానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో చంద్ర‌మ్మ‌, ఇంద్రుడు క‌లిసి మ‌ళ్లీ ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర డ‌బ్బులు కొట్టేస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? హిమ మ‌ళ్లీ ఇంటికి చేరిందా? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి నవ్వుతూ వెళ్లిపోయిన శ్రీ రాపాక

బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షోలో రెండో ఎలిమినేషన్ పూర్తయింది. మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయింది. అయితే శ్రీ రాపాక నవ్వుతూ హౌస్ నుంచి బయటకు రావడం విశేషం. రెండో వారం ఎలిమినేషన్ కి ఏకంగా 11 మంది నామినేట్ అయ్యారు. ఎప్పటిలాగే ఆదివారం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున పలు టాస్క్ లు ఆడించి డేంజర్ జోన్ లో మిత్రా శర్మ, శ్రీరాపాక, నటరాజ్ మాస్టర్ ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత ముగ్గురికి ఎగ్స్ టాస్క్ ఇచ్చి గేమ్ ఆడించగా ఆ టాస్క్ లో మిత్రా సేఫ్ అయింది. ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక నామినేషన్ లో మిగిలి ఉండగా.. శ్రీరాపాక ఎలిమినేట్ అయింది.  శ్రీరాపాక ఎలిమినేట్ కానుందని ముందు నుంచే వార్తలొచ్చాయి. అనుకున్నట్లే ఆమెనే ఎలిమినేట్ అయింది. అయితే ఆమె అసలు ఏ మాత్రం బాధ పడకుండా నవ్వుతూ హౌస్ నుండి బయటకు వెళ్లడం ఆశ్చర్యపరిచింది.

అమ్మానాన్న‌ల చావుకు హిమే కార‌ణ‌మంటూ ఏడ్చిన శౌర్య‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకుంటూ టాప్ రేటింగ్ తో రికార్డులు సృష్టించిన‌ ఈ సీరియ‌ల్ వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఎప్పుడైతే డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క క‌లిసారో అప్ప‌టి నుంచి ఈ సీరియ‌ల్ గ‌తి త‌ప్పింది. అన‌వ‌స‌ర‌మైన సాగ‌దీత ధోర‌ణిలో సాగుతూ వీక్ష‌కుల్ని చిరాకు పెట్టిస్తూ చివ‌రికి రేటింగ్ ప‌డిపోయింది. దీంతో ద‌ర్శ‌కుడు సీరియ‌ల్ ని కొత్త మ‌లుపు తిప్పాల‌ని ఏకంగా కీల‌క పాత్ర‌ధారులైన డాక్ట‌ర్ బాబు, దీప పాత్ర‌ల‌ని చంపేశాడు. హిమ అతి చేష్ట‌ల కార‌ణంగా డాక్ట‌ర్ బాబు, దీప కారు ప్ర‌మాదంలో లోయ‌లో ప‌డిపోయి మ‌ర‌ణిస్తారు. విష‌యం తెలిసి సౌంద‌ర్య‌, ఆనంద‌రావు భోరున విల‌పిస్తారు. కార్తీక్‌, దీప‌, హిమ ఫొటోల‌కి దండ‌లు వేసి విచారంగా ఏడుస్తుంటారు. ఇంత‌లో వైట్ చీర‌లో వ‌చ్చిన మోనిత `నేను చ‌చ్చేంత వ‌ర‌కు కార్తీక్ ప్రేమ నాతోనే వుంటుంది. కార్తీక్ నాతో వుంటే గుండెల్లో వుండేవాడు.. కానీ దీప‌తో ఉన్నాడు కాబ‌ట్టే ఫొటోలో వున్నాడు` అని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే ఇంద్రుడు, చంద్ర‌మ్మ మెడిసిన్ కు డ‌బ్బులు లేక దొంగ‌త‌నం చేస్తారు. ఇదే స‌మ‌యంలో సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల ముందు అరుస్తూ శౌర్య‌.. హిమ‌కు సంబంధించిన వ‌స్తువుల‌న్నింటినీ విసిరికొడుతూ "దాని వ‌ల్లే అమ్మా నాన్న‌లు చ‌నిపోయారు. అదే చంపేసింది. న‌న్ను అనాథ‌ని చేసింది." అంటూ గ‌ట్టిగా ఏడుస్తుంది. దీంతో సౌంద‌ర్య "అది కాదు రౌడీ" అని పిల‌వ‌గానే "ఆ శౌర్య ఎప్పుడో చ‌చ్చిపోయింది" అంటూ ఏడుస్తుంది. అంతే కాకుండా "అమ్మానాన్న‌ల చావుకు కార‌ణ‌మైన హిమ ఎక్క‌డో ఒక‌చోట బ‌తికే వుంటుంది" అంటుంది. క‌ట్ చేస్తే ఇంద్రుడు, చంద్ర‌మ్మ ఇంట్లో వున్న హిమ స్పృహ‌లోకి వ‌స్తుంది. "నేను ఇక్క‌డికి ఎలా వ‌చ్చాను?" అని అడుగుతుంది. హిమ మ‌ళ్లీ ఇంటికి వెళ్లిందా?.. శౌర్య రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

అభిమ‌న్యుని అడ్డంగా బుక్ చేసిన ఖుషీ.... య‌ష్‌, వేద హ్యాపీ

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌లబంధం`. గ‌త కొన్ని వారాల క్రిత‌మే మొద‌లైన ఈ సీరియ‌ల్ `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోంది? .. క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది ఒక సారి చూద్దాం. కోర్టులో నువ్వు ఎవ‌రి ద‌గ్గ‌ర వుండాల‌ని కోరుకుంటున్నావ‌ని జ‌డ్జి అడిగితే ఖుషీ త‌ను మాళ‌విక అమ్మ తో వుంటాన‌ని చెబుతుంది. ఖుషీ నుంచి ఊహించ‌ని స‌మాధానం రావ‌డంతో య‌ష్‌, వేద షాక్ కు గుర‌వుతారు. ఏంటీ ఇలా జ‌రిగింద‌ని మ‌ద‌న ప‌డుతుంటారు. ఖుషీ త‌న‌కు ద‌క్క‌లేద‌ని బాధ‌ప‌డుతూ వుంటుంది వేద‌.   ఇదే విష‌యాన్ని త‌ల్లి సులోచ‌న‌కు ఫోన్ చేసి చెబుతుంది.. విష‌యం తెలిసి సులోచ‌న ఎమోష‌న‌ల్ అవుతుంది. ఇక కోర్టు విరామ స‌మ‌యంలో య‌ష్ - వేద‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. పెళ్లి చేసుకుని లాభం లేద‌ని ఇద్ద‌రూ నిట్టూరుస్తారు. ఇదిలా వుంటే ఒంట‌రిగా ఏడుస్తున్న ఖుషీ వ‌ద్ద‌కు జ‌డ్జి వ‌చ్చి కూర్చుంటుంది. ఖుషీ బాధ‌ప‌డుతున్న తీరు గ‌మ‌నించి ఏం జ‌రిగింది? అంటూ ఆరాతీస్తుంది. త‌న‌కు ఎవ‌రంటే ఇష్ట‌మో ఆరాతీస్తుంది. దీంతో త‌న‌కు వేద అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన ఖుషీ త‌న‌ని ఎవ‌రు బెదిరించి అలా చెప్పించారో బ‌య‌ట‌పెట్టి అభిమ‌న్యుని అడ్డంగా బుక్ చేస్తుంది. విష‌యం మొత్తం అర్థం కావ‌డంతో మ‌ళ్లీ కోర్టు సెష‌న్ మొద‌ల‌వ‌గానే జ‌డ్జి.. అభిమ‌న్యు, మాళ‌విక‌ల‌కు దిమ్మ‌దిరిగే షాకిస్తుంది. ఖుషీ కోరుకున్న అమ్మ ఎవ‌రో కాద‌ని, అమె కొత్త అమ్మ వేద‌శ్విని అని చెప్పి షాకిస్తుంది. దీంతో అభిమ‌న్యు అభ్యంత‌రం చెబుతాడు. త‌ప్పుడు తీర్పు ఇస్తున్నార‌ని వాదిస్తాడు. దీంతో సీరియ‌స్ అయిన జ‌డ్జి ఖుషీని బోనులోకి పిలిచి త‌న‌ని ఎవ‌రు బెదిరించారో ధైర్యంగా చెప్ప‌మంటుంది. జ‌రిగిన విష‌యం చెప్ప‌డంతో అభిమ‌న్యు షాక‌వుతాడు. త‌న‌ని అభిమ‌న్యు బ‌య‌టికి తీసుకెళ్లి బెదిరించాడ‌ని, అందుకే తాను మాళ‌విక అమ్మ గురించి చెప్పాన‌ని, త‌న‌కు వేద అమ్మ కావాల‌ని, త‌న‌కే న‌న్ను అప్ప‌గించండ‌ని ఖుషీ బోరుమంటుంది. దీంతో జ‌డ్జి ఖుషీ క‌స్ట‌డీని వేద‌కు అప్ప‌గిస్తూ తీర్పు చెప్ప‌డంతో వేద ఆనందంతో ఖుషీని హ‌త్తుకుని సంబర‌ప‌డుతుంది. క‌ట్ చేస్తే కోర్టు బ‌య‌ట అభిమ‌న్యు, మాళ‌విక నీవ‌ల్లే కేసు ఓడిపోయామంటే నీ వ‌ల్లే ఓడిపోయామంటూ గొడ‌వ‌ప‌డుతుంటారు. అది గ‌మ‌నించిన య‌ష్ ఇద్ద‌రి మ‌ధ్య‌న చేరి వినోదం చూస్తాడు. ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రికి గ‌ట్టి క్లాస్ ఇస్తాడు. ఇదేరా నేను చూడాల‌నుకుంది అంటూ అభిమ‌న్యుని గ్రామ‌సింహంతో పోలుస్తాడు. అవ‌మానం త‌ట్టుకోలేని అభిమ‌న్యు ఏం చేయాలో అర్థం కాని అయోమ‌య స్థితిలోకి వెళ్లిపోతాడు. ఇంత‌కీ ఖుషీని అభిమ‌న్యు , మాళ‌విక ... య‌ష్ కు అప్ప‌గించారా? .. ఏం జ‌రగ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

స‌ర‌యుపై దాడి చేసిన వ‌ర్మ హీరోయిన్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో ఇటీవ‌ల మొద‌లైన విష‌యం తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షో.. బిగ్‌బాస్ టెలివిజ‌న్ షోని మించి ప‌రాకాష్ట‌కు చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది. టెలివిజ‌న్ ఎపిసోడ్ కి మించి కంటెస్టెంట్ లు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. కులాల ర‌చ్చ‌.. ఒక‌రిని ఒక‌రు కొట్టుకోవ‌డం.. చెప్ప‌డానికి వీలు కాని భాష‌లో తిట్టుకోవ‌డం వంటివి చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ తో ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అటు వారియ‌ర్స్ , ఇటు ఛాలెంజ‌ర్స్ త‌గ్గేదిలే అన్న‌టుగా ఆడుతున్నారు. గాయాల‌వుతున్నా ప‌ట్టించుకోకుండా వీర విహారం చేస్తున్నారు. కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ మొద‌టి లెవెల్ లో వారియ‌ర్స్ స్మ‌గ్ల‌ర్లుగా, ఛాలెంజ‌ర్స్ పోలీసుల్లా మార‌గా రెండో లెవెల్ లో వారి పాత్ర‌లు తారుమార‌య్యాయి. దీంతో వారియ‌ర్స్ కు చుక్క‌లు చూపించారు ఛాలెంజ‌ర్స్. ఈ సారి ఎలాగైనా గేమ్ గెల‌వాల‌ని అందుకు బ‌లంగా పోటీలోకి దిగిన వీరు మాస్ట‌ర్ ప్లాన్ వేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇదే గేమ్ లో ర‌స‌వ‌త్త‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇదే గేమ్ లో ముందు గాయాల‌పాలైన శ్రీ‌రాపాక త‌న ప్ర‌తీకారాన్ని తీర్చుకుంది. త‌న‌ని ఎవ‌రైతే గాయ‌ప‌రిచారో మ‌ళ్లీ వాళ్ల‌నే గాయ‌ప‌రిచి షాకిచ్చింది. శ్రీ రాపాక త‌న‌ని గాయ‌ప‌రిచిన స‌ర‌యుని తాజాగా గాయ‌ప‌రిచి త‌న పంతం నెగ్గించుకుంది. దీంతో షాక్ కు గురైన అఖిల్ వెంట‌నే శ్రీ రాపాక‌పై సీరియ‌స్ అయ్యాడు. ఏం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అంటూ ఫైర్ అయ్యాడు. ఇక స్విమ్మింగ్ పూల్ లో దూకేసిన స్ర‌వంతి ... స‌ర‌యుపై సీరియ‌స్ కావ‌డం కొస‌మెరుపు.   

ఆర్య‌వ‌ర్థ‌న్ ఉచ్చులో రాగ‌సుధ చిక్కిన‌ట్టేనా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తోంది. థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో సాగే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష హెచ్.కె. ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. రామ్ జ‌గ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్, జ్యోతిరెడ్డి, అనూషా సంతోష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త జ‌న్మ ప్ర‌తీకారం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. త‌న నుంచి త‌ప్పించుకున్న రాగ‌సుధ కోసం ఆర్య‌వ‌ర్థ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడు. ఎమ్మెల్యే క‌బ్జా చేసిన పెద్ద‌మ్మ త‌ల్లిని అత‌ని నుంచి విడిపించి మ‌ళ్లీ బ‌స్తీ వాసుల‌కు అప్ప‌గించిన ఆర్య.. తిరిగి పాత ఇంటికి రావాల‌ని, అక్క‌డే వుండాల‌ని అను తండ్రి సుబ్బుకు ష‌ర‌తు విధిస్తాడు. ఆ మాట కోసం సుబ్బు త‌న భార్య‌తో క‌లిసి పాత ఇంటికి వ‌చ్చేస్తాడు. త‌న‌తో క‌లిసి రాగ‌సుధ కూడా అదే ఇంటికి వ‌చ్చేస్తుంది. ఇక్క‌డే రాగ‌సుధ‌ని లాక్ చేయాల‌ని ప్లాన్ చేసిన ఆర్య వ‌ర్ధ‌న్ .. అనుని తీసుకుని సుబ్బు ఇంటికి చేరుకుంటాడు. అక్క‌డ వున్న రాగ‌సుధ‌ని అను గ‌మ‌నిస్తుంది. త‌ను ఆర్య కంటప‌డకుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. అయినా చివ‌రికి రాగ‌సుధ చేతే ఆర్యవ‌ర్థ‌న్ కి కాఫీ ఇప్పించే ప్ర‌య‌త్నం చేస్తాడు సుబ్బు. రాగ‌సుధ త‌న ఫేస్ క‌నిపించ‌కుండా కొంగుతో క‌వ‌ర్ చేసుకున్నా ఆర్య ప‌సిగ‌ట్టేస్తాడు. ఆర్య వ‌ర్థ‌న్ బిగించిన ఉచ్చులో రాగ‌సుధ చిక్కుకుందా? .. ఆర్య వ‌ర్థ‌న్ కు రాగ‌సుధ చిక్క‌కుండా అను ఏం చేసింది? ..ఈ క్ర‌మంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.. సుబ్బు ఇదంతా గ‌మ‌నించాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

న‌ట‌రాజ్ మాస్ట‌ర్ తాట తీసిన బిందుమాధ‌వి

ఓటీటీ వెర్ష‌న్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ గ‌త నెల 26న మొద‌లైన విష‌యం తెలిసిందే. ముమైత్ ఖాన్ రూపంలో ఫ‌స్ట్ వికెట్ ప‌డిపోయింది కూడా. గేమ్ లో కులా ర‌చ్చ కూడా మొద‌లైంది. దీంతో హౌస్ ఒక్క‌సారిగా హీటెక్కింది. యాంక‌ర్ స్ర‌వంతి హ‌ద్దులు దాటి మాట్లాడుతున్న తీరు స‌రికొత్త వివాదానికి దారితీసేలా వుంది. ఇక న‌టి బిందు మాధ‌వి అనూహ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాత‌ కంటెస్టెంట్స్ అఖిల్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, తేజ‌స్వి భ‌య‌ప‌డిపోతున్నారు. అయితే బిందు మాధ‌విని ఢికొట్టే స‌త్తా ఎవ‌రికీ లేక‌పోవ‌డంతో అంతా ఆమెని మాట‌ల‌తో వెన‌క్కి నెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే హౌస్ లో ఆడ‌పులిలా మారిన బిందు మాధ‌విని ఇప్ప‌టికే ఆట ఆడ‌టం మొద‌లుపెట్టింది. ఏకంగా అఖిల్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, తేజ‌స్విల‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. దీంతో ఆమెపై ఈ ముగ్గురు మాట‌ల దాడికి దిగుతున్నారు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా బిందు మాధ‌విపై సెటైర్లు వేస్తున్నారు. అవ‌కాశం కోసం చూస్తున్న బిందు బ‌మాధ‌వి.. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ని అడ్డంగా బుక్ చేసిన ఓ ఆట ఆడేసుకుంది. బుధ‌వారం ఎపిసోడ్ లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కావాల‌నే బిందు మాధ‌విని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసి ప‌ప్పులో కాలేశాడు. వారియ‌ర్స్ కి త‌మ వ‌స‌తులును గెలుచుకునే టాస్క్ లో బాస్కెట్ బాల్ వేసి వారియ‌ర్స్ గెలుచుకున్నారు. అందుకు గానూ వారియ‌ర్స్ బెడ్ రూమ్‌, ల‌గేజ్ వ‌స‌తిలో ఒక దాన్ని తిరిగి పొంద‌వ‌చ్చుని రూల్ బుక్ లో రాసివుంద‌ని న‌ట‌రాజ్ చ‌ద‌వి వినిపించాడు. అక్క‌డే అత‌న్ని బిందు మాధ‌వి లాక్ చేసేసింది. మ‌రో సారి రూల్స్ బుక్ లో ఏం రాసి వుందో చ‌ద‌వ‌మ‌ని చెప్పింది. ఏదో ఒక‌టి మాత్ర‌మే బిగ్‌బాస్ కి చెప్పండ‌ని రూల్ బుక్ లో వుంద‌ని క్లారిటీ ఇచ్చింది. ఈ విష‌యం తెలియ‌ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ బిందు బాద‌విపై సెటైర్లు వేయ‌డం మొద‌లుపెట్టాడు. అంత‌టితో ఆగ‌క వెట‌కారంగా మాట్లాడుతూ బిందుఏ మాధ‌విని చూపిస్తూ శ్రీ‌రాపాక‌కు, తేజ‌స్విల‌కు సైగ చేశాడు. వెంట‌నే గ‌మ‌నించిన బిందు మాధ‌వి `ధైర్యం వుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. పాసింగ్ కామెంట్స్ చేస్తే చాలా చీప్ గా వుంటుంది` అంటూ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. వెన‌క మాట్లాడ‌టం కాదంటూ మాస్ట‌ర్ తాట తీసినంత‌ప‌ని చేసింది.  

వేద - య‌ష్‌ల‌కు షాకిచ్చిన ఖుషీ.. ఏం జ‌రిగింది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని, పిల్ల‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప చుట్టూ తిరిగే క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నాడు. పిల్ల‌లు పుట్ట‌ని ఓ డాక్ట‌ర్‌.. త‌ల్లిదండ్రులు ప‌ట్టించుకోని ఓ పాప‌ మ‌ధ్య ఏర్ప‌డిన ప్రేమబంధం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. య‌శోధ‌ర్‌, వేద‌లు పెళ్లి చేసుకున్నార‌న్న విష‌యం తెలిసి మాళ‌విక షాక్ అవుతుంది. త‌న‌ని న‌మ్మించి మోసం చేశావ‌ని వేద‌పై మాళ‌విక ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఈ క్ర‌మంలో వేద‌పై చేయి చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే వేద ఆ ప్ర‌య‌త్నాన్ని తిప్పికొట్టి మాళ‌విక‌కు గ‌ట్టి షాకిస్తుంది. య‌శోధ‌ర్ నిజ‌స్వ‌రూపం తెలిశాకే ఖుషీని కాపాడుకోవాల‌ని అత‌న్ని పెళ్లి చేసుకున్నాన‌ని  మాళ‌వికకు చెబుతుంది వేద‌. ఇక కోర్టులో ఖుషీని  పిలిచి నువ్వు ఎవ‌రి ద‌గ్గ‌ర వుండాల‌నుకుంటున్నావ‌ని అడిగితే అమ్మ మాళ‌విక ద‌గ్గ‌రే వుంటాన‌ని చెబుతుంది. ఖుషీ నుంచి ఊహించ‌ని స‌మాధానం రావ‌డంతో య‌శోధ‌ర్‌, వేద షాక్ కు గుర‌వుతారు. అభిమ‌న్యు ఇక కేసు గెలిచామ‌ని అనందంతో పొంగిపోతాడు.. య‌ష్ ని వేధించ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆడ‌దాన్ని అడ్డుపెట్టుకుని కూడా కేసు గెల‌వ‌లేక‌పోయావ‌ని య‌శోధ‌ర్ ని అవ‌హేళ‌న చేస్తాడు. య‌ష్ - వేదల‌కు ఏం జ‌రిగిందో.. ఏం జ‌రుగుతోందో అర్థం కాదు. ఖుషీ దూర‌మైపోయింది. ఇక మ‌నం క‌లిసి వుంట‌డంలో అర్థం లేద‌ని అక్క‌డే గొడ‌వడ‌తారు. ఇది చూసిన అభిమ‌న్యు మ‌రింత‌గా రెచ్చిపోతాడు. పిల్ల‌లు క‌న‌లేని ప‌నికిమాలింది నీకు పెళ్లామా? అని య‌ష్ ని నిల‌దీస్తాడు. దీంతో య‌ష్ ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటుంది.. ఖుషీ ఎందుక‌లా మాట్లాడింది? .. అస‌లు ఏం జ‌రిగింది? .. మాళ‌విక, అభిమ‌న్యు .. ఖుషీని ఎలా మార్చారు? ..అది నిజ‌మేనా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

బిగ్‌బాస్ ఓటీటీలో స్ర‌వంతి కులాల ర‌చ్చ‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. దీని కార‌ణంగా రెండు జంట‌లు తీవ్ర ఇబ్బందులుకు ట్రోలింగ్ కు గురైన విష‌యం తెలిసిందే. ఎలాంటి లిమిటేష‌న్స్ లేకుండా వ్య‌క్త‌గ‌త విష‌యాల్లోకి కూడా తొంగిచూసిన బిగ్‌బాస్ షో ఇప్ప‌డు 24 గంట‌ల నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటూ ఓటీటీలో మొద‌లైంది. టెలివిజ‌న్ తో పోలీస్తే అక్క‌డ సెన్సార్ అంత‌గా వుండ‌క‌పోవ‌డంతో కంటెస్టెంట్ లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ప‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇప్పుడు మ‌రో వాద‌న కూడా వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంత వ‌ర‌కు బిగ్ బాస్ లో కులాల ప్ర‌స్థావ‌న వినిపించ‌లేదు కానీ బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో ఏకంగా ఏ కంటెస్టెంట్ కులాల ప్ర‌స్థ‌వన‌కు నాంది ప‌ల‌క‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 17 మంది కంటెస్టెంట్ ల‌తో మొద‌లైన ఓటీటీ బిగ్ బాస్ షో మొత్తానికి అనుకున్న‌ట్టే ముమైత్ ఖాన్ ఎలిమినేష‌న్ తో ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ని పూర్తి చేసింది. ఇక హౌస్ లో వున్న మిగ‌తా కంటెస్టెంట్ లు బ‌య‌టి కంటే హౌస్ లోనే మ‌రింత మోటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. Also Read: ఒకేసారి 20 ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్.. పూనమ్ కౌర్ సంచలన రికార్డ్ ఇందులో స్ర‌వంతి కూడా ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. స‌హ కంటెస్టెంట్ ల‌తో ప‌చ్చిగా మాట్లాడుతూ హౌస్ లో నానా ర‌చ్చ చేస్తోంది. ఎవ‌రు ప‌చ్చిగా మాట్లాడితే వారికి వీడియోలో ఎక్కువ స్కోప్ వుండ‌టంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా వ‌ర‌కు కంటెస్టెంట్ లు ప‌చ్చిగా మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. యాంక‌ర్ స్ర‌వంతి లాంటి వాళ్లైతే వ్య‌క్తిగత విష‌యాల్ని కూడా చెప్ప‌డం, కులాల ప్రస్థావ‌న తీసుకురావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. త‌న రెండో పెళ్లి గురించి చెప్పిన యాంక‌ర్ స్ర‌వంతి మ‌రింత లోతుగానే మాట్లాడి షాకిచ్చింది. అజ‌య్‌, బిందు మాధవిల‌తో కూర్చుని త‌న కులం గురించి ప్ర‌స్థావించింది. పోను పోను స్ర‌వంతి ఇంకా ఎలాంటి హ‌ద్దుల్ని చెరిపేసి ర‌చ్చ చేస్తుందో న‌ని అంతా అనుకుంటున్నారు.

`కార్తీక దీపం` డైరెక్ట‌ర్ కు జ‌నం శాప‌నార్ధాలు

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలం క్రితం టాప్ లో ట్రెండ్ అయిన ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుంది. తెలుగు సీరియ‌ల్స్ ల‌లో టాప్ రేటింగ్ ని సాధించిన ఇండియా వైడ్ గా ట్రెండ్ అయిన ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా గాడి త‌ప్పి అవ‌స్థ‌లు ప‌డుతోంది. సాగ‌దీత ధోర‌ణితో ఎపిసోడ్ ల‌ని డైరెక్ట‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు సాగ‌దీస్తూరు వున్నాడు. దీంతో ఆద‌రించిన వారే ఈ సీరియ‌ల్ పై సెటైర్లు వేయ‌డం మొద‌లైంది. దీంతో టాప్ లో వున్న సీరియ‌ల్ కాస్తా కింద‌ప‌డిపోయింది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క క‌లిస్తే బాగుండు అనుకుంటూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్ట‌ర్ కాపుగంటి రాజేంద్ర అక్క‌డి నుంచే సీరియ‌ల్ ని గాడి త‌ప్పించాడు. దీంతో ఆస‌క్తి పూర్తిగా పోయింది. ఎలా న‌డిపించాలో అర్థం కాక త‌న‌కు తోచిన‌ట్టుగా న‌డిపించ‌డం మొద‌లుపెట్టాడు అదే ఈ సీరియ‌ల్ ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. ఫ్యామిలీకి డాక్ట‌ర్ బాబు, దీప‌ల‌ని దూరం చేసి న‌డిపించిన డైరెక్ట‌ర్ ఆ త‌రువాత మ‌ళ్లీ క‌లిపి ముందుకు సాగించాల‌నుకున్నాడు. అయితే ఆస‌క్తి పోయింది.   Also Read: అత‌డితో మ‌రోసారి నయ‌న్ రొమాన్స్! ఇప్పుడు ఉన్న‌ట్టుండి డాక్ట‌ర్ బాబు, దీప‌, హిమ‌ల క్యారెక్ట‌ర్ ల‌ని ఎండ్ చేసేశాడు. చిక్‌మంగ‌ళూర్ ఎపిసోడ్ అంటూ మొద‌లుపెట్టి అక్క‌డే హిమ అత్యుత్సాహం కార‌ణంగా కారు యాక్సిడెంట్ కి గురికావ‌డం.. ఈ ముగ్గురితో స‌హా లోయ‌లో ప‌డి పేలిపోవ‌డం చూపించారు. క‌ట్ చేస్తే ఈ ముగ్గురి ఫొటోల‌కి దండేయ‌డంతో షాక్ కు గురైన వీక్ష‌కులు, మ‌హిళా ప్రేక్ష‌కులు ఇప్పుడు డైరెక్ట‌ర్ పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ఎంత ప‌ని చేశావు డైరెక్ట‌రూ చివ‌రికి వీళ్ల‌ని చంపేసి సీరియ‌ల్ కి ఎండ్ కార్డ్ వేయాల‌నుకున్నావా? అని శాప‌నార్థాలు పెడుతున్నారు.  ఇది నిజంగా నిజ‌మేన‌ని చూపిస్తాడా? లేక ట్విస్ట్ ఇచ్చి సౌంద‌ర్య డ్రీమ్ గా క‌వ‌ర్ చేస్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ముగ్గురి ఫొటోల‌కు దండేసిన సీన్ చూసిన ప్రేక్ష‌కులు మాత్రం డైరెక్ట‌ర్ పై విరుచుకుప‌డుతున్నారు. ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

ఇది ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే!

మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా మహిళలను ప్రశంసిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. కానీ యాంకర్ అనసూయ మాత్రం 'ఇది ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే' అంటూ సంచలన ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో అనసూయపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. వాటికి ఆమె అంతే ధీటుగా సమాధానం చెప్తుంటుంది. ఉమెన్స్ డే సందర్భంగా ట్రోలర్స్ ని ఎద్దేవా చేస్తూ అనసూయ ఓ ట్వీట్ చేసింది. "సడెన్ గా ట్రోలర్స్, మీమర్స్ ఓ 24 గంటల పాటు మహిళలకు గౌరవం ఇస్తారు. దీనికి మహిళలు దూరంగా ఉండండి. హ్యాపీ ఫూల్స్ డే" అంటూ అనసూయ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  అనసూయ ట్వీట్ ని కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. కేవలం ఒక్కరోజు సోషల్ మీడియాలో మహిళల గురించి గొప్పగా మాట్లాడి, మరుసటి రోజు నుంచి మహిళలపై కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు అంటూ కొందరు అనసూయకి సపోర్ట్ గా మాట్లాడుతుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అనసూయని తప్పుబడుతున్నారు. మదర్ థెరీసా, మేరి కోమ్, కల్పనా చావ్లా వంటి వారిపై ఎవరూ ట్రోల్స్ చేయరని, యాంకర్ సుమని కూడా ఎవరూ ట్రోల్ చేయట్లేదని.. మీ తీరే మీపై ట్రోల్స్ కి కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అను కోసం మాన్సీ చేస్తున్న కుట్ర ఏంటీ?

బుల్లితెర పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా అల‌రిస్తున్న ఈ సీనియ‌ల్ రోజుకో ములుపు తిరుగుతూ ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష‌, విశ్వ‌మోహ‌న్‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, రామ్ జ‌గ‌న్, బెంగ‌ళూరు ప‌ద్మ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త జ‌న్మ ప్ర‌తీకారం అనే థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్ తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. పెద్ద‌మ్మ బస్తీ ని లోక‌ల్ ఎమ్మెల్యే క‌బ్జా చేశాడ‌ని తెలిసి అత‌నికి బుద్ధిచెప్ప‌డానికి రెడీ అవుతాడు ఆర్య వ‌ర్థ‌న్ అయితే తిరిగి ఆ బ‌స్తీలో వున్న సొంత ఇంటికే సుబ్బు తిరిగి రావాల‌ని కండీష‌న్ పెడ‌తాడు ఆర్య‌.. అందుకు సుబ్బు అంగీక‌రించ‌డంతో ఆర్య రంగంలోకి దిగి లోక‌ల్ ఎమ్మెల్యేకు బుద్ధి చెబుతాడు. బస్తీలోకి తిరిగి అను ఫ్యామిలీని తీసుకొస్తాడు ఆర్య‌. అయితే బ‌స్తీవాసుల‌కు ప‌ట్టాలు అంద‌జేసే కార్య‌క్ర‌మాన్ని అను చేతుల మీదుగా జ‌రిగిపిస్తాడు. అక్క‌డ త‌న త‌ల్లి తండ్రులు చెప్పింది విన్న అను పరుగెత్తుకుంటూ వెళ్లి ఆర్య‌ని హ‌గ్ చేసుకుంటుంది. అయితే దీనికి ముందే ఆర్య వ‌ర్థ‌న్ ఇంట్లో మాన్సీ ఆమె త‌ల్లి కొత్త కుట్ర‌కు తెర‌లేపుతారు. ఇంత కాలం క‌నిపించ‌కుండా వున్న మాన్సి త‌ల్లి రంగంలోకి దిగుతుంది. అనుని త‌ల్లి కాకుండా చేయ‌డం కోసం కుట్ర మొదుపెడుతుంది. ఇంట్లో జ‌రుగుతున్న గొడ‌వ‌లు స‌మ‌సి పోవాలంటే ఏం చేయాల‌ని సిద్ధాంతిని ఇంటికి పిలిపించి ఆర్య త‌ల్లి అడుగుతుంది. అంతా ప‌రిశీలించిన సిద్ధాంతి వార‌సుడు పుడితే స‌మ‌స్య‌లన్నీ తొల‌గిపోతాయంటాడు. వెంట‌నే ఆర్య - అనుల‌కు శోభ‌నం జ‌రిపించండ‌ని, ముహూర్తం కూడా పెడ‌తాడు. ఇదంతా చాటుగా గ‌మ‌నించిన మాన్సీ విష‌యాన్ని త‌ల్లికి చేర‌వేస్తుంది. త‌న కంటే ముందు నువ్వే వార‌సుడిని క‌నాల‌ని, అదే స‌మ‌యంలో అనుకు పిల్ల‌లు పుట్ట‌కుండా అడ్డంకులు సృష్టించాలంటుంది. దీంతో మాన్సి అను కోసం కుట్ర చేయ‌డం మొద‌లుపెడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ర‌గిలిపోతున్న అభిమ‌న్యు.. కోర్టులో షాకిచ్చిన వేద‌

బుల్లితెర‌పై ఇటీవ‌లే ప్రారంభ‌మైన సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఓ పాప చుట్టూ ప్ర‌ధానంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది. త‌ల్లి కాలేని ఓ యువ‌తి పాప కోసం ఎలాంటి త్యాగానికి సిద్ద‌ప‌డింది? అన్న ప్ర‌ధాన క‌థాంశంతో ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఖుషీ కోసం య‌ష్ ని పెళ్లాడిన వేద అత్తారింట్లోకి అడుగుపెడుతుంది. త‌న ల‌గేజ్ ని తీసుకుని య‌ష్ రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఏంటీ నా రూమ్ లోకి వ‌చ్చావ్ అంటాడు య‌ష్‌..ఖుషీ కోస‌మే ఇదంతా అని చెబుతుంది వేద‌. య‌ష్ నైస్ గా మాట్లాడ‌టాన్ని గ‌మ‌నించిన వేద వెంట‌నే మాట‌లు క‌లిపి ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకుంటే కుద‌ర‌దు అంటుంది వేద‌.. వెంట‌నే నేను నీకు ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకోవ‌డం ఏంటీ? అంటాడు య‌ష్‌.. క‌ట్ చేస్తే .. య‌ష్ - వేద‌ల‌కు పెళ్లి జ‌ర‌గ‌డంతో ఖుషీ ఆనందిస్తుంటుంది. పాప ఆనందాన్ని చూసి అభిమ‌న్యు ర‌గిలిపోతుంటాడు. అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకో అని మాళివిక‌తో చెబుతాడు. అభిమ‌న్యు అడ‌గ్గానే ఖుషీ ద‌గ్గ‌రికి వెళ్లి `పెళ్లి బాగా జ‌రిగిందా? అని అడుగుతుంది మాళ‌విక‌. తేదు అంతా ఏడుస్తున్నార‌ని చెబుతుంది ఖుషీ. ఈ మాట‌లు విన్న మాళ‌విక ఇంకా ఇంకా కుళ్లి కుళ్లి ఏడ‌వాళి వాళ్లు అని మ‌న‌సులో అనుకుంటుంది. క‌ట్ చేస్తే .. కోర్టులో య‌ష్ భార్య‌గా వేద ఎంట్రీ ఇవ్వ‌డం చూసి మాళ‌విక‌, అభిమ‌న్యు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌వుతారు. య‌ష్ ప‌క్క‌న కూర్చున్న వేద మెడ‌లో తాళిని చూసి మాళ‌విక మ‌రింత‌గా కంగారుప‌డుతుంది. హియ‌రింగ్ గ్యాప్ లో వేద‌ని బ‌య‌టికి తీసుకొచ్చి ఏంటీ నువ్వు చేసిన ప‌ని అంటూ మాళ‌విక నిల‌దీస్తుంది. ఖుషీని కాపాడుకోవాల‌ని అనే ప‌ట్టుద‌ల అని చెబుతుంది వేద‌. ఈ మాట‌ల‌కు ఆగ్ర‌హించిన మాళ‌విక నువ్వు న‌న్ను వెన్ను పోటు పొడిచావ్ అంటూ వేద పై కి చేయి ఎత్తుతుంది. వెంట‌నే మాళిని చేయి అందుకున్న వేద ఉరిమి చూస్తుంది... ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌ర‌గ‌బోతోంది? క‌థ ఎలాంటి మ‌లుపులు  

 అనుని స‌ర్ ప్రైజ్ చేసిన ఆర్య వ‌ర్థ‌న్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ధారావాహిక `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతూ వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్రేమ‌, ప‌గ, ప్ర‌తీకారం నేప‌థ్యంలో థ్రిల్లింగ్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగుతూ ట్విస్ట్ ల‌తో స‌ర్ ప్రైజ్ చేస్తున్న `ప్రేమ ఎంత మ‌ధురం` సోమ‌వారం ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోందో ఒక‌సారి చూద్దాం. ఆర్య వ‌ర్థ‌న్ - జెండేల ప్లాన్ పసిగ‌ట్టిన రాగ‌సుధ త‌న‌ని, వ‌శిష్ట‌ని వారి నుంచి కాపాడుకుని సుబ్బు ఇంటి నుంచి పారిపోతుంది. ఊహించ‌ని ప‌రిణామానికి ఆర్య వ‌ర్థ‌న్ - జెండేలు షాక్ కు గుర‌వుతారు. క‌ట్ చేస్తే పెద్ద‌మ్మ బ‌స్తీలో లోక‌ల్ ఎమ్మెల్యే అనుచ‌రులు వీరంగం సృష్టిస్తారు. అడ్డు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రిని చిత‌క‌బాది బ‌స్తీని క‌బ్జా చేశామ‌ని, అంతా ఖాలీచేసి వెళ్లిపోవాల‌ని బెదిరిస్తారు. దీంతో చేసేది లేక ఆ విష‌యాన్ని అను తండ్రి సుబ్బుకి  చెబుతారు. ఆలోచించిన సుబ్బు విష‌యాన్ని అర్య‌వ‌ర్ధ‌న్ కి చెప్ప‌డం.. అందుకు ఆర్య కండీష‌న్ పెడ‌తాడు.  తిర‌గి పెద్ద‌మ్ త‌ల్లి బ‌స్తీకి వ‌చ్చి అమ్మేసిన ఇంట్లో వుంటానంటేనే తాను ఈ స‌హాయం చేస్తానంటాడు. అందుకు సుబ్బు కూడా ఓకే అని అయితే ఇల్లు మాత్రం త‌మ పేరు మీద కాకుండా వుండాల‌ని, అదే స‌మ‌యంలో అద్దె చెల్లించే విధంగా వుండాల‌ని ష‌ర‌తు విధిస్తాడు. అందుకు అంగీక‌రించిన ఆర్య‌వ‌ర్థ‌న్ ఎమ్మెల్యేకి, అత‌ని మ‌నుషుల‌కు దేహ శుద్ధి చేయ‌డంతో తిరిగి పెద్ద‌మ్మ‌త‌ల్లి బ‌స్తీ హ‌స్త‌గ‌త మ‌వుతుంది. Also Read: బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి ముమైత్ ఖాన్ అవుట్.. ఏడ్చేసిన సరయు! అంతా సంబ‌రాల్లో వుంటే ఆర్య‌వ‌ర్థ‌న్‌ ఆ పేప‌ర్ల‌ని బ‌స్తీవాసుల‌కు అంద‌జేసే ప‌నిని అనుకి అప్ప‌గిస్తాడు. ఊహించ‌ని ప‌రిణామానికి ఆనందం ప‌ట్ట‌లేని అను ఆర్య‌వ‌ర్థ‌న్ ని హ‌గ్ చేసుకుని ఆన ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఎప్పుడే అనుతో అన్న మాట‌లు నిజం కావ‌డంతో ఆర్య కూడా ఆనందిస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. సుబ్బు ఇంటి నుంచి ఆర్య వ‌ర్థ‌న్ - జెండేల కార‌ణంగా పారిపోయిన రాగ‌సుధ ఎక్క‌డ త‌ల‌దాచుకుంది?  అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

అరియానా న‌డుముకు నాగ్ మార్కులు.. చైతూ కౌంట‌ర్‌!

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో ఓటీటీలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. గ‌త నెల 26న మొద‌లైన ఓటీటీ షో 24 గంట‌ల నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ అనే కాన్సెస్ట్ తో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్ప‌టి లాగే బిగ్‌బాస్ సీజ‌న్ లో సండే ఫండే చేసేందుకు కింగ్ నాగార్జున షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డం తెలిసిందే. బిగ్‌బాస్ నాన్ స్టాప్ లోనూ సండే రోజున హౌస్ లో సంద‌డి చేస్తున్నారు నాగార్జున‌. ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ టైమ్ రావ‌డంతో షోలోకి వ‌చ్చేశారు. అనుకున్న‌ట్టుగానే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ముమైత్ కాకుండా స‌ర‌యు ఎలిమినేట్ అవుతుందేమోన‌ని త‌ను ఏడ్చేసింది. ఇదిలా వుంటే నాగ్ వారియ‌ర్స్ . ఛాలెంజ‌ర్స్ మధ్య డ్యాన్స్ ఛాలెంజ్ పెట్టారు. ఈ రెండు టీమ్ ల నుంచి ఒక్కో కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అలా యాంక‌ర్ శివ‌ - తేజ‌స్వి, అరియానా - ఆర్జే చైతూ - అఖిల్ - బిందు మాధ‌వి, అషు రెడ్డి - స్ర‌వంతి జోడీగా ఏర్ప‌డి డ్యాన్స్ చేశారు. అయితే ఈ నాలుగు జోడీల్లో ఆర్జే చైతూ - అరియానాల డ్యాన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఆర్జే చైతు - అరియానా డాన్స్ కి నాగార్జున మార్కులేసాడు. అయితే దీనికి చైతూ కౌంట‌ర్ వేయ‌డం ఆక‌ట్టుకుంది. అరియానాకు తొమ్మిది మార్కులు ఇచ్చారు. అర్జే చైతూకి ఎనిమిది మార్కులే ప‌డ్డాయి. దీంతో ఆర్జే చైతూ కౌంట‌రేశాడు. మీరు మార్కులు ఇచ్చింది అరియానా డ్యాన్స్ కా? న‌డుముకా ? స‌ర్ అని అడిగేశాడు. క‌రెక్ట్ గా చెప్పావ్ .. అరియానా న‌డుముకే అన్న‌ట్టుగా నాగ్ సెటైర్ వేశాడు. తేజ‌స్వితో డ్యాన్స్ చేసేందుకు యాంక‌ర్ శివ తెగ క‌ష్ట‌ప‌డ్డాడు. తేజ‌స్వీ మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపేసింది. అయితే యాంక‌ర్ శివ చేసిన ధైర్యానికి నాగ్ 9 మార్కులు వేశారు. తేజ‌స్వికి కూడా తొమ్మిది మార్కులు ప‌డ్డాయి. దీంతో వారియ‌ర్ టీం ఛాలెంజ‌ర్స్ పై గెలిచింది.