బిగ్‌ బాస్ ట్రోఫీ అందుకున్నాకే బ‌ర్త్‌డే చేసుకుంటుంద‌ట‌!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ రోజు రోజుకీ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఇందులో బింగు మాధ‌వి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆవ‌కాయ్ బిర్యానీ, బంప‌ర్ ఆఫ‌ర్‌, పిల్ల జ‌మీందార్ చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న బిందు మాధ‌వి ఆ త‌రువాత తెలుగు సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి త‌మిళ ఇండ‌స్ట్రీ వైపు వెళ్లిపోయింది. ఇప్ప‌డు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీతో తెలుగులో మ‌ళ్లీ ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టింది. హౌస్ లో వున్న కంటెస్టెంట్ లంద‌రిలోనూ బిందు మాధ‌వ్ చాలా మెచ్యూర్డ్ గా గేమ్ ఆడుతూ ఆక‌ట్టుకుంటోంది. ఇత‌రుల జోలికి వెళ్ల‌డం లేదు.. అలాగ‌ని త‌న జోలికి వచ్చినవారిని వ‌ద‌ల‌డం లేదు. ఏకి పారేసి పులి పిల్ల అన్న పేరు తెచ్చుకుంది. హౌస్ లో త‌న‌ని అఖిల్, అరియానా, అషురెడ్డి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, తేజ‌స్విల బ్యాచ్ టార్గెట్ చేసినా త‌ను మాత్రం చాలా కూల్ గా వారికే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తూ కౌంట‌ర్ లు ఇచ్చేస్తోంది. బిందు దెబ్బ‌తో ఒక్కో కంటెస్టెంట్ నోరు మూసుకుంటున్నారు. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే బిందుమాధ‌వి టైటిల్ ఫేవ‌రేట్ అనే పేరు తెచ్చేసుకుంది. ఇప్పుడు త‌న క‌న్ను క‌ప్పుపై ప‌డింది. తోటి కంటెస్టెంట్ ల‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిందు మాధ‌వి టైటిల్‌ టార్గెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఫోక‌స్డ్ గా గేమ్ ఆడుతూ అంద‌రికి షాకుల‌మీద షాకులిస్తోంది. జూన్ 14 బిందు పుట్టిన రోజు. బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కొట్టి బ‌య‌ట‌కు వ‌చ్చాకే పుట్టినరోజు వేడుక‌లు చేసుకుంటాన‌ని చెబుతోంది. దీంతో చాలామంది బిందు మాధ‌వినే ఈ సారి టైటిల్ విన్న‌ర్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

కొత్త కుట్ర‌కు తెర‌లేపిన అభిమ‌న్యు

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. పెళ్లి జ‌రిగినా వేద - య‌ష్ టామ్ అండ్ జెర్రీ లాగే ప్ర‌తీ విష‌యానికి గొడ‌వ‌ప‌డుతుంటారు. వేద స్టెత‌స్కోప్ మ‌ర్చిపోయింద‌ని గ‌మ‌నించిన య‌ష్ త‌న‌కు ఇచ్చేయాల‌ని హ‌డావిడిగా హాస్పిట‌ల్ కి వ‌చ్చేస్తాడు. అయితే వేద మాత్రం ఇది ఇవ్వాల‌న్న వంక‌తో నా ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాల‌ని తీసుకొచ్చారంటుంది. దీంతో ఎప్ప‌టి లాగే ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ జ‌రుగుతుంది. నీకంత సీన్ లేద‌ని డైరెక్ట్ గానే చెప్పేస్తాడు య‌శోధ‌ర్‌. ఆ త‌రువాత వేద గోల మ‌రీ ఎక్కువైపోవ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. మ‌న‌తో పెట్టుకుంటే ఇంతే మ‌రి అని వేద న‌వ్వేస్తుంది. Also Read: ఈ రోజు నుంచి `కార్తీకదీపం` కొత్త క‌థ షురూ క‌ట్ చేస్తే.. య‌శోధ‌ర్ కు అత‌ని స్నేహితుడు ఫోన్ చేసి మ్యారేజ్ యానివ‌ర్స‌రీ వుంద‌ని, పార్టీ ఇస్తున్నాన‌ని, ఖ‌చ్చితంగా రావాలంటాడు. ఇదే పార్టీకి మాళ‌విక‌ని, అభిమ‌న్యుని ఆహ్వానిస్తాడు. ఇక ఈ పార్టీ విష‌యం తెలిసి య‌ష్ త‌ల్లి మాలిని ... వేదాని కూడా పార్టీకి త‌న‌తో తీసుకెళ్ల‌మంటుంది. అది కుద‌ర‌ద‌ని అంటాడు య‌ష్‌. ఖ‌చ్చితంగా తీసుకెళ్లాల్సిందే అంటుంది మాలిని.  క‌ట్ చేస్తే వేద‌, య‌ష్ క‌లిసి పార్టీకి వెళ‌తారు. అక్క‌డ అభిమ‌న్యు ఎంట్రీ ఇస్తాడు. త‌న ఖుషీని త‌న‌కు కాకుండా చేశావ‌ని, ఖుషీ త‌న ర‌క్తం పంచుకుపుట్టిన పాప అని కొత్త డ్రామా మొద‌లుపెడ‌తాడు అభిమ‌న్యు. ఒక్క‌సారిగా షాక్ కు గురైన య‌ష్ ఆ మాట‌ల‌కు ఏం చేశాడు? ఎలా రియాక్ట్ అయ్యాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.     

హిమ‌గా వ‌చ్చిన కీర్తి రియ‌ల్ లైఫ్ లో విషాదం

`కార్తీక‌దీపం` సీరియ‌ల్ సోమ‌వారం నుంచి కొత్త మ‌లుపు తిరుగుతోంది. డాక్ట‌ర్ బాబు, దీప‌ల పాత్ర‌ల‌కు ఎండ్ కార్డ్ వేసేసిన ద‌ర్శ‌కుడు హిమ‌, శౌర్య‌ల‌తో మిగ‌తా క‌థ‌ని కొత్త పుంత‌లు తొక్కించ‌బోతున్నాడు. పిల్ల‌లు పెద్ద వాళ్లు కావ‌డం.. హిమ‌పై శౌర్య ప‌గ‌ని పెంచుకుని బ‌య‌టే బ్ర‌తుకుతుండ‌టం వంటి స‌న్నివేశాల‌తో మొద‌లుపెడుతున్నాడు. ఇదిలా వుంటే ఈ సీరియ‌ల్ లో హిమ పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి రియ‌ల్ లైఫ్ ఓ విషాదం. ఆరేళ్ల క్రితం జ‌రిగిన కారు ప్ర‌మాదంలో కీర్తి భ‌ట్ త‌ల్లిదండ్రులతో పాటు అన్న‌య్య‌, వ‌దినల‌ను కోల్పోయింది. ఆ కారు ప్ర‌మాదంలో కీర్తిభ‌ట్ కు కూడా తీవ్ర గాయాలు కావ‌డంతో త‌ను కోమాలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్ల‌కు కోలుకున్న కీర్తిభ‌ట్ `మ‌న‌సిచ్చిచూడు` సీరియ‌ల్ తో తెలుగులో బుల్లితెర న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌మాదంలో కుటుంబం మొత్తం పోవ‌డంతో అనాధ‌గా మారిన కీర్తి ప్ర‌స్తుతం ఓ అనాధ‌ని చేర‌దీసి పెంచుతోంది. గ‌తంలో `స్టార్ మా ప‌రివార్‌` కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కీర్తి భ‌ట్ త‌న న‌విషాద గాధ‌ను చెప్పుకుని భావోద్వేగానికి లోనైంది. త‌న‌కి అమ్మా, నాన్న, అన్న‌య్య‌, వ‌దిన ఎవ‌రూ లేర‌ని.. కారు యాక్సిడెంట్ లో అంతా చ‌నిపోయార‌ని ఎమోష‌న‌ల్ అయింది. అంతే కాకుండా `మ‌న‌సిచ్చి చూడు` సీరియ‌ల్ లో త‌న‌కు తండ్రిగా న‌టిస్తున్న `ఛ‌త్ర‌ప‌తి` శేఖ‌ర్ త‌న‌కి తండ్రిలేని లోటుని తీరుస్తున్నార‌ని, సొంత కూతురులా చూసుకుంటున్నార‌ని చెప్పుకొచ్చింది. తాజాగా మ‌రోసారి కీర్తి విషాద గాధ‌ని ఓంకార్ గుర్తు చేశారు. త‌ను హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఇస్మార్ట్ జోడీ`లో `మ‌న‌సిచ్చిచూడు` జంట పాల్గొంది. ఇందులో కీర్తి రియ‌ల్ లైఫ్ క‌ష్టాల గురించి ఓంవ‌కార్ చెప్పెకొచ్చారు. త‌న‌ది చాలా పెద్ద ఫ్యామిలీ అని, అంతా క‌లిసి జ‌ర్నీ చేస్తున్న టైమ్ లో కారు ప్ర‌మాదం జరిగి అంద‌రూ చ‌నిపోయార‌ని, అయితే ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన కీర్తి మాత్రం కోమాలోకి వెళ్లింద‌ని, కొన్ని రోజుల త‌రువాత కోలుకున్న త‌న‌కి ఎవ‌రూ లేర‌ని తెలిసింద‌ని, అలాంటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చింద‌ని చెప్పుకొచ్చారు.

ఈ రోజు నుంచి `కార్తీకదీపం` కొత్త క‌థ షురూ

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో టాప్ లో నిలిచిన ఈ సీరియ‌ల్ ని మ‌ల‌యాళంలో వంట‌ల‌క్క ప్రేమి విశ్వ‌నాథ్ న‌టించిన `క‌రుత‌ముత్తు` ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. 2014లో మొద‌లైన ఒరిజిన‌ల్ సీరియ‌ల్ 2019 ఆగ‌స్టులో ఎండ్ అయింది. ఇక తెలుగులో  2017 అక్టోబ‌ర్ లో ఈ సీరియ‌ల్ ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఏడు భాష‌ల‌లో ఈ సీరియ‌ల్ రీమేక్ వెర్ష‌న్ కంటిన్యూ అవుతోంది. సోమ‌వారం ఈ సీరియ‌ల్ కొత్త వెర్ష‌న్ ప్రారంభం కాబోతోంది. పిల్లుల పెద్ద‌వాళ్లు గా మార‌బోతున్నారు. హిమ‌, శౌర్య ల నేప‌థ్యంలో సీరియ‌ల్ ని కంటిన్యూ చేస్తున్నారు. హిమ చివ‌రికి ఇంటికి రావ‌డంతో త‌ను ఇంట్లో వుంటే నేను వుండ‌న‌ని శౌర్య ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. శౌర్య గురించి సౌంద‌క్య‌, ఆనంద‌రావు, హిమ టెన్ష‌న్ ప‌డుతుంటారు. అయితే శౌర్య గ‌దిలో లెట‌ర్ వుంద‌ని ఆదిత్య చెబుతాడు. ఆ లెట‌ర్ లో `అమ్మా నాన్న‌ల‌ని చంపిన హిమ తో క‌లిసి నేను ఇంట్లో వుండ‌న‌ని` ఉంటుంది. దీంతో అంతా శౌర్య‌ని వెత‌క‌డం మొద‌లుపెడ‌తారు. కానీ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చిన శౌర్య‌కు ఎటు వెళ్లాలో అర్థం కాదు. దీంతో అటుగా వెళుతున్న ఓ వ్య‌క్తిని లిఫ్ట్ అడుగుతుంది. ఇదే క్ర‌మంలో గ‌తంలో జ‌రిగిన యాక్సిడెంట్ గుర్తుకు రావ‌డంతో హిమ పై మ‌రింత‌గా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. క‌ట్ చేస్తే త‌న‌కు లిఫ్ట్ ఇచ్చిన వ్య‌క్తం దొంగ అని తెలిసి అత‌నికి క్లాస్ పీకుతుంది శౌర్య‌. అయినా అత‌డిలో మార్పు క‌నిపించ‌క‌పోవ‌డంతో అత‌నిపై అత‌నిపై రాయితో దాడి చేసి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. అనాధ పిల్ల‌లు క‌పిపించ‌డంతో వారితో క‌లిసిపోతుంది. ఈ లోగా హిమ‌ని కాపాడిన చంద్ర‌మ్మ ఓ షాపులో దొంగ‌త‌నం చేస్తుండ‌గా శౌర్య ప‌ట్టుకుని బెదిరిస్తుంది. త‌న వ‌ద్ద వున్న డ‌బ్బులు లాక్కుని అనాధ‌ల‌కు ఇచ్చేస్తుంది. క‌ట్ చేస్తే హిమ‌, శౌర్య ఇద్ద‌రూ పెద్ద వాళ్ల‌వుతారు. హిమ ఇంట్లో వుండి డాక్ట‌ర్ అవుతుంది. శౌర్య మాత్రం ఎక్క‌డో వుంటూ ఆటోడ్రైవ‌ర్ గా జీవ‌నం సాగిస్తూ వుంటుంది. ఈ ఇద్ద‌రూ ఓ యాక్సిడెంట్ కార‌ణంగా క‌లిసిన‌ట్టుగా ప్రోమోలో చూపించాడు ద‌ర్శ‌కుడు.. ఈ రోజు క‌థ‌ని ద‌ర్శ‌కుడు ఎటు తిప్ప‌బోతున్నాడు?  అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఊహించని ట్విస్ట్.. ఆర్జే చైతు ఔట్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడో వారం పూర్తి చేసుకుంది. మొదటి వారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీరపాక ఎలిమినేట్ కాగా.. మూడో వారం ఊహించని విధంగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ఓటీటీలో ఆర్జే చైతు ముందు నుంచీ దూకుడుగా వ్యవహరించాడు. టాస్క్ ల్లోనూ, వాదనల్లోనూ తనదైన మార్క్ చూపించాడు. దీంతో చైతు ఎక్కువ వారాలు హౌస్ లో ఉండే అవకాశముందని భావించారంతా. కానీ అనూహ్యంగా మూడో వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ తరువాత నాగార్జునతో కలిసి వేదిక పంచుకున్న చైతు.. బిగ్ బాస్ హౌస్ లో లాంగ్ జర్నీ ఉంటుందని ఆశించానని, ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని అన్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు కాస్త బాధగా ఉంటుందని చైతు చెప్పాడు. తెలుగు బిగ్ బాస్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఇది రెండో సారి. గతంలో బిగ్ బాస్-4 నుంచి అమ్మ రాజశేఖర్ అలాగే ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ నుంచి చైతు ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అవ్వడంతో తన కెప్టెన్ బ్యాడ్జ్ ని అనిల్ కు ఇస్తున్నట్లు తెలిపాడు.

కామెడీ స్టార్స్ ధ‌మాకాలో నాగ‌బాబు డిసిప్లిన్ ర‌చ్చ‌

బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `కామెడీ స్టార్స్ ధ‌మాకా`. `స్టార్ మా`లో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రీ ఎంట్రీతో ఈ ప్రోగ్రామ్ రూపురేఖ‌ల్నే మార్చేశారు. ముందు కామెడీ స్టార్స్ గా మొద‌లైన ఈ షో మెగా బ్ర‌ద‌ర్ ఎంట్రీతో కామెడీ స్టార్స్ ధ‌మాకా మారిపోయింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ తో క‌లిసి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌దేవి వెళ్లిపోయింది. ఆ ప్లేస్ లో నాగ‌బాబు వ‌చ్చేశారు. అంత‌కు ముందు యాంక‌ర్ గా వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వుండేది.. ఆ త‌రువాత శ్రీ‌ముఖి వ‌చ్చి చేసింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో దీపిక పిల్లిని షోలోకి తీసుకొచ్చారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ఈ షో సాగుతోంది. అయితే ఈ ఆదివారం మాత్రం ఈ షో కొత్త మ‌లుపు తిరగ‌బోతోంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోల‌ని డామినేట్ చేయాల‌నే ప్ర‌ధాన ఉద్దేశ్యంతో ఈ షోని పునః ప్రారంభించారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్ ల మ‌ధ్య డిసిప్లిన్ లేద‌ని నాగ‌బాబు గ‌మ‌నించారో ఏమోగానీ దాన్ని సెట్రెట్ చేసే కార్య‌క్ర‌మాన్నే ఈ ఆదివారం ఎపిసోడ్ కింద పెట్టుకున్నారు. ఇందు కోసం స్వ‌యంగా రంగంలోకి దిగిన నాగ‌బాబు బెత్తం ప‌ట్టుకుని ఓ రేంజ్ లో కంటెస్టెంట్ ల‌ని చిత‌కబాదేశారు. ముక్కు అవినాష్ ని అయితే ఓ రేంజ్ లో తొడ‌పాశం పెడుతూ ర‌చ్చ ర‌చ్చ చేశారు. నిస్ప‌క్ష‌పాతంగా జ‌డ్జిమెంట్ ఇవ్వాలంటే ఇందుకు కంటెస్టెంట్ ల‌లో డిసిప్లిన్ కావాలి.. అది రావాలి అంటే మ‌నం ఏం చేయాలి అంటూ చేతిలో వున్న బెత్తానికి ప‌ని చెప్పారు. దీంతో కంటెస్టెంట్ లు ఆర్త‌నాదాలు చేస్తూనే కామెడీని పండించ‌డంతో అక్కడున్న మిగ‌తావారు న‌వ్వుల్లో మునిగిపోయారు. ఇక్క‌డో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే నాగ‌బాబు స్వ‌యంగా కంటెస్టెంట్ ల మ‌ధ్య చిచ్చు పెట్టి మ‌రీ ఒక‌రిని ఒక‌రు కొట్టుకునేలా చేయ‌డం. ఓ విధంగా నార‌దుడిలా మారిన నాగ‌బాబు ఒక‌రిపై ఒక‌రికి చాడీలు చెప్పేసి రివేంజ్ ని ప్లాన్ చేసి మ‌రీ కంటెస్టెంట్ ల వీపు విమానం మోత‌మోగించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజే స్టార్ మాలో ప్రసారం కావడం విశేషం.

ఎంట్రీలోనే రాగ‌సుధ‌ని జెండే ప‌ట్టేశాడా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని నెల‌లుగా జీ తెలుగు ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌రాఠీ సీరియ‌ల్ `తుల ఫఠేరే` ఆధారంగా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ గా సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర‌మైన మలుపుల‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతోంది. వెంక‌ట్ శ్రీ‌రామ్ , వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్ , రామ్ జ‌గ‌న్‌, అనూషా సంతోష్‌, జ్యోతిరెడ్డి కీల‌క  పాత్ర‌ల్లో న‌టించారు. అనుని క‌ల‌వాల‌ని ఆర్య‌వ‌ర్థ‌న్ ఇంటికి చేరిన రాగ‌సుధ .. నీర‌జ్  ఎంట్రీతో అడ్డంగా బుక్క‌వుతుంది. అర్థ్ర‌రాత్రి  మాన్సీ కార‌ణంగా ఆర్య వ‌ర్థ‌న్ ఇంటి నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన రాగ‌సుధ‌ని ఎలాగొ అలా అను ఇంటికి క్షే మంగా పంపించేస్తుంది. రాగ‌సుధ ఎంత‌కీ ఇంటికి రాక‌పోవ‌డంతో అను త‌ల్లి ప‌ద్దు రుస రుస లాడుతూ రాగ‌సుధ‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతూ వుంటుంది. మొత్తానికి రాగ‌సుధ ఇంటికి చేర‌డంతో రాత్రి ఎక్క‌డికి వెళ్ల‌వ‌ని నిల‌దీస్తుంది. కొంచెం కూడా బాధ్య‌త భ‌యం లేద‌ని రాగ‌సుధ‌పై అరుస్తుంది. అను కార‌ణంగానే తాను రాలేద‌ని, త‌న ఇంటి వ‌ద్దే వున్నాన‌ని చెబుతుంది రాగ‌సుధ‌. అనుమానంగానే స‌పోర్ట్ చేస్తూ స‌రే అంటాడు సుబ్బు. ఆ త‌రువాత ప‌ద్దు కూడా శాంతిస్తుంది. క‌ట్ చేస్తే .. ఆర్య‌, నీర‌జ్‌, అను క‌లిసి మాన్సీని హాస్పిట‌ల్ కి తీసుకెళ్లాల‌ని రెడీ అవుతుంటారు. ఈ క్ర‌మంలో త‌న‌న రాత్రి డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కొట్టింది అనునే అని క‌నిపెడుతుంది మాన్సి. అది నిజ‌మో కాదో క్లారిఫై చేసుకోవాల‌ని అనుని మ‌ళ్లీ కొట్ట‌మంటుంది. అమాయ‌కంగా వ‌ద్దు వ‌ద్దు మామ్ అంటూనే మాన్సీ చెంప చెల్లుమ‌నిపించి మ‌రోసారి చుక్కులు చూపిస్తుంది అను. దీంతో అనునే త‌న‌ని కొట్టింద‌ని మాన్సీకి క్లారిటీ వ‌స్తుంది. అయినా త‌న‌ని ఏమీ అన‌లేని ప‌రిస్థితి. క‌ట్ చేస్తే అను, ఆర్య ఆఫీస్ కి వెళ‌తారు. అక్క‌డ మీరాని పిలిచి ఈ రోజు ప్రోగ్రామ్స్ చెప్ప‌మంటాడు. వ‌న్ బై వ‌న్‌ చెప్పేస్తుంటే.. అను మీ ఫ్రెండ్ ఎవ‌రో జాబ్ కోసం వ‌స్తుంద‌న్నావ్ అని అడుగుతాడు.. అను బిత్త‌ర‌పోయి లేదు సార్ త‌ను రెండు రోజుల త‌రువాతే వ‌స్తానంది అని చెబుతుంది. ఇంత‌లో ఎఫ్ ఎమ్ వ‌చ్చి అను మేడ‌మ్ ఫ్రెండ్ అంట వ‌చ్చారు అని చెబుతాడు.  అను మ‌ళ్లీ షాక్ అవుతుంది. వెంట‌నే వెళ్లి త‌న‌ని లోపలికి తీసుకురాబోతుంటుంది. అంత‌లో అటుగా వ‌స్తున్న జెండే రాగ‌సుధ ముసుగు తీసి ముఖం చూపించిన త‌రువాతే లోప‌లికి ఎంట్రీ అంటాడు.. రాగ‌సుధ ముఖాన్ని జెండేకి చూపిస్తుందా? .. ఈ ఉప‌ద్ర‌వం నుంచి రాగ‌సుధ‌ని అను ఎలా త‌ప్పించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

'కార్తీక‌దీపం'లో శౌర్య‌గా వ‌స్తోంది ఎవ‌రు?

బుల్లితెర సీరియ‌ల్స్ ల‌లో `కార్తీక దీపం` ఓ ప్ర‌త్యేక‌త‌ని సాధించింది. దేశ వ్యాప్తంగా టాప్ సీరియ‌ల్ గా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుని టాప్ సీరియ‌ల్ గా పాపుల‌ర్ అయింది. ఇందులో న‌టించిన వంట‌ల‌క్క ప్రేమి విశ్వ‌నాథ్‌, డాక్ట‌ర్ బాబు ప‌రిటాల నిరుప‌మ్‌, బేబీ స‌హృద‌, బేబీ కృతిక‌లు సెల‌బ్రిటీలుగా మారిపోయారు. మ‌ల‌యాళ పాపుల‌ర్ సీరియ‌ల్ `క‌రుత ముత్తు` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. అక్క‌డ వంట‌ల‌క్క‌గా న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ తెలుగులోనూ అదే పాత్ర‌ని పోషించి స్టార్ గా మారిపోయింది. ఇదిలా వుంటే గ‌త రెండు రోజులుగా `కార్తీక దీపం` లేటెస్ట్ ప్రోమో వైర‌ల్ గా మారింది. అందులో హిమ, శౌర్య‌ పెద్దవాళ్లైపోయారు. హిమ డాక్ట‌ర్ అయితే.. శౌర్య ఆటో డ్రైవ‌ర్ గా ఇంటికి దూరంగా పెరిగిన‌ట్టుగా చూపించారు. హిమ పాత్ర‌లో `మ‌న‌సిచ్చిచూడు` ఫేమ్ కీర్తి భ‌ట్ న‌టిస్తోంది. ఇక ఆటో డ్రైవ‌ర్ శౌర్య‌గా న‌టిస్తున్న న‌టి ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. శౌర్య‌గా న‌టిస్తున్న యువ‌తి క‌న్న‌డ న‌టి. త‌న పేరు అమూల్య గౌడ‌. క‌ర్ణాట‌క‌లోని మైసూర్‌ లో 1993 జ‌న‌వ‌రి 8న పుట్టింది. క‌న్న‌డ‌లో `క‌మ‌లి` అనే సీరియ‌ల్ తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. 2014లో వ‌చ్చిన క‌న్న‌డ సీరియ‌ల్ `స్వాతిముత్తు`తో న‌టిగా కెరీర్ ప్రారంభించింది. అయితే ఆమెకు గుర్తింపుని తెచ్చిపెట్టింతి మాత్రం `క‌మ‌లి` సీరియ‌ల్‌. 'పున‌ర్ వివాహ‌`, 'ఆరామ‌నే' వంటి సీరియ‌ల్స్ లోనూ న‌టించి పాపులర్ అయింది. `క‌మ‌లి` సీరియ‌ల్ తో క‌న్న‌డ‌లో పాపులారిటీని క్రేజ్ ని సొంతం చేసుకున్న అమూల్య గౌడ తొలి సారి తెలుగులో న‌టిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ప్రోమోలో అద‌ర‌గొడుతున్న ఈ క‌న్న‌డ చిన్న‌ది తెలుగు నాట ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటుందో చూడాలి. 

బిగ్ బాస్ నాన్ స్టాప్‌ :  స్విమ్మింగ్ పూల్ లో రికార్డింగ్ డాన్స్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో 19వ రోజు మ‌రింత ప‌రాకాష్ట‌కు చేసింది. ఓ విధంగా ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.ఈ రోజుని నీ క‌న్ను నీలి స‌ముద్రం అంటూ సాగే హుషారైన పాట‌తో ప్రారంభించారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ టాస్క్ లో భాగంగా ఇంటి స‌భ్యులంతా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి డాన్స్ చేయాల్సి వుంటుందిని చెప్పారు. సాంగ్ కంప్లీట్ అయ్యే వ‌ర‌కు డాన్స్ చేస్తూనే వుండాలట‌.  చివ‌ర్లో ఇంటి స‌భ్యులంతా క‌లిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశం. దీంతో ఒక్కొక్క‌రుగా స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ లు చేశారు. ఈ క్ర‌మంలో హౌస్ లో వున్న భామ‌లంతా త‌మ బోల్డ్ అవ‌తార్ ని రంగంలోకి దింపేశారు. ఓ రేంజ్ లో స్విమ్మింగ్ పూల్ అంతా అందాలు ప‌రిచేసి ద‌డిసిన ప‌రువాల‌తో హ‌ల్ చ‌ల్ చేయ‌డం ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనేస‌రికి హౌస్ లో వున్న హాట్ లేడీలంతా హాఫ్ హాఫ్ డ్రెస్సుల్లోకి మారిపోయి కావాల్సినంత వినోదాన్ని, క‌నువిందుని క‌లిగించారు. ఈ టాస్క్ ని ఎక్కువ‌గా వినియోగించుకుని అందాల విందుకు తెర‌లేపింది మాత్రం ఇద్ద‌రే. సినిమాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ఎలాగైనా ట్రాక్ లోకి రావాల‌ని చూస్తున్న తేజ‌స్వీ ఈ టాస్క్ ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని అందాల విందు చేసే ప్ర‌య‌త్నం చేసింది. హ‌మీద కూడా ఈ అవ‌కాశం పోతే మ‌ళ్లీ రాద‌నుకుందో ఏమో అనేట్టుగా స్విమ్మింగ్ పూల్ టాస్క్ ని ఓ రేంజ్ లో వాడేసుకుని హాట్ షోకి దిగిపోయింది. ఈ ఇద్ద‌రు క‌లిసి నానా హంగామా చేశారు. ఇక అజ‌య్ ష‌ర్ట్ విప్పేసి త‌న ఫోక‌స్ ని మొత్తం తేజ‌స్విపైనే పెట్టేసి స్విమ్మింగ్ పూల్ లో త‌న‌తో ఓ ఆట ఆడుకున్నాడు. తేజ‌స్విని స్విమ్మింగ్ పూల్ లో ఎత్తుకుని మ‌రీ రొమాన్స్ ని పండించాడు.  ఆ త‌రువాత ఈ ఇద్ద‌రిని బిందు మాధ‌వి అనుస‌రించి త‌ను చేయాల్సిన ర‌చ్చ త‌ను చేసేసింది. ఆఖ‌ర్లో అంతా క‌లిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి నానా ర‌చ్చ చేశారు. ఈ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్ లో హీటెక్కిపోయింది.   

య‌ష్ - వేద‌ ఫ‌స్ట్ నైట్ లో న‌డుము గోల‌

బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సాగుతున్న ఈ సీరియ‌ల్ రోజు రోజుకీ స‌రికొత్త మ‌లుపులు తిరుగుతూ పాపుల‌ర్ సీరియ‌ల్ ల జాబితాలో చేరిపోయింది. ఓ పాప చుట్టూ సాగే ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా బెంగ‌ళూరు ప‌ద్మ‌, మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమాండ్ల‌, ఆనంద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శుక్ర‌వారం ఎపిసోడ్ ఎలా ఉందో ఒక‌సారి లుక్కేద్దాం. వేద - య‌ష్ ల‌కు పెళ్లి జ‌ర‌గ‌డంతో ఇరు కుటుంబాల వాళ్లు వారికి ఫ‌స్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. వైట్ అంట్ వైట్ సారీలో కుంద‌న‌పు బొమ్మ‌లా ముస్తాబైన వేద పాల గ్లాస్ తో గ‌దిలోకి ఎంట‌ర‌వుతుంది. పూల‌తో డెక‌రేట్ చేసిన ఫ‌స్ట్ నైట్ బెడ్ పై కూర్చుని య‌ష్ ఆలోచిస్తూ వుంటాడు. బెడ్ దాకా పాల గ్లాస్ ప‌ట్టుకుని వ‌చ్చిన వేద య‌ష్ ని గ‌మ‌నించి ప‌క్క‌న పాల గ్లాస్ పెట్టేసి ప‌క్క‌న కూర్చుంటుంది. వెంట‌నే వేద లెఫ్ట్ హ్యాండ్ ని చేతుల్లోకి తీసుకున్న య‌ష్ `నువ్వు నాకు చేసిన స‌హాయానికి థాంక్స్ అనే ప‌దం చాలా చిన్న‌ది' అంటాడు. 'ఈ రోజు నా కూతురు నాకు ద‌క్కిందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం నువ్వే' అంటాడు. దీనికి వేద హ్యాపీగా ఫీల‌వుతుంది. గ‌తంలో చూసిన య‌ష్ కి ఇప్ప‌డు క‌నిపిస్తున్నయ‌ష్ కి చాలా తేడా వుంద‌ని చెబుతుంది. అయితే థాంక్స్‌ అనే పేరుతో చేయి ప‌ట్టుకుని టెమ్ట్ చేయాల‌ని చూస్తున్నావ‌ని వేద య‌ష్ తో గొడ‌వప‌డుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ చిన్న‌పాటి ఈగో గొడ‌వ జ‌రుగుతుంది.  ఇదే క్ర‌మంలో ఇద్ద‌రు దూరం అంటే దూరంగా అంటూ దూరంగా నిల‌బ‌డ‌తారు. అప్పుడే ఫ్యాన్ గాలికి వేద శారీ గాల్లో తేలుతుంది. ఆ స‌మ‌యంలో వేద న‌డుముని చూసేస్తాడు య‌ష్‌.. ఇక లొల్లి షురూ.. చిట్టి న‌డుముని చూసేశావ‌ని, సారీ చెప్పేయాల‌ని ప‌ట్టుబ‌డుతుంది వేద‌.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? 

అఖిల్ - అషురెడ్డి మ‌ధ్య అస‌లు క‌థ షురూ

ప్ర‌తి బిగ్ బాస్ సీజ‌న్ లో ఇద్ద‌రు కంటెస్టెంట్ ల మ‌ధ్య ల‌వ్ స్టోరీని స్టార్ట్ చేయ‌డం దాంతో షోని కొత్త మ‌లుపులు తిప్ప‌డం అల‌వాటుగా మారింది. దీని వ‌ల్ల ఇటీవ‌ల రెండు రియ‌ల్ జంట‌లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు కూడా. అందులో ఓ జంట ఏకంగా బ్రేక‌ప్ కూడా చెప్పేసుకుని నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఫేక్ జంట‌ల‌ని సృష్టించి రియ‌ల్ జంట‌ల‌ని టార్చ‌ర్ చేసే ఈ సంస్కృతిపై ఇప్ప‌టికే నెటిజ‌న్ లు దుమ్మెత్తిపోస్తూనే వున్నారు. అయినా బిగ్ బాస్ నిర్వాహ‌కుల్లో మాత్రం ఈ విష‌యంలో ఎలాంటి మార్పు రావ‌డం లేదు. ఇటీవ‌ల 24 గంట‌ల స్ట్రీమింగ్ పేరుతో బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్ష‌న్ ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి దాకా కంటెస్టెంట్ ల‌ని గ్రూపులుగా విడ‌దీసి కొట్టుకుంటుంటే వినోదం చూసిన బిగ్ బాస్ ఇప్పుడు కొత్త‌గా ల‌వ్ ట్రాక్ ల‌ని స్టార్ట్ చేశాడు. సీజ‌న్ 4 లో అఖిల్ - మోనాల్ ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ స్టార్ట్ చేయించి ర‌చ్చ ర‌చ్చ చేసిన బిగ్ బాస్ మ‌ళ్లీ ఓటీటీలోనూ అదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నాడు. అయితే ఇక్క‌డ అఖిల్ - అషురెడ్డిల మ‌ధ్య కొత్త‌గా ల‌వ్ ట్రాక్ ని స్టార్ట్ చేయ‌డంతో ఇప్పుడు బిగ్ బాస్ పై సెటైర్లు వినిపిస్తున్నాయి. వ‌ర్మ‌తో అషురెడ్డి చేసిన వీడియోలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి అషు - అఖిల్ ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అంటే ర‌చ్చ ర‌చ్చే. ఇప్ప‌డు ఓటీటీ బిగ్ బాస్ షో ఈ విచిత్ర ల‌వ్ ట్రాక్ కి వేదిక‌గా మారింది. గిల్లిక‌జ్జాల‌తో మొద‌లైన వీరి ప్ర‌యాణం ఇప్పుడిప్పుడే పాకాన ప‌డుతూ ఒక‌రిపై ఒక‌రు రొమాంటిక్ సాంగ్ లు వేసుకునేలా మారిపోయింది. అఖిల్ కూడా పులిహోర క‌ల‌ప‌డం మొద‌లుపెట్టాడు. అషురెడ్డి కూడా డ్యూటీ ఎక్కేసి ల‌వ్ ట్రాక్ ని స్టార్ట్ చేసింది. ఇది ఏ ట‌ర్న్ తీసుకుంటుందో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ట్రాక్ మార్చిన డైరెక్ట‌ర్‌.. హిమ డాక్ట‌ర్‌.. శౌర్య ఆటో డ్రైవ‌ర్‌!

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబుల క‌థ‌గా మొద‌లై ఒక ద‌శ‌లో టాప్ టీఆర్పీ రేటింగ్ తో దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి సీరియ‌ల్స్ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డుల‌ని న‌మోదు చేసింది. వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు ఎప్పుడు క‌లుస్తారంటూ చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూశారు. సెల‌బ్రిటీలు సైతం దీనిపై నెట్టింట ఆరా తీశారు. అంత‌లా ఈ సీరియ‌ల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఆ త‌రువాతే క‌థ అడ్డం తిరిగింది. దీప‌, డాక్ట‌ర్ బాబు క‌లిశాక క‌థ న‌త్త‌న‌డ‌క‌న సాగ‌డం మొద‌లైంది. చివ‌రికి ఆరాధించిన ప్రేక్ష‌కుల‌కే విసుగు పుట్టించే స్థాయికి వెళ్లిపోయింది. దీన్ని గ‌మ‌నించిన ద‌ర్శ‌కుడు, మేక‌ర్స్ ట్రాక్ మార్చారు. దీప - డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌కు ముగింపు ప‌లికి కొత్త త‌రంతో క‌థ‌ని గాడిలో పెట్టాల‌ని మ‌రో ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు. సౌర్య‌ని క్ష‌మించ‌మ‌ని అడ‌గాల‌ని సౌర్య ఇంటికి తిరిగి వ‌చ్చేస్తుంది. అయితే అమ్మానాన్న‌ల చావుకి కార‌ణం నువ్వే నీతో క‌లిసి నేను ఉండ‌లేను.. అంటూ సౌర్య ఇంటి నుంచి వెళ్లి పోతుంది. సౌర్య విష‌యంలో మీకిచ్చిన మాట‌ని నిజం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తానని, త‌ను ఎక్క‌డున్నా వెతికి వెన‌క్కు తీనుకొస్తాన‌ని డాక్ట‌ర్ బాబు, దీప‌ల ఫొటోల ముందు నిల‌బ‌డి హిమ చెబుతుంది. ఆ పాత్ర‌లో కొత్త న‌టిని తీసుకొచ్చారు. సీన్ క‌ట్ చేస్తే.. రౌడీ శౌర్య పెరిగి పెద్ద‌దై ఆటో డ్రైవ‌ర్ అయితే.. హిమ డాక్ట‌ర్ అవుతుంది. శౌర్య‌ని ఎలాగైనా వెతికి వెన‌క్కి తీసుకువ‌స్తాన‌ని హిమ అనుకుంటూ కార్ న‌డుపుతూ వుంటుంది.. శౌర్య మాత్రం  హిమ‌ని ఎప్ప‌టికీ క్ష‌మించ‌ను అంటూ ఆటో న‌డుపుతూ వుంటుంది.. త‌న క‌ళ్ల ముందే హిమ ఓ వ్య‌క్తికి యాక్సిడెంట్ చేస్తుంది. అది గ‌మ‌నించిన శౌర్య .. హిమ‌పై అరుస్తుంది. `వేధించే గ‌తాన్ని.. ర‌క్త సంబంధం చెరిపేస్తుందా? అక్కాచెల్లెళ్ల క‌థ‌తో స‌రికొత్త‌గా కార్తీక దీపం` అంటూ గురువారం ప్రోమోని విడుద‌ల చేశారు. ఈ ఇద్ద‌రి ప్ర‌యాణం ఎలా సాగ‌నుందో తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్పిందే.

అభిమ‌న్యు ప్లాన్ ఏంటీ?. ఏం చేయ‌బోతున్నాడు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీనియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, మిన్ను నైనిక‌, ప్ర‌ఫ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌ద‌ర్శింప‌బడుతున్న ఈ సీరియ‌ల్ పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌ల‌ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పిల్ల‌లే పుట్ట‌ర‌ని తేల్చేసిన ఓ యువ‌తికి, త‌ల్లిదండ్రులు ప‌ట్టించుకోని ఓ పాప‌కు మ‌ధ్య పెన‌వేసుకున్న అనుబంధం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. వేద అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఎమోష‌న‌ల్ అవుతుంది. ఒక త‌ల్లిప‌డే ఆనందం ఎలా వుంటుందో నాకు ఈ రోజు తెలిసింద‌మ్మా అంటూ త‌న త‌ల్లితో చెబుతూ భావోద్వేగానికి లోన‌వుతుంది. ఈ సంభాష‌ణ‌ని దూరంగా గ‌మ‌నించిన య‌ష్ త‌ల్లిదండ్రులు మాళిని - ర‌త్నం సంబ‌ర‌ప‌డ‌తారు. వేద‌కు, ఖుషీకి  ద్రోహం చేసిన దేవుడు వీళ్ల‌ని క‌లిపి న్యాయం చేశాడ‌ని సంతోషిస్తారు. క‌ట్ చేస్తే య‌ష్ త‌న కూతురు ఖుషీని కాన్వెంట్ లో దింప‌డానికి కారులో బ‌య‌లుదేర‌తాడు. మార్గ మ‌ధ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రుగుతుంది. ఇదే స‌మ‌యంలో ఖుషీ.. య‌ష్ ని ఓ మాట అడుగుతుంది. అభిమ‌న్యు అన్న మాట‌లు గుర్తు చేసుకుని డాడీ అమ్మ‌ని వ‌దిలేస్తావా? అని అడుగుతుంది. దాంతో య‌ష్ షాక‌వుతాడు. ఎందుకు నాన్నా అంటాడు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, నువ్వు, నేను, అమ్మ ముగ్గురం ఎప్పుడూ క‌లిసే వుండాలంటుంది. అలాగే అంటూ య‌ష్ ప్రామిస్ చేస్తాడు. మాట‌ల్లోనే స్కూల్ కి చేరుకుంటారు. బాయ్ చెప్పేసి య‌ష్ .. ఖుషీని స్కూల్ లో దించేసి తిరిగి ఆఫీస్ కి ప‌య‌నమ‌వుతాడు.. అయితే అక్క‌డే వున్న అభిమ‌న్యు త‌న వైపుకు రావ‌డాన్ని గ‌మ‌నించిన ఖుషీ తండ్రి య‌ష్ ని పిలుస్తూ కార్ వెంట ప‌రుగెడుతుంది. అది గ‌మ‌నించిన య‌ష్ కార్ ఆపేసి ఖుషీ వ‌ద్ద‌కు వ‌స్తాడు. ఏమైంద‌ని అడిగితే అత‌నొచ్చాడు అంటుంది. ఎవ‌ర‌ని తిరిగి చూస్తే అభిమ‌న్యు కనిపిస్తాడు. ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ జ‌రుగుతుంది. నీకు ఊహించ‌ని షాకిస్తానంటూ అభిమ‌న్యు ఛాలెంజ్ చేస్తాడు. ఇంత‌కీ అభిమ‌న్యు ప్లాన్ ఏంటీ?. ఏం చేయ‌బోతున్నాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

అర్ధరాత్రి ఆర్య ఇంట్లో రాగ‌సుధ‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

బుల్లితెర వీక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఈ సీరియ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంటూ మంచి ఆద‌ర‌ణ పొందులోంది. రేటింగ్ ప‌రంగానూ ముందు వ‌రుస‌లో నిలుస్తూ అల‌రిస్తోంది. మరాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్‌, వ‌ర్ష విహెచ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇత‌ర పాత్ర‌ల్లో విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనుషా సంతోష్‌, జ్యోతిరెడ్డి, జ‌య‌ల‌లిత న‌టించారు. థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. రాగ‌సుధ‌ని హ‌త్య చేయించాల‌ని ఆర్య‌వ‌ర్థ‌న్, జెండే ప్లాన్ చేస్తుంటారు. కానీ రాగ‌సుధ త‌ప్పించుకు తిరుగుతూ వుంటుంది. అనుతో అర్జంటుగా మాట్లాడాల‌ని రాగ‌సుధ‌.. ఆర్య వ‌ర్థ‌న్ ఇంటికి వ‌చ్చేస్తుంది. సెల్లార్ లో వున్న కార్ పార్కింగ్ ప్లేస్ లో అను కోసం ఎదురుచూస్తూ వుంటుంది. అను - ఆర్య స‌ర‌దాగా మాట్లాడుకుంటూ ప‌డుకోబోతుంటారు. ఇంత‌లో అనుకు రాగ‌సుధ ఫోన్ చేస్తుంది. అను షాక్ అవుతుంది. ఈ టైమ్ లో ఫోన్ ఏంటీ? అని. ఫోన్ ఎత్త‌గానే అర్జంటుగా మాట్లాడాలంటుంది. ఇప్ప‌డు కుద‌ర‌దు అంటుంది అను. నేను మీ ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే వున్నాన‌ని చెప్ప‌డంతో అను షాక‌వుతుంది. Also Read: అభిమ‌న్యు, మాళవిక ప్ర‌తీకారం తీర్చుకుంటారా? వెంట‌నే అమ్మ ఫోన్ చేసిందంటూ ఆర్య‌ని న‌మ్మిస్తూ హాల్ లోకి వ‌చ్చేస్తుంది. అక్క‌డి నుంచి నేరుగా సెల్లార్ లోకి వెళుతుంది. ఈ టైమ్ లో ఇక్క‌డికి వ‌చ్చావేంటీ అక్కా అని చిరాకు ప‌డుతుంది. అర్జెంటుగా మాట్లాడాలి అను అంటుంది రాగ‌సుధ‌.. ఇద్ద‌రి మధ్య సంభాష‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో అను అత్తయ్య అటు వైపుగా వ‌స్తుంది. అతి గ‌మ‌నించిన అను రాగ‌సుధ‌ని కార్ ప‌క్కకు పంపించేసి ఫోన్ మాట్లాడుతున్న‌ట్టుగా క‌వ‌రింగ్ ఇస్తుంది.. త‌ను వెళ్లిపోగానే మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ మొద‌ల‌వుతుంది. ఇంత‌లో ఆర్య అనుని వెతుక్కుంటూ కింద‌కి వ‌స్తాడు.  త‌ల్లిని అడ‌గ‌డంతో త‌ను సెల్లార్ లో ఫోన్ మాట్లాడుతుంద‌ని చెబుతుంది. ఆర్య అక్క‌డికే వ‌స్తాడు. క‌ట్ చేస్తే .. అను మ‌ళ్లీ రాగ‌సుధ‌ని త‌ప్పిస్తుంది. ఆర్య ఆల‌స్య‌మైంది ప‌దా అన‌డంతో ఇద్ద‌రు క‌లిసి సెల్లార్ లో వున్న లిఫ్ట్ లో పైకి వెళ్లి పోతారు. ఇక ఇక్క‌డి నుంచి బ‌య‌టికి వెళ్లిపోవాల‌ని వెళుతున్న రాగ‌సుధ‌కు నీర‌జ్ కారులో ఎదురుప‌డ‌తాడు. ఎవ‌రు నువ్వు? ఈ టైమ్ లో ఇక్క‌డేంచేస్తున్నావ్ అంటూ నిల‌దీసి త‌న‌ని ఇంట్లోకి తీసుకెళ‌తాడు. చేసేది లేక ఇంట్లోకి వెళ్లిన రాగ‌సుధ అర్థ్రరాత్రి ఆర్య ఇంట్లో ఏం చేసింది? అను గ‌మ‌నించిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

అఖిల్ మెడ‌లో ఫేక్ బోర్డ్‌.. బిందు మాధ‌వి స్మార్ట్ గేమ్‌!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 25వ ఎపిసోడ్ లో చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్నాయి. కెప్టెన్సీ పోరులో సీక్రెట్ టాస్క్ లు ఒక ఎత్తైతే ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా అనీల్ కి.. అల‌క‌రాజ్ అఖిల్ కి దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అఖిల్‌, అషు రెడ్డి, స్ర‌వంతి, అజ‌య్ బ్యాచ్‌.. యాంక‌ర్ శివ గురించి గుస‌గుస‌లాడ‌టం మొద‌లుపెట్టారు. సుస్సు పోవ‌డానికి.. సిగ‌రేట్ కాల్చ‌డానికి అత‌నికి ప‌ర్మీష‌న్ ఎవ‌రిచ్చారంటూ రూల్స్ మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. ఇక హౌస్ లో వున్న వాళ్ల‌లో ఎవ‌రు ఫేక్ అన్న‌ది తెలుసుకోవ‌డానికి బిగ్ బాస్ ర‌హ‌స్య బ్యాలెట్ ఓటింగ్ ని చేప‌ట్టారు. దీనిలో బాగంగా ఒక్కొక్క‌రు ఇద్ద‌రిద్ద‌రు చొప్పున ఎవ‌రు ఫేక్ అన్న‌ది చెప్పాల‌ని కోరారు. అయితే ఈ ర‌హ‌స్య బ్యాలెట్ విధానంలో ఎక్కువ మంది ఇంటి స‌భ్యులు అఖిల్ ని ఫేక్ అని తేల్చేశారు. అత‌నితో పాటు న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ని కూడా ఫేక్ అని తేల్చేయ‌డంతో ఈ ఇద్ద‌రికి మైండ్ బ్లాక్ అయింది. త‌దుప‌రి ఆదేశం వ‌చ్చే వ‌ర‌కు అఖిల్‌, న‌ట‌రాజ్ లు `ఐ యామ్ ఫేక్‌` అనే బోర్డ్ లు ధ‌రించాల‌ని శిక్ష విధించారు. అనంత‌రం బిగ్ బాస్ `ఐ యామ్ ఫేక్‌` బోర్డ్ లు పంప‌డంతో వాటిని మెడ‌లో వేసుకుని బావురు మ‌న్నారు అఖిల్, న‌ట‌రాజ్‌. ముందు అఖిల్ పేరు చెప్ప‌గానే "వాట్ ది.." అంటూ అషురెడ్డి ఓ రేంజ్ లో ఫైర‌యింది. ఇక స్ర‌వంతి అయితే అఖిల్ కి రావ‌డం ఏంటీ? అంటూ తెగ ఆశ్చ‌ర్య‌పోయింది. దీంతో అషురెడ్డి హౌస్ లో ఉన్న ఇద్ద‌రు ముగ్గురు అఖిల్ కి వేసి వుంటారు. వాళ్లెవ‌రో మ‌న‌కి తెలుసు.. బ‌య‌ట జ‌నానికి తెలుసు.. అఖిల్ అంటే ఏంటో బిగ్ బాస్ కు చూపిస్తుంటారు క‌దా.. ఇద్ద‌రు ముగ్గురు నిన్ను ఫేక్ అంటే ఫేక్ అయిపోతావా? .. నువ్వు స్ట్రాంగ్ అని వాళ్ల‌కు తెలుసు. నువ్వు ఇక్క‌డ వుంటే వాళ్లు గెల‌వ‌లేరు... వాళ్ల‌కి భ‌యం అందుకే నిన్ను టార్గెట్ చేస్తున్నార‌ని అఖిల్ గురించి చెప్పింది అషురెడ్డి. దీంతో కొత్త చర్చ మొద‌లైంది. బిందు మాధ‌వి స్మార్ట్ గేమ్ తో ఈ బ్యాచ్ ఏడుపు మొద‌లైంది.

పెళ్లి గురించి అడిగితే వర్షిణి దిమ్మతిరిగే ఆన్సర్

యాంక‌ర్ వ‌ర్షిణి బుల్లితెక‌ర‌పై పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ప‌టాస్ -2, కామెడీ స్టార్స్ షోల‌కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన వ‌ర్షిణి సౌంద‌ర రాజ‌న్ `చంద‌మామ క‌థ‌లు` చిత్రంతో న‌టిగా కెరీర్ ప్రారంభించింది. ల‌వ‌ర్స్‌, బెస్ట్ యాక్ట‌ర్స్‌, శ్రీ‌రామ ర‌క్ష‌, పెళ్లి గోల - సిరీస్‌ల‌లో న‌టించింది. `మ‌ళ్లీ మొద‌లైంది` చిత్రంతో మ‌రోసారి వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లుపెట్టింది. ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోయినా వ‌ర్షిణికి మాత్రం చారిత్ర‌క చిత్రం `శాకుంత‌లం`లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. స‌మంత లీడ్ పాత్ర‌లో న‌టించ‌గా గుణ‌శేఖ‌ర్ ఈ మూవీని రూపొందించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో వ‌ర్షిణికి మంచి పాత్రే ద‌క్కింద‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే బుల్లితెర‌పై వ‌ర్షిణికి అవ‌కాశాలు ద‌క్క‌డం లేదు. వెండితెర‌పై కూడా ఆమెది ఇవే ప‌రిస్థితి. అయితే అవ‌కాశాల కోసం వెత‌క‌డం లేదు. సోష‌ల్ మీడియానే వేదిక‌గా చేసుకుంటూ హాట్ హాట్ ఫొటోల‌తో ఫ్యాన్స్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల బ్లాక్ డ్రెస్ లో వ‌ర్షిణి హొయ‌లు పోతూ పోజులిచ్చిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇదిలా వుంటే తాజాగా వర్షిణి పెట్టిన పోస్ట్ నెటిజ‌న్‌ల‌ని ఆక‌ట్టుకుంటోంది. `26 ఏళ్లు వ‌చ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా?' అని ఎవరైనా ప్ర‌శ్నిస్తే.. తాను ఇలా స‌మాధానం చెబుతానంటూ వ‌ర్షిణి ప‌రోక్షంగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 'మ‌నం 2022లోకి వ‌చ్చాం.. అయినా కూడా మ‌న ప‌ని మనం చేసుకోకుండా ప‌క్క‌వారి గురించే ఆలోచిస్తున్నారా?' అని ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా వ‌ర్షిణి పోస్ట్ పెట్ట‌డం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. అంటే పెళ్లి గురించి త‌న‌ని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడద‌ని వ‌ర్షిణి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చింద‌ని నెటిజ‌న్స్ కామెంట్ లు చేస్తున్నారు.

హీరోయిన్‌తో షణ్ముఖ్ చిందులతో చిల్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. సిరితో అతి చేష్టల‌ కార‌ణంగా అడుగు దూరంగా విన్న‌ర్ కావాల్సిన త‌ను ర‌న్న‌ర్ గా మిగిలిపోయాడు. సిరి త‌ల్లి, ష‌న్ను త‌ల్లి చెప్పినా అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా సిరితో ష‌న్ను చేసిన అతి కార‌ణంగానే త‌నపై నెగిటివిటీ పెరిగిపోయింది. అది తెలిసి కూడా ష‌న్నులో మార్పు రాక‌పోవ‌డంతో నెటిజ‌న్స్ ఓ రేంజ్ లో ష‌న్నుని, సిరిని ఆడేసుకున్నారు. దారుణంగా కామెంట్ లు చేశారు. వీరి ఎపిసోడ్ కార‌ణంగానే షన్నుతో దీప్తి సున‌య‌న త‌న ల‌వ్ కి బ్రేకప్ చేప్పేసి షాకిచ్చింది. ఆ త‌రువాత నుంచి దీప్తి ఇచ్చిన షాక్ లోనే వున్న ష‌న్ను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తిరిగి ఎప్ప‌టిలాగే త‌న యూట్యూబ్ కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టేశాడు. `ఏజెంట్ సూర్య‌` పేరుతో కొత్త యూట్యూబ్ సిరీస్ కి శ్రీ‌కారం చుట్టాడు. టీవీ షోల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. దీప్తి కూడా త‌న క‌వ‌ర్ సాంగ్ ల‌తో బిజీగా మారిపోయింది. ష‌న్నుని ప‌ట్టించుకోవ‌డం మానేసింది. త‌ను కూడా పార్టీల్లో మునిగితేలుతూ ఫ్రెండ్స్ తో చిల్ అవుతోంది. Also Read: 'శక్తి', 'జంజీర్' సినిమాలపై తారక్, చరణ్ జోకులు ఇదిలా వుంటే ష‌న్ను కెరీర్ పై ఫుల్ ఫోక‌స్ పెట్టాడు. త‌న‌కు క‌లిసి వ‌చ్చిన డైరెక్ట‌ర్ తో మ‌రో వెబ్ సిరీస్ కి రెడీ అయిపోతున్నాడు. ఇందులో ష‌న్ను ఏజెంట్ సూర్య‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఓ ప‌క్క వెబ్ సిరీస్ చేస్తూనే ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఖుషీగా వున్నాడు ష‌న్ను. తాజాగా హీరోయిన్ సువేక్ష‌తో హీరో విజ‌య్ న‌టించిన `బీస్ట్‌` చిత్రంలోని 'అర‌బిక్ కుత్తు' పాట‌కు స్టెప్పులేసి అద‌ర‌గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఫ్యాన్స్ కోసం షేర్ చేయ‌డంతో అది నెట్టింట సంద‌డి చేస్తోంది.

అభిమ‌న్యు, మాళవిక ప్ర‌తీకారం తీర్చుకుంటారా?

బుల్ల‌ితెర‌పై ఆక‌ట్టుకుంటున్న తీసిర‌య‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ ఇత‌ర పాత్రల్ని పోషించారు. గ‌త కొన్ని వారాల క్రిత‌మే మొద‌లైన ఈ సీరియ‌ల్ బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. కోర్టు ఖుషీ క‌స్ట‌డీని య‌ష్‌, వేద‌ల‌కు అప్ప‌గించ‌డంతో య‌ష్ ఫ్యామిలీ ఆనందంగా గ‌డుపుతుంటారు. ఖుషీని స్కూల్ కి పంపిస్తుంటారు. ఈ క్ర‌మంలో వేద‌, య‌ష్ మ‌ధ్య గిల్లి క‌జ్జాలు జ‌రుగుతుంటాయి. పాప షూ పాలీష్ చేయ‌డం కూడా రాద‌ని య‌ష్ ని వేద ఆట ప‌ట్టిస్తుంటే అది చూసి ఇంట్లో వాళ్లంతా న‌వ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీని చూసి సంబ‌ర‌ప‌డుతుంటారు. ఇదే అద‌నుగా భావించిన వేద .. య‌ష్ ని మ‌రింత గా ఆట ప‌ట్టించ‌డం మొదుల పెడుతుంది. దీంతో నాకూ ఛాన్స్ వ‌స్తుంది అప్పుడు చెబుతా నీ సంగ‌తి అని య‌ష్ .. వేద‌తో అంటుంటాడు... క‌ట్ చేస్తే .. అవ‌మాన భారంతో ప్ర‌తీకార జ్వాల‌తో అభిమ‌న్యు, మాళవిక ర‌గిలిపోతుంటారు. మాళీవిక మ‌న పెళ్లెప్పుడ‌ని అభిమ‌న్యుని నిల‌దీస్తుంది. నా ప్రేమ‌ను పంచుకోవ‌డ‌మే కాదు.. నా ప‌గ‌ని కూడా పంచుకోవాలి. య‌ష్ ని ఓడించిన రోజే మ‌న పెళ్లి అని అభిమ‌న్యు మ‌రోసారి మాళ‌విక‌తో పెళ్లికి అడ్డంకులు చెబుతాడు. అభిమ‌న్యు చెప్పింది కాద‌న‌లేక‌.. అవున‌న‌లేక మాళ‌విక సైలెంట్ అయిపోతుంది. య‌ష్ ని తిరుగులేని దెబ్బ‌కొడ‌తాన‌ని, అది చూసి కుమిలి కుమిలి ఏడుస్తాడ‌ని అభిమ‌న్యు అంటాడు. ఇంత‌కీ అభిమ‌న్యు ప్లాన్ ఏంటీ? ..య‌ష్ అల‌ర్ట్ అవుతాడా? .. అభిమ‌న్యు కుట్ర‌ని స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొడ‌తాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

శౌర్య ఆగ్ర‌హం.. అనాథ‌గా మారిన హిమ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌యవంతంగా సాగుతూ టాప్ రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సీరియ‌ల్ ఇటీవ‌ల గాడి త‌ప్పింది. సాగ‌దీత ధోర‌ణి కార‌ణంగా ప‌ట్టుత‌ప్పింది. ప్రేక్ష‌కుల్లో క్రేజ్ ని కోల్పోయింది. దీంతో ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర దిద్దుబాట పేరుతో పాత్ర‌ల‌ని ముగించేయ‌డం మొద‌లుపెట్టాడు. కారు ప్ర‌మాదం క్రియేట్ చేసి దీప‌, కార్తీక్‌ల పాత్ర‌ల‌కు ఎండ్ కార్డ్ వేసేసిన ద‌ర్శ‌కుడు కొత్త తరం, ఎదిగిన త‌రం పేరుతో హిమ‌, శౌర్య‌లను కూడా త్వ‌ర‌లో పెద్ద‌వాళ్ల‌ను చేయ‌బోతున్నాడు. ఇదిలా వుంటే బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. 'హిమ బ్రతికే వుంది.. ఏదో ఒక రోజు నా కంట ప‌డుతుంది. ఆ రోజు దాన్ని చంపేస్తాను' అంటూ అరుస్తుంది శౌర్య‌.. 'నాకు చెల్లెలు లేదు.. ఒక వేళ వున్నా అది నా చెల్లెలు కాదు. దాని గురించి ఆలోచిస్తే నేను మీకు ద‌క్క‌ను' అంటూ సౌంద‌ర్య‌తో అంటుంది. ఈ మాట‌ల్ని బ‌య‌టి నుంచే విన్న‌ హిమ అటు నుంచి అటే వెళ్లిపోతుంది. మోనిత ఇంటికి వెళ్లి త‌న‌ని క‌ల‌వాల‌నుకుంటుంది. కానీ త‌ను అక్క‌డ క‌నిపించ‌దు. అప్పుడే హిమ డాక్ట‌ర్ బాబు, మోనిత క‌లిసి పూజ చేసిన ఫొటో చూస్తుంది. ఆ త‌రువాత మోనిత.. ఆనంద‌రావుతో వున్న ఫొటోని చూసి షాక‌వుతుంది. నాన్న‌, మోనిత‌తో క‌లిసి పూజ ఎందుకు చేశాడు? .. ఆనంద‌రావు ఫొటో ఇక్క‌డ ఎందుకు వుంది? .. అని ఆలోచిస్తూ బ‌య‌టికి వ‌స్తుంది. అక్క‌డే ఇంద్రుడు, చంద్ర‌మ్మ క‌నిపిస్తారు. 'నేను మీతో పాటే వ‌చ్చేస్తాన‌'ని చెబుతుంది హిమ‌. క‌ట్ చేస్తే, "నాకు పెద్ద కొడుకే ధైర్యం. వాడే లేని ఈ జీవితం ఎందుకండీ" అంటూ బోరున విల‌పిస్తుంటుంది సౌంద‌ర్య‌.. 'ఆడ‌ప‌డుచు ఏడుపు మంచిది కాదంటారు.. స్వ‌ప్న మ‌న‌పై దుమ్మెత్తిపోసింది. ఇదంతా త‌న వ‌ల్లే జ‌రిగింద‌'ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  చంద్ర‌మ్మ‌, ఇంద్రుడితో క‌లిసి హిమ మ‌ళ్లీ వాళ్ల ఇంటికే వెళ్లి పోయిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.