సంగీత్‌లో య‌ష్ - వేద అడ్డంగా దొరికిపోయారా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని, పిల్ల‌ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. వేద కోసం ఖుషీ గిఫ్ట్ అందిస్తుంది. `వ‌ర‌ల్డ్ బెస్ట్ మ‌ద‌ర్` పేరుతో వున్న గిఫ్ట్ ని చూడ‌గానే వేద ఎమోష‌న‌ల్ అవుతుంది. 'ఇది వ‌ర‌ల్డ్ లోనే బెస్ట్ గిఫ్ట్.. ఇంత గొప్ప గిఫ్ట్ ఇంత వ‌ర‌కు నాకు ఎవ‌రు ఇవ్వ‌లేదం'టూ మురిసిపోతుంది. క‌ట్ చేస్తే.. య‌ష్ , వేద‌ల సంగీత్ మొద‌ల‌వుతుంది.  Also Read: న‌య‌ని ప్ర‌యోగం ఫ‌లించిందా? వేద‌, య‌ష్ ఫ్యామిలీలు క‌లిసి సంగీత్ లో హంగామా చేస్తుంటారు. వేద‌, య‌ష్ వ‌చ్చేస్తారు. వేద సోద‌రి భ‌ర‌త‌నాట్యంతో సంగీత్ ని స్టార్ట్ చేస్తుంది. ఇదే స‌మ‌యంలో వేద‌కు గిఫ్ట్ ఇవ్వాల‌ని నెక్లెస్ ఖ‌రీదు చేస్తుంది మాళ‌విక‌. ఆ నెక్లెస్ ని వేద‌కు అంద‌జేసి త‌న‌ని త‌మ వైపు తిప్పుకోవాల‌ని మ‌న‌సులో అనుకుంటుంది. వేద ఇంటికి మాళ‌విక బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో అభిమ‌న్యు ఎదురుప‌డ‌తాడు. వేద‌కు ఖ‌రీదైన నెక్లెస్ కొన్నాన‌ని, దీంతో త‌న‌ని మ‌న వైపుకు తిప్పుతాన‌ని చెబుతుంది. దానికి అభిమ‌న్యు 'స‌రే వెళ్లు' అంటాడు. Also Read: రానా తమ్ముడు అభిరామ్ అ'హింస'తో భయపెడుతున్నాడు క‌ట్ చేస్తే సంగీత్ లో య‌ష్ త‌ల్లి మాలిని, అక్క కంచు హ‌డావిడీ చేస్తుంటారు. వేద ఫ్యామిలీని ఆట ప‌ట్టించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇదే క్ర‌మంలో య‌ష్‌, వేద‌ల మ‌ధ్య ఫ‌న్నీ మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. క‌ట్ చేస్తే అంతే స‌ర‌దాగా డ్యాన్స్ చేస్తుంటారు. య‌ష్ , వేద కూడా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయి స్టేజ్ పై డ్యాన్స్ చేయ‌డం స్టార్ట్ చేస్తారు. ఇదే టైమ్ లో వేద కోసం మాళివిక సంగీత్ ఫంక్ష‌న్ లోకి ఎంట్రీ ఇస్తుంది.. స్టేజ్ పై య‌ష్, వేద క‌లిసి డ్యాన్స్ చేస్తుండ‌టం చూసి షాక్ అవుతుంది. య‌ష్ పెళ్లి చేసుకోబోయేది వేద‌ని అని తెలుసుకుంటుంది. ఆ త‌రువాత మాళ‌విక ఎలా రియాక్ట్ అయింది?.. అభిమ‌న్యు ఈ వార్త విని ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్‌ బాస్ ఓటీటీలో అంతా సెకండ్ హ్యాండ్ వాళ్లే!

బిగ్‌ బాస్ సీజ‌న్ మ‌ళ్లీ మొద‌లు కాబోతోంది. అయితే ఈసారి ఓటీటీ ఫార్మాట్ ని కూడా స్టార్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 24 గంట‌ల‌సేపు నిరంత‌రాయంగా స్ట్రీమింగ్ కానున్న ఈ రియాలిటీ షో ఈ నెల 26 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్ లకు సంబంధించిన లిస్ట్ బ‌య‌టికి వ‌చ్చేసింది. అయితే ఈ లిస్ట్ పై సింగ‌ర్ గీతా మాధురి సెటైర్లు వేసింది. కొత్త‌ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేయ‌కుండా అంతా సెకండ్ హ్యాండ్ వాళ్ల‌నే మ‌ళ్లీ రంగంలోకి దింపేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేసింది. Also Read: 'దృశ్యమ్ 2' షూటింగ్ మొద‌లుపెట్టిన అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ‌ "బిగ్‌ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం. ఈ సారి నాకు ఉన్న బిజీ షెడ్యూల్ కార‌ణంగా వెళ్ల‌లేక‌పోయాను. నా కెరీర్ తో ఫ్యామిలీని చూసుకోవాలి. పైగా నాకు ఓ బేబీ వుంది. ఇవ‌న్నీ చూసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. నేను షోలో ర‌న్న‌ర్ ని అయ్యాను. రెండో సారి వెళ్తే క‌ప్పు వ‌చ్చేస్తుంద‌ని అనుకోలేం. ఏమీ రాదు. ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్ అయిపోయా. బిగ్ బాస్ కి సెకండ్ టైమ్ వెళితే సెకండ్ హ్యాండ్. థ‌ర్డ్ టైమ్ వెళితే థ‌ర్డ్ హ్యాండ్‌. ఎప్పుడైనా ఫ్రెష్ టాలెంట్ కే క‌ప్పు వ‌స్తుంది. ఇప్పుడు అంతా సెకండ్ హ్యాండ్ వాళ్లే ఉంటే కాంపిటేష‌న్ ఉండేదేమో కానీ కొత్త వాళ్ల‌ని మిక్స్ చేస్తున్నారు కాబ‌ట్టి వాళ్ల‌లో పాత‌వాళ్ల‌ని విన్ చేస్తే కొత్త వాళ్ల‌కి అన్యాయం చేసిన‌ట్టు అవుతుంది. Also Read: కుమార్తె చేతుల్లో క‌న్నుమూసిన బ‌ప్పీల‌హిరి  మాజీ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లే వాళ్ల‌కి నా స‌ల‌హా ఏంటంటే జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. మిమ్మ‌ల్ని కెమెరాలు ఫోక‌స్ చేస్తుంటాయ‌ని గ‌మ‌నించండి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ నోరు జార‌కూడ‌దు. సోష‌ల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉందో చూశాం కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. రియ‌ల్ ఎమోషన్స్ తోనే ఉండాలి. అక్క‌డ ఎక్కువ యాక్ట్ చేయ‌లేం. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ కాదు కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా వుండాలి. నువ్వు నువ్వుగా ఆడితేనే జ‌నానికి న‌చ్చుతుంది" అని గీతా మాధురి బిగ్ బాస్ ఓటీటీపై కామెంట్ చేసింది.

అషురెడ్డిని ఆడుకున్న నెటిజ‌న్స్‌.. ఏం జ‌రిగింది?

అషు రెడ్డి.. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ ఫొటో షూట్ లు.. వైర‌ల్ వీడియోలు చేస్తూ నెట్టింట సంద‌డి చేస్తోంది. జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ సీజ‌న్ 3తో పాపులర్ అయిన విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ సీజ‌న్ 3లో అషు రెడ్డి చేసిన హంగ‌మా అంతా ఇంతా కాదు. ఈ షో కార‌ణంగా మ‌రింత పాపుల‌ర్ అయిన అషురెడ్డి ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల్లో పాల్గొంటూ ఆక‌ట్టుకుంటోంది. బిగ్‌బాస్ షో త‌రువాత త‌న‌కు అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని సొంతం చేసుకుంటూ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే డ‌బ్స్ మాష్ వీడియోల‌తో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేసిన అషురెడ్డి గ‌త కొన్ని రోజులుగా హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తోంది. చిత్ర విచిత్ర‌మైన భంగిమ‌ల‌తో ఫొటోల‌కు పోజులిస్తూ నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ డెనిమ్ ష‌ర్ట్ వేసుకుని బ‌ట‌న్ విప్పేసి నెట్టింట సంద‌డి చేసిన అషురెడ్డి తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో వైర‌ల్ గా మారింది. చిరిగిన ష‌ర్ట్ లా క‌నిపిస్తున్న డెనిమ్ ష‌ర్ట్ వేసుకున్న అషురెడ్డిపై నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి. Also Read: 'దృశ్యమ్ 2' షూటింగ్ మొద‌లుపెట్టిన అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ‌  చినిగిన చొక్కా తో వున్న ఫొటోని షేర్ చేసిన అషురెడ్డి `చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్త‌కం కొనుక్కో అని ఒక పెద్దాయ‌న చెప్పాడు` అంటూ స‌ద‌రు ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనిపై నెటిజ‌న్ లు సెటైర్లు వేస్తున్నారు. పాపం వీధి కుక్క‌లు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంత మందేమో చినిగిన చొక్కా వేసుకున్నావ్ స‌రే.. మ‌రి పుస్ప‌కం కొన్నావా? .. ష‌ర్ట్ మ‌రీ ఇలా చిరిగిపోయిందేంటీ? అంటూ ట్రోల్ చేస్తున్నారు.  

మోనిత ట్రాప్‌లో డాక్ట‌ర్ బాబు!

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ తాజాగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఈ మంగ‌ళ‌వారం 1282వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. ఈ రోజు మోనిత ఆడే ఆట మొద‌లు కాబోతోంది. మ‌రో సారి డాక్ట‌ర్ బాబుని అడ్డంగా బుక్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. త‌న బాబు కార్తీక్ ద‌గ్గ‌రే వున్నాడ‌ని తెలుసుకున్న మోనిత ఆసుప‌త్రికి వ‌స్తుంది. అక్క‌డే డాక్ట‌ర్ బాబు, దీప వుంటారు. అక్క‌డికి వ‌చ్చిన మోనిత మ‌ళ్లీ త‌న మాట‌ల‌తో డాక్ట‌ర్ బాబుని ఆడుకోవ‌డం మొద‌లుపెడుతుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన డాక్ట‌ర్ బాబు.. దీప చూస్తుండ‌గానే మోనిత చెంప ఛెళ్లుమ‌నిపిస్తాడు. అయినా ఆగ‌ని మోనిత తాళి చూపించి భ‌ర్త‌వ‌ని మ‌ళ్లీ రెట్టించ‌డంతో వెంట‌నే మోనిత చూపిస్తున్న తాళిని తెంచేసి త‌న ముఖాన్నే కొట్టి షాకిస్తాడు. ఏం జ‌రుగుతోందో దీప తెలుసుకునే లోపే అంతా జ‌రిగిపోతుంది. త‌న కొడుకుని త‌న‌కు అప్ప‌గిస్తే మీ జోలికి రాన‌ని చెబుతుంది మోనిత‌. Also Read: ఆప‌రేష‌న్ పేరుతో బాబాయ్‌కి స్పాట్ పెట్టిన మోనిత‌ త‌న బాబాయ్ ఆప‌రేష‌న్ పేరుతో కొత్త డ్రామాకు తెర‌లేపిన మోనిత.. బాబు పేరుతో డాక్ట‌ర్ బాబుని ట్రాప్ లో ప‌డేసే ప్లాన్ చేస్తుంది. ఇది గ‌మ‌నించిన దీప దాని మాట‌లు న‌మ్మొద్ద‌ని చెబుతున్నా డాక్ట‌ర్ బాబు విన‌కుండా 'నీ బాబుని నీకు తెచ్చిస్తాను అదే మాట‌మీద నిల‌బ‌డ‌తావా?' అని ప్ర‌శ్నిస్తాడు. అందుకు మోనిత ఓకే అంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఆప‌రేష‌న్ పేరుతో మోనిత‌ త‌న బాబాయ్ ని.. కార్తీక్ కు తెలియ‌కుండా హ‌త్య చేయించే ప్లాన్ చేసిందా? .. ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా?.. ఇంత‌కీ ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

 'ఢీ' నుంచి సుధీర్‌ని త‌ప్పించారా? త‌నే త‌ప్పుకున్నాడా?

సుడిగాలి సుధీర్ `జ‌బ‌ర్ద‌స్త్‌`, 'ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్', దేవి డ్రామా కంపెనీకామెడీ షోల‌తో నిత్యం బిజీగా వుంటున్నాడు. సుధీర్ కు బుల్లితెరపై వున్న క్రేజ్, డిమాండ్ అంద‌రికి తెలిసిందే. `జ‌బ‌ర్ద‌స్త్‌` కామెడీ షోతో సుధీర్ ఏకంగా సెల‌బ్రిటీగా మారిపోయాడు. అత‌నికి, ర‌ష్మీ గౌత‌మ్ కి మ‌ధ్య వుండే కెమిస్ట్రీ ఇద్ద‌రినీ పాపుల‌ర్ అయ్యేలా చేసింది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది అనేంత‌గా వీరి మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ కావ‌డంతో `జ‌బ‌ర్ద‌స్త్‌` వారు కూడా వీరిని కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. Also Read: సుడిగాలి సుధీర్ ఇంట్లో రోజూ నాలుగు షోలు.. ఏమాక‌థ‌? బుల్లితెర‌పై వ‌చ్చిన క్రేజ్‌తో సుడిగాలి సుధీర్ సినీ హీరోగానూ మారిన విష‌యం తెలిసిందే. హీరోగా సినిమాలు చేస్తున్నా `జ‌బ‌ర్ద‌స్త్‌` ని మాత్రం త‌ను వీడ‌టం లేదు. ఇప్ప‌టికీ కంటిన్యూ చేస్తూనే వున్నాడు. త్వ‌ర‌లో సుడిగాలి సుధీర్ `గాలోడు` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే త‌ను 'ఢీ' షోని ఎందుకు వీడాల్సి వ‌చ్చిందో వివ‌రించాడు సుధీర్‌. త‌న‌ని త‌ప్పించారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొంత మంది మాత్రం 'ఢీ' షో నుంచి సుధీర్ తానే త‌ప్పుకున్నాడ‌ని ప్ర‌చారం చేశారు. `ఢీ`షో నుంచి సుధీర్ వెళ్లిపోవ‌డం ఆ షోకు బిగ్ మైన‌స్ గా మారింది. Also Read: రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌ అయితే తాజాగా `జ‌బ‌ర్ద‌స్త్‌` ప్రోమోలో 'ఢీ' నుంచి తాను ఎందుకు బ‌య‌టికి రావాల్సి వ‌చ్చిందో వెల్ల‌డించాడు. డేట్స్ స‌మ‌స్య కార‌ణంగానే తాను `ఢీ` షో నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశాడు. 'కాలింగ్ స‌హ‌స్ర‌', 'గాలోడు' వంటి చిత్రాల్లో న‌టిస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఈ రెండు చిత్రాల్లో న‌టిస్తూనే `జ‌బ‌ర్ద‌స్త్‌`, 'శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ' షోల్లో స్కిట్ లు చేస్తున్నాడు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డంతో తాను 'ఢీ' షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాన‌ని క్లారిటీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

నెటిజ‌న్‌ల‌కు అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ!

దేత్త‌డి హారిక బిగ్ బాస్ సీజ‌న్ 4లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టాప్ 5 వ‌ర‌కు వెళ్లి త‌న స‌త్తా చాటిన హారిక నెట్టింట ఓ రేంజ్ లో సంద‌డి చేస్తోంది. సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్ గా వుంటూ నెటిజ‌న్ ల‌కు అందుబాటులో వుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ , ట్విట్ట‌ర్.. ఇలా ఏ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ని వ‌ద‌ల‌కుండా త‌న‌ని తాను వైర‌ల్ చేసుకోవ‌డం కోసం వ‌రుస పోస్ట్ ల‌తో నెటిజ‌న్ ల‌కు పిచ్చెక్కిస్తోంది. వ‌రుస ఫొటో షూట్ లు.. డ్యాన్సింగ్ వీడియోల‌తో త‌న‌లో వున్న న‌టిని కూడా ప‌రిచ‌యం చేస్తోంది. దేత్త‌డి హారిక వీడియోల‌పై కొంతమంది ప్ర‌శంస‌ల్ని కురిపిస్తుంటే మ‌రి కొంతమంది "ఇక ఈ ర‌చ్చ ఆప‌వమ్మా త‌ల్లీ" అంటూ ట్రోల్ చేస్తున్నారు. హైట్ త‌క్కువ‌గా వుండ‌టంతో హారిక‌పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ నెట్టింట వైర‌ల్ గా మారుస్తున్నారు. ఈ మ‌ధ్యే ఇలాంటి ట్రోల్స్ కి దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చింది హారిక‌. "బుడ్డ‌ది అంటే గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తా" అని ఎన్టీఆర్ డైలాగ్ ని వాడేస్తూ ఓ వీడియో చేసి మ‌రీ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా దేత్త‌డి హారిక చేసిన ఓ పని ఆమెని నెటిజ‌న్ ల‌కు అడ్డంగా బుక్క‌య్యేలా చేసింది. Also Read: పునీత్ కుటుంబంలో మరో విషాదం త‌న న‌ట‌నా ప్రావీణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ త‌న‌కి తానే `ఎక్స్‌ప్రెస్ క్లీన్‌` అని బిరుదు ఇచ్చేసుకుంది. భిన్న‌బైన హావ‌భావాల్ని ప‌లికిస్తూ ఓ వీడియోను వ‌దిలింది. అయితే ఇక్క‌డే అడ్డంగా దొరికిపోయింది. ఎక్స్‌ప్రెష‌న్‌ స్పెల్లింగ్ త‌ప్పుగా రాయ‌డంతో ఆమెని ఇప్పుడు నెటిజ‌న్స్ ఆడేసుకుంటున్నారు. 'స్పెల్లింగ్ క‌రెక్ట్ గా రాయ‌డం నేర్చుకో' అంటూ దేత్త‌డి హారిక‌ని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. మ‌రి దీనిపై హారిక ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి వీడియోతో ట్రోల‌ర్స్ కి బ‌దులిస్తుందో చూడాలి.

టార్గెట్ యాంక‌ర్ శ్యామ‌ల‌.. ఆడేసుకుంటున్నారు

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా ఆక‌ట్టుకుంటోంది శ్యామ‌ల‌. గ‌త కొంత కాలంగా న‌టిగా, యాంక‌ర్‌గా రానిస్తోంది. ఆమె భ‌ర్త న‌ర‌సింహారెడ్డి బుల్లితెర‌పై న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. అయితే ఈ ఇద్ద‌రు దంప‌తుల‌పై తాజాగా టీడీపీ క‌న్నేసింది. గ‌తంలో వీరు ఓ మ‌హిళ‌ని అడ్డంగా మోసం చేశారంటూ శ్యామ‌ల దంప‌తుల‌పై ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఆమెని టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ వ‌ర్గాలు వ‌రుస ట్వీట్ లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌లో యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త‌పై చీటింగ్ కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహారెడ్డి 2017 నుంచి త‌న వ‌ద్ద విడ‌ద‌ల వారిగా కోటి రూపాయ‌లు అప్పుగా తీసుకున్నాడ‌ని, తిరిగి ఇవ్వాల‌ని అడిగితే బెదిరింపుల‌కు పాల్ప‌డ‌ట‌మే కాకుండా వేధింపుల‌కు గురిచేశాడ‌ని ఓ మ‌హిళ రాయ‌దుర్గం పోలీసుల్ని ఆశ్ర‌యించింది. ఈ వ్య‌వహారంలో శ్యామ‌ల భ‌ర్త‌తో పాటు మ‌ధ్య వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన ఓ మ‌హిళ‌ని పై చీటింగ్ కేసు న‌మోదు చేసి ఇద్ద‌రినీ అరెస్ట్ చేశారు. ఆ త‌రువాత వారిని రిమాండ్ కు త‌ర‌లించారు. దీంతో నెట్టింట శ్యామ‌ల‌, శ్యామ‌ల భ‌ర్త‌పై ట్రోలింగ్ జ‌రిగింది. శ్యామ‌ల మాత్రం త‌న భ‌ర్త తప్పు చేయ‌డ‌ని, చేయ‌లేద‌ని, స‌ద‌రు మ‌హిళ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని సైడ్ అయింది. అయితే యాంక‌ర్ శ్యామ‌ల‌, ఆమె భ‌ర్త న‌ర‌సింహారెడ్డి వైఎస్సార్ సీపీ సానుభూతి ప‌రులు కావ‌డంతో టీడీపీ వ‌ర్గాలు ఈ ఇద్ద‌రినీ సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. Also Read: రామ్ తో పూరి హీరోయిన్ రొమాన్స్!? అయితే వీరిని టీడీపీ వ‌ర్గాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ చేయడం, వీరు పేరున్న నేత‌లు కూడా కాక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ టీడీపీ వ‌ర్గాలు శ్యామ‌ల‌, ఆమె భ‌ర్త‌ని ఎందుకు టార్గెట్ చేశారు? .. ఆ అవ‌స‌రం ఏంటీ? అన్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేద‌ట‌. వీళ్ల వెంట ప‌డ‌టంలో ఆంత‌ర్య‌మేంట‌ని ప‌లువురు ఇండస్ట్రీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

నా భ‌ర్త 'రేసుగుర్రం'లో శ్రుతి హాస‌న్ లాంటోడు!

`జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షో గ‌త కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షోకి న్యాయ నిర్ణేత‌లుగా న‌టి, ఎమ్మెల్యే రోజా, సింగ‌ర్ మ‌నో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజా ప్రోమోలో రోజా త‌న భ‌ర్త ఆర్‌.కె. సెల్వ‌మ‌ణిపై చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారాయి. "సెల్వ‌మ‌ణి 'రేసుగుర్రం'లో శృతిహాస‌న్ లాంటోడు" అంటూ రోజా సెల్వ‌మ‌ణిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. `జ‌బ‌ర్ద‌స్త్ లేటెస్ట్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్ లో రెట్రో థీమ్ తో టీమ్ మెంబ‌ర్స్ స్కిట్ లు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగానే రోజా , సెల్వ‌మ‌ణిల‌ను అనుక‌రిస్తూ క‌మెడియ‌న్ నూక‌రాజు ఓ సెటైర్ వేశాడు. ఇందులో ఇద్ద‌రు క‌మెడియ‌న్ లు రోజా ఇంటికి వెళ్లి ఆమె కొత్తింటిని చూద్దామ‌నుకుంటారు. ఇంత‌లో రోజా వ‌స్తోంద‌ని తెలిసి ఆమెకి క‌నిపించ‌కుండా దాక్కుంటారు. రోజా పాత్ర‌లో న‌టించిన న‌టి గాంభీర్యంగా చూస్తూ ఎంట్రీ ఇచ్చి అబ్బాయిల‌కు అన్యాయం జ‌రిగితే అర‌గంట ఆల‌స్యం అవుతుందేమో కానీ అమ్మాయిల‌కు అన్యాయం జ‌రిగితే మాత్రం అర‌నిమిషం కూడా ఆల‌స్యం చేయ‌నంటూ పంచ్ వేస్తుంది. ఇంత‌లో స్టేజ్ పైకి వ‌చ్చిన నూక‌రాజు రెచ్చిపోయి రోజాపై పంచ్ వేశాడు. "నా నోరు లాగుతుంది.. రోజా అందంగా వుంది" అని.. "నేనే సెల్వ‌మ‌ణి" అని పంచ్ వేశాడు. దీనికి ఆశ్చ‌ర్య‌పోయిన రోజా నూక‌రాజుని చూసి న‌వ్వేసింది. ప్రేమ‌గా అత‌న్ని అభినందించింది. Also Read: బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బ‌బ్లీ బౌన్సర్'గా మారిన త‌మ‌న్నా ఇదే సంద‌ర్భంగా రోజా త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణి సీక్రెట్ బ‌య‌ట‌పెట్టింది. నూక‌రాజు స్కిట్ ని ఉద్దేశిస్తూ .. సెల్వ‌మ‌ణి 'రేసుగుర్రం'లో శృతిహాస‌న్ లాంటోడ‌ని.. అన్నీ లోప‌లే అనుకుంటాడ‌ని, బ‌య‌ట‌కు చెప్ప‌డ‌ని కామెంట్ చేసింది రోజా. అంతే కాకుండా స్కిట్ లో చెప్పిన డైలాగ్ లు పేప‌ర్ పై రాసి ఇవ్వాల‌ని ఇంటికెళ్లాక సెల్వ‌మ‌ణితో చెప్పించుకుంటాన‌ని తెలిపింది రోజా. దీంతో అక్క‌డున్న వారంతా షాక‌య్యారు. త్వ‌ర‌లో ఈటీవీలో ప్ర‌సారం కానున్న జ‌బ‌ర్ద‌స్త్ కి సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

ఆప‌రేష‌న్ పేరుతో బాబాయ్‌కి స్పాట్ పెట్టిన మోనిత‌

బుల్లితెర పై ప్ర‌సారం అవుతున్న క్రేజీ సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ వైర‌ల్ గా మారింది. స్టార్ సెల‌బ్రిటీలు సైతం ఈ సీరియల్ టైమింగ్ గురించి ట్వీట్ చేసే స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే గ‌త కొన్ని నెల‌లుగా ఈ సీరియ‌ల్ పాపులారిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. వంట‌ల‌క్క - డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల్లో నిరుప‌మ్, ప్రేమీ విశ్వ‌నాథ్ న‌టించారు. ఈ సీరియ‌ల్ తో వీరిద్ద‌రూ టాప్ సెల‌బ్రిటీలుగా మారిపోయారు. ఈ మండే ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. త‌న బాబాయ్ ని అడ్డుపెట్టుకుని కార్తీకి మ‌ళ్లీ బుక్ చేయాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ చేసింది. Also Read: రాగ‌సుధ‌కు ఎదురుప‌డిన‌ ఆర్య వ‌ర్థ‌న్ ఏం జ‌ర‌గ‌నుంది? ఇదిలా వుంటే సౌంద‌ర్య .. మోనిత బాబాయ్ కి జ‌రిగిందంతా చెబుతుంది. మోనిత ఎలా నాట‌క‌మాడిన తీరుని వివ‌రిస్తుంది. నీకు నా కొడుకు ఆప‌రేష‌న్ చేస్తాడు. అయితే ఆ త‌రువాత నువ్వు మోనిత‌ని తీసుకుపని ఇక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని కండీష‌న్ పెడుతుంది. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన మోనిత .. కార్తీక్ కు త‌న‌కు వున్న సంబంధం నిజ‌మేని చెబుతుంది. ఆప‌రేష‌న్ కానివ్వండి.. నాకొడుకు దొర‌క‌నివ్వండి ఆ త‌రువాత మీ జోలికి రాను అంటూ సౌంద‌ర్య‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తుంది. Also Read: అనుని భ‌య‌పెట్టిన టెడ్డీబేర్ ఎవ‌రు? బాబాయ్ ఆప‌రేష‌న్ వెన‌క మోనిత మ‌రో కుట్ర‌కు తెర‌లేపుతోంద‌ని గ్ర‌హించిన సౌంద‌ర్య భ‌య‌ప‌డుతుంటుంది. ఇదే విష‌యాన్ని దీప‌తో చెబుతుంది. దీంతో కార్తీక్ ని మ‌ళ్లీ ఇరికించే ప్ర‌య‌త్నం ఏదో మోనిత చేయ‌బోతోంద‌ని కార్తీక్ ఫ్యామిలీ అంతా ఆలోచిస్తుంటారు. క‌ట్ చేస్తే త‌న బాబు ఎక్క‌డున్నాడో మోనిత‌కు తెలిసిపోతుంది. ఈ క్ర‌మంలో మోనిత ఎలాంటి ప్లాన్ వేసింది. కార్తీక్ ని ఆప‌రేష‌న్ నెపంతో మ‌రోసారి మోనిత బుక్ చేయ‌బోతోందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

సుడిగాలి సుధీర్ ఇంట్లో రోజూ నాలుగు షోలు.. ఏమాక‌థ‌?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. క‌డుపుబ్బా న‌వ్విస్తూ హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రామ్ ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను చేస్తున్న‌ స్కిట్ లు హాస్య ప్రియుల్ని అల‌రిస్తున్నాయి. న‌టి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, ప్ర‌ముఖ గాయకుడు మ‌నో ఈ కార్య‌క్ర‌మానికి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అప్పుడ‌ప్పుడు టీమ్ లీడ‌ర్ లు వేసే పంచ్ ల‌కు రోజా, మ‌నో కూడా రివర్స్ పంచు లేస్తూ కామెడీ చేస్తున్నారు. ఈ గురువారం తాజా ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. ఎప్ప‌టి లాగే సుడిగాలి సుధీర్, హైప‌ర్ ఆది ఓ రేంజ్ లో ర‌చ్చ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని విడుద‌ల చేశారు. రెట్రో లుక్ కాన్సెప్ట్ తో 80`s గెట‌ప్ ల‌తో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకే క‌ల‌ర్ డ్రెస్సుల్లో క‌నిపించి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్. "అన్న‌య్యా ర‌ష్యాలో త‌ప్పులు చేస్తే శిక్ష‌లు వేరుగా వుంటాయి క‌దా?" అని అడిగాడు హైప‌ర్ ఆది. "అవును.. నీకెలా తెలుసు?" అన్నాడు సుడిగాలి సుధీర్.. "అంద‌రికి గుండు గీస్తే నీకేంటీ మీసాలు గ‌డ్డాలు గీసేశారేంటీ అన్నయ్యా?" అని పంచ్ వేశాడు హైప‌ర్ ఆది. Also Read: రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌ దీనికి నొచ్చుకున్న సుడిగాలి సుధీర్ "అలా అంటావేంట్రా ఇప్ప‌టికే డేట్స్ కుద‌ర‌క నీతో `ఢీ`చేయ‌ట్లేద‌ని ఎంత బాధ‌ప‌డుతున్నానో తెలుసా?" అన్నాడు. "ఆ డేట్స్ లో నువ్వు ఎక్క‌డెక్క‌డ ఢీ కొడుతున్నావో నేనెంత బాధ‌ప‌డుతున్నానో నీకు తెలుసా?" అని హైప‌ర్ ఆది మ‌ళ్ళీ పంచ్ వేశాడు. "నువ్విలా అన్నావంటే `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌.. ఇలా మూడు షోలు మానేస్తా" అన్నాడు సుడిగాలి సుధీర్.. వెంట‌నే "ప్లీజ్ మానేయొద్ద‌న్న‌య్యా.." అన్నాడు హైప‌ర్ ఆది. అయితే అది విన్న సుధీర్ "ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ వీడికి" అంటూ న‌వ్వేశాడు. ఆ న‌వ్వు ముగిసే లోపే హైప‌ర్ ఆది.. సుడిగాలి సుధీర్‌కు ఫ్యూజులౌట‌య్యే పంచ్ వ‌దిలాడు... "ఈ మూడు షోలు మానేసి ఇంట్లో ఏకంగా రోజుకు నాలుగు షోలు స్టార్ట్ చేస్తావేమో" అని పంచ్ వేసేస‌రికి అక్క‌డున్న వారంతా గొల్లున న‌వ్వేశారు. న‌వ్వులు పూయిస్తున్న ఈ ఎపిసోడ్ వ‌చ్చే గురువారం ప్ర‌సారం కానుంది.

బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమల్‌ హాసన్!

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ నాని హోస్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.  ఓటీటీకి కూడా నాగార్జునే హోస్ట్. ఇక తమిళ్ విషయానికొస్తే మొదటి సీజన్ నుంచి కమల్ హాసనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటిదాకా పూర్తి చేసుకున్న ఐదు సీజన్లకు కమలే హోస్ట్. బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో ఓటీటీలో అలరిస్తున్న తరుణంలో కమల్ ఊహించని షాక్ ఇచ్చాడు. 'విక్రమ్' సినిమా కారణంగా తాను బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు. "మహమ్మారి మరియు లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా 'విక్రమ్' సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల నా మనస్సుకి ఎంతో దగ్గరైన బిగ్ బాస్ షోని వదులుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. బిగ్ స్టార్స్, టాప్ టెక్నిషీయన్స్ తో కలిసి విక్రమ్ మూవీ మిగతా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. నా కోసం వారిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా పరిస్థితిని అర్థంచేసుకొని షో నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 6 తో మిమ్మల్ని అలరిస్తాను" అని కమల్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సినిమాకి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ ఓటీటీలోకి `న‌గ్నం` బ్యూటీ

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఏ స్థాయిలో హంగామా చేసిందో తెలిసిందే. కొంత మందిని హీరోల‌ని చేస్తే మ‌రి కొంత మందిని జీరోల‌ని చేసింది. కొంత మందికి సినిమా అవ‌కాశాల‌ని అందిస్తే మరి కొంత మందికి అవ‌కాశాలు లేకుండా చేసింది. కొంత మంది జంట‌ల‌ని క‌లిపితే మ‌రి కొంత మంది జంట‌ల‌ని విడ‌గొట్టింది. దీని కార‌ణంగా ఇప్ప‌టికీ కొన్ని జంట‌లు నెట్టింట వార్త‌ల్లో నిలుస్తూనే వున్నారు. ఇదిలా వుంటే సీజ‌న్ 5 చేసిన ర‌చ్చ‌ని ఇంకా మ‌రిచిపోక‌ముందే బిగ్‌బాస్ ఓటీటీ సీజ‌న్ మొద‌లుకాబోతోంది. Also  Read: బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వివాదం కాదుగా.. ప్ర‌యోగాత్మ‌కంగా 24*7 ఈ ఓటీటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి 26 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ షోని ప్రారంభించ‌బోతున్నారు. ఇప్ప‌టికే నాగార్జున‌, వెన్నెల కిషోర్, ముర‌ళీశ‌ర్మ‌ల‌పై చిత్రీక‌రించిన ప్రోమోని ఇప్ప‌టికే రిలీజ్ చేశారు. 24 గంట‌ల కాన్సెప్ట్ తో రానున్న ఈ సీజ‌న్ ఆక‌ట్టుకోవ‌డం మీద అనుమానాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గంట‌ల‌కు గంట‌లు చూస్తే ఖ‌చ్చితంగా బోర్ ఫీల‌వుతార‌ని అంటున్నారు. ఇత‌ర భాష‌ల్లో ఓటీటీ బిగ్ బాస్ క్లిక్ కావ‌డంతో అదే పంథాని తెలుగులోనూ కొన‌సాగిస్తూ తాజ‌గా ఓటీటీ బిగ్‌బాస్ షోకు శ్రీ‌కారం చుడుతున్నారు. Also  Read: ముంబైలో ఒకేసారి రెండు కొత్త ఫ్లాట్‌లు కొన్న కాజోల్‌! ధ‌ర ఎంతంటే... ఇప్ప‌టికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్ట్ లీక్ కాగా తాజాగా వ‌ర్మ హీరోయిన్ `న‌గ్నం` ఫేమ్ శ్రీ రాపాక పేరు బ‌య‌టికి వ‌చ్చింది. త‌ను గ‌న‌క షోలోకి ఎంట్రీ ఇస్తే హంగామా మామూలుగా వుండ‌ద‌ని, వినోదంతో పాటు క‌నువిందైన వినోదం పుష్క‌లంగా దొరుకుతుంద‌ని, ఓటీటీ బిగ్ బాస్ కు ఇలాంటి వాళ్లే ప్ర‌ధాన పాత్ర పోషించ‌బోతున్నార‌ని, కావాల్సి నంత కంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. మ‌రి `న‌గ్నం` ఫేమ్ శ్రీ రాపాక బిగ్ బాస్ ఓటీటీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందా?.. ఇస్తే ఎంత డిమాండ్ చేయ‌నుంది అన్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.   

రాగ‌సుధ‌కు ఎదురుప‌డిన‌ ఆర్య వ‌ర్థ‌న్ ఏం జ‌ర‌గ‌నుంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. శ్రీరామ్ వెంక‌ట్‌, వ‌ర్ష కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత‌. అనుషా సంతోష్ కీల‌క పాత్రలు పోషించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ఉత్కఠ‌భ‌రిత స‌న్నివేశాల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం ఏం జ‌ర‌గ‌నుందో ఒక సారి చూద్దాం. రాగ‌సుధ‌, అను క‌లిసి రెస్టారెంట్ కి వెళతారు. ఆర్య వ‌ర్థ‌న్ త‌న ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ కార‌ణంగా టీమ్ తో క‌లిసి ఇదే రెస్టారెంట్ కి వ‌స్తాడు.   క‌ట్ చేస్తే మాన్సీ మాత్రం మందుకు అల‌వాటు ప‌డిపోతుంది. ఏకంగా ఇంట్లోనే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. ఇంటికి వ‌చ్చిన ఫ్రెండ్స్ తో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ వుంటుంది. మాన్సీ నువ్వు ఇంకా మారాలంటూ త‌మ ఇంట్లో వారు ఏం చేస్తున్నారో.. ఇంటి వారిని ఎలా లొంగ‌దీసుకుంటున్నారో ఎబుతుంటారు. దీంతో మాన్సీ.. నీర‌జ్‌తో పాటు త‌న అత్త నిర్మ‌లాదేవికి ఫోన్ చేసి ఇంటికి ర‌మ్మంటుంది. క‌ట్ చేస్తే రెస్టారెంట్ లో ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ లేట‌వుతుండ‌టంతో అను.. రాగ‌సుధ ని నీ గురించి చెప్ప‌మంటుంది. అయితే రాగ‌సుధ తెలివిగా ముందు నీ ఫ్యామిలీ గురించి చెప్పుఅంటుంది. Also Read: బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బ‌బ్లీ బౌన్సర్'గా మారిన త‌మ‌న్నా అయ‌నా అను ముందు నీ ఫ్యామిలీ గురించి చెప్ప‌ని తిరిగి అగ‌డ‌టంతో నేను ఒంట‌రిదానిన‌ని, నాకు ఎవ‌రూ లేర‌ని చెబుతుంది.. అయినా అను .. రాగ‌సుధ గురించి ఇంకా తెలుసుకోవాల‌ని త‌న‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది.. అయినా రాగ‌సుధ చెప్ప‌దు. ఇంత‌లో వీళ్లు ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ వ‌చ్చేస్తుంది. అయితే వెయిట‌ర్ పొర‌పాటుగా క‌ర్రీ రాగ‌సుధ చీర‌పై ప‌డేలా పెడ‌తాడు. దీంతో క్లీన్ చేసుకోవ‌డానికి వాష్ రూమ్ కి వెళుతుంది.. తిరిగి బ‌య‌టికి వ‌స్తుండ‌గా .. రాగ‌సుధ‌కు ఆర్య‌వ‌ర్థ‌న్ ఎదురుప‌డ‌తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రాగ‌సుధ ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

అనుని భ‌య‌పెట్టిన టెడ్డీబేర్ ఎవ‌రు?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. జీ తెలుగులో గ‌త కొన్ని వ‌రాలుగా ప్ర‌సారం అవుతున్నఈ సీరియ‌ల్ కు మ‌రాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారం. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత‌, విశ్వ‌మోహ‌న్‌, జ్యోతిరెడ్డి, అనుషా సంతోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జీ తెలుగులో రేటింగ్ ప‌రంగా ముందు వ‌రుస‌లో వుంది. Also read: ఆర్య‌వ‌ర్ధ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా? గురువారం హైలైట్ స్ ఏంటో చూద్దాం. మాన్సీ రాక‌పోవ‌డంతో నీర‌జ్ కంగారుప‌డుతూ వుంటాడు. ఇంత‌లో మాన్సీ ఫుల్లుగా తాగేసి తూలుతూ వ‌స్తూ వుంటుంది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సీ .. మామిల్లా త‌మ్ముంటే కిందిరిరా అంటూ అరుస్తుంటుంది. అదే స‌మ‌యంలో త‌న త‌ల్లి నిర్మ‌లాదేవి కిందికి దిగుతుండ‌టం గ‌మ‌నించిన నీర‌జ్.. త‌న భార్య నోరు మూసి గ‌దిలోకి తీసుకెళ‌తాడు. ఆ దృశ్యం నీర‌జ్ త‌ల్లి కంట‌ప‌డుతుంది. వెంట‌నే త‌న‌కి క‌ళ్లు తిరిగి అలా చేస్తోంద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తాడు. క‌ట్ చేస్తే.. గెస్ట్ హౌస్ లో వాలెంటైన్స్ డే సెల‌బ్రేష‌న్స్ అంటూ అక్క‌డే వుండిపోయిన ఆర్య‌వ‌ర్ధ‌న్‌.. అనుతో రొమాంటిక్ ఆట‌లు ఆడుతూ మొత్తానికి లిప్ లాక్ లాగించేస్తాడు. క‌ట్ చేస్తే.. ఆర్య‌వ‌ర్ధ‌న్ క‌నిపించ‌క‌పోవడంతో ఎక్క‌డ వున్నార‌ని అను వెతుకుతూ వుంటుంది. ఇంత‌లో అనురూమ్‌లో టెడ్డీ బేర్ గెట‌ప్ లో ఎంట్రీ ఇచ్చిన ఓ యువ‌కుడు అనుని భ‌య‌పెట్ట‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఇంత‌కీ టెడ్డీబేర్ రూపంలో వ‌చ్చింది ఎవ‌రు? .. ఆ వ్య‌క్తిని ఆర్య‌వ‌ర్ధ‌నే ఏర్పాటు చేయించాడా? .. దీనిపై అను రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వివాదం కాదుగా..

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీని కార‌ణంగా కొన్ని జంట‌లు విడిపోవ‌డం.. కొంత మంది మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డం తెలిసిందే. అయితే ఈ షో ఎంత వివాదాల‌ని సృష్టించిందో అంతే పాపులారిటీని కూడా సొంతం చేసుకుంది. ఇప్ప‌టికీ అదే పంథాని కంటిన్యూ చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీలోనూ ప్ర‌సారం కాబోతోంది. అయితే ఈ సారి ట్రెండ్ మార్చారు. గంట నిడితో కాకుండా 24 గంట‌లు స్ట్రీమింగ్ కాన్సెప్ట్ తో వ‌స్తున్నారు. తాజాగా ఓటీటీ బిగ్‌బాస్ షోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఓటీటీ బిగ్‌బాస్ షోకు కూడా నాగార్జున‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రింస్తున్నారు. నాగార్జున‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌ల‌పై బిగ్‌బాస్ ఓటీటీ ప్ర‌మోష‌న‌ల్ ప్రోమోని వ‌దిలారు. ఇందులో వెన్నెల కిషోర్ దొంగ పొర‌పాటున ఓ వ్య‌క్తిని మ‌ర్డ‌ర్ చేస్తాడు. అత‌న్ని ప‌ట్టుకున్న ముర‌ళీశ‌ర్మ కోర్టులో హాజ‌రు ప‌రిస్తే అత‌ని త‌రుపున వాదించే లాయ‌ర్ గా నాగార్జున క‌నిపించారు. ఫైన‌ల్ గా వెన్నెల కిషోర్ కి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది.   అత‌ని శిక్ష‌ని ఎలాగైనా త‌ప్పించాల‌ని ప్ర‌య‌త్నించే లాయ‌ర్ నాగార్జున అత‌ని చివ‌రి కోరిక‌గా బిగ్‌బాస్ ఎపిసోడ్ ని చూపించండి అని ముర‌ళీశ‌ర్మ‌ని కోర‌తాడు. గంటే క‌దా అని ఓకే అంటాడు. కానీ ఇది 24 గంట‌లలు స్ట్రీమింగ్ అయ్యే షో  కావ‌డంతో ఎంత‌కీ పూర్త‌వ్వ‌దే  అని ముందు అస‌హ‌నం వ్య‌క్తం చేసినా ఆ త‌రువాత వెన్నెల కిషోర్‌, నాగార్జున‌తో క‌లిసి త‌ను కూడా చూడ‌టం మొద‌లుపెడ‌తాడు. ఉరిశిక్ష వేయాల్సిన త‌లారీ, శిక్ష వేసిన జ‌డ్జి, సెంట్రీగా వుండాల్సిన పోలీసులు కూడా క‌ర్త‌వ్యాన్ని ప‌క్క‌న పెట్టి షోని చూడ‌టం మొద‌లుపెడ‌తారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. Also Read : 'బిగ్ బాస్' ఫేమ్ 'సరయు' అరెస్ట్!   ఇలాంటి ప్రోమోల‌పై విమ‌ర్శ‌లు త‌లెత్తుతున్న విష‌యం తెలిసిందే. మ‌రి బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో కూడా వివాదం అయ్యే అవ‌కాశాలు వున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ షో ఈ నెల 26 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.  

న‌య‌ని ప్ర‌యోగం ఫ‌లించిందా?

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌క‌గ‌బోయేది ముందే గ‌మ‌నించే ఓ అమ్మాయి చుట్టూ జరిగే ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. క‌న్న‌డ న‌టీన‌టులు చందు గౌడ‌, అషిక గోపాల్ ప‌డుకోన్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనిల్ చౌద‌రి, చ‌ల్లా చందు, నిహారిక‌, ప్రియాంక చౌద‌రి, విష్ణు ప్రియ‌, జ‌య‌రామ్ ప‌విత్ర‌, శ్రీ స‌త్య‌, భావ‌నా రెడ్డి న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్ సాగుతోంది. ప్ర‌మాదం కార‌ణంగా క‌ళ్లు పోగొట్టుకున్న విశాల్ కు మ‌రో వ్య‌క్తి క‌ళ్ల‌ని దానం చేయ‌డం వాటిని విశాల్ కు పెడ‌తారు. అప్ప‌టి నుంచి గ‌తం మ‌ర్చిపోయిన విశాల్ త‌న భార్య న‌య‌న‌ని త‌ప్ప అంద‌రిని గుర్తుంచుకుంటాడు. దీంతో త‌న భ‌ర్త‌కు గ‌తం గుర్తు చేయాల‌ని న‌య‌న ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. ఈ క్ర‌మంలో త్రిన‌య‌నిలా మారి విశాల్ కు గ‌తం గుర్తు చేయాల‌ని ఏర్పాట్లు చేస్తుంది. Also Read: య‌ష్ - వేద‌ల పెళ్లి .. మాళ‌విక‌కు తెలిసిపోతుందా? ఇది విశాల్ స‌వ‌తి త‌ల్లికి ఏ మాత్రం న‌చ్చ‌దు. ఎక్కడ గ‌తం గుర్తుకొస్తే త‌న జీవితం ముగిసిపోతుందోన‌ని న‌య‌న‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయినా న‌య‌నికి ఇంట స‌భ్యుల స‌హ‌కారం ల‌భించ‌డంతో పుట్టిన రోజు అని అబ‌ద్ధం చెప్పి విశాల్ కు గ‌తం గుర్తొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. విశాల్ ని తొలిసారి క‌లిసిన  సంద‌ర్భంలో ఎలాంటి వేష‌ధార‌ణ‌తో వుందో మ‌ళ్లీ అదే వేష‌ధార‌ణ‌తో రెడీ అయి వ‌స్తుంది న‌య‌ని. దీంతో ఏదో చేయ‌బోతోంద‌ని విశాల్ స్టెప్ మ‌ద‌ర్ భ‌య‌ప‌డుతూ వుంటుంది.  ఈ క్ర‌మంలోనే విశాల్ త‌ల‌పై క‌ర్ర‌తో కొడ‌తుంది న‌య‌న‌. అది చూసి షాక్ అయిన విశాల్ త‌ల్లి న‌య‌న‌ని ఇంటి నుంచి త‌రిమేయాల‌ని చూస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  విశాల్ కు గ‌తం గుర్తొచ్చిందా? .. న‌య‌ని ప్ర‌యోగం ఫ‌లించిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

వేద‌ని టెన్ష‌న్ పెట్టిన మాళ‌విక‌.. ఏం జ‌రిగింది?

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. గ‌త కొన్ని వారాలుగా `స్టార్ మా` ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓ పాప నేప‌థ్యంలో సాగే ఈ సీరియ‌ల్ స‌రికొత్త‌గా సాగుతూ పిల్ల‌తో పాటు పెద్ద‌ల్నీ ఆక‌ట్టుకుంటోంది. ఖుషీ కోసం పెళ్లికి డాక్ట‌ర్ వేద‌, య‌ష్ రెడీ అయిపోతారు. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగిపోతోంది. ఇక పెళ్లి ఏర్పాట్ల‌లో మునిగిపోయిన ఇరు కుటుంబాలు పెళ్లిలో ఎలా డ్యాన్స్ చేయాలో ప్ర‌త్యేకంగా డ్యాన్స్ మాస్ట‌ర్ ల‌ని పిలిపించి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. క‌ట్ చేస్తే... అభిమ‌న్యు - మాళ‌విక ఇద్ద‌రూ క‌లిసి ఖుషీతో మాట్లాడుతూ వుంటారు. నిన్ను అమెరికా పంపించి పెద్ద చ‌దువులు చ‌దివిస్తాన‌ని, వెళ‌తావా? అంటాడు అభిమ‌న్యు. అందుకు ఖుషీ వెళ్ల‌నంటుంది. మ‌రి ఇండియాలో వుండి ఏం చేస్తావు మిస్ ఇండియా అవుతావా?.. మిస్ మోడ‌ల్ అవుతావా? అంటాడు. ఆ మాట‌ల‌కు మాళ‌విక సీరియ‌స్ అవుతుంది. చిన్న పిల్ల‌తో ఏంటా మాట‌లు అంటూ అభిని నిల‌దీస్తుంది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి వేద సంగ‌తేంటో క‌నుక్కోమంటాడు అభిమ‌న్యు. నేను చూసుకుంటానంటుంది మాళ‌విక‌. క‌ట్ చేస్తే.. వేద‌కు ఫోన్ చేసి త‌న‌తో మాట్లాడాల‌ని, బ‌య‌టికి ర‌మ్మంటాడు య‌ష్‌.. చెల్లెలితో బ‌య‌టకొచ్చిన వేద య‌ష్ ముందు పోజు కొడుతుంది. ఐదు నిమిషాలు టైమ్ ఇస్తున్నానంటూ బెట్టుని ప్ర‌ద‌ర్శిస్తుంది. ఆ స‌మ‌యం కుద‌ర‌ద‌ని య‌ష్ చెప్ప‌డంతో పోనీ అర‌గంట తీసుకోండి అంటుంది. ఎంగేజ్‌మెంట్ రింగ్ గోల్డ్ ది కాదుక‌దా నాతో వ‌స్తే మంచి ఉంగ‌రం కొనిస్తానంటాడు. అయితే `ఖ‌రీదైన ఉంగ‌రాలు షాప్ లో చాలా వుండొచ్చు.. కానీ వెల‌క‌ట్ట‌లేని వ‌స్తువు ఏదైనా వుందంటే అది ఇదే అంటూ ఖుషీ చేసిన రింగ్ ని చూపిస్తుంది. ఇద్ద‌రూ ఇలా మాట్లాడుకుంటుండ‌గా అభిమ‌న్యు, మాళ‌విక అక్క‌డికి వ‌స్తారు. ఇద్ద‌రిని అలా చూసి వాళ్ల‌లో అనుమానం మొద‌ల‌వుతుంది. Also Read: య‌ష్ - వేద‌ల పెళ్లికి లైన్ క్లియ‌ర్   వెంట‌నే మాళ‌విక కారు దిగి వేద ద‌గ్గ‌రికి వెళుతుంది. త‌న‌ని చూసిన య‌ష్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. వేద షాక్ అవుతుంది. య‌ష్‌తో రాసుకుపూసుకు తిర‌గ‌డం ఏమీ బాగాలేద‌ని వేద‌ని నిల‌దీస్తుంది. నీ ఎంగేజ్ మెంట్ కి వ‌చ్చాన‌ని, అక్క‌డ య‌ష్ ఫ్యామిలీ హంగామా చేయ‌డం త‌న‌కు న‌చ్చ‌లేదంటుంది. అంతే కాకుండా ఖుషీని వేద‌కు అప్ప‌గిస్తూ ఇంత‌కీ నీకు కాబోయే భ‌ర్త ఎవ‌రు?  అంటుంది. నువ్వు చెప్ప‌కుండా దాటేస్తున్నా త‌నెవ‌రో తెలిసిపోయిందంటూ వేద‌కు షాకిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ఆర్య‌వ‌ర్ధ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

బుల్లితెరపై ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స్టోరీని త‌ల‌పిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తోంది. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత, జ్యోతిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. గ‌త కొన్ని వారాలుగా అనూహ్య మ‌లుపుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ వీక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రాగ‌సుధ త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్దే వుంద‌ని తెలుసుకున్న అను వెంట‌నే త‌న‌ని క‌ల‌వాల‌ని, మాట్లాడాల‌ని టిఫిన్ తండ్రి సుబ్బు న‌డుపుతున్న టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చేస్తుంది. అక్క‌డ రాగ‌సుధ ని క‌లిసి తను నా అక్క అన‌డంతో సుబ్బు షాక్ కు గుర‌వుతాడు. త‌ను నీకు అక్క ఏంటి బుజ్జ‌మ్మా అంటూ అనుని అడుగుతాడు. ఆ విష‌యం ప‌ట్టించుకోకుండా అను సుబ్బు పై సీరియ‌స్ అవుతుంది. ఇలా అక్క‌తో ప‌ని చేయించ‌డం ఏమీ బాగాలేదంటుంది. అను ఏం మాట్లాడుతుందో.. ఎందుకు ఇలా మాట్లాడుతుందో రాగ‌సుధ‌తో పాటు, సుబ్బుకు అర్థం కాదు. Also Read:  చేతికి చిక్కిన వ‌శిష్ట‌కు చుక్క‌లు చూపిస్తున్న జెండే క‌ట్ చేస్తే ...వశిష్ట‌ని బంధించిన చోట జెండే .. ఆర్య వ‌ర్థ‌న్ కోసం ఎదురుచూస్తుంటాడు. అక్క‌డికి ఆర్య‌వ‌ర్థ‌న్ రావ‌డంతో రాగ‌సుధ‌ని ప‌ట్టుకునే క్ర‌మంలో మ‌నం ఫాలో అవుతున్న ప్లాన్ క‌రెక్ట్ కాదేమో.. ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ మారిస్తే మంచిదేమో అంటాడు జెండే.. వెంట‌నే మాస్ట‌ర్ ప్లాన్ వేసిన ఆర్య‌వ‌ర్థ‌న్ .. వ‌శీష్ట‌ని వ‌దిలెయ్ అంటాడు. ఆర్య మాట‌ల‌కు షాక్ అయిన జెండే.. ఆర్యా ఏం మాట్లాడుతున్నావ‌ని విస్మ‌యం వ్య‌క్తం చేస్తాడు. పెద్ద చేప‌కు వ‌లేస్తే చిన్న చేప ఇరుక్కుంది. అదే చిన్న చేప‌ని ఎర‌గా వేసి పెద్ద చేప‌ను ప‌ట్టుకుందాం` అంటాడు ఆర్య‌. ఆ మాట‌లు విన్న జెండే ఆలోచ‌న బాగుంది అంటాడు.. Also Read:   రాగ‌సుధ‌కు అను గ‌త జ‌న్మ ర‌హ‌స్యం చెప్పేస్తుందా? వెంట‌నే వ‌శిష్ట‌ని వ‌దిలి పెట్టి అత‌ను రాగ‌సుధ వ‌ద్ద‌కు వెళ్ల‌గానే ఇద్ద‌రిని చంపేయాల‌ని త‌న అనుచ‌రుల‌కు సూచిస్తాడు జెండే. అనుకున్న‌ట్టే త‌ప్పించుకున్న వ‌శిష్ట .. రాగ‌సుధ ని వెతుక్కుంటూ వెళుతుంటాడు. అత‌నికి తెలియ‌కుండా జెండే మ‌నుషులు వెంటాడుతుంటారు. ఇంత‌కీ ఆర్య‌వ‌ర్థ‌న్ వేసిన మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా?.. రాగ‌సుధ‌.. ఆర్య‌వ‌ర్ధ‌న్ వ‌ల‌లో చిక్కిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ సీజ‌న్ లో విజే స‌న్నీ విజేత‌గా, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ర‌న్న‌ర‌ప్ నిల‌వ‌డం తెలిసిందే. అయితే ఈ సీజ‌న్ ఓ రేంజ్ లో ర‌చ్చ‌కు తెర‌లేపింది. చివ‌రి వారాల్లో ష‌ణ్ముఖ్‌, సిరిల మ‌ధ్య జ‌రిగిన ఎపిసోడ్ నెట్టింట బిగ్‌బాస్ పై విమ‌ర్శ‌లు కురిపించింది. షో నిర్వాహ‌కుల‌పై నెటిజ‌న్స్ మండిప‌డేలా చేసింది. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ గ్రాండ్ ఫినాలే వేదిక‌గా హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ షో గురించి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఓటీటీ బిగ్‌బాస్ షో పై ర‌క ర‌కాల వార్త‌లు పుట్టుకొస్తూనే వున్నాయి. ఫైన‌ల్లీ.. అఫీషియ‌ల్ గా ఓటీటీ రియాలీటీ షోకు సంబంధించిన ప్రోమోని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ విడుద‌ల చేసి క్లారిటీ ఇచ్చేసింది. 24 గంట‌ల పాటు సాగే ఈ షో స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి ప్రారంభం కాబోతోంది?.. కంటెస్టెంట్స్ ఎంత మంది ఎవ‌రెవ‌రు అన్న డిటైల్స్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ సీజన్ లో 16  నుంచి 18 మంది కంటెస్టెంట్ లు వుంటార‌ని, ఇప్ప‌టికే వారిని నిర్వాహ‌కులు ఎంపిక చేశార‌ని, ఈ నెల 15 నుంచి వారంతా క్వారెంటైన్ కు వెళ్ల‌బోతున్నార‌ని తెలిసింది. Also Read: పెళ్లి కాకుండానే విడాకులా?.. బిగ్ బాస్ హిమజ ఫైర్! ఈ నెల 26 నుంచే ఓటీటీలో బిగ్ బాస్ రియాలిటీ షో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంద‌ని తెలిసింది. ఇందులో గ‌త సీజ‌న్ ల‌లో పాల్గొన్న వారితో పాటు కొత్త వారు కూడా వుండ‌బోతున్నారు. వారిలో యాంక‌ర్ స్ర‌వంతి, యాంక‌ర్ శివ‌, విశ్వ‌క్‌, అర్జున్‌, అనిల్ రాథోడ్ (మోడ‌ల్‌), మ‌హేష్ విట్టా, అషురెడ్డి, 7 ఆర్ట్స్ స‌ర‌యు, అఖిల్‌, అరియానా త‌దిత‌రులు ఇప్ప‌టి వ‌ర‌కు ఫైన‌ల్ అయిన కంటెస్టెంట్ లు. ఈ షోకు కూడా నాగార్జ‌న‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.