సెల్ఫీలు దిగేంత మొహం నాది కాదు!

ఫైమా జబర్దస్త్ లో అప్ కమింగ్  కమెడియన్. జబర్దస్త్ షోలో మూతి, ముక్కు వంకర్లు తిప్పుతూ ఒక రకమైన కామెడీని పండిస్తూ అలరిస్తోంది. కానీ ఫైమా ఒకప్పుడు ఎంతో పేదరికాన్ని అనుభవించింది. నాకు ఐదు, పది రూపాయలు కావాలంటే మా అమ్మ బీడీలు చుట్టి అవి అమ్మి ఆ డబ్బులు ఇచ్చేది. అన్ని కష్టాలు పడిన నాకు ఈ జబర్దస్త్ షో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. ఎవరైనా మా ఇంటి అడ్రస్ అడిగినా సరిగా చెప్పలేకపోయేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారయ్యింది. సెల్ఫీలు తీసుకునేంత మొహం నాకు లేకపోయినా నాతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇంటి అడ్రస్ అడుగుతుంటే మా ఇంటి పక్కనే అని చెప్పుకుంటున్నారు. నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బులెట్ భాస్కర్ అన్న నాకు మంచి లైఫ్ ఇచ్చాడు. నాతో కామెడీ షో ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నాకొచ్చిన పేరు చూసి మా అమ్మా నానా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పటికైనా మా అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వాలన్నదే నా కోరిక అంటూ ఫైమా ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాట చెప్పింది.

మోనిత‌లా మారిన శోభ‌.. కుట్ర‌లు మ‌ళ్లీ షురూ

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. ఈ సోమ‌వారం క‌థ ఎలాంటి మ‌లుపులు తిరుగుతోంది?.. ఎలాంటి ట్విస్ట్ ల‌కు నాంది ప‌ల‌క‌బోతోంది అన్న‌ది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో జ్వాల (శౌర్య).. నిరుప‌మ్ కు షాకిస్తుంది. ఎప్ప‌టి నుంచో నీకు ఒక‌టి చెప్పాలి అనుకుంటున్నాను `ఐ ల‌వ్ యూ..` అంటుంది. ఆ మాట‌ల‌కు నిరుప‌మ్ ఒక్క‌సారిగా షాక్ అవుతాడు. అస‌లు నా గురించి ఏమ‌నుకుంటున్నావు? అని అడుగుతాడు. ఆ వెంట‌నే ఇంత లేటుగానా చెప్ప‌డం అంటూ న‌వ్వేస్తాడు. నిరుప‌మ్ రియాక్ష‌న్ చూసి జ్వాల సంతోషిస్తుంది. క‌ట్ చేస్తే ఇదంతా జ్వాల ఊహ మాత్ర‌మే. ఊహ‌ల్లోంచి బ‌య‌టికి వ‌చ్చి డాక్ట‌ర్ సాబ్ పేరు చెప్ప‌గానే నా మ‌న‌సు గాల్లో తేలిపోతూ వుంటుంద‌ని హిమ‌తో చెబుతుంది. అంతే కాకుండా నిరుప‌మ్ ని నేను పెళ్లి చేసుకోవ‌డం ఏంటీ? అని చిరాకు ప‌డుతుంది. ఆ త‌రువాత జ్వాల‌, నిరుప‌మ్ ల‌ని హిమ ఒక చోట క‌ల‌పాల‌ని ప్లాన్ చేస్తుంది. అదే స‌మ‌యంలో డాక్ట‌ర్ సాబ్ కు నా మ‌న‌సులో మాట చెప్పేయ‌బోతున్నానంటూ జ్వాల‌ ఆనందాన్ని వ్య‌క్తం  చేస్తూ వుంటుంది.   జ్వాల‌, నిరుప‌మ్  ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి పూల‌తో ఏడు అడుగ‌ల‌ని అలంక‌రిస్తుంది హిమ‌. చీర క‌ట్టులో అందంగా ముస్తాబైన జ్వాల ఆ పూల‌పై న‌డుస్తూ నిరుప‌మ్ ద‌గ్గ‌రికి వెళుతూ వుంటుంది. అయితే నిరుప‌మ్ మాత్రం అయిష్టంగానే వుంటూ త‌న మ‌న‌సు నిండ హిమ‌నే వుంద‌ని, హిమ‌ని త‌ప్ప ఎవ‌రినీ పెళ్లి చేసుకోన‌ని జ్వాల‌కు చెప్పాని నిరుప‌మ్ మ‌న‌సులో అనుకుంటుంటాడు. క‌ట్ చేస్తే జ్వాల‌కు ఎవ‌రో ఫోన్ చేస్తే దీంతో వ‌చ్చిన విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి జ్వాల అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.  హిమ అడిగితే త‌న శ‌త్రువు హిమ ఫోన్ చేసిందంటూ చెప్పడంతో హిమ ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. ఫోన్ చేసింది శోభ.. మోనిత‌లా మారి హిమ - జ్వాల మ‌ధ్య చిచ్చుకు ప్లాన్ చేయ‌డం కొన‌మెరుపు.  

ఆర్య వ‌ర్ధ‌న్ మైండ్ లో ఏముంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. థ్రిల్లింగ్ క‌థాంశంతో రూపొందిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఇది. ట్విస్ట్ లు, చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ ఆత్మ ప‌గా, ప్ర‌తీకారం నేప‌థ్యంలో సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త వారం నుంచి చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. అనుని అడ్డం పెట్టుకుని తెలివిగా ఆర్య వ‌ర్ధ‌న్ ని లాక్ చేస్తుంది రాగ‌సుధ‌. గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్ కి అడ్డంగా నిలిచి ఆర్య‌ని మూడు రోజుల పాటు క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని రిక్వెస్ట్ చేస్తుంది. త‌ను అనుకున్న‌ట్టుగానే గ‌వ‌ర్న‌ర్ పోలీసుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ఆర్య వ‌ర్థ‌న్ ని పోలీసులు మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి తీసుకుంటారు. ఇది భ‌రించలేని అను రాగ‌సుధ వుంటున్న ఇంటికి వెళ్లి త‌న చెంప‌లు వాయించి హత్య చేసేంత ప‌ని చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ దృశ్యాల‌ని మీడియా క్యాప్చ‌ర్ చేసేలా చేస్తుంది. విష‌యం తెలిసి ఆర్య అక్క‌డి నుంచి అనుని వెళ్లిపొమ్మ‌ని చెబుతాడు. దీంతో ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో అను అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. మూడు రోజుల క‌స్ట‌డీకి అంగీక‌రించిన ఆర్య ఎలాంటి ప‌నులు చేయ‌కుండా, రాగ‌సుధ ఆట‌క‌ట్టించే ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కుండా సైలెంట్ అయిపోతాడు. ఇంత‌కీ ఆర్య మైండ్ లో ఏముంది? .. రాగ‌సుధ రెచ్చిపోతున్నా ఆర్య మౌనం వ‌హించ‌డానికి వెన‌కున్న మ‌త‌ల‌బేంటీ? ..ఏం ప్లాన్ చేయ‌బోతున్నాడు? ఇప్ప‌టికే ఆ ప్లాన్ ని మొద‌లు పెట్టాడా? .. ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్. అదేంటో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

య‌ష్ హెచ్చ‌రించినా విన‌కుండా రిస్క్ చేసిన వేద‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్ బీఎస్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సుమిత్ర తదిత‌రులు న‌టించారు. య‌ష్ బావ లోకేష్ ఎంట్రీతో క‌థ కొత్త మ‌లుపు తిరుగుతుంది. రావ‌ణుడి లాంటి క్యారెక్ట‌ర్ కావ‌డంతో వ‌చ్చి రావ‌డ‌మే వేద‌పై క‌న్నేస్తాడు లోకేష్. త‌న‌ని ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని, ముట్టుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు... చివ‌రికి వేద బెడ్రూమ్ లోకి కూడా వెళ్లి త‌న‌ని అస‌భ్యంగా తాకాల‌ని చూస్తాడు. ఇదిలా వుంటే వేద త‌న అమాయ‌క‌త్వంతో ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటుంది. కాల‌నీలో ఓ యువ‌తికి పురిటి నొప్పులు రావ‌డంతో త‌నే డెలివ‌రీ చేయాల‌ని స‌ద‌రు యువ‌తి త‌ల్లి ప‌ట్టుప‌డుతుంది. ఇదే విష‌యం ఆఫీస్ లో వున్న య‌ష్ కి చెబితే అన‌వ‌స‌రంగా రిస్క్ అవుతుంది అంటాడు. తేడా వ‌స్తే డాక్ట‌ర్ లైసెన్స్ ర‌ద్ద‌వుతుంద‌ని చెబుతాడు. అయినా స‌రే వేద‌ని స‌ద‌రు యువ‌తి త‌ల్లి బ‌ల‌వంత‌పెట్ట‌డంతో తానే హాస్పిట‌ల్ కి త‌న కారులోనే తీసుకెళుతుంది. ఈ క్ర‌మంలో కొంతమంది రోడ్డుపైనే ధ‌ర్నా చేస్తూ రాస్తా రోకో చేస్తుంటారు. వారితో చ‌ర్చించి వేద హాస్పిట‌ల్ కు తీసుకెళ్లాల‌ని అనుకుంటుంది కానీ కుద‌ర‌క‌పోవ‌డంతో ఓ తోపుడు బండిపైనే డెలివ‌రీ చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. య‌ష్‌ భ‌యం నిజ‌మైందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

`జ‌బ‌ర్ద‌స్త్` న‌రేష్ కు మెగాస్టార్ బంప‌ర్ ఆఫ‌ర్‌?

`జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న క‌మెడియ‌న్ లు చాలా మందే వున్నారు. అందులో న‌రేష్ ఒక‌రు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా క‌నిపించే న‌రేష్ `జ‌బ‌ర్ద‌స్త్` షోలో త‌న‌దైన పంచ్ లు వేస్తూ న‌వ్వులు పూయిస్తున్నాడు. ఎందో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. వ‌రంగ‌ల్ జిల్లాలో పుట్టిన న‌రేష్ సినిమాల్లో న‌టించాల‌నే ఆశ‌తో హైద‌రాబాద్ వ‌చ్చాడు. అలా అవ‌కాశాల కోసం చూస్తున్న అత‌నికి `జ‌బ‌ర్ద‌స్త్` మంచి వేదిక‌గా మారి అత‌న్ని క‌మెడియ‌న్ గా ఆక‌ట్టుకున్నాడు. అంచెలంచెలుగా `జ‌బ‌ర్ద‌స్త్` లో ఎదుగుతున్న న‌రేష్ కు తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింద‌ట‌. ఈ విషయాన్ని స్వ‌యంగా క‌మెడియ‌న్ న‌రేష్ వెల్ల‌డించాడు. ఓ యూట్యూబ్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. `జ‌బ‌ర్ద‌స్త్` జ‌ర్నీ చాలా హ్యాపీగా సాగుతోంద‌ని ఇప్ప‌టికే కారు కొన్నాన‌ని. త్వ‌ర‌లోనే ఇల్లు కొన‌బోతున్నాన‌ని తెలిపాడు. ఈ ఏడాదే ఇల్లు కొన‌బోతున్నాన‌ని, ఆ త‌రువాతే పెళ్లి కూడా చేసుకుంటాన‌ని తెలిపాడు. ఇక త‌న పెళ్లి ఓ విత్రం అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు. అయితే అమ్మాయిని ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని, అయితే ఇల్లు కొన‌గానే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాన‌న్నాడు. పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు ఎలాంటి వొత్తిడి చేయ‌డం లేద‌ని తెలిపాడు. ఇదే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త‌న‌కొచ్చి బిగ్ ఆఫ‌ర్ ని బ‌య‌ట‌పెట్టాడు. చిరంజీవిగారిని ఒక్క‌సారైనా క‌ల‌వాల‌న్న‌ది నా డ్రీమ్ అని, అయితే ఆయ‌నే స్వ‌యంగా `భోళా శంక‌ర్‌` మూవీ కోసం న‌న్ను రిక‌మెండ్ చేశార‌ని. నా జీవితంలో మర్చిపోలేని విష‌యం ఇదన్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో త‌న‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని చెప్పి `జ‌బ‌ర్ద‌స్త్`న‌రేష్ షాకిచ్చాడు.

బిగ్ బాస్ 6 లో హ‌ర్ష సాయి.. ఇంత‌కీ ఎవ‌రిత‌ను?

`ఊరి నుంచి చాలా తీసుకున్నాం.. తిరిగి ఇచ్చేయాలి.. లేదంటే లావైపోతాం`. `శ్రీ‌మంతుడు` చిత్రంలోని ఈ డైలాగ్ ని ఇప్పుడో యువ‌కుడు హ‌ర్ష సాయి అక్ష‌రాలా పాటిస్తున్నాడు. ఎక్క‌డ పేద‌వాళ్లు అవ‌స‌రం కోసం ఎదురుచూస్తున్నారో అక్క‌డికి వెళ్లి వాళ్ల‌కు తెలియ‌కుండానే డ‌బ్బులు దానం చేస్తున్నాడు. చిత్ర విచిత్ర‌మైన టాస్క్ లు పెడుతూ పేద వాళ్లతో గేమ్స్ ఆడిస్తూ వాళ్ల‌కి కావాల్సిన‌ డ‌బ్బులు ఇచ్చేస్తున్నాడు. సాయం అన్న‌వారికి నోట్ల క‌ట్ట‌ల‌ని కుమ్మ‌రిస్తున్నాడు.   ఏకంగా ఇల్లు లేని వారికి ఇల్లు క‌ట్టిస్తున్నాడు. చిన్న‌పాటి బిజినెస్ చేసుకుంటామంటే వారికి అందినంత సాహాయం చేస్తూ నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాడు. క‌ష్టాల్లో వున్న వారి గుడిసెల ముందు నోట్ల క‌ట్ట‌లు చ‌ల్ల‌డం..పేద పిల్లాడికి సైకిల్ గిఫ్ట్ గా వ‌వ్వ‌డం..స్కూల్ ఫీజులు క‌ట్ట‌డం...బార్బ‌ర్ కు కొత్త షాప్ పెట్టించ‌డం.. పిల్ల‌లు లేని దంప‌తుల‌కు వెజిటెబుల్ షాప్ పెట్టించ‌డానికి డ‌బ్బులు స‌హాయం చేయ‌డం వంటివి చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు హ‌ర్ష సాయి. ఇలాంటి వ్య‌క్తి త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 6 లో పాల్గొన‌బోతున్నాడంటూ వరుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన హ‌ర్ష సాయి. త‌న‌కు ఆస‌క్తి లేదంటూ ఓ వీడియోని విడుద‌ల చేశాడు. త‌న‌కున్న పేరుని బిగ్ బాస్ లోకి వ‌చ్చి చెడ‌గొట్టుకోవ‌ద్దంటూ అభిమానులు కోర‌డంతో హ‌ర్ష సాయి బిగ్ బాస్ సీజ‌న్ 6లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. త్వ‌ర‌లో పేద‌ల కోసం రూ.10 ల‌క్ష‌లు ఖ‌ర్చుచేయ‌బోతున్నానంటూ హ‌ర్ష సాయి ప్ర‌క‌టించ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. హ‌ర్ష సాయి జ‌స్ట్ ఏ యూట్యూబ‌ర్‌.. అత‌నికి ఇన్ని ల‌క్ష‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి? .. ఎవ‌రిస్తున్నారు? అన్న‌ది మాత్రం మిస్ట‌రీగానే వుంది.

అనుని ప్రెస్ ముందు బుక్ చేసిన రాగ‌సుధ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించారు. మ‌రాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. శ్రీ‌రామ్ వెంక‌ట్, వ‌ర్ష హెచ్. కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో రామ్ జ‌గ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, విశ్వ‌మోహ‌న్‌, జ్యోతిరెడ్డి, అనూష సంతోష్‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, రాధాకృష్ణ‌, మ‌ధుశ్రీ‌, సందీప్ త‌దితరులు న‌టించారు. ఆర్య‌ని పోలీస్ క‌ష్ట‌డీ నుంచి త‌ప్పించ‌డం కోసం గ‌న్ ప‌ట్టుకుని హ‌ల్ చ‌ల్ చేస్తుంది అను. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల‌ త‌న‌ని మ‌రింత‌గా ఇబ్బందికి గురిచేస్తుంద‌ని, నా మాట విని గ‌న్ ఇచ్చేయ‌మ‌ని ఆర్య చెప్ప‌డంతో బాధ‌ప‌డుతూనే గ‌న్ ఇచ్చేస్తుంది అను. ఇక అక్క‌డి నుంచి అనుని ఇంటికి తీసుకెళ్ల‌మ‌ని చెబుతాడు ఆర్య‌. అయితే రాగ‌సుధ‌ని క‌లిసి నిల‌దీయాల్సిందే అని అమాయ‌కంగా ఆలోచించిన అను.. నీర‌జ్‌ ఇంటికి వెళ్ల‌మ‌ని చెప్పి త‌ను మాత్రం రాగ‌సుధ వున్న‌ఇంటికి వెళుతుంది. ఆవేశంతో ఊగిపోతూ న‌మ్మ‌క‌ద్రోహి అంటూ రాగ‌సుధ‌పై విరుచుకుప‌డుతుంది అను. త‌ను ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని ప‌సిగ‌ట్టిన రాగ‌సుధ‌.. అను కోసం ప్రెస్ ని ఏర్పాటు చేస్తుంది. త‌నని రెచ్చ‌గొట్టి మ‌రీ చెంప‌లు వాయించేలా చేస్తుంది. ఇదంతా జ‌రుగుతుండ‌గానే ప్రెస్ ఎంట్రీ ఇస్తారు. అను .. రాగ‌సుధ‌ని బెదిరిస్తున్న దృశ్యాల‌ను, త‌న గొంతు ప‌ట్టుకున్న విజువ‌ల్స్ ని షూట్ చేస్తారు. ఈ దృశ్యాల‌ని టీవీ ఛాన్స్ లో చూసిన ఆర్య వ‌ర్ధ‌న్ వెంట‌నే అనుకి ఫోన్ చేసి అక్క‌డి నుంచి వెళ్లిపోమంటాడు. ఆ మాట‌లు విన్న రాగ‌సుధ‌... అనుని మ‌రింతగా రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు అన‌సూయ వార్నింగ్

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో పాపుల‌ర్ అయిన యాంక‌ర్ అన‌సూయ‌. ఈ షో ద్వారా సినిమాల్లోనూ న‌టించే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. అయినా సరే జ‌బ‌ర్ద‌స్త్ ని మాత్రం వీడ‌టం లేదు. న‌టిగా వ‌రుస సినిమాల్లో న‌టిస్తూనే యాంకర్ గానూ ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతోంది. తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ షోలో అన‌సూయ చేసిన హంగామా నెట్టింట వైర‌ల్ గా మారింది. జూన్ 16న ప్ర‌సారం కానున్న `జ‌బ‌ర్ద‌స్త్‌` కామెడీ షోకు సంబంధించిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ షోకు ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో, ఇంద్ర‌జ న్యాయ‌నిర్ణేత‌లుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోకు `గాడ్సే` మూవీ హీరో స‌త్య‌దేవ్‌, డైరెక్ట‌ర్ గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి హాజ‌ర‌య్యారు. సీ. క‌ల్యాణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా `జ‌బ‌ర్ద‌స్త్‌` షోలో సంద‌డి చేశారు. తాజా ఎపిసోడ్ లో రాకెట్ రాఘ‌వ‌, తాగుబోతు ర‌మేష్‌, రైజింగ్ రాజు త‌దిత‌రులు టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాకెట్ రాఘ‌వ కాంట్రాక్ట్ కిల్ల‌ర్ స్కిట్ తో అద‌ర‌గొట్ట‌గా, తాగుబోతు ర‌మేష్ మంగ‌ళ‌వారం నా క‌త్తికి ప‌దును పెట్ట‌ను అంటూ న‌వ్వించాడు. రైజింగ్ రాజు - దొర‌బాబు క‌లిసి అన‌సూయ హోమ్ టూర్ స్కిట్ ని చేశాడు. `సూయ‌.. సూయ అన‌సూయ‌..` అనే పాట‌కి నైటీ వేసుకుని అన‌సూయ‌లా ఎంట్రీ ఇచ్చాడు రైజింగ్ రాజు. అత‌న్ని చూడ‌గానే అన‌సూయ గుండె ఒక్క‌సారిగా ప‌గిలిపోయింది. ఈ క‌ర్మ ఏంట్రా బాబూ అన్న‌ట్టుగా త‌ల కిందికి పెట్టుకుంది. ఈ స్కిట్ లో అన‌సూయ భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ ను కూడా వాడేశారు. అత‌ని ప్లేస్ లో దొర‌బాబుని రంగంలోకి దింపేస‌రికి అన‌సూయ హ‌ర్ట్ అయింది. రాముడి లాంటి మా అయ‌న పాత్ర‌ని దొర‌బాబుకు ఇచ్చారా? అంటూ న‌సిగింది. ఇంత‌లో హోమ్ టూర్ చాలా వైలెంట్ గా వుంది మ‌నం వేరే హోమ్ టూర్ చేద్దాం అంటాడో క‌మెడియ‌న్‌. దీంతో ఆప‌కపోతే వైలెంట్ అవుద్దిప్పుడ్డు అని వార్నింగ్ ఇచ్చింది అన‌సూయ .. ఇదే షోలో చ‌లాకీ చంటి టాప్ హీరోల గెట‌ప్ ల‌లో క‌నిపించి అద‌ర‌గొట్టేశాడు.

ఆహా ఒరిజినల్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్ ను లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు. రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, "అన్య'స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య." https://fb.watch/dy_MnVIpVj/ ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే? అదే అన్య'స్ ట్యుటోరియల్. అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. రెజీనా కెసాండ్రా (మధు) కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ అంటే నచ్చదు. కానీ ఒక రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అని తెలుసుకోవాలంటే ఆహా మరియు ఆర్కా మీడియా వారి 'అన్య'స్ ట్యుటోరియల్' చూడాల్సిందే. అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.

క‌స్తూరికి ఆ క‌ల‌ర్స్ అంటేనే ఇష్ట‌మ‌ట‌!

సాయంత్రం అయ్యేసరికి స్టార్ మాలో వచ్చే 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ లో పద్దతిగా చాలా హోమ్లీగా కనిపించే కస్తూరిలో మరో యాంగిల్ కూడా ఉంది. రకరకాల డ్రెస్సుల్లో దర్శనమిస్తూ మెరుస్తూ ఉంటుంది. తన కొడుకుతో కలిసి షార్ట్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా పట్టించుకోని కస్తూరి తనకు నచ్చిందే చేస్తుంది. తనకు పింక్ అన్నా, బ్లూ కలర్ అన్నా చాలా ఇష్టం. ఎక్కువగా తన వీడియోస్ లో ఈ రెండు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు 'గృహలక్ష్మి' సీరియల్ లో ఎక్కువ శాతం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్ ఉన్న శారీస్ తోనే ఎక్కువగా కనిపిస్తుంది కస్తూరి శంకర్. ఇక ఇటీవల బ్లూ కలర్ డ్రెస్ లో బ్యాగ్రౌండ్ పింక్ తో అందంగా కనిపించే వాల్ పెయింటింగ్ తో ఒక అందమైన ఫోటో చాలా వ్యూస్ అందుకుంటోంది. ఇది చూసి నెటిజన్స్ 'మేడం మీకు పింక్ కలర్ అంటే ఇష్టమా. చాలా బాగున్నారు. ఏంజిల్ లా ఉన్నారు' అంటూ కామెంట్స్ ఇస్తున్నారు.

అధికారం కోసం ఓ అత్త... మమకారం కోసం కోడళ్ళు

'దేవతలారా దీవించండి' అనే అద్భుతమైన సీరియల్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీ తెలుగు, ఇప్పుడు 'కోడళ్ళు మీకు జోహార్లు' అనే మరో ఆసక్తికరమైన సీరియల్ తో ఈ సోమవారం నుండి ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. అత్తాకోడళ్ల ఆధిపత్యపోరు నేపధ్యంగానే వస్తున్నప్పటికీ, ఈ సీరియల్ కాస్త భిన్నంగా హాస్యభరిత మరియు ప్రతీకార సన్నివేశాలతో తెరకెక్కించబడింది. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రసారం కానుంది. పవిత్ర, కౌస్తుభా మని, దుర్గశ్రీ, మరియు నాగార్జున ప్రధానపాత్రదారులుగా వస్తున్న ఈ సీరియల్, ఇప్పటికే విడుదలైన ప్రోమోతో అందరిని ఆకట్టుకుంటుంది. కథలోపటికీ వెళ్తే, కుటుంబ సభ్యులని మోసంచేస్తూ రేఖ (పవిత్ర) తన అక్కకొడుకు శేఖర్ నుండి కుటుంబవ్యాపారాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతేకాకుండా, వ్యాపారంలో తన కొడుకు తారక్ (నాగార్జున) పలుకుబడిని పెంచుకుంటూ పోతుంది.  తన అధిపత్యానికి ఎటువంటి హాని కలగకూడదని, సున్నితస్థురాలైన మిథునని (కౌస్తుభా మని) ఇంటి కోడలిగా తెచ్చుకుంటుంది. ఐతే, మిథున చెల్లెలైన వైష్ణవి (దుర్గశ్రీ) ఎప్పటికప్పుడు రేఖ ఆగడాలకు మరియు తన ఆధిపత్యకాంక్షలకు అడ్డుకట్టవేస్తూ తన అక్కని కాపాడుకుంటూవస్తుంది. ఈవిధంగా, రేఖ మరియు మిథున మధ్య జరిగే ఆధిపత్యపోరాటం కొన్నిసార్లు నవ్వులుపూయిస్తూ మరికొన్ని సార్లు ఉద్వేగాన్ని రేకెత్తిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ సీరియల్ ప్రారంభోత్సవం  సందర్బంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ (తెలుగు) శ్రీమతి అనురాధ గూడూరు మాట్లాడుతూ, 'కోడళ్ళు మీకు జోహార్లు' సాధారణంగా అత్తాకోడళ్ల  నేపథ్యంలో వచ్చే కథాంశాలకన్నా భిన్నంగా ఉంటుందని, ఇందులోని సన్నివేశాలు నిజజీవితంలో ఒక సాధారణ కుటుంబంలో జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటాయని చెప్పారు. అలాగే ఈ సీరియల్ పాసిటివిటీని పెంపోందిస్తుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఈ వినూత్న కథాంశాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. 

‘పెన్ను కదలట్లేదురా సుధీర్, శీను.. వచ్చేయండిరా’

ఎక్స్ట్రా జబర్దస్త్ చరిత్రలో ఆడియన్స్ ఎప్పుడు నవ్వడమే చూసాం..  ఏడుపనేది తెలీకుండా స్కిట్స్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు కమెడియన్స్. కానీ ఈ వరం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చూసి ఏడవని ఆడియన్ అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ స్టేజి మీద ఏడ్చేసరికి టీం మొత్తం అతనికి అండగా నిలబడ్డారు. మేం ఉన్నాం నీ పక్కన ధైర్యంగా ఉండు అన్న అంటూ భరోసా ఇచ్చారు. ఐనా ఏడుపు ఆపులేకపోయాడు రాంప్రసాద్.  ఇంతలో ఇంద్రజ వెళ్లి రాంప్రసాద్ ని హగ్ చేసుకుని 'నువ్ జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తావ్ మేము నిన్ను చూసి మా రాంప్రసాద్ అంటూ చెప్పుకుంటాం ఆ క్షణాలు త్వరలోనే వస్తాయి' అంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. 'ఒక కంచంలో తిన్నాం ఒకే మంచంలో పడుకున్నాం. కానీ ఈరోజు నేను ఒంటరి అనే ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు నాతో ఉంటే అలా పక్కకెళ్లి స్కిట్ అరగంటలో రాసేసి తీసుకొచ్చేసేవాడిని అంత ధైర్యంగా ఉండేది నాకు. కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు గడుస్తున్నా స్కిట్ రాయలేకపోతున్న. నాకు ఫుడ్ పెట్టిన ఈ స్టేజి మీద బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా కానీ అస్సలు నా వల్ల కావడం లేదు.. పెన్ను కదలట్లేదురా.. ఎక్క‌డున్నా వచ్చేయండిరా సుధీర్, శీను' అంటూ స్టేజి మీద ఏడ్చేశాడు రాంప్రసాద్.  ఒకడు హీరోగా, ఒకడు మంచి ఆర్టిస్ట్ గా, నేను రైటర్ గా ఎప్పటికైనా కలుస్తాం అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు  రాంప్రసాద్.. ఇక వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న మూమెంట్స్ ని ప్లే చేయడంతో రాంప్రసాద్ ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ స్కిట్ చాలా వైరల్ అవుతోంది. వీళ్లది రియల్ ఫ్రెండ్షిప్, సుధీర్, శీను మళ్ళీ ఈ స్టేజి మీద స్కిట్ చేయాలి, వీ మిస్ యూ సుధీర్ అన్న అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకు నేనెవరు ?

సాకేత్ కొమండూరి ఫేమస్ సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సరిగమప  సింగింగ్ షోలోని  కంటెస్టెంట్స్ కి మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. ఐతే ఒక పక్క కెరీర్ ని ఎంజాయ్ చేస్తూ మరో వైపు ఖాళీ దొరికితే కొన్ని స్పెషల్ వీడియోస్ చేస్తూ తన ఫాన్స్ తో అటాచ్మెంట్ పెంచుకుంటున్నాడు. ఐతే ఇప్పుడు ఒక ప్రత్యేక వీడియో చేసాడు. తన భార్యకి, చెల్లెలికి మధ్య డిబేట్ పెట్టాడు. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ తన గురుంచి తెలుసు అంటూ పరీక్ష పెట్టాడు. ఇంతకు తన అసలు పేరేమిటి ? ఏ వయసులో ఫస్ట్ స్టేజి షో చేసాడు ? అన్ని కామెడీ షోస్  లోకి ఏ షో అంటే ఇష్టం ? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? ఒక మనిషిలో నచ్చని క్వాలిటీ ఏమిటి ? అంటూ తన గురుంచి తానె ప్రశ్నలు ప్రిపేర్ చేసుకుని సాకేత్ భార్య పూజితతో చెల్లెలి సోనీతో  చిన్న గేమ్ ఆడించాడు. చివరికి ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చేసరికి సాకేత్ వాళ్ళిద్దరి ఫ్రెండ్ షిప్ గురుంచి చెప్పుకొచ్చాడు.  ఇద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉందని , చాలా విషయాల్లో ఇద్దరికీ బాగా సింక్ అవుతుంది అని చెప్పాడు.  తాను ఒకప్పుడు సరైన దారిలో లేనప్పుడు భార్య చెల్లి ఇద్దరూ కలిసి తనని మార్చారని తన పాత లైఫ్ గురుంచి కూడా చెప్పాడు  సాకేత్. ఇక ఈ వీడియో బాగుంది , ప్రాంక్ వీడియోస్ కూడా చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దొంగని కనిపెట్టిన అఖిల్

  శ్యామా , అఖిల్ విగ్నేశ్వర అభిషేకానికి తయారవుతూ ఉంటారు. ఇంతలో బీరువా తీసేసరికి అక్కడ శంకర్ ఇచ్చిన కిరీటం కనిపించదు. అంతే ఒక్కసారి షాక్ అవుతుంది. అఖిల్ కి విషయం చెప్తుంది. ఇల్లంతా వెతికినా కనిపించదు. ఏం చేయాలో తెలియక ఇద్దరూ భయపడుతూ ఉంటారు.ఇంతలో వసంత వచ్చి బీరువా తాళాలు అడుగుతుంది. శ్యామాకి ఏం అర్థంకాక   తాళాలు ఇచ్చేసి అఖిల్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక  శ్యామా ఈ గండం నుంచి గట్టెక్కించమని కన్నయ్యను కోరుకుంటుంది. ఇంతలో అఖిల్ కి ఆ రూమ్ కిటికీ తలుపు దగ్గర స్క్రూలు కనిపిస్తాయి.  కిరీటం ఎవరో తెలిసిన వాళ్ళే దొంగతనం చేసారని తెలుసుకుంటారు. అంతలో కింద పట్టా మీద సగం కాలిన బీడీని చూస్తుంది శ్యామా. అది తోటమాలి కాలుస్తాడు అన్న విషయం గుర్తుతెచ్చుకుని అతన్ని వెతుకుతుంది. పెరట్లో కనిపించకపోయేసరికి వాళ్ళింటికి వెళ్తారు ఇద్దారూ . వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి తాగి ఎక్కడ పడిపోయాడో అంటుంది తోటమాలి భార్య.  మరో వైపు శంకర్ తన  కిరీటం కోసం వర్మ ఇంటికి వస్తాడు. ఐతే వర్మ ఒక గంట ఆగాక కిరీటం ఇస్తాను. ఎందుకంటే ఇందాకే రాహు కాలం వచ్చేసింది ఇలాంటి సమయంలో కిరీటం తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అంటాడు. మిగతా ఎపిసోడ్ ఈరోజు మధ్యాహ్నం వచ్చే కృష్ణ తులసి సీరియల్ లో చూడొచ్చు.  

డెలివరీ తర్వాత సీరియల్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నటి శ్రావణి

ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లోకి నటి శ్రావణి రీఎంట్రీ ఇచ్చేసింది. మళ్ళీ దమయంతి కేరెక్టర్ లో శ్రావణి కావాలి అంటూ మిగతా ఆర్టిస్ట్స్ కూడా గట్టిగా పట్టుబట్టేసరికి మళ్ళీ మేకప్ వేసుకోవడానికి షూటింగ్ స్పాట్ కే వచ్చేసింది. మార్చ్ 16 న పండంటి బాబుని ప్రసవించిన శ్రావణి షార్ట్ పీరియడ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఇక దమయంతి హౌస్ లో శ్రావణి మేకప్ చేసుకుని మిగతా ఆర్టిస్ట్స్ అందరిని పలకరించింది. పాత టీం అందరూ కలిసి షూటింగ్ స్పాట్ లో మంచి మస్తీ చేశారు.   సీరియల్స్ లో ఎప్పుడూ అరుచుకుంటూ , కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కనిపిస్తాం కానీ సీరియల్ షూటింగ్ స్పాట్ లో మాత్రం అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అన్ని షేర్ చేసుకుంటాం అని చెప్పింది శ్రావణి . ఒక తల్లిగా ఉన్న ఫీలింగ్ వేరు. కానీ షూటింగ్ ని చాలా మిస్ అయ్యాను ఈ ఫన్ అంతా మిస్సయ్యాను అనే ఫీలింగ్ వేరు. ఏదేమైనా టైగర్ దమయంతి ఈజ్ బ్యాక్ ..మరి నా కేరెక్టర్ ని సీరియల్ లో ఇకనుంచి చూసేయండి అంటూ శ్రావణి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియన్స్ కి తన రీఎంట్రీ వీడియొ షూట్ లో చెప్పేసింది.

సాయిప‌ల్ల‌వికి ఆ చిరంజీవి పాటంటే పిచ్చి ఇష్టం!

ఫిదా మూవీ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది సాయి పల్లవి. రీసెంట్ గా లవ్ స్టోరీ మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా డాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. మూవీస్ లో సాయి పల్లవి డాన్స్ ముందు ఏ హీరో ఐనా వీక్ ఐపోతాడు. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ సాయి పల్లవి డాన్స్ ని మెచ్చుకునే వాళ్ళే , పొగిడేవాళ్ళే. చిరంజీవికి కూడా పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టమట. సాయి పల్లవికి మాత్రం చిరు డాన్స్ చేసిన "నడక కలిసిన "సాంగ్ అంటే చాలా ఇష్టమట. ఆ డాన్స్ లో చాలా గ్రేస్ ఉంటుంది అది డాన్స్ అంటే అని కితాబిచ్చింది. అందుకే నాకు ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం అంది పల్లవి. తన మూవీస్ కి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని చెప్పింది. సాయి పల్లవి తాను సంపాదించేది మొత్తం తల్లికే ఇచ్చేస్తోందట. ఇలా ఎన్నో విషయాల సమాహారంతో పల్లవి తన మనసులోని మాటను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పంచుకుంది. ఈ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది.

రాగ‌సుధ కు చుక్క‌లు చూపించిన అను

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో , ట్విస్ట్ ల‌తో సాగుతున్న ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఈ వారం ఫైన‌ల్ స్టేజ్ కి చేరుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందులో శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జగ‌న్‌, అనూషా సంతోష్‌, జ్యోతిరెడ్డి, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, ఉమాదేవి, మ‌ధుశ్రీ‌, సందీప్ న‌టించారు. ఆర్య వ‌ర్థ‌న్ అరెస్ట్.. మూడు రోజుల క‌స్ట‌డీ తో క‌థ కీల మ‌లుపు తిరిగింది. రాగ‌సుధ మాస్ట‌ర్ ప్లాన్ కార‌ణంగా ఆర్య వ‌ర్థ‌న్ ని మూడు రోజుల పోలీస్ క‌స్ట‌డీకి గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేస్తాడు. దీంతో చేసేది లేక ఆర్య ఇందుకు తాను స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పి సంబంధింత పేప‌ర్ల‌పై లాయ‌ర్ చెప్ప‌న‌ట్టుగా సంత‌కాలు చేస్తాడు. ఇక అత‌న్ని సెల్ వైపు తీసుకెళుతుంటే అది భ‌రించ‌లేని అను ప‌క్క‌నే వున్న ఓ పోలీస్ నుంచి గ‌న్ ని లాక్కుని ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తూ బెదిరించడానికి ట్రై చేస్తుంది. అయితే ఆర్య వ‌ర్థ‌న్ వారించ‌డంతో చివ‌రికి గ‌న్ ప‌డేస్తుంది. ఇక స్టేష‌న్ నుంచి ఇంటికి వెళ్ల‌మ‌ని ఆర్య చెప్ప‌డంతో నీర‌జ్ ని ఇంటికి వెళ్ల‌మ‌ని, తాను ఆఫీస్ కి వెళ‌తానని చెప్పిన అను ఆవేశంగా రాగ‌సుధ వున్న ఇంటికి వెళుతుంది. ఆర్య‌ని మ‌రీ ప‌త‌నావ‌స్థ‌కు తీసుకురావాల‌ని, ప్ర‌స్తుతం అయితే ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తాన‌ని వ‌శిష్ట‌తో రాగ‌సుధ చెబుతూ వుంటుంది. అదే స‌మ‌యానికి అను ఎంట్రీ ఇచ్చి షాకిస్తుంది. నీ నిజ‌స్వ‌రూప‌మేంటో తెలిసిపోయింది. నా న‌మ్మ‌కాన్ని చంపేశావ్‌..తోడ‌బుట్టిన అక్క అని కూడా జాలి లేకుండా చంపేశావ్‌.. అని రాగ‌సుధ‌పై అరుస్తుంది అను. వాయిస్ క్లిప్స్ విన్న త‌రువాత కూడా నువ్విలా మాట్లాడ్డం ఏమీ బాగాలేదంటుంది రాగ‌సుధ‌. నిజంగానే ఆర్య వ‌ర్థ‌న్ హంత‌కుడు అంటుంది. వెంట‌నే అను ఆగ్ర‌హంతో నోర్ముయ్‌... నీకు భ‌మం అంటే ఏంటో చూపిస్తాను. అంటూ రాగ‌సుధ చెంప‌లు వాయిస్తుంది.. వెంటనే రాగ‌సుధ పీక‌ప‌ట్టుకుంటుంది అను. ఆ త‌రువాత ఏం జ‌ర‌గ‌బోతోంది?.. క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

హిమ - జ్వాల అనుబంధంపై శోభ‌ అనుమానం

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. 'నిరుప‌మ్‌.. జ్వాల‌.. హిమ‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి.. వీళ్ల గురించి గ‌ట్టిగా ప‌ట్టించుకోవాలి' అని శోభ అనుకుంటూ వుంటుంది. మ‌రో వైపు త‌న‌కు క్యాన్స‌ర్ అని చెప్పినా నిరుప‌మ్ వినిపించుకోక‌పోవ‌డంతో 'ఎందుకు బావా అన్నీ చెప్పినా నా మీద ప్రేమ‌ను పెంచుకుంటున్నావు?' అని అడుగుతుంది హిమ‌. ఆ మాట‌లు విన్న నిరుప‌మ్ `నీ మీద ప్రేమ ఎప్ప‌టికీ చావ‌దు హిమ‌` అంటాడు. 'అయితే నా ప్రేమ‌ను మీకు వేరేవాళ్ల రూపంలో అందించ‌బోతున్నాను. దాన్ని నువ్వు స్వీక‌రించాలి' అంటుంది. ఇదంతా చాటుగా వున్న శోభ గ‌మ‌నిస్తుండ‌గానే త‌న పేరు జ్వాల అని చెబుతుంది హిమ‌. ఆ మాట‌ల‌కు నిరుప‌మ్ ఆగ్ర‌హించి ఏం మాట్లాడుతున్నావ్ హిమ అని చిరాకు ప‌డ‌తాడు. శోభ మాత్రం ఆ అవ‌కాశం నాకు ఇవ్వొచ్చుక‌దే పోయి పోయి ఆ ఆటోదాన్ని ఎందుకు క‌ట్ట‌బెట్టాల‌నుకుంటున్నావు` అని శోభ మ‌న‌సులో అనుకుంటుంది. 'జ్వాలకు నువ్వంటే ఇష్టం బావ' అని హిమ చెప్ప‌గానే నిరుప‌మ్ షాక‌వుతాడు. త‌న‌నే నువ్వు పెళ్లి చేసుకోవాల‌ని హిమ చెబుతూనే క‌ళ్లు తిరిగి ప‌డిపోతుంది. క‌ట్ చేస్తే శోభ‌లో అనుమానాలు మొద‌ల‌వుతాయి. ఒక డాక్ట‌ర్ కు ఆటోదాన్నిచ్చి పెళ్లి చేయాల‌ని హిమ ఎందుకు అనుకుంటోంది? అని ఆలోచించ‌డం మొద‌లు పెడుతుంది. ఈ రెండు ఫ్యామిలీల మ‌ధ్య ఏదో వుంది. అదే స‌మ‌యంలో జ్వాల చేతిపై వున్న హెచ్ అనే అక్ష‌రం మ‌రింత అనుమానాన్ని బ‌ల‌ప‌రుస్తుంది. హెచ్ అంటే హిమ కాదు క‌దా? అని శోభ ఆలోచ‌న‌లో ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బాల‌య్య‌కు ఉద‌య‌భాను మెసేజ్‌.. త‌ర్వాత జ‌రిగింది ఇదే!

నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు వేడుక‌లు జూన్ 10 శుక్ర‌వారం జ‌రిగాయి. అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే యాంక‌ర్ ఉద‌య‌భాను మాత్రం బాల‌య్య బాబు వ్య‌క్తిత్వం గురించి ప్ర‌త్యేకంగా వివ‌రిస్తూ ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి వార్త‌ల్లో నిలిచింది. బాల‌య్య బాబు మ‌హోన్న‌త వ్య‌క్తిత్వానికి నేను సాక్షిని అంటూ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించింది. 'బాల‌య్య బాబుని అభిమానించే ప్ర‌తి అభిమానికి ఆయ‌న పుట్టిన రోజు పండ‌గే. ఎందుకంటే ఆయ‌న గురించి చెప్పాలంటే మాట‌లు స‌రిపోవు. అందుకే నేను ఆయ‌న అభిమానిగా మారిపోయా, వీరాభిమానిన‌య్యా` అని చెప్పుకొచ్చింది. 'మ‌నిషి అన్నాక కొంచెం గ‌ర్వం వుండాలి. కానీ ఆ కొంచెం గ‌ర్వం కూడా లేని నిగ‌ర్వి ఆయ‌న‌. మ‌హోన్నత‌ వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది. ఆయ‌న‌ని అభిమానించే వారి కోసం ఎంత దూర‌మైనా వెళ్లే వ్య‌క్తి బాల‌య్య‌. అలాంటి వ్య‌క్తికి అభిమానిని అయినందుకు గ‌ర్విస్తున్నాను. మాట ముక్కుసూటి త‌నం, మ‌న‌సు ప‌సి పాప‌తో స‌మానం.. అందుకే అభిమానులంతా నా కోసం జై బాల‌య్య అనండి' అంటూ ఓ వీడియోని విడుద‌ల చేసింది యాంక‌ర్‌, న‌టి ఉద‌య‌భాను. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. త‌న‌కు దేవుడు ఎన్నో దూరం చేశాడ‌ని, చివ‌రికి త‌న‌కు ఇద్ద‌రు క‌వ‌ల‌ల్ని వ‌రంగా ఇచ్చాడ‌ని అయితే వాళ్ల ఫ‌స్ట్ బ‌ర్త్ డేని ఘ‌నంగా చేయాల‌నుకున్నాన‌ని ఇందు కోసం భారీ గా ఏర్పాట్లు చేశానంది. అయితే ఈ పార్టీకి ఇండ‌స్ట్రీలోని చాలా మంది సెల‌బ్రిటీల‌ని ఆహ్వానించాలని ఫోన్ లు చేస్తే ఎవ్వ‌రూ స్పందించ‌లేద‌ని, అయితే బాల‌య్య బాబుకి చిన్న మెసేజ్ చేస్తే ఆయ‌న అర‌గంట‌లో ఫోన్ చేసి అన్ని ప‌నులు వ‌దులుకుని నా బిడ్డ‌ల ఫంక్ష‌న్ కి వ‌చ్చార‌ని, నా బిడ్డ‌ల్ని ఆశీర్వ‌దించార‌ని తెలిపింది. సెల‌బ్రిటీలా కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్ లా వ‌చ్చి మా కోసం 45 నిమిషాలు గ‌డిపార‌ని.. ఇలా ఎంత మంది వుంటార‌ని.. ఇది ఆయ‌న వ్య‌క్తిత్వం అని ఎమోష‌న‌ల్ అయింది ఉద‌య‌భాను. ఈ వీడియోని నెట్టింట బాల‌య్య అభిమానులు షేర్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.