రూమర్స్ కి సమాధానమిచ్చిన మల్లెమాల టీమ్

ఒకప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ ఐన షో జబర్దస్త్. ఈ షోని ఫామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేసేవారు. ఐతే ఈ షోకి వున్న ఆదరణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. దీనికి రేటింగ్స్ తగ్గడం మొదలయ్యేసరికి ఎక్స్ట్రా జబర్దస్త్ ని లాంచ్ చేశారు. ఈ రెండు షోస్ కి కలిపి అనసూయ, రష్మీ, రోజా, నాగబాబు యాంకర్స్ గా, జడ్జెస్ గా ఉన్నారు. ముందు నాగబాబు, తర్వాత రోజా, కమెడియన్స్ అంతా వన్ బై వన్ దూరమవుతూ వచ్చారు. దీని కారణంగా జబర్దస్త్ షో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బుల్లితెర స్టార్ గా పేరు పడిన సుధీర్ వెళ్లిపోయేసరికి కావాలనే పక్కకు తప్పించారనే  రూమర్స్ బయటికి వచ్చాయి. తర్వాత అతని ఫ్రెండ్స్ కూడా బయటికి వచ్చేసారు. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుందని వస్తున్న ప్రచారాలపై మల్లెమాల సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది. వెళ్లిన వాళ్ళు ఎలాగో వెళ్లిపోయారు. కొత్త వాళ్ళతో ఐనా షో నడిపిస్తాం కానీ ఈ షోని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు అన్నారు . ప్రస్తుతం ఈ షోకి అనుకున్నంత టాక్, రేటింగ్స్ కానీ రావడం లేదు. ఐతే ఇంతకుముందులా జబర్దస్త్ మళ్ళీ పుంజుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.  

శ్రీముఖి జాతిరత్నాలు షోకి పవర్ఫుల్ అమ్మాయి

జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో స్టాండప్ కామెడీ షోకి చాలా ఛానెల్స్ మంచి వేదికలను అందిస్తున్నాయి. చిన్నవాళ్లు నుంచి పెద్ద వాళ్ళ వరకు వచ్చి రకరకాల కామెడీ లైన్స్ తో ఉన్న కాసేపు జోక్స్ వేసి నవ్విస్తున్నారు. అందులో పవిత్ర స్టాండప్ కామెడీ మంచి పంచెస్ తో దూసుకుపోతోంది. ఈ వారం జాతిరత్నాలు ఎపిసోడ్ లో పిసినారి టాపిక్ తీసుకుని అందులో వాళ్ళ అమ్మను మెయిన్ ఎలిమెంట్ గా ప్రెజంట్ చేస్తూ ఆడియన్స్ ని నవ్వించింది పవిత్ర. "ఈ షోకి వచ్చేముందు పది పంచులు వేసి పది మందిని నవ్విద్దాం అని అనుకున్నా. కానీ మా అమ్మ పిసినారితనం వల్ల నాలుగు పంచులు వేసి నలుగుర్ని నవ్వించి, మిగతా పంచులు ఇంకో టాపిక్ లో వాడుకో అని చెప్పిందట ..అంత పిసినారిది మా అమ్మ అంటూ మంచి కామెడీ లైన్ ని ఎంచుకుని ఫన్ క్రియేట్ చేసింది. జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఇంటి స్థలం ఇస్తానమ్మా అని అంటే ఇచ్చేవాళ్లకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమెందుకు అంత ఇంట్రెస్ట్ పెట్టి తీసుకోవాలి అందట. సమ్మర్ కదా మా కాలనీలో స్విమ్మింగ్ పూల్ కట్టించుకుందామని కాలనీలో పిల్లలందరం వెళ్లి చందాలు పోగుజేసి చివరికి మా ఇంటికి వచ్చి మా అమ్మని చందా ఇమ్మని  అడిగాం. వెంటనే అమ్మ ఇంట్లోకి వెళ్లేసరికి చందా తేవడానికేమో అనుకున్నాం తీరా చూస్తే బకెట్ నీళ్లు తెచ్చింది. ఇదేంటమ్మా అని అడిగేసరికి స్విమ్మింగ్ పూల్ కి కావాల్సింది చందా కాదు నీళ్లు కదా అని పిసినారి మాటలు చెప్పిందండి"..ఇలా పవిత్ర అన్ని రకాలుగా మంచి కామెడీ స్కిట్ తో అలరించింది.

శ్యామా ఇంటి పెరట్లో పాము కుబుసం

పెరట్లో పాము కుబుసం చూసేసరికి వసంత వాళ్లంతా భయపడతారు. శ్యామా, అఖిల్ తో పూజ చేయిస్తామని మొక్కుకుని దాన్ని నెరవేర్చకపోవడం వలన ఇలా జరిగిందా అంటూ వసంత భయపడుతూనే గురువు గారికి చెప్తారు. ఆయన ఇంటికి వచ్చి మొత్తం పరిశీలిస్తారు. వసంత కుటుంబం మొత్తం ఆయన పాదపూజ చేస్తారు. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు ఇలా పాము కుబుసం ఇంట్లో కనిపిస్తే కనిష్ట సంతానానికి మంచిది కాదు అని సెలవిస్తారు గురువు గారు. కాలం కలిసి రాకపోతే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు అని చెప్తారు. ఈ కుబుసం ప్రభావం తగ్గాలి అంటే శ్యామా వట సావిత్రి వ్రతం చేయాలని సూచిస్తారు. నియమనిష్ఠలతో కటిక ఉపవాసం చేయాలని, బయటికి వెళ్లకూడదని గురువుగారు చెప్పేసరికి అన్ని సరే అని చెప్తుంది శ్యామా. మరో పక్క ఐశ్వర్య శ్యామా వ్రతాన్ని ఎలా చెడగొట్టాలా అంటూ ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తుంది. ఇంతకు శ్యామా చేసే వ్రతాన్ని ఐశ్వర్య భగ్నం చేస్తుందా ? అనే విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణతులసి ఎపిసోడ్ లో చూడొచ్చు.  

సైకిల్ రేస్ లో ప‌ది ల‌క్ష‌లు గెలిచిన న‌య‌ని

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. క‌న్న‌డ న‌టీన‌టులు అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించ‌గా, ఇత‌ర పాత్ర‌ల్లో పవిత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, ప్రియాంక చౌద‌రి, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, చ‌ల్లా చందు, అనిల్ చౌద‌రి సురేష్ చంద్ర న‌టించారు. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ ప‌ల్లెటూరి యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. త‌న భ‌ర్త త‌ల్లి హ‌త్య వెన‌క దాగివున్న అస‌లు ర‌హ‌స్యాన్ని తెలుసుకునే క్ర‌మంలో ఆ యువ‌తి ఎలాంటి సంఘ‌ట‌న‌ల్ని ఎదుర్కొంది?.. చివరికి ఎలా క‌థ సుఖాంత‌మైంది అన్న‌దే ఈ సీరియ‌ల్ ప్ర‌ధాన క‌థ‌.   గురువారం ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోందో తెలుసుకుందాం. సైకిల్ రేస్ లో గెలుపొందిన వారికి రూ. 10 ల‌క్ష‌ల బహుమ‌తి అని తెలియ‌డంతో న‌య‌ని పోటీకి సిద్ధ‌మ‌వుతుంది. ఆమెకు పోటీగా క‌సి రంగంలోకి దిగుతుంది. న‌య‌ని చెల్లెలు స‌త్య‌, తోడి కోడ‌లు హాసిని, విశాల్ మేన‌త్త దురంధ‌ర‌ కూడా పోటీకి దిగ‌డంతో అంతా క‌లిసి సైకిల్ రేస్ లో పాల్గొంటారు. మ‌ధ్య‌లో క‌సి, వ‌ల్ల‌భ ఏర్పాటు చేసిన రౌడీలు న‌య‌ని స్పీడుకి క‌ళ్లెం వేయ‌ల‌ని ప్లాన్ చేసి త‌న‌ని దారి మ‌ళ్లిస్తారు. దారి త‌ప్పిన న‌య‌నికి అక్క‌డ రౌడీలు ఎదురుప‌డ‌తారు. దీంతో ఏం జ‌రుగ‌బోతోందో గ్ర‌హించిన న‌య‌ని రౌడీలు త‌న‌పై దాడికి ప్ర‌య‌త్నించే స‌మ‌యంలో వాళ్ల క‌ళ్ల‌ల్లో ప‌సుపు, కుంకుమ చ‌ల్లి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంటుంది. మ‌ళ్ళీ పోటీలో పాల్గొంటుంది. న‌య‌ని వ‌స్తున్న విష‌యం గ‌మ‌నించి క‌సి ఇద్ద‌రు పోటీదారుల‌ని న‌య‌నికి అడ్డుత‌గిలి ప‌డేలా చేస్తుంది. అయితే అది గ‌మ‌నించిన హాసిని.. న‌య‌నికి అండ‌గా నిల‌బ‌డుతుంది.  ఆ త‌రువాత హాసిని నాకు సైకిల్ తొక్కే ఓపిక లేద‌ని చెప్ప‌డంతో త‌న‌ని సైకిల్ పై ఎక్కించుకుని న‌య‌ని ముందుకు సాగుతుంది. త‌న ముందున్న వారిని దాటి క‌సిని చేరుకుంటుంది. ఫైన‌ల్ గా క‌సిని కూడా దాటి పోటీలో విజేత‌గా నిలుస్తుంది. అయితే ప్రైజ్ మ‌నీగా వ‌చ్చిన రూ. 10 ల‌క్ష‌ల‌ను గుండె ఆప‌రేష‌న్ కోసం ఎదురుచూస్తున్న‌ఓ చిన్నారి కుటుంబానికి ఇచ్చేసి త‌న గొప్ప మ‌న‌సు చాటుకుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ప్లాన్ ఫెయిలైనందుకు క‌సి, వ‌ల్ల‌భ‌ల‌పై తిలోత్త‌మ ఎలా రియాక్ట్‌ అయింది?  అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బుల్లెట్ భాస్కర్‌ తొక్కేసిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఎవ‌రు?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌తో పాటు యూట్యూబ్ ప్రియుల్ని కూడా న‌వ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. ఈ షో నుంచి వ‌చ్చిన వాళ్ల‌లో చాలా మంది పాపుల‌ర్ అయ్యారు. కొంత మంది సినిమాల్లోకి వెళ్లిపోయారు. కొంత మంది హీరోయిన్ లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, హీరోలుగా కూడా మారిపోయారు. సినిమా అవ‌కాశాలు రావ‌డంతో చాలా మంది జ‌బ‌ర్ద‌స్త్ వీడి దూరంగా వుంటున్నారు. అయితే ఎంత మంది జ‌బ‌ర్ద‌స్త్ ని వీడి వెళ్లినా .. కామెడీ స్కిట్ల‌తో కొంత మంది ఇప్ప‌టికీ ఎంట‌ర్ టైన్ చేస్తూనే వున్నారు. అయితే ఈ షో నుంచి కొంత మంది క‌మెడియ‌న్ లు గ్రూపు రాజ‌కీయాలు.. కొంత మంది తొక్కేయ‌డం లాంటి కార‌ణాల వ‌ల్ల వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఈ షోకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఇంద్ర‌జ బ‌య‌టపెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఈ షోలో భాగంగా ఇంద్ర‌జ టీమ్ లీడ‌ర్ లు ఆటో రాం ప్ర‌సాద్‌, బుల్లెట్ భాస్క‌ర్ ల‌తో ప్ర‌త్యేకంగా చిట్ చాట్ ని నిర్వ‌హించింది. బుల్లెట్ భాస్క‌ర్ ని ఉద్దేశిస్తూ `మీకు ఓ కో టీమ్ లీడ‌ర్ (అప్పారావు) ఉండేవారు. మీరు తొక్కేయ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయార‌ని అంటున్నారు. మ‌రి దీనికి మీ స‌మాధానం అని అడిగింది ఇంద్ర‌జ‌..   ఈ విష‌యంపై నేను స్పందించ‌కూడ‌ద‌ని అనుకున్నాన‌ని, ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే.. వెళ్లిపోయింది చాలా పెద్దాయ‌న‌` అంటూ బుల్లెట్ భాస్క‌ర్ ఏదో రీజ‌న్‌ చెప్పాడు. ఇక ఆటో రాంప్ర‌సాద్ పై కూడా ఓ బాంబు పేల్చింది ఇంద్ర‌జ‌..` మీరు స్క్రిప్ట్ లు స‌రిగా రాయ‌క‌పోవ‌డం వ‌ల్లే మీ టీమ్ మెంబ‌ర్స్ (సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను) ఈ షో నుంచి వెళ్లిపోయారు. ఇది నిజ‌మా? అని అడిగేసింది. ఈ ప్ర‌శ్న‌కు హ‌ర్ట్ అయిన ఆటో రాంప్ర‌సాద్ .. ఇంద్ర‌జ‌ను ఇరికించే ప్ర‌య‌త్నం చేశాడు. `రోజా గారు మినిస్ట‌ర్ కాకూడ‌ద‌ని దేవుడికి మొక్కుకున్నార‌ట‌.. ఎందుకు మేడ‌మ్‌? అని షాకిచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది.  

రిస్క్ అని తెలిసినా డెలివ‌రీ చేసిన వేద!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. త‌ల్లిదండ్రుల ఆద‌ర‌ణ క‌రువైన ఓ పాప‌.. పిల్ల‌లే క‌ల‌గ‌ర‌న్న కార‌ణంతో పెళ్లికి దూర‌మైన ఓ డాక్ట‌ర్ మ‌ధ్య‌ చిగురించిన అనుబంధం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కీల‌క పాత్ర‌ల్లో నిరంజ‌న్ బీఎస్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక న‌టించ‌గా ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్, సుమిత్ర త‌దిత‌రులు న‌టించారు. య‌ష్ ఆఫీస్ కి వెళుతూ వేద‌ని ఫైల్ తెచ్చిపెట్ట‌మంటాడు.. ఇదే స‌మ‌యంలో వేద నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ వుంటుంది. "ఖాళీగా లేను మీరే వెళ్లి తెచ్చుకోండి" అంటుంది. దీంతో య‌ష్ సీరియ‌స్ గా చూస్తాడు.. అత‌ని చూపులు గ‌మ‌నించిన వేద.. "ఎందుకు లెండి అన‌వ‌రంగా బీపీలు తెచ్చుకోవ‌డం".. అంటూ లేస్తుంటే.. "వ‌ద్దులే నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకో.. అవ‌స‌ర‌మైతే మూతికి కూడా రాసుకో" అంటూ చిర్రుబుర్రులాడుతూ ఆఫీస్ కి వెళ్లిపోతాడు. క‌ట్ చేస్తే.. ఆ ఏరియా ఎమ్మెల్యేని ఎవ‌రో హ‌త్య చేశార‌ని అత‌ని అనుచ‌రులు ఇటు వాళ్లు అటు వెళ్ల‌కుండా.. అటు వాళ్లు ఇటు రాకుండా రాస్తారోకో చేస్తారు. ఎవ‌రు వెళ్లాల‌ని చూసినా దాడుల‌కు దిగుతుంటారు. ఈ విష‌యం టీవీలో చూసిన వేద ... య‌ష్ గురించి కంగారుప‌డుతుంది. వెంట‌నే ఫోన్ చేస్తుంది. య‌ష్ అటెంట్ చేయ‌డు. దీంతో య‌ష్ త‌ల్లి మాలిని ఫోన్ చేసి విష‌యం చెప్ప‌డంతో "నేను క్షేమంగానే ఆఫీస్ కి చేరుకున్నాను" అంటాడు య‌ష్. ఇంత‌లో కాల‌నీలో వుండే ఓ యువ‌తికి పురిటి నొప్పులు మొద‌ల‌వుతాయి. ఆమె త‌ల్లి వేద‌ని స‌హాయం చేయ‌మంటుంది.   కాల‌నీ స‌మీపంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నా త‌న‌ని కాపాడాల‌ని వేద హాస్పిట‌ల్ కు త‌న కారులో తీసుకెళుతుంటుంది. అయితే మ‌ధ్య లో రోడ్ బ్లాక్ చేసిన ఎమ్మెల్యే అనుచ‌రులు వేద‌ని ముందుకు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకుంటారు. దీంతో చేసేది లేక తిరిగి మ‌ళ్లీ కాల‌నీకే వ‌చ్చేస్తుంది. త‌న‌ని డెలివ‌రీ చేయ‌మంటున్నార‌ని య‌ష్ కి చెబితే అన‌వ‌స‌రంగా రిస్క్ అని త‌రువాత ని లైసెన్స్ ర‌ద్దు చేస్తార‌ని హెచ్చ‌రిస్తాడు. అయినా త‌న‌కు తెలిసిన వారే కావ‌డంతో గైన‌కాల‌జిస్ట్ ని సంప్ర‌దిస్తుంది వేద‌. "నువ్వే డెలివ‌రీ చేయోచ్చుక‌దా" అని త‌ను స‌ల‌హా యిస్తుంది. ఎలా చేయాలో కూడా చెబుతుంది. త‌ను చెప్పిన‌ట్టే ఫాలో అయి వేద డెలివ‌రీ చేసి తల్లీ, బిడ్డ‌ని ర‌క్షిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

 క‌సి, వ‌ల్ల‌భ కుట్ర‌.. సైకిల్ రేస్‌లో న‌య‌ని గెలుస్తుందా?  

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే అరుదైన వ‌రం వున్న ఓ యువ‌తి చుట్టూ సాగే అంద‌మైన క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, ప్రియాంక చౌద‌రి, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, చ‌ల్లా చందు, అనిల్ చౌద‌రి, సురేష్ చంద్ర న‌టించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు ట్విస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గాయ‌త్రిదేవి - న‌య‌ని - విశాల్ ఈ ముగ్గురి పేర్లు క‌లిసేలా `గాన‌వి` ఇండ‌స్ట్రీస్ కి శ్రీ‌కారం చుట్టాల‌ని న‌య‌ని - విశాల్ ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు. అయితే కంపెనీ స్టార్ట్ చేయ‌డానికి క‌నీసం ప‌ది ల‌క్ష‌లైనా కావాలి. అలాంటి టైమ్ లో లేడీస్ కోసం సైకిల్ పందెం పోటీలు జ‌రుగుతున్నాయ‌ని, ఇందులో గెలిచిన వారికి ప‌ది ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీ అందుతుంద‌ని పేప‌ర్లో ప్ర‌క‌టన వ‌స్తుంది. అది చూసిన న‌య‌ని సైకిల్ పోటీల‌కు సిద్ధ‌మ‌వుతుంది. విశాల్ వారించినా అత‌న్ని ఒప్పించి రంగంలోకి దిగుతుంది. అయితే ఈ విష‌యం తెలిసి క‌సి, వ‌ల్ల‌భ‌, తిలోత్త‌మ కుట్ర చేస్తారు. న‌య‌నిని ఈ పోటీలో దెబ్బ‌కొట్టాల‌ని ప‌థ‌కం వేస్తారు. ఇందుకు స్వ‌యంగా వ‌ల్ల‌భ‌, క‌సి రంగంలోకి దిగుతారు. క‌సి కూడా న‌య‌నికి పోటీగా సైకిల్ పందెంలోకి ఎంట‌ర‌వుతుంది. ఇదే స‌మ‌యంలో వ‌ల్ల‌భ వైఫ్ హాసిని, న‌య‌ని చెల్లెలు స‌త్య తో పాటు విశాల్ మేన‌త్త ధురంద‌ర కూడా రంగంలోకి దిగుతుంది. దీంతో న‌య‌ని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తుంది. అంతా క‌లిసి సైకిల్ పోటీలో పాల్గొంటారు. న‌య‌ని పోటీలో ముందుకు వెళ్ల‌డంతో త‌న‌ని దారి త‌ప్పించి తాము ఏర్పాటు చేసిన రౌడీల కంట ప‌డేలా చేస్తారు. అక్క‌డి నుంచి త‌ప్పించుకున్న న‌య‌ని ఎలా త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకుంది?  పోటీలో విజేత‌గా నిలిచిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

`క్యాష్` షోలో ర‌చ్చ ర‌చ్చ చేసిన సాయి ప‌ల్ల‌వి

రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యాన‌ర్ పై చెరుకూరి సుధాక‌ర్ నిర్మించారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ గ‌త ఏడాది కాలంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు జూన్ 17న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ నేప‌థ్యంలో రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. టీవీ షోల‌లో పాల్గొంటూ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు. సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న నేప‌థ్యంలో హీరోయిన్ సాయి ప‌ల్ల‌వితో పాటు చిత్ర బృందం కూడా సుమ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `క్యాష్‌` షోలో పాల్గొన్నారు. తాజాగా విడుద‌లైన ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. జూన్ 18న రాత్రి 9:30 గంట‌ల‌కు ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. ఈ షోలో సాయి ప‌ల్ల‌వి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చిరున‌వ్వులు చిందిస్తూ షో లోకి ఎంట్రీ ఇస్తూనే సుమ‌పై సాయి ప‌ల్ల‌వి పంచ్ వేసింది. 'మొన్న ఈవెంట్ లో.. ఇప్పుడు ఇక్క‌డ.. ఇది ఎలా సాధ్య‌మైంది?' అంటూ సుమ‌ని ప్ర‌శ్నించింది. 'ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ నావే' అంటూ ఫ‌న్నీగా సుమ ఆన్స‌ర్ ఇచ్చింది. సాయి ప‌ల్ల‌వితో పాటు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల, న‌వీన్ చంద్ర ఈ షోలో పాల్గొన్నారు. న‌వీన్ చంద్ర ఎంట్రీ ఇవ్వ‌గానే సుమ అత‌నికి పెట్రోల్ బాటిల్ ఇచ్చింది. ఇదిలా వుంటే షోలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో డిస్ ప్లే కాగానే సాయి ప‌ల్ల‌వి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో తెలిపింది సాయి ప‌ల్ల‌వి. సూప‌ర్ స్టార్ అయిన‌ప్ప‌టికీ ఓ సాధార‌ణ వ్య‌క్తిలా వుంటార‌ని, త‌న హార్ట్ లో ఏమ‌నిపిస్తే అది మాట్లాడ‌తార‌ని, అందుకే ఆయ‌నంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. 

వాగ్దేవికి పెద్దబాలశిక్షను బహుమతిగా ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలయ్యకు చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి చెప్పక్కర్లేదు. టీవీ షోస్ లో కనిపిస్తూ అందరిని తనదైన మార్క్ కామెడీతో, అన్ స్టాపబుల్ డైలాగ్స్ తో అలరిస్తున్నారు. ఐతే  తెలుగు ఇండియన్ ఐడల్ షోలో కంటెస్టెంట్ వాగ్దేవి బాలయ్యని ఒక పొడుపు కథ పొడుస్తాను ఆన్సర్ చెప్పమని అడుగుతుంది. " చూస్తే చూస్తుంది కళ్ళు లేవు, నవ్వితే నవ్వుతుంది పళ్ళు లేవు, తంతే తంతుంది కాళ్ళు లేవు " అని అడిగేసరికి ఇది నీకంటే చిన్నగా ఉన్నప్పుడే నేను నేర్చుకున్నా అది  అద్దం అని చెప్తారు బాలయ్య. ఇంత ఫాస్ట్ గా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు సర్ అని వాగ్దేవి అనేసరికి బాలయ్యానా , మాజాకానా అంటూ ఆట పట్టిస్తారు. రివర్స్ లో బాలయ్య వాగ్దేవికి ఒక పొడుపు కథ వేస్తారు. "ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు " ఎవరు అని అడిగేసరికి ఆన్సర్ చెప్పలేకపోతుంది వాగ్దేవి.   చిటికెన వేలు అంటారు బాలయ్య. శ్రీరామచంద్ర ఆశ్చర్యపోయి నాకింకా పెళ్లి కాలేదు కదా సర్ అందుకే నాకు తెలీదు ఆన్సర్ అంటాడు. ఏమిటి ఒక్కసారి కూడా నీకు పెళ్లి కాలేదా అంటూ కామెడీగా అడుగుతారు బాలయ్య. అది తప్ప మిగతావన్నీ అయ్యాయ్ అంటూ థమన్ కొంటెగా అనేసరికి శ్రీరామచంద్ర సిగ్గుపడతాడు. దాంతో   స్టేజి మొత్తం నవ్వులతో నిండిపోయింది. తనకు పొడుపు కథ వేసి ఎంటర్టైన్ చేసినందుకు బాలయ్య వాగ్దేవికి పెద్దబాలశిక్ష బుక్ ని ప్రెజెంట్ చేశారు. బుక్ చదివి అందరిని మంచి పొడుపు కథలు అడుగు నన్ను మాత్రం అడగకు అంటూ నవ్వేశారు  బాలయ్య. బాలయ్య ఎనర్జీ నెక్స్ట్ లెవెల్, బాలయ్య బాబా మాజాకానా, ఏ స్క్రీన్ ఐనా బాలయ్య బెస్ట్ అంటూ నెటిజన్స్ బాలయ్య మీద అభిమానాన్ని మెసేజెస్ రూపంలో చెప్పారు.

సుమక్క టీ స్టాల్ కి వచ్చిన ‘విరాటపర్వం’ టీమ్‌

'విరాటపర్వం' ఈనెల 17న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ బాగా జోరందుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఊడుగుల, న‌టుడు నవీన్ చంద్ర, హీరోయిన్ సాయి పల్లవి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర.. సుమక్క టీ స్టాల్ కి వచ్చి ఎంటర్టైన్ చేశారు. సుమక్క ఆల్వేస్ ఫన్నీ. సాయి పల్లవి కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటుంది. "మా చాయ్ షాప్ కి మీ టీం అంతా ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్తూనే  టీ పెట్టమంటూ అక్కడ ఉన్న‌తనికి పురమాయిస్తుంది సుమ.. "గ్యాస్ ఆన్ చేయలేదుగా" అని సాయి పల్లవి అడిగేసరికి "మాది కనబడని గ్యాస్" అంటూ సుమ ఫన్ చేస్తుంది. "టీ కూడా కనపట్లేదుగా" అంటుంది మళ్ళీ పల్లవి. ఇంతలో స్టాల్ లోకి వేణు ఊడుగుల వచ్చి కూర్చుంటారు. "ఏం టీ తాగుతారు మీరు?" అంటూ సుమ అడుగుతుంది.  "మసాలా టీ" అని వేణు చెప్పేసరికి దానికి రివర్స్ లో "వేపాకు టీ ఇవ్వు" అని చెప్తుంది సుమ. ఒక పేపర్ గ్లాస్ లో వేపాకులు వేసి ఇచ్చేసి "మా దగ్గర వేపాకులే ఉన్నాయి. టీ మీరు తెచ్చుకుని పోసుకుని తాగండి" అనేసరికి స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోతుంది. స్పాంటేనియస్ కామెడీకి పెట్టింది పేరు సుమ. అలా సుమ హోస్ట్ చేస్తున్న 'క్యాష్' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో ఈ చిన్న స్కిట్ మంచి నవ్వు తెప్పిస్తోంది.  డైరెక్టర్ గారు చెప్పారంటూ సాయిపల్లవితో స్టేజి మీద 'ఫిదా' మూవీలో సాంగ్ కి డాన్స్ చేయిస్తుంది సుమ. అసలే డాన్స్ క్వీన్ ఐన పల్లవి అంతే అందంగా డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించింది. ఈ వీడియోకి నెటిజన్స్ నుంచి బోల్డు మెస్సేజెస్ వస్తున్నాయి. 'సాయి పల్లవి సూపర్' అంటూ ఆమెను అలనాటి అందాల నటి సౌందర్యతో పోలుస్తున్నారు. మంచి నటి, మంచి డాన్సర్, సాయి పల్లవి చాలా ట్రెడిషనల్, సాయి పల్లవికి అందమైన మనసు ఉంది అంటూ కితాబిచ్చేశారు సాయిపల్లవి ఫాన్స్.

దసరాకు అన్ స్టాపబుల్ సీజన్ 2 ?!

ఆహా ఓటిటి వేదికపై నందమూరి నాయకుడు అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా చేసి ఆ షోకి మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టారు. ఐతే ఈ షో ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ సీజన్ ఎప్పుడు అంటూ ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలకు బాలయ్య తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి పై ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ సీజన్ మోహన్ బాబుతో మొదలై మహేష్ బాబుతో ఎండ్ అయ్యింది. ఐతే బాలయ్య ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీలోనూ షోస్ లో ఇంటర్వ్యూస్ చేస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు.  బాలయ్యలో మరో యాంగిల్ ని ప్రేక్షకులు  "అన్ స్టాపబుల్ విత్ NBK " షోలో చూసారు. ఇంతకుముందు కనిపించిన బాలయ్య వేరు, ఇప్పుడు బాలయ్య వేరు . చాలా మార్పొచ్చింది. మాటతీరు కూడా చాలా బాగుంది అంటున్నారు అభిమానులు. ఈ షో రైట్స్ ని కొనుక్కోవడానికి చాలా ఛానెల్స్ కూడా ముందుకొస్తున్నాయి. యంగ్ జనరేషన్ తో కలిసి అద్భుతమైన షోస్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ స్టేజి మీద సింగర్, హోస్ట్ ఐన శ్రీరామచంద్ర అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు అని బాలయ్యను అడిగారు. ఐతే ఈ షో బహుశా త్వరలోనే ప్రారంభం కావచ్చు అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ని బట్టి దసరాకు ఈ షో  ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

టీం లీడర్ గా రోహిణి

ఎక్స్ట్రా జబర్దస్త్ ఎవ్రీ వీక్ చాలా కాంట్రోవర్సీస్ ని మూటగట్టుకుంటున్నా ప్రేక్షకులను చక్కగానే అలరిస్తూ వస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతున్న చాలా మంది టీం లీడర్స్, టీమ్ మెంబర్స్, జడ్జెస్ వెళ్లిపోయారు. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు వచ్చారు. కానీ అంత ఫన్ పండడం లేదని ఆడియన్స్ అభిప్రాయం. ఐనా కొత్త కొత్త స్కిట్స్ వేస్తూ ఎంతో కొంత రక్తి కట్టిస్తున్నారు. ఐతే రాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో రోహిణి టీం లీడర్ అయ్యింది. ఇంతలో నరేష్ స్టేజి మీదకు వచ్చి అక్కడ భోజనాలు పెడుతున్నారంట అనేసరికి రోహిణితో సహా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక తర్వాత రోహిణి సీరియస్ అవుతుంది.  ఏంట్రా మీరు నాతో పంచులేసేది. నాలో ఒక రోహిణినే చూస్తున్నారా. నాలో ఒక తెలంగాణ శకుంతల గారు, కోవై సరళ గారు, ఒక రమాప్రభ గారు వున్నారు. తెలుసా అనేసరికి అంతమంది లోపలున్నారా  అందుకే అంత  లావుగా ఉన్నావా  వాళ్ళందరిని బయటికి పిలువ్ అంటూ రాంప్రసాద్ పంచ్ వేస్తాడు. ఇక ఈ షోకి ఇంద్రజ, ఎగిరే పావురమా హీరోయిన్ లైలా జడ్జెస్ గా వచ్చారు. ఇక ఫైనల్ గా ఇంద్రజ బులెట్ భాస్కర్ ని ఆటో రాంప్రసాద్ ని ఇంటర్వ్యూస్ చేస్తారు. "మీ కో-లీడర్ ని మీరు తొక్కేయబట్టే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు అని అంటున్నారు దీనికి మీ సమాధానం" అంటూ భాస్కర్ ని అడుగుతుంది . మీరు స్క్రిప్ట్స్ సరిగా రాయకపోవడం వల్లనే మీ టీం మెంబెర్స్ ఈ షో నుంచి వెళ్లిపోయారు..అది నిజామా" అంటూ రాంప్రసాద్ ని అడుగుతారు. ఇలా  రాబోయే వారం ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం హాట్ గా కొంచెం కూల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మరి రాంప్రసాద్, భాస్కర్ ఏం ఆన్సర్స్ ఇచ్చారు అనే విషయం తెలుసుకోవాలంటే 17 వరకు వైట్ చేయాల్సిందే.

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ లో రానాని బుక్ చేసిన చిరు!

ఆహా ఓటీటీ 'తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్' సింగింగ్ షోని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షోకు త‌మ‌న్‌, నిత్యామీన‌న్‌, శ్రీ‌రామ్ జ‌డ్జెస్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఈ షోకు గెస్ట్ గా నంద‌మూరి బాల‌య్య ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన స్టైల్లో హ‌ల్ చ‌ల్ చేశారు. పాట‌లు పాడుతూ.. డాన్స్ లు  చేస్తూ అద‌ర‌గొట్టారు. ఇక ఈ షో ఇప్ప‌డు ఫైన‌ల్ కు చేరింది. గ్రాండ్ ఫైన‌ల్ ని మెగా ఫైన‌ల్ గా ఏర్పాటు చేశారు. ఈ మెగా ఫైన‌ల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. రోల్స్ రాయిస్ కార్ లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ లోప‌లికి వ‌స్తూనే త‌న గ్రేస్ తో ఆక‌ట్టుకున్నారు. ఏళ్లు గ‌డుస్తున్నా త‌న స్టైల్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి నిరూపించారు. శుక్ర‌వారం 17న ఈ మెగా ఫైన‌ల్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోని ఆహా వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. ప్రోమోలో చిరు చాలా హుషారుగా క‌నిపించి సంద‌డి చేశారు. ఒక ద‌శ‌లో ప్రోగ్రామ్ ని త‌న చేతుల్లోకి తీసుకుంటున్నాడా? అనేంత‌గా హ‌ల్ చ‌ల్ చేశారు.                       ఇదే షోలోకి 'విరాట‌ప‌ర్వం' ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో రానా, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఎంట్రీ ఇచ్చారు. "డాన్స్ అంటే కొంచెం భ‌యం.. పాట అంటే ఇంకా భ‌యం వ‌చ్చేస్తుంది" అని సాయి ప‌ల్ల‌వి అంటే రానా 'నేను టెన్త్ .. లెవెన్త్ క్లాస్ లో వున్న‌ప్పుడు..' అని చెబుతుండ‌గానే చిరు అందుకుని "నేను దానికి ఎక్స్ టెన్ష‌న్ చెబుతాను.. చ‌ర‌ణ్ బాబు గ‌దిలో కిటికీ త‌లుపుల‌ గ్రిల్ తీశావ్‌" అన్నారు.. ఆ మాట‌ల‌కు షాకైన రానా సిగ్గుపడిపోయాడు. ఈ ఒక్క మాట‌తోనే ఆగ‌కుండా రానా చిలిపి అల్ల‌ర్ల‌ని చిరు బ‌య‌ట‌పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. రానా, చిరుల ఇంట్రెస్టింగ్ టాపిక్ ల‌కు సంబంధించిన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఎపిసోడ్ వ‌చ్చే శుక్ర‌వారం 17న రాత్రి 9 గంట‌ల‌కు `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది.

న‌య‌ని పోటీలో గెల‌వ‌కుండా క‌సి, వ‌ల్ల‌భ కుట్ర‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయే ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్టే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో నిహారిక హ‌ర్షు, ప్రియాంక చౌద‌రి, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, ప‌విత్ర జ‌య‌రామ్‌, చ‌ల్లా చందు, అనిల్ చౌద‌రి, సురేష్ చంద్ర త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. `గాన‌వి` ఇండ‌స్ట్రీస్ ని ప్రారంభించ‌డానికి పెట్టుబ‌డి లేక‌పోవ‌డంతో సైకిల్ పోటీల్లో గెలిచిన మ‌హిళ‌కు రూ. 10 ల‌క్ష‌లు బ‌హుమ‌తి అనే ప్ర‌క‌ట‌న చూస్తుంది న‌య‌ని. ఈ పోటీలో పాల్గొని ప‌ది ల‌క్ష‌లు సొంతం చేసుకుని ఫ్యాక్ట‌రీని మొద‌లు పెడ‌తామంటుంది. దీనికి విశాల్ ముందు అంగీక‌రించ‌క‌పోయినా ఆ త‌రువాత ఓకే అంటాడు. ఈ విష‌యం తెలుసుకున్న క‌సి, వ‌ల్ల‌భ ఈ పోటీలో న‌య‌ని గెల‌వ‌కూడ‌ద‌ని కుట్ర చేస్తారు. క‌సిని కూడా రంగంలోకి దింపుతారు. ఇదే స‌మ‌యంలో వ‌ల్ల‌భ భార్య హాసిని కూడా న‌య‌నికి అండ‌గా పోటీ కి దిగుతుంది. న‌యని చెల్లెలు కూడా పోటీలోకి రావ‌డంతో ఏం జ‌రుగుతోందో న‌య‌నికి అర్థం కాదు. ఈ లోగా పోటీ మొద‌ల‌వుతుంది. న‌య‌ని దూసుకువెళుతుంటే ముందుగా రౌడీల‌ని ఏర్పాటు చేసిన వ‌ల్ల‌భ త‌న‌ని అక్క‌డే అంతం  చేయ‌మ‌ని రౌడీల‌తో చెబుతాడు. దారి త‌ప్పిన న‌య‌ని ఎలాగోలా బ‌య‌ట ప‌డుతుంది. అయినా స‌రే త‌న‌ని ముందుకు వెళ్ల‌నీయ‌కూడ‌ద‌ని క‌సి ఏర్పాటు చేసిన లేడీస్ న‌య‌న‌ని కింద ప‌డేస్తారు. హాసిన వచ్చి న‌య‌నిని లేపుతుంది. అక్క‌డి నుంచి హాసిని, న‌య‌ని ఒకే సైకిల్ పై వ‌స్తుంటారు. న‌య‌ని స్పీడు పెంచుతుంది. అది చూసిన విశాల్ క‌మాన్ క‌మాన్ అంటూ అరుస్తుంటాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? న‌య‌ని అనుకున్న‌ట్టే సైకిల్ పోటీలో విజ‌యం సాధించిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

జ్వాల‌ ముందే హిమ‌కు తాళి క‌ట్టి షాకిచ్చిన నిరుప‌మ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ముందుకు సాగిపోతోంది. ఈ మంగ‌ళ‌వారం ఏం జ‌రిగిందో ఒకసారి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏడు అడుగులు వేయ‌మంటూ జ్వాల‌ అడుగుల కోసం పూల‌తో అలంక‌రిస్తుంది హిమ‌.. మ‌ధ్య‌లో నిరుప‌మ్.. అటు ఇటు హిమ, జ్వాల‌. నిరుపమ్ ద‌గ్గ‌రికి పూల‌పై అడుగులు వేస్తూ వెళుతూ వుంటుంది జ్వాల‌.. ఏడో అడుగు వేసే స‌మ‌యంలో జ్వాలకు ఫోన్ కాల్ వ‌స్తుంది. వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ ఫోన్ కాల్ చేసింది శోభ‌. జ్వాల ఎవ‌రు అని అడ‌గ్గా, శోభ త‌ను ఎవ‌రో తెలియ‌నీయ‌కుండా రాక్ష‌స న‌వ్వు న‌వ్వి 'ఎలా వున్నావు జ్వాల' అంటుంది. 'నేను హిమని' అని అబ‌ద్ధం చెబుతుంది. అంతే కాకుండా త‌నంటే చిరాకు వ‌చ్చేలా చేస్తుంది. 'నేను అడ్ర‌స్ చెబుతాను నువ్వు రావాలి. లేట్ చేస్తే మ‌న‌సు మార్చుకుంటాను' అని చెప్ప‌డంతో జ్వాల త‌న కోసం ప‌రుగులు తీస్తుంది. ఇదంతా చాటునుంచి గ‌మ‌నిస్తున్న శోభ రాక్ష‌స ఆనందం పొందుతుంది. "ఏంటి బావా.. జ్వాల ఇలా వెళ్లిపోయింది?" అని హిమ అంటుంటే, "త‌ను ఏడో అడుగు వేసి వుంటే నిన్ను నేను ప్రేమించ‌డం లేదు. ప్రేమించ‌ను కూడా అని జ్వాల‌కు చెప్పే వాడిని" అంటాడు. దీంతో హిమ షాక్ అవుతుంది. "ఏంటిది?" అంటూ సీరియ‌స్ అవుతుంది. క‌ట్ చేస్తే.. హిమ‌ను గుడికి తీసుకొచ్చిన నిరుప‌మ్ అక్క‌డే తాళిక‌డ‌తాడు. మ‌న ఇద్ద‌రినీ విడ‌దీసే హ‌క్కు ఎవ‌రికీ లేదంటూ అస‌లు విష‌యం చెబుతాడు. ఆ సీన్ చూసిన జ్వాల ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

'గాడ్ ఫాదర్' సాంగ్స్ విషయంలో బాధపడిన తమన్

తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేశారు నిర్వాహకులు. దేశవ్యాప్తంగా ఈ షోకి మంచి హైప్ వచ్చింది. రేటింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. వాగ్దేవి, వైష్ణవి, జయంత్, శ్రీనివాస్, ప్రణతి ఫైనల్స్ కి చేరుకున్న విషయం తెలిసిందే. లాలస ఎలిమినేట్ అయ్యింది. ఓటిటి వేదికగా స్టార్ట్ ఐన ఈ  షోకి మంచి ఆదరణ లభించడంతో పాటు కొత్త గొంతులు కూడా సంగీత ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇంతటి సక్సెస్ఫుల్ షో ఫైనల్ ఎపిసోడ్ కి బాస్ చిరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ షోకి అదనపు ఆకర్షణగా 'విరాటపర్వం' జోడీ రానా, సాయిపల్లవి కూడా వచ్చి స్టేజిని మరింత ఎనర్జిటిగ్గా మార్చబోతున్నారు. తెలుగులో ఇదే ఫస్ట్ ఇండియన్ ఐడల్ షో కావడంతో ఎవరు విన్నర్ అవుతారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ జూన్ 17న ప్రసారం కాబోతోంది. ఇక ఇదే రోజు 'విరాటపర్వం' మూవీ రిలీజ్ అవబోతోంది. ఇప్పుడు చిరంజీవి వస్తున్న ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  జడ్జ్‌ ఐన నిత్యామీనన్ షోకి రెడీ అవుతూ "లేటవుతుంది, నా ఇయర్ రింగ్స్" అంటూ అడుగుతూ ఉంటుంది. "గాడ్ ఫాదర్ సాంగ్స్ అడిగితే ఏం చేయాలి?" అంటూ టెన్షన్ పడుతున్నట్టుగా థమన్, "ఇక ఈ రోజు నేను కొంచెం ఎక్సయిటెడ్, కొంచెం నెర్వస్ గా ఉన్నాను" అంటూ కార్తిక్ చెప్తున్నట్టుగా ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. బ్యాగ్రౌండ్‌లో ఒక పాప పరిగెడుతూ "మన మెగాస్టార్ వచ్చేస్తున్నారో" అంటూ చెప్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నాన్న జీరో అంటూ ఏడ్చేసిన శుభలేఖ సుధాకర్

అమ్మంటే ఎంత ఇష్టమో నాన్న అన్నా కూడా అంతే ఇష్టం ఉంటుంది ఎవరికైనా. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న జీవితాంతం తన భుజాలపై మోస్తాడు. జూన్ లో ఫాదర్స్ డే రాబోతోంది. ఇక ఈ నెలలోనే మ్యూజిక్ డే కూడా వుంది. సంగీతం లేని ప్రపంచాన్ని ఊహించలేం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా, మంచి నిద్ర పట్టాలన్నా, స్పెషల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలన్నా మ్యూజిక్ కి ఆల్టర్నేట్ ఇంకోటి లేదు. మరి ఈ టు స్పెషల్ ఈవెంట్స్ ని పురస్కరించుకుని ఒక సూపర్ ప్రోగ్రాంని జీ తెలుగు డిజైన్ చేసింది. ఇందులో నటుడు గోపీచంద్, రాశిఖన్నా , సాయి పల్లవి, శుభలేఖ సుధాకర్, సురేష్, రాజీవ్ కనకాల, ప్రభాకర్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఈ షోలో కనిపించి అలరించనున్నారు. "నాన్న హీరో మనకు నచ్చినప్పుడు, నాన్న జీరో మనకు నచ్చనప్పుడు" అని చెప్తూ స్టేజి మీద ఎమోషన్ అయ్యారు శుభలేఖ సుధాకర్. "థ్యాంక్యూ దిల్ సే " అనే ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో  రిలీజ్ అయ్యింది. ఇక యాంకర్స్ గా వన్ అండ్ ఓన్లీ సుధీర్ , శ్రీముఖి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. సుధీర్ కోసమే ఈ షో చూడాలి. సుధీర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ సుధీర్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అప్పుడు పిల్ల బచ్చాను.. అందుకే ఐ లవ్ యూ చెప్పాను!

అరియానా గ్లోరీ అంటే బిగ్ బాస్ సీజన్ 4 గుర్తొస్తుంది. అందులో టాస్కులు బాగా ఆడి ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది అరియానా. అంతే కాదు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియో మస్త్ వైరల్ కూడా అయ్యింది.  ఆర్జీవీ, అరియానా మధ్య ఎఫైర్ నడుస్తోందని కూడా పుకార్లు షికారు చేశాయి. అలా అరియానా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆమె 2015 లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని చానెల్స్ లో ఎంతో మందిని ఇంటర్వూస్ చేసి మంచి పాపులర్ అయ్యింది. ఐతే జెమినీలో కెవ్వు కామెడీ షో యాంకర్ గా ఆమె మంచి ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ షో 4 వ సీజన్ లో టెన్త్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది అరియానా. ఐతే ఈ షోలో  బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కి ఎన్నో సార్లు ఐ లవ్ యూ చెప్పింది.  బిగ్ బాస్ వల్లనే తనకు మంచి నేమ్, ఫేమ్ వచ్చిందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. 'బిగ్ బాస్ 4, బిగ్ బాస్ 5 బజ్, నాన్ స్టాప్ బిగ్ బాస్ మొత్తాన్ని మూడేళ్లకు కాంట్రాక్టు తీసుకున్నావా ఏమిటి' అన్న యాంకర్ ప్రశ్నకు, 'నిజంగా అదృష్టం ఎలా వచ్చి వరిస్తుందో తెలీదు. నాకు బిగ్ బాస్ రూపంలో వచ్చింది. నేను బిగ్ బాస్ కి దత్త పుత్రికను. అన్ని లాంగ్వేజస్ లో చూసుకుంటే నేనే ఎక్కువగా బిగ్ బాస్ కి వర్క్ చేశానేమో' అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.  'బిగ్ బాస్ 4 లో ఎక్కువసార్లు ఐ లవ్ యూ చెప్పా కానీ ఓటిటిలో చాలా తక్కువ సార్లే చెప్పాను' అంటూ మనసులో మాట చెప్పింది. 'అప్పుడంటే స్టార్టింగ్ కాబట్టి ఎక్సయిట్మెంట్ ఉంటుంది, అందులోనూ పిల్ల బచ్చాను కాబట్టి అన్ని సార్లు ఐ లవ్ యూ చెప్పాను. తర్వాత మైండ్ మెచ్యూర్ అయ్యింది కాబట్టి తక్కువ సార్లు చెప్పాను' అంటోంది అరియానా. నైస్ ఇంటర్వ్యూ, మంచి ఫ్రెండ్షిప్ ఇద్దరిది, అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

అనసూయ భర్తగా దొరబాబా?!

అనసూయ పేరు బుల్లితెరపై ఇప్పుడు మస్త్ ఫేమస్. తెలుగు ఆడియెన్స్ కి మంచి ఫేవరెట్ కూడా. అందం, అభినయంతో ఎప్పుడూ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. స్టార్ హీరోస్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై నటించి వ్వావ్‌ అనిపించింది. తెలుగులో టీవీ షోస్, ఈవెంట్స్ , మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇలాంటి నవ్వుతూ నవ్విస్తూ ఉండే అనసూయకు మస్త్ కోపం వచ్చింది. కోపం తెప్పించింది ఎవరో కాదు జబర్దస్త్ షో స్క్రిప్ట్. ఈ షోలో రకరకాల స్కిట్లు ఉంటాయి. వీటిల్లో భాగంగా జడ్జెస్ మీద, యాంకర్స్ మీద జోక్స్ వేసే స్కిట్స్ కూడా ఉంటాయి. అలాంటి స్కిట్స్  కొన్నిసార్లు పేలతాయి, ఇంకొన్ని సార్లు ఫెయిలవుతాయి. అందులో భాగంగానే నెక్స్ట్ వీక్ ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో అనసూయ పై ఒక స్కిట్ చేశారు. స్కిట్ పేరు సెలబ్రిటీస్ హోమ్ టూర్ అన్నమాట. ఇందులో హైపర్ ఆది టీమ్ లో ఉండే రైజింగ్ రాజు అనసూయ వేషంలో కనిపిస్తాడు. భర్త భరద్వాజ్ కేరెక్టర్ లో దొరబాబు కనిపిస్తాడు. 'రాముడి లాంటి మా ఆయనకు దొరబాబుని ఇచ్చారా. ఇప్పుడు ఈ హోమ్ టూర్ చాలా వయలెంట్ అవ్వాల్సి వస్తుంది' అంటూ అనసూయ ఫన్నీగా చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.