సుధీర్ ని హౌలే అంటూ గాలి తీసేసిన సాయి పల్లవి
ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ జీ తెలుగులో ఫాదర్స్ డే, మ్యూజిక్ డే సందర్భంగా `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జూన్ 19న ఈ ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. సుడిగాలి సుధీర్, శ్రీముఖి ఈ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో టీవీ స్టార్లు, కమెడియన్ లు, సింగర్స్, టీవీ సీరియల్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. ఈ షోలో గెస్ట్ లుగా రానా, సాయి పల్లవి, సురేష్ బాబు, హీరో గోపీ చంద్, రాశీఖన్నా, దర్శకుడు మారుతి పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ షోలో జూలై 1న విడుదలకు సిద్ధమవుతున్న `పక్కా కమర్షియల్` మూవీ హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీ, దర్శకుడు మారుతి పాల్గొన్నారు. ఆ తరువాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన `విరాటపర్వం`లో నటించిన రానా, సాయి పల్లవి, ఈ మూవీ సమర్పకులు డి. సురేష్ బాబు పాల్గొన్నారు. ముందు గోపీచంద్, రాశిఖన్నా పాల్గొన్న ఈ షోలో ఈ ఇద్దరు కలిసి సుడిగాలి సుధీర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చివర్లో రాశిఖన్నా, సుడిగాలి సుధీర్ కలిసి డాన్స్ చేశారు. ఇదే తరహాలో గోపీచంద్, శ్రీముఖి కూడా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, రానా, సురేష్ బాబు నానా హంగామా చేశారు. ప్రోమో షాట్ కోసం రానా ఏసిన పంచ్ లు,,సాయి పల్లవి డాన్స్ తో అదరగొట్టింది. ఆ తరువాత సుధీర్ అడిగిన ఓ ప్రశ్నకు సాయి సల్లవి దిమ్మదిరిగే పంచ్ ఇచ్చింది.. హౌలేగా అంటానని చెప్పడంతో సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. తరువాత నిర్మాత డి. సురేష్ బాబు .. తనయుడు రానా నాటి కాదని, అంతకు మించి అని చెప్పడం.. రానా గాళ్ ఫ్రెండ్స్ గురించి అడిగితే ఒక్కరో ఇద్దరో కాదని చాలా మందే వుండి వుంటారని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. `థాంక్యూ దిల్ సే` పేరుతో రూపొందిన ఈ షో జూన్ 19 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.