హిమ చెప్పిన నిజం.. షాకైన సౌంద‌ర్య‌!

గ‌త ఎపిసోడ్ లో జ్వాల‌కు నిజం చెప్పాల‌నే ఉద్దేశ్యంతో నిరుప‌మ్.. జ్వాల‌ని "ప‌ద వెళ‌తాం" అంటూ హిమ ముందే పిలుస్తాడు. జ్వాల సిగ్గుప‌డుతూ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. హిమ కంగారుప‌డుతూ "నేనూ వ‌స్తాను" అని అడ్డుప‌డుతుంది. తీరా జ్వాల.. హిమ‌ని తీసుకుని వెళ్ల‌కుండా నిరుప‌మ్ ని తీసుకుని వెళ్ల‌డంతో క‌థ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరిగింది. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. హిమ క్యాన్స‌ర్ ఓ నాట‌క‌మ‌ని సౌంద‌ర్య‌కు తెలుస్తుంది. ఆ త‌రువాత త‌ను ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. హిమ క్యాన్స‌ర్ బారిన ప‌డింది అన్న‌ది ఓ నాట‌క‌మ‌ని సౌంద‌ర్య‌కు తెలుస్తుంది. దీంతో త‌న‌ని పిలిచిన సౌంద‌ర్య లాగిపెట్టి చెంప ఛెళ్లుమ‌నిపిస్తుంది. దీంతో హిమ, ఆనంద‌రావు షాకుకు గుర‌వుతారు. వెంట‌నే తేరుకున్న ఆనంద‌రావు `దాన్ని ఎందుకు కొట్టావు` అంటూ సౌంద‌ర్య‌ని నిల‌దీస్తాడు. వెంట‌నే `అంతా తెలిసిపోయింది హిమా` అని సౌంద‌ర్య అరుస్తుంది. ఆ మాట‌లు విన్న హిమ `నాన‌మ్మా` అంటుంది భ‌యం భ‌యంగా.. అదే స‌మ‌యంలో సౌంద‌ర్య‌.. 'నీకు క్యాన్స‌ర్ లేదు' అని అరుస్తుంది. అక్క‌డే వున్న నిరుప‌మ్‌, స్వ‌ప్న‌, ఆనంద‌రావు షాక్ అవుతారు. 'మా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి ఎందుకీ నాట‌కం?' అంటుంది సౌంద‌ర్య కోపంగా... 'చెబుతావా లేక..' అంటూ మ‌రోసారి హిమ పైకి చేయి లేపుతుంది. వెంట‌నే `శౌర్య ఎవ‌రో ఎక్క‌డుందో నాకు తెలుసు` అంటూ నోరు విప్పుతుంది హిమ‌. ఆ మాట‌ల‌కు సౌంద‌ర్య ఒక్క‌సారిగా షాక్ అవుతుంది.  సౌంద‌ర్య‌ని శౌర్య పేరుతో శోభ‌ బ్లాక్ మెయిల్ చేస్తున్న విష‌యాన్ని గ్ర‌హించిన హిమ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేందుకే సిద్ధ‌ప‌డుతుంది. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్, జ్వాల‌తో మాట్లాడుతుంటే సౌంద‌ర్య‌, హిమ వింటారు. ఇదే స‌మ‌యంలో హిమ ఓ నిజం చెబుతుంది. అదేంటీ?.. ఆ నిజం విని సౌంద‌ర్య ఎందుకు షాక్ కు గురైంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

73 దారుల‌న్నీ మూసేసిన రాగ‌సుధ‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థ‌తో కూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్త‌క‌ర మ‌లుపుల‌తో ఉత్కంఠ భ‌రితంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం చివ‌రి అంకానికి చేరుకుంది. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష హెచ్ కె. అత‌నికి జోడీగా న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, జ్యోతి రెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, అనుషా సంతోష్‌, వ‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, సందీప్ న‌టించారు. రాగ‌సుధ నుంచి త‌ప్పించుకోవాలంటే త‌మ వ‌ద్ద వున్న ఒకే ఒక్క ఆయుధం ఆస్తి డాక్యుమెంట్స్‌. వాటితో త‌న‌కు చెక్ పెట్టాల‌ని ఆర్య వ‌ర్థ‌న్ ప్లాన్ చేస్తాడు. ఇదే విష‌యం అను, జెండేల‌కు చెప్పి ఇంట్లో రాజ‌నంద‌ని గ‌దిలో వున్న డాక్యుమెంట్ల‌ని తీసుకుని నేరుగా కోర్టుకు ర‌మ్మ‌ని చెబుతాడు. అయితే ఇంటికి వ‌చ్చి రాజ‌నంద‌ని గ‌దిలో వెతికిన అను షాక్ కు గుర‌వుతుంది. గ‌తంలో త‌న‌ని మాట‌ల్లో పెట్టి రాగ‌సుధ ఆస్తి డాక్యుమెంట్ల‌ని తెలివిగా కొట్టేసింద‌న్న విష‌యం గుర్తిస్తుంది. ఆ విష‌యం జెండే తో పాటు మాన్సీ, ఆర్య వ‌ర్థ‌న్ మ‌ద‌ర్ కు చెబితే మాన్సీ, ఆమె త‌ల్లి హేళ‌న చేస్తారు. కావాల‌నే రాగ‌సుధ తో చేరి ఇదంతా చేశావంటూ నిందిస్తారు. అను సంజాయిషీ చెప్ప‌బోతుంటే చేసింది చాలు అను అంటూ జెండే అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తాడు. ఇంత‌లో రాగ‌సుధ ఆస్తి డాక్యుమెంట్ల‌తో కోర్టులో ప్ర‌త్య‌క్ష్యం అవుతుంది. దారుల‌న్నీ మూసుకుపోవ‌డంతో ఆర్య న్యాయ‌మే గెలుస్తుంద‌ని చెబుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  రాగ‌సుధ కుట్ర కార‌ణంగా ఆర్య ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడా?.. లేక రాగ‌సుధ కుట్ర బ‌య‌ట‌ప‌డి ఆర్య ఆస్తిని ద‌క్కించుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

కైలాష్ రావణుడని వేద గమనించిందా?

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. స్టార్ ప్ల‌స్ ఛాన‌ల్ లో ఏడేళ్ల క్రితం ప్ర‌సారం అయిన హిందీ సీరియ‌ల్ `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సీరియ‌ల్ లోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, రాజా శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, సుమిత్ర‌, బేబీ మిన్ను నైనిక త‌దిత‌రులు న‌టించారు. వేద కార‌ణంగా కాల‌నీలో వుండే ఓ యువ‌తి పండండి పాప‌కు జ‌న్మ‌నిస్తుంది. త‌నే డెలివ‌రీ చేసి త‌ల్లి, బిడ్డ ప్రాణాల‌ని కాపాడుతుంది. ఆ కృత‌జ్ఞ‌త‌తో పాప బార‌సాల‌కు వేద ఫ్యామిలీని ఆహ్వానిస్తారు. ఫంక్ష‌న్ కి అంతా వెళ్లిపోతారు. వేద రెడీ అవుతుంటే య‌ష్, ఖుషీ త్వ‌ర‌గా ర‌మ్మ‌ని చెప్పి వెళ్లిపోతారు. కానీ య‌ష్ బావ కైలాష్ మాత్రం వెళ్ల‌కుండా ఎవ‌రి కంట ప‌డ‌కుండా ఇంట్లోనే వుంటాడు. వేద రెడీ అవుతున్న విష‌యం గ‌మ‌నించి త‌లుపు చాటుగా చూస్తుంటాడు. త‌న‌ని ఎవ‌రో చూస్తున్నార‌ని గ‌మ‌నించిన వేద ఎవ‌రు అని బ‌య‌టికి వ‌చ్చి చూసేస‌రికి కైలాష్ క‌నిపిస్తాడు. ఏంటీ మీరు వెళ్ల‌లేదా అని వేద అడిగితే నువ్వెందుకు వెళ్ల‌లేద‌ని త‌న‌ని త‌దేకంగా చూస్తుంటాడు. ఫంక్ష‌న్ కి ఇంకా టైమ్ వుంద‌ని, కొంత సేపు కూర్చుని మాట్లాడుకుని వెళ్లొచ్చంటాడు. కానీ వేద మాత్రం వెళ్లాల్సిందే.. ఇప్ప‌టికే ఆల‌స్యం అయింద‌ని, ఇంకా లేట్ చేస్తే త‌న భ‌ర్త య‌ష్ సీరియ‌స్ అవుతాడ‌ని చెప్పి వెళ్ల‌బోతోంది. ఇంత‌లో వేద‌ని ఎలాగైనా ఫంక్ష‌న్ కి వెళ్ల‌కుండా చేయాల‌ని చాకుతో త‌న లెఫ్ట్ హ్యాండ్ కు గాయం చేసుకుంటాడు. గాయం చూసి షాకైన వేద త‌న‌కు క‌ట్టుకడుతూ వుంటుంది. ఛాన్స్ దొరికింద‌ని వేద‌ని త‌డుముతూ వుంటాడు. వెంట‌నే గ‌మ‌నించిన వేద ప‌క్క‌కి త‌ప్పుకుంటుంది. ఇంత‌లో య‌ష్ అక్క అక్క‌డికి వ‌స్తుంది. వేద‌ని పిలుస్తున్నార‌ని చెప్పి కైలాష్ ని తీసుకుని వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే .. య‌ష్ ఆఫీస్ కు వెళుతూ ఖుషీని స్కూల్ కి తీసుకెళ్లే హ‌డావిడిలో వుంటాడు. ఇదే స‌మ‌యంలో వేద క‌ళ్లు తిరిగి ప‌డిపోతుంది. త‌న‌ని ప‌రీక్షించిన డాక్ట‌ర్ త‌ను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. కానీ వేద అది నిజం కాద‌ని డాక్ట‌ర్ తో వాదిస్తుంది. క‌ల‌సి కాపుర‌మే చేయ‌లేదు.. ప్రెగ్నెంట్ ఎలా అని య‌ష్ మ‌న‌సులో అనుకుంటాడు. వేద కూడా అదే ఫీలింగ్ తో వుంటుంది. హాస్పిట‌ల్ కు వెళ్లి డాక్ట‌ర్ కు చెబుతుంది. డాక్ట‌ర్ నీలాంటి వాళ్ల‌కు పిల్ల‌లు పుట్టే ఛాన్స్ 10 శాతం వుంద‌ని చెబుతుంది. ఇదే స‌మ‌యంలో అక్క‌డికి మాళ‌విక ఎంట్రీ ఇస్తుంది. వేద‌ని త‌న మాట‌ల‌కు గాయ‌ప‌రుస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

గాయత్రీ దేవి ఆత్మ చెప్పిన అద్దంలో ఏముంది?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`.  మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్  గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి త‌న భ‌ర్త త‌ల్లి మ‌ర్ద‌ర్ మిస్ట‌రీని ఎలా ఛేదించింది?.. స‌వ‌తి త‌ల్లి కుట్ర నుంచి త‌న భ‌ర్తని ఎలా కాపాడుకుంది  అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇందులో అషికా గోపాల్‌, చందూ గౌడ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు న‌టించారు.   త‌న తండ్రి పుండ‌రీ నాథం రాసిన వీలు నామాలో వున్న ర‌హ‌స్యం తెలియాలంటే పున్న‌మినాటి చంద్రుని వెలుగులో నాన్న గీసిన చిత్రాన్ని అద్దంలో పెట్టి చూడాల‌ని న‌య‌నితో గాయ‌త్రీ దేవి ఆత్మ‌ చెబుతుంది.  అయితే ఆ అద్దం తిలొత్త‌మ ఇంట్లో వుండ‌టంతో విశాల్‌, న‌య‌ని కొంత మందిని తీసుకుని ఇన్ క‌మ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అంటూ రైడ్ కి వ‌చ్చామంటూ తిలోత్త‌మ ఇంట్లో హ‌డావిడి చేస్తారు. ఇల్లంతా జ‌ల్లెడ ప‌డ‌తారు. చివ‌రికి హాసిని స‌హాయంతో పెద్ద అద్దం వెన‌కాల గాయ‌త్రీ దేవి చెప్పిన‌ చిన్న అద్దం ల‌భిస్తుంది. ఇదే స‌మ‌యంలో వ‌ల్ల‌భ‌, క‌సి అక్క‌డికి వస్తారు. వారిని డైవ‌ర్ట్ చేసి విశాల్‌, న‌య‌ని.. గాయ‌త్రిదేవి చెప్పిన అద్దాన్ని చాక‌చ‌క్యంగా ఇంటికి తెచ్చుకుంటారు. ఇదే స‌మ‌యంలో గాయ‌త్రీ దేవి ఆత్మ మ‌ళ్లీ వ‌స్తుంది.. స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంద‌ని నేను చెప్పింది చేయ‌మ‌ని చెబుఏతుంది. దీంతో పౌర్ణ‌మి రోజు ఉద‌యాన్నే పూజ తో కార్య‌క్ర‌మం మొద‌లు పెడుతుంది న‌య‌ని. ఇదిలా వుంటే ఇన్ క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్స్ రైడ్ పేరుతో మారు వేశాల్లో వ‌చ్చింది విశాల్‌, న‌య‌ని అని క‌సి అనుమానం వ్య‌క్తం చేస్తుంది. అనుమానం కాద‌ని అదే నిజ‌మ‌ని చెప్ప‌డంతో తిలోత్త‌మ షాక్ కు గుర‌వుతుంది. ఇంత‌కీ వాళ్లు ప‌ట్టుకెళ్లిన అద్దంలో ఏముంద‌ని వ‌ల్ల‌భ అంటాడు. దీంతో తిలోత్త‌మ‌కు చిర్రెత్తుకొచ్చి వ‌ల్ల‌భ‌ని చీవాట్లు పెడుతుంది. అంతా క‌లిసి న‌య‌ని ఏం చేయ‌బోతోందో తెలుసుకోవాల‌ని వాళ్లు వుంటున్న కాల‌నీకి బ‌య‌లు దేర‌తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

తగ్గేదేలే.. 'అన్ స్టాపబుల్' సీజన్-2 అప్డేట్ వచ్చేసింది

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' పేరుతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ టాక్ షోతో మొదటిసారి హోస్ట్ గా మారిన బాలయ్య.. తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జీతో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాలయ్యను అభిమానించని వాళ్ళు కూడా ఈ షోతో ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అంతలా ఈ షోతో మెప్పించారు బాలయ్య. దీంతో 'అన్ స్టాపబుల్' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సీజన్-2 కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. 'అన్ స్టాపబుల్' సీజన్-2 త్వరలోనే రాబోతోంది అంటూ తాజాగా ఆహా సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈసారి భారీగా, మరింత క్రేజీగా రాబోతున్నట్లు చెప్పింది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకున్న మీ ఫేవరెట్ షో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' రెండో సీజన్ త్వరలోనే రాబోతుందని తెలిపింది. ఈ ట్వీట్ కి తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో స్పెషల్ ఎపిసోడ్ లో 'అన్ స్టాపబుల్' గురించి బాలయ్య మాట్లాడిన వీడియో క్లిప్ ని జత చేసింది. ఆ వీడియోలో "అన్ స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడు?" అని  శ్రీరామ చంద్ర అడగగా.. "మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే" అంటూ బాలయ్య తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

తులసి అంకితను ఇంట్లోకి రానిస్తుందా ?

పెట్టె సర్దేసుకుని అంకిత తులసి ఇంటికి వచ్చేస్తుంది. దీంతో పరంధామయ్య, దివ్య, అనసూయ ఆశ్చర్యపోతారు. వంట గదిలో ఉన్న తులసి కూడా అంకితను చూసి నివ్వెరపోతుంది. ఇలా పెట్టెతో ఎందుకు వచ్చిందో అర్థంకాదు. మీరు ఇంటికి రావద్దన్నారు ఆంటీ కానీ తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అంటుంది అంకిత. దయచేసి మీ మనసు మార్చుకోండి అంటూ ప్రాధేయపడుతుంది అంకిత. మీరు తీసుకున్న నిర్ణయానికి శిక్ష నన్ను అనుభవించమంటారా ఆంటీ అంటుంది అంకిత. అసలేం జరిగింది ..ఒక్కదానివే వచ్చావేంటి ? అని అడుగుతాడు పరంధామయ్య. ఆ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు..నన్ను మనిషిలా కూడా చూడడం లేదు అంటూ బాధపడుతుంది అంకిత. ఆస్తి నా పేరు మీద రాసినా నాకు స్వేచ్ఛ లేదు వాళ్లకు నచ్చినట్టు ఆడాల్సి వస్తోంది. ఇప్పుడు మీ కొడుకు కూడా వాళ్ళ వైపే చేరిపోయాడు.   ఇంకా అక్కడ నేనెందుకు ఉండాలి. అందుకే నా దారి నేను చూసుకున్నా. మీ ఇంటికి వచ్చేసా అంటుంది అంకిత. భర్తను వదిలేసి వచ్చావు నువ్వు అంటుంది తులసి. నేను అభిని వదిలేసి రాలేదు. తాను నాతో రావడానికి సిద్ధంగా లేడు. అభికి బాగా స్వార్ధం పెరిగిపోయింది. ఆడదానికి ఒక రూలు, మగాడికో రూలా అని ప్రశ్నిస్తుంది. మరో వైపు ఇంటి అద్దె ఇంకా ఇవ్వలేదేమిటి అంటూ నందుని ప్రశ్నిస్తాడు ఇంటి ఓనర్. రెండు రోజుల్లో ఇస్తానంటాడు. ఇలా ఇంకోసారి లేట్ ఐతే ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు అంకిత.. నువ్వు ఆ ఇంటి నుంచి ఇలా వచ్చేయడం వల్ల సమస్య తీరకపోగా, ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయంటుంది తులసి. అప్పుడు పరంధామయ్య అడిగిన ప్రశ్నకు తులసి ఏమని సమాధానం ఇస్తుంది అనే విషయం ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో తెలుసుకోవచ్చు.

త్వరలో డాన్స్ ఇండియా డాన్స్ ఆడిషన్స్ షురూ

జీ తెలుగు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తూనే ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళ కోసం వేదికను కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే  హిందీలో పాపులర్ ఐన డాన్స్ ఇండియా డాన్స్ షో ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ షో ఇప్పటికే చాలా భాషల్లో ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది కూడా. ఇప్పుడు ఈ జీ వేదిక ద్వారా న్యూ టాలెంట్ హంట్ కి సిద్దమయ్యింది తెలుగు డాన్స్ ఇండియా డాన్స్. దీనికి గాను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్ ఉండి వేదిక లేక ఇబ్బంది పడుతున్న అద్భుతమైన డాన్సర్స్  కోసం ఆడిషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమయ్యింది.   డాన్స్ మీద ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ఆరేళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ఈ ఆడిషన్స్ కి రావొచ్చు . జూన్ 23 న వరంగల్, ఖమ్మం జూన్ 24 న కర్నూల్, విజయవాడ, జూన్ 26 తిరుపతి, వైజాగ్ లో జరిగే ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. డాన్స్ అంటే ఇంటరెస్ట్ ఉండి రాలేని వాళ్ళు డిజిటల్ ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది. దీని కోసం ఆసక్తి ఉన్నవాళ్లు వాళ్ళ డాన్స్ వీడియోని షూట్ చేసి 9154984009 నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చని చెప్పింది. లేదంటే did.zeetelugu@gmail.com కి మెయిల్ చేయాలి. ఇంకా "didtelugu.zee5.com సైట్ లో లాగ్ ఇన్ అయ్యి దీని ద్వారా మీ వీడియోలను పంపొచ్చు.

ఎందుకీ ఆవేశం ..? ట్వీట్ లో మండిపడిన కౌశల్

అగ్నిపథ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఎటు చూసినా ఇదే అంశం పై చర్చోపచర్చలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు. ఐతే ఈ అగ్నిపథ్ స్కీంకి సంబంధించి ప్రజల్లో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు ఈ స్కీం ని విమర్శిస్తుంటే మరి కొందరు యూత్ కి ఈ స్కీం చాలా ఉపయోగం అంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఒక ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ ఇష్యూ మీద బిగ్ బాస్ ఫేమ్, యాక్టర్ ఐన కౌశల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.   ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ అగ్నిపథ్ స్కీం అనేది కరెక్ట్ కాదంటూ నిరుద్యోగులు అల్లర్లకు దిగుతున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆర్మీలో చేరితే నాలుగేళ్ల గడువుతో నియామకాలు చేపట్టడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంత ఉన్మాదం పనికిరాదంటూ కౌశల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. నిరసనల పేరు చెప్పి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం  చేయడం మూర్ఖత్వం అని అన్నాడు.  సికింద్రాబాద్ లో తగలపెట్టిన ఒక్కో  రైలు ఖరీదు 200 కోట్లు. జరిగిన నష్టం సుమారుగా 600 కోట్లు దీనివల్ల రాజకీయ నాయకులు ఏమీ నష్టపోరు.. ప్రజల నెత్తినే పన్నుల రూపంలో భారం వేస్తారు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  

`ప‌టాస్` కోసం ఫైమా అంత ప‌ని చేయాల‌నుకుందా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా నివ్వ‌స్తున్ంన కామెడీ షోస్ జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షోల్లో టీమ్ లీడ‌ర్ చేసే స్కిట్ లు పండించే హాస్యం అంతా ఇంతా కాదు. అయితే ఇందులో స‌హ‌జంగా త‌న‌దైన పంధాలో ఆక‌ట్టుకుంటూ న‌వ్వులు పూయిస్తోంది ఫైమా. తెలంగాణ యాస‌లో ఫైమా వేసే పంచ్ లు.. చేసే హంగామా హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటోంది. బుల్లెట్ భాస్క‌ర్ టీమ్ లో గ‌త కొంత కాలంగా టీమ్ మెంబ‌ర్ గా కంటిన్యూ అవుతూ వ‌స్తోంది. `ప‌టాస్‌` షోతో బుల్లితెర‌కు ప‌రిచ‌య‌మైన ఫైమా ఈ షో కు వెళ్లడానికి అంగీక‌రించ‌కుంటే ఆత్మ హ‌త్య చేసుకుంటాన‌ని ఇంట్లో వాళ్ల‌ని బెద‌రించిందట‌. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల్లో రాణిస్తున్న ఫైమా తాజాగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. `నేను కాలేజీలో చ‌దువుకునే రోజుల్లో `ప‌టాస్` షో వ‌చ్చేది. అయితే మా ఇంట్లో టీవి కూడా వుండేది కాదు. మేం చాలా పూర్‌. మా సార్ న‌న్ను కాలేజీ ట్రిప్ అని చెప్పి ... ప‌టాస్ షో కు తీసుకెళ్లారు. అలా నేను టీవి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చా. నేను మాట్లాడిన విధానం.. తెలంగాణ యాస డైరెక్ట‌ర్ల‌కు న‌చ్చింది. ఆఫ‌ర్లు ఇచ్చారు. అయితే నేను త‌రువాత చెప్లా అని వ‌చ్చేశా. మా ఇంటికి వ‌చ్చి చెబుఇతే మా వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో నేను చ‌చ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తే ఒప్పుకున్నారు. ఒక‌ప్పుడు మా ఊరికి ఎవ‌రైర‌నా వ‌స్తే నేను ఫొటోలు దిగేందుకు ప‌రుగెత్తేదాన్ని. కానీ ఎప్పుడు నేను ఊరికి వెళితే.. నాతో ఫొటో దిగేందుకు చాలా మంది వ‌స్తున్నారు. చాలా హ్యాపీగా వుంది. మా ఊర్లో మా నాన్న పేరు పోయి... నా పేరు వ‌చ్చేసింది. భాస్క‌ర్ అన్న‌నే నాకు అన్నీ. గురువులా నేర్పిస్తాడు. తండ్రిలా ఎంతో ఓపిగ్గా చెబుతాడు. డ‌ల్ గా వుంటే ఏంట్రా బంగారు త‌ల్లి అంటూ న‌వ్విస్తాడు. ఇక్క‌డ అంద‌రం ఒక‌రిని ఒక‌రం ప్రోత్స‌హించుకుంటాం. `ప‌టాస్‌` క్లోజ్ అయిన త‌రువాత జీవ‌న్ అన్న టీమ్ లో చేశా. అక్క‌డ పెద్ద‌గా పేరు రాలేదు. భాస్క‌ర్ అన్న టీమ్ లో జాయిన్ అయ్యా.. ఆ త‌రువాతే లైఫ్ మారింది. ఇంట్లో మాట్లాడే విధంగానే స్కిట్ లో మాట్లాడాల‌ని భాస్క‌ర్ అన్న చెప్పాడు. అలాగే చేస్తున్నా. సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ లోనే చేస్తాన‌ని, సినిమా ఆఫ‌ర్ల‌ని అంగీక‌రించ‌డం లేదు` అని తెలిపింది.  

జబర్దస్త్ జడ్జి సీట్ ఎప్పటికైనా రోజాదే!

'జబర్దస్త్' ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇటు వినోదం పంచుతూనే కమెడియన్స్ గా కూడా ఈ స్కిట్స్ లో పెర్ఫామ్ చేసే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారంలో ఒక్కరోజైనా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి మల్లెమాల చేసిన ప్రయోగం మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, సన్నీ, ముక్కు అవినాష్, రాఘవ, చంటి, గెటప్ శీను.. ఇలా ఒక్కరిని కాదు ఎంతో మందికి మంచి లైఫ్ ని అందించింది ఈ జబర్దస్త్ షో.  ఇక జడ్జెస్ విషయానికి వస్తే నాగబాబు, రోజా, అనసూయ, ఇంద్రజ.. ఇలా వీళ్ళందరూ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇటీవల కొన్ని నెలల నుంచి  ఈ జబర్దస్త్ లో వస్తున్న మార్పుల్ని  గమనిస్తూనే  ఉన్నాం. ఐనా అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ ప్రతీ వారం కూడా టంచనుగా మన ముందుకు వచ్చి నవ్విస్తూనే ఉంది. ఫైర్ బ్రాండ్ రోజా ఒక వైపు జడ్జిగా, మరో వైపు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ బాలన్స్ చేసుకుంటూ వచ్చారు.  ఐతే ఆమెకు మంత్రి పదవి వచ్చేసరికి ఈ షో జడ్జి స్థానం నుంచి తప్పుకున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఇంద్రజ వచ్చారు. ఐతే ఈ షోలో ఇంద్రజకి సంబంధించి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది ఏంటంటే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఇంద్రజ ఆ దేవుడిని కోరుకున్నారనే విషయం జబర్దస్త్ స్టేజి మీద బయటపెట్టాడు ఆటో రాంప్రసాద్. ఇంద్రజ కూడా తానూ అలాగే కోరుకున్నానని మనసులో మాట చెప్పేసారు. 'ఒకవేళ రోజా మళ్ళీ జడ్జిగా వస్తే ఈ సీట్ నుంచి నేను లేచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ జబర్దస్త్ స్టేజిపై తొమ్మిదేళ్ల పాటు  రోజా ఒక ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడంటే మంత్రి పదవి వచ్చిందని అటు వెళ్లారు. ఎప్పటికైనా ఈ జబర్దస్త్ జడ్జి సీటు ఆమెదే. ఏ వేదిక మీదైనా ఇదే విషయాన్ని చెప్తాను' అంటూ ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

చిత్రని ఇమిటేట్ చేసిన సుధీర్

జబర్దస్త్ షోతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఎన్నో షోస్ కి   హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్. సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్ అనే మ్యానరిజమ్ డైలాగ్ తో ఆడియన్స్ కి బాగా పరిచయమే. ఇక సుధీర్ రోజు రోజుకు తనలో ఉన్న టాలెంట్ కి పదును పెట్టుకుంటూ వచ్చాడు . ఇప్పుడు అతను ఒక మల్టీ  టాలెంటెడ్ హోస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. పాటలు పాడతాడు, డాన్స్ చేస్తాడు, కామెడీ పండిస్తాడు, ఓవర్ యాక్షన్ చేయకుండా అందరితో సరదాగా కలిసిపోతాడు..ఇలా ఎన్నో క్వాలిటీస్ వలన ప్రేక్షకుల నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. స్మాల్ స్క్రీన్ పై ఒక బ్రాండ్ లా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. అతను హోస్ట్ గా చేస్తే ఆ ప్రోగ్రాం టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిపోతుందని రేంజ్ లో ఆలోచిస్తున్నారు షోస్ మేకర్స్. అందుకే చాలా షోస్ కి అతన్నే పిలుస్తున్నారు కూడా. బిగ్ స్క్రీన్ మీద ట్రై చేసాడు కానీ అంత వర్కౌట్ కాలేదు. బుల్లి తెర మీద మాత్రం అతనికి, అతని పేరుకి కూడా చాలా డిమాండ్ ఉంది. సుధీర్ ఏ పని చేసినా అందులో ఫీల్ అవుతూ ఇన్వాల్వ్ అవుతూ చేస్తాడు కాబట్టి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు. ఈ విషయం ఆల్రెడీ సుధీర్, రష్మీ డాన్స్ షోస్ లో తెలిసింది. ఐతే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చిత్ర గారిని ఇమిటేట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్  సింగింగ్ షోకి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.  కో-హోస్ట్ గా అనసూయ కూడా ఉంది. జడ్జెస్ గా మనో, చిత్ర ఉన్నారు. ఇక ఈ షోలో సుధీర్ ఒక సాహసం చేసి అందరినీ మెప్పించాడు. చిత్ర ఒక కంటెస్టెంట్ తో కలిసి ఒక సాంగ్ పాడారు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా " చిత్ర ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్ అని చెప్పొచ్చు. కంటెస్టెంట్ పాడుతున్న ఈ పాటను మధ్యలో చిత్ర వచ్చి పాడారు. ఇక అప్పుడే బుల్లితెర స్టార్ కూడా వచ్చి చిత్రలా పాడటానికి ట్రై చేసాడు. కొన్ని లైన్స్ కూడా పాడాడు. అలా  చిత్ర, సుధీర్ కలిసి ఈ పాట పాడి అందరినీ మెప్పించారు. సుధీర్ కి ఈ పాట పాడినందుకు  మంచి ప్రశంసలు కూడా దక్కాయి.

ర‌క్తంతో నిరుప‌మ్ బొమ్మ గీసిన జ్వాల‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్నేళ్లుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సోమ‌వారం జూన్ 20 ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోంది? అనేది ఒక సారి చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో జ్వాల నీతో నేను తేల్చుకోవాలి అని నిరుప‌మ్ పిలిస్తే లేదు నేను వ‌స్తాను అని హిమ అడ్డ‌ప‌డుతుంది. దీంతో తింగ‌రి ఏంటిది నేను డాక్ట‌ర్ సాబ్ తో మాట్లాడాలి. ఇన్నాళ్లు చెప్ప‌కుండా ఆపావు.. ఇప్పుడు ఏంటీ ఇలా మ‌ధ్య‌లోకి వ‌స్తున్నావు.. అంటూ సీరియ‌స్ అవుతుంది జ్వాల‌. క‌ట్ చేస్తే.. హిమ ఏం ఆలోచిస్తోందో అని సౌంద‌ర్య ఫీల‌వుతూ వుంటుంది. అదే స‌మ‌యంలో శోభ ఎంట్రీ ఇస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి మేడ‌మ్ అంటుంది. మీ మ‌న‌వ‌రాలు ఎక్క‌డ వుందో నాకు తెలుసు అని సౌంద‌ర్య‌కు షాకిస్తుంది. ఎవ‌రికి క‌నిపించ‌ని మ‌న‌వరాలు నాకు క‌నిపించింద‌ని అంటుంది. ఈ విష‌యాన్ని హిమ చాటుగా వింటూ వుంటుంది. శోభ మాట‌ల‌కు త‌నే శౌర్య‌నా అని సౌంద‌ర్య ఆలోచ‌న‌లో ప‌డుతుంది. ఈలోగా నిరుప‌మ్ తో నా పెళ్లి చేయండి. పెళ్లి జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే మీ మ‌న‌వ‌రాలు శౌర్య మీ ముందుంటుంది అని చెబుతుంది. ఇదంతా గ‌మ‌నిస్తున్న హిమ `శౌర్య ని అడ్డు పెట్టుకుని శోభ అమ్మ‌మ్మ‌ని బ్లాక్ మెయిల్ చేస్తోంద‌ని గ్ర‌హిస్తుంది. త‌ను చేస్తున్న దానికి ఆగ్ర‌హంతో ఊగిపోతుంది. క‌ట్ చేస్తే... నిరుప‌మ్ .. శౌర్య‌ను అనాథాశ్ర‌మానికి తీసుకొస్తాడు. నేను నీతో మాట్లాడాలి అంటే ఒక్క క్ష‌ణం అంటాడు. కానీ శౌర్య విన‌కుండా ప్ర‌పోజ్ చేయ‌డం కోసం వెళుతుంది. త‌న ర‌క్తంతో నిరుప‌మ్ బొమ్మ‌ను వేసి తీసుకువ‌స్తుంది. అది చూసి నిరుప‌మ్ షాక్ అవుతాడు. మీరు నో అంటే నా గుండె ప‌గిలిపోతుంది అని చెబితే నిరుప‌మ్ సైలెంట్ అయిపోతాడు. ఆ త‌రువాత జ‌రిగిన దంతా హిమ‌కు చెబుతుంది జ్వాల‌. ఆ త‌రువాత హిమ‌, నిరుప‌మ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

ఢీ షోకు ప్ర‌దీప్ గుడ్ బై.. ఏం జ‌రిగింది?

వెండితెర‌పై గ్రాఫిక్స్ చిత్రాల‌కు శ్రీ‌కారం చుట్టిన శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి ఆగ్ర‌హం, అమ్మోరు, అంజి, అరుంధ‌తి వంటి చిత్రాల‌ని నిర్మించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్నారు. అయితే `అంజి` నిర్మాణం చాలా ఏళ్లు జ‌ర‌గ‌డం.. రిలీజ్ కు టైమ్ ప‌ట్ట‌డం వంటి కార‌ణాల‌తో ఈ మూవీ వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. దీంతో సినిమా నిర్మాణం ప‌క్క‌న పెట్టి మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో బుల్లితెర‌పై టీవీ షోలు చేయ‌డం మొద‌లు పెట్టారు. `మ‌న‌సు మ‌మ‌త` సీరియ‌ల్ తో వీర జ‌ర్నీ మొద‌లైంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, ఢీ షోల‌తో పాపుల‌ర్ అయ్యారు. చాలా మంది క‌మెడియ‌న్ ల‌ని, యాంక‌ర్ ల‌ని వెలుగులోకి తీసుకొచ్చారు. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, ఢీ షోల‌తో సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ పాపులారిటీని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌తో ఎంతో మంది క‌మెడియ‌న్ లు వెలుగులోకి వచ్చారు. అయితే మ‌ల్లెమాల ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఈ షోలు గ‌త ఏడాది కాలంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ షోకు ఆయువు ప‌ట్టుగా నిలిచిన టీమ్ లీడ‌ర్స్  ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వెళుతూ షాకులిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షో నుంచి చాలా మంది టీమ్ లీడ‌ర్లు బ‌య‌టికి వెళ్లిపోయారు. కొన్ని నెల‌ల క్రితం గెట‌ప్ శ్రీ‌ను,  సుడిగాలి సుధీర్ కూడా వెళ్లి పోయారు. సుడిగాలి సుధీర్ `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ`కి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించేవాడు. ఇటీవ‌ల ఈ షో నుంచి కూడా బ‌య‌టికి వ‌చ్చేశాడు. అత‌ని స్థానంలో యాంక‌ర్ ర‌ష్మీని రంగంలోకి దింపారు. ఇక ఢీ షో ని కూడా మ‌ల్లెమాలే ర‌న్ చేస్తోంది. ఈ షో నుంచి కూడా వారికి షాక్ త‌గిలింది. ఈ షో నుంచి తాజాగా యాంక‌ర్ ప్ర‌దీప్ వెళ్లిపోయాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే ఢీ షోకు క‌ళ త‌ప్ప‌డం గ్యారెంటీ అని చెబుతున్నారు. గ‌తంలో మ‌ల్లెమాల నుంచి బ‌య‌టికి వెళ్లిన నాగ‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ త‌రువాత నుంచి చాలా మంది ఈ సంస్థ రూపొందిస్తున్న షోల నుంచి క్ర‌మ క్ర‌మంగా దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు.

నా కూతుర్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది : సునీత

సునీత ఈమె గురుంచి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన సింగర్ మాత్రమే కాదు మంచి అందాల రాశి కూడా. మాట్లాడితే ముత్యాల రాలతాయా అన్నట్టు ఉంటుంది ఈమె మాట. సునీత సాంగ్స్ కి కానీ ఆమె ఆటిట్యూడ్ కి కానీ చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటూ తన విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఈమె తన కూతురితో దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. తన కూతురు శ్రేయ పుట్టినరోజును పురస్కరించుకుని " శ్రేయా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నీది మంచి మనసు. నువ్వు నిలువెత్తు అందానివి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ..నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు " అంటూ  ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సునీత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.  గులాబీ, ఎగిరే పావురమా మూవీస్ లో పాడిన పాటలకు సునీతకు మంచి గుర్తింపు వచ్చింది. పాటలు పాడడమే కాదు. ఈమె డబ్బింగ్ కూడా చెప్తారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోస్ అప్లోడ్ చేస్తూ నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తూ ఉంటారు. సునీత జీవితంలో ఎన్నో కష్టాలనెదుర్కొని తన కాళ్ళ మీద తాను నిలదొక్కుకుంది. ఇక ఇప్పుడు తన భర్త బిజినెస్ కి సహకరిస్తూ, అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో పాటలు పాడుతూ, రియాలిటీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  

జున్నుకి అక్షరాభ్యాసం చేయించిన లాస్య

"మా మ్యూజిక్ "లో గతంలో ప్రసారమైన సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాంతో సూపర్ డూపర్ హిట్. ఈ షో కి యాంకర్స్ గా రవి, లాస్య అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. లాస్య ఎప్పుడూ చీమ,దోమ, ఏనుగు జోక్స్ లో మంచి పాపులర్ కూడా అయ్యింది. ఈ షోని లాస్య ఎప్పుడూ నవ్వుతూ చక్కగా చలాకీగా డాన్స్ చేస్తూ రక్తి కట్టించేది. అప్పట్లో ఈ షోకి యూత్ ఫాన్స్ చాలా మంది ఉండేవారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాకపోయినా కూడా ఆరోజు ఆడియన్స్ ఎందుకు రాలేదు అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసేవాళ్ళు. తర్వాత కొంత కాలానికి రవి, లాస్య మీద సోషల్ మీడియాలో చాలా చెత్త ట్రోల్ అయ్యేసరికి లాస్య యాంకరింగ్ మానేసింది. తర్వాత కొంతకాలానికి  ఎవరి లైఫ్ లో వాళ్ళు సెటిల్ ఇపోయారు. ఇక ఇప్పుడు లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.  ఆయన కూడా లాస్య వచ్చే ప్రతీ షోకి రావడం వలన ఆడియన్స్ కి చిరపరిచితమే. వీళ్లకు జున్ను అనే మూడేళ్ళ బాబు ఉన్నాడు. ఇటీవల తనకు అక్షరాభ్యాసం చేయించారు లాస్య మంజునాథ్. బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదని అక్కడే చేయించాం అంటూ చెప్పుకొచ్చింది లాస్య. గోదావరిలో జున్నుకి స్నానం చేయించి, దీపారాధన చేసింది లాస్య. అక్షరాభ్యాసం చేయించే టైంలో బాగా  ఏడుస్తూనే ఉన్నాడట జున్ను. కానీ చివరికి ఎలాగో ఒకలా ఓం అక్షరాలను  ఏడుస్తూనే అక్షరాభ్యాసం చేసాడని చెప్పింది లాస్య. ఇప్పుడు ఈ వీడియోకి చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు. జున్నుకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, జున్నుకి మంచి పేరెంట్స్ దొరికారని ఇలా...ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.  

ఇది నా ఫస్ట్ ఫాదర్స్ డే అంటున్న అలీ రెజా

అలీ రెజా పేరు వింటే ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. 2019 లో ప్రసారమైన బిగ్ బాస్ 3 ఫేమ్. ఈ షో ద్వారా అలీ రెజా కి మంచి పేరు  వచ్చింది. మధ్యలో ఎలిమినేట్ ఐనా కూడా మళ్ళీ తర్వాత హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. టైటిల్ కోసం గట్టి పోటీ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత  నాగార్జున యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ లో అలీ రెజా మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించి ఇలాంటి పాత్రల్లో కూడా నటించగలడు అని పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కొంత కాలానికి అలీ రెజా ఒక పాపకు తండ్రయ్యాడు. అప్పట్లో పాప ముఖం చూపించకుండా "అందమైన దేవతకు తండ్రినయ్యానంటూ " పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడు ఫాథర్స్ డే ని పురస్కరించుకుని నేను నా కూతురు పుట్టాక జరుపుతున్న ఫస్ట్ ఫాథర్స్ డే అంటూ కూతురిని  ముద్దులాడుతున్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసాడు అలీ. " తండ్రిని ఐనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి... రోజూ నా జీవితంలో ఎన్నో సంతోషాలను తెస్తుంది " అంటూ పోస్ట్ చేశారు.  అలీ రెజా కొన్ని తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఒక పక్కన నటుడిగా, మరో పక్కన మోడల్ గా చేస్తున్నాడు. "గాయకుడు" అనే మూవీతో బిగ్ స్క్రీన్ పై అలీ కనిపించాడు కానీ ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా అభిమానుల్ని బాగా సంపాదించుకున్నాడు. ఇక కూతురితో దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హ్యాపీ ఫాథర్స్ డే అంటూ అలీ కి విషెస్ చెప్తున్నారు నెటిజన్స్..  

తప్పిపోయిన సుమ కొడుకు

ఈటీవీలో కాష్ ప్రోగ్రాం ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోకి సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా అప్పుడే రిలీజ్ ఐన కొత్త సినిమాల టీమ్స్ ని కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి స్టేజి మీద గేమ్స్ ఆడిస్తూ ఉంటారు సుమ . రకరకాల జోక్స్, డ్యాన్సులు అన్ని ఎలిమెంట్స్ ఈ షోలో కనిపిస్తాయి. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి 10th క్లాస్ డైరీస్ టీమ్ వచ్చింది. ఇందులో శ్రీరామ్, భానుశ్రీ, రాము, రామారావు, సురేష్ అంత కనిపిస్తారు. వీళ్ళతో రకరకాల ఆటలు ఆడించింది సుమ. ఇందులో తన కొడుకు తప్పిపోయాడంటూ ఒక ప్రకటన ఇస్తుంది సుమ . చాలామంది సుమ  కొడుకుని అంటూ వస్తూ ఉంటారు. వాళ్ళతో మస్త్ ఎంటర్టైన్ చేసింది సుమ. ఇంతలో రాము వచ్చి నేను నీ కొడుకుని అమ్మ నన్ను గుర్తుపట్టలేదా..లోకల్ గా బస్సు పాస్ లేదంటే పాస్పోర్ట్ ఇచ్చి పంపించావ్ ..విదేశాలకు వెళ్ళొచ్చాను అంటూ చెప్పేసరికి "ఓరిని నువ్వు నా కొడుకువా. అదే నిజమైతే ఇందులో ఏదో ఒకటి తినేయాలి" అంటూ "ఎదురుగా అల్లం, వేపాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర"  చూపిస్తుంది. వేపాకు తిని చాలారోజులయ్యింది అంటూ వాటిని తినేస్తాడు రాము. అబ్బా అచ్చం మేక తింటున్నట్టే ఉందిరా అంటూ సెటైర్ వేస్తుంది సుమ. ఇంతలో రామారావు వచ్చి అమ్మ నేను కొడుకునే అమ్మ గుర్తుపట్టట్లేదా అమ్మా ? అంటూ కృష్ణ గారి స్టైల్ లో అడిగేసరికి నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి తల్లినయ్యానా ?. అంటూ సుమ అడుగుతుంది. తర్వాత శ్రీరామ్ "ఎక్కడున్నావమ్మా" అనే సాంగ్ కి మంచిగా డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించారు. చివరిగా శ్రీరామ్ త్రిషతో కలిసి షూటింగ్ చేసే టైములో సెట్ లో జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ కారణంగా తన లైఫ్ ఎంత రిస్క్ లో పడిందో చెప్పేసరికి అందరికీ కాస్త బాధకలిగింది. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. శ్రీరామ్ సాంగ్ "ఎక్కడున్నావమ్మా " ఆల్ టైం ఫేవరెట్ అంటూ , చాల రోజుల తరువాత శ్రీరామ్ గారు హ్యాపీ ఉండడం చూసాం. మంచి నటుడు, సుమ గారు ఎక్కడున్నా చక్కగా ఎంటర్టైన్ చేస్తారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  

రామాకు ఘనస్వాగతం.. కన్నబాబుకు వార్నింగ్!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `జాన‌కి క‌ల‌గ‌న‌లేదు`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంత‌గా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్రియాంకా జైన్, అమ‌ర్ దీప్ చౌద‌రి జంట‌గా న‌టించారు. ఇత‌ర కీలక పాత్ర‌ల‌లో న‌టి రాశి, అనిల్ అల్లం, విష్ణు ప్రియ‌, నిఖిల్‌, షీలా సింగ్‌, మ‌హ‌తి, సూర్య‌, మ‌ధు కృష్ణ త‌దిత‌రులు న‌టించారు. ఈ సీరియ‌ల్ తో తొలి సారి న‌టి రాశి బుల్లితెర‌పై న‌టించ‌డం మొద‌లు పెట్టింది. దీంతో ఈ సీరియ‌ల్ పై అంద‌రి దృష్టి ప‌డింది. ఇక ఎపిసోడ్ లోకి వెళితే... జాన‌కి చెప్ప‌డంతో రామా వంటల పోటీల్లో పాల్గొంటాడు. అక్క‌డ క‌న్న‌బాబు కార‌ణంగా కొంత మంది చేసిన కుట్ర‌తో వంట‌ల పోటీల్లో పాల్గొనే అవ‌కాశం కోల్పోయే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. ఈ కుట్ర‌లో రామా చెయ్యి కూడా విరుగుతుంది. అయినా స‌రే జాన‌కి స‌పోర్ట్ తో త‌ల్లి జ్ఞానాంబ కోసం పోటీలో పాల్గొంటాడు రామా. చివ‌రికి వంట‌ల పోటీల్లో విజేత‌గా నిలుస్తాడు. ప్రైజ్ మ‌నీనీ సొంతం చేసుకుంటాడు. రామా విజేత‌గా నిల‌వ‌డంతో అత‌నికి ఘ‌న స్వాగ‌తం ఏర్పాటు చేస్తారు. గ‌ర్వంగా తిరిగి వ‌చ్చిన రామాని వెంట బెట్టుకుని జానికి క‌న్న‌బాబు ద‌గ్గ‌రికి వెళుతుంది. ఆయ‌న అవ‌స‌రాన్ని అవ‌కాశంగా తీసుకుని మోసం చేసి ఆయ‌న‌తో సంత‌కం చేసి సంత‌కాలు చేయ‌చించుకున్నావు` అంటూ వార్నింగ్ ఇస్తుంది. గ‌డువులోపు నీ డ‌బ్బులు నీ ముఖాన కొడ‌తాన‌ని చెప్పాను తీసుకో అంటూ క‌న్న‌బాబు ముఖాన డ‌బ్బుల క‌ట్ట కొడ‌తాడు రామా. ఆ వెంట‌నే జాన‌కి  క‌న్న‌బాబు ద‌గ్గ‌ర వున్న డాక్యు మెంట్స్ ని తీసుకుని చించేస్తుంది. దీన్ని క‌న్న‌బాబు అవ‌మానంగా భావిస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

అన‌సూయ‌కు చ‌లాకీ చంటి ఇచ్చిన మూలిక ఏంటి?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా ఈటీవీలో మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ అందిస్తున్న ఈ షో హాస్య ప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తూ టాప్ టీఆర్పీని సొంతం చేసుకుంటోంది. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో విడుద‌లైంది. ఈ నెల 23 గురువారం ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇది. సింగ‌ర్ మ‌నో, ఇంద్ర‌జ న్యాయ నిర్ణేత‌లుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు `చోర్ బ‌జ‌ర్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న హీరో ఆకాష్ పూరి, గెహ‌నా సిస్పీ హాజ‌ర‌య్యారు. చ‌లాకీ చంటి, రాకింగ్ రాఘ‌వ‌, నూక‌రాజు, తాగుబోతు ర‌మేష్‌, కొమురం త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకున్నారు. అన‌సూయ టీచర్ గా అవ‌తారం ఎత్తేసింది. స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టాల‌ని ట్రై చేస్తే అన‌సూయ‌పై పంచ్ లు వేశారు. ఇక ఈ షోలో గెస్ట్ గా పాల్గొన్న ఆకాష్ పూరి `బేబీ జ‌బ్ త‌క్ తూ మేరీ సాత్ హోనా ఇస్‌ దునియాకో మిట్టీమే మిలాదూంగా..అబ్ తూ దేక్ లేగా బ‌చ్చ‌న్ సాబ్ కా ఖేల్‌..` అంటూ చెప్పిన డైలాగ్ కి అంతా విజిల్స్ వేసి గోల చేశారు. అయితే ఇక్క‌డే చ‌లాకీ చంటీ అన‌సూయ‌పై వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలింది. మూలిక‌లు అమ్ముకునే వ్యక్తిగా స్కిట్ చేయ‌డానికి ఎంట్రీ ఇచ్చిన చ‌లాకీ చంటి `నా ద‌గ్గ‌ర అన్నీ మూలిక‌లు వున్నాయ్ చిన్న‌ది వుంది పెద్ద‌ది వుంది అంటుంటే మ‌ధ్య లో మ‌నో అందుకుని అది దొరుకుతుందా? అంటే లాస్ట్ టైమ్ మీకు పెద్ద‌ది ఇచ్చిన అన్నాడు. ఇక నాకు అందం బాగా పెరుగుతోంది.. ఆ అందం త‌గ్గ‌డానికి ఏదైనా మూలిక కావాల‌ని అడిగారొక‌రు.. వెంట‌నే ఒక మూలిక ఇచ్చి అందం పెరుగుతుంద‌న్న భ్ర‌మ త‌గ్గిపోతుంది పో అని చెప్పా అని చ‌లాకీ చంటి అన‌గానే ` ఆ మూలిక అడిగింది అన‌సూయ గారే క‌దా` స‌ర్ అంటూ  నూక‌రాజు ట‌క్కున చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా పెద్ద‌గా న‌వ్వేశారు.