బాలయ్య బాబు ఎపిసోడ్ ఇంకా ఉంటె బాగుండనిపించింది : వాగ్దేవి

తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి తన గానంతోనే కాదు అందంతో కూడా జూనియర్ పూజ హెగ్డే అనే మంచి టైటిల్ ని కూడా బాలయ్య దగ్గర నుంచి చిరంజీవి దగ్గర నుంచి అందుకుంది. ఇలా వాళ్ళు  తనని పూజ హెగ్డే తో పోల్చడం  చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది వాగ్దేవి. బాలయ్య ముందు ఆయన సాంగ్ పాడడం సంతోషంగా ఉంది. ఎందుకేనట ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన జస్ట్  అమేజింగ్ . ఆయన ఉన్నంత సేపు చాలా సందడిగా ఉంటుంది అక్కడి వాతావరణం . ఇంకా ఎక్కువ సేపు ఉంటె బాగుండనిపించింది..ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా విషయాన్నీయాంకర్ అడిగేసరికి అలాంటిది ఏమీ ఉండదు. బాలయ్య బాబు ఏది ఆన్ కెమెరా ఉండాలో డిసైడ్ చేసి చెప్తారు. అదే ప్రసారమవుతుంది అంది వాగ్దేవి. ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్లెవరకూ కూడా అక్కడవుండే అందరిని మంచిగా  ఎంటర్టైన్ చేస్తారు. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు ఉంటాయి. ఆయన మంచి పాజిటివ్ ఎనెర్జీని ఇస్తారు అందరికీ.  ఇండియన్ ఐడల్ స్టేజి మీద ఆయన వచ్చి మాతో కలిసి నాలుగు స్టెప్పులు వేసేసరికి  మాలో అప్పటివరకు ఉన్న టెన్షన్స్ అన్ని ఎగిరిపోయాయి. ఇండియన్ ఐడల్ స్టార్ట్ ఐన దగ్గరనుంచి ఒక్కో స్టెప్ క్రాస్ చేస్తూ వచ్చి విన్ అవ్వాలి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది చాలా  టఫ్ కాంపిటీషన్ అని కానీ ధైర్యంగా ముందుకు వెళ్లాను. తెలుగు ఇండియన్ ఐడల్ విన్ అయ్యాను వాటితో పాటు జూనియర్ పూజాహెగ్డే, వావ్ దేవి అనే టైటిల్స్ కూడా అందుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది వాగ్దేవి. వాగ్దేవి ఇండియన్ ఐడల్ స్టేజి మీద బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో నందమూరి నాయకుడినే పొదుపు కథ పొడిచిన ఎపిసోడ్ సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యింది..

హాసినికి న‌య‌ని చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌ర‌మున్న ఓ యువ‌తి క‌థ‌గా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో.. ట్విస్ట్ ల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు న‌టించారు.   గాయ‌త్రీ దేవి ఆత్మ చెప్పిన ప్ర‌కారం పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక పూజాకు ఏర్పాట్లు చేస్తారు న‌య‌ని, విశాల్‌. ఇందు కోసం ఓ కాలీ స్థ‌లంలో నాగ‌లిని తెప్పించి ఏరు వాక కోసం అలంక‌రించిన‌ట్టుగా అందంగా అలంక‌రిస్తారు.. పూజ కోసం ఏర్పాటు జ‌రుగుతుంటే అక్క‌డ న‌య‌ని బ్లాక్ మ్యాజిక్ చేస్తుందో . ఇంకేదైనా చేస్తుందో తెలుసుకోవాల‌ని తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ‌, క‌సి వెళ్లాల‌నుకుంటారు. వారితో క‌లిసి హాసిని, దురంధ‌ర కూడా వ‌స్తారు. గో మూత్రంతో శుద్ది చేసిన న‌య‌ని అది తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ‌, క‌సి, దురంధ‌ర ల‌పై ప‌డేలా చేస్తుంది. దీంతో ఏంటిది ఇలా స్మెస్ వ‌స్తోంది ఏంటీ? అని చీద‌రించుకుంటారు. అది గోమూత్రం అని హాసిన చెప్ప‌డంతో మ‌రింతగా ఫీల‌వుతారు. క‌ట్ చేస్తే.. పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో వున్న స్థ‌లాన్ని విశాల్, న‌య‌ని దున్నేస్తారు. ఆ త‌రువాత పూజ‌కు హాజ‌రైన వారికి ప్రసాదం ఇస్తూ వుంటుంది న‌య‌ని. ఈ క్ర‌మంలో తోడికోడ‌లు హాసినికి ఓ సిమ్ కార్డ్ ఇస్తుంది.. దీంతో ఇదేంటి చెల్లి అంటుంది హాసిని.. చెవిలో చెబుతాను ద‌గ్గ‌రికి రా అక్కా అంటూ న‌య‌ని.. ఓ ర‌హ‌స్యం చెబుతుంది. తిలోత్త‌మ అత్త‌య్య ఆట క‌ట్టించొచ్చు అంటుంది.. ఇంత‌కీ హాసినికి న‌య‌ని చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ? .. దాంతో తిలోత్త‌మ ఆట క‌ట్టించ‌బోతున్నారా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ముక్కు కోసి పప్పులో పెడతా

తొలివలపు నుంచి పక్కా కమర్షియల్ వరకు గోపీచంద్ హ్యాపీ జర్నీని ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా టాలీవుడ్ లో తనకో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్. హిట్స్ కాదు, ఫ్లాప్స్ కాదు దేన్నీ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోకుండా తన ఓన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా షోకి హాజరయ్యారు గోపీచంద్..ఇక ఈ షోలో తన చిన్ననాటి విషయాలను చాలా పంచుకున్నారు. "ముక్కు కోసి పప్పులో పెడతా" ఏమిటి ఈ డైలాగ్ అని ఆలీ అడుగుతారు. ఒకసారి ఆరోజుల్ని గుర్తుచేసుకుని చెప్తాడు గోపీచంద్. చిన్నప్పుడు ఒక రోజు  పెరుగన్నం తింటూ ఉండగా వాళ్ళ పెద్దన్నయ్య కనబడకుండా బ్లేడ్ తీసుకొచ్చి తల పైకెత్తు ముక్కు కోసి పప్పులో పెడతా అన్నాడట. అలా ఎలా పెడతారని గోపీచంద్ అడిగేసరికి ఠప్పున  ముక్కును కోసేసాడట. ఆగకుండా రక్తం కారిపోయిందని చెప్పుకొచ్చారు గోపీచంద్. ఇక తన ఎనిమిదేళ్ల వయసులోనే వాళ్ళ నాన్న టి.కృష్ణ కాన్సర్ తో చనిపోయేసరికి జీవితం తనకు చిన్న వయసులో ఎంతో నేర్పించిందని ఎమోషన్ అయ్యాడు. టి.కృష్ణ అప్పట్లో ఎన్నో ఉద్రేకభరితమైన సినిమాలు తీశారు. నేటి భారతం, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు ఇలా..తీసినవి కొన్నే ఐనా అప్పట్లో మంచి హిట్స్ కొట్టాయి. టి.కృష్ణ మూవీస్ అన్ని కూడా థాట్ ప్రొవొకింగ్ గా ఉంటాయి. సమాజాన్ని  మరో కోణంలోంచి చూసేలా చేస్తాయి. ఆయన కొడుకే ఈ గోపీచంద్. హీరోగా చేసాడు విలన్ గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జయం మూవీలో మంచి పవర్ ఫుల్ విలన్ రోల్ చేసి అందరితో శెభాష్ అనిపించుకోవడమే కాదు దీనికి గాను  ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు. అలాగే నిజం, వర్షం మూవీస్ లో పవర్ఫుల్ ఎనర్జిటిక్ విలన్ రోల్స్ చేసినందుకు మా టీవీ అవార్డ్స్ కూడా అందుకున్నాడు.

మూగ జీవాలపై జాలి చూపించండి అంటున్న రష్మీ

జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఈమె అటు సినిమాలు, ఇటు టీవీ షోస్ , ఇంకో పక్క న్యూ షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతోంది. ఇవన్నీ ఒక ఎత్తు ఈమె మనసు ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఈమెకి మూగజీవాలంటే చాలా ప్రేమ, ప్రాణం కూడా. ఈమె ఒకవిధంగా పెట్ లవర్. మాటలు రాని మూగ జీవాల్ని ఎవరు  హింసించినా, బలి ఇచ్చినా ఈమె అసలు  ఊరుకోదు. వాటి కోసం ఫైట్ చేస్తుంది. ఎప్పుడు , ఎక్కడ , ఎలాంటి సంఘటన జరిగినా  మూగ జీవాలకు సంబంధించింది వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా ఆమె ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. అందులో ఒక కుక్క ఒక డబ్బాలో మూతి పెట్టేసి దాన్ని లాకోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఐతే అంతలో అక్కడికి యానిమల్ రెస్క్యూ టీమ్ వచ్చింది.  ఆ కుక్కని కాపాడటానికి హెల్ప్ చేస్తూ ఉంది ఆ టీమ్. ఇది ఒక అపార్ట్మెంట్ దగ్గర జరిగేసరికి ఆ అపార్ట్మెంట్ లో నుంచి ఒకాయన వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయొద్దు వెళ్లిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు . ఈ సంఘటనపై రష్మీ చాలా బాధపడి అసహనం వ్యక్తం చేసింది. ఆ కుక్క మూతి డబ్బాలోంచి రాకపోతే  ఏమి తినలేక ఆకలితో చచ్చిపోతుంది. కానీ ఈ అపార్ట్మెంట్ లోని ఒక అంకుల్ మాత్రం యానిమల్ రెస్క్యూ టీంని అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ అరుస్తున్నాడు. మూగ జీవి ఇబ్బందిలో ఉంటె ఆ అంకుల్ అలా అనడం కరెక్టేనా అంటూ ప్రశ్నించింది ? ఏ మూగ జీవికి ఆపద వచ్చినా వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చాక వాళ్ళను పని చేయనివ్వండి. ఇలాంటి అంకుల్ ప్రవర్తించినట్టు ఎవరూ చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించింది రష్మీ గౌతమ్. ఇక నెటిజన్స్ కూడా రష్మీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

న్యూస్ రీడర్ గా నవ్యస్వామి

ప్రతీ వారం ఢీ-14 కొత్త కొత్త డాన్స్ స్టైల్స్ తో దుమ్ము రేపుతోంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ప్రియమణి, ప్రదీప్ , జానీ మాస్టర్, హైపర్ ఆది యాజ్ యూజువల్ గా వచ్చేసారు. ఇక అప్పుడే నిఖిల్ ఒక రష్యా అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చి "అది చెట్టు, ఇది మెట్టు" అంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ ని చూపించి ఆది "ఇతను లఫుట్టూ" అంటూ కామెడీ చేస్తాడు. అమ్మాయిల్ని చూస్తే చాలు వెంటబడతాడు అన్న విషయం అందరికీ తెలిసింది. ఇక్కడ కూడా అదే ఫాలో అయ్యాడు "అనెస్థీషియా నీకో గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇద్దామనుకుంటున్నాను అంటాడు" ఆ రష్యన్ అమ్మాయితో. "ఎవరికీ వద్దు పోరా" అంటూ రష్యన్ స్లాంగ్ తెలుగులో ఆదిని స్వీట్ గా తిడుతుంది. వావ్ అంటూ ప్రదీప్ సహా అందరూ క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తారు. ఇక జతిన్ "కెవ్వు కేక " సాంగ్ కి ఒక అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి స్టేజి మీద ఫైర్ పుట్టించి అందరినీ హీటెక్కించేసాడు. నవ్యస్వామి న్యూస్ రీడర్ అవతారం ఎత్తుతుంది. నిఖిల్ ఆన్ ఫీల్డ్ లోరిపోర్టర్ గా చేస్తాడు. ఆది,రష్యన్ అమ్మాయి ఇద్దరు భార్య భర్తలుగా చేస్తారు. కెమెరామాన్ గా రవికృష్ణ చేస్తాడు. "ఇప్పుడే అందిన తాజా వార్త. నడి రోడ్డు మీద ఒక భర్త , భార్య కొట్టుకుంటున్నారట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ రిపోర్టర్ నిఖిల్ అందిస్తాడు " అంటుంది నవ్య. " సర్ ఇక్కడేం జరిగిందని మా ప్రేక్షకులు" అంటూ నిఖిల్ తెలుగులో చెప్పలేక తడబడేసరికి ఆది అందుకుని "ఈమెను నేనేమీ చేయలేదండి ఈమె నా మీద అరుస్తుంది" అంటాడు. రవికృష్ణ కెమెరాని ఆ అమ్మాయి వైపు పెట్టేసరికి తననేమి చేయొద్దు అన్నట్టుగా రకరకాల రష్యన్ ఎక్సప్రెషన్స్ ఇచ్చి  మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది ఆ రష్యన్ బేబీ . బాబోయ్ ఈమె అపరిచితురాలు అంటూ ఆది భయపడతాడు. తర్వాత చెర్రీ , హేమాంక్ష్ జోడి బ్లాక్ డ్రెస్ లో "రా రా నా వీర " అనే సాంగ్ కి మంచి హాట్ పెర్ఫార్మన్స్ చేసేసరికి ఆది చూపులు తిప్పుకోకుండా తర్వాత ఏం జరుగుద్ది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు.  ఇక ఒక ఫ్రిడ్జ్ లో ఈ జోడి రొమాన్స్ చేసే డాన్స్ బిట్ చేస్తారు. ఫైనల్ గా   సాంగ్ ఐపోయాక "ఆది ఇప్పుడు నాకు అర్ధమయ్యింది ఏమిటి అంటే ఒక పెద్ద ఫ్రిజ్ ని అర్జెంటుగా కొని ఇంట్లో పెట్టుకోవాలి" అంటూ  ఒక కుళ్ళు డైలాగ్ వేస్తాడు జానీ మాస్టర్. "మీరు ఫ్రిజ్ ని ఇంట్లో కాదు వాన్ లో వేసుకుని దేశం మొత్తం తిరిగేస్తారు" అంటూ పంచ్ వేస్తాడు. దయచేసి నాదో రిక్వెస్ట్ "మీ ఫ్రిజ్ లో నాకు కొంచెం చోటివ్వండి"  అంటూ మరో చెత్త కౌంటర్ వేస్తాడు ఆది. ఇంకా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. నెటిజన్స్ మాత్రం కామెంట్స్ తో ఈ షోని తిట్టిపోస్తున్నారు. డాన్స్ కన్నా చెత్త కామెడీ ఎక్కువైంది ..కక్కుర్తి మొహం వేసుకుని చూస్తున్న ఆది అంటూ పిచ్చ తిట్లు తిడుతున్నారు.

లాస్య చేతిలో అడ్డంగా బుక్కైన తులసి!

తులసి సంగీతం పిల్లల కోసం ఎండ పడకుండా ఉండేందుకు ఒక టెంట్ సిద్ధం చేయడానికి రెడీ అవుతుంది. తులసి నిచ్చెనెక్కి టెంట్ వేయబోతుంది. "మమ్మల్ని పిలిస్తే మేము సాయం చేసేవాళ్ళం కదా" అని ఇంట్లో వాళ్ళు తులసితో అంటారు. ఇంతలో తులసి ఇంటికి బ్యాంకు ఏజెంట్స్ వస్తారు. "మ్యూజిక్ స్కూల్ పెట్టుకోవాలనుకుంటున్నాం" అని వాళ్ళతో చెప్తుంది తులసి. దీని కోసం ఎంత లోన్ వస్తుంది అని అడిగేసరికి "ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంటారు. మాకు ఆదాయం ఏమీ లేదు కదా ఎలా ఇస్తారంటాడు పరంధామయ్య. ఇంతలో తులసి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. అన్ని డాకుమెంట్స్ చెక్ చేసి మళ్ళీ వస్తాం అని చెప్పి బ్యాంకు ఏజెంట్స్ వెళ్ళిపోతారు. 20 లక్షల లోన్ రాగానే అందులోంచి ఫైవ్ లాక్స్ ప్రేమ్ కి ఇవ్వాలి  అని అనుకుంటుంది తులసి. ఇంకో వైపు ప్రేమ్ చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు. శృతిని పిలుస్తాడు కానీ మంచి నీళ్లు తేవడానికి వెళ్లి బిందె పట్టుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అది చూసి ప్రేమ్ బిందెని పట్టుకుని ఇంట్లో పెడతాడు.  ఐతే తనకు తక్కువ ఖరీదులో మంచి వాద్య పరికరాలు ఇస్తానని చెప్పాడని చెప్తాడు. కాబట్టి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి డబ్బులు ఏమన్నా అరేంజ్ అయ్యేలా మాట్లాడు అంటూ ఫోన్ ఇస్తాడు ప్రేమ్. శృతికి ఏం చేయాలో తెలియక తులసికి ఫోన్ చేసి వందన అనే పేరుతో మాట్లాడుతుంది. "నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ప్రేమ్ ఆల్బంకి నేను మనీ అరేంజ్ చేస్తాను" అంటుంది తుల‌సి. "బ్యాంకు లోన్ కి అప్లై చేశా, రాగానే ఇస్తాను" అని చెప్పేసరికి శృతికి ఏం మాట్లాడాలో అర్థంకాదు.  మరో వైపు "అంకిత విషయం ఏం చేద్దాం?" అంటూ గాయత్రి  అభిని అడుగుతుంది. "మీ మాటే వినట్లేదు నా మాట ఏం వింటుంది?" అంటాడు అభి. తులసి దగ్గర డాకుమెంట్స్ తీసుకున్న బ్యాంకు ఏజెంట్ భాస్కర్.. లాస్య చెప్పినట్టే ఫేక్ డాకుమెంట్స్ క్రియేట్ చేస్తాడు. కానీ చివరికి అవి ఫేక్ అని అంకిత ద్వారా తెలుసుకుని తులసి ఏం చేస్తుంది అనే విషయాలను ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

'పెళ్ళాం చెబితే వినాలి' అంటున్న హైపర్ ఆది

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సుధీర్ లేని లోటు కనిపిస్తున్నా కూడా దాన్ని మాక్సిమం భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది రష్మీ. ఇక 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి సంబంధించి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "పెళ్ళాం చెబితే వినాలి" అనేది ఈ వారం కాన్సెప్ట్. 'ఏమిటి ఇలా ఉన్నారంతా?' అని రష్మీ.. హైపర్ ఆదిని అడుగుతుంది. "మేమంతా భార్యా బాధితులం. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక మీకు చెప్పుకుందామని ఈ షోకి వచ్చాం" అని చెప్తాడు. భార్యలంతా ఒక వైపు, భర్తలంతా ఒక వైపు ఉంటారు. ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ రసవత్తరంగా జరిగేలా ఫ్రేమ్ చేశారు.  ఇంతలో శ్రీవాణి ఆపోజిట్ టీమ్ లో ఉన్న భర్త విక్రమ్ ని బెదిరిస్తుంది. "మర్యాదగా ఈ వైపుకి వచ్చేయండి, లేదంటే 60 కేజీల ఆటంబాంబ్ ఇక్కడ" అని అంటుంది. "60 కేజీలు కాదు 120 కేజీలు" అంటూ పంచ్ వేస్తాడు విక్రమ్. "మీ ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా ఆవిడ పెరిగిపోతోంది" అంటూ ఇంకో కమెడియన్ జోక్ వేసేసరికి అందరు నవ్వేస్తారు. తర్వాత "నీ కోసం నీ కోసం జీవించా చిలక " అనే సాంగ్ ని శాంతికుమార్, సుమబిందు చక్కగా పాడి ఎంటర్టైన్ చేశారు. "ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి కౌశల్, ఆయన వైఫ్ ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ పెర్ఫామ్ చేసి స్టేజిని మంచి ఎనర్జిటిక్ గా మార్చేస్తారు. తర్వాత శ్రీవాణికి, విక్రమ్ కి మధ్య ఒక తాడు ఇచ్చి టగ్ ఆఫ్ వార్ పోటీ పెడతారు. శ్రీవాణి తెలివిగా తాడు లాగుతూ క్యారేజ్ చూపించేసరికి వెంటనే విక్రమ్ భార్యతో పాటు వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిపోతాడు. భర్తల బ్యాచ్ అంతా తలబాదుకుంటుంది. "ఏమయ్యా తిమింగలంలా ఉన్నావ్ చిన్న పీతకే వెళ్ళిపోతావా నువ్వు" అంటూ హైపర్ ఆది డైలాగ్ వేస్తాడు. ఇంతలో రాంప్రసాద్ వచ్చి "మొగుళ్ళంతా లుంగీలు ఎందుకు కట్టుకుంటారు?" అని ఆదిని అడుగుతాడు. "భార్యను కట్టుకోవడం వలన పోయిన ప్రశాంతత అంతా లుంగీ కట్టుకోవడం వలన వస్తుంది" అంటూ కౌంటర్ వేస్తాడు ఆది.

రాగ‌సుధ‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న లాయ‌ర్‌!

  బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించిన సీరియ‌ల్ ఇది. వ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంత‌గా ప్ర‌సారం అవుతోంది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత, జ్యోతిరెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, సందీప్ త‌దిత‌రులు న‌టించారు. కోర్టులో రాగ‌సుధ .. అనుని అడ్డంగా ఇరికించాల‌ని చూస్తుంది. అను స‌హాయం వ‌ల్లే తాను ఇదంతా చేయ‌గ‌లిగాన‌ని చెబుతుంది. దీంతో లాయ‌ర్ అనుని క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిందిగా జ‌డ్జిని కోర‌డంతో అనుమ‌తిస్తాడు. ఆ వెంట‌నే అనురాధ‌ని బోన్ లోకి పిలుస్తారు. "పెళ్లికి ముందు మీకు ఆర్య వ‌ర్ధ‌న్ గారి గ‌తం గురించి పూర్తిగా తెలుసా?" అని అడుగుతాడు లాయ‌ర్‌. అను, "తెలుసు" అంటుంది. ఎలా అని అడిగితే ఆయ‌నే చెప్పారంటుంది. ఏమ‌ని చెప్పార‌ని అడిగితే.. రాజ‌నందినితో జ‌రిగిన వివాహం గురించి.. తాను ప్ర‌మాదవ‌శాత్తు చ‌నిపోవ‌డం గురించి మొత్తం చెప్పారు అంటుంది. దీంతో లాయ‌ర్ "అంటే.. రాజ‌నందినిది ప్ర‌మాద వ‌శాత్తు జ‌రిగిన మ‌ర‌ణం త‌ప్ప హ‌త్య అని చెప్ప‌లేదు ఔనా" అంటాడు.. అను "అవును" అన‌డంతో "నోట్ దిస్‌ పాయింట్ యువ‌ర్ ఆన‌ర్" అంటాడు లాయ‌ర్. అయితే ఆర్యవ‌ర్ధ‌న్ త‌రుపున వాదించ‌డానికి వ‌చ్చిన లాయ‌ర్ అస‌లు విషయాన్ని రాగ‌సుధ నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. దీంతో క‌న్ఫ్యూజ్ అవుతూ ఒక‌సారి ఒక‌లా మ‌రో సారి మ‌రోలా స‌మాధానం చెబుతూ కంగారు ప‌డుతూ వుంటుంది రాగ‌సుధ‌. విష‌యం ప‌సిగ‌ట్టిన లాయ‌ర్.. రాగ‌సుధ‌ని మ‌రింత‌గా ఇబ్బంది పెట్ట‌డం మొద‌లు పెడ‌తాడు.. దీంతో ఎక్క‌డ దొరికిపోతానో అని రాగ‌సుధ‌కు చెమ‌ట‌లు ప‌ట్టేస్తుంటాయి. ఈ లోగా రాగ‌సుధ త‌రుపు లాయ‌ర్ మా వ‌ద్ద బ‌ల‌మైన సాక్ష్యాలు వున్నాయ‌ని ఆస్తి ప‌త్రాలు చూపిస్తాడు. అవి ఒరిజిన‌లే అని గ్యారంటీ ఏంట‌ని ఆర్యవ‌ర్థ‌న్ లాయ‌ర్ ప్ర‌శ్నిస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

అంతా బాగుంటే డాక్ట‌ర్ సాబ్ పెళ్లాన్ని అయ్యేదాన్ని!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. వంటల‌క్క కార‌ణంగా టాప్ రేటింగ్ తో సాగిన ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా ఆ స్థాయిలో మాత్రం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోతోంది. దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్ తో రికార్డు సాధించిన ఈ సీరియ‌ల్ ఇప్ప‌డు ఫ‌ర‌వాలేదు అనే స్థాయిలో మాత్ర‌మే సాగుతోంది. వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌కు ముగింపు ప‌లికిన ద‌ర్శ‌కుడు వాళ్ల పిల్ల‌లు పెద్దవాళ్లు అయ్యాక వ‌చ్చే క‌థ న‌డిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం కొత్త త‌రం జంట‌ల‌తో ఈ సీరియ‌ల్ సాగుతోంది. ఈ గురువారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో జ్వాల ఎమోష‌న‌ల్ అవుతూ "వెళ్లిపోండి మీ మాట‌లు అబ‌ద్ధం మీరు అబ‌ద్ధం" అంటుంది. దీంతో నిరుప‌మ్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అదే స‌మ‌యంలో చాటు నుంచి చూస్తున్న సౌంద‌ర్య "ప‌ద‌వే జ్వాల దగ్గ‌రికి వెళదాం" అంటుంది హిమ‌తో. అయితే హిమ మాత్రం "కాసేపు న‌న్ను ఒంట‌రిగా వ‌దిలేయ్ నాన‌మ్మా" అంటూ ఎమోష‌న‌ల్ అవుతుంది. ప‌ర‌ధ్యానంలో హిమ రోడ్డుపై ప‌డుచుకుంటూ వెళుతుంటే కార్ డ్యాష్ ఇవ్వ‌బోగా ప్రేమ్ వ‌చ్చి కాపాడ‌తాడు. క‌ట్ చేస్తే... జ్వాల జ‌రిగిన విష‌యాన్ని త‌లుచుకుంటూ హిమ‌పై ర‌గిలిపోతూ వుంటుంది. అదే స‌మ‌యంలో హిమ‌ నుంచి ఫోన్ రావ‌డంతో నా జీవితంలో ఇద్ద‌రు శ‌త్రువులు వున్నార‌ని వార్నింగ్ ఇస్తుంది. అదే స‌మ‌యంలో సౌంద‌ర్య‌.. జ్వాల ద‌గ్గ‌రికి వెళ్లి "నీకు, నిరుప‌మ్ కు గొడ‌వేంటి?" అని అడుగుతుంది. అప్పుడు "అంతా బాగుంటే నేను డాక్ట‌ర్ సాబ్ పెళ్లాన్ని అయ్యేదాన్ని" అని జ్వాల అన‌డంతో ఎమోష‌న‌ల్ అయిన సౌంద‌ర్య.. జ్వాల‌ని హ‌త్తుకుని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్ సర్ ప్రైజ్.. 'బిగ్ బాస్' హౌస్ లోకి యంగ్ హీరో!

బిగ్ బాస్ తెలుగులో టాలీవుడ్ కుర్ర హీరోలు వరుణ్ సందేశ్, తనీష్, ప్రిన్స్, అభిజీత్ ఇలా ఎందరో సందడి చేశారు. అభిజీత్ మినహా మిగతా వారికి బిగ్ బాస్ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే ఇప్పుడు మరో కుర్ర హీరో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ 'తూనీగ తూనీగ'(2012) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'అంతకు ముందు ఆ తరువాత', 'కేరింత' వంటి సినిమాలతో అలరించిన సుమంత్ కు హీరోగా ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. తన తండ్రి డైరెక్ట్ చేసిన '7 డేస్ 6 నైట్స్'తో ఈ నెల 24న ప్రేక్షకులను పలరించనున్న ఈ కుర్ర హీరో.. బిగ్ బాస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడట. బిగ్ బాస్ తెలుగు సీజన్-6 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా యంగ్ హీరో సుమంత్ అశ్విన్ పేరు తెరమీదకు వచ్చింది. ఇటీవల షో నిర్వాహకులు సుమంత్ ని సంప్రదించగా, కంటెస్టెంట్ గా షోలో పాల్గొనడానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా హీరోగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్.. ఈ షోతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడట.

జీ తెలుగులో 'రాధే శ్యామ్'

వరుస బ్లాక్ బస్టర్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వీక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతున్న 'జీ తెలుగు', ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' సినిమాతో మీ ముందుకు రానుంది. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడి, వినసొంపైన మ్యూజిక్ తో, మనస్సుకి హత్తుకునే సన్నివేశాలతో, ఈ ప్రేమకథ ప్రేక్షకులకు ఈ వారాంతం మంచి అనుభూతిని కలిగించబోతుంది.  ప్రముఖ హస్తసాముద్రికుడి పాత్రలో అదరగొట్టిన ప్రభాస్ (విక్రమాదిత్య), ప్రేమ అనే సిద్ధాంతంపై విముఖతతో ఉంటాడు. చేతిరాతలను, గ్రహాల మరియు నక్షత్రాల స్థితిగతులను గట్టిగా విశ్వసించే విక్రమాదిత్య, సైన్స్ మాత్రమే నిజమని, విధి అంతా ఒక అబద్దమని నమ్మే డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే) ను కలుస్తాడు. విభిన్న వ్యక్తిత్వాలు, నమ్మకాలు కలిగిన ఈ పాత్రలు ప్రేమలో పడడం, ఆ తరువాత జరిగే పరిణామాలు, ఊహించని మలుపులతో ఈ సినిమా అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 'రాధే శ్యామ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను పురస్కరించుకుంటూ 'జీ తెలుగు' వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, ప్రభాస్ అభిమానులకు కంచుకోటగా ఉన్న భీమవరంలో జూన్ 18న ఆహ్లాదకరమైన 'రాధే శ్యామ్ థీమ్ పార్క్' ను ఏర్పాటుచేసి, అభిమానుల సందడి మధ్య ఈ చిత్ర టెలివిజన్ ప్రీమియర్ తేదీని మరియు సమయాన్ని ఫాన్స్ ద్వారా ప్రకటింపజేసింది. ఈ సందర్బంగా ఫోన్ ద్వారా మాట్లాడిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, అభిమానులు 'రాధే శ్యామ్' చిత్రాన్ని థియేటర్లలో ఎంతగానో ఆదరించారని, ఇప్పుడు 'జీ తెలుగు' లో కూడా అలాగే ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే ఒక అద్భుతమైన దృశ్యకావ్యమని, ఇంతకముందు చూడని వారు ఇప్పుడు టీవీలో చూసి ఒక గొప్ప అనుభూతిని పొందాలని ఆవిడ కోరారు.   వివిధ ప్రాపర్టీస్ యొక్క ఫోటో ఫ్రేమ్స్ తో ఈ థీమ్ పార్క్ అభిమానులకు సినిమాలో పలు దృశ్యాలను అనుకరించే అవకాశం కల్పించింది. ప్రేక్షకులు సినిమాలోని ట్రైన్ సన్నివేశాన్ని అనుకరించి, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, భీమవరంలో 'రాధే శ్యామ్' సందడి నెలకొంది. అభిమానులు మరియు ప్రేక్షకుల కోసం 'జీ తెలుగు' ఫ్లేమ్స్ (FLAMES) అనే టెక్ ఇన్నోవేషన్/గేమ్ ను కూడా ప్రమోషన్స్ లో భాగంగా ప్రారంభించింది. zeetelugu.tv కి వెళ్ళి మీ యొక్క ఫ్లేమ్స్ ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

ఓంకార్ తో ఆహా 'డాన్స్ ఐకాన్'.. టాప్ హీరో సినిమాలో ఛాన్స్!

ఇటీవల 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోతో ఆకట్టుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడొక భారీ డ్యాన్స్ షోతో అలరించడానికి సిద్ధమవుతోంది. 'డాన్స్ ఐకాన్' పేరుతో ఈ షో అలరించనుంది. తాజాగా ఈ షోని అధికారికంగా ప్రకటించారు. 'డాన్స్ ఐకాన్' షో కోసం ప్రముఖ యాంకర్ ఓంకార్ తో ఆహా చేతులు కలిపింది. ఓంకార్ డిజైన్ చేసిన ఈ షో అనౌన్స్ మెంట్ వేడుక తాజాగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, ఓంకార్, తదితరులు పాల్గొన్నారు. ఈ షో ఆడిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే "danceikon@oakentertainment.com"కు 60 సెకన్ల వీడియో పంపి అప్లై చేసుకోవాలి. 5 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ షోలో గెలిచిన కంటెస్టెంట్ కి భారీ ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే ఆ గెలిచిన కంటెస్టెంట్ కి డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ కి.. టాలీవుడ్ లో ఒక టాప్ హీరోకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ దక్కనుంది. ఈ షోలో ఇలాంటి సర్ ప్రైజ్ లు ఎన్నో ఉన్నాయని, అవన్నీ త్వరలో తెలుస్తాయని అల్లు అరవింద్, ఓంకార్ తెలిపారు.

శౌర్య గురించి నిజం తెలుసుకున్న సౌంద‌ర్య‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోందో ఇప్ప‌డు చూద్దాం. హిమ గురించి స్వ‌ప్న మాట్లాడుతూ "చూశావా నిరుప‌మ్ పెళ్లి కాక‌ముందే న‌న్ను బెదిరిస్తూ మాట్లాడుతోంది. పెళ్లైన త‌రువాత ఇంకా ఎలా మాట్లాడుతుందో ఏదైనా అందామంటే బాగాలేద‌న్న సానుభూతి ఒక‌టి" అన‌గానే `ఇక్క‌డ మీ సానుభూతిని ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు అత్త‌య్య‌గారు ` అని హిమ అంటుంది.. ఆ మాట‌ల‌కు వెంట‌నే అంతా షాక్ అవుతారు. దీంతో అక్క‌డి నుంచి నిరుప‌మ్, స్వ‌ప్న వెళ్లిపోతారు. వెంట‌నే సౌంద‌ర్య ..ఇదంతా ఎవ‌రి కోసం అని  హిమ‌ని నిల‌దీస్తూ "ఏం జ‌రిగింది? ఏం జ‌రుగుతోంది?" అని సీరియ‌స్ అవుతుంది. "శౌర్య కోసం" అని చెప్ప‌డం తో ఆనంద‌రావు, సౌంద‌ర్య షాక్ అవుతారు. హిమ మాట్లాడుతూ "మీ ద‌గ్గ‌ర ఓ విష‌యం దాచాను. శౌర్య ఎవ‌రో ఎక్క‌డ వుందో నాకు తెలుసు" అంటుంది. ఆ మాట‌లు విన్న ఆనంద‌రావు, సౌంద‌ర్య మ‌ళ్లీ షాక్ కు గుర‌వుతారు. వెంట‌నే శౌర్య‌ని చూపిస్తాన‌ని చెప్పి సౌంద‌ర్య‌ని తీసుకుని హిమ బ‌య‌టికి వెళుతుంది. క‌ట్ చేస్తే... అనాథాశ్ర‌మంలో నిరుప‌మ్ కోసం శౌర్య ఎదురుచూస్తూ వుంటుంది. ఇంత‌లో నిరుప‌మ్ వ‌స్తాడు. త‌ను రావ‌డంతో అత‌నిపై శౌర్య ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంది. నా మ‌న‌సులో నువ్వు లేవ‌ని, నేను తింగ‌రి హిమ‌ని పెళ్లి చేసుకుంటాన‌ని చెబుతాడు. దీంతో ఎమోష‌న‌ల్ అయిన శౌర్య‌.. వెంట‌నే నిరుప‌మ్ కాల‌ర్ ప‌ట్టుకుంటుంది. ఇదంతా చాటుగా చూస్తున్న సౌంద‌ర్య "అదేంటీ వీళ్లు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు?" అంటుంది. వెంట‌నే త‌నే శౌర్య అని హిమ చెప్ప‌డంతో సౌంద‌ర్య‌ షాక‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? సౌంద‌ర్య ఎలా రియాక్ట్ అయింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

న‌య‌ని ఏం చేయ‌బోతోందో తిలోత్త‌మ తెలుసుకుందా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`.  మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్  గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది.  మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. బెంగాలీ సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అషికా గోపాల్, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌చ నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.   తిలోత్త‌మ ఇంట్లో వున్న అద్దం తీసుకొచ్చాక న‌య‌ని గాయ‌త్రీ దేవి చిత్ర ప‌టాన్ని క్లిన్ చేస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో న‌న్ను మ‌ర్చి పోయావా న‌య‌ని అంటూ గాయ‌త్రీ దేవి ఆత్మ వ‌స్తుంది. పౌర్ణ‌మి రోజు మా నాన్న గారు గీసిన బొమ్మ‌లో వున్న‌ట్టుగా చేయాల‌ని చెప్పాను క‌దా? అని న‌య‌నితో అంటుంది. వెంట‌నే న‌య‌ని ఆ ఏర్పాట్లు మొద‌లు పెడుతుంది. పౌర్ణ‌మి రోజు చ‌న్నీళ్ల‌తో త‌ను స్నానం చేసి విశాల్ కు కూడా స్నానం చేయించి పూజ‌కు సిద్ధ‌మ‌వుతుంది. కట్ చేస్తే.. తిలోత్త‌మ ఇంట్లో న‌య‌ని చెల్లెలు సుమ‌న ప‌ల్లెం, చెంబు ప‌ట్టుకుని హాలు లోకి వ‌స్తుంది. అది చూసిన విక్రాంత్ ఏంటిది? ఏం చేస్తున్నావ్ అంటూ అడుగుతాడు. ఉప‌వాసం వున్నానండీ అని చెబుతుంది సుమ‌న‌. క‌ట్ చేస్తే .. నాగ‌లికి న‌య‌ని, విశాల్ పూజ చేయాల‌ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ విష‌యాన్ని వెట‌కారంగా తిలోత్త‌మ,క‌సిల‌కు చెబుతాడు వ‌ల్ల‌భ‌. ఏమీ లేని విశాల్ ఈ ప్ర‌పంచాన్ని దున్న‌డానికి నాగ‌లిని తెప్పించాడ‌ట అని ఠ‌క్కున్న చెప్పేస్తాడు. దీంతో న‌య‌ని ఏదో చేయ‌బోతోంది. మ‌నం ఇక్క‌డ కూర్చుని చ‌ర్చించుకోవ‌డం కాదు అక్క‌డికి వెళ్లి వాళ్లు ఏం చేస్తున్నారో గ‌మ‌నించాల‌ని విశాల్ వుండే చోటుకి వెళ‌తారు. వ‌చ్చిన వారిపై ఆవు పంచ‌కం( గో మూత్రం) ని చ‌ల్లుతుంది. అదేంటో తెలియ‌క అంతా చిరాకు ప‌డ‌తారు. ఆ త‌రువాత న‌య‌ని, విశాల్ నాగ‌లితో ఆ ప్రాంతాన్ని దున్నేస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

కోర్టులో అనుని అడ్డంగా బుక్ చేసిన రాగ‌సుధ‌!

`బొమ్మ‌రిల్లు`లో హీరో సిద్దార్ద్ కి సోద‌రుడిగా న‌టించిన శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి, నిర్మించిన సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఉత్కంఠ‌భరితంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా వ‌ర్ష హెచ్ కె న‌టించ‌గా, కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, జ్యోతిరెడ్డి, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, సందీప్ న‌టించారు.   రాగ‌సుధ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఆర్య వ‌ర్ధ‌న్ ఆస్తి కొట్టేయాల‌ని అనుని అడ్డం పెట్టుకుని ఆస్తి ప‌త్రాల‌ని కొట్టేస్తుంది. ఈ విష‌యం తెలిసి జెండే అనుపై అరుస్తాడు. చేసింది చాలు... ఆర్య‌ని బ‌య‌ట‌ప‌డేసే దారుల‌న్నీ నీ అమాయ‌క‌త్వంతో మూసేశావు అంటూ సీరియ‌స్ అవుతాడు. కోర్టు టైమ్ అవుతోంది ఇప్ప‌డు ఎలా అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు. క‌ట్ చేస్తే.. కొట్టేసి ఆస్తి ప‌త్రాలు త‌న వ‌ద్దే వున్నాయ‌న్న థీమాతో రాగ‌సుధ నేరుగా కోర్టుకు వెళుతుంది. పోలీస్ క‌స్ట‌డీలో వున్న ఆర్య వ‌ర్థ‌న్ ని కూడా కోర్టులో హాజ‌రు ప‌రుస్తారు.   ఇదే స‌మ‌యంలో త‌న అక్క రాజ‌నందిని వ్యాపార సామ్రాజ్యం గురించి.. అదే స‌మ‌యంలో ఆర్య ప్రారంభించిన వ్యాపారం గురించి కోర్టులో చెబుతుంది. త‌న‌కు ఆస్తి వ‌ద్ద‌ని త‌న అక్క‌ని హ‌త్య చేసిన ఆర్య వ‌ర్ధ‌న్ కు శిక్ష ప‌డితే చాల‌ని కోరుకుంటుంది. ఆ త‌రువాత త‌ను ఇదంతా ఆర్య వ‌ర్ధ‌న్ వైఫ్ అను స‌హ‌కారంతోనే చేశాన‌ని, తను నాకు అండ‌గా నిల‌బ‌డింద‌ని చెప్పి అనుని తెలివిగా ఇరికిస్తుంది. దీంతో లాయ‌ర్ అనుని విచార‌ణ‌కు బోనులోకి రావాల్సిందిగా కోర‌తాడు. దీంతో అను భ‌యం భ‌యంగానే బోనులోకి వెళుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అనుని రాగ‌సుధ ఎలా బుక్ చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

వేద ప్రెగ్నెంట్ కాద‌ని మాళ‌విక‌కు తెలిసిపోయిందా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా \లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. వేద క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో వెంట‌నే డాక్ట‌ర్ ని పిలిపిస్తారు. ప‌రీక్షించిన డాక్ట‌ర్ .. వేద ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దీంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ హ్యాపీగా ఫీలైతే య‌ష్ మాత్రం షాక్ కు గుర‌వుతాడు. కాపుర‌మే చేయ‌కుండా ప్రెగ్నెంట్ ఏంటీ? అని వాపోతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. వేద ప్రెగ్నెంట్ అని తెలియ‌డంతో అత్త మాలిని, త‌ల్లి సులోచ‌న హ‌డావిడి చేస్తుంటారు. అపార్ట్ మెంట్ లో అంద‌రికి స్వీట్లు పంచిపెడుతూ వుంటారు. శ్రీ‌మంతం కేర‌ళ‌లో చేద్దామ‌ని, పుట్టే బాబుని క‌లెక్ట‌ర్ ని చేస్తాన‌ని ప్లాన్ చేస్తుంటారు. వేద త‌ల్లి కూడా పాప పుడితే డాక్ట‌ర్ని చేస్తానంటూ మురిసిపోతుంది. ఇదంతా చూసిన య‌ష్ కి చిరాకు పుడుతూ వుంటుంది. వెంట‌నే వెళ్లి వేద‌ని నిల‌దీస్తాడు. 'ప్రెగ్నెంట్ కావ‌డం అబ‌ద్ధం అని తెలిసి వాళ్ల‌ని ఎందుకు మోసం చేస్తున్నావు?' అంటాడు. 'రిపోర్ట్ లో ఎలాగూ తెలిసిపోతుంది. అంత వ‌ర‌కు వాళ్ల‌ని అలాగే వుండ‌నివ్వండి' అంటుంది. అయినా స‌రే అబ‌ద్దం చెప్పావ‌ని త‌రువాత అంతా ఫీల‌వుతారంటాడు. ఇదంతా చాటు నుంచి వింటున్న కైలాష్ క‌రెక్ట్ గా దొరికావు వేదా ఇక ఆడుకుంటా.. అంటూ మురిసిపోతాడు. క‌ట్ చేస్తే సులోచ‌న‌, మాలిని ఇద్ద‌రు క‌లిసి వేద‌ని హాస్పిట‌ల్ కు చెక‌ప్ కోసం తీసుకెళ‌తారు. విష‌యం తెలిసిన మాళ‌విక అక్క‌డికి వ‌స్తుంది. ఎలాగైనా విష‌యం ఏంటో తెలుసుకోవాల‌ని ఆరాతీస్తుంది. ఇదే స‌మ‌యంలో తాను ప్రెగ్నెంట్ కాద‌ని, ఆ విష‌యం మా వాళ్ల‌కు చెప్ప‌మంటుంది వేద‌. ఈ విష‌యం విన్న మాళ‌విక సంబ‌ర‌ప‌డిపోయి వేద‌ని అవ‌మానిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

తులసిని మాటలతో గాయపరిచిన అభి

అంకిత అభి గురుంచి ఆలోచిస్తూ ఉంటుంది. దివ్య తనని నవ్విద్దాం అని ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ లో ఒక వీడియో చూపించి నవ్వించే ప్రయత్నం చేస్తుంది కానీ అంకిత మాత్రం నవ్వదు. తర్వాత పరంధామయ్య విచిత్ర వేషధారణలో వచ్చి నవ్వించడానికి చూస్తాడు. అది కూడా వర్కౌట్ అవదు. చివరికి తులసి కూడా వెళ్లి అంకిత దగ్గర జోక్ చెప్తుంది ఐనా నవ్వదు. ఫైనల్ గా ఏదో హెల్మెట్ గురుంచి తులసి చెప్పేసరికి అంకిత పక్కున నవ్వేస్తుంది. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలంటుంది తులసి. మరో వైపు నందు కోపంతో వచ్చి తులసిని పిలుస్తాడు. నందుతో పాటు గాయత్రీ, లాస్య కూడా తులసి ఇంటికి వస్తారు. వెంటను నువ్వు అంకితను గాయత్రితో పంపించు అంటూ తులసి మీద సీరియస్ అవుతాడు. నేను పిలిస్తే అంకిత రాలేదు..కాబట్టి తనను వెళ్ళు అనే అధికారం నాకు లేదు అంటుంది. దీనికి వెటకారంగా లాస్య తెలివిగా మాట్లాడుతున్నావ్ నాకు కూడా నేర్పించు అంటుంది. నీ అంగీకారం లేకుండా అంకిత నీ ఇంటికి వచ్చినప్పుడు మెడ పట్టుకుని బయటకు గెంటేయొచ్చు కదా అని సీరియస్ గా మాట్లాడుతుంది గాయత్రి. అది మీ సంస్కారం అంటుంది తులసి. నాకు కోరుకున్న ప్రేమ దొరక్క ప్రేమను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటుంది అంకిత. ఇంతలో అభి అక్కడికి వస్తాడు. పిల్లల్ని ప్రేమించే తల్లుల్ని చూసాం కానీ కోడళ్లను బిడ్డలా కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిని నిన్నే చూస్తున్నా. నువ్వు అంకితను కాపాడడం లేదు ఆమె జీవితాన్ని  నాశనం చేస్తున్నావు అని మాటలు విసిరేస్తాడు అభి. మొగుడికి విడాకులు ఇచ్చి నీలాగే ఒంటరి బతుకు బతికేలా చేస్తున్నావు. ఇంకో తులసిని తయారు చేస్తున్నావు అంటాడు. నీ మొండితనాన్నే నేర్పిస్తున్నావు అని తులసిని నిలదీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్న మేఘన లోకేష్

మేఘన లోకేష్ "కల్యాణ వైభోగం" సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటి. మంగతాయారు పాత్రతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది మేఘన. ఈమె కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఇటు తెలుగుతో పాటు అటు కన్నడలో కూడా ఈమె ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఐతే మేఘన బెంగళూరుకి చెందిన స్వరూప్ భరద్వాజ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళై మూడేళ్లయిన సందర్భంగా ఇటీవల మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంది. " మీతో ఇలాంటి మరెన్నో మధురమైన క్షణాలను గడపాలని ఉంది. మూడేళ్ళుగా నన్ను భరిస్తున్న మీకు ధన్యవాదాలు. ఇంకా నన్ను జీవిత కాలం భరించాలి అంటూ" తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. మేఘన నటించిన "శశిరేఖ పరిణయం" సీరియల్ స్టార్ మాలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మేఘన లోకేష్ వాళ్ళ నాన్న ఒక ఇంజినీర్. వాళ్ళ అమ్మ ప్రొఫెసర్. మేఘన కన్నడ అమ్మాయే ఐనా తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుంది. బాగా అల్లరి కూడా చేస్తుంది. మేఘన టీవీ సీరియల్స్ తో పాటు కొన్ని షాట్ ఫిలిమ్స్, మూవీస్ లో నటించింది. ఎమోషన్, బ్యూటిఫుల్ లైఫ్ అనే షాట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కన్నడలో దేవి, పవిత్ర బంధన, పురుషోత్తమ అనే టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసింది మేఘన. డాన్స్ జోడి డాన్స్ కి మెంటార్ గా కూడా వ్యవహరించింది. అలాగే 2017 లో ఇదే మా ప్రేమకథ, 2018 లో అమీర్ పేట టు అమెరికా అనే రెండు తెలుగు మూవీస్ లో నటించింది కూడా. ఇక ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీని పురస్కరించుకుని నెటిజన్స్ విషెస్ చెప్తున్నారు. పెళ్లిరోజు సందర్భంగా థాయిలాండ్ లోని ఫి ఫి ఐలాండ్స్ లో భర్తతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది మేఘన లోకేష్. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మారుతీ నెక్స్ట్ మూవీలో పాట పాడే ఆఫర్ కొట్టేసిన కీర్తిభట్

తెలుగు ఆడియన్స్ కి కీర్తి భట్ అంటే ఎవరో తెలీదో కానీ భాను అంటే చాలు గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే మానసిచ్చి చూడు సీరియల్ లో భాను పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కీర్తి. బెంగళూరులో పుట్టిన కీర్తికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకుంది. చదువైపోయాకు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు సీరియల్స్ చేసింది. ఐతే కొన్నేళ్ల క్రితం కీర్తి తన వాళ్ళను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది. ఒక కారు ప్రమాదంలో కీర్తి తల్లితండ్రులతో పాటు అన్నయ్య, వదినను దూరం చేసుకుంది. కీర్తి కూడా ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు కోలుకుని  మానసిచ్చి చూడు అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. ఇటీవల ఫాథర్స్ డే సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన మొగుడ్స్ పెళ్లామ్స్ షోలో "వెలుగు, చీకటిలోన తోడై నిలిచే నాన్న అంటూ పాట పాడి " బాగా ఎమోషన్ అయ్యింది కీర్తి. పాట చాలా బాగా పాడిందంటూ రాశిఖన్నా, గోపీచంద్, మారుతి మెచ్చుకున్నారు. మారుతి కూడా వాళ్ళ నాన్న గురుంచి ఈ షోలో చెప్పుకొచ్చారు. ఇక కీర్తి ఇన్వాల్వ్ అయ్యి ఇంత చక్కగా పాడినందుకు మారుతి తన నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ ని కీర్తితో పాడిస్తానంటూ మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. "ఆడపిల్లలకు నాన్న అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి తలుపు కొడితే నాన్న తలుపు తీస్తారేమో అని ఎదురు చూస్తుంటాను. వాళ్ళు రారని, లేరని తెలుసు కానీ చిన్న ఆశ ఉంది. పేరెంట్స్ లేకపోతె ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. దయచేసి పేరెంట్స్ ఎవరూ బాధపెట్టొద్దు, వాళ్ళను బాగా చూసుకోండి ..ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోండి..ఈ రోజు నేను ఈ స్టేజి మీద ఉన్నాను అంటే అది మా నాన్న , స్టార్ మా వల్ల"  అంటూ చెప్పుకొచ్చింది కీర్తి భట్.