నాన్న ఫొటో చూసి ఎమోష‌న‌ల్ అయిన గోపీచంద్‌

'పక్కా కమర్షియల్' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండేసరికి టీమ్ మొత్తం ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ బుల్లితెర మీద అన్ని షోస్ లో వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి టీం మొత్తం ఫుల్ మస్తీ చేసింది. సుమ కూడా 'పక్కా కమర్షియల్' అంటూ ప్రతీ దానికి డబ్బులు అడుగుతూ వచ్చింది. ఇటీవల జబర్దస్త్ లో సందడి చేసిన ఈ టీం డైరెక్టర్ మారుతి.. అనసూయకు పక్కా కమర్షియల్ అంటూ కితాబిచ్చాడు. ఇక క్యాష్ కి వచ్చిన టీమ్ తో ఫుల్ గా గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసింది సుమ. ఇక ప్రోమో ఎండింగ్ లో గోపీచంద్ నాన్న టి. కృష్ణ ఫోటో చూపించింది. ఆ ఫోటోని చూసేసరికి గోపీచంద్ ఫుల్ గా ఎమోషన్ ఐపోయాడు.  "దాదాపు నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం నాకు చాలా నేర్పించింది" అంటూ బాధపడ్డారు. "నాకు ఇప్పుడు తెలుస్తోంది అసలు నేనేం కోల్పోయానో.. మా నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా" అనేసరికి అక్కడ ఉన్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అయ్యింది. గోపీచంద్ 'తొలివలపు' మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే ఇటీవల ఆయన నటించిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. కానీ 'సీటీమార్' విజయంతో మళ్ళీ గోపీచంద్ గాడినపడ్డాడు. తాజా చిత్రం 'పక్కా కమర్షియల్' మంచి హిట్ అవుతుంది అనే ఆశతో ఉన్నాడు. ఈ మూవీ హిట్ ఐతే మాత్రం గోపీచంద్ కి మళ్ళీ దశ తిరిగినట్టే అంటున్నారు ఆడియన్స్.

రోహిణికి తాళి క‌ట్టిన‌ బులెట్ భాస్కర్ నాన్న!

ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం కామెడీ కొంచెం ఎక్స్ట్రా గానే ఉందనిపిస్తోంది. ఈ సీరియల్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఐతే జబర్దస్త్ స్టేజి ద్వారా  పరిచయమైన కమెడియన్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని కూడా స్కిట్స్ లో ఇన్వాల్వ్  చేయించడం కొంత కాలం నుంచి గమనిస్తున్నాం. అలాగే కొన్ని నెలల నుంచి బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న ఈ జబర్దస్త్ లో కొడుకుతో పాటు పోటాపోటీగా  స్కిట్స్ చేస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్ లో కూడా ఆయన తన కామెడీని పండించడానికి ట్రై చేశారు.  వీల్ చైర్ మీద ఉన్న బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్నను రోహిణి పెళ్లి చేసుకుంటుంది. తర్వాత వెంటనే వీల్ చైర్ లోంచి లేచి ఫస్ట్ నైట్ కి అరేంజ్ చేయమంటూ కొమరంని ఆర్డర్ వేస్తాడు బులెట్ భాస్కర్ నాన్న. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. "ఇప్పుడే పెళ్లయింది కదా నా కోసం ప్రేమగా ఏవైనా రెండు డైలాగులు చెప్పొచ్చు కదా" అంటుంది రోహిణి. అంతే బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న రెచ్చిపోతాడు. " నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను, కానీ నేను చచ్చిపోతే నువ్వు ఏడవద్దు " అంటూ ఒక మినీ కవితను లవ్ ప్రపోజ్ యాంగిల్ లో చెప్పాడు.  రోహిణి ఆ డైలాగ్ కి షాక్ అయ్యి వెంటనే అందుకుంటుంది. "ఇంతకు ముందు ఒకడుండేవాడు. తొమ్మిది సంవత్సరాలు ఇలా చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు" అంది రోహిణి. "అందుకే వాడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు" అంటూ పంచ్ వేశాడు భాస్కర్ వాళ్ళ నాన్న. ఆయన డైలాగ్ కి రష్మీ ముఖం మాడ్చేస్తుంది. ఎందుకంటే ఈ కామెంట్ సుధీర్ ని ఉద్దేశించి అన్నట్లుగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇలా ఈ వారం స్కిట్స్ ఎక్స్ట్రా ఎనెర్జీని ఆడియన్స్ కి అందించబోతున్నాయి.

నీతో నువ్వు ఒంటరిగా ఉండడం చాలా బెటర్!

సోషల్ మీడియా శ్రీ ముఖి మీద ఎప్పుడూ ఒక క‌న్నేసి ఉంచుతుంది. ఎందుకంటే శ్రీముఖి ఏది చేసినా స్పెషలే. బ్లాక్ డ్రెస్ వేసినా వేల కొద్ది లైక్స్ వస్తాయ్. బుర్జ్‌ ఖలీఫాని చూపించినా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అలా వచ్చి పడతాయి. అందుకే శ్రీముఖిని సోషల్ మీడియా ఎప్పుడూ అబ్జ‌ర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇక షూటింగ్స్ లేనప్పుడు సింగల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరు కదా. మరి శ్రీముఖి కూడా అదే సిట్యువేషన్ లో ఉందిప్పుడు. దాని మీద ఒక వీడియో చేసింది శ్రీ.  స్విగ్గిలో రా చికెన్ ఆర్డర్  చేసుకుని 'లెట్స్ సెలెబ్రేట్ ఏ లేజీ డే' అంటూ ఆ వీడియోలో ఎలా ఎంజాయ్ చేయాలో చూపించింది. లేజీ డే కాస్తా చికెన్ వచ్చేసరికి ఎక్సయిట్మెంట్ పెరిగి ఇంటరెస్టింగ్ డే అయ్యింది శ్రీముఖికి . ఇక చికెన్ ని చక్కగా వండేసింది శ్రీముఖి. మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ చేద్దామనుకుందట కానీ టొమాటోస్ లేవు కాబట్టి ఆనియన్స్ కోసింది. ఉల్లిపాయలు కొయ్యడం అంటే శ్రీముఖికి అస్సలు ఇష్టం ఉండదట. ఎందుకంటే కన్నీళ్లు వస్తాయని అంటోంది. ఇక కూర పొయ్యి మీదేసి వచ్చి డాన్స్ బేబీ డాన్స్ అంటూ డాన్స్ చేసేసింది.  'స్టేజి మీద కెమెరా ముందు డాన్స్ చేయడం ఒక లెక్క, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా డాన్స్ చేయడం ఇంకో లెక్కా ఆ కాన్ఫిడెన్సే వేరు' అంటూ మంచి హుషారుగా చెప్పింది శ్రీముఖి. "ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా, నీ లైఫ్ లో ఎవరున్నా లేకపోయినా, అసలేం జరిగినా అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ ని, నీ జర్నీని ఎంజాయ్ చేయాలి. నిన్ను నువ్వు ప్రేమించాలి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏం చేయాలో రాసుకోండి, నచ్చింది వండుకుని తినండి, మంచిగా డాన్స్ చేయండి.. మీతో మీరు స్పెండ్ చేసే టైం దొరికిందని సంతోషపడండి ముందు" అంటూ చెప్పుకొచ్చింది హోమ్ అలోన్ వీడియోలో. 'పది మంది ఫేక్ పర్సన్స్ తో ఉండే బదులు నీతో నువ్వు ఒంటరిగా ఉండడం చాలా బెటర్' అంటూ తన వీడియో ద్వారా సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న విషయంపై మంచి మెసేజ్ ఇచ్చింది.

రష్మిని వదిలేసి రాశి ఖన్నాతో సుధీర్ రొమాన్స్

'పక్కా కమర్షియల్' టీం ప్రమోషన్స్ జోరు చూస్తూ ఆడియన్స్ హోరెత్తిపోతున్నారు. ఐతే ఇటీవల 'థాంక్యూ దిల్ సే' అనే ప్రోగ్రాంకి ఈ టీం వచ్చి సందడి చేసింది. ఇక హోస్ట్స్ సుధీర్, శ్రీముఖి ఇద్దరూ మస్త్ ఎంటర్టైన్ చేశారు. గోపీచంద్ తో కలిసి శ్రీముఖి "ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన" అంటూ పాట పాడింది. 'నేను ఒక్క లైన్ అడిగితే పాడలేదు' అని సుధీర్ అనేసరికి 'లేడీస్ అడిగినప్పుడు పాడకపోతే  ఫీల్ ఐపోతారు' అన్నాడు గోపీచంద్. 'మా వైపు రాశిఖన్నా గారు ఉన్నారుగా' అని సుధీర్ అనేసరికి "నా కోసం ఒక పాట పాడతావా" అంటూ రాశి చేతిలో చెయ్యేసి మరీ అడిగేసరికి సుధీర్ మస్త్ సిగ్గుపడిపోయాడు. 'నేను ఎప్పుడూ అమ్మాయిల్ని టచ్ చేయను' అని సుధీర్ అన్న మాటకు అందరూ నవ్వేశారు. "అడిగా అడిగా" అంటూ సుధీర్ పాట అందుకొనేసరికి "ఏమడిగావ్?" అంటూ గోపీచంద్ కోరస్ పాడి నవ్వించారు.  ఇక తర్వాత రాశి ఖన్నా "ఏం సందేహం లేదు" పాట అద్భుతంగా పాడి అందరినీ మెస్మరైజ్ చేసింది. గోపీచంద్, శ్రీముఖి ఒక జోడిగా, రాశిఖన్నా, సుధీర్ ఒక జోడిగా డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. సుధీర్, "నాకు అమ్మాయిలను ముట్టుకోవడం అంటే కొంచెం ప్రాబ్లెమ్" అని రాశితో అనేసరికి, "నాకేం ప్రాబ్లెమ్ లేదు" అని సుధీర్ కి కౌంటర్ ఆన్సర్ ఇచ్చింది రాశి ఖన్నా. "ఇప్పుడు ఈ రెండు జోడీలు మధ్య డాన్స్ వార్ జరగబోతోంది" అంటూ శ్రీముఖి చెప్పేసరికి "అమ్మాయిలతో డాన్స్ వేయడం నాకు సిగ్గు" అన్నాడు సుధీర్. "అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో వేస్తావా ఏమిటి డ్యాన్స్" అన్నాడు మారుతి. ఇక తర్వాత "జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి" సాంగ్ కి డాన్స్ వేశారు శ్రీముఖి, గోపీచంద్. తర్వాత రొమాంటిక్ సాంగ్  ఏం సందేహం లేదు పాటకు సుధీర్, రాశీ ఖ‌న్నా ఇద్దరూ చక్కగా డాన్స్ చేసి మంచి ఎనర్జీని అందించారు ఆడియన్స్ కి. ఇక జడ్జి మారుతి స్టేజి మీదకు వచ్చి రొమాంటిక్ సాంగ్ లో రాశి, మాస్ సాంగ్ లో గోపీచంద్ గెలిచారని చెప్పాడు. అలా ఈ షో మొత్తం గేమ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు.

తుల‌సి అకౌంట్ లోంచి లాస్య అకౌంట్‌లోకి రూ. 20 ల‌క్ష‌లు!

తులసి మ్యూజిక్ స్కూల్ పెడుతోంద‌నీ, దానికి బ్యాంకు లోన్ కోసం అప్లై చేసిన విషయాన్ని నందుతో చెప్తుంది లాస్య. "తనకు అసలు లోన్ ఎవరిస్తారు?" అంటాడు నందు. మరో వైపు శృతికి డబ్బు ఇస్తానని కచ్చితంగా చెప్తుంది తులసి. ఇక శృతి కూడా ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోమని ప్రేమ్ కి చెప్తుంది. ఇంతలో అకౌంట్ లో డబ్బు పడినట్టు మెసేజ్ వచ్చిందని చెప్తుంది దివ్య. అది చూసి తులసి వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. శృతికి ఫోన్ చేసి డబ్బు వచ్చిన విషయం చెప్పి చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఇంతలో తులసి అకౌంట్ కి మరో మెసేజ్ వస్తుంది. ఏంటా అని చూస్తుంది అంకిత. "ఆంటీ మీ అకౌంట్ నుంచి 20 లక్షలు డెబిట్ ఐనట్టు మెసేజ్ వచ్చిం"ది అంటుంది. తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. అంకిత అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది శృతి. "వేరే ఏదో బ్యాంకు అకౌంట్ కి మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఐనట్టు మెసేజ్ వచ్చింది ఆంటీ" అంటుంది అంకిత.  బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి అడుగుతుంది. "మీరే చెక్ ఇచ్చారు.. దాని ద్వారానే డబ్బును డ్రా చేసుకున్నారు కదా" అంటాడు. డౌట్ వచ్చి ఫోన్ పెట్టేసి అంకిత తులసిని డాక్యుమెంట్స్ గురించి అడుగుతుంది. అంకితకు డాకుమెంట్స్ చూపిస్తుంది తులసి. కానీ అవన్నీ ఫేక్ అని చెప్తుంది అంకిత. మరో వైపు లాస్య అకౌంట్లోకి డబ్బు పడేసరికి చాలా సంతోషంగా ఉంటుంది. పరంధామయ్య బ్యాంకు ఏజెంట్ రంజిత్ ని బాగా తిడుతూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రిషి

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'గుప్పెడంత మనసు' మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. మరి ఈ రోజు సీరియల్స్ హైలైట్స్ ఏంటో చూద్దాం. సాక్షి గురించి దేవయాని చెప్తుండేసరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి తినకుండా లేచి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత మహేంద్ర కూడా తినకుండా వెళ్ళిపోతాడు. ఇలా జరిగినందుకు జగతి, మహేంద్ర ఇద్దరు కలిసి దేవయానిని బాగా తిడతారు.  ఇంకో వైపు తనకు లిఫ్ట్ ఇచ్చినందుకు రిషికి థాంక్స్ మెసేజ్ పెడుతుంది వ‌సు. అది చూసి వసు గురించి ఆలోచిస్తుంటారు రిషి. అక్కడ వసు కూడా రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపు ఇద్దరూ ప్రేమగా చాటింగ్ చేసుకుంటారు. రెండో రోజు రిషి దగ్గర "ఇంతకుముందులా నాతో ఫ్రీ గా మాట్లాడ్డం లేదు" అని వసు అడిగేసరికి పని ఉందని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు రిషి. అప్పుడే మహేంద్ర, జగతి కాలేజీకి వస్తారు. ఆ తర్వాత రిషి.. వసు గురించి జగతికి చెప్తాడు.  "ఈ మధ్య అస్సలు తన జీవిత లక్ష్యం గురించి పట్టించుకోవడం లేదు, కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి" అంటూ వెళ్ళిపోతాడు. తర్వాత రిషి, వసు గురుంచి మహేంద్ర, జగతి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి ప్రాజెక్ట్ విషయమై వసు అక్కడికి వస్తుంది. ఆ విషయాన్నీ డైరెక్టుగా రిషితో మాట్లాడు అంటుంది. తర్వాత రిషికి వ‌సు కాఫీ ఇస్తుంది.. కానీ సడెన్‌గా ఆమెపై రిషి అరిచేస్తాడు. వసు ఫీల్ అయ్యి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరో వైపు దేవయాని అసలేం జరిగింది రిషికి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. రిషి, సాక్షిని కలిపి తన పెత్తనాన్ని కంటిన్యూ చేయాలని ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక మిగతా హైలైట్స్ కోసం సాయంత్రం ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు' సీరియల్ లో చూడొచ్చు.

త్రినయనికి కొత్త కారుని బహుమతిగా ఇచ్చిన భర్త చేతన్

‘కథలో రాజకుమారి’ సీరియల్ పేరు చెప్తే చాలు ఆషిక గోపాల్ ప‌డుకోనే గుర్తొస్తుంది. ఆ సీరియల్ తో ఈమె బుల్లితెరపై మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సీరియల్ కి అప్పట్లో మంచి రేటింగ్స్ వచ్చేవి. ఇక ఇప్పుడు 'త్రినయని' సీరియల్ లో నటిస్తోంది. ముందుగానే భవిష్యత్తు చూసి చెప్పే పాత్రలో కష్టాలు పడుతూ కనిపిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు జీ తెలుగు టాప్ 5 సీరియల్స్ లో ఒకటిగా నిలించింది. బుల్లితెరతో సరిపెట్టుకోకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసే పిక్స్ కూడా పెడుతూ ఉంటుంది ఆషిక.   ఐతే ఇప్పుడు ఆషిక చాలా హ్యాపీగా ఉందట. దానికి కారణం వాళ్ళ హబ్బీ చేతన్ అని చెప్తోంది. లైఫ్ పార్టనర్ ఒక రోజు సడెన్గా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే దాని ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా అంటోంది. "అలాంటి ఆనందమే ఇప్పుడు నాది. నాకు చెప్పకుండా ఒక కార్ షోరూమ్ కి తీసుకెళ్లారు. అక్కడ ఒక కార్ లో టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్లాం" అని చెప్పింది.. ఇక ఫైనల్ గా తనకు  య‌స్‌యువి (suv) కార్ కొని గిఫ్ట్ చేసారని చెప్పింది ఆషిక.   ఇప్పుడు భార్యాభర్తలు ఆ కారుకి పూజ చేయించి రైడ్ కి కూడా వెళ్లారట. "సాధారణంగా చేతన్ శెట్టి అన్ని నన్నే అడిగి ఏ పనైనా చేస్తాడు కానీ ఇప్పుడు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేసాడు" అంటూ మురిసిపోతోంది. ఆషిక, చేతన్ 2021 అక్టోబర్ లో వివాహం చేసుకున్నారు. చేతన్ బేసిగ్గా సాఫ్ట్ వేర్   ఇంజినీర్ ఐనా సొంతంగా బిజినెస్ కూడా రన్ చేస్తుంటాడు.

అనసూయ 'పక్కా కమర్షియల్' అంటూ బయటపెట్టిన మారుతి!

జబర్దస్త్ షోకి రేటింగ్ పడిపోకుండా అలా నిలబడుతుంది అంటే దానికి కారణం ఇప్పుడు అనసూయ అనే చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో ఒకటి  రీలీజ్ అయ్యింది. మారుతీ డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ జులై 1న విడుదల కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ని ముమ్మరంగా చేసేస్తోంది ఈ టీమ్. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మారుతి, గోపీచంద్ జబర్దస్త్ షోకి వచ్చేశారు. అల్లరల్లరి చేసేశారు.  రావడం రావడమే మారుతి యాంకర్ అనసూయ గురుంచి గడగడా కొన్ని నిజాలు చెప్పేశాడు. అనసూయ ఆయన నోరు ముయ్యడానికి ట్రై చేసింది కానీ నిజాలు మాత్రం బయటికి వచ్చేశాయి. "పక్కా కమర్షియల్ యాంకర్ ని చూడడానికి వచ్చాను. ఈవిడ మామూలు కమర్షియల్ కాదు. చిన్న చిన్న పాత్రలు ఇస్తే అస్సలు ఒప్పుకోదు" అనేసరికి  అనసూయ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  ఇప్పుడు ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ భరద్వాజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ బ్యూటీగా అను పేరు తెచ్చుకుంది. ఇప్పుడున్న తెలుగు యాంకర్లలోకి ఈమెది స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక ఈ న్యూ ప్రోమోలో 'జయం', 'నిజం' మూవీస్ నుంచి సాంగ్స్ ని , కొన్ని సీన్స్ ని చలాకి చంటి పెర్ఫామ్ చేశారు.  బుల్లితెర మీదే కాదు అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర మీద మెరుస్తోంది అన‌సూయ‌. ఎలాంటి ప్రత్యేక పాత్రలో ఐనా సరే చాలా సునాయాసంగా నటించగలదని డైరెక్టర్స్ కూడా ఈమె వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు 'దర్జా' మూవీలో ఒక లీడ్ రోల్ చేసింది అనసూయ. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇంకా కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న 'రంగమార్తాండ' మూవీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

'ఢీ' షోకి తగ్గిపోతున్న రేటింగ్

బుల్లితెర పై ప్రసారమవుతున్న 'ఢీ' షోకి  రేటింగ్స్  ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. 'ఢీ' డాన్స్ షోకి ఒకప్పుడు మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. రష్మీ, సుధీర్ హోస్ట్ గా చేసినంత కాలం కూడా ఈ డాన్స్ షో కి మంచి రేటింగ్స్ వచ్చేవి. శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించినప్పుడు మంచి ఎనెర్జీతో, జోష్ తో ముందుకు  సాగేది. ఇప్పుడు వాళ్ళెవరూ ఈ షోలో లేకపోయేసరికి హద్దులు దాటిన ముద్దులతో, చెత్త పంచ్ డైలాగ్స్ తో షో మొత్తం గందరగోళంగా మారింది. డాన్స్ తక్కువ, సొల్లు ఎక్కువ అంటూ ఆడియన్స్ కూడా ఈ షోని  తిడుతున్నారు. దీంతో ఈ షోకి రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఢీ షోకి గట్టి పోటీ ఇచ్చేందుకు 'ఆహా' సిద్ధమయ్యిందనే విషయం తెలిసిందే. 'డాన్స్ ఐకాన్' పేరుతో ఆహా రంగంలోకి దిగింది.  'తెలుగు ఇండియన్ ఐడల్' షో తర్వాత ఈ న్యూ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు అల్లు అరవింద్, ఓంకార్. ఈ షోలో పాల్గొనే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జి గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ తో పాటు ఇంకొంత మంది జడ్జెస్ కూడా ఈ షో కి రావడానికి  రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఇయర్ ఎండింగ్ వరకు బాలయ్య 'అన్‌స్టాప‌బుల్‌' షోతో పాటు డాన్స్ షో కూడా నిర్వహించేందుకు ఆహా టీం ప్రయత్నాలు స్టార్ట్ చేసేసింది.  ఢీ డాన్స్ షోకి రేటింగ్ పడిపోవడం ఒక ఎత్తు ఐతే దీనికి పోటీ ఇచ్చే మరో షో లేకపోయేసరికి ఈ విషయాన్ని కాష్ చేసుకోవడానికి అల్టిమేట్ గా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు న్యూ టాలెంట్ కి వేదిక కల్పించేందుకు అన్ని రకాలుగా ఆహా సిద్దమయ్యింది. ఇక ఆ షో మొదలైతే మాత్రం ఢీ డాన్స్ షో పరిస్థితి ఏమిటో తెలీదు. ఉంటుందా, దుకాణం సర్దేస్తుందా అనేది  చూడాలి.

24 గంట‌ల్లో ఆర్య అనుకున్న‌ది చేస్తాడా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో రూపొంది గ‌త కొన్ని వారాలుగా ఉత్కంఠ‌భ‌రిత ములుపులు, ట్విస్ట్ ల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ ఆల్ మోస్ట్ చివ‌రి అంకానికి వ‌చ్చేసింది. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్‌.కె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మధుశ్రీ‌, ఉమా దేవి త‌దిత‌రులు న‌టించారు.   రాగ‌సుధ‌. అనుని న‌మ్మించి త‌న ట్రాప్ లో ప‌డేలా చేసి ఆస్తి ప‌త్రాల‌పై రాజ‌నందిని త‌ర‌హాలో సంత‌కం చేయిస్తుంది. అవే ఇప్ప‌డు ఆర్య‌ని ఇరికించ‌డానికి ప్ర‌ధాన ఆస్త్రాలుగా మార‌తాయి. ఆ పేప‌ర్ల‌ని ప్ర‌ధానంగా చూపిస్తూ రాగ‌సుధ లాయ‌ర్ ఆర్య వ‌ర్థ‌న్ ని ఇరికించాల‌ని చూస్తుంటాడు. ఇదే స‌మ‌యంలో ఆ పేప‌ర్ల‌పై వున్న సంత‌కం నాదేన‌ని చెబుతుంది అను. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చ‌నిపోయిన రాజ‌నందిని పెట్టిన సంత‌కం మీరు ఎలా పెడ‌తార‌ని లాయ‌ర్ ఎదురుప్ర‌శ్నిస్తాడు. అయినా స‌రే తానే రాజ‌నందినిని అంటూ అను అరుస్తుంది. దీంతో లాయ‌ర్ ఏదైనా మాన‌సిక వైద్యుడికి త‌న‌ని చూపించండ‌ని అవ‌హేళ‌న చేస్తాడు. జ‌రిగింది అర్థం కాక‌ ఆర్య వ‌ర్ధ‌న్ త‌న భార్య మాట‌ల‌కు తాను సారీ చెబుతున్నానంటాడు. క‌ట్ చేస్తే.. నా క్లైంట్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి అని ఆర్య వ‌ర్ధ‌న్ లాయ‌ర్ జ‌డ్జిని కోర‌తాడు. ఇందు కోసం మాకు ఒక నెల గ‌డువు ఇవ్వ‌మంటాడు. అయితే నెల అవ‌స‌రం లేద‌ని, ఒకే ఒక్క రోజు చాల‌ని చెప్ప‌డంతో లాయ‌ర్ తో పాటు అంతా షాక్ అవుతారు. అయితే 24 గంట‌ల్లో ఆస్తి త‌న‌దేన‌ని త‌న నిర్దోశిత్వాన్ని నిరూపించుకోక‌పోతే ఆస్తి మొత్తం రాగ‌సుధ‌కే చెందుతుంద‌ని తుది తీర్పు చెప్పాల్సి వుంటుందిని న్యాయ‌మూర్తి ఆర్య‌ని హెచ్చ‌రించి గ‌డువు ఇస్తాడు. 24 గంట‌ల్లో ఆర్య అనుకున్న‌ది చేస్తాడా?.. రాగ‌సుధ‌ని అడ్డంగా బుక్ చేస్తాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

శోభ చెంప ఛెల్లు మ‌నిపించిన సౌంద‌ర్య‌

ఈ రోజు ఎపిసోడ్ లో సౌంద‌ర్య, జ్వాల కోసం దోస‌కాయ ప‌చ్చ‌డి చేస్తాను అంటుంది. అయితే జ్వాల మాత్రం త‌న‌కు దోస‌కాయ ప‌చ్చ‌డి ఇష్టం వుండ‌ద‌ని చెబుతుంది. ఆ త‌రువాత సౌంద‌ర్య గోరు ముద్ద‌లు క‌లిపి జ్వాల‌కు తినిపిస్తూ ఆనంద‌ప‌డుతూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో జ్వాల బాధ‌ప‌డుతూ వుంటుంది. అది గ‌మ‌నించిన సౌంద‌ర్య .. జ్వాల‌ను ఓదారుస్తుంది. ఆ త‌రువాత ఇద్ద‌రు ప్రేమ‌గా మాట్లాడుకుంటారు. ఇంత‌లో అక్క‌డ‌నుంచి సౌంద‌ర్య వెళ్లిపోతుండ‌గా శోభ ఫోన్ చేస్తుంది. నిరుప‌మ్ ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీకు శౌర్య‌ని చూపిస్తాను అన్నాను క‌దా అంటుంది. దానికి సౌంద‌ర్య `నువ్వు ఎక్క‌డున్నావో లొకేష‌న్ పంపించు అక్క‌డికి వ‌చ్చి నీతో కూల్ గా మాట్లాడ‌తాను అంటుంది. వెంట‌నే శోభ నిజ‌మే అనుకుని ఆనందిస్తూ సౌంద‌ర్య‌కు లొకేష‌న్ షేర్ చేస్తుంది. క‌ట్ చేస్తే .. హిమ గురించి ఆలోచిస్తూ ప్రేమ్ బాధ‌ప‌డుతూ వుండ‌గా నిరుప‌మ్ అక్క‌డి వ‌స్తాడు. నువ్వు నా పెళ్లికి లేకుండా ముంబై వెళుతున్నావా? నువ్వులేక‌పోతే ఎలా రా అంటాడు.  అయినా స‌రే ప్రేమ్ లో ఎలాంటి మార్పు వుండ‌దు. క‌ట్ చేస్తే.. శోభ‌.. సౌంద‌ర్య కోసం ఎదురుచూస్తుండ‌గా ఇంత‌లో సౌంద‌ర్య అక్క‌డికి వ‌స్తుంది. అప్పుడు శోభ త‌న డీల్ గురించి మాట్లాడ‌గా సౌంద‌ర్య‌.. శోభ చెంప ఛెల్లు మ‌నిపిస్తుంది. అప్పుడు నా గురించి ఏమి అనుకుంటున్నావు అంటూ సౌంద‌ర్య ఇక్క‌డ అంటూ సీరియ‌స్ అవుతుంది. నా ఫ్యామిలీ గురించి కానీ నా మ‌న‌వ‌రాలు, మ‌న‌వ‌డి గురించి గానీ ఒక్క‌ మాట మాట్లాడినా నీ చాప్ట‌ర్ క్లోజ్ అంటూ గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మ‌రో వైపు హిమ ఒంట‌రిగా నిల‌బ‌డి జ్వాల గురించి ఆలోచిస్తూ బాధ‌ప‌డుతూ వుంటుంది. అప్పుడు అక్క‌డికి వ‌చ్చిన శోభ నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు అంటే జ్వాల‌కు ఫోన్ చేసి రెచ్చ‌గొడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

రిషిని భోజనం చేయకుండా అడ్డుపడిన దేవయాని

దేవయాని మాటలకు జగతి, మహేంద్ర బాధపడుతూ ఉంటారు. జగతి బాధను చూడలేక మహేంద్ర ఆమెకు  ధైర్యం చెప్తాడు. దేవయాని అక్క తన నుంచి రిషిని మరింత దూరం చేయడానికి ట్రై చేస్తోందని తెలిసి బాధపడుతుంది. 'నేను చిన్నప్పుడు విడిచి వెళ్ళిపోయాను, సాక్షి మధ్యలో వెళ్ళిపోయింది, వసు లవ్ చేయట్లేదని చెప్పింది. చివరికి దేవయాని అక్కయ్య ఇలా అబద్దపు ప్రేమ చూపిస్తుంటే రిషి ఏమవుతాడు' అని జగతి చాలా ఫీలవుతూ ఉంటుంది.  ఇంకో వైపు వసు సైకిల్ కి పంక్చర్ అయ్యేసరికి దిగులుగా ఉంటుంది. అదే టైంకి అటుగా వెళ్తున్న రిషి.. వసుని చూసి ఫన్నీగా మాట్లాడతాడు. 'నేను నీ సైకిల్ రిపేర్ చేయనా' అని అడుగుతాడు. 'మీ వల్ల కాదు అంటుంది' వసుధార. సైకిల్ బాగుచేసుకుంటున్నప్పుడు ముఖానికి ఆయిల్ మరక అవుతుంది. కర్చీఫ్ ఇస్తాడు రిషి. వసు తీసుకోదు. తర్వాత ఇద్దరూ కలిసి క్యారెక్టర్స్ ని మార్చుకుని మాట్లాడుకుంటారు సరదాగా. అప్పుడు ఇద్దరూ కలిసి టీ తాగి కారులో వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లిన రిషికి మహేంద్ర ఎదురౌతాడు. 'భోజనం చేశారా డాడ్?' అని అడుగుతాడు రిషి. 'నీకోసమే చూస్తున్నా' అంటాడు మహేంద్ర. ఆ తర్వాత జగతి ఫుడ్ రెడీ చేస్తూ ఉంటుంది. దేవయాని వచ్చి 'నువ్వు రిషికి  భోజనం వడ్డించొద్దు' అని చెప్పి త‌ను వడ్డిస్తుంది. రిషి భోజనం చేసి వంటలు చాలా బాగున్నాయని అనేసరికి దేవయాని కల్పించుకుని 'నేనే చేసాను' అంటుంది. ఎవరు చేశారని చెప్తే ఏముందిలే  నా కొడుకు కడుపునిండా తింటే చాలు అనుకుంటుంది జగతి.  రిషి భోజనం చేస్తున్నప్పుడు సాక్షి టాపిక్ తెస్తుంది దేవయాని. వెంటనే సీరియస్ గా భోజనం చేయకుండా మధ్యలో లేచి వెళ్ళిపోతాడు రిషి. అది చూసి జగతి బాధపడుతుంది. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం సాయంత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే 'గుప్పెడంత మ‌న‌సు' సీరియల్ చూడాల్సిందే.

రష్మిని అసలు నువ్వెవరు ? అని అడిగిన బులెట్ భాస్కర్ నాన్న

బుల్లితెరపై మస్త్ పాపులర్ ఐన షో జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ. స్టార్ట్ చేసిన కొంత కాలానికే మంచి పేరు తెచ్చుకుంది. సుధీర్ హోస్ట్ గా స్టార్ట్ ఐన షో ఇప్పుడు రష్మీతో కంటిన్యూ అవుతోంది. మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాదు అప్పుడప్పుడు ఎమోషషనల్ సబ్జక్ట్స్ తో ఆడియన్స్ ని కంటి తడి పెట్టిస్తూ ఉంది ఈ షో. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ప్రతీ ఇంటిని పలకరిస్తూ అలరిస్తోంది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ వారం పెళ్ళాం చెబితే వినాలి థీమ్ తో స్కిట్స్ ప్లాన్ చేశారు కమెడియన్స్. ఈ ప్రోమోలో ఐతే ఆది మిగతా కమెడియన్స్ వచ్చి సందడి చేసినట్టు కనిపిస్తుంది. ఈ స్టేజి మీద భార్యలకు, భర్తలకు కబడ్డీ పోటీ పెడతారు. ఈ గేమ్ లో బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న కూడా పార్టిసిపేట్ చేస్తారు. అప్పటివరకు సరదాగా రష్మీ ని ఆట పట్టిస్తూ పంచ్ డైలాగ్స్ తో కాస్త ఎక్కువ చేస్తాడు.  బులెట్ భాస్కర్ ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ లో వాళ్ళ నాన్నను స్టేజి మీదకు తీసుకొచ్చి కామెడీ స్కిట్స్ చేయిస్తున్నారు. ఆయన టైమింగ్ ఉన్న కామెడీ చేస్తున్నారు కానీ కొన్ని పేలుతున్నాయి కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఆయన రష్మీ మీద కూడా ఇలాంటి డైలాగ్స్ వేస్తుంటే ఏమనాలో అర్ధం కాక తెల్లమొహం వేసుకుని నిలబడుతుంది. ప్రతీ కాంపిటీషన్ లో  లేడీస్ గెలుస్తున్నారు, మగవాళ్ళు ఓడిపోతున్నారు అంటూ రష్మీ అనేసరికి మైక్ అందుకున్న బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న అసలు మీరు ఎవరు ? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.. అని కామెంట్ కం అవమానం చేసేసరికి రష్మీ ఒక్కసారిగా షాక్ ఐపోతుంది. ఇక కబడ్డీ గేమ్ లో  ఈయన కూతకు వెళ్లి స్టేజి మీద జారిపోయే పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా కాస్త టెన్షన్ అవుతారు. భాస్కర్ వాళ్ళ నాన్న పట్టు తప్పి పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ర‌క్తంతో గీసిన బొమ్మ‌ని చూపించిన జ్వాల‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఈ రోజు ఎపిసోడ్ లో శౌర్య గురించి హిమ.. సౌంద‌ర్య‌కు చెబుతూ వుంటుంది. ఒక రోజు ఐస్ క్రీమ్ పార్ల‌ర్ లో శౌర్య‌, నిరుప‌మ్ బావ‌ను ప్రేమిస్తున్న‌ట్టు తెలిసింది. త‌న మొబైల్ ఫోన్ లో బావ పేరు నా మొగుడు అని సేవ్ చేసుకుని పెట్టుకుంది అని చెప్ప‌డంతో సౌంద‌ర్య షాక్ అవుతుంది. అది చూసాకే మ‌న‌సు మార్చుకున్నాను అంటుంది హిమ. అంతే కాకుండా అమ్మా నాన్నా చ‌నిపోతూ శౌర్య జాగ్ర‌త్త అని చెప్పారు అంటూ హిమ ఎమోష‌న‌ల్ అవుతుంది. ఆ మాట‌ల‌కు సౌంద‌ర్య ఎమోష‌న‌ల్ అవుతూ హిమ ను ఓదారుస్తుంది. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్‌, జ్వాల‌కి త‌న మ‌న‌సులో మాట చెప్పినందుకు సంతోషంగా ఫీల‌వుతాడు. హిని పెళ్లి చేసుకుని అపురూపంగా చూసుకుంటాను అని త‌న మ‌న‌సులో అనుకుంటాడు. ఇదిలా వుంటే జ‌రిగిందంతా త‌లుచుకుంటూ జ్వాల బాధ‌ప‌డుతూ వుంటుంది. అదే స‌మ‌యంలో జ్వాల ఇంటికి సౌంద‌ర్య వ‌స్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఎందుకొస్తోంద‌ని అడిగితే నిరుప‌మ్ పై తాను పెంచుకున్న ప్రేమ‌ని, క‌న్న క‌ల‌ల‌ని వివ‌రిస్తుంది. ఇదే స‌మ‌యంలో ర‌క్తంతో గీసిన నిరుప‌మ్ బొమ్మ‌ని చూపిస్తుంది..ఆ బొమ్మ ని చూసి సౌంద‌ర్య ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌ట్ చేస్తే... శోభ‌, స్వ‌ప్న మాట్లాడుకుంటూ వుంటారు. ఇదే స‌మ‌యంలో నిరుప‌మ్ తో నా పెళ్లి చేసేయండి అంటుంది శోభ‌. ఆ త‌రువాత జ్వాల ముందు హిమ‌ను బుక్ చేయాల‌ని ప్లాన్ చేసిన శోభ‌.. జ్వాల‌ని హిమ వున్నచోటికి ర‌మ్మ‌ని ఫోన్ చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. హిమ‌తో జ్వాల ఎలా ప్ర‌వ‌ర్తించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

న‌య‌ని ప్లాన్ తో తిలోత్త‌మ‌కు వ‌ణుకు పుట్టిస్తున్న హాసిని

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని థ్రిల్ కు గురిచేస్తోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించ‌గా, ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.   పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలోని స్థ‌లంలో పౌర్ణ‌మి రోజు పూజ చేయ‌మ‌ని గాయ‌త్రీ దేవి ఆత్మ చెప్ప‌డంతో న‌య‌ని, విశాల్ పూజా జ‌రిపిస్తారు. నాగ‌లికి పూజ చేసి దున్నేస్తారు. న‌య‌ని ఏదో చేసేస్తోంద‌ని, త‌ను ఏం చేయ‌బోతోందో తెలుసుకోవాల‌ని అక్క‌డికి తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ వ‌స్తారు. వారితో పాటే హాసిని, దురంధ‌ర కూడా వ‌స్తుంది. పూజ అనంత‌రం ప్ర‌సాదం ఇస్తూ హాసినికి ఓ సిమ్ కార్డ్ ని అంద‌జేస్తుంది న‌య‌ని. దాంతో తిలోత్త‌మ‌ని ఓ ఆట ఆడుకోమంటుంది. ఆ సిమ్ కార్డ్ ని తీసుకుని ఎవ‌రికీ అనుమానం రాకుండా అక్క‌డి నుంచి హాసిని వెళ్లిపోతుంది. హాసినితో న‌య‌ని ఏం చెప్పిందా? అని తిలోత్త‌మ అనుమానంగానే చూస్తుంది. ఈలోగా నైట్ అవుంది. ఎవ‌రికీ తెలియ‌కుండా న‌య‌ని ఇచ్చిన సిమ్ ని యాక్టివేట్ చేసిన హాసిని.. వెంట‌నే తిలోత్త‌మ‌కు ఫోన్ చేస్తుంది. ఆ సిమ్ గాయ‌త్రీ దేవి ని హ‌త్య చేసిన భూష‌న్ ది కావ‌డం.. ఆ నంబ‌ర్ నుంచి కాల్ రావ‌డంతో తిలోత్త‌మ‌లో వ‌ణుకు మొద‌ల‌వుతుంది. ఫోన్ ఎత్తిన తిలోత్త‌మ‌కు హాసిని నేను భూష‌న్ భార్య‌ని అని, త‌ను గ‌త కొన్ని రోజులుగా క‌నిపించ‌డం లేద‌ని, త‌న‌తో నువ్వు చేయించిన హత్య‌ల గురించి పోలీసుల‌కు చెప్పేస్తాన‌ని బెదిరిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  తిలోత్త‌మ ఏం చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

రాజ‌నందినిని నేనే అంటూ షాకిచ్చిన‌ అను!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ఎండింగ్ కి చేరుకుంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష‌. హెచ్ కె కీల‌క పాత్ర‌లో శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు. రాగ‌సుధ‌కు వ‌ణుకు పుట్టించిన లాయ‌ర్ అస‌లు ఏం జరిగిందో కోర్టుకు వివ‌రించ‌మ‌ని ఆర్య వ‌ర్ధ‌న్ ని బోన్ లోకి పిలుస్తాడు. దీంతో జ‌రిగింది అంతా చెప్ప‌డం మొద‌లు పెడ‌తాడు ఆర్య‌. రాజ‌నంద‌ని, తాను ప్రేమించి పెళ్లిచేసుకున్నామ‌ని, అది రాగ‌సుధ‌కు ఇష్టం లేద‌ని చెబుతాడు. మా పెళ్లి రోజున ఇంటికి వ‌చ్చిన రాగ‌సుధ మే హైడెన్ సీక్ ఆడుతుండ‌గా మేడ‌పై నుంచి రాజ‌నందినిని తోసేసి హ‌త్య చేసింద‌ని చెబుతాడు. అయితే ఇందంతా విన్న రాగ‌సుథ లాయ‌ర్ క‌ట్టుక‌థ అంటాడు. వెల్ నెరేటెడ్ స్టోరీ అంటూ హేళ‌న చేస్తాడు. ఇలాంటి క‌థ‌లు కాద‌ని, కోర్డుకు సాక్ష్యాలు కావాల‌ని అంటాడు. రాజ‌నందిని గారిని హ‌త్య చేసింది ఆర్య‌వ‌ర్ధ‌నే అని ఈ ఆస్తి మొత్తం రాగ‌సుధ‌కు మాత్ర‌మే చెందుతుంది అన‌డానికి మా ద‌గ్గ‌ర బ‌ట‌మైన సాక్ష్యం వుంద‌ని చెబుతాడు. అను రాజ‌నందినిగా సంత‌కం పెట్టిన ఆస్తి పేప‌ర్ల‌ని కోర్టుకు స‌మ‌ర్పిస్తాడు. దీంతో ఆ సంత‌కం పెట్టింది నేనే అంటుంది.. అదెలా అంటే రాజ‌నందినిని నేనే కాబట్టి అంటుంది.. దీంతో అంతా ఒక్క‌సారిగా షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

అకౌంట్ లోంచి 20 లక్షలు మాయం

డాకుమెంట్స్ మీద సంతకం చేస్తుంది తులసి. వెంటనే ఒక బ్లాంక్ చెక్ కూడా కావాలని అడుగుతాడు బ్యాంకు ఏజెంట్. సరే అని  చెక్ మీద సైన్ చేసి ఇచ్చేస్తుంది కానీ మనసులో మాత్రం ఎందుకో టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపటిలోగా మీ అకౌంట్ లో 20 లక్షలు డిపాజిట్ అవుతాయి చూసుకోండి అనేసి వెళ్ళిపోతాడు. నందుని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి షాక్ అవుతాడు. వెంటనే లాస్య వచ్చి నందు..ఎక్కువగా ఆలోచించకు నేనే రమ్మన్నాను అని చెప్తుంది. రెండు రోజుల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 20 లక్షలు ఇవ్వబోతున్నాం అని చెప్తుంది. దానికి గాను కొన్ని డాకుమెంట్స్ మీద నందుతో సైన్ చేయించుకుని వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్. నందు కోపంతో లాస్య మీద అరుస్తాడు. అభి డబ్బులు లేవన్నాడు కదా మరి నువ్వు డబ్బు ఇస్తానంటున్నావేంటి అంటాడు.  డబ్బు గురుంచి టెన్షన్ పడకుండా కూల్ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరో పక్క అభి ప్రేమ్ వాళ్ళింటికి వెళ్తాడు . సడన్ గా అభిని చూసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. శృతిని చాప తెమ్మని చెప్పి కూర్చోబెట్టాడు. ఏంటి అన్నయ్య ఇలా వచ్చావ్ అనేసరికి సాయం కోసం వచ్చానంటాడు. నేనేం చేయగలను అంటాడు ప్రేమ్. మాట సాయం కావాలిరా అంటాడు అభి. అంకితకు నచ్చజెప్పి తనతో వచ్చేలా చేయాలి అని అడుగుతాడు. మరో వైపు తులసికి చాలా హ్యాపీగా ఉంటుంది. తులసి ఆనందాన్ని చూసి అంకిత కారణం అడుగుతుంది. ఇరవై లక్షలు బ్యాంకులో పడబోతున్నాయని చెప్తుంది. అంతలోనే అంత డబ్బు డెబిట్ ఐనట్టు మెసేజ్ వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది తులసి. ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

డాగ్ ట్రైనర్ గా సుమ

యాంకర్ సుమ కేవలం పేరు మాత్రమే కాదు దశాబ్దాలుగా బుల్లితెరపై అలరిస్తున్న ఒక బ్రాండ్. ఎలాంటి షో ఐనా సరే చిటికెలో చేసేస్తుంది. అసలు భయం అనేది   ఆమె బ్లడ్ లోనే లేదు అన్నట్టుగా ఉంటుంది ఆమె వ్యవహారాల. అందుకే ఎవ్వరినైనా ఎంత పెద్ద స్టార్ నైనా సరే ఇట్టే నవ్వించేస్తుంది. ఆమె వయసు 40 కావచ్చేమో కానీ యాంకరింగ్ లో మాత్రం ఇంకా స్వీట్ 16 నే.. బిగ్ స్టార్స్ కి సంబంధించి ఎలాంటి ఈవెంట్ ఐనా సరే సుమ యాంకరింగ్ లేకుండా జరగదు. ఈమె బేసిగ్గా మలయాళీ కుట్టి ఐనా తెలుగు వారితో చాలా బాగా కనెక్ట్ ఐపోయింది. ఐతే సుమ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్  అవుతోంది. " మనం మన ఇంట్లో పెంపుడు కుక్కలతో ఎలా మాట్లాడతాం, వాటి ఫీలింగ్స్ ఎలా అర్ధం చేసుకుంటాం" అనేదే ఆ వీడియో. ఆ వీడియోలో తాను పెంచుకునే కుక్కతో ఫీట్స్ చేయించింది సుమ. కుక్క పేరు చుక్కు. చుక్కులు, టుక్కుటుక్కులు అంటూ కుక్కతో మాట్లాడుతూ బిస్కట్ ని చూపిస్తుంది. అది కూడా ఆశగా చూస్తూండేసరికి " సిట్ " అంటుంది. చుక్కు కూర్చుంటుంది. తర్వాత "రోల్" అంటుంది సుమ .. పక్కకు దొర్లినట్టు నటిస్తుంది కానీ పూర్తిగా రోల్ అవ్వదు. కాసేపు సుమ కోపంగా బుంగ మూతి ఒక బిస్కట్ విసిరేస్తుంది. ఇలా సుమ కుక్కతో ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. " మీ కుక్క మీ మాట వినడం లేదు, స్టూడెంట్ కి డిస్టింక్షన్ వచ్చింది..కానీ టీచర్ కి కాదు , కుక్కతో జాగ్రత్త, మీరు  దాంతో ఆడుకోవడం కాదు, అదే మీతో ఆడుకుంటోంది అంటూ నెటిజన్స్ ఈ వీడియోకి  కామెంట్స్ చేస్తున్నారు.

అల్లరిపాలెం అనసూయ v / s చెప్పంపాలెం సుధీర్

సూపర్ సింగర్ జూనియర్ షో చిన్న పిల్లల పాటలతో ప్రతీ వారం అద్దిరిపోతూ మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంటోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ ఫోక్ థీమ్ సాంగ్స్ తో ఇరగదీసేందుకు పిల్లలు సిద్ధమైపోయారు. ఇక ఈ ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇందులో అల్లరిపాలెం నుంచి అనసూయ లంగా వోణిలో పొడవాటి జడతో అందంగా తయారై రాగా  మరో హోస్ట్ చెప్పంపాలెం నుంచి సుధీర్ ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చి కాసేపు ఒకరినొకరు ఆటపట్టించుకుని స్టేజిని నవ్వులతో ముంచేశారు. ఇక ఈ షోకి స్పెషల్ జడ్జిగా మాల్గాడి శుభ గారిని ఇన్వైట్ చేస్తారు. ఇక మాల్గాడి శుభ గారి పాట పాడే విధానం గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వస్తూనే పకడో,పకడో అంటూ హుషారెత్తించే పాట పాడేసి స్టేజి మీద అందరిని లేచి డాన్స్ చేసేలా  చేసి ప్రోగ్రాంని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.  ఇక జూనియర్ సందీప్ మంచి జోష్ తో " ఆ గట్టునుంటావా నాగన్న " పాట పాడి అందరిని మెప్పించాడు. "మంచి ఫైర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావ్ సందీప్ " అంటూ మాల్గాడి శుభ ఆ కుర్రాడికి మంచి కామెంట్ ఇస్తారు. ఇక "లాలూదర్వాజ లష్కర్" పాట పాడి భువనేష్  అడ్డరగొట్టేసాడు. "జోలాజో లాలి జోల నిత్యమల్లె పూల జోల" పాటను పాడి శ్రీకీర్తి స్టేజి మీద ఒక హాయితనాన్ని అందించింది. ఈ పాట పూర్తయ్యాక హేమచంద్ర ఒక విషయాన్నీ చెప్తారు. తన కూతురు శిఖరని నిద్ర పుచ్చేటప్పుడు భార్గవి ఇలాంటి పాటలు పాడుతుంది ఆ రిథమ్ కి తాను నిద్రపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.