చెట్టు కింద హారిక అందాల ఆరబోత

ఈరోజున  ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి అంటే తప్పనిసరిగా సోషల్ మీడియా ఒక్కటే సోర్స్.. ప్రతీ ఒక్కరూ దీన్నే నమ్ముకుని ఎవరి ఇమేజ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక అదే దారిలో పయనిస్తోంది. యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్లకు ఈమె మస్త్ పరిచయమే. అలాగే బిగ్ బాస్ సీజన్ 4తో ఇంకా ఎంతో మందికి పరిచయమయ్యింది. రెగ్యులర్ గా హారిక రకరకాల యాంగిల్స్ లో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్‌గా గోల్డ్ కలర్ టాప్ లో కన్ను గీటుతూ, నవ్వుతూ ఉన్న‌ ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేసింది. హారిక అలా నవ్వేసరికి బుగ్గ మీద సొట్ట పడింది. "ఇది డింపుల్ అని నేను అనుకుంటున్నాను" అనే కాప్షన్ తో ఈ ఫోటో పోస్ట్ చేసింది  ఈ బ్యూటీ. తెలంగాణా యాసలో హారిక చేసే వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా దేత్తడి నటించింది. వీటితో పాటు కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసి తనలో టాలెంట్ మొత్తాన్ని ప్రదర్శించింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్న హారికకు అవకాశాలు రాక యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటోంది. ఇప్పుడు ఈ సొట్ట బుగ్గ అమ్మాడి పోస్ట్ చేసిన ఫోటో కి సో బ్యూటిఫుల్, వావ్ క్యూటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లాస్య డబ్బు కాజేసిందని తులసి గ్రహిస్తుందా ?

అదృష్టం వచ్చినట్టే వచ్చే లాస్ట్ మినిట్ లో ఎందుకు చేజారిపోతోందో తెలియట్లేదు అని ప్రేమ్ శృతి బాధపడుతూ ఉంటారు. మరో వైపు తులసి అసలు తనకు ఇలా ఎందుకు జరుగుతోంది. నేను ఎవరినీ అనుమానించలేను అనుకుంటుంది మనసులో.  బ్యాంకు లోన్ కోసం మావయ్యగారికి హెల్ప్ చేయమని అడిగాను ఆయన రిటైర్ బ్యాంకు మేనేజర్ నెంబర్ ఇచ్చారు. మరి ఈ రంజిత్ ఎవరు అని అప్పుడు సీన్ రీకలెక్టు చేసుకుని బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి రంజిత్ గురుంచి అడుగుతుంది. రంజిత్ ఎవరో తెలీదు అంటాడు బ్యాంకు మేనేజర్. ఐతే ఇది ప్లాన్ ప్రకారమే నన్ను టార్గెట్ చేసి నా డబ్బు కాజేశారని క్లియర్ కట్ గా అర్ధం చేసుకుంటుంది. తులసి. మరో పక్క అభి దగ్గరకు గాయత్రి వస్తుంది. ఏమిటి ఎప్పుడూ ప్రొఫెషన్ గురించేనా పర్సనల్ లైఫ్ గురుంచి పట్టించుకోవా అంకిత గురుంచి ఏం ఆలోచించావ్ అని అడుగుతుంది. మరో వైపు నందు తనకు ఇంటర్వ్యూ కి టైం అయ్యిందని చెప్పి వెళ్లబోతాడు. బిజినెస్ ప్లాన్ చేసావ్ గా జాబ్ వద్దు అంటుంది. అంత డబ్బు ఎవరిస్తారు అంటాడు, బిజినెస్ కలిసి రావట్లేదు చేయను అంటాడు. వెంటనే లాస్య డబ్బు తీసి ఇస్తుంది. నా ఫ్రెండ్ సంజన ఇచ్చింది  అని చెప్తుంది. తులసి బ్యాంకుకు వెళ్లి రంజిత్ గురుంచి ఆరా తీస్తుంది. అతని నెంబర్ కి కాల్ చేస్తే కలవదు. మరో పక్క తులసిని మోసం చేసినందుకు లాస్య, భాగ్య ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా తులసి సమస్యను ఎలా సాల్వ్ చేసుకుందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.  

రిషి, వసు కలిశారంటూ మురిసిపోయిన జగతి

వసు, రిషి ఇద్దరూ పుచ్చకాయ ముక్కలు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో వైపు జగతి, మహేంద్ర ఎదురెదురుగా కూర్చుని ఆలోచిస్తుంటారు. ఇంతలో జగతి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అదేదో నాకూ చెప్తే నవ్వుతానుగా అంటాడు మహేంద్ర. రిషి, వసు దగ్గరవుతున్నారు అంటుంది జగతి. అంత ఫీల్ అవ్వకు.. రిషి ఏ విషయం అంత తొందరగా మర్చిపోడు నీ విషయంలోనే చూసావుగా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నీ మీద అదే కోపం. ఏమన్నా తగ్గిందా అంటాడు. జగతి ఎమోషనల్ అయ్యి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.  ఇక మహేంద్ర జగతికి  సర్ది చెప్పబోతాడు. వసు లవ్ లెటర్ చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకో పక్క రిషి తనదగ్గరకు వసు వచ్చినట్టు ఫీల్ అవుతాడు. తర్వాత వాళ్ళ మధ్య జరిగిన విషయం తెలిసి బాధపడతాడు. ఇక తాను స్కాలర్ షాప్ టెస్ట్ లో టాప్ లో ఉందని తెలిసి కంగ్రాట్స్ చెప్తాడు రిషి. మీరు ఆరోజు నాకు ఎంతో అండగా ఉన్నారు కాబట్టే అని అనేసరికి జరిగింది తలుచుకుని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మినిస్టర్ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని జగతి మహేంద్రకు చెప్తుంది.  వసు మంచి మార్కులు సాధించినందుకు ఒక సోషల్ ఎవెర్ నెస్ ప్రోగ్రాం చేయమని కూడా చెప్పారంటుంది జగతి. ఇక రిషి, వసు  తాము కొలిచే అమ్మవారి దగ్గరకు వెళ్లి ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లి  వాళ్ళ పేర్లు రాసి కాపాడు తల్లి అంటూ ప్రార్థిస్తారు. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం స్టార్ మాలో సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు లో చూడొచ్చు.  

జ్వాల లెక్క‌లు తేల్చుకోవ‌డం మొద‌లు పెట్టిందా?

కార్తీక దీపం 1389వ ఎపిసోడ్ హైలైట్స్.. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ తో ఏం జ‌ర‌గ‌నుందో ఇప్పుడు చూద్దాం. హిమ‌ పై కోపంలో ర‌క్తంతో గీసిన బొమ్మ‌ని ముక్క‌లు ముక్క‌లుగా చించిప‌డేస్తుంది జ్వాల‌. ఆ ముక్క‌ల‌ని అతికించి సౌంద‌ర్య‌.. జ్వాల‌కు ఇస్తుంది. నా కోపం డాక్ట‌ర్ సాబ్ మీద కాదు ఆ తింగ‌రి మీద‌.. ఎంత చేశాను త‌న‌కి..ఎలా వుండేదో తెలుసా?  ప్ర‌తి దానికి భ‌య‌మే.. ఎంత‌ అమాయ‌కంగా వుండేదో తెలుసా?  కానీ ఇప్పుడు న‌న్ను మోసం చేసేంత‌గా మారిపోయింది. నా జీవితాన్ని నా డాక్ట‌ర్ సాబ్ ని నా నుంచి దూరం చేసింది..క్ష‌మించ‌ను.. వ‌దిలేదే లేదు.. అంటూ జ్వాల ర‌గిలిపోయింది.   క‌ట్ చేస్తే.. శోభ చేస్తున్న ప‌నికి ఆగ్ర‌హంతో ఊగిపోయిన హిమ లాగిపెట్టి కోట్టి వార్నింగ్ ఇస్తుంది. అయితే అది నిజం కాదు.. అలా కొట్టాల‌ని హిమ ఊహించుకుంటుంది. నిద్ర‌లోంచి ఉలిక్కిప‌డి లేచి నా ప్లాన్స్ నాకే రివ‌ర్స్ అయ్యేలా వున్నాయి అనుకుంటుంది. ఇక నిరుప‌మ్ , స్వ‌ప్న‌లు పెళ్లి శుభ‌లేఖ హిమ వాళ్ల‌కి ఇచ్చి ఇంటికి వ‌చ్చేస‌రికి జ్వాల ఆటో ఇంటి ముందు వుంటుంది. నిరుప‌మ్‌, స్వ‌ప్న షాక్ అవుతూ కారు దిగుతారు. జ్వాల క‌ళ్ల‌నిండా నీళ్ల‌తో నిరుప‌మ్ నే చూస్తూ వుండ‌గా.. స్వ‌ప్న `ఏంటే ఏకంగా ఆటోని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టావ్ అంటుంది. నిరుప‌మ్ మాత్రం `ఏంటి జ్వాల ఇలా వ‌చ్చావ్ అంటాడు. ఇంత‌లో స్వ‌ప్న .. మెత్త‌గా అడుగుతావేంటీ.. గట్టిగా మాట్లాడ‌రా.. వెళ్ల‌మ‌ని చెప్పు.. అని ర‌గిలిపోతుంది. హ‌లో మేడ‌మ్ మీతో వెళ్ల‌మ‌ని చెప్పించుకోవాల్సిన అవ‌స‌రం నాకు లేదు. కొన్ని లెక్క‌లు తేల్చుకోవాల‌ని వ‌చ్చా` అంటుంది జ్వాల‌. వెంట‌నే స్వ‌ప్న జ్వాల పైకి చేయి లేపుతుంది.. చెంప ప‌గ‌ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇంత‌లో నిరుప‌మ్ `మ‌మ్మీ ఏంటిది` అంటూ వారిస్తాడు.. మీరు చేసిన స‌హాయానికి థ్యాంక్స్ అని, మీరు కొనిచ్చిన ఆటో ఇక నుంచి న‌డ‌ప‌లేన‌ని చెప్పి జ్వాల అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే మంగ‌ళ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే. 

బిగ్‌బాస్ 6 లో సుబ్బు సింగ్ ఎవ‌రు?

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్‌. ఇప్ప‌టికే తెలుగులో ఐదు సీజ‌న్ ల‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటీ వెర్ష‌న్ ని కూడా ఇటీవ‌లే పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ 6వ సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. సీజ‌న్ సీజ‌న్ కి విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నా అదే స్థాయిలో పాపులారిటీని, వీవ‌ర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. ఇక 6 వ సీజ‌న్ లో ఇప్ప‌టికే చాలా మంది కంటెస్టెంట్ ల ఎంపిక దాదాపుగా పూర్త‌యింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే సామాన్యుల‌కు కూడా ఈ సీజ‌న్ లో అవ‌కాశం ఇవ్వ‌బోతున్నామ‌ని నిర్వాహ‌కులు ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది ఔత్సాహికులు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టార‌ట‌. ఇప్ప‌టికే న‌టుడు వ‌డ్డే న‌వీన్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆది, అమ‌ర్ దీప్‌, దీపికా పిల్లి, వ‌ర్షిణి, యాంక‌ర్ ధ‌నుష్ ల‌తో పాటు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యాంక‌ర్ శివ‌, అనిల్‌, మిత్రా కూడా హౌస్ లోకి రాబోతున్నార‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే మొట్ట మొద‌టి సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ వ‌కీల్ సాబ్ కూడా ఎంట‌ర్ కాబోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. బిగ్ బాస్ సీజ‌న్ 6 జూలై 6 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో అడ్వ‌కేట్ సుబ్బు సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రీ సుబ్బుసింగ్ అని ఆరాతీస్తే.. పేద‌ల కోసం వంద‌ల కేసులు ఫ్రీగా వాదించార‌ట‌. సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ట‌. భ‌ర్త చ‌నిపోయిన స్త్రీలు, ఒంట‌రి మ‌హిళ‌ల కేసుల్ని ఫ్రీగా వాదించి వారికి అండ‌గా నిలిచార‌ట‌. ఆ కార‌ణంగానే ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లిలోని సిద్ధార్ధ గ్రామానికి చెందిన సుబ్బు సింగ్ కు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ల‌భించిందని చెబుతున్నారు.   

ఆసియా అంటే చ‌చ్చేంత ఇష్టం అని బ‌య‌ట‌పెట్టిన నూక‌రాజు!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎవ్రీ వీక్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలా సాగిపోతోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా సరదా సరదాగా 'పెళ్ళాం చెబితే వినాలి' అనే కాన్సెప్ట్ తో సాగిపోయింది. అందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. చివరిలో ఆసియా, నూకరాజు పరువు హత్యల మీద ఒక స్కిట్ ప్లే చేశారు. వీళ్లిద్దరికీ తల్లితండ్రులుగా శాంతికుమార్ భార్యాభర్తలు నటించారు. వీళ్ళు పెర్ఫార్మ్ చేసిన విషాద ప్రేమ కథ అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. శాంతికుమార్ కూడా ఒక తండ్రి విలన్ గా ఎలా మారతాడో చూపించాడు.  ఈ స్కిట్ గురించి  రష్మీ మాట్లాడింది. "ఇలాంటి పరిస్థితిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేయడం చాలా కష్టం" అని చెప్పింది. "మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం" అంది పూర్ణ. ఇక నూకరాజు ఆసియా గురించి తన ప్రేమను కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాడు. ఆసియా అంటే తనకు పిచ్చి, ప్రాణం, ప్రేమ అని, "ఇప్పుడు  పెళ్లి చేసుకోమన్నా చేసేసుకుంటాను" అన్నాడు. "నా కోసం తన కెరీర్ని కూడా వదిలేసుకుంది" అని చెప్పాడు నూకరాజు.  "ఈ షో చూసి మా ఇంట్లో వాళ్ళు అడిగితే ఆసియా అంటే చచ్చేంత ఇష్టం అని చెప్తాను" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆసియా కూడా "ఎప్పటికీ ఇలా కాళ్ళు పట్టుకునే రోజు కానీ, విడిపోయే రోజు కానీ రాకూడదు" అంటూ ఏడ్చేసింది. "ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉండాలి" అని నూకరాజుకి సలహా ఇచ్చింది ర‌ష్మీ. ఇలా ఈ వారం ఒక ఎమోషనల్ స్కిట్ తో పెళ్ళాం చెపితే వినాలి ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది.

ఇంట్లో కన్నా ఈవెంట్స్ లోనూ, ఇన్నోవాలోనూ ఉంటున్న అప్పారావు

'మొగుడ్స్ పెళ్లామ్స్' లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ కి చక్కని వినోదాన్ని అందిస్తోంది. ఈ ఎపిసోడ్ లో అవినాష్ యముడిగా ఒక స్కిట్ చేశాడు. పక్కనే చిత్రగుప్తుడి వేషంలో ఎక్స్‌ప్రెస్ హ‌రి కూర్చున్నాడు. "చిత్రగుప్తా! అసలు నీకా పేరు ఎందుకు వచ్చింది?" అడిగాడు అవినాష్‌. "చిన్నప్పటినుంచి చిత్రగారి పాటలు వింటూ పెరిగానని ఆ పేరు వచ్చింది" అంటూ  కామెడీ చేశాడు హరి. "ఈ పంచ్ డైలాగ్ కి పంచె పట్టుకుని  వెళ్ళిపోతాను" అంటూ నవ్వుతూ లేచెళ్లిపోయాడు అవినాష్.  "ఇంతకూ మీకు యమధర్మరాజు అని పేరెలా వచ్చింది?" అన‌డిగాడు చిత్రగుప్తుడు. "ధర్మవరంలో పుట్టాను కదా అందుకే ఆ పేరు వచ్చింది" అంటూ కామెడీ చేశాడు అవినాష్. తర్వాత చిత్రగుప్తుడు పాపులను పిలవడం స్టార్ట్ చేశాడు. అప్పారావు, సుబ్బలక్ష్మిని పిలిచాడు. "ఈవెంట్లలో తప్ప ఇంట్లో ఉండడు అప్పారావు" అని అతని మీద ఉన్న అభియోగాన్ని చెప్పాడు చిత్రగుప్తుడు.  "ఫేమ్ వచ్చిందని ఫ్యామిలీని వదిలేస్తావా?" అంటూ ఒక ప్రాస డైలాగ్ చెప్పాడు అవినాష్. "అప్పారావు ఒంటి చుట్టూ బెలూన్లు కట్టి గదతో పగలగొట్టించండి" అంటూ ఆజ్ఞాపించాడు. సుబ్బలక్ష్మి బోన్ లో నిలబడి అప్పారావు మీద కంప్లైంట్స్ చెప్పింది. "ఇంట్లో తక్కువ ఉంటాడు, ఇన్నోవాలో ఎక్కువ ఉంటాడు. నా పుట్టినరోజు తెలీదు కానీ వాట్సాప్ లో అమ్మాయిలకు బర్త్డే విషెస్ చెప్తాడు" అంది. వెంటనే అవినాష్ "జీవితంలో డబ్బే కాదు కుటుంబమూ ముఖ్యం" అన్నాడు. వెంటనే సుబ్బలక్ష్మి చేతికి కర్ర ఇచ్చి బెలూన్స్ పగలగొట్టమ‌న్నాడు. సుబ్బలక్ష్మి బెలూన్స్ ని పగలగొట్టింది. "శిక్ష ఐపోయింది కదా రూమ్ ఇస్తే రిలాక్స్ అవుతాం" అని అవినాష్ కి పంచ్ డైలాగ్ వేశాడు అప్పారావు. "ఇక ఈవెంట్స్ లో కాకుండా ఇంట్లో ఉండండి" అని సలహా ఇచ్చాడు అవినాష్. "ఇంట్లో కూడా ఉండనండి. ఎందుకంటే  బిగ్ బాస్ కి వెళ్తున్నా" అని చెప్పాడు అప్పారావు. "ఒక్కడే వెళ్లడండి.. వెంట నేను కూడా వెళ్తున్నా" అంది సుబ్బలక్ష్మి. "ఇద్దరూ కలిసి వెళ్ళండి" అని షేక్  హ్యాండ్ ఇచ్చి పంపించాడు యమధర్మరాజు అలియాస్ ముక్కు అవినాష్.

బంగారం అంటే అమ్మాయిలకు పిచ్చి అంటున్న డాక్టర్ బాబు

అమ్మాయిలకు బంగారం అన్నా, రకరకాల దుస్తులన్నా చాలా ఇష్టం. ఎన్నున్నా సరిపోవు. లేవు లేవు అంటూనే  ఉంటారు. అందుకే ఎప్పుడూ షాపింగ్ పేరుతో అన్ని కొనేస్తూ ఉంటారు. డ్రెస్ మార్చినప్పుడల్లా దానికి సరిపోయే మ్యాచింగ్  జ్యువెలరీ కోసం షాపులన్నీ జల్లెడ పట్టేస్తారు. అందుకే అమ్మాయిలతో ఎవరన్నా షాపింగ్ కి వెళ్లాలంటేనే భయపడిపోతారు. ఎన్ని సార్లు ఎన్ని షాప్స్ కి తిరిగినా వాళ్లకు అలసట అనేదే రాదు. ఇంకా ఎక్కడలేని ఎనర్జీ మాత్రం వచ్చేస్తుంది. ఇలాంటి విషయాల్లో ఇక సెలబ్రిటీస్ గురుంచి చెప్పక్కర్లేదు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, తిరిగే షాపులు లెక్కకు మించి అని చెప్పొచ్చు.ఈ విషయం మీద లేటెస్ట్ గా డాక్టర్ బాబు ఒక వీడియో చేసాడు. నిరుపమ్ భార్య మంజుల కోసం జ్యువెలరీ కొనడం కోసం ఒక షాప్ కి వెళ్లారు. ఇక అక్కడ ఏడు వారాల నగలు కొనిచ్చాడు డాక్టర్ బాబు అది రోల్డ్ గోల్డ్ జెవెల్లరీ అన్నమాట. రకరకాల మోడల్స్ చూసి అటుతిప్పి ఇటు తిప్పి కొనిపించేసుకుంటుంది మంజుల.  సంపాదించేది మీకే కదా మేమేమన్నా జ్యువెలరీ పెట్టుకుంటామా అంటూ మంజులకు కౌంటర్ కామెంట్ వేసాడు. మెడకు మంచి హారం పెట్టి ఎలా ఉంది బరువుగా ఉందా అని మంజులను అడిగేసరికి మాకు బరువు మోయడం అలవాటే ఇది మోయగలిగేంత బరువే అంటుంది. జ్యువెలరీ విషయంలో నిరుపమ్ కి ఇంతకుముందు ఐతే జీరో నాలెడ్జి కానీ ఇప్పుడు నాతో షాపింగ్స్ కి  తిరిగి తిరిగి మంచి నాలెడ్జి వచ్చేసింది అంటుంది మంజుల. ఇప్పుడు ఈ ఏడు వారాల నగల వీడియో వైరల్ అవుతోంది. ఇక నిరుపమ్ బుల్లితెర మీద డాక్టర్ బాబుగా అందరికి పరిచయమే. ఇక మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తూనే ఉంటుంది. ఇక వీళ్లిద్దరి జంట సూపర్, గుడ్ పెయిర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

భర్త గడ్డాన్ని కత్తిరించిన శ్రీవాణి!

శ్రీవాణి బుల్లి తెర మీద ఫేమస్ యాక్టర్. ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అలరిస్తోంది. శ్రీవాణి భర్త విక్రమ్, కూతురు నందిని కూడా స్మాల్ స్క్రీన్ పై అందరికీ పరిచయమే. ఐతే ఇప్పుడు శ్రీవాణి కూతురు నందినికి స్కూల్ ఓపెన్ చేసేసారు. ఐతే నందిని స్కూల్ కి వెళ్లే ముందు వాళ్ళ నాన్నకు ముద్దు పెట్టి వెళ్లడం అనేది అలవాటు. గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్న నాన్న‌ను నందిని ముద్దు పెట్టుకుంది. ఐనా నాన్న లేవడు. కానీ ముద్దు పెట్టుకునేటప్పుడు నందినికి నాన్న గడ్డం అడ్డం వచ్చి గుచ్చుకుంది. అదే విషయం తల్లి శ్రీవాణికి చెప్పింది. "ఎన్ని సార్లు చెప్పినా మీ నాన్న ఆ గడ్డాన్ని కత్తిరించుకోవట్లేదే బాబూ" అంది శ్రీ‌వాణి.  'ఐతే ఒక పని చేద్దాం మనం ఒక సైడ్ గడ్డం తీసేస్తే ఇక తప్పక నాన్న రెండో వైపు తీసేస్తాడు కదా..' అంటూ ఒక ప్లాన్ వేశారు. శ్రీవాణి కత్తెర పట్టుకొచ్చి గడ్డం నెమ్మదిగా చడీచప్పుడు కాకుండా గ‌డ్డం కత్తిరించేసింది. అలా కొంచెం కొంచెం కత్తిరించేసరికి విక్రమ్ కి మెలకువ వచ్చి చూసేసరికి ఏం అర్థం కాలేదు. ఫైనల్ గా వాళ్లిద్దరూ చేసిన విషయం చెప్పేసింది శ్రీవాణి. "నాన్నా.. ఇదంతా అమ్మ పనే నాకేం తెలీదు" అంది నందిని. "నా ప్లాన్ కాదు, నీ కూతురే ఇలా చేయమంది" అని ఇద్దరూ విక్రమ్ నుంచి తప్పించుకున్నారు. నందిని స్కూల్ కి, శ్రీవాణి షూటింగ్ కి జంప్ ఐపోయారు. ఇక తప్పక  జావేద్ సెలూన్ కి వెళ్లి జుట్టుని, గడ్డాన్ని కత్తిరించుకుని మంచి స్టైల్ గా తయారయ్యాడు విక్రమ్. తమ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే హుషారుగా ఉంటుంది అని అలాగే నందినికి ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు విక్రమ్. నందినికి మంచి పేరెంట్స్ దొరికారు అంటూ, సూపర్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గోపీచంద్‌కు ప్రసాదమిచ్చి పైసలడిగిన సుమ

సుమ హోస్ట్ చేసే క్యాష్ ప్రోగ్రాం చూస్తే చాలు టెన్షన్స్ అన్ని పోయి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ఎవరైనా. అలాంటి ఈ క్యాష్ ప్రోగ్రాం నెక్స్ట్ వీక్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఈ ప్రోగ్రాంకి పక్కా కమర్షియల్ మూవీ హీరో గోపీచంద్, మారుతీ, బన్నీ వాస్, శ్రీనివాసకుమార్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. కార్యక్రమంలో భాగంగా సినిమా బాగా ఆడాలని పూజ చేయించాం అంటూ పసుపు కుంకుమ ఉన్న ప్లేట్ గోపీచంద్ కి ఇస్తుంది. ప్రసాదం ఇచ్చి "మరి ఇదంతా చేసినందుకు నేను పక్కా కమర్షియల్ అండి మరి డబ్బులు" అని అడుగుతుంది. "మా ప్రొడ్యూసర్ ని అడగండి" అంటూ గోపీచంద్ తప్పించుకుంటాడు. ఎంత ఖర్చు అయ్యిందో ఫుల్లుగా లెక్కపెట్టుకోవడానికి కేలిక్యులేటర్ కూడా ఇచ్చేశాం లెక్కపెట్టండి అంటూ సుమ ప్రొడ్యూసర్ కి చెప్తుంది. నేను పర్సు మర్చిపోయాను అంటాడు బన్నీవాస్. స్టేజి మీదకు డైరెక్టర్ మారుతి రాగానే అతనికి  అలారం అంటగడుతుంది. ఇందాక పూజ చేయించి ప్రసాదం అది ఇచ్చాను ఆ డబ్బు బాకీ వుంది. ఇప్పుడు ఈ అలారం డబ్బులు బాకీ అంటూ మారుతిని అడుగుతుంది. మేం అడక్కుండానే అమ్మేస్తున్నారు.. డబ్బులు ఎలా ఇస్తాం అంటూ కౌంటర్ వేస్తాడు. ఇవి అమ్మే వస్తువులు  కావు వెల్కమ్ గిఫ్టులు అంటుంది సుమ. గిఫ్ట్ అని చెప్పి మరీ డబ్బులడుగుతున్నారంటూ గోపీచంద్ మరో కౌంటర్ వేస్తాడు. తర్వాత వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిస్తుంది సుమ. "ప్రపంచంలో ఎంత శాతం మంది ఏ టైంలో ఐనా తాగడానికి సిద్ధంగా ఉంటారు" అని ఒక ప్రశ్న అడుగుతుంది. ఇంత తక్కువ అని చెప్పడానికి నోరు రావట్లేదని అంటాడు శ్రీనివాస్. ఐతే ముక్కుతో చెప్పండి అంటూ మంచి పంచ్ డైలాగ్ వేస్తుంది సుమ. మారుతీ గారు మీరేమంటారు అని అడుగుతుంది.  జస్ట్ అలా మూత తీసి వాసన చూశానంటే చాలు ఆరోజు క్యాష్ ప్రోగ్రామే అంటాడు నవ్వుతూ. ఆ మాటకు సుమ వెటకారం మొహం పెట్టి అంటే నేను తాగి యాంకరింగ్ చేస్తున్నానని అంటారా క్యాష్ ప్రోగ్రాం అనేసరికి స్టేజి మీద వాళ్లంతా నవ్వేస్తారు. ఇక ఈ పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రేండింగ్ లో  ఉంది.

సుమ‌న ప్లాన్ ని న‌య‌ని ప‌సిగ‌ట్టిందా?

అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. బుల్లితెర‌పై మర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపులు, ట్విస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం. న‌య‌ని, విశాల్ ల‌కు ల‌భించిన పురాత‌న‌ పెట్టెలో ఏముందో తెలుసుకోవాల‌న్న కుట్ర‌కు తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ తెర‌లేపుతారు. ఈ విష‌యంలో న‌య‌ని చెల్లెలు సుమ‌న స‌హాయంతో ఆ పెట్టెలో వున్న ర‌హ‌స్యాన్ని తెలుసుకోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ లో భాగంగా సుమ‌న‌, విక్రాంత్ ల‌ని ఓ రోజు మొత్తం న‌యని, విశాల్ ల‌తో క‌లిసి వుండ‌మ‌ని, నైట్ అక్క‌డే స్టే చేయ‌మ‌ని చెప్పి పంపిస్తుంది తిలోత్త‌మ‌. త‌ను చెప్పిన‌ట్టుగానే విక్రాంత్ ని వెంట‌బెట్టుకుని న‌య‌ని ఇంటికి వెళుతుంది. వున్న‌ట్టుండి సుమ‌న - విక్రాంత్ లు ఎందుకు వ‌చ్చారో అర్థం చేసుకోలేని న‌య‌ని వారి రాక‌తో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంది. అంతా క‌లిసి భోజ‌నం చేశాక క‌బుర్లు చెప్పుకుంటూ ప‌డుకుంటారు. అంతా నిద్ర‌పోయాక సుమ‌న త‌న ప్లాన్ ప్ర‌కారం న‌య‌ని - విశాల్ లు వెలికి తీసిన పెట్టె లాక్ తీయ‌డం మొద‌లు పెడుతుంది. ఇంత‌లో విక్రాంత్ దొంగ దొంగ అంటూ క‌ల‌వ‌రించ‌డం మొద‌లు పెడ‌తారు.. దీంతో విశాల్ - న‌య‌ని ఏం జ‌రిగిందా? అని అటు ఇటు వెతుకుతుంటారు. ఇంత‌లో న‌య‌నికి అనుమానం వ‌స్తుంది. ఇంత‌కీ మా చెల్లి ఏది అని అడుగుతుంది.. సుమ‌న పెట్టె వెన‌కాల న‌క్కి దొరికిపోయాన్రా దోవుడా? అని భ‌యంతో వ‌ణికిపోతూ వుంటుంది. ఇంత‌కీ సుమ‌న ప్లాన్ ని న‌య‌ని ప‌సిగ‌ట్టిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

అనుకు ఆర్య వ‌ర్ధ‌న్ చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రేటింగ్ ప‌రంగానూ దూసుకుపోతోంది. స‌రికొత్త క‌థ క‌థ‌నాల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ఎండింగ్ ద‌శ‌కు చేరుకుంది. ఇందులో శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనుషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, జ్యోతిరెడ్డి త‌దిత‌రులు న‌టించారు.   ఆర్య వ‌ర్ధ‌న్ అనుభ‌విస్తున్న ఆస్తి మొత్తం త‌న అక్క రాజ‌నందినిదేన‌ని, అయితే ఆ ఆస్తిని త‌న‌కు రాసి ఇచ్చింద‌ని రాగ‌సుధ ఫోర్జ‌రీ చేసిన డాక్యుమెంట్ లు చూపించి ఆర్య‌ను ఇర‌కాటంలో పెడుతుంది. అయితే వాటి ఆధారంగా ఆస్తి రాగ‌సుధ‌కే చెందుతుంద‌ని తీర్పు ఇచ్చే స‌మ‌యంలో ఆర్య వ‌ర్ధ‌న్ త‌రుపు లాయ‌ర్ నా క్లైంట్ కి చివ‌ర‌గా ఒక్క అవ‌కాశం ఇవ్వండ‌ని, త‌గిన ఆధారాల‌తో నిరూపిస్తామ‌ని కోర‌తాడు. దీనికి న్యాయ‌మూర్తి ఓకే అంటాడు. నెల రోజుల గ‌డువు కోరితే ఆర్య మాత్రం జ‌స్ట్ వ‌న్ డే చాలంటాడు. త‌ను కోరిన ప్ర‌కార‌మే ఒక్క రోజు గ‌డువు ఇస్తాడు. క‌ట్ చేస్తే బ‌స్తీ వాసులు ఆర్య‌ని మ‌ళ్లీ క‌స్ట‌డీకి అంగీక‌రించేది లేదంటూ పోలీస్టేష్ ఎదుట ఆందోళ‌న‌కు దిగుతారు. సుబ్బు చెప్పినా ప‌ట్టించుకోకుండా స్టేష‌న్ ని చుట్టుముడ‌తారు. దీంతో అక్క‌డికి వ‌చ్చిన ఆర్య ఆశ్చ‌ర్య‌పోతాడు. ద‌య‌చేసి శాంతించండి అని చెబుతాడు. అయినా విన‌క‌పోవ‌డంతో అను వ‌చ్చి స‌ర్ధి చెబుతుంది. ఇదే స‌మ‌యంలో ఆర్య‌ని కాపాడుకోలేక‌పోతున్నాన‌ని కుమిలిపోతుంది. నేను మీకు  త‌గ‌ను, మ‌ళ్లీ బ‌స్తీకే వెళ్లిపోతాను అంటుంది. అప్పుడు అనుకు ఆర్య ఓ ర‌హ‌స్యం చెబుతాడు. వెంట‌నే ఇంటికి వెళ్లిన అను.. హ‌త్య చేయ‌డానికి మార‌నాయుధం..తో పాటు మ‌రి కొన్ని ప్రాప‌ర్టీస్ కావాల‌ని నీర‌జ్ తో అంటంది. అది విని నీర‌జ్ తో పాటు ఆర్య త‌ల్లి ఆర్చ‌ర్య‌పోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   Anu to Execute a Masterplan,Prema Entha Maduram Serial Today episode,Prema Entha Maduram ,Anu,Arya Vardhan,Raga Sudha

పింక్ లో స్మైలింగ్ అనసూయ

అనసూయ ఈ మధ్య స్పీడ్ బాగా పెంచింది. యాంకర్స్ అందరిలోకి అనసూయ కొంచెం డిఫరెంట్. అందానికి అందం, మంచి నవ్వు, ఎవరేమన్నా అంటే కౌంటర్ ఇచ్చి పడేసే ఆటిట్యూడ్ , ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసే తత్త్వం వెరసి హోమ్లీ అనసూయ. బుల్లితెర మీద చిన్నా చితక యాంకరింగులు చేసుకునే అనసూయకు టర్నింగ్ పాయింట్ జబర్దస్త్ వల్ల వచ్చింది. ఇక అంతే అప్పటినుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు అనసూయ. ఈమె డ్రెస్సింగ్ స్టైల్ మీద ఎన్నో రూమర్స్, కామెంట్స్ వచ్చినా అరే చోడ్ దో అనుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. తర్వాత మూవీ ఇండస్ట్రీకి కూడా వెళ్లి అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది. అనసూయ ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఫాన్స్ తో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీపం ఉన్నంత వరకే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతకు అనసూయకి సరిపోతుంది. అది, ఇది అనే  రెస్ట్రిక్షన్స్ లేకుండా తన రోల్ ఎలివేట్ అయ్యే అన్ని షోస్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ డ్రస్సుల్లో అనసూయ ఇంకా క్యూట్ గా కనిపిస్తూ అలరిస్తోంది. షూటింగ్స్ కోసం కాస్ట్యూమ్స్ తో రెడీ ఐన వెంటనే ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసేస్తుంది. అనసూయకు ఇప్పుడు చేతినిండా షోస్, మూవీస్ చేస్తూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తోంది. వీటితో పాటు ఫామిలీ లైఫ్ ని కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తోంది. పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న పొట్టి దుస్తుల్లో అనసూయ లుక్స్ చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి.ఇప్పుడు బుల్లి తెర పై గ్లామర్ ఐకాన్ గా అనసూయ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అనసూయ సూపర్ సింగర్ జూనియర్ షోలో సుధీర్ తో కలిసి హోస్ట్ గా చేస్తోంది. వెరీ బ్యూటిఫుల్, వన్ అండ్ ఓన్లీ స్మిలింగ్ క్వీన్, మిస్ బ్యూటీ అంటూ నెటిజన్స్ ఈమె న్యూ లుక్ కి కామెంట్స్ ఇచ్చేస్తున్నారు.  

న‌య‌ని - విశాల్ వెలికి తీసిన పెట్టెలో ఏముంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌యని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌ర ముల‌పుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ తో అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇతర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. సోమ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఇప్ప‌డు చూద్దాం. పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలోని స్థ‌లంలో పౌర్ణ‌మి రోజు పూజ చేసి నాగ‌లితో విశాల్ , న‌య‌ని దున్నేస్తారు. అయితే పున్న‌మి చంద్రుడు వ‌చ్చాక అద్దంలో గాయ‌త్రీదేవి చెప్పిన కాగితాన్ని చూస్తారు. అందులో ఏ స్థ‌లంలో చెట్టుకు డ‌బ్బులు కాస్తాయో వివ‌రంగా వుంటుంది. దాంతో ఓ చోట ఇద్ద‌రు క‌లిసి త‌వ్వ‌డం మొద‌లు పెడ‌తారు. ఈ విష‌యంలో అనుమానంగా వున్న క‌సి చాటుగా వారిని గ‌మ‌నిస్తూ వీడియో తీస్తూ వుంటుంది. చివ‌రికి మ‌ట్టి మొత్తం పైకి తీయ‌డంతో అక్క‌డ ఓ పురాత‌న‌మైన పెట్టె క‌నిపిస్తుంది. దాన్ని న‌య‌ని, విశాల్ బ‌య‌టికి తీస్తారు. అయితే దానికి లాక్ వుండ‌టంతో ఏమీ చేయ‌లేక ఇంట్లోకి తీసుకెళ‌తారు. ఈ విష‌యాన్ని క‌సి తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ‌ల‌కు వివ‌రిస్తుంది. తను తీసిన వీడియోని చూపిస్తుంది. అందులో ఏముందో తెలుసుకోవాలంటే న‌య‌ని చెల్లెలు సుమ‌న‌ని రంగంలోకి దించాల్సిందేన‌ని ప్లాన్ చేసిన తిలోత్త‌మ ఒక్క నైట్ స్టే కోసం సుమ‌న‌, ఆమె భ‌ర్త ని న‌య‌ని ఇంటికి పంపిస్తుంది. న‌య‌ని ఇంటికి వెళ్ల‌గానే బ‌య‌టికి తీసిన బాక్స్ గురించి సుమ‌న ఆరా తీయ‌డం మొద‌లు పెడుతుంది. దీంతో విశాల్, న‌య‌ని షాక్ అవుతారు. ఈ బాక్స్ గురించి ఎవ‌రికీ తెలియ‌దు.. నీకెలా తెలిసిందంటారు.. ఇక తిలోత్త‌మ చెప్పిన‌ట్టే సుమ‌న అంతా ప‌డుకున్నాక ఆ పెట్టెలో ఏ ముందో తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? న‌య‌ని ఏం చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

కైలాష్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన వేద‌

స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ న‌టించారు. పేమ‌గా తీసుకొచ్చిన గౌన్ వేసుకుంటే య‌ష్ చెప్పాపెట్టకుండా ముంబై వెళ్లిపోయాడ‌ని వేద ఫీల‌వుతూ వుంటుంది. అయితే య‌ష్ మాత్రం త‌న ద‌గ్గ‌రికే వ‌చ్చి ష‌ర్ట్ బ‌ట‌న్ ఊడింద‌ని చెబుతాడు. ఆ త‌రువాత నేను కుట్టేస్తాను గా అంటూ వేద బ‌ట‌న్ కుట్ట‌డం మొద‌లు పెడుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ మూడ్ మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే.. వేద‌ని ఆ డ్రెస్ లో చూసిన కైలాష్ భ‌లే దొరికావ్ వేద‌.. య‌ష్ రెండు రోజుల వ‌ర‌కు ముంబై నుంచి తిరిగి రాడు.. ఈ స‌మ‌యాన్ని అనుకూలాంగా మార్చుకుని నిన్ను సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేస్తాడు. వేద ఒంట‌రిగా వున్న స‌మ‌యం చూసుకుని త‌న బెడ్రూమ్ లోకి ప్ర‌వేశిస్తాడు. ఆద‌మ‌రిచి వున్న వేద‌ని కౌగిలించుకుంటాడు. ఏం జ‌రుగుతోందో ప‌సిగ‌ట్టిన వేద వెంట‌నే తేరుకుంటుంది. హాల్లోకి ప‌రుగున వ‌చ్చి య‌ష్ త‌ల్లికి విష‌యం చెప్ప‌బోతూ ఎమోష‌న‌ల్ అవుతుంది. ఏం జ‌రిగింది వేద అని య‌ష్ త‌ల్లి మాలిని అడ‌గ‌డంతో వావి వ‌రుస‌లు మ‌రిచి నన్ను కైలాష్ కౌగిలించుకుని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌బోయాడ‌ని, నీచంగా బిహేవ్ చేశాడ‌ని ఏడుస్తూ చెబుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? కైలాష్ చేసిన ప‌నికి మాలిని ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

సుధీర్ కోసం ఇంద్ర‌జ ఎందుకు ఏడ్చింది?

న‌టి ఇంద్ర‌జ బుల్లితెర‌పై జ‌డ్జిగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. మ‌ల్లెమాల‌కు చెందిన `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` కామెడీ షో ద్వారా ఇంద్ర‌జ ఫుల్ టైమ్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవ‌డంతో ఇంద్ర‌జ కూడా త‌ప్పుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె జ‌బ‌ర్ద‌స్త్ షోలో రోజా ప్లేస్ లో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంద్ర‌జ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడారు. జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవ‌డంతో ఇంద్ర‌జ చాలా మిస్స‌య్యాన‌ని ఎమోష‌న‌ల్ అయింది. `ఎక్స్ ట్రాజ‌బర్ద‌స్త్‌` షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవ‌డంపై కెవ్వు కార్తీక్ ఓ స్కిట్ చేశాడు. "సుధీర్ లా కార్తీక్‌ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకునే టైమ్ లో ఒక్క‌సారిగా ఏడ్చేశాను. క‌న్నీళ్లు ఆపుకోలేకపోయాను. సుధీర్ ను నేను సిద్ధూ అని పిలుస్తా. చాలా మిస్ అయ్యా. న‌న్ను ప్రేమ‌గా రాజీ అని సుధీర్ పిలుస్తాడు. అత‌ను అమ్మ అని పిల‌వ‌డం చాలా హ్యాపీగా వుంటుంది. అమ్మా అని పిలిపించుకోవ‌డం చాలా ఇష్టం. జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు ప్ర‌వీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకు. చాలా మంచి అబ్బాయి. అత‌నికి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చా.." అని తెలిపింది ఇంద్ర‌జ‌.  త‌న పిల్ల‌ల పెళ్లి విష‌యంలో తాను ఇన్వాల్వ్ కాబోన‌ని చెప్పుకొచ్చారు ఇంద్ర‌జ‌. పెళ్లి విష‌యం పూర్తిగా వాళ్ల ప‌ర్స‌న‌ల్ అని అన్నారు. పెళ్లికి ముందే ఆరేళ్ల పాటు మా ఆయ‌న‌తో నాకు మంచి ప‌రిచ‌యం వుండేద‌ని, త‌న గురించి అన్నీ తెలుసుకున్నాకే వివాహం చేసుకున్నామ‌ని తెలిపింది. త‌న భ‌ర్త త‌మిళంలో ప‌లు సీనియ‌ల్స్ లో న‌టించార‌ని, కొన్ని సినిమాల‌కు స్క్రిప్ట్ కూడా రాశార‌ని చెప్పారు. తామిద్ద‌రం ఎప్పుడూ క‌లిసి ప‌ని చేయ‌లేద‌ని తెలిపారు.

మొదటిసారి బేరాలాడకుండా పుచ్చకాయముక్క కొన్న వసు

వసుధారా జరిగిన విషయం గురుంచి ఆలోచిస్తూ వెళుతూ ఉంటుంది. ఇంతలో జగతి వచ్చి మాట్లాడబోతుంది. వసు ఏమో జరిగిన విషయం గురుంచి చెప్పబోయేంతలో రిషి అక్కడికి వస్తాడు. మినిస్టర్ గారి దగ్గరకు ఫైల్ తీసుకుని మీరు, మీ స్టూడెంట్ వెళ్ళండి మేడం అని చెప్తాడు. మీరు వెళ్లడమే కరెక్ట్ రిషి సర్ అని జగతి అంటుంది. రిషి సరే అంటాడు. ఐతే మీ స్టూడెంట్ కి రెడీగా ఉండమని చెప్పండి కారు దగ్గర వెయిట్ చేస్తాను అంటాడు. జగతి వసూకి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తుంది. తర్వాత జగతి తన వర్క్ లో పడిపోతుంది. ఇంతలో దేవయాని ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని వెటకారమాడుతుంది. ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుంచి కాలేజీ కి వచ్చాను అప్పుడే ఏమైపోతానని అలా అడుగుతున్నారు అని కౌంటర్ ఇస్తుంది. అక్కడ మహేంద్ర ఉన్నాడా అంటుంది. రెండు నిమిషాలు నీతో మాట్లాడాలి అని స్వరం తగ్గించి కొద్ది రోజులుగా రిషి ఎందుకో డల్ గా ఉంటున్నాడు అంటుంది. నేనూ గమనించాను అక్కయ్య అంటుంది జగతి. గమనిస్తే సరిపోదు తెలుసుకోవాలి కదా అంటుంది. రిషి స్కూల్ పిల్లాడు కాదు కాలేజీ ఎండి అంటుంది జగతి.  రిషి విషయం తెలుసుకోవడానికి నీ శిష్యురాలి సలహా తీసుకోకపోయావా అంటుంది. వెంటనే జగతి దేవయానికి గట్టిగా రిటార్ట్ ఇస్తుంది. ఇంకో వైపు రిషి, వసు కారులో వెళ్తుంటారు. మినిస్టర్ గారి దాగరకు వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురుంచి చెప్తారు. తర్వాత జగతికి మినిస్టర్ కాల్ చేస్తారు. రిషి లాంటి కొడుకుని కన్నందుకు అభినందించాలి అంటూ పొగుడుతారు. ఇక మినిస్టర్ దగ్గర నుంచి రిషి , వసు రిటర్న్ అవుతారు. ఆకలిగా ఉందని చెప్పి పుచ్చకాయ బండి దగ్గర ఆగుతారు. రెండు పుచ్చకాయ ముక్కలు ఇమ్మని అడుగుతుంది వసు. ఏమిటి బేరాలేమీ ఆడట్లేదు అంటాడు సరదాగా ఆటపట్టిస్తూ. డబ్బులు ఇచ్చేది మీరేగా ... బేరాలాడడం ఎందుకని అంటూ చెప్తుంది వసు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పుచ్చకాయ తింటూ ఉంటారు. అప్పుడు రిషి మూతికి పుచ్చకాయ ముక్క అంటుకుంటుంది దాన్ని ఫోటో తీసి చూపిస్తుంది రిషికి. మిగతా హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ చూడాల్సిందే.

ఫేక్ డాక్యుమెంట్స్ తో లోన్ తీసుకున్న తులసి

తులసిని తెలివిగా మోసం చేసాను అనుకుంటూ లోలోపల ఫుల్ ఖుషీగా ఉంటుంది లాస్య. లాస్య ఆనందాన్ని చూసి ఏమిటని అడుగుతాడు. తులసి రోడ్డున పడిన విషయం చెప్తుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యింది కానీ వాటిని ఎవరో కాజేశారని చెప్తుంది. నందు కూడా చాలా సంతోషంగా వెళ్లి తులసిని పలకరించి వద్దామా అని మళ్ళీ వద్దులే అని మనసు మార్చుకుంటాడు. తులసిని కాపాడడానికి అంకిత పక్కనే వుంది కదా వద్దులే అంటుంది లాస్య. ఇంకోవైపు తులసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎవరినైనా  లాయర్ ని కలిస్తే బాగుంటుంది అంటుంది. ఎందుకు అల్లుడే ఉన్నాడుగా చెపుదాం అంటుంది అనసూయ. వద్దు అందరికీ ఈ విషయం తెలిస్తే బాగోదు అంటుంది తులసి. తులసి ఇంట్లో ఉన్న శృతికి ప్రేమ్ నుంచి ఫోన్ వచ్చేసరికి ఇంటికి బయల్దేరుతుంది. ఆ బ్రోకర్ గాడు నాకు కనిపిస్తే వాడిని చితక్కోటేస్తాను అంటుంది అనసూయ. ఐనా మోసం చేసి ఏం బాగుపడతాడులే అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నందు అవును ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది అంటూ తులసి వైపు కోపంగా చూస్తాడు. ఫ్యాక్టరీ తీసుకున్నావ్ వదిలేసావ్, నాన్న ఆపరేషన్ కోసం అప్పు చేసావ్ వదిలేసావ్. చివరికి ఇల్లు కూడా నీవల్లే పోయింది ఐనా నీకు అహంకారం తగ్గలేదు అంటాడు. ఇప్పుడు ఈ బ్యాంకు లోన్ విషయం ఇలా జరిగింది ఐనా నీకు బుద్ది రాదు అంటాడు. నా లోన్ నా ఇష్టం అని గట్టిగా నందుకు వార్నింగ్ ఇస్తుంది తులసి. మరో వైపు ప్రేమ్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక శృతి అవస్థలు పడుతూ ఉంటుంది. ఇక లాస్య ఊరుకోకుండా బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి తులసి ఫేక్ డాక్యుమెంట్స్  పెట్టి లోన్ తీసుకున్న విషయం చెప్తుంది .. ఇక సీరియల్ లోని మిగతా హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ చూడాల్సిందే.

బులెట్ సాంగ్ కి బాయ్‌ఫ్రెండ్‌తో సిరి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్

సండే వస్తే చాలు బుల్లితెర మీద రకరకాల షోస్ అలరిస్తూ ఉంటాయి. చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నంత ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటాయి. అలాంటి షోస్ లోకి మొగుడ్స్ పెళ్లామ్స్ షో ఇప్పుడు సూపర్ స్పీడ్ తో బ్రేకుల్లేకుండా దూసుకెళ్ళిపోతోంది. ఇంక ఈ వారం జంటలన్నీ వారేవా అనేలా డాన్సులు చేయడమే కాదు.. గేమ్స్ కూడా పోటాపోటీగా ఆడాయి. ఇక ఈ ఎపిసోడ్ లో సిరి హన్మంత్ రెడ్ కలర్ డ్రెస్ లో శ్రీహాన్ తో జోడిగా మంచి కిక్ ఇచ్చే డాన్స్ చేసి స్టేజి దుమ్ము దులిపేసింది. ఈ జోడికి బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయకముందే సిరికి మంచి క్రేజ్ ఉంది. ఇక సిరికి జోడి గా వార్తల్లోకి ఎక్కిన శ్రీహాన్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఒక్క రోజు బిగ్ బాస్ స్టేజి మీద కనిపించేసరికి ఆడియన్స్ అంతా అతని ఆటిట్యూడ్ కి మస్త్ ఫిదా ఇపోయారు. అలా సిరి కంటే కూడా ఇప్పుడు శ్రీహన్ ఎక్కువ క్రేజ్ ని, ఇమేజ్ ని సంపాదించుకున్నాడని చెప్పొచ్చు.   స్టార్ మా సీరియల్స్ జోడీలు, బిగ్ బాస్ జోడీలను షోకి తీసుకొచ్చి 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే ఈవెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 'జానకి కలగనలేదు', 'గుప్పెడంత మనసు', 'గోరింటాకు' టీమ్స్ వచ్చి జోడి డాన్స్ పెర్ఫామ్ చేశారు. 'మగధీర' స్టైల్లో వసు, రిషి ఇద్దరు మంచిగా డాన్స్ చేయగా, 'జానకి కలగనలేదు' నుంచి అమరదీప్, ప్రియాంక రొమాంటిక్ డాన్స్ చేసి ఇరగదీసాడు. వీళ్ళతో పాటు సిరి, శ్రీహాన్ కూడా "కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు" సాంగ్ కి డాన్స్ చేసి వావ్ అనిపించారు. ఇక ఈ జోడి ఎన్నో వెబ్ సిరీస్ లో కూడా కలిసి యాక్ట్ చేశారు. కానీ బుల్లితెర మీద  కలిసి డాన్స్ చేయడం ఇదే మొదటిసారి. వీళ్లిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇప్పుడు ఈ జోడి పెర్ఫార్మెన్స్ చూసేసరికి అంతా తూచ్ అని చెప్పినట్టుగా అనిపిస్తోంది.