'ఆర్ఆర్ఆర్' చూసి చిరంజీవికి మెసేజ్ పంపించిన రాధ!

'బిబి జోడి' ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తోన్న డ్యాన్స్ షో అని అందరికి తెలిసిన విషయమే. ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి చేస్తుండగా జడ్జిలుగా సదా, తరుణ్ మాస్టర్, రాధ వ్యవహరిస్తున్నారు.  శనివారం రాత్రి ప్రసారమైన ఈ‌ ప్రోగ్రామ్ లో సూపర్ స్టార్ రౌండ్ జరిగింది. ‌ఈ రౌండ్ లో డ్యాన్స్ చేసే బిబి‌ జోడిలు ఒక సూపర్ స్టార్ ని సెలెక్ట్ చేసుకొని ఆ హీరోకి సంబంధించిన మ్యానరిజం, ఇంకా డ్యాన్స్ చేయవలసి ఉంటుంది. ఇక మొదటి డ్యాన్స్ జోడిగా కౌశల్, అభినయశ్రీ వచ్చి.. రామ్ చరణ్ ని సూపర్ స్టార్ గా తీసుకొని పర్ఫామెన్స్ చేసారు. వీరి డ్యాన్స్ తర్వాత శ్రీముఖి పర్ఫామెన్స్ గురించి జడ్జ్ లను అడుగగా మొదట తరుణ్ మాస్టర్ బాగుందని చెప్పాడు. ఆ తర్వాత రాధ తన అభిప్రాయం చెప్తూ... "రామ్ చరణ్ ని చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. కొందరు హీరోలు ఒకటి రెండు హిట్స్ వచ్చాక రిలాక్స్ అవుతారు.. కానీ రామ్ చరణ్ అలా కాదు.. ఒక్కో సినిమాకి ఇంకా కష్టపడుతూ తనని తాను మెరుగుపర్చుకుంటున్నాడు. మొన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో అతని యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేసాడు. అది చూసి రామ్ చరణ్ గురించి చిరంజీవికి ఒక పెద్ద మెసేజ్ పంపించాను. అంత పెద్ద మెసేజ్ నేను ఇప్పటివరకు ఎవరికి పంపించలేదు" అని రాధ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జోడీగా సూర్య, ఫైమా సూపర్ స్టార్ గా ప్రభాస్ ని ఎన్నుకొని డ్యాన్స్ చేసారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ ని సూపర్ స్టార్ గా తీసుకొని చైతు, కాజల్  జోడి పర్ఫామెన్స్ చేసారు. అఖిల్, తేజస్విని జోడి స్టార్ గా మహేష్ బాబుని ఎన్నుకొని డ్యాన్స్‌ చేసారు. ఆ తర్వాత స్కోర్ లో కౌశల్, అభినయశ్రీ జోడీ లీడింగ్ స్థానంలో ఉన్నారు. డేంజర్ జోన్ లో‌ అఖిల్, తేజస్విని ఉన్నారు. ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఈ జోడీలలో నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారో తెలుస్తుంది.

మోనితని పెళ్ళి చేసుకోమని డాక్టర్ బాబుకి చెప్పిన దీప!

'కార్తీక దీపం'  సీరియల్ శుభం కార్డుకి ఇంకా ఒక్కరోజే ఉండడంతో..  క్లైమాక్స్ ఎలా ఉంటుదోననే సస్పెన్స్ అందరిలోను నెలకొంది. కాగా ఇప్పుడు ఈ సీరియల్ ఎపిసోడ్ -1568 లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. దీపకి ఫోన్ చేస్తాడు వారణాసి. "మోనిత ఇంకా హిమ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు" అని చెప్తాడు. వారణాసి అలా చెప్పడంతో అందరూ మోనిత ఇంటికి బయలుదేరుతారు. వెళ్తున్న దారిలో.. "మోనిత నీ కోసం ఎంతకైనా తెగిస్తుంది. నేను వెళ్ళాక కూడా మిమ్మల్ని ఇలాగే టార్చర్ చేస్తుంది. నా చివరి కోరిక ఉంది అదైనా తీరుస్తారా?" అని దీప అంటుంది. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. నీతోనే నేను. అది భూమ్మీదైనా, స్వర్గంలోనైనా" అని కార్తీక్ చెప్తాడు. మోనిత ఇంటికి అందరూ వెళ్తారు. హిమ తలపై గన్ పెట్టి బెదిరిస్తుంది మోనిత. అది చూసి భయంతో దీప కింద పడిపోతుంది. అయినా మోనిత కొంచెం కూడా కనికరం లేకుండా.. "నాకు రెండు కోరికలు ఉన్నాయి.. ఒకటి కార్తీక్ ని పెళ్ళికి ఒప్పించడం.. ఇంకొకటి దీప నోటితో నన్ను డాక్టర్ బాబు భార్య అని చెప్పాలి" అని తన కండిషన్స్ చెప్తుంది.  తను చెప్పమన్నట్లు చెప్పకుంటే హిమని చంపేస్తానని బెదిరిస్తుంది. "నేను పోయాక ఎవరినో ఒకరిని చేసుకుంటారు కదా.. అదేదో మోనితనే పెళ్లి  చేసుకోండి డాక్టర్ బాబు" అని దీప అనగానే మోనిత ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. కార్తీక్, సౌందర్య ఇద్దరు "తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు దీప" అని చెప్తూ ఉంటారు. అంతలోనే తొందరగా మోనిత దగ్గరికి వెళ్ళి తన చేతిలోని రివాల్వర్ తీసుకుంటుంది దీప. ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజీవ్ కి చక్రపాణి వార్నింగ్!

'గుప్పెడంత మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్-666 లోకి అడుగు పెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. రిషి వసుధారలు గెస్ట్ హౌస్ లో ఉన్న విషయం తెలిసి దేవయాని.. "అసలు మీకెలా తెలుసు వాళ్ళు అక్కడ ఉన్నట్లు" అని మహేంద్రని అడుగుతుంది. అలా అనగానే వసుధార పంపిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు మహేంద్ర. "ఇప్పుడు ఆ వసుధార మన బాధ్యతలు గుర్తు చేస్తుందా.. నిజంగానే రిషిని మీరు పట్టించుకోవడం లేదు. చిన్నప్పుడు జగతి రిషిని వదిలేసి వెళ్తే.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు వసుధార వల్ల రిషి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు" అని అంటుంది. అంతలోనే రిషి జగతికి ఫోన్ చేసి మేడం తొందరగా కాలేజీకి రండి మాట్లాడాలి అంటాడు. దానికి సరే అని బయలుదేరుతుంది. మరో వైపు చక్రపాణికి ఫోన్ చేస్తాడు రాజీవ్. తనది తప్పేం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినా.. వినకుండా చక్రపాణి రాజీవ్ ని తిడతాడు. "నువ్వు నా కళ్ళ ముందు లేవు కాబట్టి బ్రతికిపోయావు.. లేదంటే నిన్ను చంపేసేవాణ్ణి" అని చక్రపాణి అంటాడు. "నన్ను మీరు చంపలేరు మామయ్య.. ఎందుకంటే మీరు చాలా మంచివారు‌. ఒకసారి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగాలని ఉంది" అని అనగానే చక్రపాణి ఫోన్ కట్ చేస్తాడు. "వసుధారకి బాక్స్ ఇవ్వండి" అని రిషికి ఇస్తుంది పుష్ప. అంతలోనే రిషి దగ్గరికి జగతి వస్తుంది. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. "నీ ఫ్లాట్  తాళం చెవి వసుధారకి ఇవ్వు. ప్రాజెక్ట్ హెడ్ గా తనకి ఫెసిలిటీస్ కల్పించడం మన బాధ్యత" అని జగతి చెప్తుంది.  రిషి, వసుధార ఇద్దరు మళ్ళీ ఎక్కడ ఒకటి అవుతారోనని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. రాజీవ్ కి ఫోన్ చేసి " ఏరా ఎక్కడ చచ్చావ్" అని అనగానే .. "ఏరా అంటున్నావ్ ఏంటి" అంటూ కోపంతో మాట్లాడుతాడు రాజీవ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణని ఒక్క మాట కూడా అనే రైట్ నీకు లేదు ముకుంద!

'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ ఇప్పుడు 60వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణని మహాలక్ష్మిలాగా రెడీ చేసి తీసుకొస్తుంది రేవతి. అందరూ కృష్ణని చూస్తు అలాగే ఉండిపోతారు. నీ కోడలు ఎలా ఉంది పెద్దమ్మ అని మురారి అడగగానే.. తనకేంటి బాగానే ఉంటుందని భవాని చెప్తుంది. పూజ పూర్తి అయిన తర్వాత అందరికి హారతి ఇస్తూ వస్తుంటుంది కృష్ణ. హారతి తీసుకో ముకుంద అని అంటుంది. "ఇవి నా నగలు నువ్వు ఎందుకు వేసుకున్నావ్.. నా పెళ్ళికి భవాని అత్తయ్య నాకు ఇచ్చినవి.. నన్ను అడుగకుండా ఎందుకు వేసుకున్నావ్" అని ముకుంద అంటుంది. అలా అనగానే రేవతి మధ్యలో కలుగజేసుకొని "ఆ నగలు ఇంటి కోడళ్ళలో ఎవరైనా పెట్టుకోవచ్చు.. ఆ మాత్రానికే ఇంత రాద్దాంతం చేయాలా?" అని రేవతి ప్రశ్నిస్తుంది. "నాకు ఒక మాట చెప్పాలి కదా.. మీకు కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు కదా" అని ముకుంద అంటుంది. "మాటలు మర్యాదగా రానివ్వు.. మా అత్తయ్య గారిని ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను" అని కృష్ణ అంటుంది.  ఇదంతా చూస్తున్న  భవాని ఆపండి... ఏంటీ ముకుంద నీకు సంస్కారం లేదా చిన్నా పెద్ద తేడా లేకుండా ఆ మాటలు ఏంటీ అని ముకుందని అడుగుతుంది. నగలు తీసుకునేటప్పుడు ఒక మాట అడగాలి కదా అని రేవతిని అంటుంది. "అసలు విషయం నగల గురించి కాదు అత్తయ్య ఇంట్లో నా ఉనికి గురించి.. ఇంటికి పెద్ద కోడలు అయినా కూడా పూచిక పుల్లను చూసినట్లు చూస్తారు. కూర్చున్న ప్లేస్ నుండి లేపుతారు.. ఎదురుగా వస్తే ఎందుకు వచ్చావ్ అంటారు" అంటూ ముకుంద ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. దీనంతటికి కారణం నువ్వే వెళ్లి ముకుందని సముదాయించు అని కృష్ణని పంపిస్తుంది. కృష్ణతో పాటుగా మురారి కూడా వెళ్తాడు.  ముకుంద వాళ్ళని చూసి గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. సహనం కోల్పోయిన మురారి కోపంతో ముకుందకి చెప్తాడు.‌ "కృష్ణని ఒక్క మాట కూడా అనే రైట్ నీకు లేదు ముకుంద" అని చెప్పి అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు. బెడ్ మీద పడుకొని ముకుంద చేసింది తప్పు అని కృష్ణ, మురారిలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ముద్దులే ముద్దులు...కాబోయే భర్తపై రష్మీ క్లారిటీ

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తూ వస్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంచుకున్న కాన్సెప్ట్ 'వింటర్ హనీమూన్ కాంటెస్ట్'.  రాబోయే ఎపిసోడ్ లో రష్మీ, హైపర్ ఆది, నరేష్ ఇతర కమెడియన్లు ఎప్పటిలాగే తమ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో   రియల్ లైఫ్ కపుల్స్ పార్టిసిపేట్ చేసి రొమాన్స్ చేశారు. వాళ్ళల్లో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కపుల్ కూడా ఉన్నారు. ఇంకొంతమంది డాన్స్ మాస్టర్స్ తమ తమ బెటర్ హాఫ్స్ తో  వచ్చారు.  రొమాంటిక్ కపుల్స్ తో దగ్గర ఉండి హనీమూన్ స్కిట్స్ చేయించారు హైపర్ ఆది, రష్మీ. రొమాన్స్ చేస్తున్న జంటలపై  ఆది కామెడీ పంచ్ లు వేయడం.. జడ్జి ఇంద్రజ.. "రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు" అని కామెంట్ చేయడం ఆకట్టుకుంది.  ఇక కపుల్స్ మధ్యలో యాంకర్ రష్మి అలాగే హైపర్ ఆది ఇద్దరూ ఒక పేపర్ వేసి పెదాలతో ఆ కాగితాన్ని  పట్టుకోమని పోటీ పెట్టారు. ఇక సెలబ్రిటీ జంటలు గేమ్ ఆడుతూ ఉంటే మధ్యలో "పేపర్ ఆగినా నువ్వు ఆగేలా లేవు" అంటూ అర్జున్ అంబటి మీద హైపర్ ఆది పంచ్ వేసాడు. ఆ పేపర్ మిస్ అయ్యేసరికి  ఒకరినొకరు ముద్దులు కూడా పెట్టేసుకున్నారు. ఆది పక్కన ఉన్న లేడీ కమెడియన్ "ఈ చలిలో నాకు పెదాలు పగిలిపోతున్నాయి, చేతులు పగిలిపోతున్నాయి..నువ్వు పట్టించుకోవడం లేదు" అనేసరికి "నువ్వు పగిలిపోవడం గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇక్కడ రగిలిపోవడం గురించి నువ్వు ఆలోచించట్లేదు" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక సింగర్ గణేష్ సాంగ్ పాడి అందరినీ అలరించాడు. కేరళ అమ్మాయి గెటప్ తో నాటీ నరేష్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎపిసోడ్ లో రష్మీ పెళ్లి విషయం మళ్ళీ హైలైట్ అయ్యింది. రష్మీ పెళ్ళికి సంబంధించిన ఒక ఫోటోను స్క్రీన్ మీద చూపించారు. రష్మీ పక్కన ముఖం కనిపించకుండా కూర్చున్న అబ్బాయి గురించి అడిగారు. అందుకు రష్మీ ఎవరు, ఎప్పుడు వస్తున్నారంటే అంటూ క్లియర్ గా ఆన్సర్ చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసింది.

కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ‘ఆట’ సందీప్

ఎవరు ఏ పని చేసినా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.. అలాగే డబ్బు కూడబెట్టి ఏదో ఒకటి సొంతంగా సమకూర్చుకోవాలని చూస్తుంటారు. అలా కష్టపడి కారు, బైకు, ఇల్లు వంటివి కొనుక్కుని వాటికి యజమానులు అవుతారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఆట’ సందీప్ జోడీ వచ్చేసారు. ఆట సందీప్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న డాన్సర్. పది పదిహేనేళ్ల క్రితం ఆట, ఛాలెంజ్ లాంటి షోలు ప్రతి వీకెండ్ లోనూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవి. ఆ టైంలో ‘ఆట’ ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్..తర్వాతి కాలంలో ఆట సందీప్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డాన్సర్ ఐన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చిన్న సినిమాలు, ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న సందీప్ జోడి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాలో షార్ట్ వీడియోస్ తో డాన్సులు చేయడం ఇంటరెస్ట్ ఉన్న వాళ్లకు స్టెప్స్ నేర్పించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ జంట సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది జ్యోతి. పెద్దవాళ్ళు అన్నారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ లైఫ్ లో ఈ రెండూ చాలా కష్టం. ఐదేళ్లు కష్టపడి వన్ మాన్ ఆర్మీలా ఎన్నో కష్టాలు పడి హోప్స్ అన్నీ వదిలేసుకుని ఫైనల్ గా మాకు నచ్చిన ఇల్లు కొనుక్కున్నాం అని ఎంతో సంతోషంతో చెప్పింది జ్యోతి. ఇక మూవీ యాక్టర్ స్నేహ కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ పెట్టారు.

ఆయనతో వెళ్లడం అంటే సన్నీలియోన్ ని సంకనేసుకెళ్ళినట్టే!

సుడిగాలి సుధీర్ ని సన్నీ లియోన్ తో పోల్చాడు జబర్దస్త్ కమెడియన్ అవినాష్. ఈ మధ్య కాలంలో ఆహాలో "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్" పేరుతో ఒక కామెడీ షో వస్తోంది. ఈ షోకి హోస్ట్ గా  చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇదే షోలో వేణు, అవినాష్‌, సద్దామ్‌, జ్ఞానేశ్వర్, భాస్కర్ యాదమ్మ రాజు కామెడీ స్కిట్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటారు.  ఇక రీసెంట్ గా స్ట్రీమ్ అవుతున్న ఎపిసోడ్ చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇందులో అవినాష్  తన కామెడీ స్కిట్‌ లో భాగంగా 2017 లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. సుధీర్‌, వేణు, రాంప్రసాద్‌, ధన్‌రాజ్‌ ఇలా అందరు కలిసి ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లారట. వేణు అన్నని తీసుకెళ్తే ప్రిన్సిపల్‌ని సంకన పెట్టుకుని తీసుకెళ్లినట్టే ఉంటుంది. అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడికి వెళ్లొద్దు అని కండిషన్స్ పెడతాడని చెప్పాడు. తర్వాత సుడిగాలి సుధీర్‌ గురించి చెప్తూ సుధీర్ తో టూర్‌ వెళితే సన్నీలియోన్‌ని సంకన పెట్టుకుని వెళ్ళినట్టే అని అన్నాడు. కుదురుగా ఉండడని, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం అంటూ ఉంటాడని చెప్పుకొచ్చాడు.  ఆ టైంలో తాము ఉన్న రూమ్ తనదంటూ ఒక రష్యాన్‌ అమ్మాయితో ఇష్యూ అయ్యిందని ఆ మేటర్ రాత్రి మొదలుకుని మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు సాగిందని చెప్పాడు. ఎవరి భాష ఎవరికీ అర్ధం కాకపోయేసరికి చివరికి సుధీర్ ఇంగ్లీష్ లో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసాడని చెప్తూ ఎన్నో రకాల ఎమోషన్స్ ని స్టేజి మీద పండించాడు అవినాష్‌. దీంతో అవినాష్ స్కిట్‌ నవ్వులు పూయించింది. చైర్మన్ అనిల్‌ రావిపూడి స్పందిస్తూ, ఇది ఏ సర్టిఫికేట్‌ స్కిట్‌ అని, కానీ అవినాష్‌ యు సర్టిఫికేట్‌ కోటింగ్‌ వేసి చెప్పాడని, సేఫ్‌ గేమ్‌ ఆడాడని, తను సేఫ్‌ కానీ సుధీర్‌ని ఇరికించేసాడంటూ చెప్పాడు.

బయట టూ లెట్ బోర్డు.. ఇంట్లో హిమతో మోనిత!

'కార్తీక దీపం' కి ఎలాంటి  ముగింపు ఉంటుందోనని అందరిలో సస్పెన్సు నెలకొంది. ఇప్పుడు ఈ సీరియల్ ఎపిసోడ్ -1567 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. తనని రోడ్డు మీద పడుకోబెట్టిన దీపను వదలను అంటూ కోపంతో ఊగిపోతుంది‌ మోనిత.  సౌందర్య ఇంటికి భాగ్యం వచ్చి దీప గురించి ఆరా తీసేలోపే బయట నుండి దీప వస్తుంది. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అంతలో శౌర్య అక్కడికి వచ్చి "హిమ ఎక్కడా? కనిపించడం లేదు" అని అడుగుతుంది. "ఇందాక నేను వస్తుంటే హిమ బయటికి వెళ్ళింది. నా ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి ఎక్కడికి రావాలి అని అడిగింది" అని భాగ్యం చెప్పగా అక్కడే ఉన్న దీప తన ఫోన్ తీసుకొని నెంబర్ చెక్ చేస్తే మోనిత నెంబర్ రావడంతో.. ఒక్కసారిగా భయపడి నా కూతురిని ఆ మోనిత ఏం చేస్తుందోనని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. కాసేపటికి కార్తిక్ వస్తాడు. సౌందర్య, కార్తిక్, దీపలు కలిసి మోనిత దగ్గరకి వెళ్తారు. అయితే హిమకి వాళ్ళ నాన్న గురించి తప్పుగా చెప్తూ.. తన మాటలన్నీ వినేలా మాట్లాడుతూ ఉంటుంది మోనిత. మోనిత ఇంటికి వెళ్లేసరికి.. అక్కడ బయట తాళం వేసి టూ-లెట్  బోర్డ్ ఉంటుంది. అయితే హిమ, మోనిత ఇద్దరు లోపలే ఉంటారు. బయట తాళం వేసి ఉండటం చూసి హిమని మోనిత ఎక్కడికో తీసుకెళ్ళిందని దీప కన్నీటి పర్యంతం అవుతుంది. దీపని ఓదార్చుతాడు కార్తిక్. "హిమని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంతే కానీ హిమను ఏం చెయ్యదు" అని కార్తీక్ అంటాడు. ఆ మాటలను  శౌర్య వింటుంది. "మోనిత దగ్గర హిమ ఉందా? ఈ హిమ ఎప్పుడు ఇంతే ఎవరు చెప్పింది వినదు" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

కృష్ణ అనుకొని ముకుందను హగ్ చేసుకున్న మురారి!

'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ ఇప్పుడు 59వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. విజయ్ తో పాటుగా ఇంట్లో వాళ్ళు అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. విజయ్ ప్రతీసారీ కృష్ణ, ముకుందలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అయితే విజయ్ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మురారి జంటకు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తాడు.  కృష్ణ, ముకుందలు ఇద్దరూ ఒకే కలర్ చీర కట్టుకోవడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ముకుంద పూలు సర్దుతుండగా వెనుక నుండి చూసి కృష్ణ అనుకొని మురారి పట్టుకుంటాడు. అటునుండి వస్తున్న రేవతి  గమనించి "ఏం చేస్తున్నావ్" అని మురారిని కోప్పడుతుంది. "నేను కృష్ణ అనుకొని పట్టుకున్నాను" అని మురారి అంటాడు. "తను కృష్ణా అని పట్టుకున్నాడు. మరి నీకేమైంది నువ్వు కృష్ణవి కాదు కదా ముకుందా.. నీకు తెలుసు కదా" అని రేవతి అనడంతో "మీ ఉద్దేశ్యం ఏంటీ అత్తయ్య.. అర్ధం కావడం లేదు" అని  అంటుంది. "నీ ఉద్దేశ్యమే నాకు అర్ధం కావడం లేదు" అని రేవతి చెప్తుంది. కృష్ణ నువ్వు ఇంకెప్పుడు ఈ చీర కట్టుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గాలిపటాలు ఎగురవెయ్యడంలో కుటుంబసభ్యులంతా పోటీ పడతారు. అందులో మురారి గాలిపటంకి ఉన్న ధారం తెగిపోతుంది. పోటీలో చివరగా కృష్ణ, ముకుందలు ఉంటారు. అయితే కృష్ణకి సపోర్ట్ ఇచ్చి దగ్గర ఉండి గెలిపిస్తాడు మురారి. అది చూసి ముకుంద తట్టుకోలేదు. ఆ తర్వాత కృష్ణ ని అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తూ ఉంటుంది రేవతి. ఇంట్లో వాళ్ళు అందరూ కృష్ణని ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషితో పాటు గెస్ట్ హౌస్ లో వసుధార!

'గుప్పెడంత మనసు'  సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ -665 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో వసుధార అమ్మనాన్నలు తనకి ఫోన్ చేసి తన బాగోగులు కనుక్కుంటారు. "నువ్వు ఏం బాధపడకు అమ్మా.. నరకాసురుడి నుండి మనకు విముక్తి అయింది. ఇక మనకు ఏం ఇబ్బందులు లేవు" అంటూ సంతోషంతో చక్రపాణి అంటాడు. వసుధార తన నాన్న లో వచ్చిన మార్పుకు సంతోషపడుతుంది. మరో వైపు 'రిషిధార' లు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. వసుధార గురించి ఆలోచిస్తూ రిషి.. "అసలు వసుధర మనసులో ఏముంది. వేరొకరికి భార్య అయి ఉండి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది?. తను నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్నగా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది" అని అనుకుంటాడు. మరోవైపు రిషి గురించి వసుధార ఆలోచిస్తూ.. "మిమ్మల్ని ఎప్పుడు వదులుకోను సర్.. మీరు నాకు జీవితంలో దొరికిన అరుదైన బహుమతి" అంటూ భావోద్వేగానికి లోనవుతుంది. మరుసటి రోజు వసుధార కాలేజీకి వెళ్లి రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా రిషి రాకపోయే సరికి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చెయ్యడు. అలాగే జగతి, మహేంద్రలకు చేస్తుంది. ఎవరూ  కూడా వసుధార ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ధరణికి ఫోన్ చేస్తుంది. అప్పుడు రిషి సార్ ఇంటికి రాలేదు అనే విషయం తెలుసుకుంటుంది. ఇంటి దగ్గర, కాలేజీ దగ్గర లేడంటే గెస్ట్ హౌస్ లో ఉంటాడని భావించి అక్కడికి వెళ్తుంది. గెస్ట్ హౌస్ లో రిషిని చూసిన వసుధార "మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సర్" అని అడుగుతుంది. "అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని రిషి అంటాడు. వసుధార బాధపడుతుంది. "రిషి సర్ ఇంటికి వెళ్ళండి" అని చెప్తుంది. అయినా వినకపోయేసరికి "మీ రిషి కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు" అని మహేంద్రకి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. దాంతో ఇంట్లోవాళ్ళకి రిషి గెస్ట్ హౌస్ లో ఉన్న విషయం, రిషీతో పాటుగా వసుధార కూడా అక్కడే ఉన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రష్మీ ఇంట్లో విషాదం.. కన్నీటితో తుది వీడ్కోలు

బుల్లితెర మీద ఫేమస్ యాంకర్, హీరోయిన్ రష్మీ గురించి తెలియని వారు లేరు. ప్రస్తుతం ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె ఫ్యామిలీలో ఒక  కీలకమైన వ్యక్తి మరణించారు. ఈ విషయాన్ని రష్మీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.  అసలు విషయంలోకి వెళితే రష్మీ గౌతమ్ బామ్మ ప్రమీలా మిశ్రా శుక్రవారం తుది శ్వాస విడిచారు. బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికామని పేర్కొంది రష్మీ. '' అమ్మమ్మ ప్రమీలామిశ్రా చాలా స్ట్రాంగ్ వుమన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓం శాంతి'' అని రష్మీ ఒక పోస్ట్ పెట్టింది.  రష్మీ గౌతమ్ 'ఎక్స్ట్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తోంది. మరోవైపు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. మూవీస్ లో మంచి పాత్రలకు ఆఫర్స్ వస్తున్నాయని కానీ డిఫరెంట్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. లాస్ట్ ఇయర్  రష్మీ హీరోయిన్ గా  నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో నటిస్తోంది రష్మీ.

మోనిత గుండె కావాలంటున్న దీప!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు ఎలా ముగుస్తుందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్-1566లోకి అడుగు పెట్టింది. మోనితతో మాట్లాడిన హిమ అక్కడ నుండి బయల్దేరి వస్తుంది. అంతలోనే గుడి దగ్గర కార్తీక్ కార్ కన్పించడంతో హిమ అక్కడే ఆగుతుంది. హిమ గుడి లోపలికి వస్తుండగా... దీప కింద పడిపోవడం చూస్తుంది. దీప దగ్గరకి వెళ్ళి "అమ్మా.. ఏమైంది" అని  ఏడుస్తుంది. అంతలోనే కార్తీక్ వచ్చి దీపని పైకి లేపి.. తనకి టాబ్లెట్ వేస్తాడు. కాసేపటికి దీప కళ్ళు తెరుస్తుంది. అందరూ ఇంటికి వెళ్తుండగా.. కార్తీక్ ని పక్కకు తీసుకెళ్ళి హిమ మాట్లాడుతుంది. "మోనిత అంటీ నాకు మొత్తం చెప్పింది.  ప్లీజ్ నాన్న  ఆంటీ చెప్పిన దానికి ఒప్పుకోండి" అంటూ కార్తీక్ ని బ్రతిమిలాడుతుంది. "నీకేం తెలియదు. నువ్వు చిన్నపిల్లవి"  అని హిమతో చెప్తాడు కార్తిక్. ఆ తర్వాత అందరూ అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తారు. సౌందర్య ఒంటరిగా ఉండటం చూసి హిమ అక్కడికి వెళ్ళి తనకి తెలిసిందంతా చెప్తుంది. నాకు అంతా తెలుసు నానమ్మ "నాన్నను మోనిత ఆంటీ చెప్పిన దానికి ఒప్పుకోమని చెప్పు నానమ్మ ప్లీజ్" అని హిమ అనగానే "హేయ్ ఏంటే నువ్వు.. మోనిత ఎలాంటిదో నీకు తెలిసి కూడా అలా ఎందుకు అంటున్నావు" అని సౌందర్య అంటుంది. అయితే దీప వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు అన్నీ కూడా చాటుగా వింటుంది. మోనిత నిద్ర లేచి చూస్తే తన బెడ్ తో సహా వీధిలో ఉంటుంది. ఇంకా తన చుట్టూ జనాలు ఉంటారు. నేను ఇక్కడ ఉన్నానేంటి అని అనుకునేలోపే తన దగ్గరికి దీప వస్తుంది. "నీ గుండెను నాకు ఇచ్చి నన్ను బ్రతికిస్తానని చెప్పావట కదా.. ఇప్పుడు నీ గుండెని తీసుకోవడానికి వచ్చాను" అని అంటుంది. "హేయ్ దీప నేను రోడ్డు మీద ఉన్నానేంటి" అని అడుగుతుంది. అలా అనగానే దీప అక్కడున్న జనాలతో మోనిత గురించి చెప్తుంది. "ఈవిడ పెద్ద డాక్టర్... ఈ లోకంలో ఈవిడకి ఎవరు దొరకనట్లు నా భర్త వెంట పడుతుంది. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు" అని చెప్తుంది. దాంతో అక్కడున్న జనాలు అందరూ మోనితని తిడతారు. దీంతో కోపంతో రగిలిపోతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను ఇక్కడే ఉంటాను.... నువ్వు చీర కట్టుకో!

'కృష్ణ ముకుంద మురారి' స్టార్ మా టీవీలో వస్తోన్న సీరియల్.... రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా సాగుతూ 58వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. కుటుంబమంతా కూడా భోగి స్నానాల వేడుకల్లో పాల్గొన్నారు. నవ దంపతులయిన కృష్ణ-మురారి ఇద్దరూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుంకుంటూ స్నానాల్లో పాల్గొన్నారు. వాళ్ళిద్దరిని చూసి ముకుంద ఓర్వలేకపోతుంది.  "పాపం అందరూ సంతోషంగా ఉన్నారు. ఆదర్శ్ కూడా ఉంటే ముకుంద ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొనేది" అని జాలిపడుతుంది భవాని. ఆ తర్వాత భవాని ఇంటికి విజయ్ వస్తాడు. విజయ్ రావడంతోనే మురారికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ముకుందతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయట పడుతుందోనని హడావిడి చేస్తుంటాడు. అంతలోనే ముకుంద వచ్చి "బాబాయ్ బాగున్నారా" అని పలకరించి వెళ్ళిపోతుంది. మన ప్రేమ విషయం బయట పెట్టడానికే విజయ్ ని రప్పించానని మురారితో చెప్తుంది ముకుంద. కృష్ణ దగ్గరికి మురారి వెళ్లి నువ్వు ఇంకా రెడీ కాలేదా.. కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా కట్టుకో అని చెప్తాడు. "నువ్వు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మీ భార్య ఎక్కడ అని ప్రశ్నలు వేస్తారు.. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు చీర కట్టుకో" అని చెప్తాడు మురారి.  "నువ్వు ఇక్కడ ఉండగా నేను చీర ఎలా కట్టుకుంటా" అని చెప్తుంది. అతని కళ్ళకు గంతలు కట్టి కృష్ణ చీర కట్టుకుంటుంది. ఇక ఇద్దరు గదిలో నుండి బయటికి రాగానే, ముకుంద కూడా తన గదిలో నుండి బయటికి వస్తుంది. అటువైపు ముకుంద, ఇటు వైపు కృష్ణతో మురారి మెట్లు దిగుతుంటే..  "ఇంకొక అమ్మాయి ఎవరు" అని భవానిని అడుగుతాడు విజయ్. ఆదర్శ్ భార్య అని చెప్తుంది భవాని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధార ఇప్పటికైనా రిషికి నిజం చెప్పేనా!

'గుప్పెడంత మనసు' సీరియల్ లో  వసుధార, రిషీల ప్రేమ కథని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఎపిసోడ్-664 లో.. రిషి ఇంట్లోకి వసుధార రాగానే అందరూ విసుక్కుంటారు. "ఇంకా ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావ్. మా రిషి బ్రతికున్నాడో... లేడోనని చూసి పోదామని వచ్చావా? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి వసుధార గారు" అని జగతి చెప్తుంది. "ఏంటి మేడం.. మీరు నాకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు" అని వసుధార అంటుంది. అలా కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది.  వసుధార వల్లనే రిషి బయటకు వెళ్ళిపోయాడని కుటుంబసభ్యులంతా తనపై తీవ్ర అసంతృప్తితో ఉంటారు. దీంతో వసుధార ఎంత బాధపడినా ఎవరూ వినకుండా బయటకు గెంటేస్తారు.  ఆ తర్వాత తను ఎప్పుడు వెళ్లే అమ్మవారి గుడికి వెళ్ళి, తన మనసులో ఉన్న బాధనంతా చెప్పుకుంటుంది. కాసేపటికి అదే గుడికి రిషి వస్తాడు. అతను మొక్కుకొని వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న వసుధార చూసి, తనని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ రిషి అదేమీ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంటాడు. తను ఎంత బ్రతిమాలినా రిషి పట్టించుకోవట్లేదని తన గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో నడుచుకుంటూ  వెళ్తుంది. అప్పుడే ఒక ట్రక్కు తనని ఢీ కొట్టబోతుండగా ఆ పక్క నుండి వెళ్తున్న రిషి గమనించి వెంటనే తనని కాపాడతాడు. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసి తనని వెళ్ళమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.  ఇలా అడుగడుగునా వసుధార అవమానాలు ఎదుర్కొంటుంది. రిషికి అసలు నిజం వసుధార ఎప్పుడు చెప్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే తర్వాతి ఎపిసోడ్‌లోనైనా వీళ్ళు కలసిపోతారా? లేదా? అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. తర్వాతి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

అఖిల్ ని చూసి ఫ్లాటైపోయిన హీరోయిన్ ఆనంది...

జీ తెలుగులో ప్రసారమవుతున్న "డాన్స్ ఇండియా డాన్స్" షో త్వరలో ముగియబోతోంది. ఈ షోకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం అంటే 22 న రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే షోకి వెరైటీ లుక్ తో హీరో అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. అఖిల్ ఎంట్రీ కంటెస్టెంట్స్ లోనే కాదు జడ్జెస్ లో కూడా ఉత్సాహాన్ని పెంచింది. త్వరలో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న 'ఏజెంట్' లుక్‌లో అఖిల్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ముగ్గురు జడ్జెస్ లో ఒకరైన హీరోయిన్ ఆనంది.. అఖిల్‌ను చూసి తెగ సంబరపడిపోయింది. పడీ పడీ నవ్వింది. "అఖిల్‌ని ఇలా చూస్తుంటే ఇంత ఫాస్ట్ గా పెళ్లి ఎందుకు చేసుకున్నానా అనిపిస్తోంది.." అనేసరికి అఖిల్‌ తెగ సిగ్గుపడ్డాడు. మొత్తానికి ప్రోమోతో షోకు బాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మరోవైపు "జబర్జస్త్" లేడీ కమెడియన్ రోహిణి.. 'అయ్యగారే నం.1' అనేసరికి  అందరూ నవ్వేశారు. అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్న ఈ డాన్స్ షో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 21న మొదలయ్యింది. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, యాక్టర్ సంగీత, హీరోయిన్ ఆనంది జడ్జెస్ గా  ఉన్నారు. జబర్దస్త్ రోహిణి కూడా ఈ షోలో కనిపిస్తూ కామెడీ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు  'ఏజెంట్' మూవీతో అఖిల్ ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతున్నాడు.

23 నుంచి జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘శుభస్య శీఘ్రం’ కొత్త సీరియల్ ప్రారంభం!

జీ తెలుగు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో డిఫరెంట్ సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. కామెడీ, డాన్స్, సింగింగ్ షోస్, ఆసక్తికర మలుపులతో సాగుతున్నసీరియల్స్ తో ముందుకు దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో  నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా ‘శుభస్య శీఘ్రం’ అంటూ మరో కొత్త సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సీరియల్ విషయానికి వస్తే  ఇది ఆర్థిక అసమానతలు, ఆత్మాభిమానం మధ్య చిగురించిన ఒక  అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కింది. మహేష్ బాబు- కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శుభస్య శీఘ్రం’ 23 నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం కావడానికి రెడీ ఐపోయింది. ఒక మధ్య తరగతి తల్లికి అండగా ఉండే కూతురు తన కుటుంబాన్ని ఆపదల నుంచి ఎలా రక్షించుకుంది అనే ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. కలవారి అబ్బాయి రాధాగోవింద్ గా మహేష్,  కుటుంబ బాధ్యతలను తలకెత్తుకునే  ఆడపిల్ల కృష్ణగా కృష్ణప్రియ కనిపిస్తారు.  కుటుంబమే ప్రధానంగా భావించే హీరో లైఫ్ లో కృష్ణ ఎంట్రీ ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టింది ? వాళ్ళ మధ్య ద్వేషంగా మొదలైన పరిచయంలో ప్రేమ ఎలా పుట్టింది ? ఉప్పు, నిప్పులా ఉండే వారిద్దరిని ప్రేమ ఎలా ఒకటి చేసింది ? అనేది తెలుసుకోవాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.  అలాగే  బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ని అలరిస్తున్న సాండ్ర జయచంద్రన్, భావన, ఉమాదేవి ఈ సీరియల్లో ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. ‘శుభస్య శీఘ్రం’ సీరియల్ కారణంగా "దేవతలారా దీవించండి" సీరియల్  సాయంత్రం 6 గంటలకు, ‘రాధమ్మ కూతురు’ సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానున్నాయి.  

'జబర్దస్త్' స్టేజి మీద సుజాతకు రింగ్ తొడిగి ముద్దు పెట్టి మరీ ప్రపోజ్ చేసిన రాకేష్!

జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత మధ్య కెమిస్ట్రీ గురించి అందరికీ తెలుసు. చాలా ఏళ్ల నుంచి ఈ  షోలో చేస్తున్న రాకేష్ ప్రస్తుతం టీమ్ లీడర్ గా స్కిట్స్ చేస్తున్నాడు.  ఇక న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుజాత ‘జోర్దార్’ సుజాతగా పేరు సంపాదించి ‘బిగ్ బాస్’ షోలోనూ పార్టిసిపేట్ చేసి ఆకట్టుకుంది. తన యూట్యూబ్ వ్లాగ్స్ లో ఎక్కువగా రాకేష్ తో కలిసి కనిపిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరిపై మొదట్లో ఎవరికీ డౌట్ రాలేదు కానీ తర్వాత ఈ జంట బయట కూడా జోడీగా విహారయాత్రలు చేస్తూండేసరికి అందరిలోనూ డౌట్ స్టార్ట్ అయ్యింది. తర్వాత కొన్ని రోజులు తాము లవర్స్ అంటూ వాళ్ళే కంఫర్మ్ చేశారు.  కొన్ని రోజుల ముందు సుజాత బర్త్ డే కోసం ఇద్దరూ కలిసి దుబాయికి, ఇటు కొత్త సంవత్సరం సందర్భంగా విజయవాడకు కూడా వెళ్లారు.  ఐతే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో భాగంగా స్టేజీపై స్కిట్ ఐపోయాక ఫైనల్ గా రాకేష్ రింగ్ సుజాత వేలుకి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు. అది చూసి షాకయ్యింది సుజాత. వెంటనే రాకేష్ సుజాతను దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రీసెంట్ గా  రిలీజ్ చేసిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోలో ఈ లవ్ ప్రొపోజల్ కనిపించింది.  

మన ప్రేమ గతం.. నా భార్యకి అన్యాయం చేయలేను!

'కృష్ణ ముకుంద మురారి'  స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ సీరియల్  ప్రేమ, పంతం మధ్య సాగుతుంది. కాగా ఈ సీరియల్ ఎపిసోడ్-57 లోకి అడుగుపెట్టింది.  అందరూ షాపింగ్ నుండి ఇంటికి వస్తారు. ముకుంద ఇంటికి రాగానే కాలు బెణికినట్లు నటిస్తుంటుంది. అది చూసి మురారి "ఇప్పుడు కాలు ఎలా ఉంది" అని అడగడంతో.. ముకుంద కోపంగా "ఏంటి అంత దూరం ఉండి అడుగుతున్నావు. అదే మీ ఆవిడ కాలు బెణికితే ఎత్తుకొని తీసుకెళ్తావు. అసలు నన్ను పట్టించుకోనట్టు చూస్తున్నావ్" అని అంటుంది. "నాకు పెళ్లి అయింది. నీకు పెళ్లి అయింది. మన ప్రేమ అనేది ఒక గతం మాత్రమే. ఇప్పుడు నా భార్య కృష్ణ. తనకి అన్యాయం చెయ్యలేను. నీకు భర్త ఆదర్శ్ ఉన్నాడు. ఇక నా గురించి కలలు కనడం మానుకో" అని చెప్పి మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. తను షాపింగ్ లో తీసుకున్న చీర కింద పడి ఉండడంతో " ఏంటి చీర కింద పడి ఉంది" మురారి అడుగుతాడు. "ఒకరు దానిపై ఆశపడ్డాక.. నాకు అది అవసరం లేదు. ఏదో పట్టుదలతో ఆ చీర కావాలని ముకుందతో ఆర్గ్యుమెంట్ చేశాను. కానీ నాకు అది అవసరం లేదు" అని కృష్ణ అనడంతో మురారి ఆలోచనలో పడతాడు. "చీర మీద ఆశ పడితేనే వద్దని పడేసింది. అదే ముకుంద నా మీద ఆశ పడుతుంది అని తెలిస్తే నన్ను కూడా వదిలేస్తుందా" అని మనసులో అనుకుంటాడు. "కృష్ణ నువ్వు పండగకి ఏ చీర కట్టుకుంటావ్.. పెద్దమ్మ ఆ చీర కట్టుకోలేదని అడిగితే ఏం చేస్తావ్.. ఈ కలర్ అంటే మీ నాన్న కి బాగా ఇష్టం" అని మురారి అనడంతో తను చీర కట్టుకునేందుకు ఒప్పుకుంటుంది.  అందరూ భోగి మంటలు ఎంజాయ్ చేస్తుంటే ముకుంద మాత్రం ఒంటరిగా ఉంటుంది.  కృష్ణ, మురారీలు అన్యోన్యంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి కోసం వాళ్ళింటికి వెళ్ళిన వసుధార!

'గుప్పెడంత మనసు'  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్. అత్యధిక మంది వీక్షకులను ఆకర్షిస్తోన్న ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-663 లో..  వసుధార కాలేజీలోకి వచ్చి రిషి గురించి జగతిని అడిగి తెలుసుకుంటుంది.  "రిషి గురించి నీకెందుకు" అని జగతి మేడం కోప్పడుతుంది. "వసు మేడం ఎందుకు వచ్చారు?" అని మహేంద్ర అంటాడు.  అలా అనడంతో వసుధార "సర్.. మీరు నన్ను మేడం అంటున్నారేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. "మా వసుధార అయితే మేము చెప్పినట్టు వినేది. ఇప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే  మీకు గౌరవం ఇచ్చే మాట్లాడాలి" అని మహేంద్ర అంటాడు.  "ఇక  సరే మేడం నేను వెళ్తున్నాను. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఛార్జ్ తీసుకుంటా" అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వసుధార. వసుధార తన క్యాబిన్ లో కూర్చుని రిషీకి ఫోన్ చేస్తుంది. ఎన్ని సార్లు ఫోన్ చేసిన రిషి కట్ చేస్తూనే ఉంటాడు. అలా కట్ చేసేసరికి బాధపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి వసుధార దగ్గరికి జగతి, మహేంద్రలు వస్తారు. ఏం  జరిగిందో చెప్పమని ఎంత అడిగినా వసుధార చెప్పకుండా మాట దాటేస్తుంది. ఆ తర్వాత జగతి ఇంటికి వచ్చేస్తుంది. దేవయానితో  వసుధార వచ్చిన  విషయం చెప్తుంది. "అది మళ్ళీ ఎందుకు వచ్చింది.. ఎవరు రానిచ్చారు" అని దేవయాని కోపంగా అడిగుంది. "వసుధార ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ హెడ్.. అందుకే వచ్చింది" అని చెప్పింది జగతి. అంతలోనే రిషి కోసం వసుధార వస్తుంది.  "రిషి సర్ ఉన్నారా?" అని అడుగుతుంది.  "ఏంటే.. ఇదేదో నీ సొంత అత్తారిల్లు అయినట్టు సరాసరి లోపలికి వచ్చేశావ్" అని దేవయాని కోప్పడుతుంది. "మీరు ఉండండి అక్కయ్య.. తనతో నేను మాట్లాడుతాను" అని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.