మన ప్రేమ గతం.. నా భార్యకి అన్యాయం చేయలేను!

'కృష్ణ ముకుంద మురారి'  స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ సీరియల్  ప్రేమ, పంతం మధ్య సాగుతుంది. కాగా ఈ సీరియల్ ఎపిసోడ్-57 లోకి అడుగుపెట్టింది.  అందరూ షాపింగ్ నుండి ఇంటికి వస్తారు. ముకుంద ఇంటికి రాగానే కాలు బెణికినట్లు నటిస్తుంటుంది. అది చూసి మురారి "ఇప్పుడు కాలు ఎలా ఉంది" అని అడగడంతో.. ముకుంద కోపంగా "ఏంటి అంత దూరం ఉండి అడుగుతున్నావు. అదే మీ ఆవిడ కాలు బెణికితే ఎత్తుకొని తీసుకెళ్తావు. అసలు నన్ను పట్టించుకోనట్టు చూస్తున్నావ్" అని అంటుంది. "నాకు పెళ్లి అయింది. నీకు పెళ్లి అయింది. మన ప్రేమ అనేది ఒక గతం మాత్రమే. ఇప్పుడు నా భార్య కృష్ణ. తనకి అన్యాయం చెయ్యలేను. నీకు భర్త ఆదర్శ్ ఉన్నాడు. ఇక నా గురించి కలలు కనడం మానుకో" అని చెప్పి మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. తను షాపింగ్ లో తీసుకున్న చీర కింద పడి ఉండడంతో " ఏంటి చీర కింద పడి ఉంది" మురారి అడుగుతాడు. "ఒకరు దానిపై ఆశపడ్డాక.. నాకు అది అవసరం లేదు. ఏదో పట్టుదలతో ఆ చీర కావాలని ముకుందతో ఆర్గ్యుమెంట్ చేశాను. కానీ నాకు అది అవసరం లేదు" అని కృష్ణ అనడంతో మురారి ఆలోచనలో పడతాడు. "చీర మీద ఆశ పడితేనే వద్దని పడేసింది. అదే ముకుంద నా మీద ఆశ పడుతుంది అని తెలిస్తే నన్ను కూడా వదిలేస్తుందా" అని మనసులో అనుకుంటాడు. "కృష్ణ నువ్వు పండగకి ఏ చీర కట్టుకుంటావ్.. పెద్దమ్మ ఆ చీర కట్టుకోలేదని అడిగితే ఏం చేస్తావ్.. ఈ కలర్ అంటే మీ నాన్న కి బాగా ఇష్టం" అని మురారి అనడంతో తను చీర కట్టుకునేందుకు ఒప్పుకుంటుంది.  అందరూ భోగి మంటలు ఎంజాయ్ చేస్తుంటే ముకుంద మాత్రం ఒంటరిగా ఉంటుంది.  కృష్ణ, మురారీలు అన్యోన్యంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి కోసం వాళ్ళింటికి వెళ్ళిన వసుధార!

'గుప్పెడంత మనసు'  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్. అత్యధిక మంది వీక్షకులను ఆకర్షిస్తోన్న ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-663 లో..  వసుధార కాలేజీలోకి వచ్చి రిషి గురించి జగతిని అడిగి తెలుసుకుంటుంది.  "రిషి గురించి నీకెందుకు" అని జగతి మేడం కోప్పడుతుంది. "వసు మేడం ఎందుకు వచ్చారు?" అని మహేంద్ర అంటాడు.  అలా అనడంతో వసుధార "సర్.. మీరు నన్ను మేడం అంటున్నారేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. "మా వసుధార అయితే మేము చెప్పినట్టు వినేది. ఇప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే  మీకు గౌరవం ఇచ్చే మాట్లాడాలి" అని మహేంద్ర అంటాడు.  "ఇక  సరే మేడం నేను వెళ్తున్నాను. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఛార్జ్ తీసుకుంటా" అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వసుధార. వసుధార తన క్యాబిన్ లో కూర్చుని రిషీకి ఫోన్ చేస్తుంది. ఎన్ని సార్లు ఫోన్ చేసిన రిషి కట్ చేస్తూనే ఉంటాడు. అలా కట్ చేసేసరికి బాధపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి వసుధార దగ్గరికి జగతి, మహేంద్రలు వస్తారు. ఏం  జరిగిందో చెప్పమని ఎంత అడిగినా వసుధార చెప్పకుండా మాట దాటేస్తుంది. ఆ తర్వాత జగతి ఇంటికి వచ్చేస్తుంది. దేవయానితో  వసుధార వచ్చిన  విషయం చెప్తుంది. "అది మళ్ళీ ఎందుకు వచ్చింది.. ఎవరు రానిచ్చారు" అని దేవయాని కోపంగా అడిగుంది. "వసుధార ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ హెడ్.. అందుకే వచ్చింది" అని చెప్పింది జగతి. అంతలోనే రిషి కోసం వసుధార వస్తుంది.  "రిషి సర్ ఉన్నారా?" అని అడుగుతుంది.  "ఏంటే.. ఇదేదో నీ సొంత అత్తారిల్లు అయినట్టు సరాసరి లోపలికి వచ్చేశావ్" అని దేవయాని కోప్పడుతుంది. "మీరు ఉండండి అక్కయ్య.. తనతో నేను మాట్లాడుతాను" అని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

‘దేవత’ సీరియల్ ఫేమ్ వైష్ణవి సీమంతం వేడుకలు

లాస్ట్ ఇయర్ బుల్లితెర మీద చాలా మంది సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా గుడ్ న్యూస్ చెప్పారు. కార్ లు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కుని పాలు పొంగించారు, కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు, కొంత మంది పిల్లలకు జన్మనిచ్చి గుడ్ న్యూస్ చెప్పారు. బుల్లితెర నటిగా ఎంతో ఫేమస్ అయిన వైష్ణవి రామిరెడ్డి అందరికీ తెలుసు. ఒకవేళ వైష్ణవి అంటే తెలియకపోయినా.. దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పెళ్లికి ముందు సీరియల్స్ లో యాక్టివ్ గా ఉండేది.. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది.  దేవత సీరియల్ నుంచి కూడా తప్పుకుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి.. రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. సీరియల్ నటి వైష్ణవి ప్రతి విషయాన్ని యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది. కరీంనగర్ కి చెందిన సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో తాను  తల్లిని కాబోతున్నట్టు చెప్పింది. ఇక  ఇప్పుడు ఆమె సీమంతం జరుపుకుంది. తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. సీమంతం ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ  ఫోటోలు  వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ దంపతులకు విషెస్ చెప్తున్నారు.

త్వరలో కొత్త సీరియల్ 'మధురానగరిలో' కనిపించబోతున్న "కార్తీకదీపం" కీర్తి!

కీర్తి కేశవ్ భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. 'మనసిచ్చి చూడు'' సీరియల్ లో భానుగా ఆడియన్స్ కి దగ్గరయింది కీర్తి.  ఆ తర్వాత "కార్తీకదీపం" సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో పెద్దైన తర్వాత డాక్టర్ హిమగా ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ లో నటించింది. అమాయకమైన పాత్రలో తింగరి అనిపించుకుంటూ నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది.  అయితే త్వరలో "కార్తీకదీపం" సీరియల్ కి శుభం కార్డు పడబోతోంది. కీర్తి కొత్త సీరియల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కార్తీకదీపం నెక్స్ట్ జనరేషన్ కథలో కనిపించిన కొన్నాళ్లకు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది...ఆ టైంలో సీరియల్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నడిచాయి.. ఇప్పుడు స్టార్ మాలో  'మధురానగరి'లో రాధగా మురిపించేందుకు సిద్ధమైంది.  కర్ణాటక బెంగుళూరులో జన్మించిన కీర్తికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్నా వదినను కోల్పోయిన ఈమె చాలా బాధలు అనుభవించింది. ఐనవాళ్లంతా దూరమైనా తనకు తానే ధైర్యం చెప్పుకుంది. చదువు పూర్తిచేసి  కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.  అక్కడ రెండు సినిమాలు, మూడు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో "మనసిచ్చి చూడు" సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి "కార్తీకదీపంలో" కనిపించింది. ఇప్పుడు "మధురానగరిలో" రాధగా వస్తోంది. కీర్తి జీవితం ఒక విషాదం...బిగ్ బాస్ హౌజ్ కి వెళ్ళాక ఆమె గురించి బుల్లితెర ఆడియన్స్ అందరికీ తెలిసింది. అప్పటి నుంచి కీర్తిని అంతా తమ ఫామిలీ మెంబర్ లా చూసుకోవడం స్టార్ట్ చేశారు. తోటి కంటిస్టెంట్స్ పేరెంట్స్ కూడా కీర్తిని  సొంత బిడ్డలా భావించేవారు.  అందరి ప్రేమను పొందిన కీర్తి తన కెరీర్ పరంగా మరింత ముందుకు వెళుతోంది. 

హిమకి నిజం చెప్పేసిన మోనిత!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు ఉత్కంఠభరితంగా సాగుతూ ఎపిసోడ్-1565 లోకి అడుగుపెట్టింది. సౌందర్యకి నిజం తెలిసిందేమోనని దీపకి అనుమానం కలుగుతుంది. "దీప నువ్వు వంటగదిలోకి రాకు.. ఏదీ కావాలన్నా నేను వండిపెడతాను" అని సౌందర్య చెప్పడంతో దీపకి ఉన్న అనుమానం మరింత రెట్టింపు అవుతుంది. ఇక సౌందర్య ఒంటరిగా ఉండటం చూసి తననే డైరెక్ట్ గా "అత్తయ్య మీకు నిజం తెలిసిపోయింది కదా?" అని అడిగేస్తుంది. "ఏం నిజం? నాకేం తెలియదు" అని సౌందర్య చెప్తుంది. " అత్తయ్య మీకు మీ కొడుకు లాగే నటించడం రాదు" అని దీప అంటుంది. "ఎందుకు దీప మనల్ని ఆ దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడెందుకు?" అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది సౌందర్య. దీప మాట్లాడుతూ "నేను చనిపోయాక కార్తిక్ కి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేయండి. నా పిల్లలు తల్లి లేకుండా పెరగకూడదు" అని సౌందర్యతో చెప్తుంది. మోనిత పెట్టిన చిచ్చు కారణంగా హిమ నిద్రకూడా పోకుండా రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు హిమ డైరెక్ట్ గా మోనిత దగ్గరకి వెళ్తుంది. అక్కడ మోనిత "మీ అమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు. అందుకే ఇన్ని రోజులుగా కన్పించకుండా మీ అమ్మనాన్న ఇద్దరూ తిరిగారు" అని చెప్తుంది. "ప్లీజ్ ఆంటీ అలా అనకండి" అని హిమ ఏడుస్తూ అంటుంది. "నేను ఒక్కదానినే ఈ ప్రపంచంలో మీ అమ్మ ప్రాణాలు కాపాడేది. కానీ మీ డాడీ వినట్లేదు. ఆంటీ చెప్పినట్లు చెయ్యమని నువ్వు అయినా మీ డాడీకి చెప్పు" అని మోనిత అంటుంది. "మీరు ఎంత మంచి వారు ఆంటీ. మా అమ్మ కోసం ఆలోచిస్తున్నారు. ఎలాగైనా మా డాడీని మీరు చెప్పింది చెయ్యమని చెప్తాను" అని హిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.  శౌర్య, కార్తిక్, దీపలు గుడికి వెళ్తారు. అక్కడ కార్తిక్, శౌర్య మాట్లాడుకుంటారు. "ఇన్ని రోజులు మీరెందుకు మాకు దూరంగా ఉన్నారు నాన్న" అని శౌర్య అడుగుతుంది. "అదేం లేదమ్మా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేశాను కదా.. ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను" అని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

'బ్రహ్మముడి' సీరియల్ కి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ప్రమోషన్స్!

కార్తీకదీపం సీరియల్ త్వరలో ముగియబోతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ టైం స్లాట్ లో జనవరి 24వ తేదీ నుంచి ‘బ్రహ్మముడి’ అనే పేరుతో కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ఎలా ఒక్కటి కాబోతున్నారనే కథాంశంతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఆల్రెడీ ఈ సీరియల్ ని డాక్టర్ బాబు, వంటలక్క ప్రమోట్ చేస్తున్నారు.  ఐతే ఈ కొత్త సీరియల్ ప్రమోషన్ కోసం బాలీవుడ్ బాదుషాహ్ రంగంలోకి దిగారు. సీరియల్ హీరోయిన్ కావ్య గురించి ప్రోమోలో  చాలా చక్కగా చెప్పారు. ఆడపిల్ల అయినా కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆర్టిస్ట్ ఐనా సరే ఎంతో బాధ్యత కలిగిన అమ్మాయి అంటూ కావ్య గురించి చెప్పుకొచ్చారు షారుఖ్. ‘స్టార్ మా’లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 కి ప్రసారం కాబోతుంది ఈ సీరియల్. బిగ్ బాస్ కంటెస్టెంట్  మానస్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఐతే ఈ సీరియల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తమిళ బుల్లితెర నటి దీపికా రంగరాజు ఈ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతోంది. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు హీరో. అంతేకాదు వాళ్ళ స్టేటస్ కూడా చూసే వ్యక్తిగా రాజ్ మనస్తత్వం ఉంటుంది.  ఇక తాను చేసే  పనిలో సంతోషం, సంతృప్తిని వెతుక్కుంటూ సర్దుకుపోయే క్యారెక్టర్ లో హీరోయిన్ కనిపిస్తుంది. అలాగే తన చెల్లెళ్లకి మంచి భవిష్యత్ అందించాలని తాపత్రయ పడే అమ్మాయిగా కావ్య కనిపిస్తుంది. వీళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉన్న ఈ జంట ఎలా ఒక్కటి కాబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజుల్లో ప్రసారం కాబోయే సీరియల్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక మరో విషయం ఏమిటి అంటే  ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి ఫ్రెండ్ గా చేసిన గౌతమ్ అలియాస్ కిరణ్ కాంత్ ఈ సీరియల్ లో మరొక హీరోగా కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ ఐన హమీదా హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి ఈ సీరియల్ రీమేక్. ఈ టైం స్లాట్ లో ప్రసారమైన కార్తీకదీపం ఎలా హిట్ కొట్టిందో అందరికీ తెలిసిన విషయమే.. మరి ఇప్పుడు అదే టైంకి రాబోతున్న బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉండబోతోందో చూడాలి.

త్వరలో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ - 2 ఆడిషన్స్!

ఆహా ఓటిటి వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే..ఇక ఇప్పుడు మరింత క్రేజ్ తో సీజన్ 2 ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సంగీత ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ షో త్వరలో  అలరించడానికి సిద్ధంగా ఉంది.  అందుకు గాను ఇప్పుడు ఆడిషన్స్ ని స్టార్ట్ చేశారు ఈ షో మేకర్స్. ఈ ఆడిషన్స్ కి సంబంధించిన ఒక టీజర్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇందులోని సింగర్స్ కి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఇక ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఐతే సీజన్ 1 ఓటిటి సిరీస్. మరి సీజన్ 2 కి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారా లేదా టీవీ సిరీస్ గా చేసే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  శ్రీరామచంద్ర హోస్ట్‌ చేసిన సీజన్ 1 కి తెలుగు ఇండియన్ ఐడల్‌కు థమన్ ఎస్, నిత్యా మీనన్ , కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఇందులో నెల్లూరుకు చెందిన యంగ్, టాలెంటెడ్ సింగర్ వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఆమెకు అవార్డుని అందించారు. ఇక ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, మణిశర్మ, బాలకృష్ణ వంటి ప్రముఖులు గెస్టులుగా వచ్చి ఈ షోలో సందడి చేశారు.

‘ఎలా చెప్పాలో తెలియట్లేదు’ అంటున్న దీప్తి సునైనా

దీప్తి సునైనా యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కూడా. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాకా మంచి ఆఫర్స్ నే అందుకుంది. ఈమె యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌ అప్పట్లో లవర్స్ అన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఫుల్ పాపులర్ అయ్యారు. తర్వాత కొంత కాలానికి  దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసి  సింగల్ గా ఉంటోంది. మధ్యలో కొంతకాలం గ్యాప్ తీసుకుని తన పర్సనల్ లైఫ్ ని బాగా  ఎంజాయ్ చేసింది. ఇప్పుడు 'ఏమోనే' అనే సాంగ్‌ చేసింది. సోషల్ మీడియా వల్ల తక్కువ టైములో ఎక్కువ పాపులర్ అయ్యింది దీప్తి సునైనా.. కెరీర్‌ పరంగా ఏమంత బిజీగా లేకపోయినా..జిమ్ లో వర్కౌట్స్ తో ఎప్పుడు లైం లైట్ లో ఉంటూనే ఉంటుంది. అలాగే తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ కొన్ని ఇంటరెస్టింగ్ లైన్స్ ని పోస్ట్ చేసింది. "గైస్.. ఎలా చెప్పాలో తెలియట్లేదు' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడ్డారు. తన మరో పోస్టులో 'ఏమోనే సాంగ్ టైంకి అప్‌లోడ్ చేస్తే పర్లేదు కదా ? తిట్టుకుంటున్నందుకు థ్యాంక్స్' అంటూ ఒక కామెడీ ట్విస్ట్ ఇచ్చింది. ఇలా దీప్తి కాసేపు సందడి చేసింది.

వాటికి బాధలేదని మీకు తెలుసా ..? ఐతే మనుషుల మధ్య చచ్చే వరకు పోటీలు పెట్టండి

యాంకర్ రష్మీ గురించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఒక పక్కన షోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మూగ జీవాలకు కూడా అండగా ఉంటూ వాటికి హాని తలపెట్టేవారిని ఏకి పారేస్తూ ఉంటుంది. యానిమల్ లవర్ గా  రష్మీ చేసే పోరాటం కాంట్రావర్సీలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఐతే ఆమె వాటిని చాలా లైట్ తీసుకుంటుంది. రీసెంట్ గా యాక్టర్ సంతానం మీద ట్విట్టర్ లో ఫైర్ ఐన విషయం తెలిసిందే.  ఇప్పుడు కోళ్ల కోసం ఓ డాక్టర్ పై సీరియస్ అయ్యింది రష్మీ. ఇప్పుడు ఈ విషయం ట్విట్టర్ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. నెటిజన్స్ కి రష్మీకి మధ్యన  మెసేజీల యుద్ధం కూడా జరిగింది. రీసెంట్ గా  సంక్రాంతి పందెం కోళ్ల విషయంలో ఆమె ట్విట్టర్ లో ఫుల్ ఫైర్ అయ్యింది. అంతేకాదు  ఆమె చేసిన ట్వీట్స్ కూడా వైరల్ అయ్యాయి. సంక్రాంతి పండగ రోజున ఒక డాక్టర్ తాను  కోడి పందేల్లో గెలిచానని చెప్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. ఆ డాక్టర్ పోస్ట్ చూసిన రష్మీ..దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. “నీ డాక్టర్ సర్టిఫికెట్ ని తీసుకువెళ్లి మురుగ్గుంటలో పారేసేయ్..హింసను ఇలా ప్రోత్సహిస్తున్నారా ” అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. దీంతో ట్విట్టర్ లో నెటిజన్స్ కి, రష్మీకి మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. “కోడికి లేని బాధ మీకెందుకు మేడం?” అని ఓ నెటిజెన్ అనేసరికి ‘కోడికి బాధలేదని మీకు తెలుసా ? ఐతే మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు.. గ్లాడియేటర్ పోరాటాలు సాంప్రదాయంలో భాగమే కదా. మరి చనిపోయే వరకు మనుషులను పంపాలి కదా" అంటూ  రష్మీ చేసిన  ట్వీట్ వైరల్ గా మారింది.

ఒకవైపు కృష్ణ పట్టుదల.. మరొకవైపు ముకుంద పంతం!

'కృష్ణ ముకుంద మురారి' ఇప్పుడు స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ధారావాహిక. ఎంతో వీక్షకులను సంపాదించుకుంటున్న ఈ సీరియల్ ఎపిసోడ్-56 లో .. ముకుందతో కలిసి మురారి ఉన్న ఫోటోని తీసుకొని వెళ్ళిపోతుంది రేవతి. " ఏంటి ముకుందా ఇది?" అని మురారి అడుగుతాడు. "కనీసం ఫోటో చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేసింది మీ అమ్మ" అని ముకుంద అంటుంది. "వద్దు ఇక చాలు. ఏం సమాధనం చెప్పాలో తెలియక నలిగిపోయాను. మా అమ్మకి డౌట్ వచ్చింది. ఒకదానితో ఒకటి ముడివేస్తూ పోతే ఏదో ఒకరోజు ఈ నిజం బద్దలవుతుంది" అని మురారి అంటాడు. " బ్రహ్మాండమేం బద్దలవ్వదు కదా.. తెలియనివ్వు. ఏ రోజుకైనా వాళ్ళకి తెలియాల్సిందేగా" అని ముకుంద అంటుంది. "ఇది ఎప్పటికీ బయటపడకూని నిజం. నువ్వు నేను ఒకప్పటి ప్రేమికులం అని తెలిస్తే కృష్ణ పరిస్థితి ఏంటి. ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటి. నీ స్థానం ఏంటి?" అని కృష్ణ ప్రశ్నిస్తాడు. ముకుంద మౌనంగా ఉంటుంది. "నీ పెళ్ళితోనే మన ప్రేమకు సమాధి కట్టాను. ఆ తర్వాత నా పెళ్ళితో ఆ సమాధిని పెకిలించివేశాను. నీకు చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా ఉండు" అని మురారి చెప్తాడు. "ఎలా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు నా ప్రేమకి అన్యాయం చేశావు. కానీ నేను నా ప్రేమని అనుక్షణం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. వెళ్ళు ముందుంది మొసళ్ళ పండుగ" అని ముకుంద అంటుంది. ఆ తర్వాత మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ కి వెళ్తారు. అక్కడ కృష్ణ కోసం ఒక చీరని సెలెక్ట్ చేయమని మురారికి చెప్తుంది భవాని. అయితే కృష్ణ ఒక సారీ సెలెక్ట్ చేస్తాడు. అది చూసి మొదట కృష్ణ "ఇది నాకు నచ్చింది" అని అనగా, "నాకు ఇదే నచ్చింది" అని ముకుంద అంటుంది. అలా ఇద్దరూ ఒకే చీర కోసం గొడవ పెట్టుకుంటారు. అది చూసి భవానీ "ఆపండి మీ గోల. ఏంటి మీరిద్దరు.. చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకున్నట్టు అలా గొడవపడుతున్నారు. అయితే ఇద్దరికి ఇదే నచ్చిందా" అని అడుగుతుంది. "అమ్మా కృష్ణా.. నువ్వు ఇంకొక చీర సెలెక్ట్ చేసుకోమ్మా" అని రేవతి అడుగుతుంది. "సారీ అత్తయ్య. ఒకసారి నా చేతికొచ్చాక వదిలిపెట్టడం నాకిష్ణం లేదు.. నాది పట్టుదల" అని కృష్ణ అంటుంది. "ఒకసారి నేను ఇష్టపడ్డాక అంత తేలిగ్గా వదిలేసుకుంటానా.‌. నాది పంతం" అని ముకుంద అంటుంది. ఒక చీర కోసం ఇద్దరు గొడవపడటం అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ చూసి "ఒక్క నిమిషం మేడమ్. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది" అంటూ సేమ్ ఉన్న మరొక చీరని తీసుకొచ్చి ఇస్తుంది. ఇద్దరూ చేరొక చీరని తీసుకుంటారు.  "మురారికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేయమ్మా" అని కృష్ణకి చెప్తుంది రేవతి. "అలాగే అత్తయ్య" అని కృష్ణ మంచి డ్రెస్ వెతుకుతుంది. ముకుంద కూడా మురారి కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. ముకుంద సూట్ సెలెక్ట్ చేయగా, కృష్ణ పట్టుపంచ సెలెక్ట్ చేస్తుంది. భవానీ చూసి ముకుందని తిడుతుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కొత్త MD గా బాధ్యతలు స్వీకరించిన జగతి మేడం!

'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మా టీవి ప్రేక్షకులను ‌ఆకర్షిస్తోన్న సీరియల్. మంగళవారం నాటి ఎపిసోడ్‌-662లో.. వసుధారని తల్చుకుంటూ ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళిపోతున్న రిషీని ఆపిన జగతి, మహేంద్ర ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా వినకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తాడు. అప్పుడు జగతి మేడం మాట్లాడుతూ  "రిషి.. నువ్వు వెళ్ళు. ఆపే అధికారం నాకు లేదు. కానీ కాలేజీ కి వెళ్లి ఇక్కడ ఏం చెప్పావో అదే చెప్పు. లేదంటే కాలేజ్ లో వాళ్ళు ఎవరికి తోచింది వారు అనుకుంటారు" అని చెప్తుంది. అక్కడే ఉన్న రిషి పెద్దనాన్న కూడా జగతి చెప్పింది కరెక్ట్ అని అంటాడు. "కాలేజీలో మీటింగ్ పెట్టి నువ్వు చెప్పి వెళ్ళు" అని రిషి పెద్దనాన్న అనడంతో "సరే" అని చెప్పి కాలేజీకి వెళ్తాడు. రిషి కాలేజీకి వెళ్లడంతోనే  వసుధార జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వసుధారతో కలిసి ఉన్న ప్లేస్ దగ్గరకి వెళ్లి తనని గుర్తు చేసుకుంటాడు. "ఇన్ని జ్ఞాపకాలు నాకు అందించి నాకు దూరం అయ్యావా వసుధార. నా నుండి వెళ్ళిపోయి నాకు పెద్ద శిక్ష వేశావ్" అని తనలో తాను మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత బోర్డ్ మీటింగ్ ఉంటుంది. అందులో రిషి ఫాకల్టీతో మాట్లాడుతూ ఉంటాడు. "నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థాంక్స్. అలాగే కొత్త MD కి కూడా సపోర్ట్ చెయ్యండి" అని చెప్తాడు. "మరి మీరు సర్?" అని ఒక ఫ్యాకల్టీ సర్ అడుగుతాడు. "నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు విశ్రాంతి కావాలి. కొత్త MD గా జగతి మేడం గారు బాధ్యతలు తీసుకుంటారు" అని రిషి చెప్తాడు. మీటింగ్ ముగిసాక ఫ్యాకల్టీ అంతా వెళ్ళిపోయి మహేంద్ర, జగతి, రిషి పెద్దనాన్న, రిషి ఉంటారు. "వెళ్ళక తప్పదా?" అని రిషి పెద్దనాన్న అడుగుతాడు. "గాయం మానాలంటే వెళ్ళక తప్పదు" అని రిషి బదులిస్తాడు.  కార్ లో కాలేజ్ నుండి వెళ్లిపోతూ ఉంటే వసుధార ఎదురు పడుతుంది. "రిషి సర్" అని పిలవగానే కార్ ఆపుతాడు. మళ్ళీ వసుధార అన్న మాటలను గుర్తు చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జగతి, మహేంద్రల దగ్గరికి వస్తుంది వసుధార. జగతి కోపంగా "నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావ్" అని అడుగుతుంది. "ఏంటీ మేడం అలా అంటారు. నన్ను మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఎన్నుకున్నారు కదా? ఆ వర్క్స్ స్టార్ట్ చెయ్యమని మినిస్టర్ గారి నుండి మెయిల్ వచ్చింది. అందుకే వచ్చాను. MD సర్ బయటకెళ్ళినట్టున్నారు" అని వసుధార అంటుంది. అలా అనగానే మహేంద్ర "ఇప్పుడు ఈ కాలేజీకి MD జగతి మేడం" అని చెప్పగానే వసుధార షాక్ అవుతుంది. "రిషి సర్ ఎక్కడికెళ్ళాడో తెలుసుకోవచ్చా మేడం?" అని వసుధార అడుగుతుంది. "కనపడని గమ్యాన్ని వెతుక్కుంటూ, చూడని దారుల్లో వెళుతున్నాడు" అని జగతి మేడం చెప్తుంది. ఇది విని వసుధార ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఒక్కరోజు అయిన కార్తీక్ కి భార్యగా ఉండాలని అనుకుంటున్నాను.!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ముగింపు అద్భుతంగా ఉంటుందని అఫీషియల్ గా కార్తీక్, దీపలు చెప్పారు. దీంతో‌ ఎలా‌ ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మంగళవారం నాటి ఎపిసోడ్ -1564 లో.. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కార్తీక్, దీప ఇద్దరు కలిసి దీప పుట్టింటికి వస్తారు.  దీప రిపోర్ట్ ల గురించి అందరి డాక్టర్ లకు ఫోన్ చేసి  కనుక్కుంటుంది సౌందర్య. అప్పుడే సౌందర్య దగ్గరికి మోనిత వచ్చి, ఫోన్ లాక్కుంటుంది.  "మీ కొడుకే పెద్ద డాక్టర్ కదా.. అతని వల్లనే  కాలేదు. ఇంక ఎవరి వాళ్ళ కాదు కానీ దీపని నేను ఒక్కదాన్నే కాపాడగలను. నన్ను నమ్మట్లేదా ఆంటీ" అని మోనిత అంటుంది. " విషం ఔషదం అవుతుందంటే ఎవరు నమ్ముతారు" అని సౌందర్య చెప్తుంది. "నేను చెప్పింది చేయండి. దీపని నేను బ్రతికిస్తాను. మీ కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు" అని అంటుంది మోనిత. "ఏంటీ అది?" అని సౌందర్య అడుగుతుంది. "నేను కార్తీక్ కి ఒక్క రోజు అయిన భార్యగా ఉండాలి. నాకు కార్తీక్ కి పెళ్లి చెయ్యండి. దానికి కార్తీక్ ని మీరే ఒప్పించాలి" అని అంటుంది మోనిత. "నాకు ముందే తెలుసే.. దీని వెనుక ఏదో ఉంటుందని,  నా కోడలిని ఎలా బ్రతికించుకోవాలో నాకు బాగా తెలుసు" అని మోనితతో కోపంగా అంటుంది సౌందర్య. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది సౌందర్య. కార్తీక్ దగ్గరికి సౌందర్య వచ్చి రిపోర్ట్ చూపించి అడుగుతుంది. "ఎందుకు రా మాకు ఇన్ని రోజులు చెప్పలేదు" అని సౌందర్య ఏడుస్తూ అడుగుతుంది. "దీప నాకు కావాలి మమ్మీ. దీప నా ప్రాణం. మమ్మీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దీపకి ఏం కానివ్వను. దీపను ఎలాగైనా కాపాడుకుంటాను" అని చెప్తూ ఏడుస్తాడు కార్తిక్. ఆ తర్వాత కాసేపటికి  "ఇంతకీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు. ఈ రిపోర్ట్స్ ఎవరిచ్చారు?" అని సౌందర్యని అడుగుతాడు కార్తిక్.  "మోనిత చెప్పింది" అని సౌందర్య జరిగినదంతా చెప్తుంది. "ఓహో.. నేను ఛీ కొడితే నీ దగ్గరికి వచ్చి చెప్పిందన్నమాట" అని అంటాడు కార్తిక్. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సౌందర్య ఆంటీ తను చెప్పిన దానికి ఒప్పుకోలేదని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత.  అప్పుడే సౌందర్య ఫోన్ నుండి మోనితకి ఫోన్ చేస్తుంది హిమ. "ఆంటీ.. అసలు ఏం జరుగుతుంది" అని అడుగుతుంది. "వద్దులే హిమ..నువ్వు చిన్నపిల్లవి, విని తట్టుకోలేవు" అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మోనిత. "ఇక ఏం జరుగుతుందోననే టెన్షన్ తో రాత్రంతా హిమ ఆలోచిస్తుందని" అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హైపర్ ఆది మీద మంత్రి రోజా కామెంట్స్ వైరల్...భయపెట్టి మాట్లాడిస్తున్నారు

ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంత్రి రోజా, జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం గురించి తెలిసిన విషయమే. ఇక మధ్యలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ గురించి కూడా తెలిసిందే. మరో వైపు పవన్ పై కౌంటర్స్ వేస్తూనే కమెడియన్ ఆది మాటలపై కూడా స్పందించారు.  ‘హైపర్ ఆది చిన్న ఆర్టిస్టు. అలా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో ఉండనివారు అనే భయం. ఇంకా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పెద్దది.  ఆ ఫ్యామిలీతో విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో.. వెనుక నుంచి  వెకిలిగా మాట్లాడిస్తున్నారు. ఇలా భయంతో  ఎక్కువ కాలం బతకలేరు. మంత్రులకు శాఖలు తెలియవు అంటే కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, శారద, నేను ఎలా గెలిచాం. మేమూ సినిమా వాళ్ళమే కదా ! మరి ప్రజలు మమ్మల్ని గెలిపించారు మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు ? ఎవరు ఎలాంటివారో జనాలకు తెలుసు.ఈ రాష్ట్ర ప్రజలకు అందరి గురించి తెలుసు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మైండ్ లోనూ, మనసులో ఉండాలి.. ” అని చెప్పుకొచ్చారు రోజా ఒక ఇంటర్వ్యూలో.  

ఆయన్ని అవమానించిన ఆ స్టేజి మీదకు నేను వెళ్ళేది లేదు!

"అన్ స్టాపబుల్" షో ఆహాలో ప్రసారమవుతూ ఆడియన్స్ క్రేజ్ ని సంపాదించుకున్న షో. హోస్ట్ గా బాలకృష్ణ ఈ షోని మంచిగా రక్తి కట్టిస్తున్నారు. పార్టీలకతీతంగా సెలెబ్స్ ని ఇన్వైట్ చేసి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి సందడి చేస్తున్న షో ఇది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయ్యేసరికి సీజన్ 2  కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి రోజాకి  ఇప్పటికే రెండు సార్లు ఇన్విటేషన్స్ అందాయి.  ఐతే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలిపారు.  అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినా వెళ్ళేది లేదు అని ఆమె తేల్చి చెప్పేసారు. ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి చంద్రబాబు వచ్చారో ఆ క్షణమే ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడుని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి చనిపోయిన ఎన్టీఆర్ గారిని మరోసారి అవమానించేలా మాట్లాడటం ఒక ఆర్టిస్ట్ గా  తనకు ఎంత మాత్రమూ నచ్చలేదు అని చెప్పారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే దేవుడి లెక్క అలాంటి మహా నటుడిని అవమానించి కించ పరిచిన ఆ స్టేజి మీదకు వెళ్లాలని తనకు లేదని చెప్పారు మంత్రి రోజా.

అనసూయ కోరిక తీరేనా..?

అనసూయ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కోపం వస్తే శివంగి  లేదంటే చాలా కూల్ అని. బుల్లితెర మీద అనసూయ గ్లామర్ మాత్రమే కాదు గ్రామర్ కూడా ఉన్న యాంకర్. ఇక ఈమె బుల్లితెర మీద యాంకర్ గా చేయడం మానేసి సిల్వర్ స్క్రీన్ మీద మూవీస్ లో స్పెషల్ రోల్స్ చేస్తోంది. రీసెంట్ గా ఈమె టేస్టీ తేజతో కలిసి "సంక్రాంతి స్పెషల్ లంచ్ " అనే  ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది.  తేజ ఆమెను ఎన్నో ప్రశ్నలు కూడా వేసాడు. మీ డ్రీం రోల్ ఏమిటి ? ఇలా ఇండస్ట్రీలో కి వస్తానని అనుకున్నారా ? అని. దానికి అనసూయ ఆన్సర్స్ ఇచ్చింది. "ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. కానీ అది ఛాలెంజింగ్ గా లీడ్ రోల్ లా ఉండాలి. ఆ పాత్రకు నేను మాత్రమే సూట్ అవుతాను అనే ఒక థాట్  రైటర్ లో, డైరెక్టర్ లో రావాలి. అలా వెర్సటైల్ రోల్స్ లో నటించాలని నా కోరిక. ఏ ఫిలిం మేకర్ కి ఐనా సరే నేను ఒక సేఫ్ యాక్టర్ గా ఉండడం నాకు ఇష్టం...అలా ఉంటే చాలు నా డ్రీం ఫుల్ ఫీల్ ఐనట్టే. అసలు నేను యాక్టర్ అవుతానని, ముఖానికి రంగులు పూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నేను ఆర్థోడాక్స్ ఫామిలీలో పుట్టాను. పద్ధతి తప్ప పాడు అనే మాట కూడా మా ఇంట్లో వినిపించదు. మా పేరెంట్స్ దగ్గరకు వెళ్లిప్పుడు అక్కడి పద్ధతులు, మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులు కచ్చితంగా ఫాలో అవుతాను.  నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నాన్నగారు వాళ్ళది భూదాన్ పోచంపల్లి. అమ్మ వాళ్ళది కర్ణాటక. తాతయ్య వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్స్ టైంలో ఘట్ కేసర్ కి వచ్చేసారు. నాన్నగారు నాకు పర్మిషన్ ఇచ్చాకే కెమెరా ముందుకు వచ్చాను అది కూడా న్యూస్ రీడర్ గా. అలా మెల్లగా నా దారిలో నేను అవకాశాలను అందుకుంటూ ఇంతదూరం వచ్చాను. నేను ఏం చేసినా మా నాన్నకి సంతోషమే ఎందుకంటే నాకు లోకజ్ఞానం ఎక్కువ అని అనుకుంటారు. అంతేకాదు నా మీద నాకు చాలా గర్వంగా కూడా ఉంటుంది. సంకల్పం ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనేది నా గట్టి నమ్మకం. వికీపీడియాలో మా ఆయన పేర్లు పిచ్చిపిచ్చిగా రాసేశారు. దాన్ని అసలు నమ్మకూడదు. అసలు ఇంటరెస్టింగ్ విషయం చెప్పాలంటే నేను, మా ఆయన లోన్ తీసుకుని ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నాం. మా పేరెంట్స్ ని డబ్బులు పెట్టడానికి మేం ఒప్పుకోలేదు. ఎన్ సీసీ క్యాంపులో మాకు పరిచయమయ్యింది. ఎనిమిదేళ్లు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం ". అని చెప్పింది అనసూయ.

సుమకి ప్రొపోజ్ చేసిన జానీ మాస్టర్

సుమ సుదీర్ఘ కాలం పాటు చేసిన క్యాష్ షో ప్లేస్ లోకి ఇప్పుడు "సుమ అడ్డా" అనే సరికొత్త షో స్టార్ట్ అయ్యింది. ప్రతీవారం ఈ షోకి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది సుమ. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకి రావడంతో మంచి  రేటింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ షో. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గెస్ట్స్ గా వచ్చారు.  ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఈ డాన్స్ మాస్టర్స్ ఇద్దరూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు.  ముఖ్యంగా వీరిద్దరి మీద సుమ వేసిన పంచులు వేరే లెవెల్.  శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కి మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని కూడా స్క్రీన్ పై వేసి చూపించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోలో ప్రేమదేశం మూవీ సీన్స్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఈ స్పూఫ్ లో భాగంగా మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి అని సుమ అడిగేసరికి జానీ మాస్టర్ పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగేసరికి సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. జానీ మాస్టర్ మాటలు స్టేజి మొత్తం కూడా ఈలలు కేకలే...ఇలా ఈ ఎపిసోడ్ ఫన్నీగా ఎంటర్టైన్ చేయబోతోంది. సుమ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వున్న యాంకర్. ఎంత మంది గ్లామరస్ యాంకర్స్ వచ్చినా సుమతో పోటీకి మాత్రం దిగలేకపోతున్నారు. 

కూతురికి భోగి పళ్ళు పోసి సెలబ్రేట్ చేసుకున్న రేవంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6  టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ గురించి అందరికీ తెలుసు. టైటిల్ నాదే అనే చెప్పి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి టైటిల్ తోనే తిరిగొచ్చాడు. సింగర్ రేవంత్  తోటి కంటెస్టెంట్ శ్రీహాన్ రన్నర్ గా వచ్చాడు.  ఇక రేవంత్ విన్నర్ అయ్యాడు మరో వైపు తండ్రి కూడా అయ్యాడు. టైటిల్ ని తీసుకెళ్లి తన  కూతురికి బహుమతిగా ఇచ్చాడు...ఇక రేవంత్ తన పాప ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పాప పుట్టాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున ఇంట్లో భోగి పళ్ళు పోసి వేడుక చేసాడు. ఈ సెలబ్రేషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పాప చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్  కామెంట్స్ పెడుతున్నారు.  "మకర సంక్రాంతి శుభాకాంక్షలు …మన చిట్టి తల్లి వచ్చాక సంక్రాంతి సంబరాలు !!! బొమ్మలకొలువు & భోగిపళ్లు !" అని కాప్షన్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో రేవంత్ కూడా ఒకరు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మాత్రమే కాదు గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్ కూడా.  ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక బుల్లితెర మీద షోస్ కి స్పెషల్ ఇన్విటేషన్ అందుకుంటున్నాడు రేవంత్. అలాగే బయటికి వచ్చాక హౌస్ మేట్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అలాగే ఇంటర్వ్యూస్ లో కూడా బాగా కనిపిస్తున్నాడు.

డాక్టర్ బాబుని ముద్దు పెట్టుకుని ఏడ్చేసిన వంటలక్క!

కార్తీక దీపం సీరియల్ స్టార్ మా కొన్నేళ్లుగా అలరిస్తూ ఎంటటైన్ చేస్తోంది. ఇప్పుడు ఈ సీరియల్ చివరికి వచ్చేసింది. ఆరేళ్ళ పాటు ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిన ఈ సీరియల్ ఎంతో మంది మనసుల్ని దోచుకుంది. ఈ  సీరియల్ ఈ వారంతో ముగిసిపోతుంది అనే విషయాన్ని ఇప్పటికే ఈ టీమ్  ప్రకటించింది. అందరికీ నచ్చే క్లైమాక్స్‌తో సీరియల్‌కు ముగింపు పలకబోతున్నట్లు చెప్పింది. ఫైనల్ డే షూటింగ్ అంటూ సీరియల్ లో విలన్ రోల్ చేసిన మోనిత టీమ్ మొత్తానికి స్వీట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది.  ఇక ఇప్పుడు  స్టార్‌ మాలో ప్రతీ ఆదివారం ప్రసారం అయ్యే "ఆదివారం విత్ స్టార్‌ మా పరివారం"  ప్రొగ్రామ్‌లో కార్తీకదీపం సీరియల్‌కు ఫేర్‌వెల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి  కార్తీక దీపం సీరియల్‌ మెయిన్‌ క్యారెక్టర్లు చేసిన వాళ్లంతా పార్టిసిపేట్ చేశారు. పరిటాల నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, పిల్లలు శౌర్య, హిమ, సౌందర్య అందరూ వచ్చారు. వీరికి ఘనంగా సన్మానం చేశారు. ఈ ఫేర్ వెల్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, దీప కలిసి డాన్స్ చేసి.. అందరిని ఆకట్టుకున్నారు. “ఇప్పుడే కుట్టింది చీమ.. డాక్టర్ బాబు అంటే నాకు ప్రేమ” అని కవిత్వం చెప్పి.. వంటలక్క వాహ్ అనిపించుకుంది.  ఇక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అంటే కాస్త బాధగా ఉందని నిరుపమ్ ఎమోషనల్‌ అయ్యాడు. ఆడియన్స్ అంతా కలిసి డాక్టర్ బాబు రీల్ ఫ్యామిలీకి గజమాల వేసి సత్కరించారు. చివరగా వంటలక్క కార్తీకదీపం సీరియల్‌ గురించి ఎమోషనల్‌ అవుతూ.. డాక్టర్ బాబుని ప్రేమగా హగ్ చేసుకుని ముద్దు పెట్టి ఏడ్చేసింది.

వసుధార వ్యక్తిత్వాన్ని చూసి సిగ్గుపడుతున్నానని చెప్పిన చక్రపాణి!

'గుప్పెడంత మనసు'  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్. అత్యధిక వీక్షకులను ఆకర్షిస్తోన్న ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-661 లో..  వసుధార వాళ్ళింట్లో ఒంటరిగా కూర్చొని రిషీతో గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు ఏడుస్తూ ఉంటుంది. మరో వైపు వసుధారని తల్చుకుంటూ రిషి తన ఇంట్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. వసుధార ఎందుకిలా చేసిందని పదే పదే అనుకుంటూ ఉంటాడు. వసుధార వాళ్ళ అమ్మనాన్నలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నాన్న చక్రపాణికి అన్నం తినిపిస్తుండగా.. తను వసుధారని అన్న మాటలు గుర్తుచేసుకొని చక్రపాణి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. "ఎందుకు నాన్న ఏడుస్తున్నావ్?" అని వసుధార అడుగుతుంది. "నీ వ్యక్తిత్వాన్ని చూసి సిగ్గు పడుతున్నాను అమ్మా" అంటు చక్రపాణి బాధతో చెప్తాడు. "ఏడవకండి నాన్నా" అంటూ కన్నీళ్ళు తుడుస్తుంది వసుధార.  సూట్ కేస్ తీసుకొని రిషి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న దేవయాని, జగతి, మహేంద్ర చూస్తారు. రిషిని ఆపుతుంది దేవయాని. "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడుగుతుంది. "ఈ బంధం శాశ్వతం కానప్పుడు, తను నాతో లేనప్పుడు ఇంకెందుకని అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను" అని రిషి అంటాడు.  "ఏదో జరిగిందని పరిస్థితులకు భయపడి పారిపోతున్నావా?" అని మహేంద్ర అడుగుతాడు. "పరిస్థితులకు భయపడేంత పిరికివాణ్ణి కాదు డాడీ. ఈ బాధ పోవాలంటే నన్ను నేను శిల్పిగా చెక్కుకోవాలి" అని రిషి అంటాడు. "నువు వెళ్తే కాలేజీని ఎవరు చూసుకుంటారు?" అని దేవయాని అడుగుతుంది. "కాలేజీ అన్ని బాధ్యతలు జగతి మేడం చూసుకుంటుంది. ఆల్రెడి మేడంకి మెయిల్ చేశాను" అని రిషి సమాధానమిస్తాడు. "మెయిల్ చేస్తే అయిపోతుందా.. మినిస్టర్ గారు ఒప్పుకుంటారా?" అని దేవయాని అడుగుతుంది‌. "మినిస్టర్ గారికి కూడా మెయిల్ చేశాను" అని రిషి అంటాడు. "ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా?" అని మహేంద్ర అడుగుతాడు. "అత్యంత అవసరం డాడీ" అని రిషి సమాధానమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.