మారు పేరుతో తిరిగిన సుధీర్ బాబు!

'సుమ అడ్డా' షో ఆలీతో సరదాగా షోకి పోలినట్టుగా ఉంటుంది. అందులో ఆలీ ఎలా ఐతే రకరకాల ప్రశ్నలు వేస్తారో సుమ అడ్డాలో కూడా ఆ సెగ్మెంట్ సేమ్ గా ఉంటుంది. ఇక ఈ వారం ఈ షోకి వచ్చిన హంట్ మూవీ టీమ్ నుంచి సుధీర్ బాబుని కొన్ని ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది సుమ. "మీరూ జూనియర్ ఎన్టీఆర్ కలిసి బాడ్మింటన్ ఆడేవారట కదా" అని అడిగేసరికి "ఆయన నాకు జూనియర్.. నేను సీరియస్ గా నేషనల్స్ కి ఆడాను.. ఎన్టీఆర్ మాత్రం డబుల్స్ చాలా బాగా ఆడతాడు.. ఆయన ఆటిట్యూడ్ గ్రౌండ్ లో బాడ్మింటన్ ప్లేయర్ లా ఉండదు.. కబడ్డీ ప్లేయర్ లా ఉంటుంది. డబుల్స్ ఆడేటప్పుడు ఆయన తొడ కొట్టి మరీ ఆడతారు. అలా ఉండే ఆయన ఎనర్జీ ఇప్పుడు స్క్రీన్ మీదా అలాగే ఉంది" అన్నాడు సుధీర్ బాబు.  "సుధీర్ బాబు అంటే ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అని ఇండస్ట్రీలో పేరు కదా మరి కొన్ని టిప్స్ చెప్పండి" అని సుమ అడిగేసరికి బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ మీద భరత్, సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీ పిక్స్ వేశారు. ఒకవేళ మీ ముందర డిజర్ట్ ఉంటే ఏం చేస్తారు అని అడిగేసరికి "తినేస్తాం..ఎక్సరసైజ్ చేయకుండా తింటే ప్రాబ్లమ్ కానీ తినేసి ఎక్సరసైజ్ చేస్తూ ఉంటే ఎలాంటి సమస్య రాదు" అని చెప్పారు. "ఫిట్ గా ఉండడం అంటే ఇది.. తాగేసి ఫిట్ గా ఉండడం కాదు" అని చెప్పింది. "అవును మీకు పిఎస్ బి..నాగేంద్ర అనే వ్యక్తితో దగ్గర సంబంధం ఉందట" అని అడిగింది. "నేను బాడ్మింటన్ ఆడేటప్పుడు దాన్ని కెరీర్ గా తీసుకోవడం అనే దాన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నేను బెంగళూరు లో చదువుకుండేవాడిని...అక్కడ నుంచి నేను బాడ్మింటన్ నేషనల్స్ కి వెళ్ళేటప్పుడు పేపర్ లో వచ్చేది సుధీర్ బాబు వన్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అని ...అలా ఆ పేరు రాకుండా ఉండడం కోసం నా పేరును పిఎస్ బి.నాగేంద్రగా పేరు మార్చేసుకున్నా" అని చెప్పేసరికి "మారు పేరుతో తిరిగిన సుధీర్ బాబు" అని కామెడీ చేసింది సుమ.  మీరు ఎస్ఎంఎస్ మూవీ చేశారు కదా అలా ఒక ఎస్ఎంఎస్ పంపించి ప్రియా గారిని పడేశారట కదా అని సుమ అడిగేసరికి సుధీర్ సిగ్గు పడుతూ "పడేయలేదండి.. అలా ఆమెను ఎవరూ పడేయలేరు" అన్నాడు. మీకు మహేష్ బాబు అంతకు ముందే మీకు తెలుసా అని సుమ అడిగేసరికి "అంతమందు మాములుగా తెలుసు ఎలా అంటే మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు. మహేష్ బాబు అమ్మమ్మ, మా అమ్మ ఫ్రెండ్స్.. అలా అందరం ఫామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం.. అంతే కాదు..ఇద్దరిలో సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి..ఇద్దరినీ ఒక రూమ్ లో పడేస్తే..లోపల మేమున్నామని ఎవరికీ తెలీదు..."అని ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు సుధీర్ బాబు.

రాజ్ తో డీల్ కుదుర్చుకున్న కావ్య!

స్టార్ మాలో ప్రసారమవుతన్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్-5 లోకి అడుగుపెట్టింది. శనివారం నాటి ఎపిసోడ్ లో రాజ్ మళ్ళీ తిరిగి కావ్య దగ్గరికి వస్తాడు. కావ్య, రాజ్ లకు ఇద్దరికి  అవసరం ఉంది కాబట్టి ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ "పూజ టైంకి జరగాలి.. మీరు వచ్చి ఆభరణాల డిజైన్ వేయండి" అని అంటాడు. అలా అనగానే "మీరు నాకు పూజకి ఎంట్రీ పాస్ లు ఇస్తేనే వస్తాను" అని చెప్తుంది. దానికి రాజ్ ఒప్పుకొని వాళ్ళింటికి తీసుకొస్తాడు. ఆ ఎంట్రీ పాస్ లు కనకంకి ఇస్తుంది కావ్య. కనకం ఆ ఎంట్రీ పాస్ లని పట్టుకొని శుభలేఖ అని సంతోషంతో గెంతులేస్తుంది.  కావ్య, రాజ్ వెళ్లేసరికి ఇక పూజ ఆగిపోతుందా అంటూ అందరూ అనుకుంటారు. అప్పుడే కావ్య, రాజ్ ఇద్దరు సీతారామయ్య దగ్గరికి వస్తారు. "పూజ జరుగుతుంది తాతయ్య... ఇదిగో ఆభరణాలు డిజైన్ వేసే అమ్మాయిని తీసుకొచ్చాను" అని కావ్యని చూపిస్తాడు. "సరే దగ్గర ఉండి ఆ అమ్మాయికి కావలసిన ఏర్పాట్లు చేయ్" అని సీతారామయ్య అంటాడు. కావ్య డిజైన్ వేసి అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సీతారామయ్య మెచ్చుకోవడంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. "కావ్యకి తగిన పారితోషికం ఇవ్వు" అని సీతారామయ్య చెప్తాడు. ఎంట్రీ పాస్ లు పొందిన కనకం.. తన కూతుళ్ళని ఆ ఇంటికి ఎలా పరిచయం చేస్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ ని తలపిస్తున్న 'బిబి జోడి'!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బిబి జోడి' ఆసక్తికరంగా సాగుతోంది. నువ్వా నేనా అంటూ ఒక్కో జోడి తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో మెప్పిస్తున్నారు. శనివారం నాటి ఎపిసోడ్ లో 'జడ్జెస్ ఛాలెంజ్ రౌండ్' లో ఒక్కో జోడీకి ఒక థీమ్ ని ఇచ్చారు. అందరూ ఎవరికిచ్చిన థీమ్ ని వారు బాగా పర్ఫామెన్స్ చేసారు. ఒక్కో జోడీని జడ్జ్ లు బాగుంటే మెచ్చుకోవడం, లేకుంటే మిస్టేక్ చెప్పడం చేస్తారు. అయితే అక్కడ ఉన్న జోడీలలో ఎవరికి వారే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.   అసలేం జరిగిందంటే అభినయశ్రీ - కౌశల్ డ్యాన్స్ ఇరగదీసారు. ఆ విషయాన్ని జడ్జ్ లు కూడా బాగుందని చెప్పి మంచి స్కోర్ ని కూడా ఇచ్చారు. అయితే మిగిలిన జోడీలు స్కోర్ ఇచ్చే విషయంలో గొడవకు దారి తీసింది. 'ఫైమా- సూర్య జోడి తక్కువ స్కోర్ ఇచ్చారు. "కౌశల్.. మీరు డ్యాన్స్ చేయలేదు.. ఫీమేల్ డ్యాన్స్ ఎక్కువగా కన్పించింది. మధ్యలో ఫీమేల్ లిప్ సింక్ మీరు పాడారు. అందుకే స్కోర్ తగ్గించాం" అని ఫైమా చెప్పింది. "అసలు క్యాబ్ రే డ్యాన్స్ అంటే మీకేం తెలుసు" అని కౌశల్ అనగా.. మాటా మాటా పెరిగింది. ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. అప్పుడు రాధ కల్పించుకొని.. "ఫైమా.. డాన్స్ వాళ్ళు చెయ్యలేదంటే నేను ఒప్పుకోను.. స్కోర్ అనేది రీజనబుల్ గా ఉండాలి. దేని గురించి అయినా తెలుసుకొని మాట్లాడాలి. మీకు టైం వస్తుంది. అప్పుడు చూసుకోండి" అంటూ కౌశల్-అభినయశ్రీకి చెప్పింది రాధ.  మరొక జోడి అయిన అఖిల్- తేజస్విని వాళ్లు చేసిన పర్ఫామెన్స్ ని జడ్జిలు బాగుందంటూ అందరూ తెగ పొగిడేశారు. కానీ అభినయశ్రీ-కౌశల్ వాళ్ళు ఆ జోడీకి తక్కువ స్కోర్ ఇచ్చారు. దీంతో అఖిల్, కౌశల్ మధ్య గొడవ జరిగింది. మళ్ళీ రాధ కలుగజేసుకొని సర్దిచెప్పింది. అయితే ప్రతీసారీ జోడీలను స్కోర్స్ అడిగేటప్పుడు కావాలనే స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారని అవి గొడవలకు దారితీస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఈ గొడవలు బిగ్ బాస్ ని తలపించేలా ఉన్నాయి. 

వైఫ్ ని ఎలా కంట్రోల్ చేయాలో గూగుల్ లో సెర్చ్ చేసిన సుధీర్ బాబు

'సుమ అడ్డా' ఈ వారం ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోకి 'హంట్' మూవీ టీమ్ నుంచి సుధీర్ బాబు, భరత్, డైరెక్టర్ మహేష్ వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్ బాబు తన మొబైల్ ఫోన్ లో గూగుల్ లో ఎక్కువగా ఎలాంటి విషయాలను సెర్చ్ చేశారో చూపించింది సుమ. "వైఫ్ ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి" అని సెర్చ్ చేస్తే ఎం ఆన్సర్ వచ్చింది అని అడిగేసరికి "గూగుల్ నో ఆన్సర్" అని చెప్పింది అన్నారు సుధీర్. "డైట్ ఫాలో అవకుండా 12 పాక్స్ రావాలంటే ఏం చేయాలి " అన్న  ప్రశ్నకు  "ఏం చేయకూడదు" అని ఆన్సర్ ఇచ్చారు. "వైఫ్ కి ఈజీగా వండి పెట్టే ఫుడ్ ఏది" అని అడిగేసరికి "కాఫీ ఇస్తా" అన్నారు. "రొమాంటిక్ సీన్స్ లో సిగ్గు పడకుండా ఎలా యాక్ట్ చేయాలి అన్న"ప్రశ్నకు "అప్పుడు భరత్ కి ఫోన్ చేస్తా" అని చెప్పారు. "ఏజ్ ఎప్పటికీ పెరగకుండా యంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి" అని సుమ అడిగేసరికి "అప్పుడు మీకు ఫోన్ చేసి సలహా తీసుకుంటా" అని కౌంటర్ వేసాడు. దానికి సుమ కళ్ళలో మెరుపులు కనిపించాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పింది. ఇలా సరదాగా ఒక సెగ్మెంట్ సాగిపోయింది.  ఇక ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెగ్మెంట్ ని కొంచెం లోతుగా పరిశీలిస్తే గనక ఒక విషయం అర్ధమవుతోంది. ఇది ఒక కొత్త ఫార్మాట్. విడిగా కార్డ్స్ మీద ప్రశ్నలు రాసుకొచ్చి అడగడం అనేది అరిగిపోయిన స్ట్రాటజీ కాబట్టి మొబైల్ ఫోన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసుకుంటే బాగుంటుంది అనే ఒక ఫార్ములా  అందరిలో ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుంది..ఆ వైపుగా ఆలోచించిన ఈ షో మేకర్స్ దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. హోస్ట్ అడిగే ప్రశ్నలను షూటింగ్ టైములోనే గెస్ట్స్ మొబైల్ లో సెర్చ్ చేసి పెట్టుకుంటారు. ఇక షోలోకి వచ్చేసరికి యాంకర్ అడగాల్సిన ప్రశ్నలు అవే కాబట్టి వాటికి ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళు. సోషల్ మీడియా పెరిగిపోయాక ఆడియన్స్ ని మెప్పించడానికి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల ట్రిక్స్ ని ప్రయోగిస్తున్నారు.

నా హీరోలందరిని లాగేసుకున్నావ్!

స్టార్ మాలో బిగ్ బాస్ అయిపోయాక.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ప్రారంభించిన షో 'బిబి జోడి'. అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షోలో జడ్జ్ లుగా సదా, తరుణ్ మాస్టర్, రాధా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ గా శ్రీముఖి చేస్తోంది. శనివారం ప్రసారమైన 'బిబి జోడి' షోలో 'అభినయశ్రీ-కౌశల్' జోడికి  'క్యాబ్ రే' ఐటమ్ సాంగ్ థీమ్ ని ఇచ్చారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన ఈ సాంగ్‌ పర్ఫామెన్స్ లో ఐటమ్ గర్ల్ గా అభినయశ్రీ ఓల్డ్ సాంగ్స్ నుండి న్యూ సాంగ్స్ వరకూ అన్నింటికి సరైన హావభావాలను పలికిస్తూ.. ఎక్కడా ‌ కూడా తగ్గకుండా ఒదిగి పోయి చేసింది. ఈ డ్యాన్స్ పూర్తయ్యాక పర్ఫామెన్స్ ఎలా ఉందని శ్రీముఖి జడ్జ్ లను అదిగింది. దానికి తరుణ్ మాస్టర్ "మీ అమ్మ కంటే బాగా చేసావ్" అని అంటాడు. రాధ మాట్లాడుతూ "మీ అమ్మ కాకుండా.. ఆ డ్యాన్సర్ గా ఎవరినీ ఒప్పుకోను. కానీ నిన్ను ఒప్పుకుంటా అంటుంది. ఆ తర్వాత జడ్జ్ సదా "మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్" అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీముఖి సర్ ప్రైజ్ అంటూ... అలనాటి డాన్సర్ అభినయశ్రీ తల్లి అయిన అనురాధని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంది. అలా వచ్చాక "నేను ఎక్కువ సినిమాలు రాధతో చేశాను. ఇప్పుడు తనని ఇలా చూడటం సంతోషంగా ఉంది" అని అనురాధ అంటుంది. "నా హీరోలని లాక్కోవడమే కదా నీ పని" అని రాధ సరదాగా  అంటుంది. ఆ తర్వాత స్టేజి మీద రాధ, అనురాధ, అభినయశ్రీ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. ఇది హైలెట్ ఆఫ్ ది ఎపిసోడ్ గా ఆకట్టుకుంది. "మా అమ్మ ఒంటరిగా ఎన్నో అవమానాలు భరిస్తూ... నన్ను మా తమ్ముడిని ఇక్కడివరకు తీసుకొచ్చింది" అని అభినయశ్రీ ఎమోషనల్ అయ్యింది.

మహేంద్రకి చక్రపాణి నిజం చెప్పనున్నాడా!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -672 లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో... రిషీతో దేవయాని మాట్లాడి వెళ్ళిపోతుంది.  రిషి మళ్ళీ కాలేజీకి వస్తున్నాడు సంతోషంగా ఉందని జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటారు. అక్కడే ఉన్న ధరణి "పెద్ద అత్తయ్య గారు వెళ్లి వచ్చాక రిషిలో మార్పు వచ్చింది" అని అంటుంది. అది విని ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసిందని మహేంద్ర అంటాడు. "ఎప్పుడూ రిషి, వసుధారలు విడిపోవాలని అనుకుంటుంది. అంతా ఆవిడ అనుకున్నట్టే జరిగింది" అని దేవయాని గురించి జగతి అంటుంది. ఇంతలోనే పెద్ద అత్తయ్య గారు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే సంతోషంగా ఉంటుంది అని ధరణి అనగా, నాక్కూడా అలాగే అనిపిస్తుంది అని మహేంద్ర అంటాడు.  ఇంతలోనే మహేంద్ర ఇంటికి చక్రపాణి వస్తాడు. జరిగిందంతా చెప్పడానికి వస్తాడు. దాంతో ఎందుకు వచ్చావ్ అని మహేంద్ర కోపంగా అంటాడు. చక్రపాణి అన్న మాటలు గుర్తు చేస్తుంది జగతి. "నన్ను ఆ రోజు అన్ని మాటలు అన్నారు.. దయచేసి వెళ్ళండి.. మీలాగా మాట్లాడలేం.. మాకు సభ్యత సంస్కారం ఉన్నాయి" అని అంటుంది. అప్పుడే వసుధార వచ్చి చక్రపాణిని చెప్పకుండా ఆపుతుంది. "వసుధార గారు... మీరు వెళ్ళండి ఇక్కడి నుండి వెళ్ళండి. మీకు నమస్కారం చేస్తున్న వెళ్ళండి" అని జగతి అంటుంది. చక్రపాణి, వసుధారలను అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జంతు బలులు జరుగుతున్నాయని తెలిస్తే సమాచారం ఇవ్వండి!

రష్మీ గౌతమ్.. బుల్లితెర మీద ప్రస్తుతం ఏలుతున్న యాంకర్స్ లో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. కామెడీ షోకి యాంకర్ గా చేస్తూనే టాలీవుడ్ లో చిన్న మూవీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ చేసింది అమ్మడు. అలా స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి ప్రమోట్ ఐన యాంకర్స్ లో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. రష్మీ యాంకర్ మాత్రమే కాదు జంతు ప్రేమికురాలు కూడా. వాటి కోసం సోషల్ మీడియాలో ఫుల్ ఫైట్ చేస్తూ ఉంటుంది. మూగ జీవాలను ఎవరైనా బాధ పెట్టినా, హింసించినా.. చిన్నా పెద్దా అని కూడా చూడకుండా ఏకిపారేసి ఉతికారేస్తుంది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, త్రిపుర, కేరళ ప్రాంతాల్లో జంతు బలులకు సంబంధించి ఎవరికైనా ఖచ్చితమైన సమాచారం ఉంటే గనక వెంటనే దానికి సంబంధించిన మొత్తం సమాచారంతో సహా అలాగే ఏవైనా ఫోటోలు ఉంటే వాటిని కూడా జత చేసి ఎక్కడ జరిగిందో ఆ లొకేషన్ తో సహా ఈ కింది అడ్రస్ కి మెయిల్ చేయండి"  అంటూ రష్మీ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది.  రష్మీగౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. జబర్దస్త్ వేదిక మీద సుడిగాలి సుధీర్ - రష్మీ రీల్ పెయిర్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. ఐతే ప్రస్తుతం వీళ్ళు వేరువేరుగా షోస్ చేసుకుంటున్నా కూడా ఏదో ఒక సందర్భంలో వీళ్ళను టార్గెట్ చేసి కామెడీ బిట్స్ చేస్తూనే ఉంటారు కమెడియన్స్.

కిచెన్ సామాన్లు చూసినా ఆడవాళ్లు చంద్రముఖిలా తయారైపోతారు!

షాపింగ్ అంటేనే ఆడవాళ్ళకు ఫేవరేట్.. అలాంటిది ఆన్లైన్ షాపింగ్ అంటే ఇంక ఊరుకుంటారా.. కొత్త కొత్త ప్రొడక్ట్స్ కోసం మంచిగా, తక్కువ ధరలో దొరికే వాటి కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈమధ్య ఆన్లైన్ షాపింగ్ ని ఆడవాళ్లు ఇష్టపడుతున్నారు అంటే రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బుల్లితెర నటి శ్రీవాణి కూడా ఆ కోవలోకి వచ్చి తమ కొత్త ఇంటికి కావాల్సిన సామాన్లను ఆన్లైన్ లో తెప్పించుకుంది. అవి తాను ఎప్పుడూ వాడనివి తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చూడనివి తెప్పించుకుంది. ఇప్పుడు వాటిని కొత్త ఇంటికి షిఫ్ట్ చేసాక వాటిని ఓపెన్ చేసి తన ఫాన్స్ కోసం ఒక వీడియో చేసి "మేడం అంతే" యూట్యూబ్ లో అప్ డేట్ చేసింది.  శ్రీవాణి వాళ్ళది వైట్ కలర్ కిచెన్ కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేలా వస్తువులు అన్నీ కూడా వైట్ కలర్ లొవే తీసుకుంది. కాఫీ, టీ, షుగర్  వేసుకునే జార్స్,  గెస్ట్స్ వస్తే సర్వ్ చేయడానికి కలర్ ఫుల్ ప్లేట్, అలాగే తన హస్బెండ్ ఉదయాన్నే ఆమ్లెట్లు తింటాడు కాబట్టి ఒక్కో ఆమ్లెట్ వేయడానికి టైం పడుతుందని ఒకేసారి నాలుగు ఆమ్లెట్లు వేసే పాన్ తీసుకుంది. ఇంతలో శ్రీవాణి హస్బెండ్ విక్రమ్ వచ్చి తనకు అస్సలు ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టం ఉండదు అని ఆ వస్తువుల్ని చూస్తే తనకు కోపం వస్తుందని పక్క గదిలో కూర్చున్నట్లు చెప్పాడు. కానీ ఆన్లైన్ వస్తువులు అన్ని బాగున్నట్టే కనిపిస్తున్నాయి కానీ కొన్ని మాత్రం అస్సలు బాలేదు..ఆన్లైన్ షాపింగ్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే తమవి ఓవర్ సైజు బాడీస్ కాబట్టి ఏవి కొనుక్కున్న సైజెస్ సెట్ కావని చెప్పాడు.  ఇక గుడ్లు పెట్టుకోవడానికి ఒక వెరైటీ బ్లాక్ కలర్ గిన్నె లాంటి దాని మీద పింగాణీ కోడిని తీసుకుని ఇప్పుడు చెప్పండి హెన్ బాస్కెట్ ఎలా ఉంది అనేసరికి "అందరూ ఆన్లైన్ షాపింగ్ చేయండి ఆరోగ్యానికి బాగుంటుంది" అన్నాడు విక్రమ్ ఫన్నీగా.."నగలనే కాదు కిచెన్ సామాన్లు చూసినా చాలు ఆడవాళ్లు చంద్రముఖిలా తయారైపోతారు" అంది శ్రీవాణి.. అంతే కాదు కలర్ ఫుల్ కత్తుల్ని కూడా కిచెన్ కోసం ఆర్డర్ చేసి తెప్పించుకుంది. అలాగే స్టోన్స్ తో చేసిన స్పూన్స్ బాగా నచ్చాయంటూ చెప్పింది. చపాతి బాక్స్, వాటర్ జార్, కలర్ ఫుల్ చిన్న స్పూన్స్, అలాగే పానీపూరి ప్లేట్స్, డ్రింక్స్ తాగడానికి గ్లాసెస్, ఐస్ క్యూబ్స్ మౌల్డ్స్ ఇలా తన కొత్త ఇంట్లోకి రకరకాల సామాను కొనుక్కుని ఫుల్ ఎంజాయ్ చేసింది శ్రీవాణి.

'కార్తీకదీపం' సీరియల్ ని 'బ్రహ్మముడి' బీట్ చేస్తుందా?

స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ కార్తీకదీపం ముగిసాక మొదలైంది. షారుక్ ఖాన్ ఈ సీరియల్ ని ప్రమోట్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పటిదాకా జరిగిన ఎపిసోడ్ లలో ఒక మిడిల్ క్లాస్, డబ్బున్న వాళ్ళకి ఉన్న వ్యత్యాసాలు చూపించాడు డైరెక్టర్. ఇక హీరో రాజ్ పాత్రని,  హీరోయిన్ కావ్య పాత్రలని ఇద్దరు వేరు వేరు అభిరుచులు గలవారిలా భిన్నాభిప్రాయాలతో పరిచయం చేశాడు డైరెక్టర్. ఇక హీరోయిన్ కావ్య అమ్మ పాత్రలో కనకంని ఎలివేట్ చేసిన తీరు ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉండే మహిళలను ప్రతిబింబించేలా మలిచాడు. తనలా తన కూతుళ్ళు కష్టపడకూడదని, గొప్పింటికి కోడళ్ళని చేయాలనే ఆశపడే పాత్రలో ఇమిడిపోయింది కనకం. కావ్య తండ్రి మాత్రం నీతిగా నిజాయితీగా ఉండాలి అని, ఉన్నదాంట్లో సర్దుకొనిపోదాం అన్నట్టుగా ఉంటాడు. కావ్య చెల్లి చదువుకునే స్తోమత లేక పిజ్జా డెలివరీలో జాయిన్ అయ్యి టామ్ గర్ల్ గా తయారవుతుంది. అలాగే కావ్య అక్క స్వప్న గ్లామర్, మేకప్ అంటూ తన అందాన్ని కాపాడుకోవాలని, గొప్పింటికి వెళ్ళాలని పెళ్ళి గురించి కలలు కంటుంది. హీరో రాజ్ ఒక ధనవంతుడిలా, గర్వం కలిగినవాడిలా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు. ఒకతను కవితలు వ్రాస్తూ, మరొకతను రాజ్ ఏది కోరుకుంటే అతడికంటే ముందు తను సొంతం చేసుకోవాలనుకుంటాడు. వీళ్ళకి గాఢ్ ఫాదర్ లా తాతయ్య  సీతారామయ్య.. ఆయన మాట మీదే అందరూ ఉండటం బాగుంది. డైరెక్టర్ ప్రతీ క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. 'కార్తీకదీపం' సీరియల్ ఎలాగైతే బజ్ క్రియేట్ చేసిందో అలాగే ఈ సీరియల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సీరియల్ ప్రస్తుతం అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతోంది.

నీ భార్యకు దూరంగా ఉండాలి.. అప్పటిలా నాతో ప్రేమగా ఉండాలి!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్-66 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో... మురారి వస్తున్న విషయం తెలిసి అందంగా ముస్తాబై ఎదురుచూస్తూ ఉంటుంది ముకుంద. మురారి వచ్చి డోర్ దగ్గర నిలబడగానే సంతోషపడి లోపలికి పిలుస్తుంది. "ముకుంద మనింటికి వెళ్దాం పదా" అని మురారి అడుగగా... "మన ఇల్లా?  నాకు అక్కడ విలువ ఉందా? నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉన్నావు" అని ముకుంద అంటుంది. దానికి మురారి "నీకు పెళ్లి అయింది... ఆదర్శ్ వస్తాడు. నువ్వు అక్కడే ఉండాలి" అని అంటాడు. "నువ్వు నా పాత మురారిలా నాతో ప్రేమగా ఉంటే వస్తాను. నాకు నువ్వు ఒక మాట ఇస్తే వస్తాను. నువ్వు కృష్ణకి దూరంగా ఉండాలి. ఎలాగు నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అని అన్నావు... దానినే కంటిన్యూ చెయ్" అని ముకుంద చెప్తుంది.  మురారి మౌనంగా ఉంటాడు. "ఏంటీ మౌనంగా ఉన్నావ్.. మౌనం అంగీకారం అనుకోవాలా? నీ ప్రేమ కోసం పరితపిస్తున్న నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ నాకు వరంగా ఇవ్వు. నువ్వు నేను మన ప్రేమ అంతే" అని ముకుంద అంటుంది. "సరే వెళ్దాం" అని మురారి అంటాడు. కలిసి ప్రేమగా భోజనం చేద్దాం అని ముకుంద అనేసరికి ఇంతలో ముకుంద వాళ్ళ అమ్మనాన్నలు వస్తారు. ముకుందని కాఫీ తీసుకొని‌ రా అని చెప్పి.. "మీ ప్రేమ‌ విషయం నాకు తెలుసు.. ఆ ఇంటి పరువు, ఈ ఇంటి పరువు కాపాడాల్సిన భాద్యత నీపై ఉంది" అని మురారితో ముకుంద నాన్న చెప్తాడు. మరో వైపు నందినితో ఆడుకుంటున్న కృష్ణని రేవతి కోప్పడుతుంది. నీ భర్త గురించి ఎదురు చూడాలి గాని ఇలా ఆటలు ఏంటీ? అని రేవతి విసుక్కుంటుంది. ముకుందని తీసుకొని మురారి వస్తుండగా... మధ్యలో ఐస్ క్రీం తిందామని అంటుంది ముకుంద. మరోవైపు ఎవరైనా చూస్తారేమోనని మురారి ఇబ్బంది పడతాడు. మురారితో ఐస్ క్రీం తింటూ సెల్ఫీ తీసుకుంటుంది ముకుంద. ఆ  తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు

షామ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా నటించింది...కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. లాస్ట్ ఇయర్ జూన్ లో దుబాయ్‌కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఫామిలీ మెంబర్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాను గర్భం దాల్చినట్టు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ చెప్పింది. ఇప్పుడు పూర్ణ ఇంట్లో బేబీ షవర్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోస్ ని పూర్ణ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. పూర్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీల్లో కూడా కొన్ని షోస్‌లో జడ్జిగా వ్యవహరించింది. పూర్ణ సీమంతం ఫంక్షన్ కి వాళ్ళ రిలేటివ్స్ అంతా వచ్చారు. పళ్ళు , పూలు ఇచ్చి తీపి తినిపించి అందరూ ఆమెను ఆశీర్వదించారు. పూర్ణకి ఎంతో ఇష్టమైన చేచి కూడా వేడుకకు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.  తన ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా కూడా "ఆ అల్లా దయ నీ మీద, నీ బిడ్డ మీద  ఎల్లప్పుడూ ఉండాలి" అంటూ విష్ చేశారు. పూర్ణ కూడా అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. పూర్ణ దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ'లో ఒక రోల్ లో నటించింది. మరి త్వరలో పూర్ణ ఒడిలోకి ఒక బిడ్డ రాబోతుందంటూ ఆమె ఫాన్స్, నెటిజన్స్ ఆమెను విష్ చేస్తున్నారు.

ఓన్ ప్రొడక్షన్ హౌస్ పనుల్లో వంటలక్క...

ప్రేమి విశ్వనాధ్ అంటే కొంత మందికే తెలుస్తుంది అదే వంటలక్క అంటే మాత్రం  ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అలాంటి వంటలక్కను కార్తీక దీపం 2 వచ్చేవరకు  చూడలేము అని చాలామంది బాధపడుతున్నారు. మరి సీరియల్ ఐపోయింది కదా ప్రస్తుతం వంటలక్క ఎం చేస్తోందో అనుకుంటున్నారు ఆమె ఫాన్స్. ఐతే  వంటలక్క కొచ్చిలో ఏర్పాటు చేసుకున్న తన సొంత ప్రొడక్షన్ హౌస్ వి-మీడియా పనులు చూసుకుంటోంది. కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన తన ప్రొడక్షన్ హౌస్ ఓపెనింగ్ సెరిమనీకి  మలయాళం ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.  ఇక ఇప్పుడు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది వంటలక్క. రీసెంట్ గా  వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ కి "భారతీయ చలనచిత్ర నిర్మాత, నటుడు ఐన సురేష్ కుమార్ విజిట్ చేశారు. రేవతి కళామందిర్ బ్యానర్‌పై ఆయన మూవీస్ తీస్తూ ఉంటారు..అలాంటి గొప్ప వ్యక్తి మా స్టూడియోని సందర్శించినందుకు ధన్యవాదాలు. రాబోయే ప్రాజెక్ట్స్ లో గ్రేట్ సక్సెస్ ని అందుకోవాలని కోరుకుంటున్నాం" అంటూ ఆయనతో ఫోటో దిగింది. ఆ ఫోటోని ఈ కాప్షన్ కి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది.  ఇక నెటిజన్స్ వంటలక్కను ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉందని, ప్రొడక్షన్ హౌస్ ద్వారా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అందరూ విషెస్ చెప్తున్నారు.

ఆయన నా ఫేవరేట్..ఎలాంటి సలహా కావాలన్నా ఆమెకే చెప్తా!

సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాక చాలామంది ఫేమస్ అయ్యారు. బుల్లితెర మీద సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళల్లో  ఒక  అమ్మాయి శ్వేతా నాయుడు. వెబ్ సిరీస్ చేస్తూ, డాన్స్ వీడియోస్, ఫోటో షూట్స్ వంటివి చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఇప్పుడు శ్వేతానాయుడు తన ఇన్స్టాలో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అనే టాస్క్ ని ఇచ్చింది. నెటిజన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలకు శ్వేతా ఆన్సర్స్ ఇచ్చింది. "రవికృష్ణ అన్న గురించి ఒక్క మాటలో ఎం  చెప్తావ్" అని అడిగిన ప్రశ్నకు "అతను చాలా క్యూట్...నా ఫేవరెట్స్ లో ఆయన కూడా ఉన్నారు" అంది. "లాస్య అక్క గురించి మీ అభిప్రాయం" అని అడిగిన ప్రశ్నకు "నాకు ఎలాంటి సజెషన్ కావాలి అన్నా నేను లాస్య అక్కని అడుగుతాను. తను నాకు మంచి కంపెనీ, మంచి ఫ్రెండ్, ప్యూర్ సోల్..ఐ లవ్ హర్" అని చెప్పింది.  ఇక "నీ పప్పీస్ ఎలా ఉన్నాయి" అని అడిగేసరికి "సూపర్ గా ఉన్నాయి" అని రిప్లై ఇచ్చింది.  బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ గర్ల్ ఫ్రెండ్ గా సోషల్ మీడియాలో శ్వేతా నాయుడికి ఫుల్ హైప్ ఉంది. ఇక ఈమె నయనీపావనీతో కలిసి ఢీ-14 లో సందడి చేసింది.  

స్కూల్ ఏజ్ లోనే లవ్ లెటర్స్ అందుకున్న స్నేహ

మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో ప్రతీ వారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాబోయే వారం కంటెస్టెంట్స్ కి "స్కూల్ థీమ్" ని ఇచ్చారు. ఇక ఈ షోకి స్నేహ, శివబాలాజీ జడ్జెస్ గా ఉన్నారు. "స్కూల్లో లవ్ లెటర్స్ ఏమన్నా వచ్చాయా" అని హోస్ట్ శ్రీముఖి స్నేహని అడిగేసరికి " చాలా లవ్ లెటర్స్ వచ్చాయి. నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి వచ్చాయి" అని ఆన్సర్ చెప్పింది.  ఇక శ్రీవాణి ఫామిలీ అలాగే ఇంకొంతమంది కలిసి స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఫన్నీ  స్కిట్ చేశారు. వీళ్లంతా క్లాస్ రూమ్ లో కూర్చుంటే టీచర్ వచ్చి పాఠాలు చెప్తూ "పండగంటే ఏమిటి" అని అడిగిన ప్రశ్నకు " పండగ అంటే ఈటీవీ ఈవెంట్" అంటూ ఒక స్టూడెంట్ కొంటెగా ఆన్సర్ ఇచ్చింది. ఇంతలో రాకింగ్ రాకేష్ వచ్చి "శివ ధనుస్సు ఎవరు విరిచారు" కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి అని అడిగేసరికి శ్రీవాణి వెళ్లి " నేనేం విరవలేదు సర్" అంటూ ఏడ్చేసింది. అలాగే మరో టీం కంటెస్టెంట్స్ కూడా క్లాస్ రూమ్ స్కిట్ చేశారు. అందులో టీచర్ ఒక స్టూడెంట్ ని పిలిచి "కాఫీకి, కాలేజీకి ఉన్న తేడా ఏమిటి" అని అడిగారు. "కాఫీలో షుగర్ ఉంటుంది..కాలేజీలో ఫిగర్ ఉంటుంది" అంటూ ఆ స్టూడెంట్ కొంటెగా ఆన్సర్ చెప్పాడు.  తర్వాత సుష్మ-రవికిరణ్ టీమ్ ఒక ఎమోషనల్ స్కిట్ చేసి అందరినీ ఏడిపించారు. వీళ్ళ స్కిట్ చూసిన శివబాలాజీ "అమ్మలు ఎలా ఉంటారు అంటే పిల్లల్ని కొట్టేస్తారు తర్వాత లోపలికి  వెళ్లి వాళ్ళు ఏడుస్తారు" అని ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు.  

తనకు పుట్టబోయే పిల్లాడికి ప్రదీప్ పేరు పెట్టుకుంటానన్న యాదమ్మ రాజు

లేడీస్ అండ్ జెంటిల్ మాన్ షో అందంగా ముస్తాబై ఆదివారం రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రీసెంట్ గా పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు అతని వైఫ్ ఎంట్రీ ఇచ్చారు. "మీ ఇద్దరూ కలిసొచ్చారు మాకు చాలా ఆనందం" అని ప్రదీప్ అనేసరికి "ఏటో వెళ్ళిపోతున్న నా లైఫ్ ని ప్రదీప్ అన్న కలిపాడు..అందుకే నాకు కొడుకు పుడతాడు కదా అతనికి ప్రదీప్ అన్న పేరే పెట్టుకుంటా " అని ఫన్నీగా చెప్పాడు  యాదమ్మ రాజు. ఇక ఈ షోకి  నూకరాజు, పంచ్ ప్రసాద్ కూడా వచ్చారు. "ఎల్కమ్ ఎల్కమ్" అని ప్రదీప్ ఇన్వైట్ చేసేసరికి "మేము ఎలకలం కాదు ఆర్టిస్టులం" అని పంచ్ వేసాడు ప్రసాద్. "నీ లైఫ్ లో గోల్డెన్ డేస్ ఏవి అని అడిగితే ఏం చెప్తావ్ " అని ప్రదీప్ యాదమ్మ రాజు అడిగాడు. " నా బేబీ నా లైఫ్ లోకి రావడమే గోల్డెన్ డేస్ అని చెప్పాలి లేదంటే ఇంటి పోయినాక నాకు ఉంటాయ్ " అన్నాడు కమెడియన్ యాదమ్మ రాజు. "నూకరాజు కాంతారా పెర్ఫార్మెన్స్ చూసాక ఏమనిపించింది" అని ప్రదీప్ పంచ్ ప్రసాద్ ని అడిగాడు. "నూకరాజు శివపుత్రుడు పెర్ఫార్మెన్స్ చేసి దాన్ని కాంతారా" అన్నాడు అని కౌంటర్ వేసాడు ప్రసాద్.  చివర్లో మస్కిటో కాయిల్ చూపించి " ఈ దోమల బత్తి నువ్వైతే నీ చుట్టూ తిరిగే దోమను నేను.. ఈ దోమల బత్తి నువ్వైతే దాన్ని వెలిగించే అగ్గిపెట్టె నేను" అంటూ యాదమ్మ రాజు తన వైఫ్ కి వెరైటీ గా ప్రొపోజ్ చేసాడు.

నాలో కొత్త భావాలు పుట్టుకొస్తున్నాయి అంటున్న అనసూయ!

యాంకర్ అనసూయ ఈమధ్య షాప్ ఓపెనింగ్స్ తో ఫోటో షూట్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా క్యూట్ గా, హాట్ గా కనిపిస్తోంది. ''శుభ సూచనలు, కొత్త భావాలు, పాత కోరికలు, అదే హృదయం'' అని పోస్ట్ పెట్టారు. అనసూయకు వస్తున్న కొత్త ఆలోచనలు ఏమో కానీ ఆమె ఫొటోస్ చూసి స్టన్నింగ్ లుక్స్ కి నెటిజన్స్ ఫిదా ఐపోయి కామెంట్స్ పెడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అందంతో ఆమెకు  సిల్వర్ స్క్రీన్ మీద  ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ఆమెకు వస్తున్నాయి. దాంతో అనసూయ తనలోని మరో కోణాన్ని ఆడియన్స్ కి చూపిస్తోంది. తనకు కావాల్సింది కూడా ఇదే అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  పుష్ప, ఖిలాడి, దర్జా చిత్రాల్లో  ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ ఓ మెయిన్ రోల్ చేస్తోంది. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా విలన్ గా కనిపించనున్నారు.  సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యేసరికి యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమెకు వేరే లాంగ్వేజెస్ లో నటించే ఆఫర్స్  కూడా వస్తున్నాయి. గత ఏడాది అనసూయ ఒక తమిళ, మలయాళ చిత్రం చేశారు. లైఫ్ లో ఎప్పుడూ బెటర్మెంట్ కోసం అనసూయ కసరత్తు చేస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు నటన వైపు అడుగులు వేస్తోంది. అల్లు అర్జున్-సుకుమార్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పుష్ప 2  లో ఈమె కనిపించబోతోంది అలాగే డైరెక్టర్  కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో కీలక రోల్ లో నటించింది.

ముకుందని తీసుకురావడానికి వెళ్ళిన మురారి! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ - 65వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో మురారి దగ్గరికి వెళ్తుంది కృష్ణ. "అత్తయ్య మిమ్మల్ని పట్టించుకోమని చెప్పింది. అందుకనే వచ్చాను" అని కృష్ణ అంటుంది. దానికి మురారి "నీ కళ్ళలో ఏదో అయస్కాంతం ఉంది కృష్ణ" అని అంటాడు.  మరోవైపు ముకుంద గురించి భవానీ ఆలోచిస్తుంటుంది. ఇంకా ముకుంద ఇంటికి రావడం లేదని నేనే వెళ్లి తీసుకొస్తానని భవాని బయల్దేరుతుండగా... ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తుందో అనుకుంటారు. "ఈ ఇంటి కోడలు పుట్టింట్లో ఉంటే కుటుంబం పరువు ఏం అవుతుంది... అందరూ పట్టనట్లే ఉన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను" అని ఇంట్లో వాళ్ళతో భవానీ అంటుంది. "అక్కా... నీకు చెప్పేంత దాన్ని కాదు కానీ ఇప్పుడు ముకుందని ఇంటికి తీసుకురావద్దు.. ఎందుకంటే ఇక్కడ ఒక పెళ్లి అయిన జంట ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటే ముకుంద తనకి ఆ సంతోషం లేదని బాధ పడుతుంది. తన భర్తతో తాను కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది కదా.. ఆదర్శ్ వచ్చే వరకు ముకుందని తీసుకురావద్దు" అని రేవతి చెప్తుంది.  "నువ్వు చెప్పేది నిజమే కానీ మన ఫ్యామిలీ నుండి తనని దూరం చేసిన వాళ్ళం అవుతాం.. ఆదర్శ్ వచ్చి నా భార్యని అలా వదిలేసారు అంటే ఏం సమాధానం చెప్తాం అందుకే నేను వెళ్లి తీసుకొస్తాను" అని భవానీ అంటుంది. అంతలోనే "మీరు వద్దు అత్తయ్యా... ముకుంద అమ్మ నాన్న ఏమైనా మాటలు అంటే మీరు బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. ACP సర్ ని పంపించి..  ముకుందని తీసుకురమ్మని చెప్తాను. ఎలాగైనా సరే ముకుంద ఇంటికి వస్తుంది. నేను మాట ఇస్తున్నాను" అని అంటుంది కృష్ణ. కృష్ణ పైన గదిలో ఉన్న మురారి దగ్గరికి వెళ్లి.. "మీరు ముకుందని తీసుకురండి. నా వల్లే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. నాకు చాలా గిల్టీగా ఉంది. ముకుందని తీసుకొస్తానని అత్తయ్యకి మాట ఇచ్చాను" అని చెప్తుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి "ఏంటి కృష్ణ.. అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నావ్? వాణ్ణి ఎందుకు వెళ్లమంటున్నావ్?" అని అడుగుతుంది. సరే మీ ఇష్టమచ్చినట్టు చేసుకోండి అని రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి "సరే నేను వెళ్తాను" అని మురారి బయల్దేరుతాడు. అయితే మురారి వస్తున్న విషయాన్ని అలేఖ్య ముందుగానే ముకుందకి కాల్ చేసి చెప్తుంది. అలా తను చెప్పటంతో ఎంతో సంబరపడిపోతూ.. అందంగా ముస్తాబై ఇల్లంతా శుభ్రంగా సర్దుతుంటుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.....! 

నా తల్లి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ బాధపెట్టావ్ వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -671 లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో... మహేంద్రతో మాట్లాడుతుంటాడు రిషి. "ఎందుకు డాడీ నన్ను ఇలా చేస్తున్నారు. నేను ఎవరికీ పనికి రాని వాడినా... అందరూ నన్ను వదిలేసి వెళ్తున్నారు" అని అనుకుంటూ ఎమోషనల్ అవుతాడు రిషి. అర్జెంట్ గా తన క్యాబిన్ కి రమ్మని వసుధారకి ఫోన్ చేస్తాడు రిషి. వసుధార వచ్చాకా.. తన టేబుల్ ఉన్న హార్ట్ సింబల్ చూపించి "ఈ హార్ట్ సింబల్ ఎందుకు పెట్టావు? ఎందుకు ఇలా నా హార్ట్ తో ఆడుకుంటున్నావ్? అసలెందుకు నా క్యాబిన్ కి వస్తున్నావ్" అని అడుగుతాడు. "సర్ మీతో మాట్లాడాలి. కాస్త నేను చెప్పేది ఒకసారి వినండి" అని వసుధార అనగానే... "ఇలా చీటికి మాటికీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించకు. చెప్పాలి అంటున్నావ్. ఏం చెప్తావ్? పెళ్లి ఎలా జరిగింది.. బంధువులు ఎవరెవరు వచ్చారు. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంటుంది. నీ పర్సనల్ విషయాలు నాకు చెప్పకు.. మన మధ్యలో మాటలు ఉంటే అవి ప్రాజెక్ట్ గురించి మాత్రమే అయ్యి ఉండాలి.. అవి మాత్రమే వింటాను" అని అంటాడు.  ఇక చేసేదేమీ లేక బాధపడుతూ "చివరిసారిగా అడుగుతున్నాను.. వింటారా? వినరా" అని అడుగుతుంది. వినను అని రిషి చెప్పడంతో... "ఇక నేను చెప్పాలని ప్రయత్నించను. మీరే తెలుసుకోవాలి" అని అనుకొని వెళ్తుండగా... "నా తల్లి కంటే వెయ్యి రెట్లు బాధపెట్టావ్ వసుధార" అని అంటాడు రిషి. "సర్ ఇప్పుడు నా మనసుకు గాయం అయింది" అంటూ వెళ్ళిపోతుంది వసుధార.  ఆ తర్వాత రిషి దగ్గరికి దేవయాని వస్తుంది. లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. "వసుధారని మన కాలేజీ నుంచి పంపించండి... లేదా నువ్వైనా తన నుండి దూరంగా వెళ్ళు" అని మాట్లాడుతుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!

సీతారామయ్య ఫోన్ తో వెనుతిరిగిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -4 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో రాజ్, కళ్యాణ్ ఇద్దరు కలిసి కృష్ణమూర్తి షాప్ ని వెతుక్కుంటూ వెళ్తారు. రాహుల్ అతని తల్లి కలిసి సీక్రెట్ గా మాట్లాడుకుంటారు. "మనం అసలు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళం కాదు. ఒంటరిగా ఉన్న మనల్ని చేరదీసి ఇంట్లో స్థానం కల్పించారు. మనం కూడా ఈ ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకొని ఆస్తులు మొత్తం మన సొంతం చేసుకోవాలి" అని మాట్లాడుకుంటారు. షాప్ వెతుక్కుంటూ వచ్చి చూస్తే ఆ షాప్ కావ్యదే అయ్యి ఉంటుంది. అ షాప్ లో కావ్యని చూసి రాజ్ తిరిగి వస్తుంటాడు. అలా కోపంతో వెనుతిరిగి వస్తుంటే.. కళ్యాణ్ ఆపుతాడు. "ఇప్పుడు మన అవసరం. నేను మాట్లాడుతాను" అంటూ కావ్య తో "వినాయకుడికి నగలు డిజైన్ చెయ్యడానికి మీరు రండి" అని చెప్పగానే కావ్య  నిరాకరిస్తుంది.  "మేము దుగ్గిరాల ఫ్యామిలీ.. మీకు తెలుసా" అని అనగానే... కనకం అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది కావ్య. ఆ తర్వాత కావ్యతో ఆర్గుమెంట్ చేస్తూ.. అసలు తనని తాను తగ్గించుకోకుండా ఎక్కడా కూడా తగ్గకుండా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు రాజ్.  అంతలోనే సీతారామయ్య ఫోన్ చేసి "ఎలాగైనా పూజ జరగాలి" అని చెప్తాడు. అప్పుడే కావ్యకి కనకం ఫోన్ చేసి ఎలాగైనా పాస్ లు వచ్చేలా చెయ్ అనడంతో కావ్య సరే అంటుంది. రాజ్ మళ్ళీ తిరిగి కావ్య దగ్గరికి వస్తాడు. రాజ్ కేమో వినాయకుడి నగలు డిజైన్ చెయ్యాలి. కావ్యకేమో రాజ్ వాళ్ళ ఇంట్లో జరిగే పూజకి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ లు కావాలి. ఇలా ఇద్దరిది అవసరమే. కావ్య డిజైన్ చేయడానికి వెళ్తుందా? రాజ్ కనకం కుటుంబానికి ఎంట్రీ పాస్ లు ఇస్తాడా? లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...