వాళ్ళ స్టెప్పులు మాములుగా లేవు.. అందరూ కలిస్తే అంతేమరి

మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప అదృష్టం ఏమిటి అంటే టాలెంట్ ఉంటే చాలు హీరో, హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో ఫుల్ పాపులర్ అవ్వొచ్చు..మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలా ఎంతో మంది హీరోయిన్స్ అవ్వాలని వచ్చి క్యారక్టర్ ఆర్టిస్టులు ఐన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎన్నో మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో చేసిన నటీమణులు అంతా కలుసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో మనకు ఎక్కువగా అమ్మ, అత్తా, వదిన, అక్కా, చెల్లి లాంటి క్యారెక్టర్స్ లో  నటించిన సురేఖా వాణి, హేమ, ప్రగతి, పవిత్రా లోకేష్ తో పాటు చాలామంది గుర్తొస్తారు. అప్పటి, ఇప్పటి మూవీస్ సక్సెస్ లో వీళ్లంతా కీ రోల్ ప్లే చేస్తున్నారు. హీరోయిన్ కి మించి నటిస్తున్నారు. తనకు అవకాశాలు రావడం లేదు అంటూ ఈమధ్య కాలంలో బాధపడిన సురేఖా వాణి తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది.హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉండేసరికి ఈమెకు ఎక్కువగా అక్క పాత్రలు వస్తున్నాయి.   శైలజ ప్రియా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అందంగా కనిపిస్తూ తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్  పెంచుకుంది.  ఇలా ఒకప్పటి సపోర్టింగ్ రోల్స్ లో నటించి ఇప్పటికీ నటిస్తున్న వాళ్లంతా కూడా సరదాగా సురేఖావాణి ఇంట్లో కలుసుకున్నారు.  12 మంది సీనియర్ నటీమణులు ఒక్కచోటకు చేరారు. ఫుల్ గా ఆడి పాడారు. సురేఖావాణి ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "రా రా రక్కమ్మ" సాంగ్ కి అందరూ కలిసి స్టెప్స్ ఇరగదీసారు. ఇక నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. "ప్రగతి, సుధా, పవిత్ర లోకేష్ ఆంటీలు ఎక్కడ ?" " వీళ్లు లేని సినిమా  వుండదు. వీళ్ళు చేయని పాత్రలు కూడా లేవు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వీళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు "  అంటూ కామెంట్స్ పెట్టారు.

కసి, ఆకలి ఎక్కువ అంటూ అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

బుల్లితెర మీద యాంకర్ శ్రీముఖి హోస్టింగే వేరే లెవెల్. ఆమె ఎనెర్జీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు ఎవరూ లేరు. ఆ రేంజ్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ ఐన "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రోమోలో చూస్తే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కొత్తగా స్టార్ట్ ఐన సీరియల్ "బ్రహ్మముడి" టీంతో పాటు "ఇంటింటి గృహలక్ష్మి " టీం కూడా వచ్చింది. ఈ ఎపిసోడ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ లు పిచ్చగా గుమ్మరించారు అందరూ. మరీ ముఖ్యంగా లేడీస్ మాట్లాడ్డం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. గృహలక్ష్మి టీమ్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చేసరికి "ఐ వాంట్ కసి" అని ఫైమా కసిగా అడిగింది "నీకు కసి కావాలి అంటే ఇంద్రనీల్ బాగా నేర్పిస్తారు" అని చెప్పింది లాస్య. దాంతో కస్తూరి ఇంద్రనీల్ ని వెనకేసుకొచ్చింది. "పసి బిడ్డను పట్టుకుని కసి నేర్పిస్తారని అంటారేమిటి" అని అడిగేసరికి " "ఏ యాంగిల్ లో మీకు పసి బిడ్డలా కనిపిస్తున్నాడు" అని శ్రీముఖి అడిగేసింది.  కస్తూరి, ఇంద్రనీల్ కలిసి "బావవి నువ్వు భామను నేను" సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ షోకి "మైకేల్" మూవీ నుంచి సందీప్ కిషన్ వచ్చి ఫైమాతో కలిసి డాన్స్ చేసాడు. శ్రీముఖి ఫైమా మీద ఫైర్ అయ్యింది "నీకు హీరోయిన్ అయ్యే లక్షణాలు అస్సలు లేవు.." అంది దాంతో సందీప్ కిషన్  వచ్చి "నీకు మాత్రం డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి" అని శ్రీముఖికి కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. నవరసాలు పలికించే టాస్క్ ని శ్రీముఖి హమీదకి ఇచ్చింది. అవినాష్ కళ్లల్లోకి   చూస్తూ శృంగార రసం పలికించాలని చెప్పేసరికి అవినాష్ దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు.  ఇంతలో మధ్యలోకి శ్రీముఖి వచ్చి "హమీదాకి శృంగారంలానే ఉంది..కానీ అవినాష్ కి మాత్రం కసి ప్లస్ ఆకలి లాగా ఉంది" అని అవినాష్ పరువు తీసేసింది.   తరువాత ఫైమా-అవినాష్‌ ఇద్దరికీ అదే శృంగార రసం కాన్సెప్ట్ ఇచ్చింది. ఫైమా అయితే తెగ రెచ్చిపోయింది. ఈ మధ్య కాలంలో బుల్లితెర షోస్ అన్నీ కూడా కొంచెం శృతిమించుతున్నాయి.

'నిజం విత్ స్మిత' అంటూ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్

బుల్లితెర మీద రోజురోజుకు కొత్త కొత్త టాక్ షోస్ పెరిగిపోయాయి. సమంత నిర్వహించిన "సామ్ జామ్" బాలకృష్ణ చేస్తున్న " అన్ స్టాపబుల్" ఆలీ నిర్వహించిన " ఆలీతో సరదాగా" ఈ షోస్ అన్నీ ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన షోస్. ఇప్పటి వరకు ఒక మూసలో వచ్చిన ఈ షోస్ అన్నీ ఒక ఎత్తు..ఇప్పుడు రాబోతున్న కొత్త షో మరో ఎత్తు అన్నట్టుగా ఒక టాక్ షో త్వరలో రాబోతోంది..దానికి సంబంధించిన ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఓటిటి రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అన్నీ షోస్ కి భిన్నంగా అంతకు మించి కంటెంట్ తో నేను వస్తున్నా అంటోంది సింగర్ స్మిత.. ఆమె నిర్వహిస్తున్న "నిజం విత్ స్మిత" సరికొత్త టాక్ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.  ఇక రీసెంట్ గా రిలీజ్ ఐన ప్రోమో చూస్తే గనక ఇందులో నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాని, రానా, అల్లరి నరేష్, దేవ్ కట్టా, సందీప్ వంగా,  అడివి శేష్, రాధిక, సాయిపల్లవి, అనిల్ రావిపూడి, మేజర్ భారత్ రెడ్డి  లాంటి చాలామంది స్టార్స్ కనిపించారు. చంద్రబాబునాయుడు వెన్నుపోటు గురించి, నాని నేపోటిజమ్ గురించి, రాధిక  వుమన్ పవర్స్ గురించి, సీరియస్ ఎమోషన్స్ గురించి అనిల్ రావిపూడి, సినిమా వాళ్ళ సమాజం చెడిపోతోంది అంటూ దేవా కట్టా, అభ్యుజింగ్ గురించి సాయి పల్లవి ఇలా వీళ్లంతా రకరకాల టాపిక్స్ మీద చాలా బోల్డ్ గా ఈ షోలో మాట్లాడారు. ఈ షో ప్రోమో చూస్తుంటే అన్ని రంగాల వాళ్ళను ఈ వేదిక మీదకు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా వాళ్ళ చేత చెప్పించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. హోస్ట్ స్మిత కూడా "నిజం నిర్భయంగా" అని చెప్పి ఈ ప్రోమోని ఎండ్ చేసింది. సింగర్ స్మిత ఏది చేసిన సంథింగ్ స్పెషల్ గానే గుర్తుండిపోయేలాగే చేస్తుంది అనే టాక్ ఆడియన్స్ లో ఉంది. మరి ఈ షో కూడా అంతకు మించి అన్నట్టు ఉంటే గనక ఇక దాని రేటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నెటిజన్స్ "ఈ షో అన్ స్టాపబుల్ కి గట్టి పోటీ ఇస్తుంది" అని కామెంట్స్ చేస్తున్నారు.

నీడలా వెంటాడుతున్న రాజీవ్... వసుధార ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -676 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో... కాగితపు పడవలను నీళ్లలో వదిలేసి రిషి, వసుధార ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. "రిషి సర్ ఎందుకు వచ్చాడు" అని వసుధార అనుకోగా... "వసుధార ఎందుకు వచ్చింది" అని రిషి అనుకుంటాడు. సర్ మీరు ఇక్కడ ఏంటని వసుధార అడుగగా.. "నాకు ఒకరు చెప్పారు.. మనసులో ఏదైనా అనుకొని కాగితపు పడవ మీద రాసి నీటిలో వదిలితే కోరిక నెరవేరుతుందని. అందుకే ఇక్కడికి వచ్చాను" అని అంటాడు రిషి. మీకు చెప్పిన వాళ్ళు రాలేదా సర్ అని సరదాగా అంటుంది వసుధార. ఇక ఇద్దరు వాళ్ళు రాసి వదిలిన పడవల మీద ఏం రాసారో ఒకరికొకరికి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటారు. మళ్ళీ డౌట్ వస్తోందేమోనని అనుకొని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు వసుధారని రిషి అర్థం చేసుకోలేకపోతున్నాడని చక్రపాణి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రిషికి ఫోన్ చేసి నిజం చెప్పాలని ట్రై చేస్తాడు. "రిషి సర్ వసుధారకి పెళ్లి కాలేదు" అని చెప్తాడు. కానీ రిషి ట్రాఫిక్ లో ఉండటం వల్ల సరిగా వినిపించక.. ఎవరు ఎవరు అని అంటాడు. అంతలోనే వసుధార వచ్చి చక్రపాణి ఫోన్ లాక్కొని "ఏం చేస్తున్నారు నాన్న" అని కట్ చేస్తుంది. ఎవరో ఫోన్ చేసారు అని చక్రపాణి చెప్తాడు. అంతలోనే రిషి మళ్ళీ ఫోన్ చేసేసరికి అది చూసి వసుధార ఫోన్ కట్ చేసి రాంగ్ డయల్ అని మెసేజ్ పెడుతుంది. "నాన్న ఇంకెప్పుడు రిషి సర్ కి నిజం చెప్పాలని ట్రై చేయకండి.. అలా చేస్తే నా మీద ఒట్టే" అని చెప్తుంది వసుధార. కాలేజ్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి రిషికి మీటింగ్ ఏర్పాటు చేయమని మెసేజ్ చేస్తుంది వసుధార. ఆ తర్వాత రిషి, జగతి, మహేంద్రలు మీటింగ్ కి బయల్దేరి వెళ్తారు. మరొకవైపు రాజీవ్ కి కాల్ చేస్తుంది దేవయాని. "ఎక్కడి వరకు వచ్చింది నీ ప్లాన్" దేవయాని అడగుతుంది.  "ఒక ప్లాన్ ఉంది మేడమ్ జీ.. రిషి ఉన్నాడా" అని రాజీవ్ అడుగగా.. "అందరూ మీటింగ్ కి వెళ్లారు" అని దేవయాని చెప్పడంతో.. రాజీవ్ కూడా వెళ్తాడు.. ఎలాగైనా అందరి ముందు వసుధార  నా భార్య అని చెప్తా అనుకొని రాజీవ్ వెళ్తాడు. మీటింగ్ లో అందరూ కూర్చొని ఉంటారు. డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి నా వసుధార ఎక్కడ అని అడుగుతాడు. "ఓహ్ నేను ఎవరో తెలియదు కదు.. నేను వసుధార భర్తని" అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

కలిసిపోతున్న కృష్ణ, మురారి.. అసూయతో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రోజుకో ములుపు తిరుగుతూ ఎపిసోడ్ -70 లోకి అడుగుపెట్టింది.  కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో.. కృష్ణపై మురారి అరవడంతో కృష్ణ గదిలోకి వెళ్లి బాధపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి మురారి వెళ్లి కృష్ణకి సారీ చెప్తాడు. అయినా తను సారీని యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉండడంతో కృష్ణని నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు‌. తను ఎలా ఉంటుందో డ్రాయింగ్ వేస్తాడు. అది కృష్ణ చూస్తుంది. "మీరు నా డ్రాయింగ్ వెయ్యడమేంటి.. సారీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను.. మాట్లాడకుండా ఉండను.. మీరు గొప్ప ACP సర్" అని అంటుంది కృష్ణ. నేను బయట ACP నే కానీ ఇంట్లో కృష్ణకి భర్తనని అని మురారి అంటాడు. కృష్ణ, మురారిలను పిలుస్తుంది రేవతి.  "మురారి.. నా కోడలు మీద ఎందుకు అరిచావ్" అని రేవతి అనగానే "మళ్ళీ సారీ చెప్పాడు అత్తయ్యా" అని కృష్ణ అంటుంది.  నీకేం తెలియదు ఆగు కృష్ణ అని "నా కోడలు మీదకి అరిచావ్ కాబట్టి దానికి నువ్వు కృష్ణను మూవీకి తీసుకెళ్ళు" అని చెప్తుంది. సరే తీసుకెళ్తాను అని మురారి అంటాడు. వీళ్ళ మాటలు విన్న ముకుంద "రేవతి అత్తయ్యకు నా గురించి తెలిసిందా? తెలిసి ఇలా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుందా" అని అనుకొని.. వాళ్ళు వెళ్ళాలనుకున్న కార్ టైర్ లో గాలి తీస్తుంది. కృష్ణ, మురారి లు బయటికొచ్చేసరికి కార్ టైర్ పంచర్ అవ్వడం చూసి.. వెంటనే మురారి బైక్ తీసుకొని వచ్చి కృష్ణని ఎక్కించుకు తీసుకెళ్తాడు. దీంతో ముకుంద "కార్ లో వెళ్తే అయినా దూరంగా వెళ్ళేవాళ్ళు.. ఇప్పడు టైర్ గాలి తీసి బైక్ మీద వెళ్ళేటట్టు చేసి ఇంకా దగ్గర చేసానా" అని అనుకుంటుంది ముకుంద. వాళ్ళు అలా కలిసి వెళ్లడంతో కోపంగా ఆలోచిస్తూ తను మురారి కలిసి దిగిన సెల్ఫీనీ చూస్తూ ఉంటుంది. ఇంతలోనే నందు వచ్చి ఫోన్ లాక్కొని వెళ్లడంతో.. ఇంట్లో ఎవరైనా ఆ ఫోటో చూస్తారేమో అని టెన్షన్ పడుతుంది ముకుంద. అప్పుడే భవాని వచ్చి "ఏం జరుగుతుంది ఇక్కడ" అంటూ నందు దగ్గర ఉన్న ఫోన్ తీసుకునేసరికి.. స్క్రీన్ ఆఫ్ అవ్వడంతో ముకుంద కూల్ అవుతుంది. అందరూ భోజనం చేస్తుండగా ముకుంద రాకపోవడంతో రేవతి పిలుస్తుంది. ముకుంద కిందకి రావడం.. అప్పుడే మూవీకి వెళ్లిన  కృష్ణ, మురారిలు రావడంతో వాళ్ళ వైపే చూస్తుంది ముకుంద. అలా చూస్తున్న ముకుందని రేవతి గమనిస్తుంది. "అక్క నేనొక విషయం చెప్పాలి. ఆదర్శ్ రావాలంటే ముకుంద సౌభాగ్యవతి వ్రతం చెయ్యాలని పంతులు గారు చెప్పారు" అని భవానీతో రేవతి అంటుంది. "వ్రతం చేస్తే ఆదర్శ్ రావడం ఏంటీ.. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టాలి. ఒక టీంతో వెతికించాలి అప్పుడు ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది" అని అంటుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

డాన్స్ ప్లేస్ కోసం గొడవ పడిన మెహబూబ్- అర్జున్ కళ్యాణ్....

బిగ్ బాస్ షో ఎంతో మందిని లైంలైట్ లోకి తీసుకొచ్చింది. ఊరు పేరు లేని వాళ్లకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసింది. అలాంటి వాళ్లలో రీసెంట్ గా ముగిసిన సీజన్ లో శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ఉన్నారు. సీజన్ 6 తో వీళ్ళు బాగా ఫేమస్ అయ్యారు. సత్య అంటే అర్జున్ కళ్యాణ్ కి చాలా ఇష్టం కానీ ఆమె మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న బీబీ జోడి డాన్స్ షోలో మెహబూబ్ తో కలిసి జోడీగా డాన్స్ చేస్తోంది శ్రీసత్య. ఇక ఈ షోలోకి శ్రీసత్య రీసెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది ఎందుకు అంటే మెహబూబ్ కి అంతకు ముందు జోడీగా చేసిన అష్షు రెడ్డి ఆరోగ్యం బాగోని కారణంగా షో నుంచి వెళ్ళిపోయింది. అసలే జోడీ షో కాబట్టి మెహబూబ్ కి జోడిగా శ్రీసత్యను ప్రవేశ పెట్టారు మేకర్స్.  వీళ్లంతా కూడా రెగ్యులర్ గా ఒక చోట డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.  అలా  అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య జోడీలు  ప్రాక్టీస్ చేస్తూ ఉండగా "ఇది మా ప్లేస్ మేము కూడా డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవద్దా" అని మెహబూబ్ అర్జున్ కళ్యాణ్ మీద సడెన్ గా ఫైర్ అయ్యాడు. "నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా ఐనా రీల్ జోడినే కదా మీరు రియల్ జోడి కాదుగా" అని అర్జున్ కూడా రివర్స్ లో ఫైర్  అయ్యేసరికి మధ్యలో ఇద్దరినీ విడదీయడానికి శ్రీ సత్య వచ్చింది. వాళ్లిద్దరినీ వారించే ప్రయత్నం చేసింది. ఇంతలో మెహబూబ్ "నువ్వు అరగంట లేట్ గా వచ్చావ్..అందుకే ఈ ప్రాబ్లమ్ వచ్చింది" అని గట్టిగా అరిచాడు.."ఐనా నన్నంటావేంటి" అని సత్య ఏడుపు ముఖంతో అక్కడినుంచి వెళ్ళిపోయింది.  ఇక ఫైనల్ గా మెహబూబ్ ఇదంతా ప్రాంక్ వీడియో అని చెప్పి శ్రీసత్యకు ధమ్కీ ఇచ్చాడు.

స్వప్న కాళ్ళు పట్టుకున్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. గురువారం జరిగిన ఎపిసోడ్‌ -9  లో.. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా పడిపోయిన స్వప్నని చేతిలో ఎత్తుకొని తీసుకెళ్తాడు రాజ్. అక్కడ ఉన్నవాళ్ళంతా వాళ్ళిద్దరినే ఆశ్చర్యంగా చూస్తారు. స్వప్నని తన రూంలో ఉంచి సర్వెంట్ ని పిలిచి వేడినీళ్ళతో కాపడం పెట్టిస్తాడు. రాజ్ రూం బయట ఉండి స్వప్న కి ఎలా ఉందోనని టెన్షన్ పడుతుంటాడు. ఎలాగైనా రాజ్ కి దగ్గర అవ్వాలని గట్టిగా అరుస్తుంది. అప్పుడే రాజ్ లోపలికి వస్తాడు. సర్వెంట్ చేతినుండి టవల్ తీసుకొని స్వప్న కాలుకి కాపడం పెడతాడు. దీంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా గమనిస్తూ స్వప్న తల్లి కనకం తన మొబైల్ లో రాజ్, స్వప్నల ఫోటో తీస్తుంది.  ఆ తర్వాత రాజ్ కాసేపటికి రూం బయటకి వస్తాడు. బయట సీతారామయ్య ఇంకా రాజ్ తమ్ముళ్ళు ఉంటారు. ఎలా ఉందని సీతారామయ్య అడుగగా.. "చాలా సుకుమారంగా పెరిగినట్టుంది తాతయ్య.. కాలు బెణికింది. డాక్టర్ కి కాల్ చేసాను వస్తున్నా అన్నాడు" అని చెప్తాడు రాజ్. అక్కడే ఉన్న వాళ్ళ తమ్ముడు.. "అన్నయ్యా.. నువ్వు ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకొచ్చిన దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు" అని రాజ్ తో అంటాడు. మరొక తమ్ముడు కృష్ణ "అవును అన్నయ్యా.. అందమైన అమ్మాయిని ఎత్తుకొని వచ్చావ్" అని అంటాడు. "అవును అందమే.. నేను ఇష్టపడేంత అందం" అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి డాక్టర్ వస్తాడు. స్వప్న కాల్ ని చూస్తూ ఎలా ఉందమ్మా అని అడుగుతాడు. తను నొప్పిగా ఉందని చెప్తుంది. మరి రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు. స్వప్న దగ్గరికి వచ్చి‌న రాజ్ కుటుంబసభ్యులు.. "మీరెవరు? ఎక్కడుంటారు? అనుకుంటూ ఆరా తీస్తూ" ఉంటారు.‌ ఇక ఇక్కడే ఉంటే దొరికిపోతాం అని స్వప్న, కనకం అనుకుంటారు‌. ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలని అని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తప్పించుకున్నారా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకూ ఆగాల్సిందే.

గుండె బరువుతో కాశ్మీర్ కి గుడ్ బై చెప్పిన నవ్య!

బుల్లితెర మీద నవ్య స్వామికి మంచి క్రేజ్ ఏర్పడింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఆమె కథ సీరియల్‌తో రవి కృష్ణ, నవ్యస్వామి ఆడియన్స్ కి రొమాంటిక్ పెయిర్ గా బాగా దగ్గరయ్యారు. ఆ సీరియల్‌తో నవ్య స్వామి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళ జోడి మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. సీరియల్‌లో కెమిస్ట్రీ కుదిరి, ఆఫ్ స్క్రీన్‌లోనూ రొమాన్స్ చేయడంతో అందరూ ఫిదా అయ్యారు. కానీ కొంత కాలం నుంచి వీళ్ళు అస్సలు కలిసి వర్క్ చేయడం లేదు..ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. నవ్య స్వామి మాత్రం తన దారి తాను చూసుకున్నట్టు తెలుస్తోంది.  తాను మూవీస్ కి ప్రమోట్ అయ్యేసరికి రవిక్రిష్ణను వదిలేసింది అంటూ నెటిజన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.  ఇక ఇప్పుడు "బుట్టబొమ్మ" మూవీలో నటించింది నవ్య స్వామి. అలాగే ఆమె టూర్స్ మీద టూర్స్ వెళ్తోంది. రీసెంట్ గా కాశ్మీర్ వెళ్లిన నవ్య అక్కడి అందాలను బంధించి ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యింది. తాను స్టే చేసిన ప్లేస్ ని ఫోటో తీసి "రాత్రి ఈ గదిలోంచి కాశ్మీర్ అందాలను చూడడం చాలా బాగుంది" అని కామెంట్ చేసింది.  ఇక విమానం ఎక్కేసి "కాశ్మీర్ ని వదలబుద్ది కావడం లేదు..కానీ తప్పదు ..గుడ్ బై కాశ్మీర్" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి నవ్యస్వామి కి కొత్త ఏడాది బాగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

బాపుబొమ్మ అనేది నా ఇంటి పేరుగా మారిపోయింది!

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో బాపు బొమ్మ ఎవరు అంటే చాలు టక్కున దివ్యవాణి అని చెప్పేస్తారు. అలాంటి ఆమె అందం.. నటన.. క్రేజ్ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది గుండెల్ని కొల్లగొట్టింది. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గి రాజకీయాల వైపు అడుగులు వేసింది. దివ్య వాణి అసలు పేరు ఉషా వాణి. కన్నడలో డాన్స్ రాజా డాన్స్ మూవీ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ద్వారకేష్ గారు తన పేరు దివ్య అని మార్చారట. అలా మొదట్లో కొన్ని మూవీస్ చేసిన దివ్య వాణికి పెద్దగా బ్రేక్ రాలేదు కానీ పెళ్లి పుస్తకంతో ఆమె కెరీర్ అలా టర్న్ ఐపోయింది. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మూవీస్ తో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. బాపు గారి మూవీ అవకాశం రావడమే దేవుడి దయ అని చెప్పుకోవాలి. ముత్యమంతా ముద్దు షూటింగ్ టైంలో బాపు గారు తనను చూశారట. అలా ఆయన తన సినిమా స్టోరీ చెప్పడం దానికి తానూ  ఓకే అనడం..అన్నీ అలా జరిగిపోయాయని చెప్పింది దివ్యవాణి. అలాంటి గొప్ప వ్యక్తి దొరకడం అదృష్టం అని అంది. బాపు గారి మూవీస్ లో తన ముందు జెనెరేషన్స్ వాళ్ళు, తర్వాతి జెనెరేషన్స్ వాళ్ళు కూడా చేసారు కానీ బాపుబొమ్మ అంటే తానే గుర్తొచ్చేలా తన పాత్రను రూపొందించడం నిజంగా ఆ విషయంలో చాలా లక్కీ అని చెప్పింది.  ఇప్పుడు బాపు బొమ్మ తన ఇంటి పేరుగా మారిపోయింది అని చెప్పుకొచ్చింది. చేసింది ఒక్క మూవీ ఐనా కూడా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడా ఉన్నా కూడా తన పాత్రకు కనెక్ట్ అయ్యేలా చేసిన బాపు-రమణలకు ఒక ఇంటర్వ్యూలో ధన్యవాదాలు చెప్పింది. ఎక్కడ పెళ్లి జరిగినా పెళ్ళిపుస్తకంలోని సాంగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనే సంతోషంగా చెప్పింది.  

సూత్రాలు రెండు..మంగళసూత్రం, కామసూత్రం అంటూ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చిన స్టూడెంట్స్!

"మిస్టర్ అండ్ మిస్సెస్" రియాలిటీ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించడానికి సిద్దమయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో "స్కూల్ థీమ్" కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక కంటెస్టెంట్స్ అంతా స్కూల్ డ్రెస్ లో వచ్చి టీచర్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.  జబర్దస్త్ కమెడియన్ అప్పారావు టీచర్ గా చేసాడు. ఇక వాళ్ళ టీంలోని స్టూడెంట్స్ ని కొన్ని ప్రశ్నలు వేసాడు. "మనకు దిక్కులు ఉన్నాయి కదా అవి చెప్పు" అనేసరికి "తూర్పు, పడమర, దక్షిణం" అని చెప్పేసరికి "ఉత్తరం ఏది అనేసరికి దాన్ని పోస్ట్ డబ్బాలో వేసా మాస్టారు" అని చెప్పాడు ఒక స్టూడెంట్..ఇంకో స్టూడెంట్ ని లేపి "మనకు సూత్రాలెన్ని అవి ఏవి" అని అడిగేసరికి "రెండు సూత్రాలు..మంగళసూత్రం, కామసూత్రం" అని ఆన్సర్ ఇచ్చేసరికి అప్పారావు బాదేశాడు. ఇక మరో జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు టీచర్ గా వచ్చి తన స్టూడెంట్స్ ని కొన్ని క్వశ్చన్స్ వేసాడు. "చార్మినార్ ఎక్కడ ఉంది చెప్పు" అని స్టూడెంట్ గా ఉన్న  రాకింగ్ రాకేష్ ని అడిగేసరికి "రోడ్డుకు అడ్డంగా ఉంది" అని జవాబు ఇచ్చాడు.  తర్వాత బుల్లితెర నటి కరుణ లేడీ టీచర్ గా వచ్చింది..ఆమె స్టూడెంట్స్ గా విశ్వా అతని వైఫ్ నటించారు " ఏంట్రా విశ్వా కళ్లద్దాలు పెట్టుకున్నావు" అని టీచర్ కరుణ అడిగేసరికి " ఇంత అందాన్ని డైరెక్ట్ గా చూస్తే నా కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని కళ్లద్దాలు పెట్టుకున్నా" అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "చెట్లు ఎదగాలి అంటే ఏం చేయాలి" అని మళ్ళీ అడిగేసరికి "చెట్టు పక్కన కూర్చుని నువ్వు ఎదగాలి, నువ్వు ఎదగాలి" అంటూ ఉండాలి అని విశ్వా ఆన్సర్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇలా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ నవ్వించబోతోంది. ఇక లాస్ట్ లో ఎలిమినేషన్ రౌండ్ కొంచెం ఆసక్తిని రేపెలా ఉంది.

జైఆకాష్ ఇంట్లో విషాదం...మిస్ యూ అప్పా అంటూ పోస్ట్

ఒకప్పుడు మూవీస్ లో వరుస అవకాశాలు దక్కించుకుని ఒక మోస్తరు హీరోగా నిలబడ్డాడు జై ఆకాష్. అలా కొంత కాలం మంచిగా అవకాశాలు దక్కించుకుని సెటిల్ అయ్యాడు కానీ ఆ తరువాత మూవీస్ ఎంపిక విషయంలో అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి  కనుమరుగైన నిన్నటి తరం హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఫ్యామిలీ హీరోగా ఆకాష్ కి అప్పట్లో ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉండేది.  ఆయన చేసింది తక్కువ సినిమాలే ఐనా స్మార్ట్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు.   "ఆనందం" మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో ఐపోయాడు.  తర్వాత కొన్ని మూవీస్ లో నటించాడు కానీ అవి పెద్దగా ఆడలేదు. దాంతో ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి ఆకాష్ ఇంట్లో ఇప్పుడు ఒక విషాదం చోటుచేసుకుంది. ఆ విషయాన్ని ఆకాష్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు. " నా ప్రియమైన నాన్న ఈరోజు ఉదయం లండన్‌లో కన్నుమూశారు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అప్పా" అని కాప్షన్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫాన్స్ అలాగే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వారంతా కూడా "ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అని కోరుకుంటూ మెసేజెస్ పెట్టారు.  ఇకపోతే ఆకాష్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. కానీ మూవీస్ లోకి వెళ్లకుండా సీరియల్స్ లో నటిస్తున్నారు. జెమినిలో త్వరలో స్టార్ట్ కాబోయే "గీతాంజలి" సీరియల్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో ఫేమస్ సీరియల్ నటి సుజిత ధనుష్ యాక్ట్ చేస్తోంది.

ఖుష్బూతో బులెట్ భాస్కర్ డాన్స్..ఆయన సాధించింది ఇదే అన్న కృష్ణ భగవాన్

బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ లో ఈ మధ్య క్రష్ లు, కామెడీ చేసుకోవడాలు, డాన్స్ వేయడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రాజబర్దస్త్ చూస్తే గనక రాసిన స్కిట్ కంటే కూడా తమ మీద తామే జోక్స్ వేసుకుని ఆడియన్స్ ని నవ్వించే పనిగా పెట్టుకున్నారు కమెడియన్స్. కొన్ని సందర్భాల్లో అవి పేలుతున్నాయి కొన్ని సందర్భాల్లో తుస్సుమంటూ ఆరిపోతున్నాయి.  ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే పైన చెప్పిన విషయాలు అర్థమవుతాయి. వర్ష-ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ తో ఈ వారం స్కిట్ రాబోతోంది. వీళ్ళు పెళ్లి చేసుకున్న జంటగా ఇందులో కనిపించారు. "శోభనానికి టైం అవుతుంది ఫ్లైట్ బుక్ చేయమన్నా చేశావా" అని ఇమ్ము అడగడం, వెరైటీ ప్లాన్ చేశా అది పడవలో అని వర్ష చెప్పుకున్నారు. బులెట్ భాస్కర్ వీళ్ళ పడవ నడిపేవాడిగా వచ్చాడు. నాటి నరేష్ లేడీ గెటప్ లా ఉందే అంటూ వర్ష మీద కౌంటర్ వేససరికి ఇమ్ము కోటింగ్ ఇచ్చాడు. ఇంతలో టీ, కాఫీలు అమ్ముకునే అతను  వచ్చి వర్ష జంటకు  టీ ఇచ్చాడు. అలా ఎలా సముద్రంలోంచి వచ్చి టీ ఇచ్చాడు అని అడిగేసరికి స్కెటింగ్ షూస్ కొనుక్కున్నాడు అని చెప్పాడు భాస్కర్. అందరూ స్టన్ ఇపోయారు.  ఇక స్కిట్ ఐపోయాక.. జడ్జి ఖుష్బూ లేచి వెళ్లి "ఎన్నో రాత్రులొస్తాయి గాని" సాంగ్ కి భాస్కర్ తో కలిసి డాన్స్ చేసింది. ఇంతలో మరో జడ్జి కృష్ణ భగవాన్ లైన్ లోకి వచ్చి "భాస్కర్ నీ లైఫ్ లో ఏదైనా సాధించావ్ అని ఎవరైనా అడిగితే..నేను ఖుష్బూ గారితో డాన్స్ వేసాను అని చెప్పొచ్చు" అన్నారు.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో మార్పులు...ఈసారి ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్టే!

స్టార్ మాలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో సామ్రాట్ రోల్ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఎందుకంటే సామ్రాట్ క్యారక్టర్ కేవలం తులసికి భజన చేయడం..ఇద్దరి మధ్య రొమాన్స్, పెళ్లి ఇలాంటి విషయాలు మాత్రమే చూపిస్తూండేసరికి  ఆడియన్స్ కి అవి ఎక్కడం లేదు...వాళ్లకు  పెద్దగా నచ్చలేదు...దాంతో ఈ సీరియల్ రేటింగ్ చాలా డౌన్ అవుతూ వచ్చింది.  ఇక ఇప్పుడు తన పాత్ర గురించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వస్తూ ఉండడంతో ఆయన ఇంద్రనీల్  ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఆడియన్స్ కి నచ్చేలా తన రోల్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్న కారణంగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే సీరియల్ లోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తానని  చెప్పారు. నెక్స్ట్ వీక్ షూటింగ్ షెడ్యూల్‌ ఉందని ఆ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు కథకు మరింత కనెక్ట్ అయ్యేలా స్టోరీలో చాలా చేంజెస్ చేశారని చెప్పుకొచ్చాడు  ఇంద్రనీల్ అలియాస్ సామ్రాట్. ఈ సీరియల్ బెంగాలీ వెర్షన్ "శ్రీమోయి"లో హిందీ వెర్షన్ "అనుపమ" లో తులసి క్యారెక్టర్ కి రెండో సారి పెళ్లవుతుంది. కానీ ఇది తెలుగు వెర్షన్. ఇక్కడ ఆడియన్స్ కోరుకున్నప్పుడే ప్రేమ, పెళ్లి జరుగుతుంది. వాళ్లకు క్యారెక్టర్స్ నచ్చాలి లేదంటే ఎంతటి సీరియల్ ని ఐనా వదిలేస్తారు.  ఐతే ఈ ముదురు జంట ప్రేమ కథను ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. "ఇదేం చెత్త సీరియల్..చికాకుగా ఉంది. వాళ్ళు ఆడియన్సు కి  ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. పెట్టిన టైటిల్ ఏమిటి చూపిస్తున్నది ఏమిటి" అని  అంటున్నారు ప్రేక్షకులు. రివ్యూస్ అన్నీ చదివారేమో మేకర్స్ వెంటనే కత్తెర వేసే పనిలో పడ్డారు. మరి తెలుగు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ఇప్పటికైనా అర్థమైనట్టు ఉంది అందుకే కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి ఈసారి సామ్రాట్ క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారో, తులసిని ఎలా మౌల్డ్ చేస్తారో చూడాలి.

ప్రదీప్ తన క్రష్ అని చెప్పిన శ్రద్ధా దాస్!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రద్ధా దాస్ ఎప్పటినుంచో మనసులో ఉంచుకున్న ఒక సీక్రెట్ ని లీక్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో "అలలై చిట్టలలై" సాంగ్ వస్తుంటే శ్రద్దా వైట్ శారీలో అలా నడుచుకుంటూ స్టేజి మీదకు వచ్చింది. ప్రదీప్ ఆమె చేయి పట్టుకుని కాసేపు అలా నడిచాడు. " నేను ఎప్పటినుంచో ఒక విషయం చెపుదామనుకుంటున్నా..ఒక సీక్రెట్ విషయం ఏమిటి అంటే నాకు ప్రదీప్ మీద ఎప్పటినుంచో చిన్న క్రష్ ఉంది" అనేసరికి అందరూ షాకయ్యారు. ఇక శ్రద్ధా, ప్రదీప్ కలిసి "అలలై చిట్టలలై" సాంగ్ కి రొమాంటిక్ స్టెప్స్ వేసి అందరినీ మెస్మోరైజ్ చేశారు.  ప్రదీప్ వైట్ కలర్ బెలూన్స్ తీసుకుని గాలిలోకి వదిలేయడం, శ్రద్ధా వాటిని శ్రద్దగా పట్టుకోవడం చూస్తుంటే ఇద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ ఏదో ఉన్నట్టుగానే అనిపిస్తోంది. "చిన్న సీక్రెట్ క్రష్ అన్నావ్ కదా అది పెద్ద క్రష్ ఎప్పుడవుతుంది" అని శేఖర్ మాస్టర్ చాలా ఉత్సాహంతో అడిగేసరికి "తెలియదు నాకు..లెట్స్ సి" అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది శ్రద్దా.. ఆ ఆన్సర్ కి శేఖర్ మాష్టర్ గట్టిగా అరిచాడు. ఆ కేకకి  ఆది ఎంట్రీ ఇచ్చి "అసలు మీ ఇంటరెస్ట్ ఏమిటి మాస్టర్ నాకు అర్ధం కావట్లేదు" అని అడిగేసరికి శేఖర్ మాస్టర్ నవ్వేసాడు. " మీ ఇద్దరి జంట చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది., మరి ఇంకా మీ ఇష్టం" అని ప్రదీప్ ని శ్రద్ధాకు చెప్పేసరికి "మాస్టర్ ఏమిటి మీకేమన్నా ఒంట్లో బాగాలేదా" అని హైపర్ ఆది అడిగాడు దాంతో స్టేజి మొత్తం నవ్వేసింది. "ఇన్నాళ్లకు ప్రదీప్ అన్న పొలంలో మొలకలొచ్చాయి...శ్రద్దా వదిన తగ్గేదేలే" అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

బ్రహ్మానందంకి బర్త్ డే విషెస్ చెప్పిన కమెడియన్స్!

ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు ఆయన ఫాన్స్ విషెస్ చెప్పారు.  బిగ్ బాస్ కంటెస్టెంట్  కౌశల్ మంద, కమెడియన్  ధనరాజ్ అలాగే ఎంతో మంది ఫేమస్ స్టార్స్  కూడా బ్రహ్మానందం గారికి  పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కౌశల్ బ్రహ్మానందం గారి ఫోటోను షేర్ చేసి  "పద్మశ్రీ డా. బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు ! ఈ సంవత్సరం మీకు సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీ కెరీర్‌లో మరిన్ని విజయాలను  అందించాలని కోరుకుంటున్నాను " అన్నారు.  జబర్దస్త్ కమెడియన్,  బిగ్ బాస్ ఫేమ్  ధనరాజ్ తన కుటుంబం మొత్తం  బ్రహ్మానందం గారితో  కలిసి దిగిన  ఫోటోను షేర్ చేసుకుని ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ " నీకు మాత్రమే చెప్తా" డైరెక్టర్  తరుణ్ భాస్కర్ దాస్యం తన రాబోయే తెలుగు మూవీ నుంచి బ్రహ్మానందం గారి ఫస్ట్ లుక్‌ ని  పోస్ట్ చేసి విషెస్ చెప్పారు. "నీతోనే డ్యాన్స్‌ " షోతో  ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కమెడియన్ వైవా హర్ష చెముడు కూడా బ్రహ్మానందం గారికి విషెస్ చెప్తూ ఫోటో షేర్ చేసాడు. ఇక  కాపుగంటి బ్రహ్మానందం తెలుగు కామెడీకి పెట్టింది పేరు. ఆయన్ని  కామెడీ గాడ్ గా ఆరాధిస్తారు అప్ కమింగ్  కమెడియన్స్.  తెలుగు లెక్చరర్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి తర్వాత అహ నా పెళ్లంట వంటి మూవీ తో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా.. ఖాళీ సమయాల్లో ఎన్నో వాల్ పెయింట్స్ వేసి వాళ్ళ ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు.

రాజ్ కి కంపెనీ బాధ్యతలు అప్పగించిన సీతారామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'బ్రహ్మముడి' సీరియల్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది.  కాగా బుధవారం నాటి ఎపిసోడ్ -8 లో... స్వప్న కి డాన్స్ నేర్పిస్తుంది కావ్య. అటుగా వస్తున్న రాజ్.. ఒక తెర వెనకాల నుండి డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తూ అలానే ఉండిపోతాడు. అక్కడ డాన్స్ చేస్తుంది కావ్య.. సీతారామయ్య కంపెనీ బాధ్యతలు రాజ్ కి అప్పగించాడు. దానికి మినిస్టర్ గారు అతిథులుగా వస్తారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా.. స్వప్న డ్యాన్స్ చేస్తుంది. వెనకాల వైపు కావ్యని చూస్తూ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది స్వప్న. స్టేజ్ మీద ఒక నిప్పు బొగ్గు ముక్క పడిపోతుంది. దాని మీద ఎక్కడ స్వప్న అడుగేస్తుందేమోనని కావ్య పరుగెత్తుకుంటూ వచ్చి కాలు వేయకుండా తన చేతిని అడ్డుగా పెడుతుంది. కావ్య చేతి మీద కాలు వేయడంతో స్వప్న పడిపోతుంటుంది. అలా స్పప్న కిందపడిపోతుంటే పక్కనే ఉన్న రాజ్ వెళ్లి పట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత కావ్యని చూసిన రాజ్ కోపంతో ఊగిపోతూ "నువ్వా.. మళ్ళీ ఎందుకొచ్చావ్ నువ్వు ఎక్కడుంటే అక్కడ బొగ్గే" అని అంటాడు. దానికి కావ్య "మాటలు జాగ్రత్తగా రానివ్వండి " అని అంటుంది.  కాసేపు కావ్య, రాజ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చివరగా తనకి సారి చెప్తే వెళ్తానని అంటుంది కావ్య. దానికి రాజ్ పొగరుగా "నీకు సారీనా.. నేను చెప్పను" అని సమధానమిస్తాడు.  దీంతో కనకం ఈ గొడవ ఇంకా పెరిగేలా ఉందని గమనించి డైవర్ట్ చేయాలని ఆలోచిస్తుంది. వెంటనే పరుగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి "అయ్యో అయ్యో .. దెబ్బ తగిలిందా.. కాలు బెణికిందా అమ్మా" అని స్వప్నకి సైగ చేయగా.. తను అవును కాలు బెణికింది అన్నట్టుగా యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత రాజ్ "చూడు నీవల్లే ఇలా జరిగింది" అని కావ్యని అంటాడు. స్వప్న తనని ఆపి.. "రాజ్ బదులు నేను సారీ చెప్తున్నా" అని అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి వెళ్ళి మెల్లిగా బ్రతిమాలి తనని వెళ్ళమంటుంది స్వప్న. ఇక రాజ్ సెక్యూరిటీతో కావ్యని బయటకు పంపించాలనుకుంటాడు.  రాజ్ పొగరును చూసి.. "ఈ జన్మలో ఈ ఇంటికి రాను" అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

రిషి, వసుధారలను పంచభూతాలు కలుపనున్నాయా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్‌ - 675 లోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై రిషి, వసుధారల ప్రేమకు విశేషమైన స్పందన వస్తోంది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో... వసుధారని తల్చుకుంటూ ఆలోచనల్లో మునిగిపోతాడు రిషి. నా ఆలోచనల్ని.. కలల్ని మాయం చేశావ్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావ్. నేనేం నేరం చేశాను. నా తప్పేముంది అని అనుకుంటూ రిషి  బాధపడుతుంటాడు. అంతలో రిషి దగ్గరికి జగతి అన్నం తీసుకొని వచ్చి తినమని ఇస్తుంది. నేను తినను అని రిషి  చెప్తాడు. "వసుధారని ఎలా మర్చిపోవాలో చెప్తారా మేడం.. మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నానంటే మొదటగా వసుధారని ప్రేమిస్తున్నానని నాక్కూడా తెలియని విషయాన్ని నాకు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను" అని అంటాడు. జీవితం అంటేనే పోరాటం కాలమే అన్నింటికి సమాధానం చెప్తుందని చెప్పి అక్కడి నుండి జగతి వెళ్ళిపోయింది. రిషి రెడీ అయి బయటకు వెళ్తుండగా... మేం కూడా వస్తామని జగతి, మహేంద్ర అంటారు. సరే అని అన్నాక అందరూ వెళ్తారు. నాన్న మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని చక్రపాణితో చెప్తుంది వసుధార. ఇద్దరు కలిసి ఒక చెరువు ఒడ్డుకి వెళ్తారు. "నాన్నా... ఈ గంగ ఒడ్డున మనం కోరికలు రాసి నీటిలో వదిలితే మన కోరికలు తీరుతాయట అమ్మ చెప్పింది" అని వసుధార అనగానే.. సరే నువ్వు వెళ్ళు అమ్మా అని చక్రపాణి అంటాడు.  "రిషి సర్ నేను రిషిధారగా ఒక్కటవ్వాలి" అని పేపర్ పడవ మీద రాసి పంచభూతాలకు మొక్కుకొని నీటిలో వదులుతుంది. మరోవైపు రిషి అటువైపుగా వచ్చి.. "నా ప్రపంచమే వసుధార. ఆమె ఏం కోరుకుంటే అది జరగాలి" అని రాసి కాగితపు పడవను నీటిలో వదులుతాడు. ఆ తర్వాత రెండు పడవలు కలుసుకోవడంతో ఆ పడవ ఎవరిది అని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.అలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. ఈ సీన్ అంతా ఎమోషనల్ గా సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కన్నీరు పెట్టుకున్న మురారి.. ఓదార్చిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ - 69 లోకి అడుగు పెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో... మురారి తన కార్ లో ఉన్న ముకుందను ఎవరైనా చూస్తారేమోనని కంగారుపడతాడు.  నా ప్రేమని చంపి ఆత్మవంచన చేసి ఈ నరకంలో పడేసావని ముకుంద అంటుంది. "ఏంటీ అది నరకమా.. నువ్వంటే ఫ్యామిలీలో అందరికి ఇష్టమే.. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్" అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు మురారి. అవేమీ వినకుండా ముకుంద అలానే మాట్లాడేసరికి... "జీవితాంతం నన్ను ద్వేషించేవాడిగా చూసినా పర్వాలేదు కానీ ప్రేమించేవాడిలా మాత్రం చూడకు" అంటూ కంటతడి పెడతాడు మురారి. అది చూసిన ముకుంద... ఏంటీ మురారి నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఏడ్వకు నిన్ను గొప్ప ఆఫీసర్ గా చూడాలనుకుంటున్నా.. కానీ ఇలా కాదు నిన్ను బాధపెట్టినందుకు సారి అని చెప్తుంది. మరోవైపు కృష్ణ కాపురం గురించి ఆలోచిస్తూ స్టవ్ మీద పాలు ఉన్న విషయం మర్చిపోయి మరి ఆలోచిస్తుంది రేవతి.  ఇంతలో కృష్ణ వచ్చి.. ఏంటీ అత్తయ్య అలా ఉన్నారు అంటూ బీపీ చెక్ చేస్తుంది. "ఇంత బీపీ ఉందేంటి అత్తయ్యా.. దేని గురించి ఆలోచిస్తున్నారు" అంటుంది కృష్ణ. నువ్వు మురారి సంతోషంగా ఉంటున్నారా అని రేవతి అడుగుతుంది. దానికి కృష్ణ "ఏంటీ అత్తయ్య ఇలా అడుగుతుంది మురారి నేను దూరంగా ఉంటున్నట్టు తెలిసిందా" అని అనుకుంటుంది. మేం బాగుంటున్నాం. మురారి నన్ను ఒక్క మాట కూడా అనడు. మీకు తెలుసు కదా అంటుంది కృష్ణ. "మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయిందో నాకు తెలుసు.. మీరు బాగుండాలి" అని రేవతి చెప్తుంది. మేము బాగుంటాం మా గురించి టెన్షన్ పడకండని కృష్ణ అంటుంది. "కృష్ణ పెత్తనం నడుస్తుంది" అని అలేఖ్య, సుమలత  ఇద్దరు మాట్లాడుకుంటారు. అది నందిని విని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ మాటలు విన్న రేవతి‌‌... వారిద్దరికీ స్ట్రాంగ్ కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మురారిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా.. ప్రశ్నలతో తనకి చిరాకు తెప్పిస్తుంది కృష్ణ. దాంతో  మురారి "నా బాధలేవో నేను పడుతున్నాను. నన్ను వదిలేయ్" అంటూ అరిచేసరికి... కృష్ణ అక్కడి నుండి వెళ్లిపోతుంది‌. వాళ్ళ మాటలు అన్ని కూడా రేవతి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యుగయుగాల నుంచి ఉన్న ఆలీ..కూతురికి పెళ్లైన అవి అస్సలు తగ్గలేదంటూ...

"సుమ అడ్డా" లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఆలీ, పోసాని కృష్ణ మురళి వచ్చారు. ఇక వాళ్ళతో కలిసి సుమ మంచి ఫన్ చేసింది. ఈ సందర్భంగా కృష్ణ మురళి గారు మీ నాన్న గారి గురించి చెప్పండి అని అడిగేసరికి "మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆయనకు  ఏ అలవాట్లూ లేవు. కానీ ఎవడో పేకాట నేర్పాడు. ఊళ్ళో ఎవరో ఒకరు అంటారు కదా..ఎందుకు సుబ్బారావు నువ్విలా చేస్తావు అని అడిగేసరికి ఆయనకు ఆయన సమాధానం చెప్పుకోలేక పొలం వెళ్లి అక్కడ చనిపోయాడు." అని ఆయన బాధను షేర్ చేసుకున్నారు.  ఇక ఆలీ గురించి చెప్తూ "ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎన్ని యుగాల నుంచి ఉన్నారు ఆలీ గారు" అని చెప్పేసరికి ఆలీ ఫుల్ ఖుషీ ఇపోయారు. "రాజా రాజా రాజా అని మీరు ఎన్ని సార్లు అన్నారో నేను నా రాజా కూడా అన్ని సార్లు అనలేదు" అని పోసాని డైలాగ్ మీద కౌంటర్ వేసింది సుమ. "ఇంతకు సెల్ ఉండడం మంచిదా లేకపోవడం మంచిదా..మీకు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లేదు" అని సుమ పోసానిని అడిగేసరికి "ఎందుకు అవన్నీ..ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్, అప్పుడప్పుడు చిన్న చిన్న మెసేజెస్" చాలు అన్నారు పోసాని. ఇంతకు మీ ఫోన్ ఏది అని ఆలీని అడిగేసరికి "సగం కొరికి పెట్టాడే ఎంగిలి చేసింది.అది నాది..నువ్వు కూడా కోరుకుతావా" అని తన ఆపిల్ ఫోన్ గురించి చెప్పేసరికి "వద్దు, వద్దు" అంది సుమ భయపడుతూ.  సుమ అడిగిన ప్రశ్నకు ఒక స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఆలీ ఒక చాకోలెట్ తీసుకెళ్లి ఆ స్టూడెంట్ కి ఇచ్చి షాక్ హ్యాండ్ ఇచ్చేసరికి "కూతురికి పెళ్ళైనా ఇవేం తగ్గలేదసలు" అని సైడ్ డైలాగ్ వేసింది సుమ.