Illu illalu pillalu : ధీరజ్ కోసం ప్రేమ తపన.. బతుకమ్మ ఆటలో ఇరు కుటుంబాలు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -286 లో.. నర్మద పేరెంట్స్ ని తీసుకొని వచ్చి సాగర్ నర్మదకి సర్ ప్రైజ్ ఇస్తాడు. నర్మద తన పేరెంట్స్ ని చూసి సంతోషపడుతుంది. అమ్మా మీరేలా వచ్చారని నర్మద అడుగుతుంది. సాగర్ వచ్చి.. నా వల్ల మీ కూతురిని బాధపెట్టకండి అని రిక్వెస్ట్ చేసాడు.. దాంతో మీ నాన్న కూడా ఏం అనలేదని నర్మద వాళ్ళ అమ్మ అంటుంది. ఆ తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. నువ్వు మా కుటుంబం కోసం ఏంత చేస్తున్నావ్.. ఈ మాత్రం చేయలేనా అని సాగర్ అంటాడు. ఆ తర్వాత అందరు బతుకమ్మ ఆడుతారు. వేదవతిని ప్రేమ తీసుకొని వెళ్లి తన వాళ్ళ దగ్గర ఆడేలా చేస్తుంది. ఆ తర్వాత నర్మద వాళ్ళ అమ్మని ప్రేమ తీసుకొని వచ్చి నర్మద దగ్గర ఆడెలా చేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కి నీ ప్రేమ విషయం చెప్పమని ప్రేమతో నర్మద చెప్తుంది. అక్క నువ్వే హెల్ప్ చెయ్యాలని ప్రేమ అంటుంది. ఐ లవ్ యూ అని ఒక పేపర్ పై రాసి ఒక పాప కి ఇచ్చి ధీరజ్ కి ఇచ్చి ఆ అక్క పంపిందని చెప్పు అని ప్రేమని చూపిస్తుంది. ఆ పాప వెళ్లి పేపర్ ఇస్తుంది. ఎవరు ఇచ్చారని ధీరజ్ అడుగుతాడు. ఆ పాప ప్రేమని చుపిస్తుంది. కానీ వెనకాల ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్య పంపింది అనుకొని ధీరజ్ తన దగ్గరికి వెళ్లి.. ఇది రాసింది నువ్వేనా అనీ అడుగుతాడు. నువ్వే రాసి ఇలా నన్ను అంటున్నావని ఐశ్వర్య సిగ్గుపడుతుంది. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటే అని ఐశ్వర్యతో గొడవ పడుతుంది. నర్మద వచ్చి గొడవ ఆపుతుంది. ప్రేమతో సైలైంట్ గా మాట్లాడుతుంది నర్మద. ఆ పేపర్ నేను రాసి నువ్వు ఇచ్చావని పంపించాను కానీ ఐశ్వర్య అనుకున్నాడని ప్రేమతో నర్మద అంటుంది. మరొకవైపు సేనాపతి, రామరాజు కలిసిపోయారు కదా మీ ప్రేమ మీ ఇంట్లో బతుకమ్మ తీసుకొని వచ్చింది కదా అని ఒకతను సేనాపతితో అంటాడు. వాడితో కలవడం ఏంటి వాడే సిగ్గు లేకుండా వాళ్ళని అడ్డు పెట్టుకొని మాతో కలవాలని చూస్తున్నాడని సేనాపతి అంటాడు. మరోవైపు రామరాజు తన ఇద్దరు కోడళ్ళని చూసి.. ఈ ఇద్దరు కోడళ్ళు నా పరువు తీసేందుకే ఉన్నారని అనుకుంటాడు. అదే విషయం వేదవతితో చెప్తాడు. అదంతా విన్న శ్రీవల్లి.. రామరాజుకి వచ్చి ఇంకా కోపం పెరిగేలా మాట్లాడుతుంది. అదంతా ప్రేమ, నర్మద వింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో కార్తీక్ వైరం.. ఇప్పుడే మొదలైంది!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -485 లో....బోర్డ్ మీటింగ్ జరుగుతుంది.. అందులో నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అనగానే.. మీ కంటే ముందు మేము ఒక నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెంబర్స్ అంటారు. ఈ కంపెనీలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మా ముగ్గురికి ఉంది.. కంపెనీ లాస్ లో ఉంది.. అందుకే మా షేర్స్ అమ్మాలని అనుకుంటున్నామని బోర్డ్ మెంబర్స్ అనగానే అందరు షాక్ అవుతారు. ఎవరికి అమ్ముతున్నారని దశరథ్ అడుగుతాడు. వస్తున్నాడని వాళ్ళే చెప్తారని బోర్డ్ మెంబర్స్ అంటుండగానే అప్పుడే వైరా వస్తాడు. కార్ దగ్గరున్న డ్రైవర్ కి వైరా మేనేజర్ హాయ్ చెప్తాడు. అతను ఎవరని వైరా అడుగుతాడు. శివన్నారాయణ డ్రైవర్ అని అతను చెప్తాడు. ఆ తర్వాత వైరా లోపలికి ఎంట్రీ అవ్వగానే దశరత్, శివన్నారాయణ షాక్ అవుతారు. మేము అమ్మాలనుకుంటుంది తనకే అని బోర్డు మెంబర్స్ చెప్తారు. దశరథ్ కి వైరాకి మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడే శివన్నారాయణ మేనేజర్ కార్తీక్ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తాడు. కార్తీక్ లోపలికి రావడానికి శివన్నారాయణ పర్మిషన్ అడుగుతాడు. కార్తీక్ ని రమ్మని శివన్నారాయణ చెప్తాడు. మరొకవైపు వంట చేస్తూ దీప మామిడి కాయ పుల్లగా ఉందో లేదో చూస్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. ఏంటి ఏదైనా విశేషామా పుల్లటిది తింటున్నావని అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు అత్తయ్య అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్ లోపలికి వస్తాడు. మీరు పిల్చింది డ్రైవర్ నా అని వైరా వెటకారంగా మాట్లాడుతాడు. అతను మాజీ సీఈఓ.. నా మనవడు అని శివన్నారాయణ చెప్పగానే వైరా షాక్ అవుతాడు.  ఆ తర్వాత కార్తీక్ బోర్డ్ మెంబర్స్ తో మాట్లాడి కన్విన్స్ చేసి షేర్స్ అమ్మకుండా చేస్తాడు. దాంతో వైరా నీతో మాట్లాడాలి కార్తీక్.. బయట వెయిట్ చేస్తానని వెళ్తాడు. బావని ఎందుకు పిలిచారు.. నన్ను ప్రతిసారీ జోకర్ ని చేస్తున్నారని చెప్పి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. శివన్నారాయణ, దశరథ్ ఇద్దరు కార్తీక్ కి థాంక్స్ చెప్తారు. కార్తీక్ బయటకు వెళ్లి వైరాతో మాట్లాడతాడు. నేను మీ మావయ్య తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. నువ్వు అడ్డురాకని కార్తీక్ కి వైరా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య కోసం వెళ్ళిన రాజ్.. తన మాట మార్చుకుంటాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -848 లో.....నా నిర్ణయం అయితే నేను మార్చుకోను. కావ్యని ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు కానీ నేను చెప్పింది చెయ్యాలని రాజ్ తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఇక గొడవలు అయితే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పు జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంది. అత్తయ్య అన్ని మాటలు అంటుందిని కళ్యాణ్ తో అప్పు చెప్తూ బాధపడుతుంది. అసలు అలా వదినని అమ్మ అన్ని మాటలు అనడానికి కారణం నువ్వే.. నువ్వు సరిగ్గా భోజనం చెయ్యకపోవడంతో నీ కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని అమ్మ అంటుందని అప్పుతో కళ్యాణ్ అంటాడు. ఇక జరిగింది చాలు అక్కకి నిజం చెప్తానని అప్పు వెళ్తుంటే వద్దు అన్నయ్య చెప్పకుండా అబార్షన్ చెయ్యాలని చేస్తూన్నాడు కదా.. ఇప్పుడు నువ్వు చెప్తే ఎలా అని అప్పుని కళ్యాణ్ ఆపుతాడు. నువ్వు ఈ జ్యూస్ తాగు లేదంటే అమ్మ మళ్ళీ గొడవ చేస్తుందనగానే అప్పు తాగుతుంది. మరొకవైపు రాజ్ మారేలా లేడని ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి తన గదిలో పెట్టి వెళ్లిపోతుంది. మరుసటి రోజు పనిమనిషి రూమ్ క్లీన్ చేస్తుంటే ఆ లెటర్ బయట పడుతుంది. అది చూసి అపర్ణ చదువుతుంది. కావ్య వెళ్ళిపోయిందని తెలుసుకొని షాక్ అవుతుంది. ఇంట్లో అందరిని పిలిచి విషయం చెప్తుంది. నీ వల్లే నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని రాజ్ పై అపర్ణ కోప్పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని రుద్రాణి అంటుంది. దాంతో సుభాష్ తనపై కోప్పడతాడు. కావ్య ఖచ్చితంగా తన పుట్టింటికి వెళ్లి ఉంటుంది అపర్ణ, నువ్వు కనకం కి కాల్ చెయ్యమని సుభాష్ చెప్తాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. అల్లుడు గారు రాలేదా అని కనకం అడుగుతుంది. తరువాయి భాగంలో కావ్య కోసం కనకం ఇంటికి రాజ్ వస్తాడు. మీ నిర్ణయం మార్చుకుంటేనే నేను వస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బలం కావాలంటే తాగాలి పాలు... నాకు కావాలి బాలు 

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఇల్లు-ఇల్లాలు-పిల్లలు వెర్సెస్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇక ప్రభాకర ఆమనితో ముచ్చట్లు పెట్టింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు రామరాజు గారు" అని అడిగింది. "మీరు ఎలా ఉంటారు అనుకున్నాను. చూస్తే మా వైఫ్ లో బుజ్జమ్మను చూసినట్టే ఉన్నారు" అని చెప్పాడు ప్రభాకర్. "బుజ్జమ్మ గారు సెట్ లో కూడా ఇంతే రొమాంటిక్ గా ఉంటారా ఏంటి" అంటూ ఆమనిని అడిగింది. "ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు" అని చెప్పింది. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి వచ్చిన హీరో బాలు శ్రీముఖికి ఒక కంప్లైంట్ చేసాడు. "వీడికి ఎంత కస్టపడి ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే షాప్ ఓనర్ లా రావాలి కానీ వీడేమో మెకానిక్ షాప్ ఓనర్ లా వచ్చాడు." అంటూ సీరియల్ లో తన తమ్ముడు మనోజ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక మనోజ్ ఐతే తానూ వేసుకొచ్చిన బ్లూ కలర్ డ్రెస్ ని కింద నుంచి పై వరకు చూసుకుని కొంచెం ఫీలయ్యాడు. దాంతో సెట్ లో ఉన్నవాళ్ళంతా నవ్వేశారు. ఇక సీరియల్ లోని మీనా గురించి రెండు లైన్స్ చెప్పాడు హరి.."అందరి మీద పడుతుంది వానా. అందరి మనస్సులో ఉంటుంది మీనా" అనేసరికి "అబ్బో" అంటూ అరిచింది శ్రీముఖి. "బలం కావాలంటే తాగాలి పాలు...కానీ నాకు బలం రావాలంటే కావాలి బాలు" అంటూ శ్రీముఖి మంచి జోష్ తో చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే ఈ షోలో బాలును చూసినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.  "బాలు నీ షో లో చూసి చాలా రోజులు అవుతుంది , బాలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.బాలు కోసం ఈ వీక్ షో కచ్చితంగా చూడాల్సిందే." అంటూ కామెంట్ చేశారు.

Bigg Boss 9 Telugu: డ్యాన్స్ తో ఇరగదీసిన సుమన్ శెట్టి.. ఆటలో సంజనని ఓడించాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో ప్రస్తుతం టాస్క్ ల పరంపర సాగుతుంది. ఎవ్వరు తగ్గటం లేదు.. ఎందుకంటే డూ ఆర్ డై సిచువేషన్ ఉంది. ఎందుకంటే ఈ వీకెండ్ లో వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో హౌస్ లీస్ట్ లో ఉన్నవారు ఎలిమినేషన్ అవుతారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే గేమ్ లలో ఎవరు బాగా ఆడి టేబుల్ లో టాప్ లో ఉంటారో వాళ్ళు సేఫ్.. కానీ లీస్ట్ లో ఉన్నవాళ్ళు డేంజర్ జోన్ . ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లే సమయం వచ్చింది. అయితే ఎంటర్‌టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్కులో గెలవడం కూడా అంతే ముఖ్యం. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్‌లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటికి రావాలి. ఏ జట్టు సభ్యులైతే ఎక్కువసార్లు ముందుగా బయటికొస్తారో వాళ్లు ఈ టాస్కులో విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక సాంగ్​ మొదలవగానే సుమన్ శెట్టి అద్దిరిపోయేలా స్టెప్పులేశాడు. మిగిలిన అమ్మాయిలతో కలిసి సుమన్ శెట్టి వేసిన డ్యాన్స్ చూసి అందరూ తెగ నవ్వుకున్నారు.  నాది నక్లెస్ గొలుసు పాటకి సుమన్ శెట్టి, సంజనా గల్రానీ చేసిన డ్యాన్స్ నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.  ఇంతలో మ్యూజిక్ స్టాప్ చేసి ఆరెంజ్ కలర్ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అందరికంటే ముందు దివ్య ఆ హోల్​లో దూరింది. వెనకాల నుంచి మిగిలిన వాళ్లు లాగినా సరే బయటపడి గెలిచింది దివ్య. అలా ఈ గేమ్ మూడు  సార్లు జరిగింది. మూడో రౌండ్  లో సుమన్ శెట్టి-సంజనా ఉండగా.. సుమన్ శెట్టి చిరుత వేగంతో వచ్చి హోల్ నుండి బయటకి వచ్చేశాడు. దాంతో సుమన్ శెట్టి టీమ్ గెలిచింది. సంజనా టీమ్ ఓడిపోయింది. ఇలా నిన్నటి టాస్క్ లో భరణి-దివ్యలతో పాటుగా సుమన్ శెట్టి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. 

Bigg boss 9 Telugu : సేఫ్ జోన్ లో ఆ ఇద్దరు.. ఇంటికి వెళ్ళిపోతానంటూ సంజన ఏడుపు!

  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్ప అందరు డేంజర్ జోన్ లో ఉన్నారు. అందరూ టీమ్ లుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అయిదు టీమ్ లలో ఒక్కొక్కరు డాన్స్ చెయ్యాలి.. పాట ఆపినప్పుడు బిగ్ బాస్ చెప్పిన కలర్ గల హోల్స్ నుండి కంటెస్టెంట్స్ వెళ్ళాలి. అలా ఎవరు ముందు వెళ్తారో వాళ్లే ఆ రౌండ్ విన్నర్.. మొదటి రౌండ్ కి కళ్యాణ్, తనూజ టీమ్, రెండో రౌండ్ కి భరణి దివ్య టీమ్.. మూడో రౌండ్ కి డీమాన్ పవన్, రీతూ.. నాలుగో రౌండ్ కి సుమన్ శ్రీజ, చివరగా సంజన ఫ్లోరా ఉన్నారు. పాయింట్స్ బోర్డు పై సంజన ఫ్లోరా నాలుగో స్థానంలో, సుమన్ శ్రీజ అయిదో స్థానంలో ఉన్నారు. అయితే మొదటి స్థానంలో ఉన్న భరణి, దివ్యకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. చివరి రెండు స్థానాలలో ఉన్న ఒక టీమ్ ని తీసేయమని భరణి, దివ్య టీమ్ కి బిగ్ బాస్ చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి డిస్కషన్ చేసుకొని సంజన, ఫ్లోరాలని టాస్క్ నుండి ఎలిమినేట్ చేస్తారు. దాంతో సంజన ఏడుస్తుంది. నన్ను ఇంటికి పంపించండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత పిరమిడ్ టాస్క్ లో తనూజ, కళ్యాణ్ మొదటగా పూర్తి చేశారు. దివ్య, భరణి రెండవ  స్థానంలో టాస్క్ ని పూర్తి చేశారు, సుమన్ శెట్టి, శ్రీజ మూడవ స్థానం, రీతూ, డిమాన్ నాల్గవ స్థానంలో పూర్తి చేశారు. పాయింట్స్ బోర్డు లో మొదటి స్థానంలో భరణి, దివ్య ఉన్నారు. కాగా వాళ్ళని సేఫ్ జోన్ కి బిగ్ బాస్ పంపిస్తాడు. ఇక రెండో స్థానంలో ఉన్న కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరికి మాత్రమే సేఫ్ జోన్ ఛాన్స్ వస్తుందని బిగ్ బాస్ చెప్పగా ఇద్దరు డిస్కషన్ చేసుకొని కళ్యాణ్ ని సేఫ్ జోన్ అని తనూజ చెప్తుంది. ఇక డేంజర్ జోన్ లో తనూజ ఉంటుంది. 

Jayam serial : జయం సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. గంగ కోసం వచ్చిన రుద్ర!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -80 లో.. నిన్ను ఎంతో నమ్మాను.. నీలో నా కొడుకు ప్రేమని  చూసుకున్నాను కానీ నువ్వు నాకు నమ్మకద్రోహం చేసావ్.. నాతో ప్రేమగా ఉంటుంటే ఆ రుద్ర ఏం తప్పు చెయ్యలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావని గంగపై శకుంతల కోప్పడుతుంది. నేను అలా మీకు నమ్మకద్రోహం చెయ్యలేదని శకుంతల కాళ్లపై పడుతుంది గంగ. అయిన వినకుండా శకుంతల చిరాకు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గంగ తన గదివైపు వెళ్తుంటే.. ఏంటి గంగ ఎక్కడికి వెళ్తున్నావ్.. ఇంకా ఇంత జరిగిన కూడా ఇంట్లోకి వెళ్తున్నావ్ ఇంట్లో వాళ్లంతా నీపై చిరాకు పడుతున్నారని గంగతో ఇషిక అంటుంటే.. వెళ్తుందిలే ఇషిక అని వీరు అంటాడు. నాకు సంబంధించిన వస్తువులు పైన ఉన్నాయి.. అవి తీసుకొని రావడానికి వెళ్తున్నానని గంగ అంటుంది. ఆ తర్వాత మణికి వీరు ఫోన్ చేసి గంగని ఇంట్లో నుండి గెంటేసారు.. ఏం చేసుకుంటావో నీ ఇష్టమని చెప్తాడు. మరొకవైపు గంగ వెళిపోతు రుద్ర రూమ్ ముందు ఆగి నన్ను క్షమించండి అని చెప్తుంది. ఆ తర్వాత గంగ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మణి తాళితో రెడీగా ఉంటాడు. బలవంతంగా గంగ మెడలో తాళి కట్టబోతుంటే గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి వచ్చి మణి మెడపై కత్తిపీట పెడుతుంది‌. దాంతో మణి భయపడుతాడు. ఈ పైడిరాజ్.. నీ కూతురితో నా పెళ్లి చేస్తానన్నాడు.. డబ్బులు తీసుకున్నాడు.. నా డబ్బు నాకు ఇవ్వండి అని మణి అడుగుతాడు. తరువాయి భాగంలో గంగ ఇంట్లో లేదని రుద్రకి తెలిసి తన ఇంటికి వస్తాడు. నేను మీకు మాటిచ్చాను.. నీ కూతురిని జాగ్రత్తగా చూసుకుంటానని అందుకే గంగని నా వెంట తీసుకొని వెళ్తున్నానని గంగ చెయ్యి పట్టుకొని రుద్ర తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నర్మద ప్లాన్ సూపర్.‌. ప్రేమ చేతుల మీదుగా బతుకమ్మ సాగిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -285 లో.....నర్మద, ప్రేమ, శ్రీవల్లి ముగ్గురు కలిసి బతుకమ్మలని తీసుకొని వస్తారు. వాళ్ళు అలా సంతోషంగా ఉండడం చూసి పండుగ అంతా మన భార్యల మొహంలోనే కనిపిస్తుందని అన్నదముళ్లు అనుకుంటారు. అప్పుడే రామరాజు వచ్చి.. వాళ్ళు అలా పైకి ఉన్నా వాళ్ళ మనసులో బాధ ఉంటుంది కదా.. వాళ్ళ పుట్టింటికి దూరంగా ఉన్నారు. వాళ్లకి కష్టం రాకుండా చూసుకోవాలని తన కొడుకులకి రామరాజు చెప్తాడు. మరొకవైపు ప్రేమ, నర్మద కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ప్రేమ పుట్టింటివాళ్ళు బతుకమ్మ తీసుకొని వస్తుంటే ప్రేమ, నర్మద వెళ్తారు. రేవతి పడిపోతుంటే తన చేతులో బతుకమ్మని ప్రేమ తీసుకుంటుంది. ఇలా చేతులు మారిన బతుకమ్మ మరొక చేతులకి మారితే అరిష్టమని నర్మద అంటుంది. అదేం లేదని భద్రవతి అంటుంది. అప్పుడే వేదవతి వచ్చి వాళ్ళు ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం మాట్లాడుతుంది. వాళ్ళ బతుకమ్మ నువ్వెందుకు పట్టుకున్నావని వేదవతి అంటుంది. ఎంతైనా మన వాళ్ళు కదా.. అత్త చేతులు మారితే అరిష్టం అంట అని ప్రేమ అంటుంది. దాంతో వేదవతి కోపంగా వెళ్లినట్టు యాక్ట్ చేస్తుంది. ఆవిడ కోపంగా వెళ్ళింది.. ఈవిడ వద్దంటుంది త్వరగా వెళ్లి బతుకమ్మ అక్కడ పెట్టు ప్రేమ అని నర్మద అనగానే ప్రేమ వెళ్లి బతుకమ్మ పెడుతుంది. అనుకున్నట్లుగానే ప్రేమ చేతుల మీదుగా బతుకమ్మ తీసుకొని వస్తారు. అదంతా రామరాజుకి శ్రీవల్లి చూపిస్తుంది. ప్లాన్ సూపర్ అని నర్మదని వేదవతి మెచ్చుకుంటుంది. మరొకవైపు నర్మద పేరెంట్స్ ని సాగర్ తీసుకొని వచ్చి తనకి సర్ ప్రైజ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దాస్ పై శివన్నారాయణకి డౌట్.. జ్యోత్స్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -484 లో.....శివన్నారాయణ, పారిజాతం ఇద్దరిని కార్తీక్ గుడికి తీసుకొని వెళ్లి రిటర్న్ అవుతాడు. మీ నాన్న ఇంట్లో దాస్ ఉన్నాడట అక్కడ ఆపమని కార్తీక్ తో పారిజాతం చెప్తుంది. ఏంటి మీ గుసగుసలు అని శివన్నారాయణ అడుగుతాడు. ఏం లేదు వాళ్ళ కొడుకు ఊరు నుండి వచ్చాడట ఒకసారి శ్రీధర్ ఇంటి దగ్గర ఆపమని అంటుందని కార్తీక్ చెప్తాడు. ఆ మాత్రం దానికి గుసగుసలు ఎందుకు మాములుగా మాట్లాడుకోవచ్చు కదా శ్రీధర్ ఇంటిదగ్గర ఆపు అని కార్తీక్ కి శివన్నారాయణ చెప్తాడు. కార్తీక్ సడన్ గా కార్ ఆపుతాడు. ఇంకా శ్రీధర్ ఇల్లు రాలేదు కదా అని శివన్నారాయణ అంటాడు. ముందు చూడండి దాస్ మావయ్య జ్యోత్స్న మాట్లాడుకుంటున్నారని కార్తీక్ చూపిస్తాడు. దాస్ ని రిక్వెస్ట్ చేస్తూ దాస్ చెయ్ తన తలపై పెట్టుకొని ఒట్టేస్తుంది జ్యోత్స్న. ఇక్కడ ఏం జరుగుతుందని శివన్నారాయణ వెళ్లి అడుగుతాడు. దాస్ దగ్గర ఏం మాట తీసుకున్నావని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.ఏం లేదు సర్ కాశీకి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి లేదంటే నా మీద ఒట్టే అంటుందని దాస్ కవర్ చేస్తాడు. అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్లి దాస్, జ్యోత్స్న మాట్లాడుకున్నది చెప్తాడు. కాసేపటి తర్వాత కార్తీక్, దీప ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. ఒకరికొకరు నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు.  మరుసటి రోజు దాస్ తో జ్యోత్స్న మాట్లాడడం గురించి దశరథ్ తో శివన్నారాయణ చెప్తాడు. అసలు దాస్ నాకు అబద్ధం చెప్పాడనిపిస్తుందని శివన్నారాయణ అంటాడు. దాంతో దాస్ ని జ్యోత్స్న కొట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు దశరథ్. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ లో రెస్టారెంట్ లాభాల కోసం నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అప్పు టెన్షన్.‌. అక్క లెటర్ రాసి వెళ్ళిపోయిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -847 లో.....రాజ్ కి డాక్టర్ ఫోన్ చేసి ఇంకా కొన్ని రోజుల్లో కావ్యకి అయిదు నెలలు పడుతాయి. అప్పుడు అబార్షన్ చెయ్యడం వీలు కాదు. అప్పుడు తల్లి బిడ్డని కోల్పోవాల్సి ఉంటుందని డాక్టర్ బెదిరిస్తుంది. నువ్వు త్వరగా కావ్యకి అసలు విషయం చెప్పి ఒప్పించని డాక్టర్ చెప్తుంది. దాంతో రాజ్ లో టెన్షన్ మొదలవుతుంది. ఇప్పటికైనా వదినకి నిజం చెప్పు అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు. నిజం చెప్పి ఇంట్లో వాళ్ళని బాధపెట్టలేనని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య గురించి అప్పు తల్చుకొని ఒక్కసారిగా ఉల్లిక్కిపడి నిద్రలేస్తుంది. అక్కతో మాట్లాడాలని అప్పు వెళ్తుంటే ధాన్యలక్ష్మి జ్యూస్ తీసుకొని వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదని టాబ్లెట్ ఇస్తుంది. దాంతో అప్పు పడుకుంటుంది. ధాన్యలక్ష్మి వస్తుంటే రుద్రాణి ఎదురుపడుతుంది. అప్పు ఈ సిచువేయేషన్ లో కూడా అక్క గురించి ఆలోచిస్తుందని ధాన్యలక్ష్మికి కావ్యపై ఇంకా కోపం కలిగేలా రుద్రాణి చేస్తుంది. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా ఇంట్లో అందరిని పిలుస్తుంది. కావ్య, రాజ్ లు సమస్య ని పరిష్కారించుకొని గొడవలు లేకుండా చూసుకోవాలని ధాన్యలక్ష్మి అందరికి చెప్తుంది. నేను నా నిర్ణయం మార్చుకోనని రాజ్ అనగానే అయితే నా కొడుకు కోడలిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ధాన్యాలక్ష్మి అనగానే మీ నిర్ణయానికి అడ్డు చెప్పనని రాజ్ అనగానే సీతారామయ్య వచ్చి రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకుంటున్నావా అని సీతారామయ్య అంటాడు. నేను ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో నాలో ఎలాంటి మార్పు లేదని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో కావ్య లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అది అపర్ణ చూసి ఇంట్లో అందరికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg boss 9 Telugu :భరణితో దివ్య క్లోజ్‌గా ఉంటుంది.. జెలస్ ఫీల్ అవుతున్న  ఆ ఇద్దరు!

బిగ్ బాస్ సీజన్-9 లో బోలెడు ట్విస్ట్ లు టాస్క్ లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ కేరాఫ్ ఉమ్మడి కుటుంబం అనేలా అందరు బిహేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఈ ఒక్కరు ఖాళీగా లేరు. ఎవరో ఒకరు ఏదో బాండ్ తో ఉన్నారు. ఇక చాలా క్రేజ్ సంపాదించుకున్న బాండ్ ఏదంటే భరణి-తనూజ నాన్న నాన్న అంటూ తన చుట్టూ తిరుగుతుంది తనూజ. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనీ సోషల్ మీడియా పాజిటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయితే గత వారం కింద వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది దివ్య నిఖిత. తను కూడా భరణికి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు హౌస్ లో భరణి తనతో ఎక్కువగ ఉండడం వల్ల తనూజ జెలస్ గా ఫీల్ అవుతుంది. నువ్వు అర్ధం చేసుకుంటావ్ అమ్మ కానీ తనూజ అలా కదు నాన్న మారిపోయాడు అంటుందని ఒక సందర్బంలో దివ్య తో భరణి అంటాడు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లలో భరణి, దివ్య జోడిగా ఉన్నారు. మరొకవైపు సంజన కూడా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఆ పిల్ల రాకముందు తనూజతో వంద శాతం ఉంటే నాతో ముప్పై శాతం అయినా ఉండేవాడు భరణి  కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినప్పటి నుండి నన్ను పట్టించకోవడం లేదు అసలు నేనొక దాన్ని ఉన్నానో లేనో కూడా చూడట్లేద్దని ఇమ్మాన్యుయేల్‌తో సంజన చెప్తుంది.

లయ ఎనర్జీ ఏమీ తగ్గలేదు...శ్రీకాంత్ సొట్టబుగ్గలే ఇష్టం నాకు

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్  2025 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ గా సీనియర్స్ జూనియర్స్ అన్న తేడా లేకుండా అందరూ వస్తున్నారు. ఇంద్రజ, ఆలీ, రాశి, శ్రీకాంత్ వంటి వాళ్లంతా వచ్చారు. ఇక ఇప్పుడు లయ వచ్చింది. లయ 90s హీరోయిన్. హీరో వేణుతో కలిసి "స్వయంవరం" మూవీతో ఫుల్ పాపులర్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యింది. "ప్రేమించు, మిస్సమ్మ, నీ ప్రేమకై, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం" వంటి మూవీస్ లో నటించింది.  ఇక రీసెంట్ గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ షోకి వచ్చింది. ఇక నల్ల కళ్ళజోడు పెట్టుకుని శ్రీకాంత, లయ చేసిన డాన్స్ మాములుగా లేదు. "చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లయను చూడడం. అప్పటి ఎనెర్జీ ఇప్పటికీ తగ్గలేదు" అంటూ శ్రీకాంత్ లయకి కాంప్లిమెంట్ ఇచ్చాడు. లయ ఐతే థ్యాంక్యూ అని చెప్పింది. ఇక ప్రదీప్ వచ్చి "శ్రీకాంత్ గారిలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి" అంటూ శ్రీముఖిని అడిగాడు. ఆమె వెంటనే శ్రీకాంత్ బుగ్గల్ని నొక్కుతూ "ఆయన సొట్ట బుగ్గలు" అని చెప్పింది. దాంతో శ్రీకాంత్ "బుగ్గలు ఎక్కువై సొట్టలు కనిపించడం లేదు" అనేసరికి శ్రీముఖి ఆయన రెండు బుగ్గల్ని గిల్లింది. కింద నుంచి శ్రీకాంత్ వైఫ్ ఊహ అలా చూస్తూనే ఉంది. ఇక ఈ ఈవెంట్ గా "తెలుసు కదా" మూవీ నుంచి సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా వచ్చారు. అలాగే పూజ హెగ్డే కూడా వచ్చింది. లయ మూవీస్ లో కంటే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఫ్రండ్స్ అండ్ ఫామిలీ మెంబర్స్ తో కలిసి గ్రూప్ డాన్స్ వీడియోస్ అలాగే తన పిల్లలతో ఉండే వీడియోస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి విచ్చేసింది.

పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిపడేసిన తనూజ!

బిగ్ బాస్ సీజన్-9 లో టాస్క్ ల పరంపర సాగుతోంది. పాయింట్స్ కోసం కంటెస్టెంట్స్ కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ పాయింట్స్ ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు.. ఈ టాస్క్ లలో చివర్లో ఉన్న ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. అందుకే లీస్ట్ లో ఉండకుండా టాస్క్ లలో గట్టి పోటీ ఇస్తున్నారు. ‌ నిన్నటి టాస్క్ లలో తనూజ-కళ్యాణ్ టీమ్ లీస్ట్(చివరి) స్థానంలోకి వెళ్ళింది. అయితే దీనికి కారణం పవన్ కళ్యాణ్ సరిగ్గా బ్రెయిన్ వాడకపోవడమే.. ఇది నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రతీఒక్కరికి అర్థమవుతుంది. నిన్నటి టాస్క్.. 'హోల్డ్ ఇట్ లాంగ్'. ఏ జంట అయితే టాస్క్ ముగిసేవరకూ తమ ప్లాట్‌ఫామ్‌ను నేలకి టచ్ కాకుండా గాల్లో ఉంచగలుగుతారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కుకి ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ సంచాలకులుగా ఉన్నారు. ఇక బజర్ మోగిన తర్వాత టాస్క్ మొదలైంది. అన్ని జంటలకి ఒక్కో సంచి వేయండని బిగ్‌బాస్ చెప్పాడు. తర్వాత కేవలం ఒక జంటకి ఒక సంచి వేయండి అని బిగ్‌బాస్ చెప్పగానే మేము ఇద్దరం డిసైడ్ అయి పెడుతున్నాం ప్లీజ్.. అంటూ భరణి-దివ్యలపై భారం వేశారు ఇమ్మూ-రాము.  తర్వాత సంజన-ఫ్లోరా టీమ్‌కి కూడా సంచి వేయడంతో ఇక్కడ అబ్బాయిలు కూడా లేరు చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ అంటూ సంజన బతిమాలింది.  ఒక జంటకి రెండు సంచులు అని బిగ్‌బాస్ చెప్పాడు. శ్రీజ-సుమన్ శెట్టి టీమ్‌కి సంచి వేస్తుండగా ఒక నిమిషం ఆగు అని శ్రీజ చెప్పింది. కాదు మీ పొజిషన్ అలా పెట్టుకున్నారు మీరు అంటూ రాము అన్నాడు. ఆ వెంటనే సుమన్ టీమ్ టాస్క్ నుండి బయటకొచ్చేసింది. నెక్స్ట్ భరణి-దివ్య టీమ్ ఔట్ కాగా తర్వాత సంజన-ఫ్లోరా టీమ్ ఎలిమినేట్ అయింది. చివరిగా కళ్యాణ్-తనూజ, రీతూ-డీమాన్ టీమ్ మాత్రమే ఉన్నాయి. తనూజ టీమ్‌కి బ్యాగ్ పెడతాడు రాము. ఆ తర్వాత తనూజ తన తాడుని మెళ్లిగా కిందకి అంటానని కళ్యాణ్ తో చెప్పింది కానీ అతను మాత్రం బ్యాలెన్స్ చేయకుండా తాడుని అలానే పట్టుకున్నాడు దాంతో సంచి కిందపడిపోయింది. ఆగు ఆగు హే పడుతుందంటూ తనూజ ఆ రోప్‌ని వదిలేసి కళ్యాణ్‌పై ఫైర్ అయింది. నాకు చెప్పడానికి రాకు కళ్యాణ్ నువ్వు.. నీది డౌన్ వచ్చింది అక్కడ.. అని తనూజ చెప్పింది. నేను దించట్లేదు నువ్వు ఫుల్ డౌన్ చేసేశావ్ అక్కడ అంటూ కళ్యాణ్ అన్నాడు. ఇలా ఈ టాస్కులో డీమాన్-రీతూ గెలిచారు.

ఢీ షోలో కన్నీళ్లు పెట్టుకున్న పండు..దేవుడు వరమిస్తే ఒక్క రోజైనా పండులా బతకాలి

  ఢీ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఆడియన్స్ ని అలరించింది. ఐతే భూమిక పెర్ఫార్మెన్స్ కి ముందు పండు విజయ్ బిన్నీ మాష్టర్ దగ్గరకు వచ్చి "మీరెంత పెద్ద తప్పు చేశారో తెలుసా అబ్బాయిలతో పోటీ పడే ఏకైక కెపాసిటీ ఉన్న అమ్మాయి భూమిక అంటూ పొగిడారు. ఆ మాటకు ఆ అమ్మాయి పిచ్చెక్కి పోయి ఎలాంటి డాన్స్ లు చేస్తుందో తెలుసా" అంటూ భూమిక చేసిన డాన్స్ ని చూపించాడు. ఇక సాంగ్ ఐపోయాక భూమికకు వోట్ చేశారు జడ్జెస్ కూడా. తర్వాత నందు పండుని స్టేజి మీదకు పిలిచాడు. "ఇటుక మీద ఇటుక పెడితే" సాంగ్ పండు ట్రేడ్ మార్క్ సాంగ్ ఐపోయింది అని చెప్పాడు. ఆ సాంగ్ వైరల్ ఐనందుకు ఒక మాషప్ వీడియోని ప్లే చేసి చూపించారు. ఇక పండు గురించి ఆది మాట్లాడాడు."మనోడు ప్రతీ సీజన్ లో తన మార్క్ ని క్రియేట్ చేసేవాడు. ప్రతీ సీజన్ ఇంకో లెవెల్ కి వెళ్ళడానికి హెల్ప్ చేసేది పండునే. ఈ సీజన్ ఇంత బాగా హైలైట్ అవడానికి కారణం పండు ఆరోజు చేసిన ఇటుక మీద ఇటుక సాంగ్. వచ్చి ఏదో సాంగ్ చేసి వెళ్ళిపోదాం అని అనుకోడు. ఏదో కొత్తగా చేయాలి మిగతా వాళ్ళ కంటే డిఫెరెంట్ గా థింక్ చేయాలి అనుకుంటాడు. ప్రతీ సీజన్ తన మార్క్ ని నిలబెట్టుకోవడానికి చూపే తపన విషయంలో పండుకు హ్యాట్సాఫ్" అంటూ చెప్పాడు. ఇక పండు మాట్లాడాడు. "ఇంత రెస్పాన్స్ చూసాక చాల హ్యాపీగా ఉంది. నా గురించి ఎవరు మాట్లాడినా వినాలనిపిస్తుంది. కానీ ఆది అన్న మాట్లాడితే ఇంకా వినబుద్దేస్తుంది. ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఈరోజు నా గురించి మాట్లాడేసరికి చాల ఎమోషనల్ గా ఫీలయ్యా. నన్ను మా డాడీ వాళ్ళ కంటే బాగా పెంచింది మా బాబాయ్. వాళ్లకు నేను చదువుకోవడం ఇష్టం. కానీ నేను డాన్స్ వైపు వచ్చేసాను. అలాంటి బాబాయ్ ఢీ 15 టైములో ఫస్ట్ టైం నా గురించి ఏడుస్తూ ఒక మాట అన్నారు. అరేయ్ నువ్వు సక్సెస్ కావడం నేను చూడాలి అని. ఢీ ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంటుంది. నాకు ఎలాంటి ప్రైజ్ వద్దు అనిపిస్తుంది. కానీ ఇన్ని సీజన్స్ నుంచి చేస్తున్నా కానీ కప్పు కోసం ఈ సీజన్ ట్రై చేస్తున్నా. మాక్సిమం ట్రై చేసి ఫైనల్స్ వరకు వెళ్తా మాష్టర్." అని చెప్పాడు. ఇక నందు మాట్లాడాడు.."వీడికి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను అని చెప్తాను ఎందుకంటే నాకు తెలిసి నాకు మించిన కాంప్లిమెంట్ ఇవ్వరు. ఇస్తారో లేదో తెలీదు. ఒక రోజు నేను ఒకరిలా బతకాలి అని దేవుడు వరం ఇస్తే వీడిలా బతకాలని ఉంది" అని చెప్పాడు నందు.

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో ప్రభంజనం సృష్టిస్తున్న సుమన్ శెట్టి!

  బిగ్ బాస్ హౌస్ లో అయిదో వారం టాస్క్ లతో ఫుల్ ప్యాక్ డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. గత రెండు రోజుల నుండి టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి. అందుకు టీమ్ లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ అన్ని జంటలకి టాస్క్ ఇస్తాడు. రూమ్ లోకి వెళ్లి అక్కడ రెడ్ క్లాత్ పై ఉన్న ఐటమ్ ని గుర్తు పెట్టుకొని వచ్చి డ్రా చెయ్యాలి.. డ్రా చేసిన దాన్ని బట్టి తన టీమ్ మేట్ అదే ఐటమ్ వెళ్లి తీసుకొని రావాలి. అలా మొదటి రౌండ్ కి దివ్య గీసిన డ్రాయింగ్ చూసి భరణి కరెక్ట్ గా తీసుకొని వస్తాడు. రెండో రౌండ్ కి సంజన డ్రా చేయగా ఫ్లోరా కరెక్ట్ గా తీసుకొని వస్తుంది. మూడో రౌండ్ కి సుమన్ డ్రా చెయ్యగా శ్రీజ కరెక్ట్ గా తీసుకొని వస్తుంది. నాలుగో రౌండ్ కి డీమాన్ పవన్ డ్రా చెయ్యగా రీతూ కరెక్ట్ గా తీసుకొని వస్తుంది. చివరగా గెలవకుండా మిగిలింది తనూజ, కళ్యాణ్ టీమ్.  వాళ్ళు స్కోర్ బోర్డు లో చివరగా ఉంటారు. నాలుగో స్థానంలో సుమన్, శ్రీజ. మూడో స్థానంలో రీతూ, పవన్, రెండో స్థానంలో సంజన, ఫ్లోరా మొదటి స్థానం లో భరణి, దివ్య ఉంటారు. ఇక టాస్క్ పూర్తయ్యాక ఇమ్మాన్యుయల్ స్కోర్ బోర్డు చూస్తూ కామెడీ చేశాడు. టీవీలో శ్రీ చైతన్య, నారాయణ రిజల్ట్స్ వచ్చినప్పుడు చేసే యాడ్ లా స్పూఫ్ ఇరగదీశాడు ఇమ్మాన్యుయల్. స్కోర్ బోర్డు పై స్థానాలని చెప్తు అందరిని కడుపుబ్బా నవ్వించాడు. సుమన్ శెట్టి పాయింట్స్ లో ప్రభంజనం.. అయిదో స్థానం నుండి నాలుగో స్థానానికి  మారడం.. ఇది సుమన్ అన్నకే సాధ్యమంటూ మొదలెట్టాడు.. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. జయం సినిమాలో తన కామెడీతో జయం పొంది.. తెలుగు సినిమా రంగంలో కామెడీయన్ గా ఎదిగాడు.. ఇక తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో నటించిన అతను.. బిగ్ బాస్ నుండి రింగ్(ఫోన్ కాల్) రాకపోయినా.. తనే రింగ్(బిగ్ బాస్ కి కాల్ చేసి) ఇచ్చి ఇక్కడికి వచ్చి.. తన టార్గెట్ అంతా ఆ కిరీటం మీదే పెట్టుకున్నాడంటూ ఇమ్మాన్యుయల్ చేసిన స్పూఫ్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఇది బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. సుమన్ శెట్టి ఓ టాస్క్ లో గీసిన కిరీటం చూసిన బిగ్ బాస్.. సుమన్ శెట్టి మీరు గీసిన డ్రాయింగ్ అచ్చం నిజమైన కిరీటంలానే ఉందని అన్నాడు. దాంతో హౌస్ అంతా కడుపుబ్బా నవ్వేశారు. 

Karthika Deepam2 : జ్యోత్స్నకి‌ డౌట్ క్రియేట్ చేసిన దాస్.. వాళ్ళిద్దరు కలుస్తారా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -483 లో..... అసలు మీరు ఇంకా ఎందుకు ఆ ఇంట్లో పని చేస్తున్నారని అడిగితే మొన్నటి దాకా దీప కోసం అన్నావ్ ఇప్పుడేమో అన్నయ్య కూతురు కోసం అంటున్నావ్.. నాకేం అర్థం కావడం లేదని కార్తీక్ తో కాంచన అంటుంది. నాకు కార్తీక్ పై నమ్మకం ఉందని అనసూయ అంటుంది. ఆ తర్వాత దీపతో కార్తీక్ మాట్లాడుతాడు  నువ్వు ఇలా ఉండకు జ్యోత్స్న.. ఏం అన్నా కూడా మాటకి మాట సమాధానం చెప్పమని దీపతో కార్తీక్ అంటాడు. మరుసటి రోజు దీప హుషారుగా పనులు చేస్తు గుడ్ మార్నింగ్ అమ్మయి గారు అని దీప అంటుంది. బావ రాలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. వచ్చాడు కిందున్నాడని దీప అంటుంది. నిన్న బావ ఎందుకు అలా అన్నాడు.. నా కోసం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది. మీ కోసమని ఎవరు అన్నారు.. సుమిత్ర అమ్మ కూతురు కోసమని దీప అనగానే అప్పడే పారిజాతం ఎంట్రీ ఇచ్చి సుమిత్ర కూతురు జ్యోత్స్ననే కదా అని అంటుంది. ఏమో అని దీప వాళ్ళని కన్ఫ్యూషన్ చేస్తూ మాట్లాడుతుంది. దాని మాటలు పట్టించుకోకు నువ్వు ఆఫీస్ కి వెళ్ళు.. నేను గుడికి వెళ్తానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆఫీస్ కి కాదు నీ కొడుకు దగ్గరికి వెళ్తానని జ్యోత్స్న అనుకుంటుంది. కాసేపటికి దాస్ దగ్గరకి జ్యోత్స్న వెళ్తుంది. నువ్వు దీపకి నిజం చెప్పవా అని అడుగుతుంది.‌ లేదు నేను చెప్పకుంటే ఎవరు చెప్పరా.. నాలాగే ఎవరైనా జరిగింది చూశారేమో చెప్పి ఉంటారేమోనని దాస్ అంటుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అదంతా కాశీ చూసి ఏంటి జ్యోత్స్న మా నాన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుందని అనుకుంటాడు. మరొకవైపు దశరథ్ తో దీప మాట్లాడుతుంది. సుమిత్రని పిలుస్తుంది. సుమిత్ర అమ్మ, మీరు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళండి హ్యాపీగా ఉండండి.. నా వల్ల మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారని దశరథ్ ని దీప అడుగుతుంది. దశరథ్ కప్ కింద పడేసి దాన్ని ఇప్పుడు అతుకుపెట్టగలవా.. అది అతుకు పెట్టిన కూడా అది అతుకులాగే ఉంటుంది.. నమ్మకం కూడా అంతేనని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. నేను తప్పు చేసాను నన్ను శిక్ష అనుభవించనివ్వు కానీ నువ్వు చేసింది గుర్తుచెయ్యను అలాగని మర్చిపోనని సుమిత్ర అనగానే.. దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : ఇంట్లో నుండి వెళ్ళిపోయిన గంగ.. ఆ రౌడీ ఏం చేయనున్నాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -79 లో.....గంగ మారు వేషంలో రుద్ర దగ్గరికి వచ్చిన వీడియోని ఇషిక అందరికి చూపిస్తుంది. గంగ నేను కాదని అంటుంది. వీడియో మొదటి నుండి చూపించగానే గంగ షాక్ అవుతుంది. ఇషిక వెళ్లి నర్స్ డ్రెస్ తీసుకొని వచ్చి చూపించగానే గంగ అడ్డంగా బుక్కవుతుంది. ఇప్పుడేమంటావ్ గంగ అని ఇషిక అంటుంది. ఇంట్లో అందరు తలో మాట అంటుంటే.. నేను ఇదంతా రుద్ర సర్ కోసం చేసానని అంటుంది. మీ బడ్డీ చిట్టితో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేద్దామని అలా చేసాననని రుద్రతో గంగ అంటుంది. దాంతో రుద్ర తనని కొట్టబోయి ఆగిపోతాడు. నువ్వు ఇక చెప్పకు అని చిరాకు పడతాడు. నిన్ను నమ్ముతూనే ఉంటాను. ఇంకా మోసం చేస్తూనే ఉండమని రుద్ర అంటాడు. రుద్ర కోపంగా వెళ్లిపోతుంటే.. ఇప్పుడు అర్థమైందా మోసం చేస్తే ఎలా ఉంటుందోనని శకుంతల అనగానే రుద్రకి గంగపై ఇంకా కోపం వస్తుంది. నువ్వు కరెక్ట్ చేసావ్ కావచ్చు కానీ నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది కాదని పెద్దసారు అంటాడు. అందరు తిడుతుంటే గంగ ఏడుస్తుంది. నిన్ను అభిమానించిన వాళ్ళు అవమనిస్తుంటే ఎలా ఉంది.. బాధగా ఉంది కదా నాక్కూడా అలాగే ఉందని శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే రౌడీకి  వీరు ఫోన్ చేసి.. గంగ ఇంట్లో నుండి బయటకు వస్తుంది.. పెళ్లి చేసుకుంటావో అమ్మేసుకుంటావో నీ ఇష్టమని వీరు అంటాడు. గంగ వాళ్ళింటికి వెళ్లేసరికి తాళితో రౌడి రెడీగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : బతుకమ్మ పేర్చిన రామరాజు కోడళ్ళు.. కొడుకులకి అగ్నిపరీక్షే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -284 లో.....ధీరజ్, నేను ముద్దు పెట్టుకున్నామో లేదో అన్న కన్ఫ్యూషన్ ఉంది అక్క నువ్వు ధీరజ్ ని అడుగు అక్క అని నర్మదని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ధీరజ్ వస్తుంటే నర్మద ఆపి మాట్లాడుతుంది. ప్రేమ చాటు నుండి అంతా వింటుంది. నిన్న బ్యాచిలర్ పార్టీలో ఏదో అయిందంట కదా అని అడుగుతుంది. ఏం అయింది పార్టీ బాగా జరిగిందని ధీరజ్ అంటాడు. ప్రేమ వింటున్న విషయం ధీరజ్ చూస్తాడు. దాంతో ఏమో వదిన కరెంటు పోయింది. నాకేం తెలియదని ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు ఏమైనా చిన్నపిల్లలా నువ్వు ఏమో కళ్ళు మూసుకున్నానంటావ్.. అతనేమో కరెంటు పోయిందని అంటున్నాడు.. మధ్యలో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావని ప్రేమతో నర్మద అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కోడళ్ళు బతుకమ్మ పేరుస్తారు. ఎవరు బాగా పేర్చారని ముగ్గురు అడుగుతారు. నాన్న మీరు చెప్పండి అనీ ధీరజ్, సాగర్ చందు అంటారు. మీ భార్యలకి సంబంధించినది మీరే చెప్పాలని అనేసి రామరాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేమ బతుకమ్మ బాగుందని సాగర్ అంటాడు. వల్లి వదినది బాగుందని ధీరజ్ అంటాడు. నర్మద బతుకమ్మ బాగుందని చందు అంటాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములు గొడవ పడినట్టు చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తిరుపతిని చెప్పమంటే నాకేం తెలియదని అంటాడు. మరొకవైపు భద్రవతి బతుకమ్మ పేరుస్తూ వేదవతి, ప్రేమలని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. నువ్వు బాధపడకు అత్త.. వచ్చే సంవత్సరానికి ప్రేమ వచ్చేలా చేస్తానని భద్రవతికి విశ్వ మాటిస్తాడు. మరొకవైపు పుట్టింటిని చూస్తూ ప్రేమ, వేదవతి ఇద్దరు బాధపడతారు. అప్పుడే నర్మద వస్తుంది. ఎప్పుడు నా చేత్తో బతుకమ్మ తీసుకొని వెళ్లేదాన్ని అని వేదవతి బాధపడుతుంటే నేను ఈసారి ఆ ఇంట్లో నుండి మీరు బతుకమ్మ తీసుకొని వెళ్లేలా చేస్తానని  వేదవతికి నర్మద చెప్తుంది. అందరు బతుకమ్మలు అడేందుకు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాజ్ కి విడాకులు ఇస్తానన్న కావ్య.. అప్పు షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -846 లో..... అప్పు డల్ గా ఉండడంతో ధాన్యలక్ష్మిని రుద్రాణి తీసుకొని వచ్చి .. నీ కోడలు చూడు ఎలా ఉందో.. దీనికి కారణం ఆ కావ్య.. ఇలా ఉంటే పుట్టే బిడ్డపై ఎఫెక్ట్ కలుగుతుందని రుద్రాణి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. కళ్యాణ్ ని పిలిచి అప్పుని అలా బయటకు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ సరే అంటాడు. అప్పు దగ్గరికి వచ్చి బయటకు వెళదాం.. అమ్మ నిన్ను ఇలా చూసినట్లు ఉంది.. అందుకే బయటకు తీసుకొని వెళ్ళు అంది అనగానే అప్పు సరే అంటుంది. మరొకవైపు రాజ్ కి వినపడేలా కావ్య తన ఫ్రెండ్ తో విడాకుల గురించి మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ బయటకు వెళదామని వస్తుంటే కావ్య మాటలు విని అప్పు నిజం అనుకొని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఏమైంది బయటకు వెళ్లలేదా అని అప్పుని ధాన్యలక్ష్మి అడుగుతుంది. లేదని అప్పు లోపలికి వెళ్తుంది. అప్పు రిటర్న్ రావడానికి కారణం ఆ కావ్య ఫోన్ లో విడాకుల గురించి మాట్లాడుతుంటే.. అప్పు విని ఇలా బాధపడుతూ వచ్చేసిందని ధాన్యలక్ష్మితో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ గొడవ పడుతారు. విడాకులు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా.. ఎక్కడ కావాలో చెప్పు అక్కడ సంతకం పెడతానని రాజ్ అంటాడు. అదంతా విని అప్పు కళ్ళు తిరిగిపడిపోతుంది. కావ్య దగ్గరికి వెళ్తుంటే మీ గొడవల వళ్ళే అప్పు కి ఇలా అయిందని ధాన్యాలక్ష్మి అంటుంది. డాక్టర్ చెకప్ చేసి అప్పు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలా అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్ చెప్తుంది. రాజ్ కి డాక్టర్ ఫోన్ చేసి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు.. నేను కావ్యతో నిజం చెప్పాలా అని అంటుంది. తరువాయి భాగంలో ఇంట్లో గొడవలు ఇలా జరిగితే నా కొడుకు కోడలిని తీసుకొని వెళ్ళిపోతానని ధాన్యలక్ష్మి అంటుంది. మీ ఇష్టం అని రాజ్ అంటాడు. సీతారామయ్య వచ్చి రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.