అన్షుపై విజయ్ బిన్నీ మాస్టర్ ఫైర్.. పండు గెలవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్!

  ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎక్స్-కంటెస్టెంట్స్ తో డాన్స్ చేశారు. అందరూ పోటాపోటీగా చేశారు. కానీ అన్షు రెడ్డి విషయానికి వచ్చేసరికి విజయ్ బిన్నీ మాస్టర్ ఆమె మీద ఫుల్ ఫైర్ అయ్యారు. "బొమ్మొలే ఉందిరా పోరి.." సాంగ్ కి డాన్స్ చేసింది. ఐతే అందులో ఆమె డాన్స్ అంతగా లేదని ఫీలయ్యాడు జడ్జ్. దాంతో "నాకు అసలు అన్షు ఎక్కువగా చేయలేదు అన్న ఫీల్ వచ్చింది" అన్నాడు. దాంతో డాన్స్ మాస్టర్ ఏదో చెప్పాడు. "బిహైండ్ కెమెరా సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయారు. కాబట్టి ఇది చూడండి మీరు అంటే ప్రోపర్ గా ఉండదు. చాలా మంది ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు " అన్నారు.    లాస్ట్ జతిన్ అలాగే పండు వచ్చి పోటాపోటీగా డాన్స్ చేశారు. దాంతో జడ్జెస్ ఇద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడ్డారు అసలు ఎవరికీ ఎం మార్క్స్ ఇవ్వాలా అని. జతిన్ పెర్ఫార్మెన్స్ కి సంకేత్ వచ్చి షూస్ పక్కకు తీసేసి వాళ్ళను విష్ చేసాడు. ఇక పండు ఐతే ప్రేమికుల రోజు మూవీ నుంచి వాలు కనులదాన అనే సాంగ్ కి చేసిన డాన్స్ ఐతే మాములుగా లేదు. విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే స్టేజి మీదకు వచ్చి మెచ్చుకున్నాడు. ఇది చాలా టఫ్ డెసిషన్. ఇలా ఉండాలి పోటీ అంటే. మేమిద్దరం ఇలాంటి ఒక రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ చెప్పింది రెజీనా. ఇక నెటిజన్స్ ఐతే అందరూ పండు గెలవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.  

Bigg Boss 9: ఆ వీడియో చూసి తనూజ షాక్.. ఇకనైనా మారుతుందా?

  బిగ్ బాస్ సీజన్-9 లో కొత్త కంటెస్టెంట్స్ రావడంతో హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. ‌తనూజ, కళ్యాణ్ మొదటి వారం క్రేజ్ ఉన్న పెయిర్. అందరు కళ్యాణ్, తనూజ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ తనూజ కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని కళ్యాణ్ కూడా అలాంటి అడ్వాంటేజ్ ఏం తీసుకోవడం లేదు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళందరు వీళ్లపై కాన్సన్ట్రేషన్ పెట్టారు.   తనూజని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. మాధురి, రమ్య మాట్లాడకున్న వీడియో చూపిస్తాడు. అందులో తనూజ, కళ్యాణ్ కి అంత లీనియన్స్ ఇచ్చింది.. కళ్యాణ్ చెయ్యి వేస్తుంటే తను ఇబ్బంది పడుతుంది.. అయినా చెయ్యి వేస్తున్నాడు కళ్యాణ్. తను అలా చేస్తుండంటే అంత లీనియన్స్ ఇచ్చే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని మాధురి, రమ్య మాట్లాడుకుంటారు. అది చూసి తనూజ షాక్ అవుతుంది. సర్ నేను అందరికి ముందే క్లారిటీ ఇచ్చాను సర్. కళ్యాణ్ రాగానే నేను అంటే ఇష్టమని చెప్పడంతో అందరు అలా అనుకుంటున్నారు.. నేను క్లారిటీ తో ఉన్నానని తనూజ చెప్తుంది.   ఆ తర్వాత కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని రమ్య, మాధురి మాట్లాడుకున్న వీడియోని కళ్యాణ్ కి చూపిస్తారు. చూసావా హౌస్ లో ఎలా అనుకుంటున్నారో నీ ముందు అనలేదు.. నీ వెనకాల మాట్లాడుకుంటున్నారని నాగార్జున చెప్తాడు. తనూజ క్లారిటీగా ఉందని పోలింగ్ చేస్తే అందరు తనూజకి సపోర్ట్ గా పోలింగ్ చేస్తారు. అందరి మాటలు దృష్టిలో పెట్టుకొని తనూజ ఆట మారుతుందో లేదో చూడాలి మరి.  

Bigg Boss 9: రీతూపై ఫీలింగ్ ఉందని చెప్పిన డీమాన్ పవన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ సూపర్ క్రేజీగా సాగింది. నాగార్జున వీకెండ్ లో అందరి బండారం హౌస్ మేట్స్ ముందు కాకుండా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడుతున్నాడు. డీమాన్ పవన్, రీతూని కన్ఫెషన్ రూమ్ కి నాగార్జున పిలుస్తాడు. వాళ్ళిద్దరికీ ఒక వీడియో చూపిస్తాడు. రమ్య దగ్గరికి డీమాన్ పవన్ వెళ్లి మాట్లాడతాడు. రీతూతో ఎందుకుంటున్నావ్.. నీ గేమ్ స్పాయిల్ అవుతుందన్నట్లు డిస్కషన్ చేస్తుంది. నా గేమ్ ఫస్ట్ తర్వాతే ఎవరైనా అని డీమాన్ పవన్ అంటాడు.   అసలు మీకు ఇద్దరికి మీపై క్లారిటీ ఉందా అని నాగార్జున అడుగతాడు. ఉంది సర్ హౌస్ లో నేను వీడితో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటాడు. నా గేమ్ నేను ఆడుకుంటానని రీతూ క్లారిటీగా చెప్తుంది. నాకు అంతే సర్ తనతో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటానని డీమాన్ పవన్ అంటాడు. ఆ తర్వాత మరొక వీడియో అని ఇంకొక వీడియో ప్లే చేస్తాడు నాగార్జున. మళ్ళీ డీమాన్, రమ్య మాట్లాడుకుంటారు. నువ్వు తనని లవ్ చేస్తున్నావ్ కదా.. ఇందాక ఏడ్చావ్ నీ కళ్ళు చూస్తే తెలిసిపోతుందని రమ్య అనగానే.. అదేం లేదు.. నేను క్లారిటీగా ఉన్న అన్నాడు. అవతల వైపు జెన్యూన్ గా ఉందో మీకే తెలియాలని రమ్య అంటుంది. లవ్ అలాంటిది ఏం లేదు ఫ్రెండ్ అంతే ఇన్‌ఫాక్చువేషన్ అని డీమాన్ అంటాడు. అది చూసి నీ మీద నీకే క్లారిటీ లేదని నాగార్జున అంటాడు. నాకైతే క్లారిటీ ఉందని రీతూ అంటుంది. నాకైతే కంఫర్ట్ జోన్ తను.. తనపై ఫీలింగ్ ఉందని డీమాన్ చెప్తాడు. డీమాన్ చెప్పిన దానికి ఆడియన్స్ వంద శాతం నో అని పోలింగ్ చేస్తారు.   డీమాన్ బయటకు వెళ్ళాక రీతూ ఉంటుంది. సర్ అందరు కూడా ఇదే టాపిక్ గురించి మాట్లాడతున్నారని రీతూ చెప్తుంది. వాళ్ళు నీ బలహీనత గురించి చెప్పి.. నిన్ను డౌన్ చెయ్యాలని చూస్తారు కదా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా అని నాగార్జున అంటాడు. రీతూకి క్లారిటీ ఉందో లేదో పోలింగ్ చేస్తే 50 పర్సెంట్ మాత్రమే థమ్స్ అప్ చేస్తారు. ఇప్పటికైనా ఇద్దరు క్లారిటీకి వచ్చి గేమ్ పై ఫోకస్ చేస్తారేమో చూడాలి మరి.  

Bigg Boss 9:  కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూసి షాకైన ఆ ఇద్దరు!

  బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. ప్రతీ ఎపిసోడ్ కొత్తగా సాగుతోంది.  వీకెండ్ లో నాగ్ వైల్డ్ కార్డ్స్ మాటల దూకుడికి చెక్ పెట్టాడు. వారం రోజులుగా ఓల్డ్ కంటెస్టెంట్స్ ని తమ మాటలతో టార్చర్ చేసారు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు మాట్లాడిన వీడియోని చూపించి అసలైన గేమ్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. రమ్య రావడంతోనే తను ఫుడ్ పవర్ తో ఎంట్రీ ఇచ్చింది. తను వచ్చి గేమ్ మీద కంటే అక్కడున్న జంటలపై ఫోకస్ పెట్టింది.    రమ్య, కళ్యాణ్ ని కన్ఫెషన్ రూమ్ కి నాగార్జున పిలుస్తాడు. మాధురి, రమ్య మాట్లాడుకుంటూ తనూజని కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడే టచ్ చేస్తున్నాడు.. నన్ను అలా టచ్ చేస్తే ఒక్కటిస్తానని రమ్య అంటుంది. ఆ వీడియోని చూపించగా కళ్యాణ్ షాక్ అవుతాడు. అలా అనడం కరెక్టేనా అమ్మాయిల పిచ్చి అని తన క్యారెక్టర్ పై ముద్ర వెయ్యడం తప్పు అని నాగార్జున చెప్తాడు. నా ఇంటెన్షన్ కరెక్టే కానీ ఆ మాట నేను వాడి ఉండకూడదు సర్ అని కళ్యాణ్ కి సారీ చెప్తుంది రమ్య. నేను అయితే ఏ ఉద్దేశ్యంతో అలా చెయ్యలేదు ఏదైనా తప్పుగా అనుకుంటే సారీ అని కళ్యాణ్ అంటాడు.    రమ్యకి ఇచ్చిన ఫుడ్ పవర్.. ఆ ఫుడ్ ని సుమన్ శెట్టితో షేర్ చేసుకోవడం సరైన నిర్ణయం కాబట్టి హౌస్ లో అందరు సరైన నిర్ణయం అంటారు. దాంతో తన ఫుడ్ పవర్ తనకే ఉంటుంది.  

Bharani Elimination: భరణి ఎలిమినేషన్.. బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్!

  భరణి ఎలిమినేషన్.. ‌ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్-9 సాగుతోంది. ఈ సీజన్ లో టాప్-5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా అనుకుంటున్న భరణి ఎలిమినేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   హౌస్ కి పెద్ద దిక్కుగా నిలిచిన భరణి ఎలిమినేట్ అవ్వడమనేది బిగ్ బాస్ ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. కథ అంతా మారిపోయింది.. ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న రాముని సేవ్ చేసి, భరణిని ఎనిమినేట్ చేశారనే వార్తల నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తనూజకి నాన్నగా, దివ్యకి అన్నగా, ఇమ్మాన్యుయల్ కి మామగా భరణి హౌస్ లో చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హౌస్ లో అందరితో ప్రేమగా ఉంటూ గేమ్ లో తన వంద శాతం ఇస్తున్న భరణి ఎలిమినేట్ అవ్వడమనేది ఆడియన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత వారం శ్రీజని ఎలిమినేషన్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్.. భరణిని ఎలిమినేషన్ చేసి హౌస్ లోని కంటెస్టెంట్స్ కి పెద్ద షాకే ఇచ్చాడు.    సోషల్ మీడియాలో బిగ్ బాస్ షూటింగ్ కి సంబందించిన కొన్ని లీక్స్ వస్తుంటాయి. ‌అయితే శనివారం, ఆదివారం నాటి ఎపిసోడ్ లకి సంబంధించిన లీక్స్ అన్ని సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుండే అప్డేట్ చేశారు.‌ అన్ని సోషల్ మీడియా పేజీలలో భరణి ఎలిమినేషన్ అనే వార్తలే వస్తున్నాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భరణి హౌస్ లో కీ ప్లేయర్.. మన భాషలో చెప్పాలంటే దమ్మున్న కంటెస్టెంట్. మరి అతడిని నిజంగా ఎలిమినేషన్ చేశారా లేదా సీక్రెట్ రూమ్ లో ఉంచి వీక్ మిడిల్ లో హౌస్ లోకి తెస్తారా అనేది తెలియాల్సి ఉంది. నేడు(ఆదివారం) జరగబోయే ఎపిసోడ్ లో నిజంగానే భరణిని ఎనిమినేట్ అవుతాడా లేదా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  

Bigg Boss 9: మాధురికి ఇచ్చిపడేసిన నాగ్.. పవర్ తీసేసాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్స్ రాకముందు కంటే వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ లో గందరగోళంగా ఉంది. వాళ్లు చేసే చేష్టలకి చిరాకు వచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా.. నాగార్జున వచ్చి అందరికి చివాట్లు పెడుతాడా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అనుకున్నదే అయింది.. వీకెండ్ వచ్చిరాగానే నాగార్జున అందరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు.   వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చిన పవర్స్ కి  వాళ్ళు అర్హులో కాదో అని మిగతా కంటెస్టెంట్స్ లో ఇద్దరి ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ బట్టి ఆడియన్స్ పోలింగ్ ద్వారా పవర్స్ ని ఉంచాలో తొలగించాలో డిసైడ్ చేసారు. మాధురికి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే పవర్ కి తను అర్హురాలో కాదోనని ఓల్డ్ కంటెస్టెంట్స్ లో సంజనని అడుగగా తను అర్హురాలని చెప్తుంది. దివ్య కాదని చెప్తుంది. ఆడియన్స్ కూడా దివ్యకి సపోర్ట్ చెయ్యడం తో మాధురి పవర్ తొలగించబడుతుంది.   పవన్, మాధురి కిచెన్ దగ్గర గొడవని నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో మాధురి తప్పు ఉంటుంది. నీ ఇంటెన్షన్ కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం తప్పని నాగార్జున చెప్తాడు. నాకు అలా చెప్పే అలవాటు లేదు సర్ నాది అంతా కమాండింగే ఉంటుంది.. రిక్వెస్ట్ ఉండదని మాధురి పొగరుగా సమాధానం చెప్తుంది. అదే మార్చుకుంటే ఎంతో ఎత్తుకి వెళ్తావని నాగార్జున సలహా ఇస్తాడు. రాబోయే వారాల్లోనైనా మాధురి మాటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి మరి.  

Illu Illalu Pillalu: ముద్దు పెట్టాడని అరిచేసిన శ్రీవల్లి.. గాలి తీసిన నర్మద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -293 లో.. ధీరజ్ కి ప్రేమ అన్నం తినిపిస్తుంది. మరొకవైపు సాగర్ ఇల్లరికం గురించి నర్మద వాళ్ళ నాన్న మాట్లాడడంతో రామరాజు బాధపడతాడు. నా కుటుంబం అంటే చాలా ఇష్టం.. అందరం ఎప్పుడు కలిసే ఉండాలని వేదవతితో రామరాజు చెప్తూ ఎమోషనల్ అవుతాడు.   మరొకవైపు నీ హ్యాపీనెస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను.. కానీ, నేను మీ ఇంటికి వెళ్లినందుకు మా నాన్నకి సారీ చెప్పావంటే.. నేను చేసింది తప్పు అని అనుకుంటున్నావని నర్మదపై సాగర్ కోప్పడుతాడు. దాంతో సాగర్ కి నర్మద ముద్దు పెడుతుంది. సాగర్ కూల్ అవుతాడు.    మరుసటిరోజు శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే విశ్వ పిలిచి అమూల్యని అలా పక్కకి తీసుకొని రా అంటాడు. నేను తీసుకొని రానని శ్రీవల్లి అంటుంది. పది లక్షలు ఇచ్చింది రాయబారం నడపడానికే అని భద్రవతి అంటుంది. శ్రీవల్లి సరే అని వెళ్లిపోతుంటే.. నర్మద ఎదురుపడి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నావని అడుగుతుంది. వాళ్ళని మన జోలికి రావొద్దని తిడుతున్నానని శ్రీవల్లి చెప్తుంది.    ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. ఇప్పుడు అంతా సెట్ అయింది కదా నాతో బాగుండొచ్చు కదా అని శ్రీవల్లి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. చందు తనకి ముద్దుపెడతాడు. దాంతో మా అయన నాకు ముద్దు పెట్టాడని గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి. దాంతో అందరు వస్తారు. ఎందుకు అలా అరుస్తున్నావ్ నిన్న మా ఆయన పెట్టాడు.. మావయ్య కూడా అత్తయ్యకి ఎన్నో సార్లు పెట్టాడు.. మొన్న ధీరజ్ కూడా ప్రేమకి ముద్దు పెట్టాడు.. మేం ఇలాగే అరుస్తున్నామా అని నర్మద అంటుంది.    తరువాయి భాగంలో ధీరజ్ క్యాబ్ డ్రైవర్ గా వెళ్తుంటే.. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది.. ఈ రోజు వద్దు అని ప్రేమ అంటున్నా కూడా ధీరజ్ వెళ్తుంటే ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: క్షేమంగా ఉన్న సుమిత్ర.. శివన్నారాయణకి ఎందుకు తెలియొద్దంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -492 లో... దీప ఫోన్ చేయగానే కార్తీక్ కంగారుగా వస్తాడు. ఇంట్లో సుమిత్రని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. దీప జరిగింది మొత్తం చెప్తుంది. అక్కడ తాత వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానని కార్తీక్ అంటే దీప వద్దని ఆపుతుంది. సుమిత్ర కోపంగా తనతో అన్న మాటలు చెప్తుంది. నేను ఆ ఇంటికి వెళ్లను అంది.. ఇప్పుడు స్పృహలోకి వచ్చి మళ్ళీ ఏమైనా అంటుందేమోనని దీప అంటుంది.   ఆ తర్వాత కాంచన, శ్రీధర్ ఇంటికి వస్తారు. నాన్న వచ్చినట్లు ఉన్నాడు తనకి అత్త ఇక్కడ ఉన్నట్లు తెలియొద్దని వాళ్లు లోపలికి రాకుండా ఆపుతారు. నేను ఇంట్లోకి రావడం ఇష్టం లేదా అని శ్రీధర్ అంటాడు. అలా కాదు ఇంటిదగ్గర పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తారు కదా.. వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా అని శ్రీధర్ ని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. కాంచన లోపలికి వచ్చాక సుమిత్ర ఉన్న విషయం చెప్తారు. సుమిత్రని చూసి కాంచన బాధపడుతుంది.    అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి మా అమ్మ గురించి తెలిసిందా అని అడుగుతుంది. అత్త క్షేమంగా ఉందని కార్తీక్ అనగానే మమ్మీ ఎక్కడ ఉందో తెలిసిందా అని జ్యోత్స్న అంటుంది. లేదు క్షేమంగా ఉంటుందని అంటున్నానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. దాంతో దాసు, కాశీ ఇద్దరు సుమిత్ర ని వెతకడానికి వెళ్తారు. శ్రీధర్ కూడా సుమిత్ర కోసం వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: భర్త ఆకలి తీర్చడానికి అలా చేసిన భార్య.. అతను తెలుసుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -855 లో... రాజ్ నిరాహార దీక్ష చేస్తుంటే.. అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు. మీ భార్యకి మీకు గొడవ ఏంటని అడుగుతారు. అది నా పర్సనల్.. దాని గురించి మీకు అవసరం లేదని రాజ్ ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు అక్కడ జరిగేది మొత్తం ఎప్పటికప్పుడు ఇందిరాదేవి తెలుసుకుంటుంది. అపర్ణ కూడా చెప్తుంది.   ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వచ్చి అల్లుడు గారి ముందు కావాలనే భోజనం చెయ్ అని చెప్తుంది. దాంతో కావ్య వెళ్లి తన ముందు కూర్చొని భోజనం చేస్తుంది రాజ్ టెంప్ట్ అవుతాడు కానీ బయటపడడు. మరొకవైపు అపర్ణ డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైందని సుభాష్ వచ్చి అడుగుతాడు. ఏముంది అక్కడ కొడుకు ఏం తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా అని ఇందిరాదేవి చెప్తుంది.   ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి కావ్య వెళ్లి భోజనం తీసుకెళ్ళమని చెప్తుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇదంతా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ విషయం ఆయన్ని అడగండి అని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కృష్ణమూర్తి వెళ్లి భోజనం ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నాలో టాలెంట్ ని గుర్తించింది ఎస్పీ బాలు గారే..ఆయనే నాకు అవకాశాలు ఇచ్చారు

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో బ్రహ్మానందాన్ని ఈ షోకి గెస్ట్ గా పిలిచారు. ఇక బ్రహ్మానందం రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ థమన్, కార్తీక్, గీత, శ్రీరామ చంద్ర అలాగే సమీరా భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఇక కంటెస్టెంట్స్ కి తన స్టైల్ లో ఆల్ ది బెస్ట్ చెప్పారు. కంటెస్టెంట్ ధీరజ్ వచ్చి ఎస్పీ బాలు గారి బ్రెత్ లెస్ సాంగ్ "మాటే రాని" సాంగ్ పాడాడు. అలాగే ధీరజ్ ఆయన గురించి షేర్ చేసుకున్నాడు. "నా మ్యూజికల్ ఐడల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంత పెద్ద వేదిక మీద నేను ఇలా నిలబడి మన లెజెండరీ జడ్జెస్ ముందు పాడుతున్నాను అంటే దానికి కారణం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. నేను సింగర్ అవుతాను అన్న ఐడియా మా అమ్మానాన్నకు లేదు. కానీ ఎస్పీబి సర్ నన్ను గుర్తించారు. ఆయనే పాడడానికి అవకాశాలు ఇచ్చారు నాకు. ఆయన షోలో పాడే మంచి ఛాన్స్ ఇచ్చారు. అలాగే పాట అంటే ఏమిటి పాట యొక్క వేల్యూ ఏమిటి ఒక పాటలో సాహిత్యానికి ఉండే ఇంపార్టెన్స్ గురించి నాకు ఆయన చెప్పేవారు. మనకు ఉన్న టాలెంట్ ఎప్పుడూ ఎదుటి వాళ్లకు ఉపయోగపడాలి దాని కోసం మనం ఎంతో సాధన చేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు నాకు చెప్పారు" అంటూ ధీరజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటకు బ్రహ్మానందం ఫిదా ఇపోయారు అలాగే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అనౌన్స్ చేశారు.

గోరింటాకు సీరియల్ నాకెప్పుడూ స్పెషల్..గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగతనం చేశా

బుల్లితెర మీద కన్నడ నటుడు నిఖిల్ గురించి తెలియని వారుండరు. అలాంటి నిఖిల్ బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు. అలాంటి నిఖిల్ ఒక చిట్ -చాట్ షోలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "నా పేరు నిఖిల్ మలియక్కల్. నేను పుట్టి పెరిగింది కర్ణాటక మైసూర్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. స్కూల్ , కాలేజ్ కి వెళ్తూ బంక్ కొడుతూ ఉన్న ప్రాసెస్ లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కన్నడలో ఒక రెండు సినిమాలు చేసిన తర్వాత ఒక సీరియల్ చేసాను అలాగే ఒక 20 - 25 వరకు థియేటర్ షోస్ చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆడిషన్ చేసి ఒక తెలుగు సీరియల్ లో అవకాశం ఇచ్చారు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దొరికిన ప్రేమ సపోర్ట్ జనాల దగ్గర నుంచి లభించింది. నేను బ్లేస్డ్ అని చెప్పొచ్చు. నేను ఇంతవరకు వచ్చాను అంటే అది నా జర్నీ మాత్రమే కాదు నన్ను ఇష్టపడి నన్ను నడిపించిన ఒక్కొక్కరి జర్నీ ఇది." అని చెప్పుకొచ్చాడు. "మీ లైఫ్ ని చేంజ్ చేసిన ఆ ఒక్క రోజు ఏంటి" అని అడిగేసరికి "ఎక్స్పెక్టింగ్ మానేసిన రోజు నా లైఫ్ చేంజ్ అయ్యింది" అని చెప్పాడు. "పేరెంట్స్ తో అబద్ధమాడిన సిట్యువేషన్" "చాలా ఉన్నాయి. ఫీజు కట్టాలి అని డబ్బులు తీసుకెళ్లి ఎంజాయ్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. చిన్నప్పుడు ఉన్న గర్ల్ ఫ్రెండ్ కి కేక్ కొనివ్వడానికి అమ్మ బ్యాంగిల్ దొంగతనం చేసాను అలాగే అమ్మ పర్సులోంచి 100 , 50 దొంగతనం కూడా చేసాను" అని చెప్పాడు. "మీరు కాకుండా బిగ్ బాస్ లో టాప్ 3 నేమ్స్ ఎవరివి చెప్తారు".." విష్ణు ప్రియా, నబీల్, పృద్వి" అని చెప్పాడు. "మీరు వర్క్ చేసిన సీరియల్స్ లో టాప్ 3 చెప్పాలంటే ఎవరి పేర్లు చెప్తారు".. "భవ్య, శిరీష, ఆయేషా" అని చెప్పాడు. "మీ హిడెన్ టాలెంట్ ఏంటి". "చాలా ఉన్నాయి. టీజ్ చేస్తూ ఉంటాను, కౌంటర్లు వేసి నవ్విస్తూ ఉంటాను. నేను చాల లేజీ అదే సీక్రెట్" అని చెప్పాడు. "వన్ సైడ్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా".."వన్ సైడ్ కాదు అన్నీ డబుల్ సైడ్..చిన్నప్పుడు నాకు మా టీచర్ అంటే ఇష్టం. ఆవిడ నా క్రష్ " అని చెప్పాడు. " మీ లైఫ్ లో మీరు రిగ్రెట్ ఫీలైన పరిస్థితి".."రిగ్రెట్ అంటూ ఏమీ లేదు. ప్రతీ పరిస్థితి ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తుంది. "ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ లో ఏది ఇష్టం" అనేసరికి "ఆర్టిస్ట్ గా నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ నాకు ఇష్టం. ఐతే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడూ బెస్ట్ అనుకుంటాం కదా అలా నా ఫస్ట్ ప్రాజెక్ట్ గోరింటాకు ఇష్టం. ఈ సీరియల్ ద్వారానే నేను తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగాను" అని చెప్పాడు. "మీకు తెలుగు, కన్నడ ఏ ఇండస్ట్రీ ఇష్టం".. "ఒక్కటి చెప్పడం అంటే కష్టం. ఆర్టిస్ట్ అనేవాళ్లకు బోర్డర్స్ ఉండవు, భాషతో సంబంధం ఉండదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం" అని చెప్పాడు.

బిగ్ బాస్ సీజన్-9 విజేత అతడే.. ఎందుకో తెలుసా!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో మొత్తం పదహారు మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఇప్పటివరకు ఉన్నవారిలో ఎవరు టాప్-5 లో ఉంటారు. ఎవరు విజేతగా నిలుస్తారు. ఎవరేంటో ఓసారి చూసేద్దాం. తనూజకి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. అందుకే తను ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా తనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి ఉంటున్నాడు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ , డీమాన్ పవన్ కి ఓ మోస్తారు ఓటింగ్ బజ్ అయితే ఉంది. అయితే వీళ్ళంతా నామినేషన్ లో ఉన్నప్పుడు హౌస్ లో గేమ్ ఆడితేనే ఓట్లు పడతాయి.‌ కానీ ఇమ్మాన్యుయల్ కి  మాత్రం ఎవరున్నా లేకున్నా ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే అతనే హౌస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేది. గేమ్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కాస్త సరదాగా నవ్వుతూ ఉండాలంటే అక్కడ ఇమ్మాన్యుయల్ పంచ్ లు డైలాగులు ఉండాల్సిందే అన్నట్టుగా ఈ సీజన్-9 సాగుతుంది.  ఎందుకంటే ఎవరు ఏ సిచువేషన్ లో ఉన్నా వారిని నవ్విస్తాడు ఇమ్మాన్యుయల్. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలు.. ఇలా బిగ్ బాస్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇమ్మాన్యుయేల్.  తాజాగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇమ్మాన్యుయల్ చేసే కామెడీకి వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. ఇమ్మాన్యుయల్ మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా నేచురల్ గా కనిపిస్తున్నాడు. తోటి కంటెస్టెంట్స్ తోనూ ఎంతో కలివిడిగా ఉంటున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు హౌస్ లోని టాస్క్ లలో కూడా ఇరగదీస్తున్నాడు. తన వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడుతున్నాడు. అందుకే అతనికి గోల్డ్ స్టార్ కూడా వచ్చింది. గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయల్.. కేవలం 500 రూపాయలతో ఊరి నుండి సిటీకి వచ్చి ఆడిషన్ లో పాల్గొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్మాన్యుయల్.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతడి కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత షోలలో కామెడీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. దాంతో బిగ్ బాస్ సీజన్-9 లో ఎంట్రీ ఇచ్చాడు.  ఇందులో తమూజతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ తో  ఇమ్మాన్యుయల్ చేసే కామెడీకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక హౌస్ లో పదహారు మంది ఉండగా వారిలో బెస్ట్ ఎవరంటే మాత్రం ఫస్ట్ ఇమ్మాన్యుయల్ కన్పిస్తాడు. దీన్ని బట్టి చూస్తే .. ఇమ్మాన్యుయల్ ఈ సీజన్-9 విజేతగా నిలవడం ఖాయమనిపిస్తోంది. ఇమ్మాన్యుయల్ మొదటి స్థానంలో, తనూజ రెండవ స్థానంలో, సుమన్ శెట్టి మూడో స్థానంలో ఉంటారని ఇన్ని వారాల ఓటింగ్ ని బట్టి చూస్తే తెలుస్తోంది. మరి టాప్-3 లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu: బహుబలిలో ప్రభాస్ లా స్పీచ్ ఇచ్చిన సుమన్ శెట్టి.. గూస్ బంప్స్ లోడింగ్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ మొదటి టాస్క్ లో  ‌సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచారు. దాని తర్వాత రీతూ వచ్చి సుమన్ శెట్టి నుదుటిపై ముద్దు పెట్టింది.  ఆ తర్వాత గేమ్ లో ఓడిపోయామనే బాధలో కింద కూర్చొని అయేషా ఏడ్చేసింది. నా కన్ను వల్ల పోయింది మేమ్.. నా లోపం వల్ల పోయింది.. నాకు కనబడలేదంటూ అయేషా తన చెంపమీద తానే కొట్టుకుంటూ ఏడ్చేసింది. దీంతో అందరు తనని ఓదార్చడానికి వచ్చారు. నేనే ఫస్ట్ వచ్చాను.. అయినా కానీ ఓడిపోయాం.. నా కన్ను వల్ల పోయింది ఇమ్మూ నాకు కనబడలేదు ఇమ్మూ అంటూ అయేషా ఏడ్చింది. ఇది చూసి మాధురి కూడా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంది. దీంతో మాధురి గారు మీరు కూడా ఏడుస్తారేంటి అంటూ అందరూ ఓదార్చారు. కెప్టెన్ అయిన సంతోషంలో అధ్యక్షా.. సుమన్ శెట్టి అను నేను నీతిగా, నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నానని సుమన్ శెట్టి చెప్పాడు. ఇది ఎలా ఉందంటే బహుబలి సినిమాలో పట్టాభిషేకం అప్పుడు ప్రభాస్ స్పీచ్ ఇచ్చాడు కదా అచ్చం అలాగే ఉంది. ఇది సుమన్ శెట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ గా నిలిచిపోయింది. కాసేపటికి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.  ఇంట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు.  గౌరవ్-నిఖిల్ ఇద్దరికీ 'గెలుపు కొరకు చివరి వరకూ'.. అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. పోటీదారులు తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కర్రలపై నిలబడి రోప్స్‌కి కట్టిన వెయిట్ బ్యాగ్స్‌ని హ్యాండిల్స్ ద్వారా లాగుతూ కాళ్లు కిందపెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి.. బజర్ మోగిన ప్రతిసారీ సంచాలకులు చెప్పినన్ని వెయిట్ బ్యాగ్స్‌ని తను పిలిచిన ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వకూడదనుకునే పోటీదారుని రోప్‌కి హుక్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కుకి తనూజ సంచాలక్. టాస్క్ మొదలుకాగానే నిఖిల్ కంటే గౌరవ్ చాలా స్ట్రాంగ్‌గా బలంగా కనిపించాడు. గేమ్ కూడా అలానే జరిగింది. కాసేపటికి నిఖిల్ తన చేతికి ఉన్న రోప్‌ని మోయలేక వదిలేశాడు. దీంతో టాస్కులో గెలిచి మళ్లీ గౌరవ్ కెప్టెన్ అయిపోయాడు. ఇక కెప్టెన్స్ ఇద్దరూ మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నారు. అయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కనుక.. నువ్వు ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మిగిలిన బెడ్స్‌పై బయట మేము పడుకుంటామని సుమన్ చెప్పాడు. ఈ మాట చెప్పగానే అయేషా సహా లేడీస్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టావన్నా అంటూ మిగిలిన వాళ్లు అరిచారు. మరి సుమన్ శెట్టి కెప్టెన్ గా గెలవడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu : హౌస్ లో కొత్త కెప్టెన్ సుమన్ శెట్టి.. బిగ్ ట్విస్ట్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం ఆట క్రేజీగా సాగింది. నిన్న మొన్నటి వరకు ఆటల్లో సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేదని సుమన్ శెట్టిని అన్నారు. కానీ ఇప్పుడు తన మెరుగైన ఆటతీరుతో ఆరోవారం ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇది సుమన్ శెట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ గా నిలిచింది. అదేంటో ఓసారి చూసేద్దాం. నిన్న జరిగిన టాస్కులో తమ కంటెండర్‌షిప్ కాపాడుకొని నిలిచిన ఆరుగురు సభ్యులు ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు.. గెలిపొందు..ఈ టాస్కులో గెలిచిన జంటలోని ఇద్దరు సభ్యులు హౌస్‌ కెప్టెన్లు అవుతారు.. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల లాక్ అయి ఉంటారు.. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి అక్కడ తన పార్టనర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి.. ఆ కోడ్ కనుక్కోవడానికి కావాలస్సిన క్లూ సమాధి లోపలే ఉంటుంది.. ముందుగా ఎవరు తమ పార్టనర్‌ని విడుదల చేస్తారో వాళ్లు ఈ టాస్కు విజేతలు అవుతారని బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. సమాధి లోపల ఉన్న సభ్యులికి ఒక వాకీ టాకీ మరియు ఒక టార్చ్ లైట్ ఇవ్వడం జరుగుతుంది.. జంటలో బయట ఉన్న మరో సభ్యులు సమాధి లోపల ఉన్న మీ పార్టనర్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఒక వాకీ అవసరం కాబట్టి ముందుగా ఆ సభ్యులు కేజ్‌లో ఉన్న తమ వాకీ ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది.. అది కనుక్కోవడానికి అక్కడ ఉన్న వాకీస్‌లో తమ పార్టనర్ వాయిస్ గుర్తించి కేజ్ దగ్గర ఉన్న కీస్‌లో సరైన కీతో కేజ్ ఓపెన్ చేసి తమ వాకీని తీసుకోవాలి.. సమాధి లోపల ఉన్న ఫొటో బయట మీకు కావాల్సిన బాక్స్‌పై కూడా ఉంటుంది.. సమాధి లోపల ఉన్న వాళ్లు టార్చ్ వేసి చూసి అదేంటో స్పష్టంగా కనిపిస్తుంది.. దాన్ని బట్టి సరైన బాక్స్ ఓపెన్ చేసి అందులో కోడ్ గుర్తుపెట్టుకొని యాక్టివిటీ ఏరియాలో ఉన్న తమ పార్టనర్ సమాధి దగ్గరికెళ్లి అందులో కోడ్ ఎంటర్ చేసి మీ పార్టనర్‌ని విడుదల చేయాలి.. ఎవరైతే ముందుగా తమ పార్టనర్ సమాధిని ఓపెన్ చేసి విడుదల చేసి గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని మోగిస్తారో వాళ్లు టాస్క్ విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కు ఇలా మొదలుకాగానే చకచాకా కేజ్ నుంచి వాకీ టాకీ తీసుకొని మాధురి ఇచ్చిన సూచనల ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేసింది అయేషా. అలానే పరిగెత్తుకొని లోపలికి అయితే వెళ్లింది. కానీ అక్కడ మాధురి ఉన్న సమాధికి ఏర్పాటు చేసిన తాళానికి కావాల్సిన పాస్ వర్డ్ రాంగ్ ఎంటర్ చేసింది. దీంతో అది ఓపెన్ కాలేదు. మరోవైపు తర్వాత వెళ్లిన సాయి.. రమ్య ఏ బాక్స్‌లో ఉందో కనిపెట్టలేకపోయాడు. కానీ చివరిగా వెళ్లిన గౌరవ్ మాత్రం.. చాలా ప్రశాంతంగా సుమన్ శెట్టి పడుకున్న బాక్స్‌ని ఓపెన్ చేశాడు. దీంతో పరిగెత్తుకుంటూ ఇద్దరూ వెళ్లి గంట కొట్టేసి విన్ అయిపోయారు. సుమన్ శెట్టి అయితే ఫుల్ హ్యాపీ ఫీలైపోయాడు. రీతూ అయితే వచ్చి సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చింది.

Jayam serial : నిజం చెప్పిన సూర్య.. వీరూనే అంతా చేస్తుందని రుద్ర తెలుసుకుంటాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -87 లో.....గంగ దగ్గరున్న డబ్బు మణి తీసుకొని వెళ్తాడు. అప్పుడే లక్ష్మీ వస్తుంది. ఇంత లేట్ అయిందని అడుగుతుంది. వర్క్ బాగా ఉందని గంగ చెప్తుంది. నా ఫ్రెండ్స్ ని కలిసి వస్తానని గంగ వెళ్తుంది. తన ఫ్రెండ్ శ్రీను అన్న దగ్గరికి వెళ్లి నాకు ఏమైనా వర్క్ ఉంటే చెప్పండని అడుగగా.. ఉందని అతను చెప్తాడు. మరొకవైపు పారు ఫోటో చూస్తూ రుద్ర తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సూర్య ఫోన్ చేసి రుద్ర నీతో మాట్లాడాలని చెప్పి పడిపోతాడు. తన పక్కనున్న అతను ఫోన్ తీసుకొని ఎవరో సర్ ఫోన్ కావాలంటే ఇచ్చానని అతను చెప్తాడు. సరే నేను వస్తున్నానని అడ్రెస్ చెప్పమని అంటాడు. అడ్రెస్ చెప్పగానే రుద్ర బయల్దేరి వెళ్తుంటే వీరు ఆపి ఎక్కడికి అని అడుగుతాడు. పూర్ణ జంక్షన్ దగ్గర వర్క్ ఉందని చెప్పి రుద్ర వెళ్తాడు. వీరు తన మనుషులకి పూర్ణ జంక్షన్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత గంగ ఒక హోటల్ దగ్గర పని చేస్తుంది. అక్కడ రౌడీలు తనని ఏడిపిస్తుంటే వాళ్ళని గంగ కొడుతుంది. ఆ తర్వాత సూర్యని ఒకతను గంగ ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇతని కోసం ఒకతను వస్తానని చెప్పాడు. నాకు వర్క్ ఉందని అతను వెళ్ళిపోతాడు. రుద్ర సర్ అని సూర్య అంటుంటే రుద్ర సర్ అంటున్నాడు ఏంటి.. సర్ కి ఏమైనా చెప్పాలేమోనని తన ఓనర్ ని వీడియో రికార్డు చెయ్యమని చెప్తుంది. సూర్య మాట్లాడుతుంటే అతను రికార్డు చేస్తాడు. నేను నీకు చాలా చెప్పాలి. ఇదంతా మా అన్నయ్య చేస్తున్నాడని చెప్తాడు. మా అన్నయ్య ఎవరో కాదని చెప్పబోతుంటే వాడిని ఏసేయండి రా అంటూ వీరు మనుషులు వస్తారు. తరువాయి భాగంలో రుద్ర టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చి సూర్య గురించి అడుగుతాడు. రుద్రకి కనిపించకుండా గంగ టవల్ కట్టుకుంటుంది. ఓనర్ కి ఆ వీడియో సర్ కి చూపించమని గంగ చెప్పగానే అతను సూర్య చెప్పిన వీడియో చూస్తాడు. ఆ తర్వాత రుద్ర సూర్య కోసం వెతుకుతుంటే మక్కం కన్పిస్తాడు. ఇక్కడ ఏంటి అని రుద్ర అడుగుతాడు. గంగ ఇక్కడే పని చేస్తుందని మక్కం చెప్పగానే గంగని రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : రామరాజుకి క్షమాపణ చెప్పిన నర్మద.. ఆమె మురిసిపోతుందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -292 లో.....నర్మద వాళ్ళ నాన్న అన్న మాటలకి రామరాజు కోపంగా ఉంటాడు. రామరాజుకి ఇంకా కోపం వచ్చేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. దాంతో సాగర్ పై రామరాజు కోప్పడతాడు. నువ్వు మిల్ లో పని చెయ్యడం  నామూషీగా ఫీల్ అవుతున్నావా అని సాగర్ ని రామరాజు అడుగుతాడు. ఆయన మాటలు పట్టుకొని మీరు తప్పుగా అర్థం చెసుకుంటారని సాగర్ అనగానే ఏమంటున్నావ్ రా నువ్వే మీ మావయ్య దగ్గరికి వెళ్లి ఇల్లరికం వస్తానన్నట్లు ఉన్నావని రామరాజు అంటాడు. నిన్ను సొంత కూతురులాగా చూసుకున్నామని నర్మదతో రామరాజు అంటాడు. మా నాన్న అలా ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు మావయ్య కానీ నేను నా పుట్టింటికి దూరంగా ఉన్నాను కానీ వాళ్ళ ప్రేమకి కాదు నన్ను మీరు బాగా చూసుకున్నారు. మా నాన్న తరుపున సారీ, సాగర్ తరుపున కూడా సారీ అని నర్మద చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేసి అమూల్య ని బయటకు తీసుకొని రమ్మని చెప్తాడు. అమూల్యని తీసుకొని శ్రీవల్లి గేట్ దగ్గరికి వస్తుంది. కావాలనే భద్రవతి ఆ ధీరజ్ పై కంప్లైంట్ ఇస్తానని అంటుంది. వద్దు అత్త ఎంతైనా వాడు అత్త కొడుకు కదా అని విశ్వ అంటాడు. ఇక వాళ్ళిద్దరి మాటలు అమూల్య వింటుందని విశ్వ పాజిటివ్ గా మాట్లాడతాడు. అదంతా అమూల్య వింటుంది. మరొకవైపు ప్రేమ లాకెట్ పట్టుకొని ఉంటుంది. ధీరజ్ వచ్చి ఆ లాకెట్ చూడలేదు.. చూపించమని అడుగుతాడు. దాంతో ప్రేమ కోపంగా పడుకుంటుంది. ఆకలిగా ఉందని ధీరజ్ అనుకుంటాడు. అది విని ప్రేమ భోజనం తీసుకొని వచ్చి ధీరజ్ కి తినిపిస్తుంది. తరువాయి భాగంలో మా ఆయన నాకు ముద్దు పెట్టాడని శ్రీవల్లి మురిసిపోతుంటే అదేమైన వింతా.. మా ఆయన పెట్టాడు. అత్తయ్యకి మావయ్య పెట్టాడు. ప్రేమకి మొన్న ధీరజ్ పెట్టాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రని కనిపెట్టేసిన దీప.. దొంగోడు ఎంత పని చేశాడంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -491 లో.... శివన్నారాయణ స్పృహలోకి వచ్చి.. సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు. ఉందట తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారని శివన్నారాయణతో కాంచన చెప్తుంది. కార్తీక్ నువ్వు వెళ్లి అత్తని తీసుకొని రా అని కాంచన పంపిస్తుంది. మరొకవైపు ఒక దొంగ సుమిత్రని నగలు ఇవ్వమని బెదిరిస్తుంటే దీప వచ్చి రౌడీ తలపై కొడుతుంది. మరోవైపు శివన్నారాయణ, దశరథ్ కి కాంచన భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్నని పారిజాతం పక్కకి తీసుకొని వచ్చి మాట్లాడుతుంది. నా భర్తపై కోపం ఉంది కానీ ఆయన్ని చంపాలని ఎప్పుడు అనుకోలేదు .. ఆయనకి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వే.. మీ అమ్మ వెళ్తుంటే ఆపలేదు.. నీలో అసలు బాధ అనేది కనిపించడం లేదని జ్యోత్స్నని పారిజాతం తిడుతుంది. ఎవరు మారినా నేను మారనని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళదాం అమ్మ అని సుమిత్రని దీప రిక్వెస్ట్ చేస్తుంది కానీ దీపతో సుమిత్ర కోపంగా మాట్లాడుతుంది. ఆ రౌడీ మళ్ళీ వచ్చి దీపని కొట్టబోతుంటే సుమిత్ర అడ్డుపడుతుంది. దాంతో దెబ్బ తనకి తగులుతుంది. మరొకవైపు కార్తీక్ కి దీప ఫోన్ చేసి అర్జెంట్ గా ఇంటికి రా అంటుంది. కార్తీక్ ఇంటికి వెళ్లి నేను అత్త గురించి వెతుకుతుంటే ఎందుకు పిలిచావని దీపని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే శౌర్యా వచ్చి అమ్మమ్మ అని చెప్పబోతుంటే ఎందుకు అత్త గురించి శౌర్యకి చెప్పావని కార్తీక్ అంటాడు. శౌర్య గది వంక చూపించగానే కార్తీక్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ సుమిత్ర పడుకొని ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : నిరాహారదీక్ష చేస్తున్న రాజ్.. కృష్ణమూర్తితో నిజం చెప్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -854 లో...... కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఇంటికి రమ్మని అడుగుతాడు. రానని కావ్య తెగేసి చెప్పడంతో.. ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. కావ్య లోపలకి వెళ్తుంటే ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. సంతకం చెయ్యాలంటే పెన్ కావాలి కదా అని కావ్య లోపలికి వెళ్లి పెన్ తెస్తుంది. ఆ తర్వాత విడాకుల పత్రాలపై కావ్య సంతకం చేస్తుంది. ఆ పేపర్స్ ని రాజ్ చింపేస్తాడు. నువ్వు రానిదే నేను ఇక్కడ నుండి వెళ్లనని ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాడు రాజ్. మరొకవైపు ప్లాన్ సక్సెస్ అయి కావ్య, రాజ్ విడిపోతారని రుద్రాణి డ్యాన్స్ చేస్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. ఇందిరాదేవి ఇంట్లో అందరిని పిలుస్తుంది. కావ్య కోసం రాజ్ ఇంటి ముందు ధర్నా చేసున్నాడట అని చెప్పగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేంటి నీ కొడుకు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటి ముందు అలా చేస్తున్నాడంటే హ్యాపీగా ఫీల్ అవుతావేంటని రుద్రాణి అంటుంది. నా కోడలు కోసమని అపర్ణ సమాధానం చెప్తుంది. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావ్.. ఇంట్లో స్వీట్ చేస్తానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అప్పు చాలా హ్యాపీగా ఉండి ఫ్రూట్స్ తింటుంది. కళ్యాణ్ వచ్చి తనతో మాట్లాడుతాడు. మరొక వైపు కావ్య కావాలనే రాజ్ ముందు టీ తాగుతుంది. అప్పుడే ఒక తాగుబోతు వాడు వచ్చి.. నీకు సపోర్ట్ గా నేనుంటాను.. నేను భార్యాబాధితుడిని అని అతను అంటాడు. సపోర్ట్ గా మీడియా వాళ్ళని పిలుస్తానని పిలుస్తాడు. మీడియా వాళ్ళు వచ్చి మీరు ఇలా ఎందుకు ధర్నా చేస్తున్నారంటు అడుగుతారు. తరువాయి భాగంలో అందరూ పడుకున్నాక రాజ్ కోసం తన తండ్రి కృష్ణమూర్తితో భోజనం పంపిస్తుంది కావ్య.  అది తీసుకొని రాజ్ భోజనం చేస్తాడు. నా కూతురిపై అంత ప్రేమ ఉంది.. అసలు కారణం ఏంటో చెప్పొచ్చు కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu Voting : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక  క్రేజీగా సాగుతోంది. అయితే  ఈ వారం తనూజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, డీమాన్ పవన్ నామినేషన్లో ఉన్నారు.  అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, తనూజ స్వల్ప ఓట్ల తేడాతో టాప్ లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో డీమాన్ పవన్, రాము రాథోడ్ ఉన్నారు. మొన్నటి ఓటింగ్ లో భరణి లీస్ట్ లో ఉండగా‌.. నిన్నటి ఆటని బట్టి, భరణి ఫ్యాన్స్ గట్టిగానే ఓట్లు వేశారు. అందుకేనేమో డీమాన్ పవన్ ని అధిగమించి ఓ స్థానం పైకి వెళ్ళాడు. అయితే డీమాన్ పవన్ కి పెద్దగా ఓట్లేమీ పడటం లేదు.. అయితే రాము రాథోడ్ కి కూడా ఓటింగ్ తక్కువే ఉంది. భరణి నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి.. దివ్య నిఖితకి ఓట్లు తగ్గాయనిపిస్తోంది. దువ్వాడ మాధురితో దివ్యకి ఉన్న గొడవలు చూస్తుంటే ఆమెను ఈ వారం హౌస్ నుండి బయటకి పంపించడం కష్టమే అనిపిస్తోంది.  ఇక అందరితో పోలిస్తే రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే రాము నామినేషన్స్‌లోకి వచ్చాడు. అతనిపై పెద్దగా నెగిటివిటీ లేదు కానీ తన సత్తా ఏంటనేది ఈ రోజు అర్థరాత్రి ఓటింగ్ లైన్స్ పూర్తయ్యేవరకు తెలుస్తుంది. ఎక్కడ అన్ అఫీషియల్ ఓటింగ్‌ ని బట్టి చూస్తే మాత్రం ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత వారం శ్రీజ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ప్రకారం ఈ వారం డీమాన్ పవన్, భరణి, రాము రాథోడ్ లలో ఎవరు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు.