Bigg Boss 9 Telugu : దువ్వాడ మాధురి వీరంగం.. రీతూ, దివ్యలపై పర్సనల్ ఎటాక్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం క్రేజీగా సాగుతోంది. అయిదో వారం వరకు కామ్ అండ్ కూల్ గా సాగిన హౌస్.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత గందరగోళంగా మారింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. హౌస్ లో ఈ వీక్ ఫుడ్ మానిటర్ గా దివ్య, మెయిన్ షెఫ్ గా మాధురి ఉన్నారు. కిచెన్ కి సంబంధించిన ఫుడ్ ఏది తిన్నా కూడా ఫుడ్ మానిటర్ గా ఉన్న దివ్యకి చెప్పాలి. దివ్య తనే అందరికి సరిపోయేలా ఫుడ్ పెడుతుంది కాబట్టి ప్రతీది తనకి చెప్పాలి. అయితే దివ్యకి చెప్పకుండా దువ్వాడ మాధురి కర్రీ వేసుకుంది. అది తెలుసుకున్న దివ్య.. నాకు చెప్పలేదు అలా చెయ్యకూడదని దివ్య స్మూత్ గా చెప్తుంది. నేను కొంచెమే వేసుకున్నాను.. నీకెందుకు చెప్పాలి.. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు ఏదైనా నీకెలా చెప్తానని మాధురి అంటుంది. ఈ ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు తీసెయ్యండని పొగరుగా కళ్యాణ్ తో దువ్వాడ మాధురి చెప్తుంది. నాకు మీతో పర్సనల్ గా బాండింగ్ వద్దన్నాను.. ఇలా వర్క్ పరంగా ఏదైనా చెప్పొచ్చని దివ్య అంటుంది. నేను మీతో ఏం బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు.. నీలా ఎప్పుడు నాన్న నాన్న అంటు తిరగనని మాధురి అంటుంది. ఎవరన్నారని దివ్య అడుగుతుంది. ఎవరంటే వాళ్ళకి.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు .. ఎందుకు నిన్ను అన్నానని భుజాలు తడుముకుంటున్నావని మాధురి అంటుంది. అలా ప్రతీదాంట్లో దూరి కావాలనే గొడవ చేస్తుంది దువ్వాడ మాధురి. రీతూ, అయేషా విజిల్స్ క్లీనింగ్ దగ్గర గొడవ పెట్టుకుంటుంటే మాధురి మధ్యలో దూరి రీతూతో గొడవ పెట్టుకుంటుంది. హౌస్ లో కెప్టెన్ అయిన కళ్యాణ్ తో కూడా గొడవపెట్టుకుంది. తను ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియక కెప్టెన్ కళ్యాణ్ భయంతో సైలెంట్ గా ఉంటున్నాడు.

Jayam serial: వీరు గురించి నిజం చెప్పేసిన గంగ.. సూర్యని రుద్ర కలుస్తాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -85 లో..... స్నేహ వచ్చి ప్రమీల కళ్ళు మూస్తుంది. గంగ నువ్వేనా అని ప్రమీల అంటుంది. అందరూ హాల్లోకి వస్తారు. స్నేహ నువ్వా.. గంగ అనుకున్నానని ప్రమీల అంటుంది. అందరు గంగ గురించి మాట్లాడుకుంటారు. ఒక పనిమనిషి గురించి ఇంత మాట్లాడుకుంటున్నారేంటని ఇషిక అంటుంది. మరొకవైపు వీరు తమ్ముడు సూర్య హాస్పిటల్ నుండి తప్పించుకొని బయటకు వస్తాడు. అదే సమయంలో సూర్య ఎక్కడికి వెళ్లాడు.. వాడు రుద్రని కలిసే లోపే నా దగ్గరికి తీసుకొని రండి అని వీరు తన మనుషులకి చెప్తాడు. ఆ తర్వాత రుద్రని సూర్య చూసి తనకి నిజం చెప్పాలని చూస్తాడు కానీ రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రుద్ర ఇంటికి గంగ వస్తుంది. అది ఇషిక చూసి శకుంతలకి చెప్తుంది. గంగను స్నేహ చూసి ఇంట్లో అందరిని పిలుస్తుంది. పెద్దసారు చూసి లోపలికి రమ్మని పిలుస్తాడు. గంగ లోపలికి వస్తుంటే ఆగమని శకుంతల అంటుంది. ఎందుకు వచ్చావని శకుంతల అనగానే.. మీకోక విషయం చెప్పాలి.. ఆ రోజు రుద్ర సర్ కి అగేనెస్ట్ గా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఈ రోజు హాస్పిటల్ లో చూసాను. వాళ్ళతో వీరు సర్ ఉన్నాడని గంగ చెప్పగానే మంచి ప్లాన్ తో వచ్చావని గంగని శకుంతల తిడుతుంది. తరువాయి భాగం లో రుద్రకి సూర్య ఫోన్ చేసి రమ్మంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ధీరజ్, ప్రేమలని విడదియ్యాలని విశ్వ స్కెచ్.. రామరాజు ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -290 లో..... ధీరజ్ కి తన ప్రేమ విషయం చెప్పాడానికి ప్రేమ తన దగ్గరికి వెళ్తుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఉన్న ఫొటోతో గల లాకెట్ ని  ధీరజ్ కి ఇస్తుంది ప్రేమ. సరిగ్గా అది ఓపెన్ చేసేటప్పుడే అమూల్యని విశ్వ ఏడిపించడం ధీరజ్ చూస్తాడు. ఇక అక్కడికి వెళ్ళి విశ్వని ధీరజ్ కొడతాడు. విశ్వకి బ్లడ్ వస్తుంది. దాంతో ధీరజ్ పై కోప్పడుతుంది ప్రేమ.  ఇప్పుడు తెలిసింది.. నీ అసలు రూపం అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ప్రేమని ధీరజ్ అంటాడు. మరొకవైపు రామరాజు ఇంటికి కోపంగా వస్తాడు. అది చూసి మావయ్య గారు నర్మద, సాగర్ చేసిన పనికి మావయ్య కోపంగా ఉన్నాడని అనుకుంటుంది. శ్రీవల్లీ ఏదో మాట్లాడాలని వెళ్తుంది. కానీ రామరాజు మీ వాళ్ళని పిలిపించు మాట్లాడాలని శ్రీవల్లితో రామరాజు అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. మరొకవైపు నువ్వు మా ఇంటికి ఎందుకు వెళ్ళావ్.. ఇప్పుడు అనవసరంగా మావయ్య బాధపడుతున్నారని సాగర్ తో నర్మద అంటుంది. మరొకవైపు నా కొడుకుని కొట్టిన ఆ ధీరజ్ ని వదలనని సేనాపతి కోపంగా వెళ్తుంటే విశ్వ ఆపుతాడు. సేనాపతి వెళ్లకుండా ఆగిపోతాడు. అసలు నువ్వు ఎందుకు సేనాని ఆపావని విశ్వని భద్రవతి అడుగుతుంది. ఎప్పుడు  గొడవ జరిగిన కూడా ప్రేమ నన్నే తిట్టేది కానీ ఇప్పుడు ధీరజ్ ని తిట్టింది. ఇంకా వాళ్ళ మధ్య దూరం పెంచాలి.. ఆ అమూల్యకి దగ్గర కావాలని భద్రవతికి విశ్వ చెప్తాడు. తరువాయి భాగంలో ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి సారీ చెప్తాడు. ధీరజ్ చెయ్ కి బ్లడ్ వస్తుంటే ప్రేమ కట్టుకడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కన్పించకుండాపోయిన సుమిత్ర.. కార్తీక్, శివన్నారాయణ కనిపెడతారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -489 లో..... అనసూయ శౌర్య కోసం ఒక బొమ్మ తీసుకొని వస్తుంది. ఇది బొమ్మ కాదు కోరిక అని దీపతో అంటుంది. నా మనవరాలు అని చెప్పుకోవడానికి నీకు కార్తీక్ కి పుట్టిన బిడ్డ ఉండాలి. శౌర్యకి ఆడుకోవడానికి ఒక చెల్లి కావాలని అనసూయ అనగానే దీప షాక్ అవుతుంది. శౌర్యకి మీరు తల్లిదండ్రులు మాత్రమే కాదు భార్య భర్తలు కూడా.. మా అందరి కోరిక తీరుస్తాను అంటేనే ఈ బొమ్మ తీసుకోమని అనసూయ అంటుంది. చాలాసేపు అలోచించిన దీప ఆ బొమ్మని తీసుకుంటుంది. దాంతో అనసూయ, కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా కార్తీక్ వింటాడు. ఆ తర్వాత దీప బయటకు వస్తుంది. లోపల జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు సిగ్గుపడతారు. ముందు ఇంటికి వెళదాం.. అక్కడ అమ్మ సిచువేషన్ ఎలా ఉందోనని దీప అంటుంది. నువ్వు నేను తాతయ్య కలిసి..  అత్త మామయ్యలని కలపాలని కార్తీక్ అంటాడు. మరొకవైపు కాశీకి జాబ్ వస్తుంది. దాంతో స్వప్న, శ్రీధర్, కావేరి అందరు మెచ్చుకుంటారు. ఇప్పుడు జాబ్ వస్తే గానీ నా గురించి తెలియలేదా అని కాశీ కోపంగా అంటాడు. ఆ తర్వాత కార్తీక్,  దీప ఇంటికి వెళ్లేసరికి సుమిత్ర లేదని మాట్లాడుకుంటారు. అది విని షాక్ అవుతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని జ్యోత్స్న అనగానే నోరు ముయ్ అని శివన్నారాయణ, దశరథ్ ఇద్దరు తనపై కోప్పడుతారు. అసలు మీ అమ్మ వెళ్తుంటే ఆపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అంటే సుమిత్ర వెళ్లడం మీరు చూసారా అని దశరథ్ అడుగుతాడు. అంటే నేను చూడలేదని పారిజాతం అంటుంది. ఎవరో వెళ్లినట్టు అనిపించిందని జ్యోత్స్న అన్నదని పారిజాతం చెప్తుంది. ఇంట్లో నుండి ఎవరు వెళ్తారు. ఆ మాత్రం తెలివి లేదా అని అందరు జ్యోత్స్నని తిడతారు. కార్తీక్, దశరథ్ ఇద్దరు సుమిత్రని వెతకడానికి వెళ్తారు. మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త కన్పించడం లేదు.. అక్కడకి వస్తే చెప్పమని చెప్తాడు. అదే విషయం కాంచనతో శ్రీధర్ చెప్పగానే కాంచన షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : పుట్టింట్లో కావ్య.. మహిళా సంఘాలకి రాజ్ ఏం సమాధానం చెప్పనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -852 లో.....కావ్య దగ్గరికి మీడియా వాళ్ళు వెళ్లి రాజ్ గురించి ఇంకా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతారు. దాంతో రాజ్ దృష్టిలో కావ్యని నెగెటివ్ చెయ్యాలని రుద్రాణి ట్రై చేస్తుంది. నువ్వు ఆపు ఇక దీనంతటికి కారణం రాజ్ కదా.... వాడి వాళ్ళే ఈ సిచువేషన్ వచ్చిందని రుద్రాణి పై ఇందిరాదేవి సీరియస్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణిని చూసి రాహుల్ నవ్వుతాడు. ఇన్ని రోజుల్లో నువ్వు వేసే ప్లాన్ ఏదైనా సక్సెస్ అవుతున్నావా అని వెటకారంగా నవ్వుతాడు. దాంతో రుద్రాణి తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్రాణికి కావ్య ఫోన్ చేసి మీడియా వాళ్లని మీరే పంపించారు కదా అని అడుగుతుంది. నేను ఎందుకు పంపిస్తానని రుద్రాణి అంటుంది. ఇప్పుడు నాకు డౌట్ మాత్రమే ఉంది అది నిజం అయితే మాత్రం మీకు ఉంటుందని కావ్య కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. రుద్రాణి కోపంగా ఇప్పుడు మీడియా వాళ్ళని పంపిస్తే తిప్పి కొట్టి పంపింది. ఇప్పుడు మహిళ సంఘాలని పంపాలని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి.. నువ్వు మీడియా వాళ్ళతో చెప్తే నేను బయపడి నా నిర్ణయం మార్చుకుంటానని అనుకున్నావా అసలు లేదని అంటాడు. ఆ తర్వాత కావ్య ఫోటో పట్టుకొని రాజ్ ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు మహిళా సంఘాలు రాజ్ దగ్గరికి వచ్చి మీ భార్య మీ టార్చర్ భరించలేక వెళ్లిపోయిందట కదా అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జబర్దస్త్ నరేష్ పెళ్లి చూపులు...వధువు ఎవరో తెలుసా!

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఎమోషనల్ గా ఉంది. ఇక ఇందులో నాటీ నరేష్ పెళ్లిచూపులు జరిగాయి. బుల్లితెర మీద నాటీ నరేష్ అంటే తెలియని వారు లేరు. అతని హైట్ అతను చేసే కామెడీ ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అలాంటి నరేష్ హైట్ మీద చాలామంది చాలా కామెంట్స్ చేస్తూ అసలు అతనికి పెళ్లవుతుందా అనేలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐతే ఇప్పుడు నిజంగా ఆ ఘట్టం వచ్చిందంటూ ఆది చెప్పుకొచ్చాడు. "మా అందరికీ ఒక ఫామిలీ తరపున ఒక మెసేజ్ వచ్చింది. ఇలా నాటీ నరేష్ ని పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము తనకు ఒకే అంటే ఆ పెళ్లి చూపులేదో చేద్దాం...ఆ ఫామిలీ కూడా ఈ సెట్ కి వచ్చారు" అంటూ ఆది ఆ ఫామిలీని పరిచయం చేసాడు ఆది. పెళ్లి చేసుకోబోయే పిల్ల పేరు నవ్య. ఐతే నవ్య - నరేష్. అక్కడే పేర్లు కూడా కలిసిపోయాయి అని చెప్తూ ఆది నరేష్ ని ముద్దు పెట్టేసుకున్నాడు. ఇక నవ్య మాట్లాడుతూ "నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత దూరం ఇక్కడి వరకు వచ్చా. లవ్ యు. లవ్ యు ఫర్ ఎవర్" అని చెప్పింది. ఇక నరేష్ కూడా "నాకు కూడా మీరు బాగా నచ్చారు" అని సిగ్గుపడిపోతూ చెప్పాడు. తర్వాత సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఆమె కూడా నవ్యని ఒక ప్రశ్న వేశారు."ఏమ్మా నువ్వు డిగ్రీ పాసయ్యాక ఉద్యోగానికి పోతావా" అంది. "నరేష్ కి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం" అని చెప్పింది నవ్య. ఇక నాటీ నరేష్ వాళ్ళ నాన్న రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ తాగుబోతు క్యారెక్టర్స్ చేస్తూ ఫన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఈ ప్రోమోలో ఏడుస్తూ కనిపించాడు. "నరేష్ వాళ్ళ నాన్న ఏడుస్తుండే" అంటూ కొమరక్కా చెప్పేసరికి ఆయన కళ్ళు తుడుచుకుని "కొంతమంది నరేష్ పెళ్లవుతుందో కాదో అని చెప్తూ ఎగతాళి చేసేవాళ్ళు ఆ మాటలకు నాకు బాధగా అనిపించేది" అనేసరికి ఆది వాళ్ళ నాన్న కన్నీళ్లు తుడిచాడు.

Bigg Boss 9 Telugu Nominations: బాయ్‌ఫ్రెండ్-నాన్న అనుకుంటూ ఫినాలేకి పోతారా..తనూజపై అయేషా సీరియస్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వేళ పాత కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టిన వేళ అన్నట్టుగా నామినేషన్లు సాగాయి. ఒక్కొక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తమ స్ట్రాటజీని ప్లే చేశారు. వారిలో ముఖ్యంగా భరణి, దివ్య, తనూజలని ఎక్కువగా టార్గెట్ చేశారని నిన్నటి ఎపిసోడ్ లో తెలిసింది.  హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ లో అయేషా షార్ప్ లా కన్పిస్తుంది. ఎందుకంటే సంజన, తనూజలని సుమన్ శెట్టి నామినేషన్ చేయగా అయేషా మాత్రం తనూజని నామినేట్ చేసింది. మీ ఇన్‌ఫ్లుయెన్స్, మీ ఫేవరిజం వల్ల ఇక్కడ మిగిలిన అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందనేది నా పాయింట్.. ఉదాహరణకు చెప్పాలంటే నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది.. ఆల్రెడీ స్టార్ మాలో చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి.. ఇక్కడ అది అవసరం లేదంటూ అయేషా చెప్పింది. దీనికి ప్రతి దానికి భరణి సర్ వచ్చి నన్ను సపోర్ట్ చేశారా.. నేను ఏం సింగిల్‌గా గేమ్ ఆడలేదా అని తనూజ అడిగింది. నీకు ఏ ప్రాబ్లమ్ అయినా నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని ఏడవలేదా నువ్వు ఇక్కడ అని సూటిగా ప్రశ్నించింది అయేషా. అఫ్‌కోర్స్ ఎవరికి వాళ్లు ఇక్కడ ఫేవరెట్ ఉన్నారు.. ఎవరికి వాళ్లు సపోర్ట్ చేసుకోవడానికి ఉన్నారని తనూజ ఒప్పుకుంది. అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావా అని మళ్లీ కొశ్చన్ చేసింది అయేషా. మేము మొదటి రోజు నుండి నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి ఆ బాండ్ ఉందంటూ తనూజ అంటుంది. ఆ అదే నేను చెప్తున్నా మీరు క్లోజ్‌గా చాలా ఉన్నారని చెప్తున్నానంటూ అయేషా అంది. అలానే మీరు ఈ హౌస్‌లో ఎప్పుడూ మీరు రెండు పనులు చేస్తారు.. ఒకటి అరుస్తారు.. ఎందుకు అరుస్తారో తెలీదు.. లేదంటే ఏడుస్తారు.. ఇప్పుడు కట్ చేస్తే మీరు ఈ నామినేషన్ అయిపోయాక భరణి గారి దగ్గరికెళ్లి నాన్న నా వల్ల నీ ఆట పోయిందా నాన్న అంటూ ఏడుస్తావ్.. చేసేది అదే అంటూ అయేషా అంది. మీరు ఒరిజినల్ నాన్న కూతురా? కాదు కదా.. నిజానికి ఈ సీజన్ ఎలా అయిందంటే ఇక్కడ ఒక నాన్నో-బాయ్‌ఫ్రెండో ఉంటే ఓకే ఫినాలేకి వచ్చేద్దామనేలా ఉందని అయేషా అంది‌. 

కన్నీళ్లు పెట్టుకున్న అన్నపూర్ణమ్మ..నా కూతురు ఆత్మహత్య కి కారణమిదే!

  సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి అందరికీ తెలుసు. ఎన్నో వందల సినిమాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న ఒక గొప్ప నటి. ఆమె బుల్లితెర మీద వచ్చే ఎన్నో షోస్ కి కూడా వస్తూ ఉంటారు. అలాగే ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "మేమంతా కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమొరీని ఇద్దామని అది కూడా ఇంద్రజ గారి చేతుల మీద ఇప్పిద్దాం అనుకుంటున్నాం" అని చెప్పాడు ఆది. ఇక ఇంద్రజ ఒక గిఫ్ట్ ప్యాక్ తెచ్చారు. అది ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది పోగొట్టుకున్న తన కూతురి ఫోటో అది. ఆ ఫోటో చూసాక ఇక కన్నీళ్లు ఆగలేదు అన్నపూర్ణమ్మకు. ఆమె ఏడవడం చూసిన ప్రేరణ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. "ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారు జామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య మీరంతా అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు కదా అందుకని" అంటూ ఏడుస్తూనే వెళ్లి కూర్చుంది. ఇక ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇంద్రజ ఆమె మోకాలి మీద తలపెట్టుకుని పడుకుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఒక శ్యాడ్ సాంగ్ ప్లే అవుతూనే ఉంది. ఇక అన్నపూర్ణమ్మ బాధ చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆమెకు ఊరటగా కామెంట్స్ చేస్తున్నారు. "కంటే ఒక బిడ్డేనమ్మా పార్వతీదేవికి ప్రపంచం అంతా బిడ్డలేనమ్మా అన్నపూర్ణమ్మా..అన్నపూర్ణమ్మ గారు బాధపడకండి అమ్మ మీ కోసం మేమంతా ఉన్నాం.." అంటూ ఆమెకు సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు.

Bigg Boss 9 Telugu Nominations: సుమన్ శెట్టి వ్యాలిడ్ నామినేషన్.. కంటెస్టెంట్స్ అంతా నవ్వులే నవ్వులు!

బిగ్ బాస్ సీజన్-9 లో నామినేషన్లు ఫుల్ హీటెడ్ గా జరిగాయి. హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ మొదటగా భరణి, దివ్యలని నామినేట్ చేసింది. తర్వాత సంజన వచ్చి రాము, భరణిలని నామినేట్ చేసింది. ఆ తర్వాత బాల్ అయేషాకి రావడంతో తను సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ముందుగా తనూజని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్‌లో గేమ్స్‌కి టీమ్‌లు ఏర్పడేటప్పుడు నాతో టీమ్‌ అవుతానని నాకు మాట ఇచ్చావ్.. కానీ సైలంట్‌గా కళ్యాణ్‌తో వెళ్లిపోయావ్ నువ్వు.. నాతో నువ్వు ఆడుంటే ఇంకా బాగా నాకు ఉపయోగపడేదేమో.. అలానే నువ్వు హౌస్‌లో చాలా ఎమోషనల్ అయిపోతున్నావ్.. సెంటిమెంట్ ఎక్కువైపోయిందనిపిస్తుంది అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. దానికి తనూజ మీకు చెప్పాను కదా అన్న ఎవరైనా అడిగితే నేను వెళ్ళిపోతాను.. మీరు ఫీల్ అవ్వరు కదా అని అడిగాను కదా సుమన్ అన్న అంటూ తనూజ చెప్పింది. లేదమ్మా నువ్వు నాతో అనలేదు.. నాతో అని ఉంటే నేనెందుకు ఇలా చెప్తానమ్మ అంటు సుమన్ శెట్టి అన్నాడు‌. మీ ట్రూ కలర్స్ కన్పిస్తున్నాయి అన్న.. నేను మిమ్మల్ని నమ్మాను.. కానీ మీరు రివేంజ్ నామినేషన్ చేసి ఏదో రీజన్ చెప్తున్నారు సుమన్ అన్నా అంటూ తనూజ అంది.   ఇక ఆ తర్వాత సంజనని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. హౌస్‌లో ఏదైనా గొడవ జరుగుతుందంటే మీకెందుకమ్మా అంత సంతోషం.. వెళ్లి ఆపాలి కానీ అలా మీరు ఎంజాయ్ చేస్తారా అని సుమన్ శెట్టి యాక్షన్ చేసి చూపించడంతో హౌస్‌లో అందరు తెగ నవ్వుకున్నారు. హౌస్ లోని వాళ్ళంతా మనవాళ్ళు.. మనవాళ్ళు అక్కడ అలా గొడవ పడుతుంటే రీతూ, మీరు వెళ్లి తెగ నవ్వుకుంటారా.. ఇదేంటండి.. అది నాకు నచ్చలేదంటు సంజనని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక సంజనని సేవ్ చేసి తనూజని నామినేట్ చేసింది అయేషా‌. సుమన్ శెట్టి నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.   

Bigg Boss 9 Telugu Srija Dammu : శ్రీజ రీఎంట్రీ కన్ఫమ్.. బిగ్ ట్విస్ట్!

  బిగ్ బాస్ సీజన్-9 లో‌ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ‌అయిదు వారాల దాకా ఒక లెక్క.. ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా సాగుతోంది. గత వారం ఫ్లోరా సైనీ,‌ శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇందులో ఫ్లోరా సైనీ జనాల ఓటింగ్ తో బయటకు వచ్చేసింది. కానీ‌ శ్రీజని వైల్డ్ కార్డ్స్ నిర్ణయంతో ఎలిమినేషన్ చేసారు. ఇది క్లియర్ గా అన్ ఫెయిర్ అని జనాలు ఫైర్ అవుతున్నారు. ఎలిమినేషన్ లో ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి లీస్ట్ లో.. మొదటగా ఫ్లోరాని ఎలిమినేషన్ చేసారు. కానీ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెండో ఎలిమినేషన్ లో‌ రీతూని చేయాల్సి ఉండగా రీతూ-డీమాన్ పవన్ ల లవ్ ట్రాక్ పోతుందని తనని ఎలిమినేషన్ చేయకుండా ఆపారు. ఇది క్లియర్ గా కంటెంట్ కోసం బిగ్ బాస్ స్ట్రేటజీ అని తెలుస్తోంది. అయితే ఆడియన్స్ మాత్రం దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓట్లు వేసే మేము‌ పిచ్చోళ్ళమా అంటూ రోడ్ల మీదకొచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట ధర్నాకి దిగారు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ తో రూడ్ గా ప్రవర్తించారని తెలుస్తోంది. ‌అయితే బిగ్‌ బాస్ టీమ్ దీని గురించి పాజిటివ్ గా స్పందించిందని తెలుస్తుంది. శ్రీజని ఈ వారంలో హౌస్ లోకి రీఎంట్రీ చూపిస్తారని తెలుస్తుంది.  రివ్యూయర్ ఆదిరెడ్డి, శ్రీను65 లతో పాటు మరికొంత మంది ‌యూట్యూబర్స్ కూడా శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని తనని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేదాకా మా పోరాటం ఆగదంటు తమ వీడియోలలో చెప్పుకొచ్చారు. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చాక రోజుకో కొత్త గొడవ జరుగుతుంది. ‌అందులోను‌ దువ్వాడ మాధురి నామినేషన్ ఎక్కువగా ఉండటంతో పాత కంటెస్టెంట్స్ తనతో మాట్లాడటానికే భయపడుతున్నారు. అదే శ్రీజ ఉంటే మాధురికి సరైన సమాధానమిచ్చేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయేషా, నిఖిల్ ఇద్దరు కాస్త బాగానే మాట్లాడినా.. మాధురి, రమ్య మోక్షల మాటతీరు మాత్రం కావాలని గొడవ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరు కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నారంటు ఇన్ స్టాగ్రామ్ లో‌ ట్రోల్స్ మొదలయ్యాయి. ‌మరి వీరికి సరైన గుణపాఠం చెప్పడానికి బిగ్‌బాస్ యాజమాన్యం దమ్ము శ్రీజని హౌస్ లోకి తీసుకొస్తుందా.. మీకు ఏమనిపిస్తుందో  కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Nominations: భరణి ఛాలెంజ్...సంజన ఫైర్...కూర్చొని తినడానికి రాలేదు

  బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటితో నామినేషన్ ల పర్వం ముగిసింది. కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా కలిసి ఉన్న వాళ్ల మధ్య పెద్ద గొడవ జరగింది. అది బిబి ఆడియన్స్ నిజంగా షాకింగ్ విషయమే. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. నిన్నటి నామినేషన్లో మొదటగా రీతూ నామినేషన్ చేయగా ఆ తర్వాత సంజనకి అవకాశం దక్కింది. గౌరవ్ బాల్ సంపాదించి సంజనకి ఇచ్చాడు. ఇక సంజన రాముని ఫస్ట్ నామినేట్ చేసింది. రాము నీకు ఏం అనిపించలేదా అక్కడ బెడ్ టాస్కులో ఒక్క అమ్మాయిని నలుగురు అబ్బాయిలు అలా ఎత్తుకొని తీసుకుపోయారు.. రూల్ మార్చేద్దామని.. అలానే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు.. ఓపెన్‌గా భరణికి సపోర్ట్ చేశావ్ సంఛాలక్‌గా.. లిట్రల్లీ వాళ్లు గుండాల్లా వచ్చేసి అమ్మాయిల్ని తీసి ఇట్లా పడేస్తున్నారు.. మీరేం చేస్తున్నారు సంఛాలక్‌గా.. అంటూ సంజన ఫైర్ అయింది. దీనికి రాము కూడా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకున్నాడు. మీరు గేమ్ ఆడటానికి ఇక్కడికి వచ్చారంటేనే మీకు అది తెలుసుండాలి.. ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు.. అందరు కలిసే ఆడాలి.. అక్కడ నా అక్కున్నా నా చెల్లి ఉన్నా నేను అలానే చేస్తాను.. నేను ఇక్కడ కూర్చొని తినడానికి రాలేదు. నేను గేమ్ ఆడుతున్నాను. అన్నీ చూస్తున్నానంటూ రాము బదులిచ్చాడు. ఆ తర్వాత భరణిని నామినేట్ చేసింది సంజన. నాకు బాలేనప్పుడు నన్ను హౌస్‌లోకి రాకుండా రాముతో మీరే చెప్పి అలా చేయించారు.. అది నాకు నచ్చలేదంటూ సంజన చెప్పింది. మీ కోసం బాక్స్ త్యాగం చేసింది నేను.. అలాంటిది బెడ్ టాస్క్‌లో గేమ్ ఆడితే మీరు గూండాలు అని ఎలా అంటారు.. ఆ మాట వెనక్కి తీసుకోండి.. మరి ఇప్పుడు వైల్డ్‌కార్డ్స్‌లో వాళ్లు అమ్మాయిలు కాదా.. వాళ్లు పోటీపడలేదా.. గూండాలు అనకూడదంటూ భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు. ఒకవేళ నేను రాముతో మీ పేరు చెప్పి మిమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్నానని ప్రూ చేస్తే నేనే హౌస్ నుంచి వాకౌట్ చేస్తానంటూ భరణి ఛాలెంజ్ చేశాడు. ఇక భరణి మాట్లాడుతుండగా మధ్యలో సంజన మాట్లాడుతుంటే.. వినండి.. ముందు విను.. మీ గురించి చూసి చూసి మెంటల్‌గా అలసిపోయి మాట్లాడుతున్నా.. మా త్యాగాల వల్ల మీరు ఇక్కడున్నారు.. అది మర్చిపోకు.. ఆడియన్స్ కూడా సంజనని భరణిని చూస్తున్నారు.. ఎవరు ఏంటో వాళ్లకి తెలుసు. అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఇక రాము-భరణిలో రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేశాడు గౌరవ్. సంజన చేసిన ఈ రెండు నామినేషన్లు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Nominations:  రీతూ చౌదరి చెత్త నామినేషన్.. దివ్యని నామినేషన్ చేసిన మాధురి!

  బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇక కొత్తగా హౌస్ లోకి వెల్డ్ కార్డ్స్ రావడంతో పాత కంటెస్టెంట్స్ కి దడ మొదలైంది. అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే వైల్డ్ కార్డ్ గా వచ్చిన కంటెస్టెంట్స్ బిహేవ్ చేస్తున్నారు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. మొదటగా బాల్ ని దువ్వాడ మాధురి దక్కించుకొని రీతూ చౌదరికి ఇచ్చింది. ఇక తనేమో భరణిని నామినేట్ చేసింది. నిజానికి భరణిని నామినేట్ చేస్తానని రీతూ ముందు చెప్పింది కనుకే మాధురి తనకి బాల్ ఇచ్చింది. నాకు మీరు కెప్టెన్సీ టాస్కులో సపోర్ట్ చేయలేదు.. మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చేయలేదు.. మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది.. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి.. ఇలా చేస్తే ఎలా అని రీతూ మాట్లాడింది. నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు.. రాముకి కూడా ఇచ్చాను. కనుక నీ కంటే రాము ఎక్కువ అనిపించి తనకి సపోర్ట్ చేశానంటూ భరణి డిఫెండ్ చేసుకున్నాడు. ఇక తన రెండో నామినేషన్ గా దివ్యని చేసింది రీతూ. నాకు ఈరోజు టిఫిన్ టైమ్‌కి దొరకలేదు.. దాని వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది నీరసం వచ్చి కళ్లు తిరిగాయ్.. నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయిందని.. నువ్వే రీజన్ అని నామినేట్ చేస్తున్నానంటూ రీతూ చెప్పింది. దోస కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని దివ్య కామెడీ చేసింది. నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు పెద్ద ఇష్యూ అంటూ రీతూ అంది.  అయితే ఈ రెండింటిలో ఒకరిని సేవ్ చేసి ఒక నామినేషన్ మాత్రమే సెలక్ట్ చేయాలి కాబట్టి నేను భరణిని సేవ్ చేస్తున్నాను.. దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నానంటూ మాధురి చెప్పింది. మేము హౌస్‌కి కొత్తగా వచ్చాం.. మీరు చాలా రోజులుగా ఉన్నారు.. మాకు కోఆపరేట్ చేయాలి.. మా మీద అరవకూడదని మాధురి చెప్పింది. అది మీ మాట తీరు బట్టి ఉంటుందండి.. మీరు అరిస్తే నేను అరుస్తానంటూ దివ్య అంది. సరే అరవండి.. ఏం పర్లేదు అరుచుకుందాం.. నాకు అయితే అది నచ్చలేదు.. హౌస్‌లో ఉన్నవాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అయ్యారు.. కానీ మీరు ఎంతసేపు భరణిగారితో తప్ప ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదని మాధురి అనగా.. నాకు మీతో అవ్వాలని కూడా లేదని ముఖం మీదే దివ్య చెప్పేసింది. సరే మీ ఇష్టం నేను చెప్తున్నాను మీ ఆన్సర్ నేను అడగలేదు కదా..ఇదిగో ఈ అటిట్యూడ్ కారణంగానే ఆమెని నామినేట్ చేస్తున్నాను.. అది అటిట్యూడ్ అంటూ మాధురి చెప్పేసింది‌. రీతూ చేసిన ఇన్ వ్యాలిడ్ రీజన్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.

Jayam serial : హాస్పిటల్ నుండి వీరు తమ్ముడు సూర్య మాయం.. 

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -84 లో......గంగ లోపలికి వెళ్ళగానే వీరుని చూసి షాక్ అవుతుంది. అసలు రుద్ర సర్ శత్రువులతో వీరు సర్ ఎందుకు ఉన్నాడని ఆలోచిస్తుంది. మరొకవైపు పారు, ఇంకా వాళ్ళ అన్నయ్య మేనేజర్ ని కలిసి హాస్పిటల్ లో పని చేసే నర్సులందరిని  లైన్ లో నిల్చొపెట్టమని అడుగుతారు. దానికి అతను సరే అంటాడు. మరొకవైపు పేషెంట్స్ అందరిని రుద్ర చూస్తూ వస్తున్నాడు.. రుద్రని వీరు చూసి తన మనుషులకి ఫోన్ చేసి రుద్ర వస్తున్నాడు. తమ్ముడున్న గది వైపు వస్తున్నాడు.. ఏదైనా చెయ్యండి అని అంటాడు. వీరు తమ్ముడు ఉన్న రూమ్ దగ్గరికి రుద్ర రాగానే కోమాలో ఉన్న పేషెంట్ ని పక్కన ఉంచి గంగని డాక్టర్ ని బెదిరిస్తారు. దాంతో గంగ ఇక్కడ పేషెంట్  ఎవరు లేరని రుద్ర తో చెప్పగానే రుద్ర వెళ్ళిపోతాడు. రుద్ర సర్ రాగానే ఈ పేషెంట్ ని దాచేశారంటే రుద్ర సర్ వెతుకుతుంది ఇతనేనా.. వెంటనే ఈ విషయం రుద్ర సర్ కి చెప్పాలని గంగ అనుకుంటుంది. ఆ తర్వాత పారు అందరి నర్స్ లలో తనతో ఎవరు గొడవ పెట్టుకుందో చెక్ చేస్తుంది. మరొకవైపు రుద్రకి డౌట్ వచ్చి రిటర్న్ సూర్య ఉన్న రూమ్ కి వెళ్తుంటే.. వీరు టెన్షన్ పడతాడు. గంగ మాస్క్ పారు తియ్యబోతుంటే అప్పుడే వీరు ఫైర్ అలారం కొడతాడు. దాంతో ఎక్కడివాళ్ళు అక్కడ పారిపోతారు. పారు, రుద్ర డాష్ ఇచ్చుకుంటారు. ఓవర్ లుక్ లో వెళ్ళిపోతారు. గంగ కిందపడిపోతే రుద్ర ఎత్తుకొని బయటకు తీసుకొని వెళ్తాడు  మరోవైపు వీరు తన తమ్ముడిని హాస్పిటల్ నుండి చేంజ్ చెయ్యాలనుకుంటాడు కానీ వీరు వాళ్ళు వెళ్లేసరికి అక్కడ తన తమ్ముడు సూర్య ఉండడు. అంతకు ముందు వీరు మాట్లాడింది విని భయంతో సూర్య పారిపోతాడు. ఇప్పుడు సూర్య ఆ రుద్రకి పాజిటివ్ అయితే  మీకు ప్రాబ్లమ్ అని వీరు మనుషులు అంటారు. మరొక వైపు ఇంట్లో అందరు గంగని మిస్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : రామరాజుని అవమానించిన ప్రసాదరావు.. ధీరజ్ ఆ ఫోటోని చూస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -289 లో......ధీరజ్ తో ప్రేమ తన ప్రేమ విషయం చెప్పాలని ట్రై చేస్తుంది. తనకి లవ్ ప్రపోజ్ చేసినట్లు ఉహించుకుంటుంది. కానీ అసలు విషయం ధీరజ్ కి చెప్పదు. మరొకవైపు నర్మదని చూసి సాగర్ తన వెంటే తిరుగుతాడు. ఆ తర్వాత రామరాజు దగ్గరికి నర్మద వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడతాడు. రామరాజు కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతాడు. ఊళ్ళో రైస్ మిల్ లో నీ కొడుకు మూటలు మోసే వాడు.. అందుకే నా ఇంటికి ఇల్లరికం పంపండి. కలెక్టర్ వచ్చినప్పుడు అసలు నిన్ను పట్టించుకోలేదు కానీ నా కూతురు వల్ల నిన్ను గుర్తుపట్టాడని ప్రసాదరావు అంటాడు. అప్పుడు కూడా నేను రైస్ మిల్ ఓనర్ అని తెలిసే గౌరవం ఇచ్చాడని రామరాజు అంటాడు.  నీ కొడుకు నా ఇంటికి వచ్చి మీ కూతురు హ్యాపీగా లేదని రమ్మన్నాడని చెప్పగానే రామరాజు షాక్ అవుతాడు. సాగర్ వంక చూసి నర్మదని.. బాగా చూసుకోవడం లేదా.. తను హ్యాపీగా లేదా అని అనేసి రామరాజు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు భద్రవతి, విశ్వ, భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. నేను మీకు హెల్ప్ చేయాలంటే ఆ నర్మద జాబ్ ఉండొద్దని భాగ్యం అనగానే భద్రవతి సరే అంటుంది. మరొకవైపు ధీరజ్ ని ఊహించుకొని ప్రేమ ఉహాల్లో తేలుతుంది. ఎలా నా ప్రేమ విషయం నీకు చెప్పాలని ఆలోచిస్తుంది.  తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఉన్న ఫోటోని ధీరజ్ కి ప్రేమ ఇస్తుంది. ధీరజ్ ఓపెన్ చేస్తుండగా అమూల్యని విశ్వ ఏడిపించడం చూసి ధీరజ్ వచ్చి విశ్వతో గొడవపడతాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: భర్త గౌరవం కాపాడలేని భార్య ఎందుకంటూ దశరథ్ ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -488 లో.. జ్యోత్స్న ఇంటికి వెళ్లి అందరిని పిలుస్తుంది. మమ్మీ డాడీ మీరు ఇలా ఉండకండి ఎప్పటిలాగే ఉండండి .. ఎవరో ఒక అనాధకి పెళ్లి చేసి మీరు దూరంగా ఉండడం ఏంటి అని జ్యోత్స్న అంటుంది. నేను క్షమించలేనని దశరథ్ అంటాడు. మీ అమ్మ తప్పు చేసింది. ఆ తప్పుకి క్షమాపణ కూడా తెలుసు, అయినా చెయ్యడం లేదని దశరథ్ అంటాడు. మీరు ఆగండి మావయ్య అని కార్తీక్ అంటాడు. ఇది మా  ఫ్యామిలీ మ్యాటర్ అని జ్యోత్స్న అనగానే.. వాడు కూడా ఈ ఇంటి వాడే.. నా కూతురు కొడుకు అని శివన్నారాయణ అంటాడు. మీరందరు ఒకటి.. మా అమ్మకి సపోర్ట్ ఎవరు లేరని జ్యోత్స్న అంటుంది. మీ అమ్మ తప్పు చేసిన రోజే నా మనసు సచ్చిపోయింది.. రెండోసారి తప్పు చేసినప్పుడు నేనెందుకు ఉన్నాను.. ఆ బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోతే బాగుండేదనిపించిందని దశరథ్ అనగానే సుమిత్ర షాక్ అవుతుంది. దశరథ్ పై శివన్నారాయణ కోప్పడతాడు. భార్యంటే భర్త గౌరవం కాపాడాలి కానీ నాకు ఆ గౌరవం లేదని దశరథ్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న వల్లే ఇదంతా అని కార్తీక్ కోపంగా ఇంటికి వెళ్తాడు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. తప్పు చేస్తున్నావ్ జ్యోత్స్న అని పారిజాతం అంటుంది. అంతా మన మంచికే అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత నేను ఉండడం వల్ల ఆయన సంతోషంగా లేడని సుమిత్ర ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది. అది జ్యోత్స్న చూసి సైలెంట్ గా ఉంటుంది. ఎవరో బయటకు వెళ్లారని పారిజాతం అంటుంది. ఎవరు లేరని జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి దీపకి జరిగింది మొత్తం చెప్తాడు. మరుసటి రోజు అనసూయ తన మరదలు అయిన అంబుజవల్లి ఫోటో తీసుకొని వచ్చి దీపకి ఇస్తుంది. ఎవరు ఆమె అని శౌర్య అడుగుతుంది. దీపని పెంచిన అమ్మ అని అనసూయ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మీడియాకి లీక్ అయిన భార్యాభర్తల గొడవ.. విడాకులు ఇస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -851 లో...... కావ్య బాధపడుతుంటే వాళ్ళ నాన్న వస్తాడు. నాన్న నేను చేస్తుంది కరెక్టేనా అని అడుగుతుంది. కావ్యని మోటివేట్ చేస్తూ కృష్ణమూర్తి మాట్లాడతాడు. మరొకవైపు నాకు సపోర్ట్ చెయ్యొచ్చు కదా కళావతి అని రాజ్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చెయ్యడానికి వచ్చి అందరిని పిలుస్తాడు. మాకు ఆకలిగా లేదు నిరాహార దీక్ష చేస్తున్నామని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవి ఫుల్ గా కావ్య వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చి బేగ్ తీస్తుంది. నిరాహార దీక్ష చేసేటోళ్ళకి అలా వస్తాయా అని రాజ్ అంటాడు. ఏం తినకపోతే ఇలాగే వస్తాయని ఇందిరాదేవి అంటుంది. మీరు తినకండి నేను తింటానని రాజ్ వెళ్లి తింటుంటే.. అందరు వెళ్లి డిస్టబ్ చేస్తారు. ఆ తర్వాత మీడియా వాళ్ళు కావ్య దగ్గరికి వచ్చి మీ భర్తతో మీరు గొడవపడి వచ్చారట.మ అందుకు కారణం మీ బిడ్డ అంట కదా అని అడుగుతారు. అలాంటివి ఏం లేవని కావ్య చెప్పి లోపలికి వెళ్తుంది. అయిన మీడియా వాళ్ళు రాజ్ గురించి తప్పుగా మాట్లాడతారు. అదంతా రాజ్ వాళ్ళు చూస్తారు. కావ్య ఈ ఇంటి పరువు తీస్తుందని కావ్యపై కోపం వచ్చేలా రుద్రాణి మాట్లాడుతుంది.  ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ కలిసి కావ్య, రాజ్ మధ్య దూరం పెంచాలని ట్రై చేస్తారు.తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి రుద్రాణి విడాకుల పత్రాలు తీసుకొని వెళ్లి విడాకులు ఇస్తానని కావ్యని బెదిరించు.. అప్పుడు నీతో ఇంటికి వస్తుందని రుద్రాణి చెప్తుంది. రాజ్ అవి  పట్టుకొని కావ్య దగ్గరికి వెళ్లి ఇంటికి వస్తావా లేదా విడాకుల పత్రాలపై సంతకం పెటడతావా అని అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇక నుంచి ఆటో కాదు టాటూ రాంప్రసాద్ ...

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో రాంప్రసాద్ స్కిట్ వేరే రేంజ్ లో కొత్తగా ఉంది. ఆటో రాంప్రసాద్ పేరు కాస్త ఇప్పుడు టాటూ రాంప్రసాద్ గా మారిపోయింది. ఈ స్కిట్ లో టాటూ వేసి దొరబాబు. "ఇంతకు ముందు అంతా ఆటో రామ్ అనేవాళ్ళు ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి టాటూ రామ్ అంటున్నారు" అంటూ రాంప్రసాద్ చెప్పుకున్నాడు. "మా దగ్గర ఒకసారి వేయించుకుంటే ఇంకోసారి ఫ్రీగా వేస్తాం" అంటూ చెప్పాడు దొరబాబు. ఇంతలో చలాకి చంటి తన వైఫ్ ని తెచ్చి "నా భార్య బొడ్డు మీద నీ పేరు రాయడమేంట్రా" అని అడిగాడు. మాములుగా టాటూ వేస్తుంటే నాకు కనెక్ట్ అయిందేమో అనుకుని నా పేరు వేసేసా అని చెప్పి దొరబాబు అందరినీ నవ్వించాడు. ఇంతలో శాంతి వచ్చి "మెడ మీద మొదలుకుని ఒళ్ళంతా పాము చుట్టుకుని బొడ్డు దగ్గరకొచ్చి కాటేయాలి" అంటూ టాటూ ఎలా వేయాలో చెప్పింది. దానికి దొరబాబు "ముందు కాటేస్తాను తర్వాత పాము వేస్తాను" అనేసరికి అందరూ పగలబడి నవ్వారు. మళ్ళీ చలాకి చంటి వచ్చి "మా ఆవిడ ఎం వేయిమంది నువ్వు ఎం వేసావ్" అని అడిగాడు. "పుట్ట వేసాను. పాము పుట్టలోకి వెళ్ళిపోయినట్టుంది" అని చెప్పాడు దొరబాబు. జడ్జ్ గా వచ్చిన శ్రీదేవి ఐతే అదే పనిగా నవ్వుతూ స్కిట్ ని ఎంజాయ్ చేసింది. తర్వాత రింగ్ రియాజ్, కొమరక్కా, నూకరాజు, వర్ష చేసిన బ్యాంకు లోన్, బర్రెల స్కిట్ కూడా ఫుల్ కామెడీగా ఉంది. ఇక రాకింగ్ రాకేష్, ప్రవీణ్ స్కిట్ కూడా బాగా నవ్వు తెప్పించింది. ఇందులో ప్రవీణ్ లేడీ గెటప్ వేసుకొచ్చి నవ్వించాడు.

వైరల్ అవుతున్న ముమైత్ చేతి గోరింటాకు..ఫ్యూచర్ లో మంచి భర్త వస్తాడంటూ నెటిజన్ కామెంట్

  ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సాంగ్ తో ముమైత్ ఖాన్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలూగించింది ఈ అమ్మడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆమె హవా తగ్గిపోయింది. దాంతో అప్పుడప్పుడు బుల్లితెర మీద కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. కొంత కాలం క్రితం ప్రసారమైన ఓంకార్ డాన్స్ షో "డాన్స్ ఐకాన్ సీజన్ 2 తో ఒక మెంటార్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. రకరకాల వీడియోస్ ని రీల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది. అలాగే ఒక రూమి కవితను కూడా పెట్టింది. "ఒంటరిగా ఉన్నానని ఫీలవకు, విశ్వమంతా నీలోనే ఉంది. నిన్ను నువ్వు చిన్నతనంగా చూసుకోవడం మానెయ్. ప్రేమ పారవశ్యంతో కదులుతున్న విశ్వం నువ్వే. నీ జీవితాన్ని నువ్వే వెలిగించుకో" అంటూ రూమి మనిషి జీవితం గురించి చెప్పిన ఒక కోట్ ని పోస్ట్ చేసింది. అలాగే తన రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని అందులో చిన్న చందమామను చూపిస్తూ మురిపెంగా నవ్వుతూ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే ముమైత్ గోరింటాకు గురించి కామెంట్స్ చేస్తున్నారు. "ముమైత్ నువ్వు మెహందీ ఆర్ట్ ఫీజుని సేవ్ చేసావ్. మెహందీ ఇలా కూడా పెట్టొచ్చా..చాలా బాగుంది. మీ మంచి మనసుకు ఫ్యూచర్ లో మీకు మంచి భర్త వస్తాడు. మీరు చాలా మంచి డాన్సర్." అంటూ కామెంట్స్ పెట్టారు.

రొమాంటిక్ ఆంధ్ర మగాడు..ఇది ఫ్యామిలీ షోనే  కదా...

  జయమ్ము నిశ్చయమ్మురా ప్రతీ వారం లాగే ఈ వారం కూడా కలర్ ఫుల్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రాబోతున్నాడు. ఆర్ ఏ ఎం అంటే రామ్ కాదు రొమాంటిక్ ఆంధ్ర మగాడు అంటూ సరికొత్త నిర్వచనంతో జగపతి బాబు రామ్ ని ఇన్వైట్ చేశారు. "హౌ ఓల్డ్ ఆర్ యు" అనేసరికి 11 అన్నాడు రామ్. "14 ఐనా పర్లేదు మీసాలు పెంచేయి అన్నారు" అంటూ రామ్ అన్నాడు. "పెరిగాయా అప్పుడు మీసాలు వచ్చేసాయా" అంటూ అనుమానంగా అడిగారు జగపతి బాబు. "మరి తెలంగాణా క్వీన్ ఎవరు" అంటూ అడిగారు జగ్గు భాయ్. "నేను అలా డైవర్ట్ చేద్దామని చూస్తున్నా" అన్నాడు రామ్. "రొమాన్స్ ఎలా ఫిట్ అవుతుంది నీ లైఫ్ లో " అని జగ్గు భాయ్ అడిగారు. "న్యాచురల్ కాలమిటీస్ అన్నీ మనం అనుకుంటే రావు వచ్చేస్తాయి అవన్నీ వచ్చాక ఓహ్ ఐపోయిందా అనుకుంటాం..అది కూడా 6 వరకే" అన్నాడు రామ్. "ఏది మార్నింగ్ 6 ఆ" అని జగ్గు భాయ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేసేసరికి ఫ్యామిలీ షోనే కదండీ ఇది..ఫ్యామిలీ హీరో" అంటూ జగ్గు భాయ్ ని చూపించి నవ్వేసాడు రామ్.  "గుర్తుపెట్టుకోండి ఎటకారం తన ఇంటి పేరు" అంటూ రామ్ మీద మరో సెటైర్ వేశారు జగ్గు భాయ్. టాలీవుడ్ లో రామ్ పోతినేని క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలో ఆడియన్స్ ముందుకు "ఆంధ్ర కింగ్ తాలూకా" పేరుతో సరికొత్త మూవీతో రాబోతున్నాడు. దేవదాస్ మూవీతో టాలీవుడ్ లో హిట్ కొట్టి తర్వాత జగడం, రెడీ, ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట, ఇష్మార్ట్ శంకర్, కందిరీగ, రెడ్, వారియర్, స్కంద వంటి మూవీస్ లో నటించాడు. కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు మరో మంచి బ్రేక్ ఇచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్.