Bigg Boss 9 Telugu: బహుబలిలో ప్రభాస్ లా స్పీచ్ ఇచ్చిన సుమన్ శెట్టి.. గూస్ బంప్స్ లోడింగ్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ మొదటి టాస్క్ లో  ‌సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచారు. దాని తర్వాత రీతూ వచ్చి సుమన్ శెట్టి నుదుటిపై ముద్దు పెట్టింది.  ఆ తర్వాత గేమ్ లో ఓడిపోయామనే బాధలో కింద కూర్చొని అయేషా ఏడ్చేసింది. నా కన్ను వల్ల పోయింది మేమ్.. నా లోపం వల్ల పోయింది.. నాకు కనబడలేదంటూ అయేషా తన చెంపమీద తానే కొట్టుకుంటూ ఏడ్చేసింది. దీంతో అందరు తనని ఓదార్చడానికి వచ్చారు. నేనే ఫస్ట్ వచ్చాను.. అయినా కానీ ఓడిపోయాం.. నా కన్ను వల్ల పోయింది ఇమ్మూ నాకు కనబడలేదు ఇమ్మూ అంటూ అయేషా ఏడ్చింది. ఇది చూసి మాధురి కూడా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంది. దీంతో మాధురి గారు మీరు కూడా ఏడుస్తారేంటి అంటూ అందరూ ఓదార్చారు. కెప్టెన్ అయిన సంతోషంలో అధ్యక్షా.. సుమన్ శెట్టి అను నేను నీతిగా, నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నానని సుమన్ శెట్టి చెప్పాడు. ఇది ఎలా ఉందంటే బహుబలి సినిమాలో పట్టాభిషేకం అప్పుడు ప్రభాస్ స్పీచ్ ఇచ్చాడు కదా అచ్చం అలాగే ఉంది. ఇది సుమన్ శెట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ గా నిలిచిపోయింది. కాసేపటికి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.  ఇంట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు.  గౌరవ్-నిఖిల్ ఇద్దరికీ 'గెలుపు కొరకు చివరి వరకూ'.. అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. పోటీదారులు తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కర్రలపై నిలబడి రోప్స్‌కి కట్టిన వెయిట్ బ్యాగ్స్‌ని హ్యాండిల్స్ ద్వారా లాగుతూ కాళ్లు కిందపెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి.. బజర్ మోగిన ప్రతిసారీ సంచాలకులు చెప్పినన్ని వెయిట్ బ్యాగ్స్‌ని తను పిలిచిన ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వకూడదనుకునే పోటీదారుని రోప్‌కి హుక్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కుకి తనూజ సంచాలక్. టాస్క్ మొదలుకాగానే నిఖిల్ కంటే గౌరవ్ చాలా స్ట్రాంగ్‌గా బలంగా కనిపించాడు. గేమ్ కూడా అలానే జరిగింది. కాసేపటికి నిఖిల్ తన చేతికి ఉన్న రోప్‌ని మోయలేక వదిలేశాడు. దీంతో టాస్కులో గెలిచి మళ్లీ గౌరవ్ కెప్టెన్ అయిపోయాడు. ఇక కెప్టెన్స్ ఇద్దరూ మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నారు. అయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కనుక.. నువ్వు ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మిగిలిన బెడ్స్‌పై బయట మేము పడుకుంటామని సుమన్ చెప్పాడు. ఈ మాట చెప్పగానే అయేషా సహా లేడీస్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టావన్నా అంటూ మిగిలిన వాళ్లు అరిచారు. మరి సుమన్ శెట్టి కెప్టెన్ గా గెలవడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu : హౌస్ లో కొత్త కెప్టెన్ సుమన్ శెట్టి.. బిగ్ ట్విస్ట్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం ఆట క్రేజీగా సాగింది. నిన్న మొన్నటి వరకు ఆటల్లో సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేదని సుమన్ శెట్టిని అన్నారు. కానీ ఇప్పుడు తన మెరుగైన ఆటతీరుతో ఆరోవారం ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇది సుమన్ శెట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్ గా నిలిచింది. అదేంటో ఓసారి చూసేద్దాం. నిన్న జరిగిన టాస్కులో తమ కంటెండర్‌షిప్ కాపాడుకొని నిలిచిన ఆరుగురు సభ్యులు ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు.. గెలిపొందు..ఈ టాస్కులో గెలిచిన జంటలోని ఇద్దరు సభ్యులు హౌస్‌ కెప్టెన్లు అవుతారు.. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల లాక్ అయి ఉంటారు.. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి అక్కడ తన పార్టనర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి.. ఆ కోడ్ కనుక్కోవడానికి కావాలస్సిన క్లూ సమాధి లోపలే ఉంటుంది.. ముందుగా ఎవరు తమ పార్టనర్‌ని విడుదల చేస్తారో వాళ్లు ఈ టాస్కు విజేతలు అవుతారని బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. సమాధి లోపల ఉన్న సభ్యులికి ఒక వాకీ టాకీ మరియు ఒక టార్చ్ లైట్ ఇవ్వడం జరుగుతుంది.. జంటలో బయట ఉన్న మరో సభ్యులు సమాధి లోపల ఉన్న మీ పార్టనర్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఒక వాకీ అవసరం కాబట్టి ముందుగా ఆ సభ్యులు కేజ్‌లో ఉన్న తమ వాకీ ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది.. అది కనుక్కోవడానికి అక్కడ ఉన్న వాకీస్‌లో తమ పార్టనర్ వాయిస్ గుర్తించి కేజ్ దగ్గర ఉన్న కీస్‌లో సరైన కీతో కేజ్ ఓపెన్ చేసి తమ వాకీని తీసుకోవాలి.. సమాధి లోపల ఉన్న ఫొటో బయట మీకు కావాల్సిన బాక్స్‌పై కూడా ఉంటుంది.. సమాధి లోపల ఉన్న వాళ్లు టార్చ్ వేసి చూసి అదేంటో స్పష్టంగా కనిపిస్తుంది.. దాన్ని బట్టి సరైన బాక్స్ ఓపెన్ చేసి అందులో కోడ్ గుర్తుపెట్టుకొని యాక్టివిటీ ఏరియాలో ఉన్న తమ పార్టనర్ సమాధి దగ్గరికెళ్లి అందులో కోడ్ ఎంటర్ చేసి మీ పార్టనర్‌ని విడుదల చేయాలి.. ఎవరైతే ముందుగా తమ పార్టనర్ సమాధిని ఓపెన్ చేసి విడుదల చేసి గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని మోగిస్తారో వాళ్లు టాస్క్ విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కు ఇలా మొదలుకాగానే చకచాకా కేజ్ నుంచి వాకీ టాకీ తీసుకొని మాధురి ఇచ్చిన సూచనల ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేసింది అయేషా. అలానే పరిగెత్తుకొని లోపలికి అయితే వెళ్లింది. కానీ అక్కడ మాధురి ఉన్న సమాధికి ఏర్పాటు చేసిన తాళానికి కావాల్సిన పాస్ వర్డ్ రాంగ్ ఎంటర్ చేసింది. దీంతో అది ఓపెన్ కాలేదు. మరోవైపు తర్వాత వెళ్లిన సాయి.. రమ్య ఏ బాక్స్‌లో ఉందో కనిపెట్టలేకపోయాడు. కానీ చివరిగా వెళ్లిన గౌరవ్ మాత్రం.. చాలా ప్రశాంతంగా సుమన్ శెట్టి పడుకున్న బాక్స్‌ని ఓపెన్ చేశాడు. దీంతో పరిగెత్తుకుంటూ ఇద్దరూ వెళ్లి గంట కొట్టేసి విన్ అయిపోయారు. సుమన్ శెట్టి అయితే ఫుల్ హ్యాపీ ఫీలైపోయాడు. రీతూ అయితే వచ్చి సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చింది.

Jayam serial : నిజం చెప్పిన సూర్య.. వీరూనే అంతా చేస్తుందని రుద్ర తెలుసుకుంటాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -87 లో.....గంగ దగ్గరున్న డబ్బు మణి తీసుకొని వెళ్తాడు. అప్పుడే లక్ష్మీ వస్తుంది. ఇంత లేట్ అయిందని అడుగుతుంది. వర్క్ బాగా ఉందని గంగ చెప్తుంది. నా ఫ్రెండ్స్ ని కలిసి వస్తానని గంగ వెళ్తుంది. తన ఫ్రెండ్ శ్రీను అన్న దగ్గరికి వెళ్లి నాకు ఏమైనా వర్క్ ఉంటే చెప్పండని అడుగగా.. ఉందని అతను చెప్తాడు. మరొకవైపు పారు ఫోటో చూస్తూ రుద్ర తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సూర్య ఫోన్ చేసి రుద్ర నీతో మాట్లాడాలని చెప్పి పడిపోతాడు. తన పక్కనున్న అతను ఫోన్ తీసుకొని ఎవరో సర్ ఫోన్ కావాలంటే ఇచ్చానని అతను చెప్తాడు. సరే నేను వస్తున్నానని అడ్రెస్ చెప్పమని అంటాడు. అడ్రెస్ చెప్పగానే రుద్ర బయల్దేరి వెళ్తుంటే వీరు ఆపి ఎక్కడికి అని అడుగుతాడు. పూర్ణ జంక్షన్ దగ్గర వర్క్ ఉందని చెప్పి రుద్ర వెళ్తాడు. వీరు తన మనుషులకి పూర్ణ జంక్షన్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత గంగ ఒక హోటల్ దగ్గర పని చేస్తుంది. అక్కడ రౌడీలు తనని ఏడిపిస్తుంటే వాళ్ళని గంగ కొడుతుంది. ఆ తర్వాత సూర్యని ఒకతను గంగ ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇతని కోసం ఒకతను వస్తానని చెప్పాడు. నాకు వర్క్ ఉందని అతను వెళ్ళిపోతాడు. రుద్ర సర్ అని సూర్య అంటుంటే రుద్ర సర్ అంటున్నాడు ఏంటి.. సర్ కి ఏమైనా చెప్పాలేమోనని తన ఓనర్ ని వీడియో రికార్డు చెయ్యమని చెప్తుంది. సూర్య మాట్లాడుతుంటే అతను రికార్డు చేస్తాడు. నేను నీకు చాలా చెప్పాలి. ఇదంతా మా అన్నయ్య చేస్తున్నాడని చెప్తాడు. మా అన్నయ్య ఎవరో కాదని చెప్పబోతుంటే వాడిని ఏసేయండి రా అంటూ వీరు మనుషులు వస్తారు. తరువాయి భాగంలో రుద్ర టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చి సూర్య గురించి అడుగుతాడు. రుద్రకి కనిపించకుండా గంగ టవల్ కట్టుకుంటుంది. ఓనర్ కి ఆ వీడియో సర్ కి చూపించమని గంగ చెప్పగానే అతను సూర్య చెప్పిన వీడియో చూస్తాడు. ఆ తర్వాత రుద్ర సూర్య కోసం వెతుకుతుంటే మక్కం కన్పిస్తాడు. ఇక్కడ ఏంటి అని రుద్ర అడుగుతాడు. గంగ ఇక్కడే పని చేస్తుందని మక్కం చెప్పగానే గంగని రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : రామరాజుకి క్షమాపణ చెప్పిన నర్మద.. ఆమె మురిసిపోతుందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -292 లో.....నర్మద వాళ్ళ నాన్న అన్న మాటలకి రామరాజు కోపంగా ఉంటాడు. రామరాజుకి ఇంకా కోపం వచ్చేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. దాంతో సాగర్ పై రామరాజు కోప్పడతాడు. నువ్వు మిల్ లో పని చెయ్యడం  నామూషీగా ఫీల్ అవుతున్నావా అని సాగర్ ని రామరాజు అడుగుతాడు. ఆయన మాటలు పట్టుకొని మీరు తప్పుగా అర్థం చెసుకుంటారని సాగర్ అనగానే ఏమంటున్నావ్ రా నువ్వే మీ మావయ్య దగ్గరికి వెళ్లి ఇల్లరికం వస్తానన్నట్లు ఉన్నావని రామరాజు అంటాడు. నిన్ను సొంత కూతురులాగా చూసుకున్నామని నర్మదతో రామరాజు అంటాడు. మా నాన్న అలా ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు మావయ్య కానీ నేను నా పుట్టింటికి దూరంగా ఉన్నాను కానీ వాళ్ళ ప్రేమకి కాదు నన్ను మీరు బాగా చూసుకున్నారు. మా నాన్న తరుపున సారీ, సాగర్ తరుపున కూడా సారీ అని నర్మద చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేసి అమూల్య ని బయటకు తీసుకొని రమ్మని చెప్తాడు. అమూల్యని తీసుకొని శ్రీవల్లి గేట్ దగ్గరికి వస్తుంది. కావాలనే భద్రవతి ఆ ధీరజ్ పై కంప్లైంట్ ఇస్తానని అంటుంది. వద్దు అత్త ఎంతైనా వాడు అత్త కొడుకు కదా అని విశ్వ అంటాడు. ఇక వాళ్ళిద్దరి మాటలు అమూల్య వింటుందని విశ్వ పాజిటివ్ గా మాట్లాడతాడు. అదంతా అమూల్య వింటుంది. మరొకవైపు ప్రేమ లాకెట్ పట్టుకొని ఉంటుంది. ధీరజ్ వచ్చి ఆ లాకెట్ చూడలేదు.. చూపించమని అడుగుతాడు. దాంతో ప్రేమ కోపంగా పడుకుంటుంది. ఆకలిగా ఉందని ధీరజ్ అనుకుంటాడు. అది విని ప్రేమ భోజనం తీసుకొని వచ్చి ధీరజ్ కి తినిపిస్తుంది. తరువాయి భాగంలో మా ఆయన నాకు ముద్దు పెట్టాడని శ్రీవల్లి మురిసిపోతుంటే అదేమైన వింతా.. మా ఆయన పెట్టాడు. అత్తయ్యకి మావయ్య పెట్టాడు. ప్రేమకి మొన్న ధీరజ్ పెట్టాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రని కనిపెట్టేసిన దీప.. దొంగోడు ఎంత పని చేశాడంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -491 లో.... శివన్నారాయణ స్పృహలోకి వచ్చి.. సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు. ఉందట తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారని శివన్నారాయణతో కాంచన చెప్తుంది. కార్తీక్ నువ్వు వెళ్లి అత్తని తీసుకొని రా అని కాంచన పంపిస్తుంది. మరొకవైపు ఒక దొంగ సుమిత్రని నగలు ఇవ్వమని బెదిరిస్తుంటే దీప వచ్చి రౌడీ తలపై కొడుతుంది. మరోవైపు శివన్నారాయణ, దశరథ్ కి కాంచన భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్నని పారిజాతం పక్కకి తీసుకొని వచ్చి మాట్లాడుతుంది. నా భర్తపై కోపం ఉంది కానీ ఆయన్ని చంపాలని ఎప్పుడు అనుకోలేదు .. ఆయనకి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వే.. మీ అమ్మ వెళ్తుంటే ఆపలేదు.. నీలో అసలు బాధ అనేది కనిపించడం లేదని జ్యోత్స్నని పారిజాతం తిడుతుంది. ఎవరు మారినా నేను మారనని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళదాం అమ్మ అని సుమిత్రని దీప రిక్వెస్ట్ చేస్తుంది కానీ దీపతో సుమిత్ర కోపంగా మాట్లాడుతుంది. ఆ రౌడీ మళ్ళీ వచ్చి దీపని కొట్టబోతుంటే సుమిత్ర అడ్డుపడుతుంది. దాంతో దెబ్బ తనకి తగులుతుంది. మరొకవైపు కార్తీక్ కి దీప ఫోన్ చేసి అర్జెంట్ గా ఇంటికి రా అంటుంది. కార్తీక్ ఇంటికి వెళ్లి నేను అత్త గురించి వెతుకుతుంటే ఎందుకు పిలిచావని దీపని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే శౌర్యా వచ్చి అమ్మమ్మ అని చెప్పబోతుంటే ఎందుకు అత్త గురించి శౌర్యకి చెప్పావని కార్తీక్ అంటాడు. శౌర్య గది వంక చూపించగానే కార్తీక్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ సుమిత్ర పడుకొని ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : నిరాహారదీక్ష చేస్తున్న రాజ్.. కృష్ణమూర్తితో నిజం చెప్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -854 లో...... కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఇంటికి రమ్మని అడుగుతాడు. రానని కావ్య తెగేసి చెప్పడంతో.. ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. కావ్య లోపలకి వెళ్తుంటే ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. సంతకం చెయ్యాలంటే పెన్ కావాలి కదా అని కావ్య లోపలికి వెళ్లి పెన్ తెస్తుంది. ఆ తర్వాత విడాకుల పత్రాలపై కావ్య సంతకం చేస్తుంది. ఆ పేపర్స్ ని రాజ్ చింపేస్తాడు. నువ్వు రానిదే నేను ఇక్కడ నుండి వెళ్లనని ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాడు రాజ్. మరొకవైపు ప్లాన్ సక్సెస్ అయి కావ్య, రాజ్ విడిపోతారని రుద్రాణి డ్యాన్స్ చేస్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. ఇందిరాదేవి ఇంట్లో అందరిని పిలుస్తుంది. కావ్య కోసం రాజ్ ఇంటి ముందు ధర్నా చేసున్నాడట అని చెప్పగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేంటి నీ కొడుకు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటి ముందు అలా చేస్తున్నాడంటే హ్యాపీగా ఫీల్ అవుతావేంటని రుద్రాణి అంటుంది. నా కోడలు కోసమని అపర్ణ సమాధానం చెప్తుంది. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావ్.. ఇంట్లో స్వీట్ చేస్తానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అప్పు చాలా హ్యాపీగా ఉండి ఫ్రూట్స్ తింటుంది. కళ్యాణ్ వచ్చి తనతో మాట్లాడుతాడు. మరొక వైపు కావ్య కావాలనే రాజ్ ముందు టీ తాగుతుంది. అప్పుడే ఒక తాగుబోతు వాడు వచ్చి.. నీకు సపోర్ట్ గా నేనుంటాను.. నేను భార్యాబాధితుడిని అని అతను అంటాడు. సపోర్ట్ గా మీడియా వాళ్ళని పిలుస్తానని పిలుస్తాడు. మీడియా వాళ్ళు వచ్చి మీరు ఇలా ఎందుకు ధర్నా చేస్తున్నారంటు అడుగుతారు. తరువాయి భాగంలో అందరూ పడుకున్నాక రాజ్ కోసం తన తండ్రి కృష్ణమూర్తితో భోజనం పంపిస్తుంది కావ్య.  అది తీసుకొని రాజ్ భోజనం చేస్తాడు. నా కూతురిపై అంత ప్రేమ ఉంది.. అసలు కారణం ఏంటో చెప్పొచ్చు కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu Voting : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక  క్రేజీగా సాగుతోంది. అయితే  ఈ వారం తనూజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, డీమాన్ పవన్ నామినేషన్లో ఉన్నారు.  అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, తనూజ స్వల్ప ఓట్ల తేడాతో టాప్ లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో డీమాన్ పవన్, రాము రాథోడ్ ఉన్నారు. మొన్నటి ఓటింగ్ లో భరణి లీస్ట్ లో ఉండగా‌.. నిన్నటి ఆటని బట్టి, భరణి ఫ్యాన్స్ గట్టిగానే ఓట్లు వేశారు. అందుకేనేమో డీమాన్ పవన్ ని అధిగమించి ఓ స్థానం పైకి వెళ్ళాడు. అయితే డీమాన్ పవన్ కి పెద్దగా ఓట్లేమీ పడటం లేదు.. అయితే రాము రాథోడ్ కి కూడా ఓటింగ్ తక్కువే ఉంది. భరణి నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి.. దివ్య నిఖితకి ఓట్లు తగ్గాయనిపిస్తోంది. దువ్వాడ మాధురితో దివ్యకి ఉన్న గొడవలు చూస్తుంటే ఆమెను ఈ వారం హౌస్ నుండి బయటకి పంపించడం కష్టమే అనిపిస్తోంది.  ఇక అందరితో పోలిస్తే రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే రాము నామినేషన్స్‌లోకి వచ్చాడు. అతనిపై పెద్దగా నెగిటివిటీ లేదు కానీ తన సత్తా ఏంటనేది ఈ రోజు అర్థరాత్రి ఓటింగ్ లైన్స్ పూర్తయ్యేవరకు తెలుస్తుంది. ఎక్కడ అన్ అఫీషియల్ ఓటింగ్‌ ని బట్టి చూస్తే మాత్రం ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత వారం శ్రీజ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ప్రకారం ఈ వారం డీమాన్ పవన్, భరణి, రాము రాథోడ్ లలో ఎవరు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

Bigg Boss 9 Telugu: కన్నీళ్ళు పెట్టుకున్న భరణి.‌ ఓదార్చిన దివ్య నిఖిత!

  బిగ్ బాస్ సీజన్-9 ఆరో వారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. కొత్త కంటెస్టెంట్స్ రావడంతో పాత కంటెస్టెంట్స్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్ లో భరణి, దివ్య నిఖితలని రీతూ నామినేట్ చేసింది. అయితే దానికి భరణి ఫుల్ హర్ట్ అయ్యాడు. ‌దివ్య కూడా అయింది. అయితే తనతో దివ్య క్లోజ్ మాట్లాడింది. అది చూసిన భరణి తీసుకోలేకపోయాడు. అసలేం జరిగిందో ఓసారి చూసేందుకు. దివ్య దగ్గరికెళ్లి భరణి మాట్లాడాడు. రీతూ నిన్ను, నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో అంత క్లోజ్‌గా ఉండటం కూడా నాకు నచ్చలేదని అన్నాడు. ఎవరు క్లోజ్‌గా ఉంది.. మీకు ఒక విషయం నచ్చకపోతే చెప్పరా నాకు.. మీలో మీరే పెట్టేసుకుంటారా.. నేను గుచ్చిగుచ్చి అడిగేవరకూ చెప్పరా.. అని దివ్య అడిగింది. చెప్పడం కాదు నువ్వు తనకి నడుము ఇరిగిపోయేంతలా ఆరోజు టాస్కులో హెల్ప్ చేశావ్.. సంబంధం లేకుండా ఆ తరువాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే నేను ఏం అనుకోవాలి.. మొత్తం టెనెంట్స్ అందరు నేను కెప్టెన్‌గా ఉండాలని హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు.. ఇమ్మూ-నేను కెప్టెన్సీ టాస్కులో ఉన్నప్పుడు సంచాలక్ గా ఎలా ఉందో కూడా తెలుసు..అయినా కానీ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పా.. ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది.. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తన పక్కన కూర్చొని జోకులేసి నవ్వుకుంటుంటే నేను ఏ రకంగా తీసుకోవాలి.. నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు కానీ అంత క్లోజ్‌ ర్యాపో ఏంటని భరణి అడిగాడు. క్లోజ్ ఏంటి నేను ఏం రీతూతో సింగిల్‌గా మాట్లాడలేదు అక్కడ నాతో పాటుగా ముగ్గురున్నారని దివ్య అంది.  రేపు పొద్దున్న నేను చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తీసి మాట్లాడాల్సి వస్తుందని భరణి అన్నాడు. మాట్లాడండి నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా నామినేషన్స్ వచ్చేసరికి నేను గేమ్ గేమ్‌లానే ఆడతా.. అయినా మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు.. నేను ఒక్క మనిషితో ఒక్క పూట మాట్లాడితే మీరు అలా తీసేసుకుంటారా.. అక్కడ ఐదుగురున్నారు.. మీరు ఒక్క రీతూనే ఎందుకు చూస్తున్నారు.. దానికి మీరు హర్ట్ అయ్యారా అని దివ్య అడిగింది. హర్ట్ ఏం అవ్వలేదు.. నాకు అది ఎందుకో నచ్చలేదు.. చెప్పాలనిపించి చెప్పాను.. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. ఏదో మంచిది అనిపించినప్పుడు చెప్తాను.. వింటావా వినవా అనేది నీ ఇష్టమని భరణి అన్నాడు. ఈ మాటలకి దివ్య ఎమోషనల్ అయిది. ఇవే వద్దనేది..నాకు ఈ హౌస్‌లో ఫస్ట్ మీరే.. మీరు అందరితో మాట్లాడుతున్నారు.. నేను కూడా మాట్లాడాలి కదా.. ప్రతిదానికి మీరూ ఇలా అంటే ఎలా.. నిన్న ఏదో సరదాగా మాట్లాడాను.. వేరే వాళ్ళతో ఫస్ట్ టైమ్ నేను అలా మాట్లాడటం.. ఎందుకంటే నేను ఓపెన్ అప్ అవ్వట్లేదని అందరు చావగొడుతున్నారు. ఒక్కరితోటే ఉంటున్నావని.. ఉన్నవాళ్లలో మీ తర్వాత నాకు వాళ్లు బెటర్ అనిపించి వాళ్లతో మాట్లాడాను.. మీరు ఇంత అపార్థం చేసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదని దివ్య ఏడ్చింది. నీకు ఏదైనా చెబ్దామంటే ఇలా బాధపడి ఏడుస్తావనే నేను ఏం చెప్పనని భరణి అన్నాడు. కాదు మీరు అసలు ఇంత అపార్థం ఎలా చేసుకుంటారని దివ్య అంది. నిన్ను ఎవరూ కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదని భరణి చెప్పాడు. వంద మంది నన్ను అన్నా కూడా నేను ఫేస్ చేస్తాను కానీ నా మనిషిని ఏమైనా అంటే నేను తట్టుకోలేను.. మీకు అది అర్థం కాదా.. మీరు నా గురించి ఆలోచించడం కాదు నేను కూడా మీ గురించి ఆలోచిస్తాను కదా.. అని దివ్య అంది. వెంటనే భరణి కంట్లో నీళ్లు తిరిగాయి. దీంతో మీరు ఎందుకు ఏడుస్తున్నారు.. ఏడవకండి.. సారీ నేను అరిచినందుకు.. నేను చూడలేను మీరు ఏడవకండి అంటూ భరణిని దివ్య ఓదార్చింది.

Bigg Boss 9 Telugu aysha : ప్రేమించినవాడు మోసం చేస్తే అయేషా ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చాక కథ మారిపోయింది. హౌస్ లోని పాత కంటెస్టెంట్స్ అంతా డల్ ఆయిపోయారు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో అయేషా గురించి తెలుసుకుందాం. ఆయేషా కేరళలో‌ జన్మిచింది. తనకి నటనపై ఆసక్తితో ఉండటంతో మొదటగా తనకొచ్చిన ఆఫర్ సీరియల్. దాంతో తను 'సత్య'అనే తమిళ్ సీరియల్ లో నటించింది. అది సూపర్ హిట్ అవ్వడంతో సత్య2 కూడా తీశారు మేకర్స్. అయితే ఆ తర్వాత అయేషాకి రెండుసార్లు నిశ్చితార్థం జరిగింది. కానీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. కొన్ని ప్రాజెక్ట్ లకు వారిద్దరు కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా తనకి బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆమె చెప్పింది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్ లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్మెంట్ లోనే అతనికి కూడా ఆమె గుడ్ బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. ఇక ఈ లవ్ మనకు వర్కవుట్ కాదని కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేయాలని తెలుగు బిగ్ బాస్ కి వచ్చినట్టుగా నాగార్జునతో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెప్పుకొచ్చింది. ఆయేషా హీరోయిన్‌గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్ బాస్ లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్ గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్ పై ఫైర్ అవ్వడం  సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది.  హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పింది. ఒకసారి హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ నే ఎదురించి వైరల్ అయింది. తెలుగులో 'ఊర్వశివో రాక్షసివో ' అనే సీరియల్ లో నిఖిల్ తో కలిసి నటించింది అయేషా. ఇంత ఫైర్ ఉన్న ఈ వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ ని మన తెలుగు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి మరి. 

Bigg Boss 9 Telugu : రూటు మార్చిన ఇమ్మాన్యుయేల్.. తనూజని కాదని రమ్య మోక్షతో స్కిట్!

  బిగ్ బాస్ సీజన్-9 లో‌ అయిదో వారం సాదాసీదాగా సాగింది. ఎప్పుడు అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారో అంతా తారుమారు అయింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు ఇమ్మాన్యుయల్, తనూజ కలిసి స్కిట్ చేసేవారు. అలా ఏ స్కిట్ చెయ్యడానికి అయిన వీళ్ళే పెయిర్ గా ఉండేది..  వాళ్లు ఏం చేసిన ఆ స్కిట్ హిట్ అయ్యేది.. కానీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక అసలు కంటెస్టెంట్స్ అందరు చేంజ్ అయ్యారు. ఇమ్ము ముందు నుండి ఉన్న కంటెస్టెంట్స్ తో కాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయి వాళ్ళతోనే ఉంటున్నాడు. తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో ఇమ్ము 'అపరిచితుడు' సినిమాలోని సీన్లని స్పూఫ్  చేశారు. అందులో రమ్య, ఇమ్మాన్యుయల్ ఇద్దరు చేశారు. రాము, నందిని రెండు క్యారెక్టర్స్ ని ఇమ్మాన్యుయల్, రమ్య ఇన్వాల్వ్ అయ్యి చేశారు. వీళ్లంతా స్కిట్ చేస్తుంటే తనూజ కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. స్కిట్ అంతా అయ్యాక నందిని నువ్వు నన్ను ఒప్పుకున్నావు కదా నాకొక కిస్ ఇవ్వమని రాము(ఇమ్మాన్యుయల్) అడుగుతాడు. దాంతో రాము క్యారెక్టర్ లో ఉన్న ఇమ్ము కళ్ళు మూసుకోగా కళ్యాణ్ వచ్చి ఇమ్ము చెంపపై ముద్దిస్తాడు. అది నందిని క్యారెక్టర్ లో ఉన్న రమ్య ఇచ్చిందని ఇమ్ము అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. హౌస్ లో ఇంతవరకు ఇమ్ము, తనూజల కాంబినేషన్ సూపర్ హిట్టు కానీ ఇమ్ము అలా రమ్యతో స్కిట్ చెయ్యడం ఏం బాలేదని తనూజ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Jayam serial : గంగ చెప్పిన ఆ నిజాన్ని పెద్దసారు చెప్తాడా.. రుద్ర ఏం చేయనున్నాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -86 లో....వీరు గురించి గంగ చెప్పడానికి పెద్దసారు ఇంటికి వస్తుంది. కానీ అక్కడ గంగని శకుంతలతో పాటు అందరు అవమానిస్తారు. మోసం చేసే నువ్వు మా వీరు గురించి మాట్లాడుతున్నావా అని గంగపై శకుంతల కోప్పడుతుంది. గంగ బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతుంటే రుద్ర ఎదురుపడుతాడు. ఏంటి గంగ ఇలా వచ్చావని అడుగుతాడు. ఒక విషయం గురించి చెప్పడానికి వచ్చాను.. మీరు హాస్పిటల్ లో కనిపించారని గంగ అంటుంది. ఆ రోజు రుద్ర సర్ కి అప్పొజిట్ గా సాక్ష్యం చెప్పిన వాళ్ళతో మిమ్మల్ని హాస్పిటల్ లో చూసానని వీరుతో గంగ చెప్తుంది. మీరు వాళ్లతో ఎందుకున్నారని గంగ అడుగుతుంది. ఇదేంటి అంతా చూసినట్లు చెప్తుందని వీరు అనుకుంటాడు. నేను వాళ్ళతో ఉండి నిజం రాబట్టడానికి యాక్టింగ్ చేస్తున్నానని వీరు చెప్తాడు. రుద్ర బావ వస్తున్నాడు అతనికి కూడా చెప్పమని వీరు అనగానే ఆమ్మో వద్దని గంగ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రుద్ర వస్తూ గంగ ని చూస్తాడు. గంగ ఎందుకు వచ్చిందని వీరుని అడుగుతాడు. ఏమో బావ అని వీరు అంటాడు. వీరు గురించి చెప్పడానికి వచ్చిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు గంగ రోజంతా సంపాదించిన డబ్బుని మణి వచ్చి లాక్కొని వెళ్తాడు. తన వెనకాలే పైడిరాజు వెళ్లి నాకు మందుకి అందులో నుండి కొంచెం డబ్బు ఇవ్వమని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : కలిసిపోయిన ధీరజ్, ప్రేమ.. శ్రీవల్లి మళ్ళీ కొత్త ప్లాన్ వేసిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -291 లో.. ధీరజ్ అన్న మాటలకి ప్రేమ బాధపడుతుంది. కాసేపటికి ప్రేమ బాధపడుతుంటే ధీరజ్ తన దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. ప్రేమ చాలా కోపంతో ఉంటుంది. ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఆ తర్వాత ధీరజ్  చెయ్ కి బ్లడ్ వస్తుంటే కట్టు కడుతుంది. నువ్వు గయ్యాళి గంపవే కాదు మంచిదానివి కూడా అని ధీరజ్ అంటాడు. సారీ చెప్పినా కూడా ఎందుకు అలాగే ఉంటావని ధీరజ్ అంటాడు. కోపంగా ఉంటే కొట్టమని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ ఆ చెంప, ఈ చెంప వాయిస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మాత్రం నీ జోలికి రావద్దే తల్లి అని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేసి మా మావయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారని చెప్తుంది. ఆ తర్వాత వేదవతి కిచెన్ లో వంట చేస్తుంటే తిరుపతి వచ్చి మాట్లాడతాడు. ఏది ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్లు.. పుట్టింటి గురించి ఆలోచిన చేయొద్దని తిరుపతి అంటే తనకి అట్లకాడతో వాత పెడుతుంది వేదవతి. మరొకవైపు రామరాజు దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. నర్మద వాళ్ళ నాన్న మాట్లాడింది మళ్ళీ గుర్తుచేస్తుంది. ఇల్లరికం రమ్మని అంత ధైర్యంగా అతను అన్నాడంటే కచ్చితంగా సాగర్ మనసులో ఆ ఆలోచన ఉండి ఉంటుందని శ్రీవల్లి అంటుంది. ఏం మాట్లాడుతున్నావని శ్రీవల్లిపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : స్పృహ తప్పి పడిపోయిన శివన్నారాయణ.. సుమిత్ర ఆచూకి తెలిసేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -490 లో..... కార్తీక్, దశరథ్ ఇద్దరు సుమిత్రని వెతకడానికి వెళ్తారు. కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. అక్కడికి వస్తే కాల్ చెయ్యమని చెప్తాడు. సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం కాంచనకి శ్రీధర్ చెప్తాడు. దాంతో కాంచన షాక్ అవుతుంది. మరొకవైపు సుమిత్ర గురించి దీప ఒకవైపు కార్తీక్, దశరథ్ ఇద్దరు ఒకవైపు వెతుకుతుంటారు. సుమిత్రని గుర్తుచేసుకొని దశరథ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేసి తాతయ్య స్పృహ తప్పి పడిపోయాడని చెప్తుంది. దాంతో కార్తీక్, దశరథ్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. డాక్టర్ వస్తాడు. అయన ఏదో టెన్షన్ పెట్టుకున్నాడు.. అది దూరం చెయ్యమని డాక్టర్ చెప్తాడు. మరొకవైపు దీప ఒక అమ్మవారి గుడి దగ్గర ఆగుతుంది. తన బాధని చెప్పుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే పంతులు వచ్చి దీపకి ధైర్యం వచ్చేలా మాట్లాడతాడు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఆ బాధ తొలగిపోతుంది దైర్యంగా వెళ్ళమని దీపతో పంతులు చెప్తాడు. శివన్నారాయణ దగ్గరికి కాంచన, శ్రీధర్ వస్తారు. తన తండ్రిని ఆ పరిస్థితిలో చూసి కాంచన ఏడుస్తుంది. అసలు మీ అమ్మ వెళ్తుంటే ఆపకుండా ఏం చేసావని జ్యోత్స్నని పారిజాతాన్ని కాంచన తిడుతుంది. శివన్నారాయణ స్పృహలోకి వచ్చి సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : భార్య ఇంటి ముందు ధర్నా చేస్తున్న భర్త.. తను అత్తగారింటికి వస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -853 లో..... రుద్రాణి ఫోన్ చేసి మహిళ సంఘాల వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు రాజ్ దగ్గరికి వచ్చి మీ భార్యని టార్చర్ పెడుతున్నారని తెలిసింది.. అందుకే పుట్టుంటికి వెళ్లిందట కదా అని రాజ్ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతారు. అప్పుడే కావ్య ఎంట్రీ ఇచ్చి.. నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదని చెప్తుంది. భార్యాభర్త అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి.. మేం పరిష్కారించుకుంటామని కావ్య వాళ్ళని అక్కడ నుండి పంపించేస్తుంది. ఆయనకు నాకు గొడవలు ఉన్నాయి కానీ ఈ కుటుంబం నాది.. పరువుపోతుంటే నేనెలా చూస్తానని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి డిస్సపాయింట్ అవుతుంది. మరొక ప్లాన్ వేస్తుంది. రాజ్ కావ్య వీడాకుల తీసుకునేలా రుద్రాణి ప్లాన్ చేసి రాహుల్ కి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ఇవి విడాకుల పత్రాలు వీటిపై సంతకం చెయ్ అని బెదిరించు అప్పుడు కావ్య తప్పకుండా తిరిగి వస్తుందని రాజ్ కి రుద్రాణి సలహా ఇస్తుంది. దాంతో కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. నేను రానని కావ్య అనగానే.. అయితే ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాజ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కావ్య ఇంటికి రావాలని రాజ్ తన ఇంటి ముందు ధర్నా చేస్తాడు. కావ్య కూల్ గా కాఫీ తాగుతూ లోపలికి రండి అని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్..పోలీస్ స్టేషన్ కి అసలు ఎందుకు వెళ్ళింది ?

జయమ్ము నిశ్చయమ్ము రా సెలబ్రిటీ టాక్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. ఇక ఈ వారం షోకి మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక ఆమె నవ్వు ఆమె లైఫ్ గురించి మొత్తం ఈ షోలో చెప్పుకొచ్చింది. ఐతే ఈమె పోలీసు స్టేషన్ కి వెళ్ళింది ఒకసారి. దాంతో జగపతి బాబు ఈ పోలీసు స్టేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అడిగేసరికి..అసలు విషయం బయటపెట్టింది. "కాలేజీ టైములో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఒక సలోన్ కి మేము వెళ్తున్న టైములో ఒక చోట నిలబడి ఎం చేయాలి అని చూస్తున్న టైములో ఒక అబ్బాయి వచ్చి మేము రోడ్ క్రాస్ చేసే టైములో భుజాన్ని టచ్ చేసాడు. దాంతో నేను వాడిని పట్టుకుని వెంటనే లాగే ఒక్కటి ఇచ్చాను. దాంతో అతను సీరియస్ గా ఫేసు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోడ్ క్రాస్ చేస్తున్న టైములో బ్యాక్ నుంచి ఏదో యాక్సిడెంట్ జరిగిందేమో అన్నట్టుగా అనిపించింది నాకు ఏంటంటే అతను వెనక నుంచి వచ్చి నెత్తి మీద చాలా గట్టిగ కొట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నేను నా ఫ్రెండ్ వెంటనే వాడి వెనక పరిగెట్టాం. ఛేజ్ చేసాం చాలా దూరం పరిగెత్తిన అతను దొరకలేదు. ఐతే అక్కడ ఒక బేకరీలో కూర్చున్నాం. నాన్నకు ఫోన్ చేశా..దగ్గరలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారేమో చూస్తాను అన్నారు. ఇంతలో నేను రోడ్డుకు అవతల వైపు నన్ను కొట్టిన వాడిని చూసా. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళా. కొంచెం దూరంలోనే ఒక పోలీస్ బూత్ కూడా ఉంది. నేను నా ఫ్రెండ్ వెళ్లి అతన్ని పట్టుకుని కంప్లైంట్ ఇచ్చా పోలీస్ స్టేషన్ లో. " అలా పోలీసు స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది అంటూ చెప్పింది కీర్తి సురేష్.

సుదీప్ మూవీ లో సాంగ్ పాడుతున్న...ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్

  తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో దర్శన్ అనే కంటెస్టెంట్ స్పెషల్ గా తన టాలెంట్ ఆఫ్ సింగింగ్ తో అలాగే చక్కగా తెలుగు నేర్చుకుని జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో దర్శన్ ఒక అద్భుతమైన సాంగ్ పాడి జడ్జెస్ అందరినీ మెప్పించాడు. "నేను నా నెక్స్ట్ ఫిలింని సుదీప్ తో అలాగే సంతోష్ ఆనంద్ రామ్ తో కలిసి పని చేస్తున్నాను. ఆ మూవీలో నువ్వు ఒక సాంగ్ పాడాలి. అలాగే నువ్వు పాడే పాత రికార్డింగ్ సెషన్ కి విజయ్ ప్రకాష్ ని కూడా పిలుస్తాను" అంటూ థమన్ ఒక బిగ్ ఆఫర్ ని దర్శన్ కి ఇచ్చేసరికి అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక లాస్ట్ వీక్ ఐతే సహస్ర అనే కంటెస్టెంట్ "జరగండి జరగండి" అనే సాంగ్ ని హైపిచ్ లో జడ్జెస్ ని మెప్పిస్తూ అద్భుతంగా పాడింది. దాంతో థమన్ ఫిదా ఐపోయాడు. "నువ్వు పాడిన ఈ పాటతో నేను సునిధి చౌహన్ ని, దలేర్ మెహందీ అందరినీ మర్చిపోయాను. నీ వాయిస్ మాత్రమే మోతమోగుతోంది. సో నా స్టూడియోకి వచ్చేయి. ఈ సాంగ్ మీద ఒక కవర్ సాంగ్ చేద్దాం" అంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చారు థమన్. ఇలా ప్రతీ సీజన్ లో జడ్జెస్ వాళ్ళు చేసే మూవీస్ లో కానీ అలాగే స్టేజి షోస్ లోకి ఇలాంటి కంటెస్టెంట్స్ కి అవకాశం కల్పిస్తూ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకునేలా సపోర్ట్ చేస్తున్నారు.

బాలు గారిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం  

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కి ఫాన్స్ అంతా ముద్దుగా పిలుచుకునే కిల్ బిల్ పాండే అలియాస్ బ్రహ్మానందం షోకి గెస్ట్ రా వచ్చారు. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆయన స్టేజి మీదకు రాగానే హోస్ట్ శ్రీరామా చంద్ర వెళ్లి కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక జడ్జెస్ కూడా లేచి నిలబడ్డారు. "మీరు వచ్చినందుకు చాల చాలా ఆనందంగా ఉంది సర్. అల్లాడిపోతున్నాను సర్" అంటూ హోస్ట్ సమీరా భరద్వాజ్ అనేసరికి బ్రహ్మానందం షాక్ అయ్యారు. "మీ స్టైల్ లో కంటెస్టెంట్స్ కి ఒక ఆల్ ది బెస్ట్" చెప్పండి అనేసరికి ఫన్నీగా చెప్పి అందరినీ నవ్వించారు ఆయన. అలాగే తర్వాత లేడీ రాక్ స్టార్ బృందా వచ్చి "నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. "భగవంతుడు నీలాంటి వాళ్ళ లిస్ట్ తీసుకుని టిక్ చేసి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించాలని నేను మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ఆమెను బ్లెస్స్ చేశారు బ్రహ్మానందం. తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి "వారేవా ఏమి ఫేసు" అనే సాంగ్ పాడి బ్రహ్మానందంకి డేడికేట్ చేశారు. దాంతో ఆయన "నన్నెందుకు ఇలా టార్గెట్ చేశారో అర్ధం కావట్లేదు" అన్నారు. తర్వాత హోస్ట్ శ్రీరామచంద్ర "బ్రహ్మానందం సర్..మీకు ఎస్పీ బాలు గారికి మధ్య చిన్న ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా" అని అడిగాడు. "చిన్న అనుబంధం కాదు పెద్దదే. కుటుంబ సాన్నిహిత్యం ఉంది. ఆయన చాలామంచి మనిషి . ఆయన" అంటూ ఇక చెప్పలేక కన్నీళ్లు కారుస్తూ అలా బాధపడుతూనే ఉన్నారు.

Bigg Boss 9 Telugu: గిన్నె తెచ్చిన పెంట.. రీతూపై అయేషా వైల్డ్ ఫైర్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి పాత కంటెస్టెంట్స్ కి మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం సాగుతోంది. ఏది మాట్లాడిన అక్కడ గొడవ అవుతుంది. కంటెంట్ కోసమో తెలియదు అది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి ఎపిసోడ్ లో ఓ వైపు మాధురి డామినేషన్ సాగగా మరోవైపు అయేషా డామినేషన్ నడిచింది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక్క గిన్నె తోమడం కోసం ఇద్దరు గొడవపడ్డారు. అదేంటో ఓసారి చూసేద్దాం. ఉదయాన్నే గిన్నెలు తోమడానికి వెళ్లి రీతూ తిట్టుకుంది. ఎవరైనా తినడం లేటయ్ అర్ధరాత్రి తినేవాళ్లయితే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్.. పొద్దున్న నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు తోముతుంది.. మళ్లీ పొద్దున్న వేస్తే ఎలా.. అంటూ రీతూ చిరాకు పడింది. ఇదే విషయం దివ్యకి కూడా చెప్పింది. దీంతో కళ్యాణ్ వెళ్లి.. గిన్నెలు తోమడానికి పెట్టిన మరో హౌస్‌మెట్ అయేషా దగ్గరికెళ్లాడు. రీతూ రాత్రి అన్ని డిషెస్ వాష్ చేసింది కానీ ఎవరో మార్నింగ్ దోశ పిండి గిన్నె అక్కడ పెట్టారు.. అది నువ్వు చేస్తావా అని అడిగాడు. లేదు నేను ఎందుకు చేస్తాను.. బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకు వాడిన గిన్నెలు మాత్రమే నావి.. తర్వాత రీతూ పని అని అయేషా అంది. కాసేపటికి డిషెస్ వాష్ చేయడానికి అయేషా కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ రాత్రి వాడిన దోశ పిండి గిన్నె కనిపించింది. దీంతో రీతూ ఇక్కడ బ్యాలెన్స్ పెట్టింది ఫినిష్ చేస్తావా.. నాకు ఇటు స్పేస్ కావాలని చాలా సింపుల్‌గా నెమ్మదిగా రీతూని అయేషా అడిగింది. నేను క్లియర్‌గా కెప్టెన్‌కి చెప్పాను.. అక్కడ నేను అన్నీ క్లియర్ చేశాను.. అక్కడ ఉన్నవి నేను క్లియర్ చేయను.. అక్కడ పెట్టుంటేనే నేను చేస్తానని చెప్పాను.. పొద్దున్న సింక్‌లో వేశారు ఆ గిన్నె అంటూ రీతూ చెప్పింది. ఈ గిన్నె నిన్న నైట్‌ది అని అయేషా చెప్పింది. నిన్న నైట్ రెండు సింక్‌ లు ఖాళీగా ఉన్నాయి అదే చెప్పాను. పిండి ఉంది నైట్ ఆ గిన్నెలో అంటూ రీతూ చెప్పింది. డ్యూటీ గురించి చెప్పినప్పుడు నువ్వే చెప్పావ్ నైట్ చేయకపోతే మార్నింగ్‌కి కూడా యాడ్ అవుతుందని.. ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అయేషా సూటిగా అడిగింది. రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్.. నేను పొద్దున్న కూడా నీకు ఏం చెప్పానంటూ దివ్య వైపు చూసింది రీతూ. ఇది నిన్నటిదంటే నీ డ్యూటీ కూడా నేనే చేయాలా.. అన్నీ నేనే తోమాలా.. అని అయేషా అడిగింది. అది నిన్నటిదే నేను చెప్పేది విను అయేషా.. అని రీతూ అరిచింది. దీంతో ఏం వినాలి చెప్పు.. అంటూ అయేషా రెయిజ్ అయింది. అది నైట్ తీయలేదు అందులో పిండి ఉంది చెప్తున్నా కదా.. అంటూ రీతూ అంది.  అది నైట్‌ది నేను ఎందుకు తోమాలి.. అని అయేషా స్టార్ట్ చేసింది. ఇంతలో కళ్యాణ్ మధ్యలో మాట్లాడాడు. అయేషా పాయింట్ ఏంటంటే అది రాత్రి వాడిన గిన్నె కదా నేనెందుకు కడుగుతాను అంటుంది.. రీతూ పాయింట్ ఏంటంటే అది ఉదయాన్నే వేశారు కదా.. అని కళ్యాణ్ చెప్పాడు. ఇది నేను కడగను అని చెప్పట్లేదు అర్ధరాత్రి వేశారు అంటున్నాను.. అని రీతూ చెప్పింది. అవన్నీ నాకు అవసరం లేదురా నువ్వు తర్వాత చేస్తావ్ కదా.. అని అయేషా అడిగితే చేస్తాను.. అని రీతూ అంది. సరే పక్కన పెట్టనా.. అయిపోయింది అంతే.. అని అయేషా కట్ చేసింది. కానీ రీతూ మళ్లీ సాగదీసింది. అయిపోయింది కాదు నువ్వు మాటలు అనేసి అయిపోయింది అంటే కాదంటూ రీతూ అంది. మరి మాట్లాడటం అయిపోతే అయిపోయిందనే అంటారు. లేకపోతే మాట్లాడుతూనే ఉండాలా రోజంతా నీతో అంటూ అయేషా చెప్పింది. మరి నువ్వు అనకుండా ఉండమని రీతూ అంటే సరేరా అయిపోయింది రీతూ అని మళ్లీ గట్టిగా అరిచింది అయేషా. పని నువ్వు చేయకపోతేనే కదా నేను అడుగుతున్నాను.. ఊరికే నేనేం నీ గురించి చెప్పలేదు రీతూ.. ఫస్ట్ నువ్వు కరెక్ట్‌గా ఉండు రీతూ.. అంటూ అయేషా వాయిస్ రెయిజ్ చేస్తూనే ఉంది. రీతూ కూడా చాలా వరకూ అరిచింది కానీ అయేషా వాయిస్ ముందు తేలిపోయింది. నువ్వు కూడా ఉండమని రీతూ అంటే నువ్వు ఉండవే ఫస్ట్.. నువ్వు ఉండు.. నువ్వు ఊరుకోవే.. నువ్వు ఊరుకో.. ఏం పని చేయవు అడిగితే న్యన్యన్య అంటావంటూ అయేషా వెక్కిరించింది. దీంతో ఏంటి అది మాటలు సరిగా మాట్లాడమంటూ రీతూ మళ్లీ వాదించింది. ఇంతలో అయేషా అయేషా అంటూ కళ్యాణ్ పిలిచాడు. ఏంటి నాతో వద్దు కళ్యాణ్.. ఎందుకు నన్ను పిలుస్తున్నావ్ అక్కడ ఆపలేకుండా అని కళ్యాణ్‌పై సీరియస్ అయింది అయేషా. నేను అక్కడ ఆపాను సౌండ్.. అక్కడ ఆగాక నువ్వు మళ్లీ అరుస్తున్నావని కళ్యాణ్ అన్నాడు. అక్కడ అరిచే దాన్ని బట్టి నా రియాక్షన్ వస్తుంది కళ్యాణ్ అంటూ అయేషా సూటిగా చెప్పింది. అయేషా , రీతూ చౌదరి మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్ కామెంట్ చేయండి. 

Bigg Boss 9 Telugu: మాధురి, సంజన ప్రాంక్.. మెంటల్ గాళ్ళలా ఉన్నారేంట్రా బాబు!

  బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అయినప్పటి నుండి గందరగోళంగా మారింది. ముఖ్యంగా దువ్వాడ మాధురి మాటతీరుకి అటు హౌస్ మేట్స్ కి ఇటు ఆడియన్స్ బుర్రపాడవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజన, మాధురి కలిసి ఓ ప్రాంక్ చేశారు. పెద్ద గొడవ జరిగినట్టు సీన్ క్రియేట్ చేద్దాం.. కాసేపు మనమిద్దరం మాట్లాడుకోవద్దని మాధురితో సంజన అనగానే సరేనని తను అంది.  ఇక కాసేపటికి దువ్వాడ మాధురి తన యాక్టింగ్ మొదలెట్టింది. నా స్టిక్కర్స్ కనిపించట్లేదు పాపా.. బాత్రూం దగ్గరే పెట్టాను.. బాత్రూం క్లీనింగ్ ఎవరో రమ్మనండి.. అంటూ తనూజతో చెప్పింది మాధురి. సంజన గారు, ఇమ్మూ.. ఆ పని చేస్తున్నారని తనూజ అనగానే ఒకసారి ఇమ్మాన్యుయల్ ని రమ్మనండి అని మాధురి అడుగుతుంది. బాత్రూం దగ్గర ఉన్న అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టాను నావి కనిపించట్లేదని మాధురి అడిగితే మా మమ్మీ అడిగినట్లుంది ఎవరివి ఇది అని అంటూ ఇమ్మూ చెప్పాడు. దీంతో సంజన నా స్టిక్కర్స్ ఏవి అని మాధురి అడిగితే పడేశానంటూ సంజన అంది. ఏంటి కామెడీగా ఉందా అని మాధురి అంది. లేదు చాలా మందిని అడిగాను.. ఎవరూ ఏం చెప్పలేదు అందుకే పడేశానంటూ సంజన చెప్పింది. అమ్మాయిల్ని కదా అడగాలి.. అబ్బాయిల్ని కాదని మాధురి వాదించింది. లేదు చాలా అవర్స్ అక్కడే ఉన్నాయని డిసిప్లేన్ కోసం పడేశానంటూ సంజన సమాధనమిచ్చింది. అవన్నీ కాదు నా స్టిక్కర్స్ నాకు కావాలి లేదా గుడ్డు దొంగతనం చేసినట్లు స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా అని మాధురి ఫైర్ అయింది. లేదు నా స్టిక్కర్స్ ఉన్నాయి కావాలంటే అని సంజన చెప్పింది. లేదు నావి నాకు కావాలి.. మీ స్టిక్కర్స్ , మీ బట్టలు వేసుకోవడానికి నేను వచ్చానా అంటూ సంజన మీదా మాధురి ఫైర్ అవుతూనే ఉంది. ఇదంతా చూసి ఏంట్రా వీళ్ల గొడవ అని అందరు అవాక్కయ్యారు.  మీకు ఆల్రెడీ బోర్డ్ వేశారు కదా దొంగ అని మీకు అలవాటేమో అలా దొంగతనం చేయడమ మాధురి తిడుతుంటే సంజన నవ్వు ఆపుకోలేక హలో కట్ కట్.. తనే చెప్పింది స్టిక్కర్స్ కోసం గొడవపడదామని.. తనే చెప్పింది.. ఇది ప్రాంక్ అంటూ సంజన నవ్వింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.. ఏంటో మాకీ కర్మ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దివ్య అయితే కళ్యాణ్ వైపు చూస్తూ.. ఈ హౌస్ లో  అందరూ మెంటల్ గాళ్లు కళ్యాణ్  అని సెటైర్ వేసింది.